కొణిజేటి రోశయ్య

కొణిజేటి రోశయ్య ( 1933 జూలై 4 - 2021 డిసెంబరు 4) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.

ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించాడు . రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా పనిచేశాడు.

కొణిజేటి రోశయ్య
Konijeti Rosaiah
కొణిజేటి రోశయ్య
18వ తమిళనాడు గవర్నర్
In office
31 ఆగస్టు 2011 – 30 ఆగస్టు 2016
అంతకు ముందు వారుసూర్జీత్ సింగ్ బర్నాలా
తరువాత వారుసి.హెచ్.విద్యాసాగర్ రావు (ప్రత్యేక బాధ్యత)
17వ కర్నాటక గవర్నర్
In office
28 జూన్ 2014 – 31 ఆగస్టు 2014
అంతకు ముందు వారుహెచ్.ఆర్. భరద్వాజ్
తరువాత వారువాజుభాయ్ వాలా
15వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
In office
3 సెప్టెంబరు 2009 – 25 జూన్ 2011
అంతకు ముందు వారువై.యస్. రాజశేఖరరెడ్డి
తరువాత వారునల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
నియోజకవర్గంగుంటూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం(ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు)
Member of the indian Parliament
for నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం
In office
10 మార్చి 1998 – 26 ఏప్రిల్ 1999
అంతకు ముందు వారుకోట సైదయ్య
తరువాత వారునేదురుమల్లి జనార్ధనరెడ్డి
వ్యక్తిగత వివరాలు
జననం (1933-07-04) 1933 జూలై 4 (వయసు 90)
వేమూరు, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం)
మరణం4 డిసెంబర్ 2021
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామిశివలక్ష్మి
సంతానంకె. ఎస్. సుబ్బారావు
పి. రమాదేవి
కె. ఎస్. ఎన్. మూర్తి
నివాసంఅమీర్‌పేట, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం

నేపధ్యము

కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించారు. ఆయన భారత జాతీయ కాంగ్రెసు పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైననూ, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.

వ్యక్తిగత జీవితం

కొణిజేటి రోశయ్య 1933 జూలై 4న ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. వాణిజ్యశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశాడు. 1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికయ్యాడు. కొణిజేటి రోశయ్య అనారోగ్యంతో 2021లో డిసెంబరు 4న ఉదయం హైదరాబాదులో కన్నుమూశారు.

రాజకీయ ప్రస్థానం

రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలు లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

ఆర్థికమంత్రిగా

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినారు.

ముఖ్యమంత్రిగా

వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు.

కాలరేఖ

గుర్తింపులు

  • 2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది.

జీవిత సాఫల్య పురస్కారం

2018 ఫిబ్రవరి 11 ఆదివారం నాడు టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యను గజమాలతో సత్కరించి జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు, రోశయ్యకు స్వర్ణ కంకణం బహుకరించారు. రోశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యదక్షుడని కొనియాడారు. సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసేవారని తెలిపారు. రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఆంధ్ర ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని రోశయ్య తెలిపారు. ఆ సమయంలోనే వెంకయ్యతో పరిచయం ఏర్పడిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందించిన సహకారంతోనే చట్టసభల్లో తగిన గుర్తింపు లభించిందన్నారు. తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. తనకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వహించానని తెలిపారు.

తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత వెంకయ్య, రోశయ్యలకు దక్కుతుందని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ కాలంపాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత రోశయ్యదేనని కీర్తించారు. ఒక మహోన్నత వ్యక్తి మరో గొప్ప వ్యక్తికి సన్మానం చేయటం విశేషమన్నారు. చమత్కారాలు, ఛలోక్తులు విసరటంలో వీరిద్దరూ ఎవరివారే సాటి అని తెలిపారు.

మరణం

కొణిజేటి రోశయ్య అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లో 2021 డిసెంబరు 4న మరణించాడు.

చిత్రమాలిక

బయటి లింకులు

మూలాలు


ఇంతకు ముందు ఉన్నవారు:
వై.యస్. రాజశేఖరరెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
02/09/2009 — 16/11/2010
తరువాత వచ్చినవారు:
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

Tags:

కొణిజేటి రోశయ్య నేపధ్యముకొణిజేటి రోశయ్య వ్యక్తిగత జీవితంకొణిజేటి రోశయ్య రాజకీయ ప్రస్థానంకొణిజేటి రోశయ్య కాలరేఖకొణిజేటి రోశయ్య గుర్తింపులుకొణిజేటి రోశయ్య మరణంకొణిజేటి రోశయ్య చిత్రమాలికకొణిజేటి రోశయ్య బయటి లింకులుకొణిజేటి రోశయ్య మూలాలుకొణిజేటి రోశయ్యఆంధ్రప్రదేశ్కర్ణాటకగవర్నరుతమిళనాడుముఖ్యమంత్రి

🔥 Trending searches on Wiki తెలుగు:

అంజూరంనిర్మలమ్మరాజా రవివర్మతెలుగు భాష చరిత్రజ్యోతీరావ్ ఫులేగురజాడ అప్పారావుగైనకాలజీపుష్యమి నక్షత్రమునారా చంద్రబాబునాయుడుకర్పూరంచిత్త నక్షత్రముకొమురం భీమ్బైబిల్దక్షిణ భారతదేశంబలంట్యూబెక్టమీవృషభరాశిలలితా సహస్ర నామములు- 1-100విరూపాక్ష దేవాలయం, హంపిఉత్తర ఫల్గుణి నక్షత్రముగన్నేరు చెట్టుప్రియురాలు పిలిచిందిమహాసముద్రంమేషరాశినోబెల్ బహుమతికృష్ణా నదినాయీ బ్రాహ్మణులురెండవ ప్రపంచ యుద్ధంశేషాద్రి నాయుడుసావిత్రిబాయి ఫూలేతొలిప్రేమఈనాడుభారత ఆర్ధిక వ్యవస్థదగ్గుబాటి వెంకటేష్పాండవులుపల్లెల్లో కులవృత్తులుకుమ్మరి (కులం)ఇందిరా గాంధీమొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమముదగ్గుభారత పార్లమెంట్చోళ సామ్రాజ్యంఅక్బర్నల్గొండ జిల్లావ్యాసుడుమదర్ థెరీసాబ్రహ్మంగారిమఠంనువ్వు లేక నేను లేనుసతీసహగమనండా. బి.ఆర్. అంబేడ్కర్ స్మృతివనంశివుడుఅశ్వని నక్షత్రముదానంభారత అత్యవసర స్థితిరాజ్యసభసంధిచేతబడినందమూరి బాలకృష్ణశ్రీనివాస రామానుజన్ఆంధ్రజ్యోతిరమాప్రభచీకటి గదిలో చితక్కొట్టుడుతెలంగాణ తల్లిశ్రీలీల (నటి)నీతి ఆయోగ్చక్రిజ్వరంరామావతారముకేంద్రపాలిత ప్రాంతంసర్వాయి పాపన్నఏ.పి.జె. అబ్దుల్ కలామ్తెలుగు కథచతుర్వేదాలుబమ్మెర పోతనవేమన శతకముముదిరాజ్ (కులం)షేర్ మార్కెట్మంచు మోహన్ బాబు🡆 More