ఎలినార్ అస్ట్రోం

ఎలినార్ క్లైరె లిన్ అస్ట్రోం (నీ అవాన్; 1933 ఆగస్టు 7 - జూన్ 12, 2012) ఒక అమెరికన్ రాజకీయ ఆర్థికవేత్త.

ఈ సంస్థ పని న్యూ ఇనిస్టిట్యూషనల్ ఎకనామిక్స్, రాజకీయ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధణతో ముడిపడి ఉంది. 2009 లో ఆమె "ఆర్థిక పరిపాలన విశ్లేషణ, ముఖ్యంగా కామన్స్" కొరకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ మెమోరియల్ బహుమతి అందుకున్నది. ఆమె ఆ బహుమతిని ఒలివర్ ఇ. విలియమ్సన్తో పంచుకుంది. ఎకనామిక్సులో నోబెల్ బహుమతి పొందిన ఇద్దరు మహిళలలో ఆమె మొదటిదిగా గుర్తించబడింది. రెండవ మహిళ " ఎస్తేర్ డుఫ్లో ".

Elinor Ostrom
New institutional economics
ఎలినార్ అస్ట్రోం
Ostrom in 2009
జననం(1933-08-07)1933 ఆగస్టు 7
Los Angeles, California,
United States
మరణం2012 జూన్ 12(2012-06-12) (వయసు 78)
Bloomington, Indiana,
United States
జాతీయతAmerican
సంస్థ
  • Indiana University
  • Arizona State University
  • Virginia Tech
  • UCLA
రంగం
  • Public economics
  • Public choice theory
పూర్వ విద్యార్థిUCLA (BA, PhD)
రచనలు
  • Institutional Analysis and Development framework
  • Governing the Commons
పురస్కారములు
  • 2009 Nobel Memorial Prize
  • 2004 John J. Carty Award
  • 2001 US National Academy of Sciences electee
  • 1999 Johan Skytte Prize in Political Science
Information at IDEAS/RePEc

బి.ఎ. పట్టా పొందిన తరువాత పిహెచ్.డి. యు.సి.ఎల్.ఎ. నుండి, ఆస్ట్రోం ఇండియానాలోని బ్లూమింగ్టన్లో నివసించింది. ఆమె అరిజోనా స్టేట్ యూనివర్శిటీలో పని చేసింది. కెరీర్ చివరిలో ఇండియానా విశ్వవిద్యాలయం అధ్యాపకురాల్గా పనిచేసింది. ఆమె ఇండియానా విశ్వవిద్యాలయంలో విశిష్ట ప్రొఫెసరుగానూ ఆర్థర్ ఎఫ్‌ బెంట్లీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, ఇండియానా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ థియరీ అండ్ పాలసీ అనాలిసిస్ వర్క్ షాప్ కో-డైరెక్టరుగానూ, అలాగే పరిశోధనా ప్రొఫెసరుగానూ సెంటర్ ఫర్ ది స్టడీ వ్యవస్థాపక డైరెక్టరుగానూ పనిచేసింది. ఆమె యు.ఎస్.ఎ.ఐ.డి.నిధులతో వర్జీనియా టెక్ నిర్వహణలో ఉన్న " సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసౌర్స్ మేనేన్మెంటు కొలాబరేట్ రీసెర్చి పోగ్రాంకు ఆమె నాయకత్వం వహించింది. 2008 నుండి ఆమె, ఆమె భర్త విన్సెంట్ ఆస్ట్రోమ్ ట్రాన్స్నేషనల్ కార్పొరేషన్స్ రివ్యూ పత్రికకు సలహా ఇచ్చారు.

వ్యక్తిగత జీవితం, విద్య

ఎలినార్ క్లైరె అవాన్ లాస్ ఏంజలెస్(కలిఫోర్నియా) లో సంగీతకారుడు లీ హాప్కింసు - ఆడ్రియన్ అవాన్ దంపతులకు ఏకైక సంతానంగా జన్మించింది.ఆమె జీవితంలో ప్రారంభంలో ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. తరువాత ఎలినోర్ తన తల్లితో ఎక్కువ సమయం నివసించింది. ఆమె తన తల్లితో ప్రొటెస్టంట్ చర్చికి హాజరైంది. తన తండ్రితో తరచూ యూదు కుటుంబంతో వారాంతాలు గడిపింది. విడాకులు తీసుకున్న అనంతర కాలంలో పెరిగిన వత్తిడి కారణంగా ఓస్ట్రోమ్ తనను తాను "పేద పిల్ల" గా చెప్పుకున్నది. ఆమెకు ఈత ప్రధానవ్యాపకంగా ఉంది. ఆమె ఈత బృందంలో చేరింది. ఆమె ఈత నేర్పడం ప్రారంభించే వరకు ఆమె ఈత పోటీలో పాల్గొనేది. కళాశాలలో అధ్యయనం చేయడానికి ఆమె ఈత శిక్షకురాలిగా పనిచేసింది.

బెవర్లీ హిల్స్ హై స్కూలులో ఆమె చదువుకుని 1951 లో పట్టభద్రురాలైంది.ఆపాఠశాల నుండి అత్యధికంగా కళాశాలలో ప్రవేశించడం తన అదృష్టంగా ఆమె భావించింది. ఓస్ట్రోం జూనియరుగా ఉన్నసమయంలో సహవిద్యార్ధులు ఆమెను చర్చా బృందంలో చేరమని ప్రోత్సహించారు. చర్చా వ్యూహాలు ఆమె ఆలోచనా విధానాల మీద ప్రభావాన్ని చూపింది.ఒక ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఎలినోర్ ఆస్ట్రోం త్రికోణమితిని అధ్యయనానికి తగినంత ప్రోత్సాహం లభించలేదు. ఎందుకంటే బీజగణితం, జ్యామెంట్రిలో ఉన్నత మార్కులు లభించని బాలికలను ఈ అధ్యయనానికి అనుమతించలేదు. ఆమె కుటుంబంలో ఎవరికీ కళాశాల అనుభవం లేదు. ఆమె ఉన్నత పాఠశాలలో 90% మంది విద్యార్థులు కళాశాలకు ప్రవేశించారు. ఆమె తల్లికి ఆమె కాలేజీకి హాజరు కావడంలో ఆసక్తి లేదు. దానికి ఎటువంటి కారణం లేదు.

ఆమె యు.సి.ఎల్.ఎ కి హాజరై, బి.ఎ. (పట్టా) 1954 లో యు.సి.ఎల్.ఎ.లో పొలిటికల్ సైంసులో పట్టబధ్రురాలైంది. సెమిస్టర్లలో బహుళ సమ్మర్ సెషన్, అదనపు తరగతులకు హాజరు కావడం ద్వారా ఆమె మూడు సంవత్సరాలలో గ్రాడ్యుయేట్ చేయగలిగింది. ఆమె సెమిస్టర్‌కు $ 50 చొప్పున ఫీజు చెల్లించడానికి లైబ్రరీ, డైం స్టోర్, పుస్తక దుకాణంలో పనిచేసింది.ఆమె సహవిద్యార్ధి చార్లెస్ స్కాట్‌ను వివాహం చేసుకుంది. స్కాట్ హార్వర్డ్ లా స్కూల్‌లో చదివేసమయంలో ఆమె మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లోని జనరల్ రేడియోలో పనిచేసింది. చాలా సంవత్సరాల తరువాత ఆస్ట్రోం పిహెచ్.డి గురించి ఆలోచించడం ప్రారంభించినసమయంలో వారు విడాకులు తీసుకున్నారు. గ్రాడ్యుయేషన్ తరువాత ఆమె ఉద్యోగం చేయడానికి ఇబ్బంది పడింది. ఎందుకంటే యజమానులు ఆమె ఉపాధ్యాయురాలిగా లేదా కార్యదర్శి ఉద్యోగం చేయాలని ఎదురుచూస్తుందని భావించారు. స్టెనోగ్రఫీ కరస్పాండెన్సు కోర్సు చేసిన తరువాత ఆమె ఎగుమతి కార్యాలయంలో గుమస్తాగా ఉద్యోగం ప్రారంభించింది. తరువాత పరిశోధనా ప్రాజెక్టుల మీద ముఖాముఖి ఇంటర్వ్యూలలో నోట్స్ తీసుకునేటప్పుడు ఆమె సహాయకారిగా పనిచేసింది. ఒక సంవత్సరం తరువాత ఆమె ఒక వ్యాపార సంస్థలో అసిస్టెంట్ పర్సనల్ మేనేజర్‌గా ఒక పదవిని పొందింది. ఇంతకు ముందెన్నడూ ఒక మహిళను సెక్రటేరియల్ పదవిలో నియమించలేదు. ఈ ఉద్యోగం గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సులకు హాజరు కావడానికి, చివరికి రీసెర్చ్ అసిస్టెంట్షిప్, పిహెచ్.డి ప్రవేశానికి దరఖాస్తు చేయడానికి ఆమెను ప్రేరేపించింది.

హైస్కూల్ నుండి జామెంట్రీ లేకపోయిన కారణంగా ఆమె యు.సి.ఎల్.ఎ.లో ఎకనామిక్స్ పిహెచ్.డి అధ్యయనానికి అనర్హురాలైంది. UCLA వద్ద. ఆమె పొలిటికల్ సైంసులో గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం చేయడానికి యు.సి.ఎల్.ఎ. ప్రవేశించింది. అక్కడ ఆమెకు 1962 లో ఎం.ఎ, 1965 లో పి.హెచ్.డి చేసింది. ఆమె 1963 లో రాజకీయ శాస్త్రవేత్త విన్సెంట్ ఓస్ట్రోంను వివాహం చేసుకుంది. దక్షిణ కాలిఫోర్నియాలో నీటి వనరుల నిర్వహణ మీద తన పరిశోధనలకు సహాయం చేస్తున్నప్పుడు ఆమె ఆయనను కలుసుకుంది. ఆమె పాల్గొన్న గ్రాడ్యుయేట్ విద్యార్థుల బృందాలు దక్షిణ కాలిఫోర్నియాలోని భూగర్భజల బేసిన్ల సమూహంలో కలిగించే రాజకీయ ఆర్థిక ప్రభావాలను విశ్లేషించాయి. ముఖ్యంగా వెస్ట్ బేసిన్ చూడటానికి ఓస్ట్రోంను నియమించారు. ఒక సాధారణ-పూల్ వనరును పలువురు వ్యక్తులు కలిసి ఉపయోగించినప్పుడు నిర్వహించడం చాలా కష్టమని ఆమె గుర్తించింది.

  1961 లో విన్సెంట్ ఆస్ట్రోం, చార్లెస్ టైబౌట్, రాబర్ట్ వారెన్ "ది ఆర్గనైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ మెట్రోపాలిటన్ ఏరియాస్" ను ప్రచురించారు. ఇది ప్రభావవంతమైన కథనంగా మారింది.

ఏది ఏమయినప్పటికీ ఈ వ్యాసం యు.సి.ఎల్.ఎ. బ్యూరో ఆఫ్ గవర్నమెంటల్ రీసెర్చితో విభేదాలను తీవ్రతరం చేసింది. ఎందుకంటే బ్యూరో ప్రయోజనాలకు విరుద్ధంగా వికేంద్రీకరణకు (పాలిసెంట్రిజం) అనుకూలంగా కేంద్రీకృత మహానగర ప్రాంతాలకు వ్యతిరేకంగా ఉండాలని ఈ వ్యాసంలో సూచించబడింది. ఈ వివాదం ఆస్ట్రోం యు.సి.ఎల్.ఎ.ను విడిచి వెళ్ళేలా ప్రేరేపించింది. విన్సెంట్ ఇండియానా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్షిప్‌ను స్వీకరించి వారి 1965 లో ఇండియానాలోని బ్లూమింగ్టన్‌కు వెళ్ళారు. ఆమె విజిటింగు అసిస్టెంటు ప్రొఫెసరుగా ఫ్యాకల్టీలో చేరింది. ఆమె సాయంకాల తరగతిలో మొదటిసారిగా అమెరికన్ ప్రభుత్వం మీద బోధించింది.

వృత్తిజీవితం

ఆస్ట్రోం తన సొంత సాధ, ఇతరుల ఫీల్డ్ వర్క్ ద్వారా గుర్తింపు పొందింది. లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో ఆమె 1950 లలో శుష్కప్రాంతంలో ఉన్న తన ఇంటి సమీపంలో జరుగుతున్న నీటి యుద్ధాలను, కుళాయిజలాల అధ్యయనం చేసింది. మాల్తుసియనిజం సంబంధిత ప్రస్తుత హేతుబద్ధమైన-ఆర్ధిక అంచనాలు, కామన్సు విషాదానికి భిన్నంగా, సరఫరా తగ్గిపోతున్న సమయంలో మానవులు చిక్కుకొని నిస్సహాయంగా ఉన్న సందర్భాలను ఆమె చూపించింది. గవర్నింగ్ ది కామన్స్ అనే ఆమె పుస్తకంలో స్పెయిన్, నేపాల్ లోని నీటిపారుదల వ్యవస్థలు, స్విట్జర్లాండ్, జపాన్ లోని పర్వత గ్రామాలు, మైనే, ఇండోనేషియాలోని మత్స్య సంపద మీద ఆమె అధ్యయనం చేసింది.

1973 లో ఓస్ట్రోం ఆమె భర్త ఇండియానా విశ్వవిద్యాలయంలో రాజకీయ సిద్ధాంతం, విధాన విశ్లేషణ వర్కుషాప్‌ను స్థాపించారు. ఉమ్మడి కొలను (కామన్ పూల్) వంటి వనరుల (సిపిఆర్) నిర్వహణలో సామూహిక కృషి, నమ్మకం, సహకారం ఉపయోగాన్ని పరిశీలిస్తే ఆమె సంస్థాగత విధానం (ఇన్స్టిట్యూషనల్ అనాలిసిస్ అండ్ డెవలప్‌మెంట్ ఫ్రేమ్వర్కు (ఐఎడి))గా కొంత భిన్నంగా పరిగణించబడుతుంది.

ఆమె సంస్థాగత సిద్ధాంతం, పొలిటికల్ సైన్సు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రంగాలలో అనేక పుస్తకాలను రచించింది. ఎలినోర్ ఓస్ట్రోం తన జీవితాంతం వరకు సిద్ధాంతపరమైన పుస్తకరచనకు అంకితమైన పండితురాలుగా గుర్తించబడుతుంది. ఆమె చనిపోయే ముందు రోజు కూడా ఆమె వ్రాస్తున్న కాగితాల గురించి సహ రచయితలకు రెండు ఇ-మెయిల్ సందేశాలను పంపింది. మార్చిలో లండన్లో జరిగిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ (ఐసిఎస్‌యు) ప్లానెట్ అండర్ ప్రెషర్ సమావేశానికి ఆమె ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా పనిచేసింది.

సాధారణంగా వినియోగదారులు సమిష్టిగా ఉపయోగించిన సహజ వనరులు అధికంగా దోపిడీకి గురై నాశనం చేయబడతాయని ఆర్ధికవేత్తలు దీర్ఘకాలికాలంగా అభిప్రాయపడుతున్నారు. చిన్న, స్థానిక సమాజాలలోని ప్రజలు పచ్చిక బయళ్ళు, చేపలవేటకు ఉపయోగించే జలాశయాలు అడవులు వంటి సహజ భాగస్వామ్య వనరులను ఎలా నిర్వహిస్తారనే విషయం మీద క్షేత్ర అధ్యయనాలు నిర్వహించడం ద్వారా ఎలినోర్ ఓస్ట్రోం ఈ ఆలోచనను ఖండించారు. సహజ వనరులను వారి వినియోగదారులు సంయుక్తంగా ఉపయోగించినప్పుడు ఆర్థికంగా పర్యావరణపరంగా స్థిరంగా ఉండే విధంగా వీటిని ఎలా చూసుకోవాలి, ఉపయోగించాలో అనే విషయంలో కాలక్రమంలో నియమాలు ఏర్పడతాయని ఆమె నిరూపించింది.

ఆమె విన్సెంట్, ఎలినోర్ ఓస్ట్రోం పొలిటికల్ థియరీ అండ్ పాలసీ అనాలిసిస్‌లో వర్క్‌షాప్ సీనియర్ రీసెర్చి డైరెక్టరుగా విధులు నిర్వహించింది. విశిష్ట ప్రొఫెసరు ఆర్థర్ ఎఫ్. బెంట్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్సు అండ్ సైన్సెస్లో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరుగానూ, స్కూల్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ అఫైర్సు ప్రొఫెసరుగానూ విధులు నిర్వహించింది.

పరిశోధన

ఓస్ట్రోం ప్రారంభ పరిశోధన ఉమ్మడిగా నిర్వహించే ఆస్తులు, వనరుల సేవల ఉత్పత్తిని ప్రభావితం చేసే నిర్ణయాల మీద ప్రజలపాత్రను నొక్కి చెప్పింది. ఇండియానాపోలిస్లో పోలీసు ఉత్సవాలు నిర్వహించే పాలిసెంట్రిసిటీ మీద ఆమె అధ్యయనం ఈ ప్రాంతంలో అధికంగా గుర్తించబడింది.ఉమ్మడి సంరక్షణ అనేది సాంస్కృతిక ప్రమాణాల ఆధారంగా రూపొందిచబడిన నియమాల ఆధారంగా నిర్వహించబడుతుంటుంది. ఇందుకు అవసరమైన నియమాలగురించి నమ్మకం ఆధారంగా ముఖాముఖిగా చర్చించవలసి ఉంటుంది. డాక్టరు ఓస్ట్రోం ఉపగ్రహ డేటామీద విరుచుకుపడుతూ స్వయంగా వారిని ప్రశ్నించింది. పరిమిత వనరులను ఉపయోగించుకుంటున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యక్తుల ప్రవర్తనను అంచనా వేయడానికి కృషిచేసింది. 1973 లో ఆమె, ఆమె భర్త విన్సెంట్ అనే రాజకీయ శాస్త్రవేత్త కలిసి ఇండియానా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ థియరీ అండ్ పాలసీ అనాలిసిస్‌ వర్కుషాపు ఏర్పాటు చేశారు. ఆమె విద్యార్థులకు జాతీయ కామన్సులో వాటాలు ఇవ్వబడ్డాయి. వారు సమిష్టి నిర్వహణ ఆరంభించే ముందు వారు ఏమి చేయాలో వారు చర్చించి పని ఆరంభిస్తే వారి "పెట్టుబడుల" నుండి వచ్చే రాబడి రేటు రెట్టింపు చేయడానికి వీలుకలుగుతుందని భావించారు. తరువాత ఆమె మరింత ప్రసిద్ధమైన, దీర్ఘకాలిక స్థిరమైన వనరుల దిగుబడిని నిర్వహించడానికి మానవులు పర్యావరణ వ్యవస్థలతో ఎలా వ్యవహరిస్తారనే దానిపై దృష్టిసారించింది. సాధారణ పూల్ వనరులలో అనేక అడవులు, మత్స్య, చమురు క్షేత్రాలు, మేత భూములు, నీటిపారుదల వ్యవస్థలు ఉన్నాయి. పశ్చిమ నేపాలు గ్రామాలలో (ఉదా., డాంగ్ డ్యూఖురి), ఆఫ్రికాలోని స్థానికులు పచ్చిక నిర్వహణ, నీటిపారుదల వ్యవస్థల నిర్వహణ మీద ఆమె క్షేత్రస్థాయి అధ్యయనాలు నిర్వహించింది. వనరుల క్షీణతను నివారించడంలో కొన్ని ఏర్పాట్లు విఫలమైనప్పటికీ, సహజ వనరులను నిర్వహించడానికి, పర్యావరణ వ్యవస్థ పతనం నివారించడానికి సమాజాలు విభిన్న సంస్థాగత ఏర్పాట్లను ఎలా అభివృద్ధి చేయడాన్ని ఆమె పరిశోధించింది. ఆమె పరిశోధన మానవ-పర్యావరణ వ్యవస్థ పరస్పర చర్య బహుముఖ స్వభావాన్ని నొక్కి చెప్పింది.

పొలిటికల్ థియరీ అండ్ పాలసీ అనాలిసిస్‌లోని వర్క్‌షాపు ఆర్థిక, రాజకీయ, ఇతర రంగాలలోని నిష్ణాతులకు సహకరించడానికి కృషిచేస్తూ విభిన్న పర్యావరణ, సామాజిక ఆర్థిక రాజకీయ వేదికల సంస్థాగత ఏర్పాట్ల ఫలితాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. డేటాను సేకరించే ప్రయత్నంలో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించడంతో సరిపెట్టుకొనకుండా ప్రపంచంలోని ప్రత్యేక ప్రాంతాలలో నివసించే అటవీ ప్రజల పరిస్థితుల మీద ఆసక్తిని కలిగి ఉన్న పరిశోధకుల నెట్వర్కును సృష్టించి అటవీ విధానం అధ్యయనాలు నిర్వహించింది.

ఉమ్మడి వనరుల సంస్థ రూపకల్పన విధానాలు

ఓస్ట్రోం స్థిరమైన స్థానిక సాధారణ పూల్ వనరుల నిర్వహణకు ఎనిమిది "సూత్రాలను" గుర్తించి రూపకల్పన చేసింది:

  1. స్పష్టంగా నిర్వచించబడింది (సాధారణ పూల్ వనరు విషయాల స్పష్టమైన అవగాహన లేని అనర్హులైన బృందాలను సమర్థవంతంగా మినహాయించడం);
  2. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉండే సాధారణ వనరుల సముపార్జన, కేటాయింపు;
  3. సమిష్టి-ఎంపిక ఏర్పాట్లు వనరులను కేటాయించేవారు నిర్ణయాత్మక ప్రక్రియలో పాల్గొనడానికి అనుమతిస్తాయి;
  4. జవాబుదారీగా ఉన్న మానిటర్ల ద్వారా సమర్థవంతమైన పర్యవేక్షణ నిర్వహించడం;
  5. కమ్యూనిటీ నియమాలను ఉల్లంఘించే వనరుల కేటాయింపుదారుల మీద ఆంక్షల వింధిచేస్థాయి;
  6. చౌకైన,సులభంగా అందుబాటు చేయగల పరిష్కారం విధానాలు;
  7. సంఘం స్వీయ-నిర్ణయానికి ఉన్నత స్థాయి అధికారులు గుర్తింపు;
  8. పెద్ద కామన్-పూల్ వనరుల విషయంలో, చిన్న స్థానిక సిపిఆర్‌లతో బేస్ స్థాయిలో సమూహ స్థాయిలో బహుళ స్థానికసంస్థల భాగస్వామ్యం చేయడం.

ఈ సూత్రాలు స్వల్ప-వ్యవస్థీకృత పాలనా వ్యవస్థల విజయాన్ని ప్రభావితం చేస్తాయని విశ్వసించబడుతున్నాయి. ఈ సూత్రాలు కొద్దిగా సవరించబడి అనేక అదనపు వైవిధ్యమైన విధానాలి చేర్చి విస్తరించబడ్డాయి. వీటిలో సమర్థవంతమైన కమ్యూనికేషన్, అంతర్గత విశ్వాసంతో నిర్వహణ బాధ్యత వహించడం ఉమ్మడి వనరుల సంరక్షణకు సాయపడతాయని నిరూపించబడింది.

ఓస్ట్రోం ఆమె సహ-పరిశోధకులు కలిసి సమగ్రమైన "సాంఘిక-పర్యావరణ వ్యవస్థలు (SES) ఫ్రేంవర్కు" ను అభివృద్ధి చేశారు. వీటిలో సాధారణ-పూల్ వనరులు, సామూహిక స్వపరిపాలన సిద్ధాంతాలు ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్నాయి.

పర్యావరణ సంరక్షణ

నార్వేజియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అర్బన్ అండ్ రీజినల్ రీసెర్చి ఆధారంగా అస్ట్రోం "పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా పనిని సమన్వయం చేస్తూ సమస్యను పరిష్కరించడానికి ప్రపంచ స్థాయిలో సమిష్టికృషి అవసరమని ప్రభుత్వ విభాగాలను హెచ్చరించింది. ఆమె ప్రతిపాదించిన పాలిసెంట్రిక్ విధానం సన్నివేశానికి దగ్గరగా కీలకమైన నిర్వహణ నిర్ణయాలు ఉండాలి తెలియజేస్తుంది. " సహజ వనరులు దీర్ఘకాలంలో ఎక్కువగా ఉపయోగించబడి తరువాత క్రమంగా నాశనం అవుతాయనే ఆర్థికవేత్తల ఆలోచన సరికాదని ఋజువు చేయడానికి ఓస్ట్రోం పరిశోధన సహాయపడింది. చిన్న, స్థానిక సమాజాలలో ప్రజలు ఉపయోగించే పచ్చిక బయళ్ళు, గనులు ఇండోనేషియాలోని మత్స్య జలాలు, నేపాలులోని అడవులు వంటి సహజ వనరుల నిర్వహణ గురించిన క్షేత్రస్థాయి అధ్యయనాలు నిర్వహించడం ద్వారా ఎలినోర్ ఆస్ట్రోం ఈ ఆలోచనను ఖండించింది. సహజ వనరులను వారి వినియోగదారులు సంయుక్తంగా నిర్వహించేటప్పుడు, కాలక్రమేణా వీటిని నిర్వహిస్తూ ఆర్థికంగా, పర్యావరణపరంగా స్థిరంగా ఉపయోగించడానికి నియమాలు ఏర్పడతాయని ఆమె నిరూపించింది.

ఓస్ట్రో చట్టం

" ఓస్ట్రోం చట్టం " వంటి ఎలినోర్ ఆస్ట్రోం రచనలు ఆర్థిక శాస్త్రంలో మునుపటి సైద్ధాంతిక చట్రాలను, ఆస్తి గురించి (ముఖ్యంగా కామన్స్ గురించి) వివరించే సామెతగా సూచించబడ్డాయి. ఓస్ట్రోం కామన్సు క్రియాత్మక ఉదాహరణల వివరణాత్మక విశ్లేషణలు ఆచరణాత్మకంగా, సిద్ధాంతపరంగా సాధ్యమయ్యే వనరుల ప్రత్యామ్నాయ దృష్టిని సృష్టిస్తాయి. పేరులేని ఈ చట్టాన్ని లీ అన్నే ఫెన్నెలు క్లుప్తంగా ఇలా పేర్కొన్నాడు:

సిద్ధాంతంలో పని చేస్తూ ఆచరణలో కార్యరూపందాల్చి పనిచేయగలిగిన వనరుల అమరిక.

అవార్డులు, గుర్తింపులు

ఓస్ట్రోం " యునైటెడ్ స్టేట్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ " లో సభ్యురాలిగా, అమెరికన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ & పబ్లిక్ ఛాయిస్ సొసైటీ అధ్యక్షురాలిగా పనిచేసింది. 1999 లో పొలిటికల్ సైంసులో ఆమె ప్రతిష్టాత్మక జోహన్ స్కైట్ బహుమతిని అందుకున్న మొదటి మహిళగా నిలిచింది.

1998 లో ఓస్ట్రోంకు రాజకీయ ఆర్థిక వ్యవస్థ కొరకు ఫ్రాంక్ ఇ. సీడ్మాన్ విశిష్ట అవార్డు లభించింది. "ది కంపారిటివ్ స్టడీ ఆఫ్ పబ్లిక్ ఎకానమీ" పై ఆమె పేపర్ సమర్పించిన తరువాత ఆమెకూ కెన్నెత్ ఆరో, థామస్ షెల్లింగ్, అమర్త్య సేన్ మధ్య చర్చలు జరిగాయి. 2004 లో " నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ " ఆమెకు జాన్ జె. కార్టీ అవార్డును ప్రదానం చేసింది. 2005 లో " అమెరికన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ జేమ్స్ మాడిసన్ " నుండి అవార్డును అందుకుంది. 2008 లో రాజకీయ శాస్త్రంలో విలియం హెచ్. రైకర్ బహుమతిని అందుకున్న మొదటి మహిళగా ఆమె గుర్తింపు పొందింది. మరుసటి సంవత్సరం ఆమె టఫ్ట్స్ విశ్వవిద్యాలయంలోని జోనాథన్ ఎం. టిష్ కాలేజ్ ఆఫ్ సిటిజన్‌షిప్ అండ్ పబ్లిక్ సర్వీస్ నుండి టిష్ సివిక్ ఎంగేజ్‌మెంట్ రీసెర్చి బహుమతిని అందుకుంది. 2010 లో ఉట్నే రీడర్ మ్యాగజైన్ ఓస్ట్రోంను "మీ ప్రపంచాన్ని మార్చే 25 ద్రష్టలలో " ఒకరుగా చేర్చింది.2012 లో టైమ్ మ్యాగజైన్ "ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది" లో ఒకరిగా ఆమె పేరుపొందింది.


ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ (ఐ.ఎస్.ఎస్) 2002 లో ఆమెకు గౌరవ ఫెలోషిప్ ఇచ్చింది.

ఎలినోర్ ఆస్ట్రోంతో టెలిఫోన్ ఇంటర్వ్యూ

2008 లో ఆమెకు నార్వేజియన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో గౌరవ డిగ్రీ, డాక్టర్ హానరిస్ కాసా లభించింది. 2019 జూలైలో " ఇండియానా యూనివర్శిటీ బ్లూమింగ్టన్ " లోని పొలిటికల్ సైంసు భవనం వెలుపల ఓస్ట్రోం శిల్పం స్థాపించబడింది.

ఆర్ధికశాస్త్రంలో నోబుల్ బహుమతి

2009 లో ఓస్ట్రోం ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ మెమోరియల్ బహుమతిని పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది. ఆమెకు బహుమతి ఇవ్వనున్నట్లు చేసిన ప్రకటన చాలా మంది ఆర్థికవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఆమె గురించి ఎన్నడూ వినని " ప్రిన్స్టన్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ " ప్రముఖులను కూడా ఈ ప్రకటన ఆశ్చర్యపరచింది." రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఓస్ట్రోంను ఉదహరిస్తూ "ఆమె ఆర్థిక విశ్లేషణ " ఉమ్మడి ఆస్తిని ఉపయోగించే సమూహాలలో ఎలా విజయవంతంగా నిర్వహించవచ్చో నిరూపించింది అని వివరించింది. ఆర్థిక విధానంలో ఆస్ట్రోం ప్రత్యేక కృషికి కొరకు ఆస్ట్రోం ఆలివర్ ఇ. విలియమ్సన్‌తో కలిసి 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ (90 990,000; 44 1.44 మిలియన్) బహుమతిని పంచుకున్నారు. మునుపటి ద్రవ్య బహుమతులను ఓస్ట్రోం అవార్డును ఆమె స్థాపించిన వర్క్‌షాప్‌కు విరాళంగా ఇచ్చింది.

ఎలినార్ అస్ట్రోం 
2009 నోబుల్ బహుమతి విజేతలతో ఎలినార్ ఓస్ట్రో

రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మాటలలో ఓస్ట్రోం "పరిశోధన ఈ అంశాన్ని శాస్త్రీయ దృష్టికి తీసుకువచ్చింది ... సాధారణ వనరులు-అడవులు, మత్స్య సంపద, చమురు క్షేత్రాలు లేదా మేత భూములు (ప్రభుత్వాలు లేదా ప్రైవేట్ సంస్థల ద్వారా కాకుండా) ఎలా ఉపయోగిస్తే ప్రజలు విజయవంతంగా నిర్వహించగలరో చూపించింది ". ఈ విషయంలో ఓస్ట్రోం చేసిన కృషి సాంప్రదాయిక జ్ఞానాన్ని సవాలు చేసింది. ప్రభుత్వ నియంత్రణ లేదా ప్రైవేటీకరణ లేకుండా ఉమ్మడి వనరులను విజయవంతంగా నిర్వహించవచ్చని ఇది చూపిస్తుంది.

మరణం

2011 అక్టోబరులో ఆస్ట్రోంకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ణయించబడింది. ఆమె జీవితంలో చివరి సంవత్సరంలో ఆమె మరణానికి పదకొండు వారాల ముందు వరకు " ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లో" హాయక్ ఉపన్యాసం ఇస్తూ, వ్రాస్తూనే ఉంది. 2012 జూన్ 12 న మంగళవారం ఉదయం 6:40 గంటలకు ఆమె తన 78 సంవత్సరాల వయసులో ఐ.యు. హెల్త్ బ్లూమింగ్టన్ ఆసుపత్రిలో మరణించింది. ఆమె మరణించిన రోజున ఆమె చివరి వ్యాసం "గ్రీన్ ఫ్రమ్ ది గ్రాస్‌రూట్స్" ను ప్రాజెక్ట్ సిండికేట్‌లో ప్రచురించబడింది. ఆమె మరణం గురించి ఇండియానా విశ్వవిద్యాలయ అధ్యక్షుడు మైఖేల్ మెక్‌రోబీ ఇలా వ్రాశారు: "ఎలినోర్ ఆస్ట్రోమ్ గడిచిన తరువాత ఇండియానా విశ్వవిద్యాలయం కోలుకోలేని, అద్భుతమైన నిధిని కోల్పోయింది". ఆమె మరణించిన తరువాత ఆమె ఇండియానా సహోద్యోగి మైఖేల్ మెక్‌గిన్నిస్ ఇలా వ్యాఖ్యానించాడు. ఆస్ట్రోం తన వాటా అయిన 1.4 మిలియన్ డాలర్ల నోబెల్ అవార్డు డబ్బును వర్క్‌షాప్‌కు విరాళంగా ఇచ్చింది.-ఇప్పటివరకు ఓస్ట్రోం కేంద్రానికి ఇచ్చిన అనేక అవార్డులలో ఇది అతిపెద్ద ద్రవ్య పురస్కారం. 17 రోజుల తరువాత ఆమె భర్త విన్సెంట్ క్యాన్సర్‌కు సంబంధించిన సమస్యలతో మరణించాడు. అప్పటికి ఆయన వయసు 92.

మూలాలు

Tags:

ఎలినార్ అస్ట్రోం వ్యక్తిగత జీవితం, విద్యఎలినార్ అస్ట్రోం వృత్తిజీవితంఎలినార్ అస్ట్రోం పరిశోధనఎలినార్ అస్ట్రోం అవార్డులు, గుర్తింపులుఎలినార్ అస్ట్రోం మరణంఎలినార్ అస్ట్రోం మూలాలుఎలినార్ అస్ట్రోం

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతరత్నఫరియా అబ్దుల్లావేములవాడవేముల ప్ర‌శాంత్ రెడ్డిరాం చరణ్ తేజరమాప్రభనర్మదా నదివాట్స్‌యాప్ఆది శంకరాచార్యులుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసిల్క్ స్మితపంచారామాలుబైబిల్యూట్యూబ్సమ్మక్క సారక్క జాతరరక్త పింజరిభారతదేశ అత్యున్నత న్యాయస్థానంనిజాంనారా చంద్రబాబునాయుడుబాబర్రామదాసురైతుబంధు పథకంఉత్తర ఫల్గుణి నక్షత్రమురామానుజాచార్యుడుహరిద్వార్తెలంగాణ రైతుబీమా పథకంమే దినోత్సవంతెలంగాణ ప్రభుత్వ పథకాలురావు గోపాలరావుతెలుగునాట ఇంటిపేర్ల జాబితాఆరుగురు పతివ్రతలుహనుమాన్ చాలీసాతెలుగు ప్రజలుపూరీ జగన్నాథ దేవాలయంజీ20కంటి వెలుగుఉగాదితెలుగుదేశం పార్టీసంక్రాంతిఇ.వి.వి.సత్యనారాయణఅటార్నీ జనరల్దుర్యోధనుడుతెలంగాణ రాష్ట్ర సమితితెలుగు వ్యాకరణంపొంగూరు నారాయణబెల్లి లలితగిడుగు వెంకట రామమూర్తిజనాభాఆశ్లేష నక్షత్రముకాంచనగోపరాజు సమరంద్రౌపది ముర్ముబంగారు బుల్లోడుపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)హస్తప్రయోగంఒగ్గు కథరక్తంభూమిరోహిణి నక్షత్రంస్వలింగ సంపర్కంమా ఊరి పొలిమేరకిలారి ఆనంద్ పాల్గోవిందుడు అందరివాడేలేన్యుమోనియావేమన శతకముత్యాగరాజువందేమాతరంఏ.పి.జె. అబ్దుల్ కలామ్రోజా సెల్వమణిరామావతారముఆయాసంశరత్ బాబుగురుడుభారత జాతీయపతాకంగంగా పుష్కరంఇండుపుతెలుగునాట జానపద కళలుపాండ్య రాజవంశంగౌడ🡆 More