ఇంగ్మార్ బెర్గ్మాన్

ఇంగ్మార్ బెర్గ్మాన్; Ernst Ingmar Bergman (14 జూలై 1918 - 30 జూలై 2007) ప్రముఖ స్వీడిష్ దర్శకుడు.

ఇతని సినిమాలు ప్రపంచ సినిమా రంగంలో ఎందరికో ప్రేరణను కలిగించాయి.ఎందరినో ప్రభావితం చేశాయి. దాదాపు 60 సినిమాలు, టెలివిజన్ డాక్యుమెంటరీలకి దర్శకత్వం వహించాడు. అతని ప్రసిధ్ధి చెందిన సినిమాలు. The Seventh Seal (1957), Wild Strawberries (1957), Persona (1966), Cries and Whispers (1972), and Fanny and Alexander (1982). ప్రపంచంలోని మేటి దర్శకులెందరో తమకు స్ఫూర్తిగా పేర్కొనే మహాదర్శకుడు ఇన్మార్ బెర్గ్‌మన్! ‘మూవీ కెమెరా కనుక్కున్నాక, భూమ్మీద జన్మించిన అతిగొప్ప సినిమా కళాకారుడు బెర్గ్‌మన్,’ అంటాడు దర్శకుడు వూడీ అలెన్. మృత్యువు, అస్తిత్వం, నైతిక చింతన, దైవం, నిరాశ, ఒంటరితనం, కలలు, గతించిన యౌవనం, పశ్చాత్తాపం, వాంఛ లాంటి బలమైన భావనల్ని అజరామరంగా తెరకెక్కించాడు బెర్గ్‌మన్. తత్వోద్వేగాల సంక్లిష్ట సమ్మేళనంలాంటి ఆయన చిత్రాలకు సినిమా ప్రేమికులు పాఠ్యగ్రంథాల స్థాయినిస్తారు.

ఇన్మర్ బెర్గ్‌మన్
ఇంగ్మార్ బెర్గ్మాన్
వైల్డ్ స్ట్రాబెర్రీస్(1957)
చిత్రనిర్మాణ సమయంలో ఇన్మర్ బెర్గ్‌మన్
జననం
ఎర్నెస్ట్ ఇన్మర్ బెర్గ్‌మన్

(1918-07-14)1918 జూలై 14
ఉప్సాలా, స్వీడన్
మరణం2007 జూలై 30(2007-07-30) (వయసు 89)
ఫోర, స్వీడన్
వృత్తిచిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1944–2005
జీవిత భాగస్వామి
  • ఎల్సే ఫిషర్ (1943–45)
  • ఎల్లన్ లుండ్‍స్ట్రామ్ (1945–50)
  • గున్ గ్రుట్ (1951–59)
  • క్యాబి లరాతే (1959–69)
  • ఇన్‍గ్రిడ్ వాన్ రోసెన్ (1971–95)
పురస్కారాలు
  • గొయెతె బహుమతి
  • Praemium Imperiale
సంతకం
ఇంగ్మార్ బెర్గ్మాన్

పరిమితమైన అవసరాలతో, పరిమితమైన స్థలంలో జీవించిన బెర్గ్‌మన్... షూటింగుకు కూడా పూర్తి పరిచిత, పరిమిత వాతావరణం సృష్టించుకునేవాడు. నటీనటులుగానీ, సాంకేతిక నిపుణులుగానీ ఆయనకు దాదాపుగా అందరూ ‘రెగ్యులర్సే’. గున్నార్ జోర్న్‌స్ట్రాండ్, మాక్స్ వాన్ సిడో, గన్నెల్ లిండ్‌బ్లోమ్, ఇంగ్రిడ్ తులిన్, లివ్ ఉల్‌మాన్, బీబీ ఆండర్సన్, హారియెట్ ఆండర్సన్, స్వెన్ నైక్విస్ట్ (కెమెరామన్)... ఆయన సినిమాలన్నింటా దాదాపుగా ఈ పేర్లే పునరావృతం అవుతాయి. బృందానికి తల్లిలాంటి ఆదరణతో టీ, లంచ్ సర్వ్ చేయడానికి ఒకామెను నియమించుకుని, ఆమె పేరు కూడా టైటిల్స్‌లో వేసేవాడు. అందుకే, ఒక సందర్భంలో, ‘నేను పద్దెనిమిది మంది స్నేహితులతో పనిచేస్తాను,’ అన్నాడాయన. దానివల్ల, మళ్లీ కొత్తగా ప్రారంభించాల్సిన పనిలేదు! ఇలాగైతే ఒక ఆర్టిస్టిక్ కంట్రోల్ ఉంటుందని ఆయన ఉద్దేశం!

దేవుడివల్ల కాదు, మనిషికి ప్రేమవల్లే విముక్తి దొరుకుతుందని విశ్వసించిన బెర్గ్‌మన్ సినిమాలు ఎవరికి వారు తమ దేహాన్ని నగ్నంగా చూసుకున్నంత ఆశ్చర్యంగా, గొప్పగా, చిత్రంగా, మురికిగా ఉంటాయి.

బాల్యం

‘మా ఇంటి పెద్ద కిటికీలోంచి వచ్చే సూర్యోదయాన్ని నేను ‘వినేవాణ్ని’. దూరంగా మోగుతున్న చర్చి గంటల నేపథ్యంలో నాకు వెలుతురు వినిపించేది,’ అంటాడు తన బాల్యంలో దృశ్యానికి ఆకర్షితుడైన తీరును గురించి బెర్గ్‌మన్. పూర్తి సానుకూలంగా లేని చిన్నతనంలో ఆయన్ని భయం, సోమరితనం, నిరాశ, కోపం లాంటి దయ్యాలే ఎక్కువగా పలకరించేవి. ‘ఎప్పుడైతే దయ్యం వాస్తవమో, దానికొక మానవస్పృహ అద్దడం అత్యవసరమైపోతుంది!’ ఒక చిన్న దృశ్యం, ఒక పలకరింపు, ఒక మనిషిపట్ల కలిగే ఉద్వేగం, ఒకరు చెప్పే సంఘటన, ఒక మనిషి ముఖం... అదేదైనా కావొచ్చు, అందులోంచి గుర్తింపునకు రాగలిగే బీజాన్ని ఆయన వృక్షంగా పెంపుచేసేవాడు. మళ్లీ దాన్ని పదాలుగా, వాక్యాలుగా కాగితంలోకి రూపాంతరం చెందించి, తిరిగి ఆ అక్షరాల్ని దృశ్యాలుగా ఆవిష్కరించేవాడు. అయితే, టెక్నికల్ వివరాలు, లాంగ్ షాట్, క్లోజప్ లాంటి మాటలు స్క్రిప్టులో రాయడం ‘బోర్’ అనేవాడు. రాయకుండానే అందులోని రిథమ్ అర్థం చేసుకోవడం సరైందనేవాడు.

ప్రభావం

సినిమాలు

మనిషి అంతరంగపు అరాచకత్వాన్ని తక్కువ బడ్జెట్‌తో, పద్ధతిగా, ఏడాదికొక సినిమాగా మలుస్తూపోయాడు బెర్గ్‌మన్. హాలీవుడ్‌ని పట్టించుకోకుండా, తన మాతృదేశం స్వీడన్‌కే పరిమితమవడానికి కారణం, లాభనష్టాలు బేరీజు వేయనక్కర్లేని సృజనాత్మక స్వేచ్ఛ! తొలుత రంగస్థలంలో పనిచేసి, స్వయంప్రకాశంతో సినిమాల్లోకి వచ్చాడు. వింటర్ లైట్, సెవెన్త్ సీల్, వైల్డ్ స్ట్రాబెర్రీస్, పర్సోనా, క్రైస్ అండ్ విస్పర్స్, మెజీషియన్, సెలైన్స్, ఫ్యానీ అండ్ అలెగ్జాండర్, త్రూ ఎ గ్లాస్ డార్కీ... తమ జీవితకాలంలో అలాంటి ఒక్క సినిమానైనా తీయాలని సృజనశీలురు కలలుగనే క్లాసిక్స్!

“The Devil’s Eye (1960)” ఒక ఫాంటసీ కామెడీ చిత్రం. “The chastity of a woman is a sty in the eye of the devil” అన్న వాక్యంతో మొదలవుతుంది కథనం. నరకంలో సైతానుకి కంటి మీద ఒక కురుపు వస్తుంది. దానికి కారణం భూమ్మీద ఉన్న ఒక అమాయకపు కన్య అని తీర్మానిస్తారు అతని సలహాదారులు. ఆ కురుపు పోవాలంటే ఆమెని ఆకర్షించి, ప్రేమలో పడవేసి, ఆమె కన్యత్వాన్ని అపహరించడమే పరిష్కారం అంటారు. దీనివల్ల, సైతాను డాన్యువాన్ అన్న ఒక నరకలోక వాసిని పిలుస్తాడు. అతగాడు ఇదివరలో భూమ్మీద బ్రతికున్నప్పుడు వందలకొద్దీ అమ్మాయిలను తన మాయలో పడవేసిన చరిత్ర కలవాడు. ఇలా ప్రతి ఒక్కర్నీ ప్రేమలో ముంచి మోసం చేయడమే కానీ, నిజంగా ప్రేమించడం అంటే ఏమిటో తెలియని వాడు. చివరికి అలాగ “ప్రేమలో” పడ్డ ఒక అమ్మాయి తండ్రి తాలూకా విగ్రహం ఇతనితో చేయి కలిపినట్లే కలిపి, నరకంలోకి లాగేస్తుంది. సరే, అతగాడు సైతాను చెప్పింది విని ఒప్పుకొని భూమ్మీదకు వెళ్లి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ప్రవేశిస్తాడు. అతగాడు తన ప్రయత్నంలో సఫలమయ్యాడా? పాపం సైతాను కురుపు తగ్గుముఖం పట్టిందా? అతని బాధ తీరిందా? అన్నది తదుపరి కథ. Persona (1966) ఇందులో కథ, ఒక నటి ఉన్నట్లుండి మనుష్యుల్తో మాట్లాడటం మానేస్తుంది. ఏమైందో ఎవరికీ అర్థం కాదు. ఆమెని చూస్కోడానికి హాస్పిటల్లో ఓ నర్సుని నియమిస్తారు. నటికి స్థాన మార్పు కోసం వీళ్ళిద్దరూ అక్కడి డాక్టర్ చెప్పిన ప్రదేశానికి వెళ్తారు. ఉండేది ఇద్దరే కనుక, ఏమీ తోచక నర్సు నటితో తన కథ చెప్పడం మొదలుపెడుతుంది. ఆమె అన్నింటికీ తల ఊపుతుంది తప్పితే ఏమీ మాట్లాడదు. కాలం గడిచేకొద్దీ నర్సు ప్రవర్తన మార్పు చెందుతూ వస్తుంది. ఎవరు ఎవరి ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చారో అన్న సందేహం వస్తుంది. ఈ సినిమాలో ఉన్న విశేషం, కేవలం రెండు పాత్రలే ఉంటాయి. అందులోనూ కెవలం ఒక్క పాత్ర మాత్రమే మాట్లాడుతుంది. పైగా సైకో టైపు. కానీ, ఈ సినిమాలో కథ, ఆ పాత్రధారుల హావభావాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. కథ కాస్త క్లిష్టమైనది. దాన్ని సినిమాగా తీయగలగడం అన్నదే ఈ సినిమా దర్శకత్వంలోని గొప్పదనం.


Wild Strawberries (1957) ఈ సినిమాలో ఓ వృద్ధ ప్రొఫెసర్ తనకి ఓ యూనివర్సిటీ ఇస్తున్న గౌరవ డాక్టరేటు తీసుకోవడానికి తన కోడలితో సహా వెళ్తూ ఉంటాడు. ఈ ప్రయాణంలో అతన్ని జ్ఞాపకాలు, కలలూ, మరణం గురించిన చింతా – చుట్టుముడతాయి. దారిలో అతను కలిసిన మనుష్యులూ, అతని ఆలోచనల్లో ఒక్కో పాత్ర ప్రవేశం తెచ్చిన మార్పులూ – ఇదీ కథాంశం.


Fanny and Alexander (1982): కథ విషయానికొస్తే ఇది ఫానీ, అలెగ్జాండర్ అన్న ఇద్దరు అన్నాచెల్లెళ్ళ కథ. హఠాత్తుగా వాళ్ళ తండ్రి చనిపోవడం, వాళ్ళ తల్లి రెండో పెళ్ళి చేసుకోవడం, ఆ సవతి తండ్రి చేతుల్లో ఈ తల్లీ పిల్లల పాట్లు – ఈ నేపథ్యంలో సాగుతుంది. చివరికి సుఖాంతమయ్యే ఈ సినిమాలో ఇంకా చాలా అంశాలు ప్రస్తావిస్తాడు బెర్గ్మాన్. మతం, దేవుడు, ప్రేమ, ద్వేషం, మధ్యలో ఆత్మలూ, దయ్యాలూ, కాస్త తాత్విక చింతనా – ఇలా ఎన్నో విషయాల గురించి చర్చిస్తాడు. అలెగ్జాండర్ ఆత్మతో సంభాషిస్తూ ఉండే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

రచనలు

అయితే, బెర్గ్మాన్ ఒక దర్శకుడే కాదు. రచయిత కూడా. తన సినిమాలు, వాటి తాలూకా స్క్రీన్ ప్లేలు కాకుండా అనేక నాటకాలు కూడా వ్రాశాడు. సినిమాను సాహిత్యపు స్థాయికి తెచ్చిన బెర్గ్‌మన్ చిత్రంగా సాహిత్యాన్ని సినిమాగా తీయడాన్ని ఇష్టపడలేదు. అవి రెండూ భిన్నమాధ్యమాలనేవాడు. కానీ తను రాసే స్క్రిప్టును మాత్రం పూర్తిస్థాయి రచనలాగే చేసేవాడు. ఎదుటివారికి అర్థంకావడానికి అంతకంటే మార్గంలేదనేవాడు. చెప్పలేనివి కూడా అర్థం చేయించగలిగే ప్రత్యేక కోడ్ ఉంటే బాగుండేదని కూడా తలపోశాడు. అయినా భాషా పరిమితిని దాటి ఆయన ప్రపంచానికి చేరువయ్యాడు.

అవార్డులు

మరణం

మూలాలు

ఇతర లింకులు

Tags:

ఇంగ్మార్ బెర్గ్మాన్ బాల్యంఇంగ్మార్ బెర్గ్మాన్ ప్రభావంఇంగ్మార్ బెర్గ్మాన్ సినిమాలుఇంగ్మార్ బెర్గ్మాన్ రచనలుఇంగ్మార్ బెర్గ్మాన్ అవార్డులుఇంగ్మార్ బెర్గ్మాన్ మరణంఇంగ్మార్ బెర్గ్మాన్ మూలాలుఇంగ్మార్ బెర్గ్మాన్ ఇతర లింకులుఇంగ్మార్ బెర్గ్మాన్

🔥 Trending searches on Wiki తెలుగు:

సావిత్రి (నటి)శుభ్‌మ‌న్ గిల్ప్రియురాలు పిలిచిందినితిన్వరంగల్తెలుగు భాష చరిత్రజీమెయిల్భారత రాజ్యాంగంతెలంగాణ జిల్లాల జాబితాక్లోమముదువ్వాడ శ్రీనివాస్రాజ్‌కుమార్కలమట వెంకటరమణ మూర్తిఏ.పి.జె. అబ్దుల్ కలామ్మెదక్ లోక్‌సభ నియోజకవర్గంవృషణంహైదరాబాదుగ్రామ పంచాయతీబంగారు బుల్లోడుఆర్తీ అగర్వాల్బతుకమ్మనీ మనసు నాకు తెలుసువిరాట పర్వము ప్రథమాశ్వాసముఎనుముల రేవంత్ రెడ్డిపరిటాల రవిరెండవ ప్రపంచ యుద్ధంవందేమాతరంజార్ఖండ్పరీక్షిత్తుచంద్రుడువిశ్వనాథ సత్యనారాయణఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాతెలంగాణ2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅమ్మజూనియర్ ఎన్.టి.ఆర్తెలుగు సినిమాల జాబితాప్రదీప్ మాచిరాజునవగ్రహాలు జ్యోతిషంజయం రవిఏడిద నాగేశ్వరరావుకాట ఆమ్రపాలిజ్యోతీరావ్ ఫులేతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగోదావరిహనుమాన్ చాలీసాపక్షవాతంజగ్జీవన్ రాంపులిమానవ శరీరముభారతదేశ ప్రధానమంత్రిపొంగులేటి శ్రీనివాస్ రెడ్డివేమిరెడ్డి ప్రభాకరరెడ్డియానిమల్ (2023 సినిమా)స్వర్ణకమలంనువ్వు నాకు నచ్చావ్పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికాలేయంసంభోగంముదిరాజ్ (కులం)రైతురాజనీతి శాస్త్రముమీనరాశిరిషబ్ పంత్గన్నేరు చెట్టుపూర్వ ఫల్గుణి నక్షత్రముఅంగారకుడు (జ్యోతిషం)పాములపర్తి వెంకట నరసింహారావుస్వామియే శరణం అయ్యప్పభారతదేశ జిల్లాల జాబితాచిరంజీవి నటించిన సినిమాల జాబితానారా లోకేశ్భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితారాజ్యసభకమల్ హాసన్ నటించిన సినిమాలుసింహంమఖ నక్షత్రము🡆 More