బాలాసోర్, ఒడిషా రాష్ట్రం లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.
దీన్ని బాలేశ్వర అని కూడా అంటారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు ఉత్తరాన 194 కి.మీ. దూరం లోను, కోల్‌కతా నుండి 300 కి.మీ. దూరం లోనూ ఈ పట్టణం ఉంది. ఇది ఉత్తర ఒడిశా లోని అతిపెద్ద పట్టణం. ఇది చాందీపూర్ బీచ్‌కు ప్రసిద్ధి చెందింది. దీనిని 'క్షిపణి నగరం' అని కూడా అంటారు. భారతీయ బాలిస్టిక్ క్షిపణి రక్షణ కార్యక్రమపు ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ పట్టణానికి దక్షిణంగా 18 కి.మీ. దూరంలో ఉంది.
బాలాసోర్ బాలేశ్వర | ||||||
---|---|---|---|---|---|---|
పట్టణం | ||||||
| ||||||
Coordinates: 21°29′N 86°56′E / 21.49°N 86.93°E | ||||||
దేశం | India | |||||
రాష్ట్రం | ఒడిశా | |||||
జిల్లా | బాలాసోర్ | |||||
Area | ||||||
• పట్టణం | 17.48 km2 (6.75 sq mi) | |||||
Elevation | 16 మీ (52 అ.) | |||||
Population (2011) | ||||||
• పట్టణం | 1,44,373 | |||||
• Rank | India 409th, Odisha 7th | |||||
• Density | 8,300/km2 (21,000/sq mi) | |||||
• Metro | 1,77,557 | |||||
భాషలు | ||||||
• అధికారిక | ఒరియా | |||||
Time zone | UTC+5:30 (IST) | |||||
PIN | 756001-756xxx | |||||
Telephone code | 06782 | |||||
Vehicle registration | OD - 01(Previously OR - 01) | |||||
UN/LOCODE | IN BLS |
శీతోష్ణస్థితి డేటా - Balasore (1981–2010, extremes 1901–2012) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 35.6 (96.1) | 38.7 (101.7) | 41.6 (106.9) | 45.0 (113.0) | 46.7 (116.1) | 46.1 (115.0) | 39.9 (103.8) | 36.7 (98.1) | 36.2 (97.2) | 36.1 (97.0) | 34.8 (94.6) | 33.6 (92.5) | 46.7 (116.1) |
సగటు అధిక °C (°F) | 27.1 (80.8) | 29.8 (85.6) | 33.6 (92.5) | 35.9 (96.6) | 35.7 (96.3) | 34.0 (93.2) | 32.3 (90.1) | 31.9 (89.4) | 32.1 (89.8) | 31.9 (89.4) | 30.1 (86.2) | 27.6 (81.7) | 31.8 (89.2) |
సగటు అల్ప °C (°F) | 14.3 (57.7) | 17.6 (63.7) | 21.7 (71.1) | 24.5 (76.1) | 25.7 (78.3) | 26.1 (79.0) | 25.8 (78.4) | 25.6 (78.1) | 25.3 (77.5) | 23.1 (73.6) | 18.6 (65.5) | 14.7 (58.5) | 21.9 (71.4) |
అత్యల్ప రికార్డు °C (°F) | 7.2 (45.0) | 6.7 (44.1) | 11.7 (53.1) | 16.6 (61.9) | 18.4 (65.1) | 20.0 (68.0) | 20.0 (68.0) | 21.3 (70.3) | 20.3 (68.5) | 15.5 (59.9) | 8.9 (48.0) | 6.7 (44.1) | 6.7 (44.1) |
సగటు వర్షపాతం mm (inches) | 16.4 (0.65) | 36.2 (1.43) | 39.6 (1.56) | 60.5 (2.38) | 146.4 (5.76) | 296.7 (11.68) | 291.2 (11.46) | 308.4 (12.14) | 290.0 (11.42) | 174.3 (6.86) | 39.7 (1.56) | 6.8 (0.27) | 1,706.1 (67.17) |
సగటు వర్షపాతపు రోజులు | 1.1 | 2.0 | 2.3 | 4.2 | 7.2 | 10.9 | 13.7 | 15.3 | 11.8 | 6.0 | 1.6 | 0.4 | 76.4 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 63 | 62 | 64 | 69 | 71 | 75 | 78 | 80 | 80 | 76 | 70 | 65 | 71 |
Source: India Meteorological Department |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బాలాసోర్ పట్టణ ప్రాంత మొత్తం జనాభా 1,44,373, అందులో 73,721 మంది పురుషులు, 70,652 మంది స్త్రీలు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల జనాభా 14,773. బాలాసోర్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 113,418, ఇది జనాభాలో 78.6%, పురుషులలో అక్షరాస్యత 81.7% కాగా, స్త్రీలలో ఇది 75.3%. ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత 87.5%. ఇందులో పురుషుల అక్షరాస్యత 91.0% కాగా, స్త్రీలలో ఇది 83.8%. షెడ్యూల్డ్ కులాల జనాభా 15,812, షెడ్యూల్డ్ తెగల జనాభా 9,291. 2011 నాటికి పట్టణంలో 30460 గృహాలు ఉన్నాయి
చండీపూర్-ఆన్-సీ అనేది ఒక మైలు పొడవైన బీచ్ ఉన్న సముద్రతీర రిసార్టు. ఇది ఒక ప్రత్యేకమైన బీచ్ - అలలు నిర్ణీత వ్యవధిలో రోజుకు నాలుగు సార్లు మాత్రమే ఒడ్డుకు వస్తాయి. పట్టణం నుండి నైరుతి దిశలో 30 కిమీ దూరంలో పర్వతంపై పంచలింగేశ్వరాలయం ఉంది. అక్కడి శివలింగం, జలపాటం వెనుక, నీటిలో మునిగి ఉన్నందున కనిపించదు; దాన్ని తాకి అనుభూతి చెందుతారు. బాలాసోర్‌కు నైరుతి దిశలో సుమారు 33 కిమీ దూరంలో సంతరాగడియా పట్టణంలో కొండపై బిశ్వేశ్వర దేవాలయం ఉంది. పట్టణం నలువైపులా కొండలతో చుట్టబడి ఉంది. సమీపంలోని ఖులియా గ్రామం, ఆదివాసీల స్థావరం. బాలాసోర్‌కు ఆగ్నేయంగా దాదాపు 30 కిమీ దూరంలో ధమరా అనే ఓడరేవు ఉంది.
సమీప విమానాశ్రయం భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ విమానాశ్రయం. ఇది బాలాసోర్ నుండి 200 కి.మీ. దూరంలో ఉంది. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం బాలాసోర్ నుండి 254 కి.మీ. దూరంలో ఉంది.
బాలాసోర్ రైల్వే స్టేషను సౌత్ ఈస్టర్న్ రైల్వేలో హౌరా-చెన్నై ప్రధాన మార్గంలో ఉన్న ఒక ముఖ్యమైన స్టేషను. కోల్‌కతా నుండి దాదాపు 254 కి.మీ., భువనేశ్వర్ నుండి 206 కి.మీ. దూరంలో ఉంది. బాలాసోర్ సమీపంలోని రూప్సా నుండి బారిపడాకు ఒక మార్గం ప్రారంభమవుతుంది. బాలాసోర్ నుండి భువనేశ్వర్, కోల్‌కతా, న్యూఢిల్లీ, చెన్నై, గౌహతి, బెంగళూరు, పూరి, ఎర్నాకులంలకు తదితర నగరాలకు రైళ్ళున్నాయి.
జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 18 బాలాసోర్ గుండా వెళుతున్నాయి. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో భాగమైన జాతీయ రహదారి 16, చెన్నై నుండి కోల్‌కతా వెళ్తుంది. నగరం లోపల రవాణాలో సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు ఉంటాయి. 2017 ఆగస్టు 15 న బాలాసోర్‌లో సిటీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. బస్ టెర్మినస్ సహదేవ్ ఖుంటా వద్ద ఉంది. ప్రతిరోజూ వేలాది ప్రైవేట్ బస్సులు వందలాది గమ్యస్థానాలకు తిరుగుతాయి. అనేక విలాసవంతమైన AC బస్సులు ప్రతిరోజూ భువనేశ్వర్, కోల్‌కతా తదితర నగరాలకు తిరుగుతాయి.
బాలాసోర్ అనేక ఇంజనీరింగ్ కళాశాలలతో ఉత్తర ఒడిశాలోని ప్రధాన విద్యా కేంద్రంగా ఉంది. ఈ పట్టణానికి చెందిన ప్రఖ్యాత నవలా రచయిత ఫకీర్ మోహన్ సేనాపతి పేరు మీద ప్రసిద్ధ ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయం ఉంది. 2018 సంవత్సరంలో దీన్ని స్థాపించారు.
This article uses material from the Wikipedia తెలుగు article బాలాసోర్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.