శ్వేత సౌధం

శ్వేత సౌధం (English: White House వైట్ హౌస్) అమెరికా అధ్యక్షుని నివాసం.

వాషింగ్‌టన్‌ డీసీలో ఉంది. దీన్ని నిర్మించి ఇప్పటికి 210 ఏళ్లయింది. ఇన్నేళ్ల చరిత్రలోనూ ఇదొకసారి శత్రు సైనికుల దాడికి ధ్వంసమైంది. అగ్నిప్రమాదం, వరదలు ఎదుర్కొంది. దీని నిర్వహణకు ఏటా అయ్యే ఖర్చు సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు.

శ్వేత సౌధం
శ్వేత సౌధం

ప్రస్తుతం వైట్‌హౌస్‌ అని వ్యవహరించబడుతున్నప్పటికీ, దాన్ని కట్టాక వందేళ్లకి కానీ ఆ పేరు ఏర్పడలేదు. అంతకు ముందు ప్రెసిడెంట్స్‌ ప్యాలస్‌ అని, ఎగ్జిక్యూటివ్‌ మాన్షన్‌ అనిరకరకాలుగా వ్యవహరించేవారు. ఓసారి ఇది కాలిపోయినప్పుడు మరమ్మతుల కోసం తెల్లరంగు వేశారు. అప్పట్నుంచి వైట్‌హౌస్‌ అనేవారు. అధికారికంగా మాత్రం 1901లో అప్పటి అధ్యక్షుడు థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ ఆ పేరును వాడడం మొదలుపెట్టారు.

ఆరు అంతస్తులుగల ఈ భవనం ఉన్న స్థలం కంచెతో కలిపి మొత్తం 18 ఎకరాలు. భవనం లోపల నిర్మాణస్థలం 55,000 చదరపు అడుగులు. ఉగ్రవాదుల భయంతో ఇప్పుడు అనుమతించడం లేదు. అంతకు మునుపు రోజూ దీన్నీ చూడ్డానికి ఆరువేల మంది వచ్చేవారు.

వైట్‌హౌస్‌ నిర్మాణాన్ని 1792లో మొదలు పెట్టి ఎనిమిదేళ్ల పాటు కొనసాగించారు. అమెరికా తొలి అధ్యక్షుడైన జార్జి వాషింగ్టన్ ఎంపిక చేసిన స్థలంలో కట్టడం మొదలుపెడితే రెండో అధ్యక్షుడైన జాన్‌ ఆడమ్స్‌ హయాంలో 1800లో పూర్తయింది. దీని నిర్మాణానికి అప్పట్లో సుమారు 13 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. తర్వాత ఒకో అధ్యక్షుడుఒకో రకమైన మార్పులు చేస్తూ వచ్చారు. ఇప్పటి అధ్యక్షుడు ఒబామా కొత్తగా ఆర్గానిక్‌ తోటని నాటించి, అందులో తేనెటీగల పెంపకాన్ని చేపడుతున్నారు.

విశేషాలు

  • యుద్ధ సమయంలో 1814లో బ్రిటిష్‌ సైనికులు దీన్ని తగుల బెట్టారు.
  • వైట్‌హౌస్‌లో కూడా ఎలుకల బెడద కూడా ఉండేది. జంతు ప్రేమికుడైన అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్‌ వాటిని పెంచేవాడు. వాటి సంఖ్య పెరిగిపోవడంతోఫెర్రెట్స్‌ అనే ముంగిసలాంటి జంతువుల్ని పెంచి అరికట్టాల్సి వచ్చింది.
  • వైట్‌హౌస్‌ భూగర్భంలో ఓ బంకర్‌ ఉంది. అత్యవరసర పరిస్థితుల్లోఅధ్యక్షుడు ఇక్కడి నుంచే విధులు నిర్వర్తించడానికి అత్యాధునిక సౌకర్యాలుఉన్నాయి. కొన్ని సొరంగమార్గాలు కూడా ఉన్నాయి.
  • వైట్‌హౌస్‌లో మొత్తం 132 గదులు, 142 తలుపులు, 147 కిటికీలు, ఒకేసారి140 మంది కూర్చుని తినగలిగే డైనింగ్‌ టేబుల్‌, 13,000 చాకులు, చెంచాలు ఉన్నాయి.
  • దీని నిర్వహణకు 5,700 మంది ఉద్యోగులున్నారు.

వైట్ హౌస్ అద్దె

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ అద్దె విలువ నెలకు సుమారు రూ.110 కోట్లు అని అంచనా. అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒకవేళ అద్దె చెల్లించాల్సిన పరిస్థితే వస్తే, ఆరు నెలలకు మించి ఆయన దానిని భరించే పరిస్థితి లేదంటూ ‘న్యూయార్క్ డెయిలీ’ దినపత్రిక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం... సువిశాలమైన వైట్‌హౌస్ విస్తీర్ణం 55 వేల చదరపు అడుగులు కాగా, ఇందులో 132 గదులు ఉన్నాయి. 2013 ఆగస్టు ధరల ప్రకారం దీని అద్దె విలువ నెలకు రూ.110 కోట్లకు (18 లక్షల డాలర్లు) పైమాటే. ఇంతటి విస్తీర్ణంలో నిర్మించిన భవనానికి ఏటా రూ.66.75 లక్షలు (1.09 లక్షల డాలర్లు) పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా నికర విలువ రూ.74.7 కోట్లు (12.2 లక్షల డాలర్లు) మాత్రమే. ఆయన వార్షికాదాయం రూ.24.4 కోట్లు (4 లక్షల డాలర్లు).

మూలాలు

Tags:

English languageఅమెరికా

🔥 Trending searches on Wiki తెలుగు:

మంతెన సత్యనారాయణ రాజుసుభాష్ చంద్రబోస్మాదిగనరేంద్ర మోదీకేతిరెడ్డి వెంకటరామిరెడ్డిభారతీయ రిజర్వ్ బ్యాంక్తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుకలువబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ శాసనసభసిమ్రాన్తాటితెలుగు సినిమాలు డ, ఢఅక్కినేని నాగ చైతన్యఅపర్ణా దాస్ద్రోణాచార్యుడుశ్రీలీల (నటి)ఆరోగ్యంఅనసూయ భరధ్వాజ్శివమ్ దూబేచార్మినార్ఢిల్లీ డేర్ డెవిల్స్బ్రహ్మంగారి కాలజ్ఞానంమహావీర్ జయంతిపిఠాపురంమహాత్మా గాంధీతెలుగునాట జానపద కళలుతెలుగు శాసనాలున్యుమోనియాఏప్రిల్అ ఆజ్ఞానపీఠ పురస్కారంభారతీయ శిక్షాస్మృతికొంపెల్ల మాధవీలతభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకుక్కభారతీయ స్టేట్ బ్యాంకుసూర్యుడుశ్రీఆంజనేయంమరణానంతర కర్మలుగురువు (జ్యోతిషం)తిలక్ వర్మమూర్ఛలు (ఫిట్స్)శాంతిస్వరూప్రవీంద్ర జడేజావికీపీడియాపి.సుశీలసౌందర్యపల్లెల్లో కులవృత్తులుబర్రెలక్కమంగ్లీ (సత్యవతి)వెలిచాల జగపతి రావుఎమ్.ఎ. చిదంబరం స్టేడియంశుక్రాచార్యుడుభారతదేశ జిల్లాల జాబితామౌన పోరాటందీపావళినిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంనారా లోకేశ్రైతుపవన్ కళ్యాణ్నామనక్షత్రముమర్రిదీపక్ పరంబోల్వందేమాతరంసంధ్యావందనంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుసాయి ధరమ్ తేజ్హిందూధర్మంశ్రీముఖిప్రజా రాజ్యం పార్టీభారతరత్ననవగ్రహాలు జ్యోతిషంసింహంవిలియం షేక్‌స్పియర్నన్నయ్యతీహార్ జైలునల్లారి కిరణ్ కుమార్ రెడ్డి🡆 More