సల్మాన్ ఖాన్: నటుడు, నిర్మాత

సల్మాన్ ఖాన్ (జననం 27 డిసెంబరు 1965), భారతీయ నటుడు, నిర్మాత, టీవీ నటుడు.

ఆసియాలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఆయన చాలా ప్రసిద్ధులు. ఆయన అసలు పేరు అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్. బాలీవుడ్ లో విజయవంతమైన, ప్రభావవంతమైన నటునిగా ప్రసిద్ధిపొందారు సల్మాన్.

సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్
2009లో సల్మాన్ ఖాన్
జననం
అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్

(1965-12-27) 1965 డిసెంబరు 27 (వయసు 58)
వృత్తిచలనచిత్ర నటుడు
టెలివిజన్ ప్రెజెంటర్
మోడల్
పరోపకారి
పెయింటర్
క్రియాశీల సంవత్సరాలు1988–ప్రస్తుతం
తల్లిదండ్రులుసలీం ఖాన్ (తండ్రి)
సుశీలా చరక్ ఖాన్ (తల్లి)
బంధువులుఅర్బాజ్ ఖాన్ (సోదరుడు)
సోహైల్ ఖాన్ (సోదరుడు)
అల్వీరా ఖాన్ అగ్నిహోత్రి (సోదరి)
అర్పితా ఖాన్ (సోదరి)
హెలెన్ (సవతి తల్లి)

సల్మాన్ తండ్రి సలీం ప్రముఖ స్క్రీన్ రచయిత. బివి హోతో అయిసీ (1988) సినిమాలో సహాయనటునిగా తెరంగేట్రం చేశారు ఆయన. ఆ తరువాత సూరజ్ బర్జత్య దర్శకత్వంలో మైనే ప్యార్ కియా (1989) సినిమాతో కథానాయకునిగా మారారు సల్మాన్. 90వ దశకంలో ఆయన నటించిన హమ్ ఆప్కే హై కౌన్..! (1994), కరణ్ అర్జున్ (1995), బీవీ నెం.1 (1999) వంటి సినిమాలతో బాలీవుడ్ లో తనదైన గుర్తింపు  తెచుకున్నారు ఆయన. 1998లో కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన కుచ్ కుచ్ హోతా హై సినిమాలోని  ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం  అందుకున్నారు సల్మాన్. 2000వ దశకం ఆయనకు కలసి  రాకపోయినా, 2010లో దబాంగ్ సినిమాతో మళ్ళీ హిట్ ల బాట పట్టారు  సల్మాన్. ఆ తరువాత ఆయన నటించిన బాడీ గార్డ్ (2011), ఏక్ థా టైగర్ (2012), కిక్ (2014), బజరంగీ భాయీజాన్ (2015), సుల్తాన్ (2016) వంటి సినిమాలతో బాలీవుడ్ లోనే అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాలను అందించారు. 9 ఏళ్ళ పాటు వరుసుగా బాలీవుడ్ కు అత్యధిక వసూళ్ళు చేసిన సినిమాలు అందించిన ఏకైక నటుడు సల్మాన్. 2014లో ఫోర్బ్స్ భారత్ జాబితాలో ఆయన మొదట ఉన్నారు. ఫోర్బ్స్ 2015 జాబితాలో 33.5 మిలియన్ డాలర్లు తీసుకుంటూ సల్మాన్ ను ప్రపంచ టాప్ పెయిడ్ ఎంటర్టైనర్స్ 2015గా నిలిచారు.

ఆయన ఒక మంచి స్టేజ్ పెర్ఫార్మర్, దాతగా కూడా ప్రఖ్యాతులు. ఆయన బీయింగ్ హ్యూమన్ అనే సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సల్మాన్. ఇవే కాక ఐశ్వర్య రాయ్ తో ప్రేమకథ, అరుదైన జంతువులను వేటాడిన కేసు విషయంలోనూ, ఫుట్ పాత్ పై అయిదుగురిపై కారు పోనిచ్చిన కేసులతో ఆయన ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. 2015లో ఐదేళ్ళ జైలుశిక్ష వేసిన కోర్టు కొన్నిరోజుల తరువాత ఆయనను నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది.

తొలినాళ్ళ జీవితం, నేపథ్యం

సల్మాన్ ఖాన్: నటుడు, నిర్మాత 
తన తమ్ముళ్ళు అర్బాజ్ ఖాన్ (ఎడమ), సోహైల్ ఖాన్ (కుడి)లతో సల్మాన్.

ప్రముఖ స్క్రీన్ రచయిత సలీం ఖాన్, ఆయన మొదటి భార్య సుశీలా చరక్ (సల్మా ఖాన్ గా తరువాత పేరు మార్చుకున్నారు)ల మొదటి సంతానం సల్మాన్ ఖాన్. ఆయన తండ్రి తరఫు పూర్వీకులు అఫ్ఘనిస్థాన్ కు చెందిన పఠాన్ కుటుంబానికి చెందిన వారు. వీరు మధ్యప్రదేశ్  లోని ఇండోర్ లో స్థిరపడ్డారు. సల్మాన్ తల్లి మహారాష్ట్రకు  చెందినవారు.  కానీ ఆమె తండ్రి బల్దేవ్ సింగ్ చరక్ జమ్మూ-కాశ్మీర్ నుంచి  వలస వచ్చారు. ఆమె తల్లి మహారాష్ట్రకు చెందిన వారు. సల్మాన్ తనను తాను హిందూగానూ, ముస్లింగానూ కూడా చెప్పుకుంటారు.

సల్మాన్ సవతి తల్లి హెలెన్ ప్రముఖ నటి. ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు  అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్, ఇద్దరు చెల్లెళ్ళు అల్విరా ఖాన్  అగ్నిహోత్రి, అర్పితా. అందులో అర్పితా దత్తత చెల్లెలు. అర్బాజ్ ఖాన్ నటి మలైకా అరోరాను వివాహం చేసుకోగా, అల్విరా నట దర్శకుడు అతుల్ అగ్నిహోత్రిని పెళ్ళి చేసుకున్నారు.

ముంబైలోని బాంద్రాలో సెయింట్ స్టాన్సలస్ హై స్కూల్ లో చదువుకున్నారు సల్మాన్. అంతకుముందు నాలుగేళ్ల పాటు గ్వాలియర్ లోని ది స్కిండియా స్కూల్ లో కూడా చదువుకున్నారు. ముంబైలోని సెయింట్ గ్జేవియర్స్ కళాశాలలో చదివి, మధ్యలోనే మానేశారు ఆయన.

ఇవి కూడా చూడండి

సల్మాన్ ఖాన్ సినిమాల జాబితా

మూలాలు

Tags:

నిర్మాత

🔥 Trending searches on Wiki తెలుగు:

జీమెయిల్నరసింహ శతకముమ్యాడ్ (2023 తెలుగు సినిమా)ఆతుకూరి మొల్లబాజిరెడ్డి గోవర్దన్దానం నాగేందర్సదాకర్ణుడువృషభరాశిప్రియాంకా అరుళ్ మోహన్భారతదేశ చరిత్రసమంతఫేస్‌బుక్భీష్ముడుపాలక్కాడ్ జిల్లామా తెలుగు తల్లికి మల్లె పూదండఅక్టోబరురాజస్తాన్ రాయల్స్రావి చెట్టుకల్వకుంట్ల చంద్రశేఖరరావుశ్రీ గౌరి ప్రియసత్య సాయి బాబాసోరియాసిస్ముంతాజ్ మహల్తెలంగాణ జిల్లాల జాబితాఆప్రికాట్రంజాన్టాన్సిల్స్పుదుచ్చేరిజాన్ నేపియర్పాడుతా తీయగా (సినిమా)సూర్య (నటుడు)పాములపర్తి వెంకట నరసింహారావుహన్సిక మోత్వానీచెలి (సినిమా)సుహాసిని (జూనియర్)రాగులుతెలంగాణ గవర్నర్ల జాబితావిరాట్ కోహ్లికందుకూరి వీరేశలింగం పంతులువనపర్తిపిఠాపురం శాసనసభ నియోజకవర్గంజాతిరత్నాలు (2021 సినిమా)బుడి ముత్యాల నాయుడుహను మాన్రాజ్యసభరైటర్ పద్మభూషణ్తిరుమలఅవశేషావయవమువిశాఖపట్నంకాకతీయుల శాసనాలువృశ్చిక రాశిసిద్ధు జొన్నలగడ్డఆలంపూర్ జోగులాంబ దేవాలయంఅంగచూషణశ్రీముఖిహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాశ్రీరామనవమి2024 భారత సార్వత్రిక ఎన్నికలుమాగుంట శ్రీనివాసులురెడ్డినీతా అంబానీచతుర్యుగాలుతెలుగు సినిమాలు 2023PHరాజమండ్రిఫిదానానార్థాలుభీమా (2024 సినిమా)శోషరస వ్యవస్థదశావతారములుజోల పాటలుశివుడుమూత్రపిండముతూర్పు గోదావరి జిల్లాశాసన మండలిటబుఉపాధ్యాయుడు🡆 More