సినిమా రుద్రమదేవి: 2015 సినిమా

రుద్రమదేవి, 2015 లో గుణశేఖర్ రూపకల్పనలో వచ్చిన 3డి చారిత్రక చిత్రం, ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రూపొందినది. అనుష్కశెట్టి, శివ కుమార్ శ్రీపాద, కృష్ణంరాజు, దగ్గుబాటి రానా, విక్రమ్ జీత్ విర్క్, ప్రకాశ్ రాజ్, ఆదిత్య మెనన్, నిత్య మెనన్, బాబా సెహగల్, కాథరీన్ త్రెసలతో కూడిన భారీ తారాగణం చిత్రంలో ఉంది. అనుష్క 13వ శతాబ్ది కాకతీయ వంశపు రాణి రుద్రమదేవిగా నటిస్తున్నారు. ఈ సినిమాకి నేపథ్యం సంగీతం, సంగీతం ఇళయరాజా అందిస్తున్నారు  తోట తరణి ఆర్ట్ డైరెక్షన్ నిర్వహిస్తున్నారు. నీతా లుల్లా కాస్ట్యూం డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.

2015 అక్టోబరు 09న విడుదల చేసారు.

రుద్రమదేవి
దర్శకత్వంగుణశేఖర్
నిర్మాతగుణశేఖర్
తారాగణంఅనుష్క శెట్టి
రానా దగ్గుబాటి
శివ కుమార్ శ్రీపాద
విక్రమ్‌జీత్ విర్క్
ప్రకాష్ రాజ్
కృష్ణంరాజు
నిత్య మెనన్
ఆదిత్య మెనన్
ఛాయాగ్రహణంఅజయ్‌నన్ విన్సెంట్
కూర్పుఎ.శ్రీకర్ ప్రసాద్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
గుణ టీమ్ వర్క్స్
విడుదల తేదీ
OCT 09, 2015
దేశంఇండియా
భాషలుతెలుగు
తమిళం
మలయాళం
బడ్జెట్60 crore (US$7.5 million) collection 80crore

నిర్మాణం

దర్శకుడు గుణశేఖర్ రాణి రుద్రమదేవి చరిత్రను ఆధారం చేసుకుని స్క్రిప్ట్ తయారుచేసుకున్నారు. అనుష్క, నయనతార, ప్రియాంక చోప్రాలను ప్రధానపాత్రకు ఆలోచించి, చివరకు గతంలో అరుంధతి సినిమాకు గాను అనుష్క చేసిన నటనను బట్టి ఆమెను టైటిల్ రోల్ కి తీసుకున్నారు. గుణశేఖర్ ఇళయరాజాను సంగీతానికి, తోటతరణిని ఆర్ట్ డైరెక్షన్ కు తీసుకున్నారు. సినిమాను 70 కోట్ల రూపాయల బడ్జెట్లో నిర్మించారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లను గోనగన్నారెడ్డి పాత్రకు సంప్రదించగా వారిద్దరిలో ఎవరూ అందుకు ముందుకురాలేదు. తర్వాత స్వయంగా శివ కుమార్ శ్రీపాద ఆ పాత్రను పోషించేందుకు ముందుకువచ్చారు.

చిత్ర బృందం

నటులు: అనుష్క, అల్లు అర్జున్, రాణా, నిత్యమీనన్, కేథరీన్, కృష్ణంరాజు, ప్రకాష్‌రాజు, సుమన్ సంగీతం: ఇళయరాజా కళ: తోట తరణి ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ కథ, కథనం, దర్శకత్వం: గుణశేఖర్

దర్శకుడు గుణశేఖర్ ‘రుద్రమదేవి’ గురించి చరిత్రలో సామాన్యుడికి అందని అనేక విషయాలను శోధించాడు. కష్టపడి కథగా అల్లుకున్నాడు. కథను తెరకెక్కించేందుకు నిర్మాణంలో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. భారీ బడ్జెట్ సినిమా కనుక -మరో నిర్మాతను రిస్క్‌లో పెట్టకూడదన్న ఆలోచనతో తనే రిస్క్ చేశాడు. చారిత్రక ఘట్టాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించే ప్రయత్నం కనుక -తాను ఆశించింది వచ్చే వరకూ ఆలస్యాన్నీ భరించాడు. చివరకు ‘రుద్రమదేవి’ని విడుదల చేసే విషయంలోనూ -గుణశేఖర్‌ను కష్టాలే చుట్టుముట్టాయి. వాటినీ భరించి, వౌనంగా సహించి.. చివరకు తను స్వప్నాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు.

గణపతిదేవుడి పాలనలో సుభిక్షంగా సాగుతున్న కాకతీయ సామ్రాజ్యంపై శత్రురాజులు కన్నేస్తారు. ఆ సమయంలో మహారాజుకు ఆడపిల్ల పుడుతుంది. ఆడపిల్ల రాజ్యాధికారానికి అనర్హురాలు. పైగా, శత్రురాజుల దండెత్తే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో -పుట్టిన బిడ్డను రుద్రమదేవుడిగా రాజ్యానికి పరిచయం చేస్తాడు. అలా మొదలైన కథ -అసలు విషయానికి దూరంగా జన్మ రహస్యం పాయింట్ చుట్టూనే తిరిగింది. రుద్రమదేవి జన్మ రహస్యం బహిర్గతం కావడమే -సినిమాకు టర్నింగ్ పాయింట్. తరువాత యుద్ధ వ్యూహాలతో సినిమా పతాక సన్నివేశాలకు వెళ్లిపోయింది. ఖడ్గ విద్యలో నైపుణ్యం, మత్తగజాన్ని లొంగదీయడం, చుట్టుముట్టిన సైనికులను చీల్చిచెండాడటం, శత్రుదుర్భేద్యమైన ఏడుకోటల నిర్మాణం, పన్నుల రద్దుకు సాహసోపేత నిర్ణయం, కులాంతర వివాహాలను ప్రోత్సహించడం, రుద్ర సైన్యం ఏర్పాటులాంటి కీలక సన్నివేశాలున్నాయి.

తారాగణం

చిత్రీకరణ

సినిమా రుద్రమదేవి: నిర్మాణం, చిత్ర బృందం, తారాగణం 
సినిమా చిత్రీకరణ ప్రారంభమైన వేయి స్తంభాలయం

సినిమా చిత్రీకరణ 2013 ఫిబ్రవరి 14న వరంగల్లులో ప్రారంభమైంది. మొదటి షాట్ వరంగల్లు లోని చారిత్రక ప్రదేశమైన వేయిస్తంభాలయంలో చిత్రీకరించారు డాన్స్ డైరెక్టర్ బాబా సెహగల్‌ని ఓ పాత్ర కోసం తీసుకున్నారు.  అశుతోష్ గోవారికర్ ఖేలే హమ్ జీ జాన్ సే (2010)లో నెగెటివ్ పాత్రను పోషించిన విక్రమ్‌జీత్ విర్క్‌, మహదేవ నాయకుడు అన్న నెగెటివ్ పాత్రలో కనిపిస్తున్నాడు. చిత్రీకరణ ఆఖరి షెడ్యూలు జూలై 2014లో ముగిసింది.

విడుదల

చిత్ర ఆధికారిక ట్రైలర్ ఫిబ్రవరి 2015లో విడుదలైంది. సినిమా 2015 సెప్టెంబరు 09న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలచేయదలచారు.కాని విడుదల కాలేదు. సినిమా ఆడియోను ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణాలోనూ కూడా అక్కడి ముఖ్యమంత్రుల సమక్షంలో విడుదల చేయాలని ప్రణాళిక వేసుకున్నారు.  మూడు పాటలు విశాఖపట్నంలోనూ, తర్వాతిరోజు మిగిలిన మూడుపాటలు వరంగల్లు లోనూ విడుదల చేశారు. చివరకు రుద్రమదేవి సినిమా 2015 అక్టోబరు 9 న విడుదల అయింది. (సాక్షి, తే. 9-10-2015).

సంగీతం

పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇళయరాజా స్వరపరిచారు. సినిమా ఆడియోలో 6 పాటలు ఉండగా, 3 పాటలు ఉగాది నాడు విశాఖపట్నంలోనూ, మిగిలిన మూడుపాటలు తర్వాతిరోజు వరంగల్లు లోనూ విడుదల చేశారు. దక్కన్ మ్యూజిక్ రుద్రమదేవి పాటలను బెస్ట్ తెలుగు ఆల్బం ఆఫ్ మార్చి 2015గా గుర్తించింది.

మూలాలు

Tags:

సినిమా రుద్రమదేవి నిర్మాణంసినిమా రుద్రమదేవి చిత్ర బృందంసినిమా రుద్రమదేవి తారాగణంసినిమా రుద్రమదేవి చిత్రీకరణసినిమా రుద్రమదేవి విడుదలసినిమా రుద్రమదేవి సంగీతంసినిమా రుద్రమదేవి మూలాలుసినిమా రుద్రమదేవిఇళయరాజాతోట తరణిరుద్రమదేవి

🔥 Trending searches on Wiki తెలుగు:

వాతావరణంగాజుల కిష్టయ్యమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంఉభయచరముమంద కృష్ణ మాదిగమకరరాశిరోజా సెల్వమణిచదరంగం (ఆట)చాకలి ఐలమ్మమంచు విష్ణుమాల (కులం)సరస్వతికౌరవులుఉబ్బసమువ్యవసాయంశ్రీ కృష్ణదేవ రాయలువృత్తులుయూట్యూబ్గుంటకలగరతెలంగాణ చరిత్రమంతెన సత్యనారాయణ రాజుస్మృతి ఇరానికొఱ్ఱలుజరాయువురాజ్యాంగంవిష్ణువు వేయి నామములు- 1-1000నరేంద్ర మోదీతెలుగు వికీపీడియాభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుసంధ్యారాణి (నటి)అమరావతి స్తూపంమొదటి ప్రపంచ యుద్ధంతెలుగు పత్రికలుఅక్బర్మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమముహరికథతెలుగుదేశం పార్టీపెద్దమనుషుల ఒప్పందంరంగస్థలం (సినిమా)వీర సింహా రెడ్డిగ్రామంవాట్స్‌యాప్మెంతులుప్రజాస్వామ్యంకన్నెగంటి బ్రహ్మానందంవృశ్చిక రాశిభూమితెలంగాణా సాయుధ పోరాటంలలితా సహస్రనామ స్తోత్రంనరసరావుపేటశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాపూర్వాభాద్ర నక్షత్రముదాస్‌ కా ధమ్కీఆనం చెంచుసుబ్బారెడ్డిఅమ్మదేశ భాషలందు తెలుగు లెస్సమృగశిర నక్షత్రముభారత ప్రధానమంత్రులుభారత స్వాతంత్ర్యోద్యమంమీనాముదిరాజు క్షత్రియులుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచంద్రబోస్ (రచయిత)వేమూరి రాధాకృష్ణభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థఅర్జున్ దాస్అంగారకుడుమహాభాగవతంసామెతల జాబితాకృతి శెట్టిమర్రిఉత్తర ఫల్గుణి నక్షత్రముసింగిరెడ్డి నారాయణరెడ్డిమక్కాభారతదేశ రాజకీయ పార్టీల జాబితాభలే రంగడుప్రియురాలు పిలిచిందినవగ్రహాలు🡆 More