మలబారు చింత

మలబారు చింత ఒక రకమైన మొక్క.

ఇది గట్టిఫెరె కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం Garcinia cambogia.

మలబారు చింత
మలబారు చింత
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Malpighiales
Family:
Genus:
Garcinia
Species:
G. gummi-gutta
Binomial name
Garcinia gummi-gutta
(లి.) Roxb.

మలబార్ చింతపండుని పూర్వ కాలం నుంచి మలబార్ ప్రాంతంలో అంటే కొచ్చిన్, త్రివేండ్రం, కాలికట్, కన్నూరులలో వాడుతున్నారు. ఈ ప్రాంత వాసులు చేపల కూరలో చింతపండుకు బదులుగా మలబార్ చింతపండును వాడుతారు. ఇది వాడిన చేపల కూర కాస్త వగరుగా అనిపిస్తుంది. 10 నుంచి 20 మీటర్ల ఎత్తు పెరిగే ఈ చెట్టు నుంచి పండిన కాయల్ని కోసి, తోలు వేరుగా చేసి, తోలును ఎండ బెట్టి సుగంధ ద్రవ్యంగా వాడతారు. ఎండ బెట్టగా వచ్చిన నల్లటి చింతపండు పోలిన పదార్థాన్ని మందుల తయారీ కూరల్లో వాడతారు. మలయాళంలో దీన్ని కోడంపులి (మలబార్ చింతపండు)గా పిలుస్తారు. వీటి కాయలు పండినపుడు పసుపురంగులో వుండి కాయల మీద గాడులు ఉంటాయి. 6 నుంచి 8 దాకా విత్తనాలుంటాయి. విత్తనాల చుట్టు అరిల్ అనే ఒక రకమైన కణజాలం వుంటుంది. దీని ప్రాముఖ్యాన్ని వెలుగులోకి తెచ్చాక మలబార్ చింతపండు విలువ అనేక రెట్లు పెరిగింది.

వ్యాప్తి

పశ్చిమ కనుమల్లోని అడవుల్లో, దక్షిణంగా కొంకణ్ నుంచి ట్రావెన్ కూర్ ప్రాంతం వరకు, నీలగిరి ప్రాంతంలోని షోలా అడవుల్లో ఇది పెరుగుతుంది.

ఆయుర్వేద మందులు

మలబార్ చింతపండు నుంచి ఎన్నో ఆయుర్వేద మందులు తయారై ప్రాచుర్యం పొందాయి. దీని ప్రాముఖ్యాన్ని శాస్త్రీయంగా గుర్తించడం జరిగింది. నేడు ఆధునిక వైద్య శాస్త్రంలో మలబార్ చింతపండును దివ్యౌషధంగా పరిగణిస్తున్నారు.

లావు తగ్గడానికి

లావు తగ్గించడంలో మలబార్ చింతపండు ఎంతగానో దోహదపడుతుంది. దీనిలో 30 శాతం హైడ్రాక్సీ సిట్రికామ్లం వుండటమే అందుకు కారణం. దీనివల్ల మనం తీసుకున్న ఆహార పదార్థంలో వున్న పిండి పదార్థాలు అధికంగా ఖర్చయిపోయి, కొవ్వుగా మారకుండా నిరోధించబడతాయి. ఆహారపుటలవాట్లలో మార్పుగానీ, ఆకలి నశించడంగానీ దీనివల్ల వుండదు. ఆహారం జీర్ణం కానపుడు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

వ్యాధి నివారణకు

మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఇన్సులిన్ ను చైతన్యవంతం చేసి వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది. రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరెడ్స్ ను తగ్గిస్తుంది. మన శరీరంలోని కొవ్వు పదార్థాలను ఇది సహజ సిద్ధంగా, నాడీ మండలానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా దహించి వేస్తుంది. దీనితో తయారు చేసిన కషాయం ఇస్తే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.

ఇతర ఉపయోగాలు

పశువుల్లో నోటి వ్యాధి నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చూడండి

చిత్రమాలిక

బయటి లింకులు

మలబారు చింత 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

Tags:

మలబారు చింత వ్యాప్తిమలబారు చింత ఆయుర్వేద మందులుమలబారు చింత లావు తగ్గడానికిమలబారు చింత వ్యాధి నివారణకుమలబారు చింత ఇతర ఉపయోగాలుమలబారు చింత ఇవి కూడా చూడండిమలబారు చింత చిత్రమాలికమలబారు చింత బయటి లింకులుమలబారు చింత

🔥 Trending searches on Wiki తెలుగు:

సురేఖా వాణిమహేంద్రసింగ్ ధోనిసర్వాయి పాపన్నగోదావరిగ్రామంవాట్స్‌యాప్చరవాణి (సెల్ ఫోన్)దక్షిణ భారతదేశంరవ్వా శ్రీహరిఉసిరిసూర్యుడువంగవీటి రంగాపెళ్ళిఉపనయనముక్షయదశావతారములువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)క్వినోవామలబద్దకంజాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కృతి శెట్టితామర వ్యాధిద్వాదశ జ్యోతిర్లింగాలుతెలంగాణ జిల్లాలుజనాభారవితేజసింధు లోయ నాగరికతడింపుల్ హయాతితెలుగుదేశం పార్టీదశదిశలుఆంధ్రప్రదేశ్ జిల్లాలుమాల (కులం)దగ్గుఆవర్తన పట్టికరెడ్డిగోత్రాలుపాండ్యులురుద్రుడుకాకతీయుల శాసనాలుజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షవృషణం2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలుగరికిపాటి నరసింహారావునక్షత్రం (జ్యోతిషం)అయ్యప్పఅనసూయ భరధ్వాజ్ద్వారకా తిరుమలవిరూపాక్షధనిష్ఠ నక్షత్రముకందుకూరి వీరేశలింగం పంతులుమిషన్ భగీరథజాతీయ విద్యా విధానం 2020లలితా సహస్రనామ స్తోత్రంభారత ప్రభుత్వంవ్యాసుడుజగ్జీవన్ రాంజోరుగా హుషారుగాతెలంగాణ రాష్ట్ర శాసన సభభారత సైనిక దళంపుష్కరంహస్తప్రయోగంరణభేరివిష్ణువుకస్తూరి రంగ రంగా (పాట)సంధ్యావందనంభారత రాజ్యాంగ సవరణల జాబితాహలో గురు ప్రేమకోసమేకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)సూడాన్గుణింతంతెలంగాణా బీసీ కులాల జాబితాశ్రీకాళహస్తిమంచు మోహన్ బాబుసీతాపతి చలో తిరుపతిసావిత్రిబాయి ఫూలేసీమ చింతహెబియస్ కార్పస్సమాసంపునర్వసు నక్షత్రము🡆 More