కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.

ఆయన నల్లగొండ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా పని చేశాడు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
07 డిసెంబర్ 2023
గవర్నరు తమిళిసై సౌందరరాజన్

ఎమ్మెల్యే
పదవీ కాలం
03 డిసెంబర్ 2023 – ప్రస్తుతం
నియోజకవర్గం నల్గొండ
పదవీ కాలం
2014 – 2018
ముందు బూర నర్సయ్య గౌడ్
నియోజకవర్గం నల్గొండ

తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2022
నియోజకవర్గం భువనగిరి

పదవీ కాలం
23 మే 2019 – 06 డిసెంబర్ 2023
నియోజకవర్గం భువనగిరి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 – 2014
నియోజకవర్గం నల్గొండ

వ్యక్తిగత వివరాలు

జననం (1965-05-23) 1965 మే 23 (వయసు 58)
బ్రాహ్మణవెల్లెంల, నార్కెట్‌పల్లి మండలం, నల్లగొండ జిల్లా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు పాపిరెడ్డి, సుశీలమ్మ
జీవిత భాగస్వామి కోమటిరెడ్డి సబితా
బంధువులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సంతానం శ్రీనిధి
నివాసం నల్లగొండ, తెలంగాణ

కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి, డిసెంబర్ 07న రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.

జననం, విద్యాభ్యాసం

కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1965 మే 23న తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, నార్కెట్‌పల్లి మండలం, బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో కోమటిరెడ్డి పాపిరెడ్డి, సుశీలమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1980లో హైద‌రాబాద్, మ‌ల‌క్‌పేట్‌లోని అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు ఉన్న‌త పాఠ‌శాల నుంచి ఎస్ఎస్‌సీ, ప‌త్త‌ర్‌ఘ‌ట్టీలోని ఎన్‌.బీ.సైన్స్ కాలేజీలో ఇంట‌ర్మీడియ‌ట్, గండిపేట్‌లోని చైత‌న్య భార‌తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ నుంచి బి.ఇ. ప‌ట్టా అందుకున్నాడు.

రాజకీయ జీవితం

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పరిలో వివిధ హోదాల్లో పని చేసి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో న‌ల్గొండ శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2004, 2009, 2014లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన వైఎస్సార్, రోశయ్య మంత్రివర్గాలలో ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, రేవుల శాఖ మంత్రిగా పని చేశాడు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పై 4500 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. 2022 ఏప్రిల్ 10న కాంగ్రెస్ అధిష్టానం ఆయనను 2023 శాసన సభ ఎన్నికల టీ కాంగ్రెస్‌కు స్టార్‌ క్యాంపెనర్‌గా నియమించింది. ఆయనను 2023 సెప్టెంబరు 20న కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో స్థానం కల్పిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుండి ఎమ్మెల్యేగా గెలిచి, డిసెంబర్ 07న రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, డిసెంబర్ 10న తెలంగాణ సచివాలయంలోని 5వ అంతస్తు తన చాంబర్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించాడు.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో డిసెంబర్ 18న భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కాంగ్రెస్ పార్టీ నియమించగా, డిసెంబర్ 24న ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆయనను మార్చి 31న సికింద్రాబాద్‌ లోక్‌సభ ఇన్‌చార్జ్‌గా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ప్రకటించింది.

తెలంగాణ ఉద్యమం

కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసి, 2010లో ఒక‌సారి, 2011 అక్టోబ‌రులో మ‌రోసారి త‌న శాస‌న‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయగా అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆయ‌న రాజీనామాల‌ను అంగీక‌రించ‌లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ న‌ల్గొండ ప‌ట్ట‌ణంలో న‌వంబ‌రు 1, 2011 నుంచి తొమ్మిది రోజుల పాటు నిరాహార దీక్ష చేప‌ట్టాడు.

నిర్వహించిన పదవులు

సంవత్సరం వివరణ
1999 మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
2004 2వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
2009 3వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు

వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో

  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్పోర్ట్స్, యూత్, కమ్యూనికేషన్స్ మంత్రి
  • విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సహజవాయువు పరిశ్రమల
  • మౌలిక వసతులు, పెట్టుబడులు, రేవుల శాఖ మంత్రి
2014 4వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
  • ఉప నాయకుడు, భారత జాతీయ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ, తెలంగాణ శాసనసభ
2019 17వ లోక్‌సభకు భువనగిరి నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు
  • పార్లమెంటు సభ్యుడు, భోంగీర్
  • బొగ్గు, గనులు & ఉక్కుపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ (భారతదేశం) & కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2023 5వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
  • రోడ్లు & భవనాల & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి

కోమ‌టిరెడ్డి ప్ర‌తీక్ ఫౌండేష‌న్‌

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు కోమ‌టిరెడ్డి ప్రతీక్ రెడ్డి 2011లో మెదక్ జిల్లా కొల్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన ఆ తరువాత తన కుమారుడి జ్ఞాపకార్థం కోమ‌టిరెడ్డి ప్ర‌తీక్ ఫౌండేష‌న్‌ను ఏర్పాటు చేసి న‌ల్గొండ ప‌ట్ట‌ణంలో రూ.3.5 కోట్లు ఖ‌ర్చు చేసి ప్ర‌తీక్ స్మార‌క ప్ర‌భుత్వ బాలుర జూనియ‌ర్ క‌ళాశాల, బాలిక‌ల కోసం వృత్తి విద్యా నైపుణ్య క‌ళాశాల‌ను ఏర్పాటు చేసి, రోడ్డు భ‌ద్ర‌తపై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టి ఫౌండేష‌న్ త‌ర‌పున ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేశాడు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా జాబ్ మేళాను నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాడు.

మూలాలు

Tags:

కోమటిరెడ్డి వెంకటరెడ్డి జననం, విద్యాభ్యాసంకోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ జీవితంకోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమంకోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన పదవులుకోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమ‌టిరెడ్డి ప్ర‌తీక్ ఫౌండేష‌న్‌కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూలాలుకోమటిరెడ్డి వెంకటరెడ్డినల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం

🔥 Trending searches on Wiki తెలుగు:

హనుమంతుడుమృణాల్ ఠాకూర్నామనక్షత్రముపరశురాముడురామ్ చ​రణ్ తేజరష్యాతమన్నా భాటియావ్యవసాయంసింగారెడ్డి గారి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డితాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిపృథ్వీరాజ్ సుకుమారన్ఆయాసంఆస్ట్రేలియాసుందర కాండవన్ ఇండియాపెరుగుసమంతఅనుష్క శెట్టిఅక్కినేని నాగార్జునబేటి బచావో బేటి పడావోశ్రీవిష్ణు (నటుడు)పాఠశాలవిటమిన్ బీ12భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితామాగంటి గోపీనాథ్డియెగో మారడోనామక్కాకన్నెగంటి బ్రహ్మానందంబర్రెలక్కరావుల శ్రీధర్ రెడ్డితెలుగు సంవత్సరాలుకేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుజానంపల్లి రామేశ్వరరావుడెక్కన్ చార్జర్స్బి.ఆర్. అంబేద్కర్అనుష్క శర్మఎర్రబెల్లి దయాకర్ రావునేదురుమల్లి జనార్ధనరెడ్డిడేటింగ్ఆపిల్కల్వకుంట్ల కవిత2024 భారత సార్వత్రిక ఎన్నికలునవగ్రహాలుఅంగారకుడు (జ్యోతిషం)ఎస్. శంకర్విజయశాంతిడెన్మార్క్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిసజ్జల రామకృష్ణా రెడ్డిమాదిగహైన్రిక్ క్లాసెన్నరసింహావతారంభారత ప్రధాన న్యాయమూర్తుల జాబితాపన్నుమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిముంతాజ్ మహల్జిల్లెళ్ళమూడి అమ్మమృగశిర నక్షత్రముకారకత్వంనీతా అంబానీఆలీ (నటుడు)గౌడవంగవీటి రంగాయూట్యూబ్క్రిస్టమస్అమృత అయ్యర్కిరణజన్య సంయోగ క్రియపర్యాయపదంతెలుగులో అనువాద సాహిత్యంపూరీ జగన్నాథ దేవాలయంవర్షంసవర్ణదీర్ఘ సంధివిశ్వామిత్రుడువిభక్తిలుటీషియంఆవుశతభిష నక్షత్రముజాతీయములు🡆 More