కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు.

ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుండి శానససభ్యుడిగా ఉన్నాడు. శాసన మండలి సభ్యుడిగా, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి 15వ లోక్ సభ (2009-2014) సభ్యుడిగా పనిచేశాడు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి


పదవీ కాలం
2018 - 2022 ఆగస్టు 2
నియోజకవర్గం మునుగోడు శాసనసభ నియోజకవర్గం

పదవీ కాలం
2016-2018

పదవీ కాలం
2009 - 2014
తరువాత బూర నర్సయ్య గౌడ్
నియోజకవర్గం భువనగిరి

వ్యక్తిగత వివరాలు

జననం (1967-06-01) 1967 జూన్ 1 (వయసు 56)
బ్రాహ్మణవెల్లెంల, నల్లగొండ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు పాపిరెడ్డి - సుశీలమ్మ
జీవిత భాగస్వామి లక్ష్మీ
సంతానం ఒక కుమారుడు
వెబ్‌సైటు www.krgreddy.com

జననం - చదువు

రాజగోపాల్ రెడ్డి 1967, జూన్ 1న పాపిరెడ్డి - సుశీలమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లాలోని బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. పట్టా పొందాడు. రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాజీ మంత్రి, ప్రస్తుతం భువనగిరి లోక్‌సభ ఎంపిగా ఉన్నాడు.

వివాహం

రాజగోపాల్ రెడ్డికి 1994, ఆగస్టు 20న లక్ష్మితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు.

ప్రవృత్తి

వ్యాపారవేత్తగా ప్రసిద్ధి పొందాడు. ఆ సమయంలోనే అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించాడు. గ్రామీణ ప్రాంతాలలో వైద్య శిబిరాలు, నేత్ర శిబిరాలు నిర్వహించాడు.

రాజకీయరంగం

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన 2009లో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటి చేసి భారత కమ్యునిస్టు పార్టీ అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 1,39,978 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. తరువాత 2016 నుండి 2018 వరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 22,552 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆయన 2022 ఆగస్టు 2న కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 ఆగస్టు 21న మునుగోడులో జరిగిన ఆత్మగౌరవ సభలో కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన ఆ తరువాత 2022లో జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో ఓడిపోయాడు. రాజగోపాల్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా 2023 జూలై 5న బీజేపీ జాతీయ నాయకత్వం నియమించింది. రాజగోపాల్‌రెడ్డి 2023 అక్టోబరు 25న బీజేపీకి రాజీనామా చేశాడు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2023 అక్టోబరు 27న ఢిల్లీలో పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయనను 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన రెండో జాబితాలో మునుగోడు అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో 2024 మార్చి 31న భువనగిరి లోక్‌సభ ఇన్‌చార్జ్‌గా నియమితుడయ్యాడు.

పదవులు

  • 31.08.2009 - 2014: నీటి వనరులపై కమిటీ సభ్యుడు
  • 04.05.2017 - 17.12.2018: టేబుల్ పేపర్స్ కమిటీ చైర్మన్, తెలంగాణ శాసనమండలి.

ఇతర వివరాలు

చైనా, ఈజిప్ట్, జెర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, మలేసియా, శ్రీలంక, సింగపూర్, యు.ఎస్.ఏ. మొదలైన దేశాలు సందర్శించాడు.

మూలాలు

Tags:

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జననం - చదువుకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాహంకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రవృత్తికోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయరంగంకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవులుకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇతర వివరాలుకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మూలాలుకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి15వ లోక్‌సభకాంగ్రెస్ పార్టీతెలంగాణభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంమునుగోడు శాసనసభ నియోజకవర్గంరాజకీయ నాయకుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

భౌతిక శాస్త్రంమరణానంతర కర్మలునరసాపురం లోక్‌సభ నియోజకవర్గంభాగ్యరెడ్డివర్మశివ సహస్రనామాలుఛత్రపతి శివాజీతెలుగు సాహిత్యం2024 భారత సార్వత్రిక ఎన్నికలుగ్యాస్ ట్రబుల్ఎఱ్రాప్రగడవృషణంబుధుడు (జ్యోతిషం)భారత కేంద్ర మంత్రిమండలినాయీ బ్రాహ్మణులురాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంఅలెగ్జాండర్శ్రీకాళహస్తిమార్చి 27కేంద్రపాలిత ప్రాంతంఅనూరాధ నక్షత్రంఅమెరికా సంయుక్త రాష్ట్రాలుఅయ్యప్పవై.యస్.రాజారెడ్డిసుమ కనకాలరజాకార్సంస్కృతంకరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలోక్‌సభ స్పీకర్దేవుడురమ్యకృష్ణఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంపౌరుష గ్రంథిఅంజలి (నటి)అవయవ దానంయాగంటిరూప మాగంటియవలుప్రకటనకర్ణాటకధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిచెన్నై సూపర్ కింగ్స్ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్. రాజశేఖరరెడ్డి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుమాల (కులం)ఇండియన్ ప్రీమియర్ లీగ్రామ్ చ​రణ్ తేజరాహువు జ్యోతిషంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాగన్నేరు చెట్టుమానవ శరీరముపూర్వాషాఢ నక్షత్రముగజము (పొడవు)జయలలిత (నటి)శ్రీముఖితెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితాగాంధీకల్వకుంట్ల చంద్రశేఖరరావురావి చెట్టుగుంటూరు కారంఅమ్మకోసంకానుగకామినేని శ్రీనివాసరావుటైఫాయిడ్రోహిత్ శర్మజగ్జీవన్ రాంధనూరాశిమేళకర్త రాగాలుపరిపూర్ణానంద స్వామివావిలికర్ర పెండలంసందీప్ కిషన్లగ్నంసుందర కాండప్రొద్దుటూరు🡆 More