కాటం లక్ష్మీనారాయణ

కాటం లక్ష్మీనారాయణ (సెప్టెంబరు 19, 1924 - ఫిబ్రవరి 25, 2010) సుప్రసిద్ధ నిజాం వ్యతిరేక పోరాటయోధుడు, న్యాయవాది.

కాటం లక్ష్మీనారాయణ
జననంకాటం లక్ష్మీనారాయణ
సెప్టెంబరు 19, 1924
రంగారెడ్డి జిల్లా శంషాబాదు
మరణంఫిబ్రవరి 25, 2010
ప్రసిద్ధిసుప్రసిద్ధ నిజాం వ్యతిరేక పోరాటయోధుడు , న్యాయవాది.
మతంహిందూ
తండ్రిలక్ష్మయ్య,
తల్లిసత్తెమ్మ

జీవిత విశేషలు

కాటం లక్ష్మీనారాయణ రంగారెడ్డి జిల్లా శంషాబాదులో, లక్ష్మయ్య, సత్తెమ్మ దంపతులకు 1924 వ సంవత్సరంలో సెప్టెంబరు 19 న జన్మించాడు. ఇతని తాత కాటం నారాయణ స్థానిక జమీందారుల అకృత్యాలను ఎదిరించిన దైర్యవంతుడు. తాత పేరుతో పాటు దైర్య సాహాసాలు కూడా మనమనికి వచ్చాయి. 1942 అక్టోబరు 12బూర్గుల రామకృష్ణారావు చాదర్ ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండులో సత్యాగ్రహం చేయడానికి సన్నాహాలు ప్రారంభించగా నైజాము పోలీసులు లాటీలు ఝుళిపించారు. అక్కడే కాటం లక్ష్మినారాయణ సత్యాగ్రహానికి మద్దతుగా నినాదాలు చేయగా పోలీసులు బూర్గుల రామకృష్ణారావుని, లక్ష్మీనారాయణని అరెస్ట్ చేశారు. అప్పటికి నారాయణ వయస్సు పంతొమ్మిది. అప్పటి నుండి లక్ష్మినారాయణ బూర్గుల రామకృష్ణారావుని గురువుగా బావించాడు. పోలీసులు లక్ష్మినారాయణను ఏడు నెలల పాటు చెంచల్ గూడ జైల్లో వుంచారు. ఆ జైల్లో స్థానిక నాయకులెందరో ఉన్నారు. అక్కడే వారి అనుభవాలను తెలుసుకున్నాడు. అతనికి జైలు జీవితం చాల మంచి పాఠాలను నేర్పింది. బయటకు వచ్చిన లక్ష్మినారాయణ న్యాయవిద్య పూర్తి చేసి బూర్గుల వారి వద్దనే జూనియర్ లాయర్ గా చేరారు. వారికి చేదోడు వాదోడుగా వుంటూ, అన్ని కార్య కలాపలాలలో క్రియా శీలక పాత్ర పోషించాడు. లక్ష్మి నారాయణ రాజకీయ కార్యకలాపాలే గాక ఆనాటి సామాజికి సమస్యలలో కూడా పాలు పంచుకున్నాడు. నిజాం ప్రభుత్య ఆజ్ఞలను దిక్కరించి హింది పాఠశాలను స్థాపించాడు. ఖాది వ్యాప్తి, దళిత జనోద్దరణ వంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు. ఆచార్య రంగా ప్రేరణతో 1945లో లక్ష్మినారాయణ హైదరాబాదు యువ జన కాంగ్రేసు స్థాపించి తాను ప్రదాన కార్యదర్శిగా పనిచేశారు.

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కాని నైజాము స్టేటులో విముక్తి లభించలేదు. బూర్గుల వారు, కాటం వారు ఈ విషయాన్ని ప్రపంచ నాయకుల దృష్టికి తీసుకురావాలని వారి సహకారాన్ని కోరాలని 1947 ఆగస్టు 15 న బూర్గులవారితో కలిసి మద్రాసు చేరి రష్యా, అమెరికా, ప్రాన్సు వంటి దేశాలకు టెలిగ్రాములు ఇచ్చారు. కాని వారు తిరిగి హైదరాబాదులో అడుగు పెట్టగానే నైజాము పోలీసులు వారి అరెస్టు చేశారు. కొండా వెంకట రంగారెడ్డికి లక్ష్మినారాయణ అంటే చాల ఇష్టం. అతను జైల్లో వున్నప్పుడు లక్ష్మినారాయణకు కుటుంబ పోషణకు నెలకు పదిహేను రూపాయలనిచ్చే వారట. ఇలా లక్ష్మినారాయణకు ఆనాటి ప్రముఖు లందరితో మంచి పరిచయాలుండేవి. 1947 మే నెల 11 న పెళ్ళి చేసుకొన్న లక్ష్మినారాయణ నాలుగు నెలలకే మళ్లీ అరెస్ట్ అయాడు. ఇలా లక్ష్మి నారాయణ ఏదో ఒక ఉద్యమంలో పాల్గొనడం, అరెస్ట్ కావడం, తిరిగి రావడం, మళ్లి జైలుకెళ్లడం నిత్య కృత్యం అయింది.

పత్రికారంగంలో

నైజాము స్టేట్ భారతదేశంలో విలీనం తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడి నప్పుడు., లక్ష్మినారాయణ రాజకీయ పదవులకు పాకులాడ లేదు. ఆర్థిక, సాంకేతిక, వైజ్ఞానిక రంగాలలో రాష్ట్ర పునర్ నిర్మాణానికి 1949 డిసెంబరులో "జనత" పేరుతో ఒక పత్రికను ప్రారంబించాడు. గతంలో రజాకార్ల చేతిలో హతుడైన షోయబుల్లా ఖాన్తో కలిసి పత్రికా రంగంలో పనిచేసిన అనుభవం ఇప్పు డితనికి బాగా ఉపకరించింది. అంతే గాక రైతుల సమస్యల పరిష్కారానికి 1952లో రాష్ట్ర కర్షక సంఘాన్ని స్థాపించారు."తెలుగు భూమి" అనే మరొ పత్రికను 1969లో ప్రారంబించారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సమైక్య వాదిగా తన గళాన్ని వినిపించారు. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు అకాడమి లాగ హింది అకాడమి ఉండాలని ఉద్యమించి ప్రభుత్వాన్ని ఒప్పించి స్థాపించి దానికి తానే ఉపాద్యక్షులయ్యారు. 1968లో హైకోర్టు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు చెల్లవని తీర్పు ఇవ్వగా దాంతో బలహీన వర్గాల నాయకులందరిని ఒక తాటిపైకి తెచ్చి ఒక కార్యవర్గాన్ని ఏర్పరిచి దానికి కన్వీనరు అయి సుప్రీం కోర్టుకు వెళ్లి హైకోర్టు తీర్పును రద్దు చేయించారు. ఆ సందర్భంలో ఒక మహా సభ ఏర్పాటు చేయించారు. దానికి లక్షలాది మంది రాగ సాక్షాత్తు ప్రదాన మంత్రి ఇందిరాగాంది కూడా తరలి వచ్చారు. లక్ష్మి నారాయణ సాధించిన ఘన విజయాలలో ఇది ఒకటి.

మరిన్ని కార్యక్రమాలు

స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొన్న యోధులకు పెన్షన్ ఒక వరం లాంటిది అని నమ్మేవారు లక్ష్మి నారాయణ. స్వతంత్ర భారత్ లో ఈ అవకాశాన్ని అందరు వినియోగించు కుంటున్నా.... నైజాము స్టేటు లోని యోధులకు ఆ అవకాశం రాలేదు. వీరికి కూడా ఆ అవకాశం రావాలని లక్ష్మినారాయణ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. కేంద్రం దానికి అంగీకరించ లేదు. దాంతో లక్ష్మినారాయణ " తెలంగాణ సమర యోధుని సత్యాగ్రహం" అని రాసిన ఒక అట్టను మెడలో తగిలించు కొని ప్రధాని ఇంటి ముందు నిరాహార దీక్ష చేసారు. ఈ విషయాన్ని ఢిల్లీ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. దాంతొ ఇందిరా గాంధి లక్ష్మిణాయణను పిలిపించి కారణం అడగగా......, దానికి లక్ష్మి నారాయణ " సంస్థానాలలో స్వాతంత్ర్య యోధులను మీరు గుర్తించక పోవడాన్ని మేము అవమానంగా భావిస్తున్నాము. బ్రిటిష్ ఆంధ్ర స్వాతంత్ర్య యోధులు ఒక బ్రిటిష్ వారితోనె పోరాడారు. కాని సంస్థాన లోని యోధులు అటు సంస్థానాధీశులతోను, ఇటు బ్రిటిష్ వారితోను పోరాడారు. 15 ఆగస్టు మాకు స్వాతంత్ర్య దినం కాదా? హైదరాబాదు విముక్తి జరిగిన సెప్టెంబరు 17 ను స్వాతంత్ర్య దినంగా జరుపుకో మంటారా? ఒక్క హైదరాబాదు సంస్థాన ప్రజలే కాదు పలు సంస్థానాల ప్రజలు భారతీయులు కారా? అవునా? కాదా? ముందు ఇది తేల్చండి? " అని సూటిగా, దైర్యంగా ఇందిరా గాంధిని ప్రశ్నించి యోధుడు లక్ష్మి నారాయణ. దాంతో సంస్థానాల లోని స్వాతంత్ర్య యోధులకు కూడా పెన్షన్ సౌకర్యం లభించింది. ఈ యోధుడు సాధించిన అతి పెద్ద ఘన కార్యం.

ఇతను చేసిన మరో ఘన కార్యం ఏమంటే? హైదరాబాదు స్వాతంత్ర్య సమార చరిత్రను ప్రామాణిక పద్ధతుల్లో గ్రంథస్థం చేయించడం. ఆ విధంగా వచ్చిందే మాణిక్య రావు గారి 844 పేజీల హైదరబాదు స్వాతంత్ర సమర చరిత్ర. ఇది ఇప్పటికీ ప్రామిణిక గ్రంథం. దాన్ని అప్పటి భారత రాష్ట్ర పతి జైల్ సింగ్ చేత ఆవిష్కరింప జేసారు. పి.వి.నరసింహ రావు, టి. అంజయ్య, కాసు బ్రంహానంద రెడ్డి, భవనం వెంకట్రామ రెడ్డి, ఈ నలుగురు ముఖ్య మంత్రులతో ఒక పెద్ద సభను నిర్వహించారు. ఇతను నిర్వహించిన సభలకు ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, పీఠాధిపతులు, స్వాతంత్ర సమర యోధులు, దలైలామ వంటి వారు కూడా పాల్గొనే వారు. తన స్వంతానికి ఏ మాత్రం పాటు పడక కేవలం ప్రజలకు, విలువల కొరకు ఎంతటి వారినైన ఎదిరించి ధైర్యంగా నిర్మొహమాటంగా నిలబడటం కాటం లక్ష్మినారాయణ గారి వ్యక్తిత్యం లోని ప్రధాన గుణం. ఆ మహా యోధుడు 2010 వ సంవత్సరం ఫిబ్రవరి 25 నాడు తను కొలిచే శ్రీ కృష్ణునిలో ఐక్యమైపోయారు.

మూలాలు

  • ఆది వారం: వార్త: 20 పిబ్రవరి 2011.)

యితర లింకులు

Tags:

కాటం లక్ష్మీనారాయణ జీవిత విశేషలుకాటం లక్ష్మీనారాయణ పత్రికారంగంలోకాటం లక్ష్మీనారాయణ మరిన్ని కార్యక్రమాలుకాటం లక్ష్మీనారాయణ మూలాలుకాటం లక్ష్మీనారాయణ యితర లింకులుకాటం లక్ష్మీనారాయణ19242010న్యాయవాదిఫిబ్రవరి 25సెప్టెంబరు 19

🔥 Trending searches on Wiki తెలుగు:

వృషభరాశిసముద్రఖనినాయుడుఆంధ్రప్రదేశ్ చరిత్రనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిసర్వే సత్యనారాయణతాజ్ మహల్రేణూ దేశాయ్విచిత్ర దాంపత్యంలలితా సహస్రనామ స్తోత్రంసవర్ణదీర్ఘ సంధిఅమెజాన్ ప్రైమ్ వీడియోకూచిపూడి నృత్యంసంభోగంబౌద్ధ మతంపన్ను (ఆర్థిక వ్యవస్థ)ఎన్నికలుపక్షవాతం2024 భారత సార్వత్రిక ఎన్నికలుఅచ్చులుజయలలిత (నటి)శ్రీనాథుడువిడాకులుతోట త్రిమూర్తులుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుశ్రీ గౌరి ప్రియవేమన శతకముఅనసూయ భరధ్వాజ్యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్జాంబవంతుడుతెలుగు వికీపీడియాఅయోధ్యజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్భలే అబ్బాయిలు (1969 సినిమా)మర్రిలలిత కళలువంగవీటి రంగామలేరియారాహుల్ గాంధీజిల్లేడుఅక్కినేని నాగార్జునభారతీయ రైల్వేలుబలి చక్రవర్తినిర్వహణనరేంద్ర మోదీభారత జాతీయ క్రికెట్ జట్టుధనిష్ఠ నక్షత్రమురిషబ్ పంత్ప్రభాస్పులివెందుల శాసనసభ నియోజకవర్గంప్రకాష్ రాజ్భారత జాతీయ చిహ్నంహనుమంతుడుగరుడ పురాణంఅంగారకుడుభరణి నక్షత్రముశుక్రుడుఫ్యామిలీ స్టార్భారతదేశంలో కోడి పందాలుసంఖ్యకమల్ హాసన్దూదేకులరెడ్యా నాయక్ఉత్తర ఫల్గుణి నక్షత్రముగురజాడ అప్పారావుకొమురం భీమ్తెలంగాణా బీసీ కులాల జాబితాగంగా నదిరాశిఆహారంఉత్తరాభాద్ర నక్షత్రముధర్మవరం శాసనసభ నియోజకవర్గంపమేలా సత్పతివాల్మీకిపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి🡆 More