92వ అకాడమీ పురస్కారాలు: 2020 అకాడమీ పురస్కారాలు

92వ అకాడమీ పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం 2020, ఫిబ్రవరి 9న (భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 10 సోమవారం ఉదయం) అమెరికా కాలిఫోర్నియా లాస్ ఎంజెల్స్ నగరంలోని హాలీవుడ్ డాల్బీ థియేటర్లో జరిగింది.

2019లో ప్రపంచవ్యాప్తంగా రూపొందిన చిత్రాలనుండి ఉత్తమ చిత్రాలను ఎంపికచేసి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సెస్ వారిచే ఆస్కార్ అవార్డులు ఇవ్వబడ్డాయి. ఈ పురస్కారంలో భాగంగా 24 విభాగాలలో అకాడమీ అవార్డులను అందించారు. యునైటెడ్ స్టేట్స్ లో ఈ కార్యక్రమాన్ని అమెరికన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రసారం చేసింది, దీనికి లినెట్ హోవెల్ టేలర్, స్టెఫానీ అలైన్ నిర్మాతలుగా వ్యవహరించగా, గ్లెన్ వైస్ దర్శకత్వం వహించాడు. 2019లో వ్యాఖ్యాత లేకుండా నిర్వహించిన 91వ అకాడమీ పురస్కారాలు కార్యక్రమం విజయవంతం అయినందువల్ల, ఈసారి కూడా మళ్ళీ వ్యాఖ్యాత లేకుండా నిర్వహించబడుతుందని అమెరికన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రకటించింది.

92వ అకాడమీ పురస్కారాలు
92వ అకాడమీ పురస్కారాలు: చరిత్ర, పురస్కార విజేతలు, నామినేషన్లు - బహుమతులు
అధికారిక పోస్టర్
Dateఫిబ్రవరి 9, 2020 ( భారత కాలమానం ప్రకారం 2020, ఫిబ్రవరి 10 సోమవారం ఉదయం)
Siteడాల్బీ థియేటర్
హాలీవుడ్, లాస్ ఎంజెల్స్, కాలిఫోర్నియా, అమెరికా
Produced byలినెట్ హోవెల్ టేలర్
స్టెఫానీ అలైన్
Directed byగ్లెన్ వైస్
Highlights
ఉత్తమ చిత్రంపారాసైట్
ఎక్కువ పురస్కారాలుపారాసైట్ (4)
ఎక్కువ నామినేషన్లుజోకర్ (11)
Television coverage
Networkఅమెరికన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ
Duration3 గంటల, 35 నిముషాలు

అకాడమీ 11వ వార్షిక గవర్నర్స్ అవార్డుల వేడుక 2019, అక్టోబరు 27న హాలీవుడ్ ప్రాంతంలోని హైలాండ్ సెంటర్ గ్రాండ్ బాల్‌రూమ్‌లో నిర్వహించబడింది.

92వ అకాడమీ పురస్కారాలు: చరిత్ర, పురస్కార విజేతలు, నామినేషన్లు - బహుమతులు
బాంగ్‌ జూన్‌ హో
(ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే, ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ విజేత)
92వ అకాడమీ పురస్కారాలు: చరిత్ర, పురస్కార విజేతలు, నామినేషన్లు - బహుమతులు
వాకిన్‌ ఫీనెక్స్‌
(ఉత్తమ నటుడు విజేత)
92వ అకాడమీ పురస్కారాలు: చరిత్ర, పురస్కార విజేతలు, నామినేషన్లు - బహుమతులు
రెనీ జెల్‌వెగర్‌
(ఉత్తమ నటి విజేత)
92వ అకాడమీ పురస్కారాలు: చరిత్ర, పురస్కార విజేతలు, నామినేషన్లు - బహుమతులు
బ్రాడ్‌ పిట్‌
(ఉత్తమ సహాయ నటుడు విజేత)
92వ అకాడమీ పురస్కారాలు: చరిత్ర, పురస్కార విజేతలు, నామినేషన్లు - బహుమతులు
లారా డ్రెన్‌
(ఉత్తమ సహాయ నటి విజేత)
92వ అకాడమీ పురస్కారాలు: చరిత్ర, పురస్కార విజేతలు, నామినేషన్లు - బహుమతులు
తైకా వెయిటిటి
(ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విజేత)
92వ అకాడమీ పురస్కారాలు: చరిత్ర, పురస్కార విజేతలు, నామినేషన్లు - బహుమతులు
హిల్దార్‌
(ఉత్తమ సంగీతం విజేత)
92వ అకాడమీ పురస్కారాలు: చరిత్ర, పురస్కార విజేతలు, నామినేషన్లు - బహుమతులు
ఎల్టన్ జాన్
(ఉత్తమ పాట విజేత)

చరిత్ర

ఆస్కార్ అవార్డుగా పిలవబడుతున్న అకాడమీ పురస్కారాలు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రతీ ఏటా చలనచిత్రరంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక బహుమతులు. మొట్టమొదటి అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం 1929, మే 16న హాలీవుడ్‌లోగల హోటల్ రూజ్వెల్ట్‌లో జరిగింది. 1927, 1928 సంవత్సరాలలో చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడంకోసం నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీ కలిసి ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు.

పురస్కార విజేతలు

దక్షిణ కొరియా చిత్రం పారాసైట్ ఉత్తమ చిత్రంతోసహా నాలుగు అవార్డులతో ప్రథమస్థానంలో నిలిచింది, విదేశీ భాషకు చెందిన ఒక సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికకాడం ఇదే తొలిసారి. 1917 సినిమా మూడు అవార్డులను గెలుచుకోగా ఫోర్డ్‌ వర్సెస్‌ ఫెరారీ, జోకర్, వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌ సినిమాలు రెండు అవార్డుల చొప్పున గెలుచుకున్నాయి.

  • ఉత్తమ చిత్రం: పారాసైట్
  • ఉత్తమ నటి: రెనీ జెల్‌వెగర్‌ (జూడీ)
  • ఉత్తమ నటుడు: వాకిన్‌ ఫీనెక్స్‌ (జోకర్‌)
  • ఉత్తమ దర్శకుడు: పారాసైట్‌ (బోన్‌జోన్‌ హో)
  • ఉత్తమ సంగీతం: జోకర్‌ (హిల్దార్‌)
  • మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: బాంబ్‌ షెల్‌
  • ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌: పారాసైట్‌
  • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: 1917 (రోచ్‌రాన్‌, గ్రెగ్‌ బట్లర్‌, డోమినిక్‌ తువే)
  • ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌: ఫోర్డ్‌ వర్సెస్‌ ఫెరారీ (మైఖేల్‌ మెక్‌సుకర్‌, ఆండ్రూ బక్‌ల్యాండ్‌)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: 1917 (రోజర్‌ డికెన్స్‌)
  • ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌: ఫోర్డ్‌ వర్సెస్‌ ఫెరారీ (డొనాల్డ్‌ సిల్వెస్టర్‌)
  • ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్‌: 1917 (మార్క్‌ టేలర్‌, స్టువర్ట్‌ విల్సన్‌)
  • ఉత్తమ సహాయనటి: లారా డ్రెన్‌ (మ్యారేజ్‌ స్టోరీ)
  • ఉత్తమ సహాయ నటుడు: బ్రాడ్‌ పిట్‌ (వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌)
  • ఉత్తమ యానిమేషన్‌ చిత్రం: టాయ్‌ స్టోరీ4
  • ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: బాంగ్‌ జూన్‌ హో (పారాసైట్‌)
  • ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: హెయిర్‌ లవ్‌
  • ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: తైకా వెయిటిటి (జోజో ర్యాబిట్‌)
  • ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ది నైబర్స్‌ విండో
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: జాక్వెలిన్‌ దురన్‌ (లిటిల్‌ విమన్‌)
  • ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్‌): అమెరికన్‌ ఫ్యాక్టరీ

నామినేషన్లు - బహుమతులు

92వ అకాడమీ పురస్కారాల్లో, 53 సినిమాల నుండి 124 నామినేషన్లు వచ్చాయి. వాటిల్లో 16 సినిమాలకు 24 విభాగాల్లో అకాడమీ బముమతులు వచ్చాయి.

సినిమాల వారిగా నామినేషన్లు
నామినేషన్లు సినిమా
11 జోకర్
10 ది ఇరిశ్వన్
1917
వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌
6 జోజో ర్యాబిట్‌
లిటిల్ విమెన్
మ్యారేజ్‌ స్టోరీ
పారాజైట్
4 ఫోర్డ్‌ వర్సెస్‌ ఫెరారీ
3 బాంబ్ షెల్
స్టార్ వార్స్: ది రైజ్ ఆఫ్ స్కైవాకర్
ది టూ పోప్స్
2 హరిఎల్
హనీలాండ్
జూడీ
పెయిన్ అండ్ గ్లోరీ
టాయ్ స్టోరి 4
ఎక్కువ పురస్కారాలు పొందిన సినిమాలు
పురస్కారాలు సినిమా
4 పారాసైట్
3 1917
2 ఫోర్డ్‌ వర్సెస్‌ ఫెరారీ
జోకర్
వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌

ఇవికూడా చూడండి

మూలాలు

ఇతర లంకెలు

Tags:

92వ అకాడమీ పురస్కారాలు చరిత్ర92వ అకాడమీ పురస్కారాలు పురస్కార విజేతలు92వ అకాడమీ పురస్కారాలు నామినేషన్లు - బహుమతులు92వ అకాడమీ పురస్కారాలు ఇవికూడా చూడండి92వ అకాడమీ పురస్కారాలు మూలాలు92వ అకాడమీ పురస్కారాలు ఇతర లంకెలు92వ అకాడమీ పురస్కారాలు91వ అకాడమీ పురస్కారాలుఅమెరికాఆస్కార్ అవార్డుకాలిఫోర్నియాయునైటెడ్ స్టేట్స్లాస్ ఎంజెల్స్

🔥 Trending searches on Wiki తెలుగు:

బ్రాహ్మణులురాష్ట్రపతి పాలనమెరుపుశ్రీముఖినితిన్రతన్ టాటాబోయపాటి శ్రీనుకరోనా వైరస్ 2019పి.వి.మిధున్ రెడ్డిసంగీతంనువ్వు నేనుకూచిపూడి నృత్యంవరిబీజంకిలారి ఆనంద్ పాల్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులునానార్థాలుఅన్నమాచార్య కీర్తనలువిశాఖ నక్షత్రము2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురవితేజపెంటాడెకేన్జ్యోతీరావ్ ఫులేఊరు పేరు భైరవకోనఅన్నమయ్య జిల్లాసంధ్యావందనం2019 భారత సార్వత్రిక ఎన్నికలుదసరాపోలవరం ప్రాజెక్టునిర్మలా సీతారామన్వినాయక చవితిచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంమాచెర్ల శాసనసభ నియోజకవర్గంఅగ్నికులక్షత్రియులుసామెతలుఉత్పలమాలఅక్కినేని నాగార్జునశివ కార్తీకేయన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.శోభన్ బాబుగైనకాలజీభారత రాజ్యాంగ సవరణల జాబితాఆవర్తన పట్టికగొట్టిపాటి నరసయ్యశోభితా ధూళిపాళ్లఉప్పు సత్యాగ్రహంనజ్రియా నజీమ్విష్ణు సహస్రనామ స్తోత్రమురష్మికా మందన్నసప్తర్షులునువ్వులురాబర్ట్ ఓపెన్‌హైమర్సౌందర్యసాక్షి (దినపత్రిక)షణ్ముఖుడుఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంగరుడ పురాణంరకుల్ ప్రీత్ సింగ్పరిపూర్ణానంద స్వామిపక్షవాతంరాజనీతి శాస్త్రముపురుష లైంగికతరాయలసీమఆర్యవైశ్య కుల జాబితాఅమిత్ షానువ్వు నాకు నచ్చావ్భారత జాతీయగీతంశ్రీదేవి (నటి)తెలుగు సినిమాలు 2022కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంకడియం కావ్యఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలువర్షం (సినిమా)సప్త చిరంజీవులుతెలుగు కథఢిల్లీ డేర్ డెవిల్స్తారక రాముడుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుతాటి ముంజలు🡆 More