ఐదు మూలస్తంభాలు

అడ్డదారి:
WP:5P
First pillar
వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం. ఇది మౌలిక డాక్యుమెంట్లు దొరికే వనరు కాదు , వార్తాపత్రిక కాదు, ఉచితంగానో, వెలకో వెబ్‌లో స్థలం ఇచ్చే సంస్థ కాదు. ప్రజాస్వామ్యంపైనో, అరాచకత్వంపైనో చేసే ప్రయోగమేమీ కాదు. మీ స్వంత అభిప్రాయాలు, అనుభవాలు, వాదనలు ప్రచురించుకునే స్థలం అంతకంటే కాదు.
 
Second pillar
వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అనుసరిస్తుంది. అంటే వ్యాసాలు ఏ ఒక్క దృక్కోణాన్నీ ప్రతిబింబించవు. దీనికోసం ఒక్కోసారి వివిధ దృక్కోణాలను చూపవలసి రావచ్చు; విషయానికి సంబంధించిన అన్ని దృక్కోణాలను నిష్పాక్షికంగా, అది ఎవరి దృక్కోణమో వివరంగా తెలిసేలా సందర్భశుద్ధిగా ప్రతిబింబించాలి. దీనివలన చదువరులకు అది ఎవరి దృక్కోణమో తెలుస్తుంది. ఫలానా దృక్కోణం నిజమనీ, సరైనదనీ చూపించరాదు. అవసరమైనచోట మీ వ్యాస మూలాలను, వనరులను ఉటంకించాలి. మరీ ముఖ్యంగా, వివాదాస్పద విషయాల్లో ఇది చాలా అవసరం.
 
Third pillar
వికీపీడియా స్వేచ్ఛగా పంచుకోగల విజ్ఞానసర్వస్వం. ఎవరైనా మార్చవచ్చు. వాడటం, సవరించటం, పంపిణి చేయటం చెయ్యవచ్చు.: సంపాదకులందరూ సమాజానికి ఉచితంగా తమ కృతులను అందచేస్తారు కాబట్టి, ఇక్కడి వ్యాసాలు ఏ ఒక్క సంపాదకునికీ సొంతం కాదు. రచనలు నిర్దాక్షిణ్యంగా మార్పులకు లోనవుతాయి. పంపిణీ కూడా అవుతాయి. నకలు హక్కుల చట్టాలను గౌరవించండి. మూలాల నుండి దొంగతనం చేయవద్దు. ఉచితం కాని మాధ్యమాలను సముచిత వినియోగం నిబంధన క్రింద వాడుకోవచ్చు. కాని స్వేచ్ఛగా పంచుకోగల మూలాల కోసమే ముందు వెతకాలి.
 
Fourth pillar
వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి. వ్యక్తిగతమైన దాడికి దిగకండి. వ్యర్థ వివాదాలకు తావివ్వకండి. మీ వాదనను నిరూపించుకునేందుకు వికీపీడియాలో అడ్డంకులు సృష్టించక, నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప. కొత్తవారిని ఆహ్వానించండి. వివాదాలేమైనా తలెత్తితే, సరైన చర్చాపేజీలో మృదువుగా చర్చించండి. మీరు కృషి చేసేందుకు వికీపీడియాలో ఇంక బోలెడు పేజీలున్నాయని గుర్తుంచుకోండి. మీ వాదనకు అనుకూలంగా బలం పెంచుకునేందుకు మిథ్యా సభ్యులను సృష్టించకండి.
 
Fifth pillar
వికీపీడియాలో విధానాలు, మార్గదర్శకాలూ ఉన్నాయి. అయితే ఏవీ కూడా శిలాశాసనాలు కాదు; నిరంతరం రూపుదిద్దుకుంటూ ఉంటాయి. అక్షరాలు, మాటల కంటే వాటి స్ఫూర్తి, ఆదర్శమూ ముఖ్యం. కొన్ని సందర్భాల్లో వికీపీడియాను మెరుగుపరచేందుకు, నియమాలను పక్కన పెట్టాల్సి ఉండొచ్చు. వ్యాసాలలో మార్పులు చేర్పులు చేసేందుకు చొరవగా ముందుకు రండి, అయితే నిర్లక్ష్యంగా ఉండకండి. వ్యాసాన్ని చెడగొడతామేమోనని వెనకాడవద్దు. పాత కూర్పులన్నీ జాగ్రత్తగానే ఉంటాయి కాబట్టి, తిరిగి సరిదిద్దలేనంతగా చెడగొట్టే అవకాశం లేదు. అయితే, ఒక్క విషయం..మీరు ఇక్కడ రాసేది శాశ్వతంగా ఉండే అవకాశం ఉందని గ్రహించండి.

🔥 Trending searches on Wiki తెలుగు:

జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థపూరీ జగన్నాథ దేవాలయంఉండి శాసనసభ నియోజకవర్గంభారతీయ రైల్వేలుతారక రాముడులలిత కళలుఆర్టికల్ 370 రద్దుశాసనసభఆంధ్రజ్యోతిభారత జాతీయ మానవ హక్కుల కమిషన్వరిబీజంఅనూరాధ నక్షత్రంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుకడియం కావ్యబోయపాటి శ్రీనుతిథిఅన్నమయ్యదేవికమహాకాళేశ్వర జ్యోతిర్లింగంనూరు వరహాలువాస్తు శాస్త్రంకరోనా వైరస్ 2019రోహిత్ శర్మబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంపేరుచిరంజీవులుఅమెరికా రాజ్యాంగంపాముయూట్యూబ్పూర్వ ఫల్గుణి నక్షత్రముపన్ను (ఆర్థిక వ్యవస్థ)భాషా భాగాలుమంతెన సత్యనారాయణ రాజుసంధ్యావందనంధనూరాశిసప్త చిరంజీవులుతమన్నా భాటియాహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితావినాయక చవితిచరవాణి (సెల్ ఫోన్)హనుమాన్ చాలీసాకన్యారాశిజవాహర్ లాల్ నెహ్రూPHతాన్యా రవిచంద్రన్హార్సిలీ హిల్స్తెలుగునాట జానపద కళలుపుష్యమి నక్షత్రముపవన్ కళ్యాణ్కోల్‌కతా నైట్‌రైడర్స్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్వంగవీటి రంగాక్రికెట్అన్నమయ్య జిల్లానిఖిల్ సిద్ధార్థగోత్రాలుపెళ్ళి చూపులు (2016 సినిమా)కామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)యోనిరామావతారంశ్రీకాళహస్తిపెద్దమనుషుల ఒప్పందంన్యుమోనియాకంప్యూటరుధర్మవరం శాసనసభ నియోజకవర్గంమియా ఖలీఫాద్వాదశ జ్యోతిర్లింగాలుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుమహేశ్వరి (నటి)పూజా హెగ్డేవై.యస్.అవినాష్‌రెడ్డిక్రిక్‌బజ్పంచభూతలింగ క్షేత్రాలుఅరుణాచలంభారత సైనిక దళంభారతీయ స్టేట్ బ్యాంకు🡆 More