వాంకోవర్

వాంకోవర్ (English: Vancouver, /væŋˈkuːvər/ ( listen), లేక /vænˈkuːvər/) సముద్రతీర నౌకాశ్రయ నగరం.

ఇది బ్రిటిష్ కొలంబియా, కెనడా దిగువభూభాగంలో ఉంది. బ్రిటిష్ కొలంబియాలో ఇది అత్యధిక జనసాంధ్రత కలిగిన నగరం. 2011 కెనడా గణాంకాల ఆధారంగా నగర జనసంఖ్య 6,03,502. ఇది కెనడాలోని 100 పెద్ద మున్సిపాలిటీలలో (8 వ స్థానం) ఇది ఒకటి. వాంకోవర్ మహానగరం 2.4 మిలియన్ల నివాసితులు ఉన్నారు. కెనడా లోని 100 పెద్ద మహానగరాలలో ఇది ఒకటి. వాంకోవర్ నగరంలో వైవిధ్యమైన పలు సంప్రదాయాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. వైవిధ్యమైన భాషావైవిధ్యం కలిగిన నగరంగా వాంకోవర్ గుర్తించబడుతుంది. నగరంలోని 52% ప్రజలకు ఆంగ్లేతర భాషలు మాతృభాషగా కలిగి ఉన్నారు. వాంకోవర్ గ్లోబల్ సిటీగా వర్గీకరించబడింది. వాంకోవర్ నగర వైశాల్యం 114 చ.కి.మీ. నగర జనసాంధ్రత 5,249 చ.కి.మీ. కెనడియన్ మున్సిపాలిటీలలో జనసాధ్రతపరంగా వాంకోవర్ ప్రథమ స్థానంలో ఉంది. ఉత్తర అమెరికాలో ఇది 4 వ స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాలలో న్యూయార్క్, శాన్ డియాగో , మెక్సికో నగరాలు ఉన్నాయి.ఆరంభకాల సెటిల్మెంట్‌గా ఈ ప్రాంతం పేరు గ్యాస్టౌన్. హాస్టింగ్స్ మిల్ లాగింగ్ సామిల్ ప్రాపర్టీ పశ్చిమ తీరంలో ఈ నగరం అభివృద్ధి చెందింది. 1867 జూలై 1న ప్రాపర్టీ యజమాని గ్యాసీ జాక్ పాలవళ్ళను రెండు మొద్దుల మీద పరచిఉన్న చెక్క మీద ఒక ఆహారశాల ఏర్పాటు చేయాలని కోరాడు. ఇలా మొదటి సంస్థ మొదలైన తరువాత పశ్చిమ తీరంలోని జలతీరం వెంట క్రమంగా త్వరితగతిలో ఇతర స్టోర్లు, కొన్ని హోటళ్ళు అభివృద్ధి చేయబడ్డాయి. గ్యాస్ టౌన్ బ్రిటిష్ కొలంబియాలోని గ్రాన్ విల్లా బి.ఐ.గా (బి.ఐ. అంటే సముద్రం చొచ్చుకువచ్చిన భూభాగం) టౌన్ సైట్‌గా అభివృద్ధి చేయబడింది. తరువాత ఈ టౌంసిల్ రాజకీయ ఒప్పందంలో భాగంగా వాంకోవర్ పేరుతో సి.పి.ఆర్. రైల్ హెడ్ అయింది. 1886 లో వాంకోవర్ నగరం హోదాను సంతరించుకుంది. 1887 నాటికి " కెనెడియన్ పబ్లిక్ రైల్వే (ట్రాంస్ కాంటినెంటల్ రైల్వే) నగరం లోని నౌకాశ్రయం వరకు విస్తరించబడింది. ఇది ఓరియంట్, ఈస్టర్న్ కెనడా, యూరప్ లను కలిపే వాణిజ్య మార్గానికి ప్రధాన అనుసంధానంగా మారింది. 2014 నాటికి " పోర్ట్ మెట్రో వాంకోవర్ " సరకు రవాణాలో ఉత్తర అమెరికాలోని పెద్ద నౌకాశ్రయాలలో మూడవ స్థానంలో ఉంది. అలాగే అంతర్జాతీయంగా 27వ స్థానంలో ఉంది. అంతేకాదు కెనడాలో అతిపెద్ద, బిజీగా ఉండే నౌకాశ్రయంగానూ ఉత్తర అమెరికాలో వైవిధ్యమైన నౌకాశ్రయంగా గుర్తించబడుతూ ఉంది. వాంకోవర్ నగరంలో ప్రధానంగా అడవి ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. నగరం చుట్టూ ప్రకృతి సహజమైన వన్యప్రాంతం ఉంటుంది. నగరానికి పర్యాటకం రెండవ పెద్ద ఆదాయవనరుగా ఉంది. వాంకోవర్‌లో పెద్ద చిత్రనిర్మాణ సంస్థలు ఉన్నాయి. నగర పరిసర ప్రాంతాలలో ఉన్న చిత్రనిర్మాణ సంస్థలు వాంకోవర్‌ను ఉత్తర అమెరికాలో ప్రధాన చిత్రనిర్మాణ కేంద్రంగా మార్చాయి. ఇది " వాంకోవర్‌ను నార్త్ హాలీవుడ్ " గా మార్చింది. నాణ్యమైన జీవనప్రమాణాలు కలిగిన నగరం, జీవించడానికి అనూకూలమైన నగరంగా వాంకోవర్ ప్రత్యేకత కలిగి ఉంది. నివశించడానికి అనుకూలమైన 10 అంతర్జాతీయ నగరాలలో వాంకోవర్ ఒకటి అని " ఎకనమిస్ట్ ఇంటెలిజెంస్ యూనిట్ " (వరుసగా 5 సంవత్సరాలు) పేర్కొన్నది. వాంకోవర్ నగరం పలు అంతర్జాతీయ సమావేశాలకు, ఉత్సవాలకు ఆతిథ్యం ఇచ్చింది. 1954 బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామంవెల్త్ గేంస్, యు.ఎన్.హబితాత్ ఐ, ఎక్స్పో 86, ది వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేంస్ (1989-2009), 2010 వింటర్ ఒలింపిక్స్, 2010 పారాలింపిక్స్ లకు వాంకోవర్ ఆతిథ్యం ఇచ్చింది. ఇవి వాంకోవర్, నగరానికి ఉత్తరంలో ఉన్న విస్ట్లర్ (బ్రిటిష్ కొలంబియా) రిసార్ట్ కమ్యూనిటీలో నిర్వహించబడ్డాయి. 2014 లో టి.ఇ.డి కాంఫరెంస్ (గత 30 సంవత్సరాలుగా ఇవి కలిఫోర్నియాలో జరిగాయి) వాంకోవర్ నగరంలో నిర్వహించబడింది. 2015 లో ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వుమంస్ వరల్డ్ కప్ క్రీడలు వాంకోవర్ నగరంలో జరిగాయి. ఫైనల్ బి.సి. ప్లేస్ స్టేడియంలో జరిగింది.

వాంకోవర్
Vancouver
వాంకోవర్ యొక్క నగరం
Clockwise from top: Downtown Vancouver as seen from the southern shore of False Creek, The University of British Columbia, Lions Gate Bridge, a view from the Granville Street Bridge, Burrard Bridge, The Millennium Gate (Chinatown), and totem poles in Stanley Park.
Clockwise from top: Downtown Vancouver as seen from the southern shore of False Creek, The University of British Columbia, Lions Gate Bridge, a view from the Granville Street Bridge, Burrard Bridge, The Millennium Gate (Chinatown), and totem poles in Stanley Park.
Official logo of వాంకోవర్
Nickname: 
See Nicknames of Vancouver
Motto(s): 
"By Sea, Land, and Air We Prosper"
Location of Vancouver within Metro Vancouver in British Columbia, Canada
Location of Vancouver within Metro Vancouver in British Columbia, Canada
Countryవాంకోవర్ కెనడా
Provinceవాంకోవర్ British Columbia
RegionLower Mainland
Regional districtMetro Vancouver
Incorporated6 April 1886
Named forCaptain George Vancouver
Government
 • MayorGregor Robertson
(Vision Vancouver)
 • City Council
List of Councillors
 • MPs (Fed.)
List of MPs
 • MLAs (Prov.)
List of MLAs
Area
 • నగరం114.97 km2 (44.39 sq mi)
 • Metro
2,878.52 km2 (1,111.40 sq mi)
Elevation
0–152 మీ (0–501 అ.)
Population
 (2011)
 • నగరం6,03,502 (8th)
 • Density5,249/km2 (13,590/sq mi)
 • Urban
21,35,201
 • Metro
23,13,328 (3rd)
DemonymVancouverite
Time zoneUTC−8 (PST)
 • Summer (DST)UTC−7 (PDT)
Postal code span
V5K to V6Z
Area code(s)604, 778, 236
NTS Map092G03
GNBC CodeJBRIK
GDPUS$ 109.8 billion
GDP per capitaUS$ 44,337
WebsiteCity of Vancouver

చరిత్ర

స్థానిక ప్రజలు

ఆర్కియాలజీ రికార్డుల ఆధారంగా ఈ ప్రాంతంలో 8,000 -10,000 పూర్వపు ఆదిమ మానవులు నివసించిన సాక్ష్యాలు లభించాయి. ప్రారంభకాలంలో ఈ ప్రాంతంలో స్క్వామిష్, మస్క్వియం, త్ల్సెయిల్- వూటత్ ప్రజలు (శాలిష్ తీరప్రాంత ప్రజలు) నివసించారు. ప్రస్తుత వాంకోవర్ ప్రాంతంలో పలు గ్రామాలు ఉన్నాయి. అవి ప్రస్తుతం స్టాన్లీ పార్క్, ఫాల్సె క్రీక్, కిట్సిలానో, పాయింట్ గ్రే మొదలైన ఫ్రాసర్ నదీ ప్రాంతాలుగా ప్రాంతాలుగా ఉన్నాయి.

అణ్వేషణ, ఒప్పందం

1791 లో స్పెయిన్‌కు చెందిన " జోస్ మరియా నర్వీజ్ " తన అణ్వేషణలో భాగంగా ప్రస్తుత వెస్ట్ పాయింట్ గ్రే, బుర్రద్ ఇన్లెట్ ప్రాంతానికి చేరడంతో ఈ ప్రాంతాలకి యురేపియన్ల రాక ఆరంభం అయింది. 1792 లో జార్జ్ వాంకోవర్ బుర్రద్ ఇన్లెట్ నౌకాశ్రయ ప్రాంతానికి అణ్వేషకుడుగా వచ్చి చేరాడు. తరువాత జార్జ్ వాంకోవర్ ఇక్కడ ప్రాంతాలకు బ్రిటిష్ పేర్లను పెట్టాడు. అణ్వేషకుడు, నార్త్ వెస్ట్ కంపెనీ వ్యాపారి " సైమన్ ఫ్రాసర్ ", ఆయన బృందం ప్రస్తుత నగరప్రాంతంలో ప్రవేశించిన యురేపియన్లని భావిస్తున్నారు. 1808 లో వారు తూర్పుదిశగా ప్రయాణించి ప్రస్తుత పాయింట్ గ్రే చేరుకున్నారు.

ఆరంభకాల అభివృద్ధి

1858 " ది ఫ్రాసర్ గోల్డ్ రష్ " సమయంలో కలిఫోర్నియా నుండి ఈ ప్రాంతానికి కొత్తగా 25,000 మంది పురుషులు వచ్చి చేరారు. వారు ఫ్రాసర్ కేన్యాన్ చేరుకునే మార్గంలో మద్యలో ఫ్రాసర్ నదీతీరంలో ఉన్న " న్యూ వెస్ట్ మినిస్టర్ " ప్రాంతంలో మజిలీ చేసేవారు. అది తరువాత వాంకోవర్‌గా మారింది. ప్రస్తుత వాంకోవర్‌లో మొదటి యురేపియన్ సెటిల్మెంట్ 1862లో ఫ్రాసర్ నదీతీరంలోని మెక్లీర్ ఫాం వద్ద ఆరంభం అయింది. ఇది పురాతన గ్రామం మస్క్వియంకు తూర్పున (ప్రస్తుత మార్పోల్) ఉంది. 1863లో మూడీవిల్లె (ప్రస్తుత నార్త్ వాంకోవర్) వద్ద సామిల్ ఏర్పాటు చేయబడింది. ఇక్కడ కొయ్యపనితో నగరానికి దీర్ఘకాల అనుబంధం ఉంది. తరువాత ఇన్లెట్ దక్షిణప్రాంతంలో కేప్టన్ ఎడ్వర్డ్ స్టాంప్ ఈ రంగంలో స్థిరపడ్డాడు. ఎడ్వర్డ్ ముందుగా బ్రోక్టన్ పాయింట్ వద్ద ఉన్న " పోర్ట్ అల్బర్ని " సమీపంలో లాగింగ్ ఆరంభించాడు. తరువాత 1867లో ఆయన కొన్ని సమస్యల కారణంగా డన్లెవీ పర్వతపాదాల సమీపంలో మిల్‌ తరలించాడు. ఈ మిల్ హాస్టింగ్స్ మిల్‌గా గుర్తించబడింది.క్రమంగా ఈ మిల్ పరిసరప్రాంతాలు వాంకోవర్‌గా అభివృద్ధి చెందింది. క్రమంగా 1880 లో కెనడియన్ పసిఫిక్ రైల్వే (సి.పి.ఆర్) ఆరంభించిన తరువాత నగరకేంద్ర ప్రాధాన్యత మారింది. అయినప్పటికీ 1920 లో మిల్లు మూతపడే వరకు ఈ మిల్లు ఈ ప్రాంత ఆర్ధికవనరుగా ఉంది. గ్యాస్ టౌన్ అనబడే సెటిల్మెంట్ గ్యాసీ స్థాపించిన ఆహారశాల, మార్కెట్ కేంద్రంగా చేసుకుని త్వరగా అభివృద్ధి చెందింది. 1870 లో బ్రిటిష్ కొలంబియా కాలనీ ప్రభుత్వం సెటిల్మెంటును సర్వేచేసి టౌన్ సైట్‌గా చేసి " బ్రిటిష్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ది కాలనీస్ " లార్డ్ గ్రాంవిల్లే గౌరవార్ధం దీనికి గ్రాంవిల్లే అని పేరు మార్చింది. 1884 లో ఇక్కడ సహజసిద్ధమైన నౌకాశ్రయం స్థాపించబడింది. పోర్ట్ మూడీ, న్యూ వెస్ట్ మినిస్టర్, విక్టోరియా అభివృద్ధి కొరకు " కెనడియన్ పసిఫిక్ రైల్వే టెర్మినల్‌ " ఏర్పాటుకు ప్రయత్నాలు ఆరంభించారు. 1871 లో కెనడాను మొత్తం అనుసంధానించడానికి బ్రిటిష్ కొలంబియా ఆరంభించిన రైల్వే పనులు " పసిఫిక్ స్కాండల్, చైనా శ్రామికుల శక్తిని అత్యుపయోగం చేసారన్న ఆరోపణలు రైల్వే నిర్మాణపు పని జాప్యమై 1880 వరకు కొనసాగింది.

వాంకోవర్ 
A portrait of the first Vancouver City Council meeting after the 1886 fire. The tent shown was on the east side of the 100 block Carrall.
వాంకోవర్ 
Panorama of Vancouver, 1898

కార్పొరేషన్ రూపకల్పన

1886 ఏప్రిల్ 6 న వాంకోవర్ కార్పొరేషన్ అయింది. అదే సంవత్సరం నగరంలోకి మొదటి ట్రాంస్ కాంటినెంటల్ ట్రైన్ ప్రవేశించింది. హెంరీ జాన్ కాంబీ సిఫారసు అనుసరించి సి.పి.ఆర్. అధ్యక్షుడు విలియం వ్యాన్ హార్నే సి.పి.ఆర్. టెర్మినల్ స్థాపించడానికి పోర్ట్ మూడీ చేరుకున్నాడు. తరువాత విలియం వ్యాన్ హార్నే జార్జి వాంకోవర్‌ గౌరవార్ధం నగరానికి వాంకోవర్ అని నామకరణం చేసాడు. 1886 జూన్ 13 న నగరంలో గ్రేట్ వాంకోవర్ ఫైర్ సంఘటన సంభవించింది. అదే సంవత్సరం వాంకోవర్ ఫైర్ డిపార్ట్మెంటు స్థాపించబడింది. తరువాత నగరం వేగవంతంగా పునర్నిర్మించబడింది. 1881 లో 1,000 మంది ప్రజలు మాత్రమే ఉన్న వాంకోవర్ జనసంఖ్య శతాబ్దం చివరికాలానికి 20,000 లకు చేరుకుంది. అలాగే 1911 నాటికి జనసంఖ్య 1,00,000 కు చేరుకుంది. వాంకోవర్ వ్యాపారులు 1898 లో క్లోండికె గోల్డ్ రష్ కారణంగా సంపన్నులయ్యారు. 1892లో వారిలో ఒక వ్యాపారి అయిన చార్లెస్ వుడ్వర్డ్ అబ్బాట్, కార్డోవా స్ట్రీట్ ప్రాంతాలలో మొదటిసారిగా స్టోర్స్ ప్రారంభించాడు. తరువాత స్పెంసర్ డిపార్ట్మెంటల్ స్టోర్స్, హడ్సన్ బే డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఆరంభించబడ్డాయి. ఇవి కొన్ని దశాబ్ధాల కాలం నగర చిల్లర వ్యాపారాన్ని శాశించాయి. వాంకోవర్ నగర ఆరంభకాల ఆర్థికవనరుగా సి.పి.ఆర్. సహకరించింది. ఇది నగరం వేగవంతంగా అభివృద్ధి చెందడానికి సహకారం అందించింది.

నగరంలో రియల్ ఎస్టేట్, హౌసింగ్ డెవెలెప్మెంట్ రంగానికి సి.పి.ఆర్. కంపెనీ ఆధిక్యత వహించింది. 1890 లో బెంజిమిన్ టింగ్లే రోజర్స్ షుగర్ రిఫైనరీ స్థాపించబడింది. సహజ వనరులు వాంకోవర్ ప్రధాన ఆర్థికవనరులుగా ఉన్నాయి. వనరుల రంగంలో లాగింగ్ (కొయ్య పరిశ్రమ) ఆధిక్యత వహిస్తుంది. తరువాతి కాలంలో ఎగుమతులు దిగుమతులకు ప్రాధాన్యత వహించింది. ఫలితంగా 1930 నాటికి వ్యాపారం వాంకోవర్ నగరానికి అతిపెద్ద ఆర్థికవనరుగా మారింది.

20వ శతాబ్ధం

నగరానికి వ్యాపార రంగం నుండి ఆదాయం అధికరించిన అదే తరుణంలో కార్మికవర్గం తిరుగుబాటు కార్యక్రమాలు కూడా అధికం అయ్యాయి. నగరంలో మొదటిసారిగా 1903 లో సి.పి.ఆర్. కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మె ప్రారంభించారు. శ్రామిక నాయకుడు ఫ్రాంక్ రోజర్స్ సి.పి.ఆర్. పోలీస్‌చే హత్యకు గురైయ్యాడు. బ్రిటిష్ కొలంబియాలో ఫ్రాంక్ రోజర్ మొదటి అమరవీరుడయ్యాడు. ఈ ప్రాంతం అంతటా పారిశ్రామిక ఉద్రిక్తతలు అధికరించి 1918 నాటికి కెనడా జనరల్ సమ్మెకు దారితీసింది. 1920 సమ్మె కొంత సద్దుమణిగింది. 1935 లో సుదూరప్రాంతాలలో మిలటరీ నిర్వహణలో ఉన్న నిరుద్యోగ పురుషులు నగరంలోకి వరదలా వచ్చి చేరారు. వారు మిలటరీ కేంపుల స్థితి వివరించారు. రెండు మాసాల కాలం ఎడతెగని దినసరి నిరసన ప్రదర్శనల తరువాత నిరసనదారులు సమస్యను ఓటావా ట్రెక్‌లోని ఫెడరల్ గవర్నమెంటు దృష్టికి తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ వారి నిరసనలు అణిచివేయబడ్డాయి. ఉద్యోగులు (బ్రిటిష్ కొలంబియా మిషన్ ) వద్ద ఖైదుచేయడం, వర్క్ కేంపులలో బంధించడం వంటి చర్యలు తీసుకున్నారు. వాంకోవర్‌లో స్త్రీవాదం, నీతి నియమ సంస్కరణలు, నిగ్రహ ఉద్యమం ఇతర సాంఘిక ఉద్యమాలు జరిగాయి. 1918 లో మేరీ ఎలెన్ స్మిలిత్ (మద్యపాన నిషేధం, స్త్రీలకు ఓటుహక్కు ఉద్యమకారిణి) కెనడాలో మొదటి లెజిస్లేటివ్ సభ్యురాలిగా ఎన్నుకొనబడింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత కెనడాలో మద్యపాన నిషేధం ఆరంభమై 1921 వరకు కొనసాగింది. తరువాత ప్రాంతీయ ప్రభుత్వం మద్యం విక్రయం మీద నియంత్రణ స్వాధీనం చేసుకుంది. అది ఇప్పటికీ కొనసాగుతుంది. ఫెడరల్ లేబర్ మినిస్టర్, విలియం లియాన్ మాకెనైజ్ కింగ్ నిర్వహించిన విచారణ తరువాత కెనడా మద్యపాన నిషేధచట్టం రూపొందించబడింది. ఆసియాటిక్ ఎక్స్‌క్లూషన్ లీగ్ నాయకత్వంలో అల్లర్లలో వాంకోవర్ చైనాటౌన్‌, వాంకోవర్ జపాన్ టౌన్‌లలో జరిగిన వినాశనం, నష్టం గురించి విచారించమని కింగ్ ఆదేశించాడు. నష్టపరిహారం కోరినవారిలో ఇద్దరు ఓపియం విక్రయదారులు ఉన్నారు. అదనపు విచారణలో ఒకశ్వేత జాతీయురాలు తరచుగా చైనావారిని కలుసుకున్నదని వెల్లడైంది. ఫెడరల్ చట్టం ఓపియాన్ని వైద్యేతర ఉపయోగాలకు నిషేధం విధించింది. ఈ అల్లర్లు, " ఆసియాటిక్ ఎక్స్చ్లూషన్ లీగ్ " ఏర్పాటు వాంకోవర్‌, బ్రిటిష్ కొలంబియాలో నివసిస్తున్న జపాన్ వారని కలవరపరిచింది. " పీర్ల్ హార్బర్ మీద " దాడి జరిగిన తరువాత భీతి తీవ్రం అయింది. చివరికి వాంకోవర్, బ్రిటిష్ కొలబియాలో నివసిస్తున్న కెనడియన్లను క్రమబద్ధంగా నమోదు చేయుట లేక ప్రాంతం నుండి పంపివేసారు. యుద్ధం తరువాత జపాన్ - కెనడియన్లు వాంకోవర్ నగరంలో ప్రవేశించడానికి అనుమతించలేదు. వాంకోవర్ జపాన్ టౌన్ తిరిగి పునరుజ్జీవనం పొందలేదు. పాయింట్ గ్రేతో విలీనం అయిన తరువాత వాంకోవర్ నగరం విస్తరించి దేశంలో మూడవపెద్ద నగరంగా అవతరించింది. 1929 జనవరి 1 విస్తరించిన వాంకోవర్ జనసంఖ్య 2,28,193.

భౌగోళికం

వాంకోవర్ 
23 official neighbourhoods of Vancouver (local usage varies)

బుర్రద్ ద్వీపకల్పంలో ఉన్న వాంకోవర్ ఉత్తరదిశలో బుర్రద్ ఇన్లెట్, దక్షిణంలో ఫ్రాసర్ నది పశ్చిమంలో జార్జియా జలసంధి దానిని ఆనుకుని వాంకోవర్ ద్వీపం ఉన్నాయి. చదరంగా ఉండే భూభాగం, పర్వతప్రాంతం నగర వైశాల్యం 114 కి.మీ. ఇది పసిఫిక్ టైం జోన్, పసిఫిక్ మారీ టైం ఎకోజోన్ మద్య ఉంది. 1885 లో నగరం పేరు వాంకోవర్ అని మార్చే వరకు వాంకోవర్ అనే పేరు వాంకోవర్ ద్వీపానికి ఉండేది. అందువలన వాంకోవర్ నగరం ద్వీపంలో ఉండేది అని అనుకుంటూ ఉంటారు. ద్వీపానికి, నగరానికి రాయల్ నేవీ కేప్టన్ జార్జ్ వాంకోవర్ ఙాపకార్ధం ఆయన పేరు నిర్ణయించబడింది. (యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న వాంకోవర్ (వాషింగ్టన్)లా). వాంకోవర్ నగరంలో స్టాన్లీ నేషనల్ పార్క్ (వైశాల్యం 404.9 చ.హెక్టార్లు) ఉత్తర అమెరికాలోఉన్న అతి పెద్ద నేషనల్ పార్క్‌గా గుర్తించబడుతుంది. నగరంలో ఉన్న నార్త్ కోర్ మౌంటెంస్ నుండి వాషింగ్టన్ ఈశాన్యంలో ఉన్న హిమంతో కప్పబడిన బేకర్ అగ్నిపర్వతం, పశ్చిమం, నైరుతిలో జార్జియా జలసంధికి ఆవల తీరంలో ఉన్న వాంకోవర్ ద్వీపం, వాయవ్యంలో బోవెన్ ద్వీపం ఉన్నాయి.

పర్యావరణం

వాంకోవర్ వృక్షజాలం " టెంపరేట్ రెయిన్ ఫారెస్ట్ "గా వర్గీకరించింది. ఇక్కడ పినోఫీ, చెల్లాచెదురుగా మేపుల్, అత్యధికమైన చిత్తడినేలలు ఉంటాయి. బ్రిటిష్ కొలంబియా సముద్రతీరంలో డౌగ్లాస్, తుజా ప్లిక్టా (వెస్టర్న్ రెడ్ సెడార్), వెస్టర్న్ హెమ్లాక్‌ కలగలిపిన కోనిఫర్ వృక్షాలు ఉంటాయి. బ్రిటిష్ కొలంబియా సముద్రతీరప్రాంతాలలో అతి పెద్ద వృక్షాలు ఉంటాయి. ఎలియాట్ బే, సియాటెల్ లోని వృక్షాలు బుర్రద్ ఇన్లెట్, ఇంగ్లీష్ బేలో కనిపించే వృక్షాలకంటే వైవిధ్యంగా ఉంటాయి. వాంకోవర్ లోని జెరిచో బీచ్ ప్రాంతంలోఉనా గ్యాస్ టౌన్, దక్షిణ ప్రాంతాలలో (ఫాల్స్ క్రీక్, ఇంగ్లీష్ బే) అతిపెద్ద వృక్షాలు ఉంటాయి. స్టేన్లీ పార్క్‌లో 1860, 1880 కాలం నాటి వృక్షాలు ఉన్నాయి. ఇక్కడ పాతకాలం నాటి వండ్రంగి పని విధానం కొనసాగుతూ ఉంది. వాంకోవర్, దిగువ భూములలో ఉన్న చెట్లు, మొక్కలు ఖండం లోని వివిధ ప్రాంతాల నుండి దిగుమతి చేయబడ్డాయి. అరౌకారియా అరౌకానా (మంకీ ఫజిల్ ట్రీ), అసర్ పాల్మాతుం (జపాన్ మేపుల్) మొదలైన చెట్లు, మగ్నోలియా, అజాలియా, రోడోడెండ్రన్ మొదలైన పూల మొక్కలు ఉంటాయి. కొన్ని వృక్షజాతులు తూర్పు కెనడా, ఐరోపా వంటి వాతావరణంలో పెరిగే వృక్షాలు దిగుమతి చేయబడ్డాయి. స్థానికమైన అసర్ గ్లాబ్రం (డౌగ్లాస్ మేపుల్) బృహత్తరమైన పరిమాణంలో పెరుగుతుంటాయి. నగర వీధులలో అధికంగా సకురల్ (జపానీ చెర్రీ) పూల మొక్కలు కనిపిస్తుంటాయి. వీటిని 1930లో జపాన్ ప్రభుత్వం అందించింది. వసంతకాల ఆరంభకాలంలో కొన్నివారాల కాలం పుష్పించే ఈ పూలమొక్కలు పుష్పించే కాలం వాంకోవర్ చెర్రీ బ్లౌసంగా భావించబడుతూ ఉంది. ఇతర వీధులలో పుష్పించే చెస్ట్ నట్ చెట్లు (హార్స్ చెస్ట్ నట్), ఇతర అలంకార మొక్కలు ఉంటాయి.

వాతావరణం

వాంకోవర్ 
Kitsilano Beach is one of Vancouver's many beaches

శీతాకాలంలోనూ వెచ్చగా ఉండే కెనడా నగరాలలో వాంకోవర్ ఒకటి. కెనడా ప్రమాణాలు అనుసరించి వాంకోవర్ వాతావరణం సమశీతల వాతావరణంగా వర్గీకరించబడింది. కోపెన్ వాతావరణ వర్గీకరణలో నగరవాతావరణం సాధారణంగా " ఓషనిక్ క్లైమేట్ (సముద్రతీర వాతావరణం) గా నిర్ణయించబడుతుంది. కెనడా ఇన్లాండ్‌లో వేసవిలోఉష్ణోగ్రతలు అధికంగా ఉండే సమయంలో వాంకోవర్ నగరంలో ఉష్ణోగ్రతలు ఆహ్లాదకరమైనంతగా చల్లాగా ఉంటాయి. వేసవి వాతావరణం పొడిగా ఉంటుంది. జూలై, ఆగస్టు మాసాలలో వర్షపాతం ఉంటుంది. నవంబరు నుండి మార్చి వరకు దాదపు సగం రోజులలో వర్షపాతం ఉంటుంది. కెనడా నగరాలలో వాంకోవర్ అతిగా తడిగా ఉండే నగరాలలో వాంకోవర్ ఒకటి. అయినప్పటికీ మహానగర ప్రాంతం అంతటా వర్షపాతంలో వ్యత్యాసాలు సహజం. రిచ్‌మండ్ ప్రాంతంలో ఉన్న విమానాశ్రయంలో నమోదు చేసిన వార్షిక వర్షపాతం 1,189 మి.మీ. డౌన్‌టౌన్ ప్రాంతంలో వర్షపాతం 1588 మి.మీ. నార్త్ వాంకోవర్ వర్షపాతం 2044 మి.మీ. జూలై, ఆగస్టు మాసాలలో దినసరి అత్యధిక ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటీగ్రేడ్. అరుదుగా ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. 2009 జూలై 9 న అత్యధికంగా 34.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. 1965 జూలై 13న వాంకోవర్ నగరంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్. 1981 ఆగస్టు 8 న నమోదైన ఉష్ణోగ్రత తిరిగి 35 డిగ్రీల సెంటీ గ్రేడ్. చివరిగా అత్యధికగా 35 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత 1983 మే 29 న నమీదైంది. వాంకోవర్ వార్షిక సరాసరి వర్షపాతం 38.1 సె.మీ. మంచు అధికకాలం భూమి మీద నిలిచి ఉండదు. కెనడా నగరాల శీతాకాలవాతావరణంలో వాంకోవర్ 4వ స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాలలో విక్టోరియా బ్రిటిష్, ననైమో, డంకన్ (బ్రిటిష్ కొలంబియా) ఉన్నాయి. వాంకోవర్ గ్రోయింగ్ సీజన్ సరాసరి 237 రోజులు (మార్చి 18 నుండి నవంబరు 10 వరకు).

నగరరూపం

వాంకోవర్ 
A view of English Bay from the Burrard Bridge

నగర రూపకల్పన

2011 నాటికి వాంకోవర్ నగరం కెనడాలో అత్యధిక జనసాంధ్రత కలిగిన నగరంగా మారింది. నగర విస్తరణకు బదులుగా వాంకోవర్ నగరీకరణ ప్రణాళిక బహుళ అంతస్తుల నివాసగృహ సముదాయాలు, నగరకేంద్రాలలో మిశ్రిత ఉపయోగ అభివృద్ధి (మిక్సెడ్ - యూస్ డెవెలెప్మెంట్) పధకాలు అమలుచేసేలా రూపొందించబడింది. ఈ ప్రణాళిక వాంకోవర్ మహానగరంలో నివసించడానికి మార్గం సుగమం చేసింది.

వాంకోవర్ 
Downtown Vancouver as seen from the Harbour Centre
వాంకోవర్ 
Vancouver at night

ప్రపంచంలో నివసించడానికి అనుకూలమైన నగరాలలో వాంకోవర్ ఒకటిగా ఒక దశాబ్ధకాలం నుండి వర్గీకరించబడుతూ ఉంది. 2010 గణాంకాల ప్రపంచంలో ఆధారంగా అత్యంత నాణ్యమైన జీవనప్రమాణాలు కలిగిన నగరాలలో వాంకోవర్ 4వ స్థానంలో ఉందని భావిస్తున్నారు. 2007 ఫోర్బ్స్ నివేదికల ఆధారంగా రియల్ ఎస్టేట్ ధరలు అత్యధికంగా ఉన్న ప్రపంచ నగరాలలో వాంకోవర్ అంతర్జాతీయంగా 6 వ స్థానంలో ఉంది. ఉత్తర అమెరికాలో ద్వీతీయ స్థానంలో (మొదటి స్థానంలో లాస్ ఏంజలెస్ ) ఉంది. వాంకోవర్ కెనడాలో అత్యంత ఖరీదైన జీవనప్రమాణం కలిగిన నగరంగా వర్గీకరించబడిది. 2016 ఫిబ్రవరి మాసంలో నగరంలో జరిగిన విక్రయాలు 10 సంవత్సరాల సరాసరి కంటే 56.3 % అధికంగా ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన నగరాలలో వాంకోవర్ 10వ స్థానంలో ఉందని ఫోర్బ్స్ వివరించింది. 1950 నుండి వాంకోవర్ నగరీకరణ ప్రణాళికలు ఆరంభం అయ్యాయి. వాంకోవర్ పశ్చిమ తీరంలో బహుళ అంతస్తుల భవననిర్మాణానికి నగరాభివృద్ధి ప్రణాళిక ప్రోత్సాహం అందించినప్పటి నుండి నగరాభివృద్ధి ఆరంభం అయింది. హరితరక్షణ (గ్రీన్ ప్రిజర్వ్) బహింరంగ ప్రదేశాల రక్షణ కొరకు బహుళ అంతస్తుల నిర్మాణాలకు ప్రోత్సాహం లభించింది. జనబాహుళ్యం నివసించడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడడం నగరప్రాంత పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి దారి తీసింది. 1980లో నార్త్ ఫాల్స్ క్రీక్, కోయల్ హార్బర్ స్థాపించబడ్డాయి. ఫలితంగా నగరకేంద్రాలు నాణ్యమైన వసతులు కలిగిన, నివాసయోగ్యమైన ప్రాంతాలుగా అతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. భూభాగాన్ని ఉపయోగించి జనసాధ్రతకు అవసరమైన నివాసయోగ్యమైన సౌకర్యవంతమైన నివాసగృహాలను అందిస్తూ పర్యావరణాన్ని రక్షించే వ్యూహాత్మక విధానం (ఎకోడెంసిటీ) సమీపకాలంగా చర్చనీయాంశం అయింది. కెనడాలో బలహీనమైన రవాణాసౌకర్యాలు కలిగిన నగరాలలో వాంకోవర్ ఒకటి. నగరంలోని పురాతనమైన ఇరుకైన వంతెనలు, రహదారుల కొరత నగరప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి.

A panorama of Vancouver looking north from the vicinity of West Broadway and Oak Street. The bridge on the left is the Granville Street Bridge.

నిర్మాణ కళ

వాంకోవర్ 
Aerial view of Downtown Vancouver
వాంకోవర్ 
Vancouver Post Office in 1937, now part of Sinclair Centre

1906 లో వాంకోవర్ డౌన్‌టౌన్‌లో నియోక్లాసికల్ ఫార్మర్ కోర్ట్ హౌస్ నిర్మించబడింది. దీనిని ఫ్రాంసిస్ రాటన్‌బ్యురీ రూపకల్పన చేసాడు. ఆయన బ్రిటిష్ కొలంబియా పార్లమెంటు, ఎంప్రెస్ హోటల్ (విక్టోరియా) నిర్మాణాలకు కూడా రూపకల్పన చేసాడు. అలాగే వాంకోవర్‌లో ఉన్న రెండవ హోటల్‌ను అందగా అలంకరించాడు. మూడవదిగా 1939లో రాగి కప్పుతో 556 గదుల హోటల్ నిర్మించబడింది. 1894లో గోతిక్ శైలిలో క్రిస్టియన్ కాథడ్రల్ చర్చి నిర్మించబడింది. 1976 లో ఇది వారసత్వభవనంగా ప్రకటించబడింది.

ఆధునిక నిర్మాణాలు

డౌన్‌టౌన్ ప్రాంతంలో పలు ఆధునిక శైలి నిర్మాణాలు ఉన్నాయి. వీటిలో హార్బర్ సెంటర్, వాంకోవర్ లా కోర్ట్, రాబ్సన్ స్గైర్‌లో ఉన్న ప్లాజా (ఆర్థర్ ఎరిక్సన్ రూపకల్పన చేసాడు), వాంకోవర్ లైబ్రరీ స్క్వేర్ (మోషే సఫ్డీ), డి.ఎ.న్ ఆర్కిటెక్ట్స్ రూపకల్పన చేసినవి), రోం లోని కోలోసియం మ్యూజియం అవశేషాలు, సమీపంలో నిర్మాణపు పనులు పూర్తిచేసుకున్న వుడ్‌వార్డ్స్ బిల్డింగ్ (ప్రస్తుతం ఎలెక్ట్రా కండోమినియాగా మార్చబడింది) ప్రధానమైనవి. నగరంలోని ఈశాన్యంలోని జార్జియా, తర్లో ఇంటర్సెక్షన్ ప్రాంతంలో ఉన్న మాక్‌మిల్లన్ బ్లొయెడే భవనం, కెనడా సుందర ప్రాంతాలకు ప్రముఖ చిహ్నంగా ఉన్న కెనడా ప్లేస్ (జెయిడర్ రాబర్ట్స్ పార్టనర్‌షిప్ రూపొందించినది),ఎం.సి.ఎం.పి. డి.ఎ. ఆర్కిటెక్ట్స్, వాంకోవర్ కాంవెంషన్ సెంటర్‌లో భాగంగా ఉన్న ది ఫార్మర్ కెనడా పవిల్లియన్ (1986 వరల్డ్ ఎక్స్పొజిషన్), ది పాన్ పసిఫిక్ వాంకోవర్ హోటెల్ (క్రూసీ షిప్ టెర్మినల్) భవనాలు ఉన్నాయి. వాంకోవర్ స్కైలైన్‌కు భిన్నంగా ఉండే సిటీ హాల్, వాంకోవర్ జనరల్ హాస్పిటల్ ఉన్నాయి. ఈ రెండు నిర్మాణాలను 1936, 1958 లలో ఫ్రెడ్ టోన్లీ, మాథ్సన్ రూపకల్పన చేసాడు. నగరం పాత డౌన్‌టౌన్ ప్రాంతంలో ఉన్న ఎడ్వర్డియన్ భవనాలు (నిర్మించేనాటికి ఇవి బ్రిటిష్ ఎంపైర్ ఎత్తైన భవనాలుగా గుర్తించబడ్డాయి)." ది వాంకోవర్ ప్రొవింస్ " వార్తా పత్రిక పాత కార్యాలయంగా ఉన్న కార్టర్ - కాటన్ భవనం, ది డోమినియన్ బిల్డింగ్ (1907), సన్ టవర్ (1911) ఉన్నాయి. ఇక్కడ అదనంగా " ది మారిన్ బిల్డింగ్ " ఇది సెరామిక్ టైల్, ఇత్తడి తలుపులు, ఎలివేటర్లతో అలంకరించబడింది. ఇది చలనచిత్రాల నిర్మాతలకు అభిమాన లొకేషన్‌గా మారింది. 62 అంతస్తుల లివింగ్ షరింగ్రి-లా (62 మీ ఎత్తు) వాంకోవర్ నగరంలో ఎత్తైన భవనంగా గుర్తించ బడుతున్న " హోటెల్ జార్జియా " (156 మీ) మూడవ స్థానంలో 48 అంతస్తుల వన్ వాల్ సెంటర్ (150 మీ) తరువాత షా టవర్ వాంకోవర్ (149 మీ),

ఆర్ధికరంగం

వాంకోవర్ 
Sir Norman Foster designed Jameson House building in Downtown Vancouver.

పసిఫిక్ తీరంలో ఉన్న వాంకోవర్ నగరం వద్ద ట్రాంస్ కెనడా హైవే టెర్మినల్, రైలు రూట్ టెర్మినల్ ఉన్నాయి. వాంకోవర్ కెనడాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలలో ఒకటి. కెనడాలోని అతిపెద్ద నౌకాశ్రయం " పోర్ట్ మెట్రో వాంకోవర్ "లో వౌవిధ్యమైన 160 వ్యాపారవిధానాల ద్వారా వార్షికంగా 172 బిలియన్ల వ్యాపారం జరుగుతూ ఉంది. మైనింగ్ కంపనీలకు, వన్యసంపదకు వాంకోవర్ కేంద్రంగా ఉంది. అలాగే నగరం సాఫ్ట్‌వేర్ డెవెలెప్మెంట్, బయోటెక్నాలజీ, ఎయిరోస్పేస్, వీడియో గేం డెవెలెప్మెంటు, అనిమేషన్ స్టడీస్, టెలివిజన్ ప్రొడక్షన్, సినిమా ఆఫ్ కెనడా (సినిమా పరిశ్రమ) లకు ప్రధానకేంద్రంగా ఉంది. నగరంలో లైఫ్ స్టైల్, హెల్త్ కల్చర్‌కు కేంద్రంగా ఉంది. నగరంలో లులూలెమన్, కిట్ అండ్ ఏస్, మౌంటెన్ ఎక్విప్మెంట్ కో- ప్, హర్చెల్ సప్లై కో, రియిగ్నింగ్ చాంప్, నేచుర్స్ పాత్ ఆర్గానిక్ ఫుడ్ స్థాపించబడి వాంకోవర్ నగరంలో ప్రధానకార్యాలయాలు ఏర్పాటుచేసుకున్నాయి. ప్రకృతి సౌందర్యంతో అలరారే వాంకోవర్ నగరం పలువురు పర్యాటకులకు ఆకర్షణీయమైన గమ్యంగా మారింది.పర్యాటకులు అధికంగా నగరంలోని స్టాన్లీ పార్క్, క్వీన్ ఎలిజెబెత్ పార్క్ (బ్రిటిష్ కొలంబియా), వాందుసేన్ బొటానికల్ గార్డెన్, పర్వతాలు, మహాసముద్రం, అడవి, నగరమంతా విస్తరించి ఉన్న పార్కులను సందర్శిస్తుంటారు. ప్రతిసంవత్సరం ఒక మిలియన్ కంటే అధికమైన ప్రజలు అలాస్కా వెళ్ళేదారిలో క్రూసీలద్వారా వాంకోవర్ చేరుకుంటారు. కెనడాలో ఖరీదైన నివాసగృహాలు కలిగిన వాంకోవర్ ప్రత్యేకత సంతరించుకుంది. 2012 లో డెమోగ్రఫియా ప్రపంచంలో జీవించడానికి కష్టమైన నగరాలలో వాంకోవర్ ద్వితీయ స్థానంలో ఉందని వర్గీకరించింది. నివాసగృహాల ధరలు తగ్గించడానికి కోపరేటివ్ హౌసింగ్, చట్టబద్ధమైన సెకండరీ సూట్లు, సాధ్రత అభివృద్ధి, స్మార్ట్ గ్రోత్ వంటి విధానాలు చేపట్టింది. 2010 ఏప్రిల్ గణాకాలను అనుసరించి వాంకోవర్ నగరంలో టూ- లెవల్ హోం సరాసరి విక్రయం ధర 9,87,500 అమెరికండాలర్లకు చేరింది. కెనడియన్ సరాసరి 3,65,141 అమెరికన్ డాలర్లు. 1990 నుండి కెనడా కండోమినియాలు అభివృద్ధిచెందాయి. 1997 లో మునుపటి బ్రిటిష్ కాలనీగా ఉన్న హాంగ్ కాంగ్ నగరం తిరిగి చైనాకు అప్పగించడానికి ముందుగా వాంకోవర్ నగరానికి వలసప్రజలుగా ప్రవేశించిన వారి కొరకు నివాసగృహాలు నిర్మించబడ్డాయి. ఇలాంటి నివాసగృహాలు యేల్‌టౌన్, కోయల్ హార్బర్ జిల్లాలు, స్కై ట్రైన్ (వాంకోవర్) స్టేషంస్‌ (డౌన్ టౌన్ తూర్పు) ప్రాంతాలలో అధికంగా అభివృద్ధి చేయబడ్డాయి. " 2010 వింటర్ ఒలింపిక్స్ "కు ఆతిథ్యం ఇచ్చిన నగరాలలో వాంకోవర్ ఒకటి. ఇది వాంకోవర్ ఆర్థికరంగం అభివృద్ధిచెందడానికి మరింత దోహదం చేసింది.ఒలింపిక్స్ సమయంలో నివాసగృహాల కొరత తీవ్రత ప్రస్పుటంగా కనిపించింది. ఈ సమయంలోనే నగరంలో తక్కువ ఆదాయం ఉన్న వారికొరకు నిర్వహించబడుతున్న హోటళ్ళు, ప్రాపర్టీ యజమానులు అధికాదాయం ఉన్నవారిని, పర్యాటకులను ఆకర్షించడానికి ప్రయత్నించారు. వాంకోవర్ నగరంలో జరిగిన మరొక అంతర్జాతీయ ఉత్సవం " ఎక్స్పో 86 " (1986 వరల్డ్ ఎక్స్పొజిషన్) సమయంలో 20 మిలియన్ల పర్యాటకులు వాంకోవర్ నగరానికి చేరుకున్నారు. ఈ ఎక్స్పొజిషన్ కెనడాకు 3.7 అమెరికన్ డాలర్ల ఆదాయం అధికంగా సమకూర్చింది. ఎక్స్పొజిషన్‌లో భాగంగా నిర్మించబడిన పబ్లిక్ ట్రాంసిస్ట్, కెనడా ప్యాలెస్ ఇప్పటికీ నగరానికి ప్రత్యేకతలుగా ఉన్నాయి.

ప్రభుత్వం

వాంకోవర్ 
B.C. Place reflected in False Creek

బ్రిటిష్ కొలబియాలోని ముంసిపాలిటీలలో వాంకోవర్ నగరం ముందుగా కార్పొరేషన్ చేయబడింది. వాంకోవర్ నగర పాలన 11 సభ్యుల " వాంకోవర్ సిటీ కౌంసిల్ ", 9 మంది సభ్యుల స్కూల్ బోర్డ్, 7 గురు సభ్యుల " వాంకోవర్ పార్క్ బోర్డ్ " నిర్వహిస్తున్నాయి. సభ్యులు ఎన్నిక మూడు సవత్సరాలకు ఒకమారు నిర్వహించబడుతుంటాయి. sఅంపన్నులు అధికంగా నివసించే పశ్చిమ వాంకోవర్‌ వాసులు " కంసర్వేటివ్ " లేక లిబరల్ పార్టీలకు ఓటువేస్తుండగా తూర్పు ప్రాంతం వాసులు " లెఫ్ట్ వింగ్ " పార్టీకి ఓటు వేస్తుంటారు. ఇది 2005 బ్రిటిష్ కొలంబియా జనరల్ ఎలెక్షన్, 2006 కెనడియన్ ఫెడరల్ ఎలెక్షన్ ఫలితాలలో పునరిద్ఘాటితం అయ్యాయి.

వాంకోవర్ 
Vancouver City Hall

రాజకీయ విభేదాలకు అతీతంగా వాంకోవర్ నగరసమస్యల విషయంలో ఏకాభిప్రాయంగా స్పందించడం విశేషం. అర్బన్ పార్కుల సంరక్షణ, ఫ్రీవేవిధానానికి ప్రతిగా రాపిడ్ ట్రాంసిస్ట్ అభివృద్ధి, డ్రగ్ ఉపయోగం అడ్డగించడం కమ్యూనిటీ ఆధారిత అభివృద్ధి కొరకు కృషిచేయడం మొదలైన విషయాలకు ఏకాభిప్రాయ ప్రకటన ఇందుకు ఒక ఉదాహరణ. 2008 వాంకోవర్ మునిసిపల్ ఎన్నికల పోరాటంలో ఎన్.పి.ఎ. పార్టీ చేత అధికారంలేని " శాం సుల్లివన్ " మేయర్ కాండిడియేట్‌గా తొలగించబడి బదులుగా పీటర్ లాండర్ సరికొత్త మేయర్ కాండిడియేట్‌గా ఎన్నిక చేయబడ్డాడు.వాంకోవర్ - ఫెయిర్‌వ్యూ మునుపటి ఎం.ఎల్.ఎ. హ్యాపీ ప్లానెట్ అధ్యక్షుడు గ్రేగర్ రాబర్ట్సన్ విషన్ వాంకోవర్ మేయర్ కాండిడియేట్ ఎన్నికచేయబడ్డాడు. విషన్ వాంకోవర్ కాండిడియేట్ గ్రేగర్ రాబర్ట్సన్‌ను షుమారైన మెజారిటీతో (20,000 ఓట్ల తేడాతో) లాండర్ ఓడించాడు. అయినప్పటికీ విషన్ వాంకోవర్ 10 కౌంసిలర్ స్థానాలలో 7 స్థానాలలో విజయం సాధించారు. మిగిలిన మూడు స్థానాలలో సి.ఒ.పి.ఇ. రెండు స్థానాలు, ఎన్.పి.ఎ. ఒకస్థానంలో విజయం సాధించారు. స్కూల్ ట్రస్టీ స్థానాలలో నాలుగు స్థానాలు విషన్ వాంకోవర్, మూడు స్త్యానాలు సి.ఒ.పి.ఇ. రెండు స్థానాలు ఎన్.పి.ఎ. సాధించాయి.

ప్రాంతీయ ప్రభుత్వం

మహానగర వాంకోవర్‌లో వాంకోవర్ మునిసిపాలిటీ భాగంగా ఉంది. మాహానగర వాంకోవర్ లోని సభ్యులందరికీ ప్రత్యేక పాలితవర్గం ఉంటుంది. " మెట్రో వాంకోవర్ ఓవర్సీస్ కామన్ సర్వీసెస్ అండ్ ప్లానింగ్ " ప్రజలకు అవసరమైన త్రాగునీరు, మురుగునీరు, చెత్త నిర్వహణ, రీజనల్ పార్కుల నిర్వహణ, వాయుపరిశుభ్రత నిర్వహణ, గ్రీన్ హౌసెస్ గ్యాసెస్, పర్యావరణ పరిరక్షణ, ప్రాంతీయ అభివృద్ధి, భూభాగ ఉపయోగం మొదలైన సౌకర్యాలను అందిస్తుంది.

ప్రాంతీయ, ఫెడరల్ పాలన

వాంకోవర్ " ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా "లో 11 మంది లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు (ఎం.ఎల్.ఎ) ఉంటారు. 2016 గణాంకాలను అనుసరించి వీటిలో 4 స్థానాలను బ్రిటిష్ కొలంబియా లిబరల్ పార్టీ ఆధీనం లోనూ, 7 స్థానాలు బ్రిటిష్ కొలంబియా న్యూ డెమొక్రటిక్ పార్టీ ఆధీనం లోనూ ఉన్నాయి." ది హౌస్ ఆఫ్ కొలంబియా కెనడా " (వాంకోవర్) లో 6 మంది సభ్యులు ఉంటారు. సమీపకాలంలో నిర్వహించబడిన " కెనడియన్ ఫెడరల్ ఎలెక్షన్ 2015 "లో లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా వాంకోవర్ క్వాద్రా, వాంకోవర్ సెంటర్ స్థానాలపై విజయం సాధించింది. వాంకోవర్ ఈస్ట్, వాంకోవర్ కింగ్స్వే స్థాలపై న్యూ డెమొక్రటిక్ పార్టీ విజయం సాధించాయి. ఈ ఎన్నికలలో కంసర్వేటివ్ పార్టీ ఆఫ్ కెనడా పూర్తిగా విఫలం అయింది. ప్రస్తుతం వాంకోవర్ నగరం నుండి అటార్నీ జనరల్‌ ఆఫ్ కెనడా పదవికి జోడీ విల్సన్- రేబౌల్డ్, హర్జిత్ సజ్జన్ నేషనల్ డిఫెంస్ మంత్రిగా నియమించబడ్డాడు.

పోలీస్, నేరం

వాంకోవర్ పోలీస్ డిపార్ట్మెంటులో 1,174 సభ్యులు ఉన్నారు. 2005 లో పోలీస్ డిపార్ట్మెంటు నిర్వహణ వ్యయం 149 మిలియన్ల అమెరికండాలర్లు. 2005 నగర ఆర్థిక ప్రణాళికలో 16% పోలీస్ నిర్వహణ కొరకు వ్యయం చేయబడుతుంది. " ది వాంకోవర్ పోలిస్ డిపార్ట్‌మెంట్ ఆపరేషనల్ " విభాగంలో " పోలీస్ బైసైకిల్ " (బైసైకిల్ స్క్వాడ్), " వాటర్ పోలీస్ " (మారిన్ స్క్వాడ్), " పోలీస్ డాగ్ " (డాగ్ స్క్వాడ్) అంతర్భాగంగా ఉన్నాయి. ఇందులోపోలీస్ మౌంటెడ్ (మౌంటెడ్ స్క్వాడ్) కూడా ఉంది. ఇది ముందుగా స్టాన్లీ పార్క్ పెట్రోల్, డౌన్‌టౌన్ ఈస్ట్ అండ్ వెస్ట్, క్రౌడ్ కంట్రోల్ కొరకు ఉపయోగించబడింది. పోలీస్ సివిలియన్ కంజెక్షన్, వాలంటీర్ల నిర్వహణలో ఉన్న పోలీస్ సెంటర్లలో పనిచేస్తుంటారు. 2006 లో పోలీస్ డిపార్ట్మెంటు " కౌంటర్ టెర్రరిజం " (కౌంటర్ టెర్రరిజం యూనిట్) స్థాపించింది. 2005లో న్యూ ట్రాంసిస్ట్ పోలీస్ ఫోర్స్, ది గ్రేటర్ వాంకోవర్ ట్రాంస్‌పోర్టేషన్ అథారిటీ పోలీస్ సర్వీస్ (ప్రస్తుత సౌత్ కోస్ట్ బ్రిటిష్ కొలంబియా ట్రాంస్‌పోర్టేషన్ అథారిటీ పోలీస్ సర్వీస్) స్థాపించబడ్డాయి. చట్టవిరుద్ధం అయినప్పటికీ వాంకోవర్ పోలీస్ స్వల్పంగా కన్నాబిస్ ( మార్జునా) మొదలైన డ్రగ్ ఉంచుకున్న వారిని సాధారణంగా ఖైదు చేయదు. 2000లో వాంకోవర్ పోలీస్ డిపార్ట్మెంటు గ్రోబస్టర్స్ అనే స్పెషలైజ్డ్ డ్రగ్ స్క్వాడ్ స్థాపించబడింది. మార్జునా నియంత్రణ కొరకు చేపట్టిన ఇలాంటి కార్యక్రమాలు తీవ్రంగా విమర్శలను ఎదుర్కొన్నాయి. అత్యధికంగా నేరాలు జరుగుతున్న కెనడియన్ నగరాలలో వాంకోవర్ 7వ స్థానంలో ఉంది. అయినప్పటికీ వాంకోవర్ నగరంలో నేరాలు క్రమంగా తగ్గాయి. ఆస్తివ్యవహార నేరాలలో ఉత్తర అమెరికా నగరాలలో వాంకోవర్ ప్రథమస్థానంలో ఉంది. అయినప్పటికీ 2004 -2005 మద్య ఆస్థిసంబంధిత నేరాలు వాంకోవర్ నగతంలో 10.5% తగ్గింది. 2006 వాంకోవర్ మహానగరంలో గన్ సంబంధిత నేరాలు కెనడియన్ మహానగరాలన్నింటిని అధిగమించాయి. వాంకోవర్‌లో 1,00,000 మందికి 45.3 గన్ సంబంధిత నేరాలు నమోదయ్యాయి. కెనడాసరాసరి 27.5. " 2009 వాంకోవర్ గ్యాంగ్ వార్ "లో వరుసగా తుపాకికాల్పుల నేరాలు సంభవించాయి.

సమావేశాల ఆతిథ్యం

వాంకోవర్ " ఆసియా- పసిఫిక్ ఎకనమిక్ కోపరేషన్ ", క్లింటన్- యెల్ట్సిన్ సమ్మిట్, (సింఫోనీ ఆఫ్ ఫైర్ ) సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చింది. వీటికి పోలీస్ రక్షణ గణనీయమైన పాత్రవహిస్తుంది. " 1994 స్టాన్లీ- కప్ " సమయంలో అదుపుతప్పిన అల్లర్లలో 200 మంది ప్రజలు గాయపడ్డారు. " 2011 స్టాన్లీ కప్ ఫైనల్లో తిరిగి అల్లర్లు చోటుచేసుకున్నాయి.

Military

వాంకోవర్‌లోని జెరిచో బీచ్‌లో కెనడియన్ ఆర్మీకి చెందిన " 39 కెనడియన్ బ్రిగేడ్ గ్రూప్ " ప్రధానకార్యాలయం ఉంది. లోకల్ ప్రైమరీ రిజర్వ్ యూనిట్స్‌లో " ది సీఫోర్ట్ హైలాండర్స్ ఆఫ్ కెనడా " ( సీఫోర్త్ ఆర్మౌరీ), "ది బ్రిటిష్ కొలంబియా రెజిమెంట్ " (బీటీ స్ట్రీట్ డ్రిల్ హాల్), 15 వ ఫీల్డ్ రెజిమెంట్ (రాయల్ కెనడియన్ ఆర్టిల్లరీ) విభాగాలు ఉన్నాయి. ది నావల్ రిజర్వ్ యూనిట్ స్టాన్లీ పార్క్‌ లోని డెడ్‌మాన్స్ ఐలాండ్‌లో ఉంది. వెస్టర్న్ కెనడాలోని మొదటి ఎయిర్ బేస్ ఆర్.సి.ఎఫ్. స్టేషన్ (జెరికో బీచ్)ను 1947లో ఆధిపత్యం " కెనడియన్ ఫోర్స్ లాండ్ ఫోర్స్ కమాండ్ " వశమైంది. 1969లో వాంకోవర్ నగరానికి తరలించబడింది. తరువాత ఈ ప్రాంతానికి " జెరికో పార్క్ " అని నామాంతరం చేయబడింది.

గణాంకాలు

వాంకోవర్ 
The Marine Building, built in 1929, an example of Art Deco architecture from the era
వాంకోవర్ 
Inuksuk at English Bay

2011 కెనడా గణాంకాల ఆధారంగా నగర జనసంఖ్య 6,03,000 కంటే అధికం. జనసంఖ్యా పరంగా వాంకోవర్ కెనడాలోని 100 పెద్ద మునిసిపాలిటీలలో ఒకటిగానూ 8 వ అత్యధిక జనసంఖ్య కలిగిన నగరంగానూ గుర్తించబడుతుంది. పశ్చిమ కెనడాలో వాంకోవర్ 4వ స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాలలో కల్గరీ, ఎడ్మొంటన్, విన్నిపెగ్ నగరాలు ఉన్నాయి. మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని గ్రేటర్ వాంకోవర్ అంటారు. మహానగర నివాసితుల సంఖ్య 2.4 మిలియన్లు. జనసంఖ్యాపరంగా వాంకోవర్ కెనడాలోని 100 అతిపెద్ద మహానగర ప్రాంతాలలో ఒకటిగా ఉంది. అలాగే జనసాంధ్రతాపరంగా వాంకోవర్ కెనడాలో 3వ మహానగప్రాంతంగా ఉంది. అంతేకాక పశ్చిమ కెనడాలో అత్యంత జనసాంధ్రత కలిగిన నగరంగా గుర్తించబడుతుంది.లార్జెర్ లోవర్ మెయిన్ లాండ్ (స్క్వామిష్ - లిలోయట్,ఫ్రాసర్ వెల్లీ సన్ షైన్ రీజనల్ డిస్ట్రిక్ కలిసిన మొత్తం ప్రాంతం) జనసంఖ్య 2.93 మిలియన్లు. జనసాంధ్రత చ.కి.మీ. 5,249.కలిగిన వాంకోవర్ అత్యంత జనసాంధ్రత కలిగిన కెనడియన్ ముంసిపాలిటీగా గుర్తించబడుతుంది. వాంకోవర్ మహానగరంలో జనసంఖ్యలో 74% ప్రజలు నగరానికి వెలుపలి ప్రాంతంలో నివసిస్తున్నారు. వాంకోవర్‌ను " సిటీ ఆఫ్ నైబర్‌హుడ్ ". వాంకోవర్ నగరంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కొక సంప్రదాయానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. కనుక ప్రాంతానికి ప్రాంతానికి విభిన్నత ఉంటుంది. నగరంలోని ప్రజలలో ఇంగ్లీష్, స్కాటిష్, ఐరిష్ సంప్రదాలు పెద్ద సంఖ్యలు కలిగిన సమూహాలుగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో (ప్రత్యేకంగా సౌత్ గ్రాన్‌విల్లే, కెర్రీస్డేల్) బ్రిటిష్ సొసైటీ, సంస్కృతి మూలాలు కనిపిస్తుంటాయి. వాంకోవర్ నగరంలో సంఖ్యాపరంగా జర్మన్లు యురేపియన్లలో రెండవ స్థానంలో ఉన్నారు. 1914 లో రెండవ ప్రపంచ యుద్ధం ఆరభం అయిన తరువాత అంతర్జాతీయంగా జర్మన్ వ్యతిరేకత అధికరించే వరకు జర్మన్లు సాంఘికంగా, ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం నగరంలో చైనీయులు అధికంగా కనిపిస్తుంటారు. వీరు కాంటొనెస్, మాండరిన్ భాషలు మాట్లాడుతుంటారు. వాంకోవర్ నగరంలో చైనా టౌన్, పంజాబీ మార్కెట్ (వాంకోవర్), లిటిల్ ఇటలీ, గ్రీన్ టౌన్ (వాంకోవర్), జపాన్ టౌన్ (వాంకోవర్) మొదలైన వైవిధ్యమైన ప్రాంతాలు ఉన్నారు. 1980 నుండి వలసలు అధికం అయ్యాయి. వలసలు నగరంలో సంప్రదాయ సమూహాలను, భాషలను అధికం చేసాయి. నగరంలో ఆంగ్లం ధారాళంగా మాట్లాడలేని ప్రజలు 52% ఉన్నారు. హాన్ చైనీస్ వమ్శానికి చెందిన ప్రజలు నగరంలో 30% ఉన్నారు. 1980 లో యునైటెడ్ నుండి హాంగ్‌కాంగ్‌కు పూర్తి స్వతంత్రం కోరుతూ హాంగ్ కాంగ్ నుండి ప్రజలు వరదగా వచ్చిచేరారు. ప్రధాన చైనాభూభాగం, తైవాన్ ప్రజలతో కలిసి వాంకోవర్నగరంలో చైనీయుల సంఖ్య ప్రథమస్థానంలోకి చేరింది.ఉత్తర అమెరికాలో చైనీయులు అత్యధికంగా ఉన్న నగరంగా వాంకోవర్ నగరానికి ప్రత్యేకత ఉంది. తరువాత అంతర్జాతీయంగా వలసప్రజలు వాంకోవర్‌కు వస్తూనే ఉన్నారు. కెనడాలో వలసప్రజలు అధికంగా ఉన్న నగరాలలో వాంకోవర్ ద్వితీయస్థానంలో ఉంది. మొదటి స్థానంలో టొరంటో ఉంది. వాంకోవర్ నగరంలో నివసిస్తున్న దక్షిణాసియన్లలో పంజాబీలో అధికంగా ఉన్నారు. నగరంలో ఇండో కెనడియన్లు (5.7%), ఫిలిప్పినో కెనడియన్లు 5%, జపానీస్ కెనడియన్లు 1.7%, కొరియన్ కెనడియన్లు 1.5%, అలాగే గుర్తించతగినంత వియత్నామీయులు, ఇండోనేషనీయులు, కంబోడియన్ కెనడియన్లు ఉన్నారు. 1980 - 1990 వరకు లాటిన్ అమెరికన్ల వలస అధికం అయినప్పటికీ సమీపకాలంలో అది తగ్గింది. ఆఫ్రికన్ అమెరికన్ల శాతం 3.6%_3.3% ఉంది. వాంకోవర్ నగరంలో బ్లాక్ కెనడియన్లు మిగిలిన కెనడియన్ నగరాలతో పోల్చితే తక్కువగా (09%) ఉన్నారు. స్ట్రాత్కోనా (వాంకోవర్) లో యూదసమూహం అధికంగా ఉంది. చైనా టౌన్ సమీపంలో ఉన్న హోగంస్ అల్లేలో నల్లజాతి ప్రజలు అధికంగా ఉన్నారు. 1981లో 7% కంటే తక్కువ ప్రజలు " విజిబుల్ మైనారిటీ " సమూహాలకు చెందినవారు ఉన్నారు. 2008 నాటికి వీరి శాతం 51%కి చేరింది. 1990 లో హాంగ్ కాంగ్ ఉద్యోగ వలసలు అధికం కాకముందు వాంకోవర్ నగరంలో బ్రిటిషేతర యురేపియన్లలో జర్మన్లు మొదటి స్థానంలో తరువాత స్థానాలలో వరుసగా ఇటాలియన్ కెనడియన్లు, ఉక్రెయిన్ కెనడియన్లు, చైనీస్ కెనడియన్లు ఉన్నారు. 1950 నుండి 1980 వరకు చాలామంది పోర్చుగీస్ కెనడియన్లు వంకోవర్ నగరానికి వలసగా వచ్చారు. 2001 నాటికి వీరి సంఖ్యాపరంగా నగరంలో మూడవ స్థానానికి చేరింది. తూర్పు యురేపియన్ ప్రజలలో యుగస్లేవియా, రష్యన్, స్జెచ్స్, పోలండ్, రోమానియన్లు, హంగేరియన్లు (మగ్యర్లు ) వలసగా వచ్చి చేరారు. వీరి రాకకు రెండవ ప్రపంచయుద్ధం తరువాత తూర్పు ఐరోపా ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకోవడం ప్రధాన కారణం అయింది. 1960 - 1970లో గ్రీక్ వలసలు అధికం అయ్యాయి. వీరు కిట్సిలానో ప్రాంతంలో కేంద్రీకృతం అయ్యారు. వాంకోవర్ నగరంలో 11,000 కెనడియన్ స్థానిక ప్రజలు ఉన్నారు. వాంకోవర్ నగరంలో గే కమ్యూనిటీ అధికంగా ఉన్నారు. వీరు అధికంగా పశ్చిమతీరంలోని డేవీ వీధి (సమీపకాలంలో దీనిని డేవీ గ్రామంగా చేసారు) లో ఉన్నారు. క్రమంగా గే సమూహాలు పశ్చిమతీరం, యేల్ టౌన్ ప్రాంతాలలో విస్తరించారు. వాంకోవర్ నగరం వార్షికంగా " గ్రే ప్రైడ్ పేరేడ్ "కు అతిథ్యం ఇస్తుంది.

Vancouver
సంవత్సరంజనాభా±%
189113,709—    
190126,133+90.6%
19111,00,401+284.2%
19211,17,217+16.7%
19312,46,593+110.4%
19412,75,353+11.7%
19513,44,833+25.2%
19563,65,844+6.1%
19613,84,522+5.1%
19664,10,375+6.7%
19714,26,256+3.9%
19764,10,188−3.8%
19814,14,281+1.0%
19864,31,147+4.1%
19914,71,644+9.4%
19965,14,008+9.0%
20015,45,671+6.2%
20065,78,041+5.9%
20116,03,502+4.4%
Canada 2006 Census Population
Visible minority group
Source:
చైనీయులు 182,230
దక్షిణాసియన్లు 35,140
నల్లజాతీయులు 5,720
ఫిలిప్పైన్లు 35,490
లాటిన్ అమెరికన్లు 9,595
అరబ్ కెనడియన్లు 2,975
ఈశాన్య ఆసియన్లు 17,870
పశ్చిమాసియన్లు 6,885
కొరియన్లు 8,780
జపానీయులు 10,080
ఇతర అల్పసంఖ్యాకులు 1,175
మిశ్రిత అల్పసంఖ్యాకులు 8,680
మొత్తం అల్పసంఖ్యాకులు 305,615
స్థానిక ప్రజలు
Source:
First Nations 7,865
మెటిస్ ; కెనడా ప్రజలు 3,595
Inuit ఇన్యుయిట్ 70
Total Aboriginal population 11,945
European Canadian 272,645
Total population 590,205

విద్య

వాంకోవర్ 
Aerial view of the University of British Columbia

" వాంకోవర్ స్కూల్ బోర్డ్ "లో ప్రాథమిక, మాధ్యమిక, పోస్ట్ మిడిల్ స్కూల్ విద్యార్థులు అందరూ కలిపి 1,10,000 విద్యార్థులు ఉన్నారు. ఇది వాంకోవర్‌ను ఈ ప్రొవింస్‌లో ద్వీతీయ స్కూల్ డిస్ట్రిక్‌ను చేసింది. స్కూల్ జిల్లా నిర్వహణలో 74 ప్రాథమిక పాఠశాలలు, 17 ఎలిమెంటరీ అన్నెక్షెస్, 18 సెకండరీ స్కూల్స్, 7 అడల్ట్ ఎజ్యుకేషన్ సెంటర్స్, 2 వాంకోవర్ లాన్ నెట్వర్క్ స్కూల్స్ (వీటిలో ఫ్రెంచ్ ఇమ్మెర్షన్, మాండరిన్, ఫైన్ ఆర్ట్స్, మాంటసోరీ స్కూల్స్) ఉన్నాయి. నగరంలో మూడు ఫ్రాంకోఫోన్ స్కూల్స్ ఉన్నాయి; " ఎకోల్ రోస్ - డెస్ - వెంట్స్ ", ఎకోల్ అన్నె - హెబర్ట్, ఎకోల్ సెకండరీ జూలెస్- వర్నె. 46 కంటే అధికంగా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో నగరంలోని 10% విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వాంకోవర్ మహానగరంలో 5 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 2008 గణాంకాల ఆధారంగా వీటిలో యూనివర్శిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా (యు.బి.సి), సైమన్ ఫ్రాసర్ యూనివర్శిటీలలో (ఎస్.ఎఫ్.యు) 90,000 మంది అండర్ గ్రాజ్యుయేట్స్, గ్రాజ్యుయేట్స్, ప్రొఫెషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. యు.బి.సి ప్రపంచంలో 40 ఉత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా, 20 అంతర్జాతీయ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా గుర్తింపు ఉంది. ఎస్.ఎఫ్.యు. కెనడాలో కాంప్రహెంసివ్ యూనివర్శిటీలలో ఒకటి, 200 ఉత్తమ అంతర్జాతీయ. యూనివర్శిటీలలో ఒకటి అనే గుర్తింపు ఉంది. నగరంలో అదనంగా యు.బి.సి. మెయిన్ కాంపస్ పాయింట్ గ్రే ప్రాంతంలో " యూనివర్శిటీ ఎండోన్మెంట్ లాండ్ " వద్ద ఉంది. ఎస్.ఎఫ్.యు. మెయిన్ కాంపస్ బర్నబే ప్రాంతంలో ఉంది. రెండు యూనివర్శిటీలకు వాంకోవర్ డౌన్ టౌన్, సుర్రే వద్ద కాంపస్‌లు ఉన్నాయి. ఉత్తర వాంకోవర్‌లో కాపిలానో యూనివర్శిటీ, ది ఎమిలీ కార్ యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ (గ్రాంవిల్లే దీవి ; వాంకోవర్), క్వాంటెన్ పాలిటెక్నిక్ యూనివర్శిటీ (ఇందులో నగరానికి వెలుపలి ప్రాంతాలలో 4 కాంపసులు ఉన్నాయి) ఉన్నాయి. ఈ ప్రాంతంలో 6 ప్రైవేట్ ఇంస్టిట్యూషన్లు ఉన్నాయి.అవి వరసగా లాంగ్లే వద్ద ట్రినీ వెస్టర్న్ యూనివర్శిటీ, యూనివర్శిటీ కెనడా వెస్ట్, న్యూ యార్క్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఫెయిర్ లీగ్ డికింసన్ యూనివర్శిటీ, కొలంబియా కాలేజ్, స్పోర్ట్ షా కాలేజ్.

కాలేజీలు

వాంకోవర్ కమ్యూనిటీ కాలేజ్, లంగారా కాలేజ్ వాంకోవర్‌లో ఉన్నాయి. డగ్లాస్ కాలేజీకి నగరానికి వెలుపల మూడు కాంపసులు ఉన్నాయి. బర్నబే వద్ద ఉన్న బ్రిటిష్ కొలంబియా ఆఫ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ విద్యను అందిస్తుంది. వాంకోవర్ ఫిల్మ్‌ స్కూల్ ఒక సంవత్సరకాల ఫిల్మ్‌ ప్రొడక్షన్, గేం డిజైనింగ్ ప్రోగ్రాంలు అందిస్తుంది. విదేశీ విద్యార్థులు, ప్రైవేట్ ఇంగ్లీష్ ద్వితీయ భాషగా విద్యాభ్యాసం చేసిన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలలో ప్రవేశం లభిస్తుంది. 2008-2009 విద్యాసంవత్సరంలో వాంకోవర్ నగరంలోని 52% విద్యార్థులు తమ గృహాలలో ఆంగ్లేతర భాష మాట్లాడుతుంటారు.

Arts and culture

Theatre, dance and film

వాంకోవర్ 
The Vogue Theatre on Granville Street

వాంకోవర్‌లో ఆర్ట్స్ క్లబ్ దియేటర్ కంపెనీ (గ్రాంవిల్లే ద్వీపం), బీచ్ వద్ద బార్డ్ వంటి ప్రముఖ ఉన్నాయి. అదనంగా టచ్‌స్టోన్ దియేటర్, స్టూడియో 58 మొదలైన చిన్నకంపెనీలు ఉన్నాయి. ది కల్చ్, ది ఫైర్ హాల్ ఆర్ట్స్ సెంటర్, యునైటెడ్ ప్లేయర్స్, ది పసిఫిక్ దియేటర్, మెట్రో దియేటర్ అన్నీ దియేటర్ సీజన్‌లో నిరాటంకంగా నిర్వహించబడుతుంటాయి. దియేటర్ అండర్ ది స్టార్స్ స్టాన్లీ పార్క్ లోని మాల్కిన్ బో వద్ద వేసవి కాలంలో షోలు నిర్వహిస్తుంటారు. పుష్ ఇంటర్నేషనల్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెస్టివల్ (జనవర్), వాంకోవర్ ఫ్రింజ్ ఫెస్టివల్ (సెప్టెంబర్) మొదలైన సందర్భాలలో వార్షిక ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి. 50 సంవత్సరాల కాలం నిర్వహించబడిన " ది వాంకోవర్ ప్లే హౌస్ దియేటర్ " 2012 మార్చిలో మూసివేయబడింది. " ది స్కాటియా బ్యాంక్ డాంస్ సెంటర్ " ఇది గ్రాంవిల్లే, డావీ మూలలో ఉంది. ఇది ఒకప్పుడు బ్యాంక్ ఉండేది తరువాత దీనిని డాంస్ సెంటర్‌గా మార్చారు. ఇది ఒక కూడలి ప్రదేశం, ప్రదర్శన ప్రాంతంగా ఉంది. ఇక్కడ ఉన్న చిన్న వేదిక మీద వాంకోవర్ నృత్యకారులు, నృత్యదర్శకులు ప్రర్శనలు ఇస్తూ ఉంటారు. " ది వాంకోవర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ సెంటర్ " వెన్యూ, దివాంసిటీ దియేటర్ ఆర్ట్ ఫిలింస్ ప్రదర్శించబడుతుంటాయి.

చలనచిత్రాలు

వాంకోవర్‌కు " హాలీవుడ్ నార్త్ " అనే ప్రత్యేకత ఉంది. ఇది చలనచిత్రాల చిత్రీకరణకు ప్రధా కేంద్రంగా మారింది. వాంకోవర్ నగరం పలు ప్రముఖ చలనచిత్రాలు, టి.వి. సిరీస్‌లలో కనిపిస్తుంటుంది. వాంకోవర్ నగరం, వెలుపల పలు ప్రముఖ చిత్రాల విత్రీకరణ జరిగింది. 1989 లో " కజిన్ " హాస్యప్రధాన ప్రేమకథా చితం వాంకోవర్‌లో నిర్మించబడింది. ఈ చిత్రంలో టెడ్ డాంసన్, ఇస్బెల్లా నటించారు.1994లో రిచర్డ్ గెరె, షరాన్ స్టోన్ నటించిన యు.ఎస్ థ్రిల్లర్ చిత్రం " ఇంటర్‌సెక్షన్ " చిత్రీకరణ వాంకోవర్ నగరంలో జరిగింది. 2007 లో టెర్రీ చెరియన్, జెయిమె కింగ్ నటించిన కెనడియన్ గోస్ట్ థ్రిల్లర్ " దే వెయిట్ " వాంకోవర్ నగరంలో నిర్మించబడింది. ప్రముఖ కెనడియన్ మాక్యుమెంటరీ " హార్డ్ కోర్ లోగో " వాంకోవర్‌లో చిత్రీకరించబడింది. ఈ చితం 15 సంవత్సరకాలంలో ద్వితీయ కెనడియన్ చిత్రంగా గుర్తించబడింది. సూపర్ నేచురల్ (యు.ఎస్.టి.వి), ది 100 (టి.వి. సీరియల్), అర్రో (టి.వి), ది ఫ్లాష్, అన్ రియల్ ది ఎక్స్ ఫైల్స్ మొదలైన టి.వి. షోలు వాంకోవర్ నగతంలో చిత్రీకరించబడ్డాయి.

గ్రంధాలయాలు, మ్యూజియంలు

వాంకోవర్‌లో " వాంకోవర్ పబ్లిక్ లైబ్రరీ " ప్రధాన శాఖ లైబ్రరీ స్క్వేర్‌లో ఉంది. దీనిని " మోషే సఫ్డీ " రూపొందించాడు. ప్రధాన శాఖలో 1.5 మిలియన్ల గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలయానికి ఉన్న 24 శాఖలలో మొత్తం 2.25 మిలియన్ల గ్రంథాలు ఉన్నాయి. కెనడా మొదటి టూల్ లెండింగ్ లైబ్రరీ " ది వాంకోవర్ టూల్ లైబ్రరీ " వాంకోవర్ నగరంలో ఉంది.

వాంకోవర్ 
The Vancouver Art Gallery, formerly the Provincial Courthouse

మ్యూజియంలు

ది వాంకోవర్ ఆర్ట్ గ్యాలరీ "లో 10,000 కళాఖండాలు భద్రపరచబడి ఉన్నాయి. ఇక్కడ ఎమిలీ కార్ కళాఖండాలు అత్యధికంగా భద్రపరచబడి ఉన్నాయి. డౌన్ టౌన్‌లో " కాంటెంపరీ ఆర్ట్ గ్యాలరీ (వాంకోవర్) (కాగ్) ఉంది. ఇక్కడ వర్ధమాన వాంకోవర్ కళాకారుల కళాఖండాలు ప్రదర్శించబడుతూ ఉంటాయి.కిట్సిలానో జిల్లాలో వాంకోవర్ మేరీటైం మ్యూజియం, ది హెచ్.ఆర్. " మాక్మిల్లన్ స్పేస్ మ్యూజియం " కెనడాలో అతి పెద్ద సివిక్ మ్యూజియంగా గుర్తించబడుతుంది. యు.బి.సి. వద్ద ఉన్న " ది మ్యూజియం ఆఫ్ ఆంథ్రోపాలజీ " పసిఫిక్ వాయవ్య తీరంలో ఫస్ట్ నేషన్స్ సంస్కృతి సంబంధిత అతిపెద్ద మ్యూజియంగా గుర్తించబడుతుంది. ఫాల్స్ క్రీక్ వద్ద సైన్సు వరల్డ్ ఉంది. నగరంలో వైద్యమైన కళాఖండాలు సేకరించబడి ఉన్నాయి.

విష్యుయల్ ఆర్ట్స్

వాంకోవర్ స్కూల్ ఆఫ్ కాన్సెప్చ్యూల్ ఆర్ట్స్ ఫొటోగ్రఫీ (ఫొటోకాంసెప్చ్యుయలిజం)కి చెందిన కళాకారులు 1980 నుండి అంతర్జాతీయ గర్తింపు కలిగి ఉన్నారు. ఈ బృందంలో జెఫ్ వాలేస్, కెన్ లం, రాయ్ ఆర్డెన్ . స్టాన్ డగ్లాస్, రీడ్నీ గ్రహం మొదలైన ప్రముఖ కళాకారులు ఉన్నారు.

సంగీతం, రాత్రిజీవితం

వాంకోవర్ నగరంలో ప్రధానంగా క్లాసికల్ (సంప్రదాయ), జానపద, పాపులర్ సంగీతప్రదర్శనలు జరుగుతుంటాయి. వాంకోవర్ నగరంలో " ది వాంకోవర్ సింఫోనీ ఆర్కెస్ట్రా ", " వాంకోవర్ ఒపేరా ", " సిటీ ఒపేరా ఆఫ్ వాంకోవర్ " మొదలైన ప్రముఖ సంగీతప్రదర్శనా సంస్థలు ఉన్నాయి.

సంగీత రూపకర్తలు

నగరంలో కెనడియన్ సంగీతరూపకల్పకులలో రోడ్నీ షర్మన్, జెఫ్రీ ర్యాన్, జోస్లిన్ మొర్లాక్ మొదలైన వారు ప్రాధానూతవహిస్తున్నారు.

వాంకోవర్ 
The Granville Entertainment District downtown can attract large crowds to the street's many bars and nightclubs.

నగరంలో పలు పంక్ రాక్ బాండ్లు ఉన్నాయి. డి.ఒ.ఎ, సుభుమంస్, ది యంగ్ కెనడియంస్, ది పాయింటెడ్ స్టిక్స్, యు.జె 3 ఆర్.కె 5 మొదలైన పంక్ బాండ్స్ ఉన్నాయి. 1990 లో ఆల్టర్నేటివ్ రాక్ ప్రాబల్యత సంతరించుకున్న తరువాత 54-40, ఓడ్స్, మాయిస్ట్స్, ది మాత్యూ గుడ్ బాండ్, సంస్ ఆఫ్ ఫ్రీడం, ఎకోనోలైన్ క్రష్ మొదలైన సంస్థలు తలెత్తాయి. సమీపకాలంలో గాబ్ బాండ్, మారియంస్ ట్రెంచ్ బాండ్, తియరీ ఆఫ్ ఏ డెడ్‌మాన్, స్టాబిలో బాండ్ మొదలైన సంస్థలు విజయవంతమై ప్రాబల్యత సంతరించుకున్నాయి.

ఇండిపెండెంట్ బాండ్స్

ప్రస్తుతం వాంకోవర్ నగరంలో ది న్యూ పొర్నోగ్రాఫర్స్, జపాన్ డ్రాయిడ్స్, గ్రైంస్, డిస్ట్రాయర్, ఇన్ మెడియాస్ రెస్ బాండ్, తెగన్ అండ్ సారా, నెట్ వర్క్, మింట్ మొదలైన ఇండిఒఎండెంట్ బాండ్లు ఉన్నాయి.

మెటల్ బాండ్

వాంకోవర్ నగరంలో స్ట్రాపింగ్ యంగ్ లాడ్ ప్రాబల్యత సంతరించుకున్న మెటల్ బాండ్లు ఉన్నాయి. అలాగే ఎలెక్ట్రో - ఇండస్ట్రియల్ వంటి మెటల్ బాండ్లలో స్కినీ పప్పీ, నంద్, ఫ్రంట్ లైన్ ఏంబసీ వంటి పయనీరుంగ్ బాండ్లు ఉన్నాయి. అత్యున్నత పాప్ గ్రూప్ డెలెరియం బాండుకు బిల్ లీప్ నిధిసహాయం అందిస్తుంది.

సంగీత కళాకారులు

నగరంలో ప్రభావం కలిగించిన సంగీతకళాకారులలో కార్లీ రీ జెప్సెన్, బ్రియన్ ఆడంస్, సారాహ్ మెక్లాచియన్, హార్ట్ బాండ్, ప్రిజం, ట్రూపర్, చిల్లీవాక్ (బాండ్), పయోలాస్, మోయెవ్, ఇమేజెస్ ఇన్ వాగ్యూ, మైకేల్ బబ్లూ, స్టెఫ్ లాగ్, స్పిరిట్ ఆఫ్ ది వెస్ట్ ప్రాబల్యత సంతరించుకున్నారు.

సంగీతప్రదర్శనా వేదికలు

నగరంలో రోజర్స్ అరేనా, క్వీన్ ఎలిజబెత్ దియేటర్, బి.సి. ప్లేస్ స్టేడియం (పసిఫిక్ కొలోసియం) వంటి వేదికలలో బృహత్తరమైన ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. చిన్న ప్రదర్శనలు కొమ్మొడరె బాల్రూం, ది ఆర్ఫియుం దియేటర్ (వాంకోవర్), వాగ్యూ దియేటర్లలో ప్రదర్శించబడుతున్నాయి.

సంగీత ఉత్సవాలు

" ది వాంకోవర్ ఫోల్క్ మ్యూజిక్ ఫెస్టివల్ ", వాంకోవర్ ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్ లలో సంగీతప్రదర్శనలు నిర్వహించబడుతుంటాయి.

రాత్రిజీవితం

వాంకోవర్ నగరంలో ఉత్సాహవంతమైన రాత్రిజీవితం కార్యక్రమాలు ఉంటాయి. ఆహారసేవనం, బార్లు, నైట్ క్లబ్బులు ఇందులో భాగస్వామ్యం వహిస్తుంటాయి. నగరంలోని " గ్రాంవిల్లే ఎంటర్టెయిన్మెంట్ డిస్ట్రిక్‌లో కేంద్రీకృతమైన బార్లు, నైట్ క్లబ్బులు తెల్లవారు ఝాము 3 గంటలకు మూతపడుతుంటాయి. కొన్ని క్లబ్బులు వారాంతాలలో తెల్లావారే వరకు తెరిచి ఉంటాయి. ఈ వీధి వారాంతాలలో పెద్ద సంఖ్యలో ప్రజకను ఆకర్షిస్తూ ఉంటుంది.రాత్రిజీవితానికి గ్యాస్టౌన్ కూడా ప్రాబల్యత కలిగి ఉంది. ఖరీదైన హోటళ్ళు, నైట్ క్లబ్బులు, డేవీ విలేజ్ నగరంలోని ఎల్.జి.బి.టి. కమ్యూనిటీకి అభిమానకేంద్రాలుగా ఉన్నాయి.

ప్రయాణసౌకర్యాలు

వాంకోవర్ 
Vancouver's rapid transit network
వాంకోవర్ 
SkyTrain rapid transit system signage

వాంకోవర్ ట్రాం (స్ట్రీం కార్) విధానం 1890 జూన్ 28న ప్రారంభం అయింది. ఇది మొదటిసారిగా గ్రాన్‌విల్లే స్ట్రీట్ బ్రిడ్జ్ నుండి వెస్ట్‌మినిస్టర్ అవెన్యూ (ప్రస్తుతం వాంకోవర్ మెయిన్ స్ట్రీట్), కింగ్స్వే వాంకోవర్ వరకూ పయనించింది. సంవత్సరం లోపల వెస్ట్‌మినిస్టర్ ట్రాంవే కంపెనీ కెనడా మొదటి ఇంటర్‌ అర్బన్ లైన్ ప్రారంభించబడింది. 1910లో ఇది చిల్లీవాక్ వరకు పొడిగించబడింది. 1902 లో ఆరంభమైన వాంకోవర్, లులూ ఐలాండ్ రైల్వేను 1905 లో బ్రిటిష్ కొలంబియా ఎలెక్ట్రిక్ కెనడియన్ పసిఫిక్ రైల్వే లీజుకు తీసుకుంది. ఇది గ్రీన్‌వెల్లీ స్ట్రీట్ బ్రిడ్జ్ నుండి కెర్రిస్డబుల్ మీదుగా స్టేవ్‌స్టన్ (బ్రిటిష్ కొల,బియా) వరకూ నడిచింది. ఇది పొరుగున ఉన్న నివాసాలకు ప్రయాణసౌకర్యం అధికంచేసింది. 1897 లో స్థాపించబడిన బ్రిటిష్ కొలంబియా ఎలెక్ట్రిక్ రైల్వే (బి.సి.ఇ.ఆర్) కంపెనీ 1958 వరకు అర్బన్, ఇంటర్ అర్బన్ రైల్ సిస్టం నిర్వహించింది. తరువాత ట్రాక్లెస్ ట్రాలీ పోల్, గ్యాసోలైన్ (డీసెల్ బసెస్) నిర్మాణం కొరకు కూల్చివేయబడింది. తరువాత బి.సి.ఇ.ఆర్. కేంద్రంగా కొత్తగా బి.సి. హైడ్రో స్థాపించబడింది. 2013 మార్చిలో వాంకోవర్‌లో ట్రాలీ బస్ ప్రస్తుతం ఉత్తర అమెరికాలో ద్వీతీయస్థానంలో నిలబెట్టింది. మొదటి స్థానంలో శాన్‌ఫ్రాంసిస్కో ఉంది.

వాంకోవర్ 
Vancouver's SkyTrain in the Grandview Cut, with downtown Vancouver in the background. The white dome-like structure is the old roof of BC Place Stadium

రహదారులు

దీర్ఘకాల ప్రణాళికలో రహదార్లు నిర్మించడానికి 1970 -1980 మధ్య సిటీ కౌంసిల్ ఫ్రీవే నిర్మాణాలను నిలిపి వేసింది., ఫలితంగా నగరంలో ఈశాన్య భాగం వరకు సాగే బ్రిటిష్ కొలంబియా హైవే 1 మాత్రమే నగరంలో ఏకైక రహదారి అయింది. ఒకవైపు నగరజనాభా అధికరించిన కారణంగా కార్ల సంఖ్య కూడా అధికరించినప్పటికీ కార్లయాజమాన్యం, పయనించే దూరం శాతం రహదార్ల కొరత కారణంగా 1990 వరకూ తగ్గుముఖం పట్టింది. కెనడియన్ నగరాలలో ఈసమస్యను ఎదుర్కొన్న నగరం వాంకోవర్ మాత్రమే. అదే సమయం కార్లు ప్రయాణించే సమయం మూడవవంతు అధికం అయింది.

ట్రాఫిక్ జాం

2012లో వాంకోవర్ నగరం అత్యధిక ట్రాఫిక్ జాం సమస్యను ఎదుర్కొన్నది. వాంకోవర్ ట్రాఫిక్ జాం సమస్య ఉత్తర అమెరికాలో ద్వీతీయస్థానానికి చేరుకుంది. మొదటి స్త్యానంలో లాస్ ఏంజలెస్ నగరం ఉంది. 2013 గణాంకాలను అనుసరించి వాంకోవర్ ట్రాఫిక్ జాం అత్యంత అధికం అని తెలియజేస్తున్నాయి. ప్రజలు అధికంగా వారికి అనుకూలప్రదేశానికి సమీపంలో ఉండడంపట్ల ఆసక్తి చూపారు. కొంతమంది ప్రజలు మాస్ ట్రాంసిస్ట్, సైక్లింగ్ పట్లకూడా ఆసక్తి కనబరిచారు. ఇది సిటీ ప్లానర్లను ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, పర్యావరణ రక్షణ పోరాటం కొరకు తీవ్రంగా పనిచేసేలా చేసింది. ట్రాంస్పోర్టేషన్ డిమాండ్ మేనేజ్మెంటు డ్రైవర్ల మీద విధించిన నిబంధనలు డ్రైవర్లను సమస్యలకు గురిచేసి రవాణావ్యయం అధికం అయ్యేలా చేసింది.

వాంకోవర్ మహానగరం రహదార్లు, పబ్లిక్ ట్రాంస్పోర్టేషన్ బాధ్యత ట్రాంస్ లింక్ వహించింది. అది ప్రయాణీకులకు బి లైన్ వాంకోవర్ రాపిడ్ బస్ సర్వీసెస్, పాదచారులు, సైకిల్ ప్రయాణికుల కొరకు ఫెర్రీలు (సీ బస్), ఆటోమేటెడ్ రాపిడ్ ట్రాంసిస్ట్ సర్వీస్ (స్కై సర్వీస్), వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ కమ్యూటర్ రైల్ మొదలైన సర్వీసులను అందుబాటుకు తీసుకువచ్చింది. వాంకోవర్ స్కై ట్రైన్ సిస్టంలో మైలేనియం లైన్, ది ఎక్స్పో లై, కెనడా లైన్ మార్గాలు ఉన్నాయి.

ట్రాంస్ లింక్

10 సంవత్సరాల ట్రాంస్ లింక్ ట్రాంస్పోర్టేషన్‌లో భాగంగా రీజనల్ ట్రాంస్పోర్టేషన్‌ నెట్‌వర్క్‌లో మార్పులు చేయబడ్డాయి. సమీపకాలంలో నిర్మాణం పూర్తిచేసుకున్న కెనడా లైన్ 2009 ఆగస్టు 17 న ప్రారంభించబడింది. ఇది వాంకోవర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, పొరుగున ఉన్న రిచ్మండ్ (బ్రిటిష్ కొలంబియా) లను అనుసంధానం చేస్తూ సర్వీసులను అందిస్తుంది. 2016 నాటికి స్కైట్రైన్ సిస్టం ద్వారా కోక్విట్లం, పోర్ట్ మూడీ నగరాలను అనుసంధానం చేస్తూ సేవలందించడానికి ఎవర్‌గ్రీన్ లైన్ (ట్రాంస్‌లింక్) ప్రణాళిక రూపొందించింది. స్కై ట్రైన్ మిలేనియం లైన్ మార్గం " యూనివర్శిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా వరకూ పొడిగించడానికి ప్రళాళిక రూపొందించబడింది. వాంకోవర్ నగరంలో వైవిధ్యభరితమైన ఇతర ప్రయాణసౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ సిటీ పాసింజర్ రైల్ సర్వీసెస్ పసిఫిక్ సెంట్రల్ స్టేషన్ నుండి తూర్పు పాయింట్ వరకు, సియాటెల్, పోర్ట్ లాండ్, రాకీ మౌంటెన్ ట్రైన్ రూట్స్ మద్య అంట్రాక్ కాస్కేడ్స్ సర్వీస్ అందుబాటులో ఉంది. ఫాల్స్ క్రీక్ నుండి గ్రీన్‌విల్లే ఐలాండ్, వాంకోవర్ డౌన్ టౌన్, కిట్సిలానో వరకు ఫెర్రీ సర్వీసులు నిర్వహించబడుతున్నాయి. వాంకోవర్ నగరమంతా బైసైకిల్ మార్గాలు నిర్మించబడ్డాయ. సంవత్సరమంతా సైకిలిస్టులు ప్రయాణించడానికి ఈ మార్గాలు అనుకూలంగా ఉన్నాయి.వాంకోవర్ నగరంలో సైకిల్‌లో ప్రయాణించే వారి సంఖ్య అధికరిస్తూ ఉంది.

విమానాశ్రయాలు

వాంకోవర్ నగరానికి రిచ్మండ్ చిటీలోని సీ ఐలాండ్ (బ్రిటిష్ కొలంబియా) వద్ద ఉన్న " వాంకోవర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ " (వై.వి.ఆర్) విమానసేవలు అందొస్తుంది. కెనడాలోని బిజీయస్ట్ విమానాశ్రయాలలో ఇది ద్వితీయస్థానంలో ఉంది. ఉత్తర అమెరికా పశ్చిమతీర విదేశీప్రయాణీకులకు వాంకోవర్ విమానాశ్రయం ద్వితీయ ద్వారంగా ఉంది. హెలీజెట్, ఫ్లోట్ ప్లేన్ కంపెనీలు వాంకోవర్ హార్బర్ నుండి వై.వి.ఆర్. సౌత్ టెర్మినల్ వరకు హెలికాఫ్టర్ సేవలు అందిస్తుంది.

ఫెర్రీలు

వాంకోవర్ నగరంలో రెండు బి.సి. ఫెర్రీ సర్వీసులు ప్రయాణీకులకు జలమార్గ రవాణాసేవలు అందిస్తున్నాయి. అవి వరుసగా నగరానికి వాయవ్యభాగంలో హార్స్‌షూ బే (బ్రిటిష్ కొలంబియా) ఫెర్రీ సర్వీసు, త్సావస్సేన్ (బ్రిటిష్ కొలంబియా) ఫెర్రీ సర్వీస్.

క్రీడలు

వాంకోవర్ 
Vancouver's English Bay
వాంకోవర్ 
BC Place, home of the BC Lions and the Vancouver Whitecaps FC, and also the site of the Opening and Closing ceremonies of the 2010 Winter Olympics.
వాంకోవర్ 
Rogers Arena, home of the Vancouver Canucks

అహ్లాదకరమైన వాంకోవర్ వాతావరణం మహాసముద్రం, పర్వతాలు, నదులు, సరోవరాలు ఈప్రాంతాన్ని ఔట్‌డోర్ రిక్రియేషన్ అభిమానులకు అభిమాన గమ్యస్థానంగా మార్చింది. వాంకోవర్ నగరంలో 1298 చ.హెక్టారుల వైశాల్యంలో పార్కులు ఉన్నాయి. వాటిలో స్టాన్లీ పార్క్ వైశాల్యపరంగా అతిపెద్దది. నగరంలో పలు విశాలమైన సముద్రతీరాలు ఉన్నాయి. ఒకదానికి ఒకటి సమీపంలో ఉండే ఈ సముద్రతీరాలు స్టాన్లీ పార్క్ నుండి ఆరంభమై ఇంగ్లీష్ బేకి దక్షిణంలో ఉన్న ఫాల్స్ క్రీక్ ప్రాంతం వరకు, కిత్సిలానో నుండి యూనివర్శిటీ ఎండోమెంట్ లాండ్స్ వరకు (యూనివర్శిటీకి ఉన్న అదనపు సముద్రతీరాలు నగర పరిమితులను దాటి ఉన్నాయి) ఉన్నాయి.అదనంగా ఉన్న 18కి.మీ పొడవైన సముద్రతీరాలలో స్టాన్లీపార్క్ ద్వితీయ, తృతీయ సముద్రతీరాలు, ఇంగ్లీష్ బే (ఫస్ట్ బీచ్), సన్‌సెట్, కిత్సిలానో బీచ్, జెరిచో, లొకామో, స్పానిష్ బ్యాంక్, స్పానిష్ బ్యాంక్ ఎక్స్‌టెంషన్, స్పానిష్ బ్యాంక్ వెస్ట్, రెక్‌బీచ్ ఉన్నాయి. వాంకోవర్ డౌన్‌టౌన్‌కు 20-30 నిముషాల డ్రైవింగ్ దూరంలో " నార్త్ షోర్ మౌంటెంస్ " ఉన్నాయి. వీటిలో సైప్రెస్ మౌంటెన్, గ్రూస్ మౌంటెన్, మౌంట్ సేమౌర్ స్కై ఏరియాలు ఉన్నాయి. " మౌంటెన్ బైకర్స్ " ఉత్తర సముద్రతీరం (నార్త్ షోర్) వెంట అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ట్రైల్స్ ఏర్పాటు చేసారు. కాపిలానో నది, లిన్ క్రీక్, సేమౌర్ నది వసంతకాలం, వర్షాకాలంలో వైట్‌వాటర్ క్రీడలకు అనుకూలంగా ఉంటుంది.

పరుగు పందాలు

వాంకోవర్ సన్ రన్ (10 కి.మీ. పరుగు పందెం) ప్రతి ఏప్రిల్ మాసంలో నిర్వహించబడింది. ప్రతి మే మాసంలో " వాంకోవర్ మారతాన్ " నిర్వహించబడుతుంది. జూన్ మాసంలో " స్కోటియా బ్యాంక్ హాఫ్ మారతాన్ " నిర్వహించబడుతుంది.

పర్వతారోహణ

హేమతం, వేసవి మాసాలలో గౌస్ మౌంటెన్ వద్ద " ది గ్రౌస్ గ్రైడ్ " 2.9 కి.మీ పందెం నిర్వహించబడుతుంది.వెస్ట్ వాంకోవర్ లోని హార్స్‌షూ బే (వెస్ట్ వాంకోవర్) నుండి డీప్ కోవ్ (నార్త్ వాంకోవర్) వరకు 42 కి.మీ. పొడవైన " బేడన్ పౌల్ ట్రైల్ " లాంగ్ హైక్ నిర్వహించబడుతుంది.

సైకిల్ పందాలు

వాంకోవర్ నగరం సైక్లింగ్ పందాలకు కేంద్రంగా ఉండేది. 1973 నుండి పలు వేసవులలో గ్యాస్‌టౌన్ లోని కోబల్ స్టోన్ వీధిలో " ది గ్లోబల్ రిలే గ్యాస్టౌన్ గ్రాండ్ ప్రిక్స్ " సైకిల్ పందాలు నిర్వహించబడుతుంటాయి. వాంకోవర్ మహానగరంలో ప్రతిసంత్సరం ప్రొఫెషనల్ సైక్లింగ్ రేస్ సీరీస్ బి.సి.సూపర్ వీక్ పేరుతో నిర్వహించబడుతుంటాయి. అందులో భాగంగా ది గ్లోబల్ రిలే గ్యాస్టౌన్ గ్రాండ్ ప్రిక్స్, యు.బి.సి. గ్రాండ్ ప్రిక్స్ సైకిల్ పందాలు నిర్వహించబడుతుంటాయి.

2009 లో వాంకోవర్ మహానగరం " వరల్డ్ పోలిస్ అండ్ ఫైర్ గేంస్ "కు ఆతిథ్యం ఇచ్చింది. బర్నబే సిటీ సమీపంలో ఉన్న స్వాంగర్డ్ స్టేడియంలో " 2007 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ యు- 20 వరల్డ్ కప్ "కు ఆతిథ్యం ఇచ్చింది.

వింటర్ ఒలింపిక్స్, ఇతర క్రీడలు

వాంకోవర్ విష్ట్లర్, రిచ్మండ్‌లతో కలిసి " 2010 వింటర్ ఒలింపిక్స్ "కు, " 2010 వింటర్ పారాలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. 2010 జూన్ 12న వాంకోవర్ అల్టిమేట్ ఫైటింగ్ చాంపియంషిప్ 115 " (యు.ఎఫ్.సి) క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. కెనడాలో నిర్వహించబడిన యు.ఎఫ్.సి. క్రీడలలో ఇది నాలుగవది. అలాగే మాంట్రియల్ నగరానికి వెలుపల జరిగిన మొదటి యు.ఎఫ్.సి. క్రీడ ఇదే. 2011లో వాంకోవర్ " గ్రే కప్ ", ది కెనడియన్ ఫుట్‌బాల్ లీగ్ (సి.ఎఫ్.ఎల్) చాంపియన్ గేం (ఇది ఒక్కో సంవత్సరం ఒక్కోక సి.ఎఫ్.ఎల్ టీం ఉన్న నగరంలో నిర్వహించబడుతుంది) లకు ఆతిథ్యం ఇచ్చింది. అతివేగంగా అభివృద్ధి చెందుతున్న అల్టిమేట్ క్రీడలకు వాంకోవర్ కేంద్రంగా ఉంది. 2008 లో వాంకోవర్ నగరం " వరల్డ్ అల్టిమేట్ చాంపియంషిప్ " క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది.

బాస్కెట్ బాల్

1995 లో వాంకోవర్ నగరంలో వాంకోవర్ గ్రిజ్జిల్స్ పేరుతో " ది నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్.బి.ఎ)" స్థాపించబడింది. వారు రోగర్స్ అరేనాలో క్రీడలలో పాల్గొన్నారు. 6 సంవత్సరాల వాంకోవర్ నగరంలో ఉన్న తరువాత 2001లో నేషనల్ " బాస్కెట్ బాల్ అసోసియేషన్ " మెంఫిస్ (తెన్నెస్సీ) కి తరలించబడింది. 2015 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ వుమంస్ వరల్డ్ కప్ గేం " నిర్వహించబడిన 6 నగరాలలో " వాంకోవర్ ఒకటి. " 2015 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వుమంస్ వరల్డ్ కప్ ఫైనల్ కప్ "కు (యునైటెడ్ స్టేట్స్, జపాన్ మద్య జరిగింది) వాంకోవర్ ఆతిథ్యం ఇచ్చింది.

ఊబకాయం

వాంకోవర్ నగరంలో యువకులలో 12% ఊబకాయం ఉంది. కెనడా సరాసరి ఊబకాయం 23% ఉంది. వాంకోవర్ వాసులలో 51.8% అధికబరువు కలిగి ఉన్నారు. సన్నని వారు అధికంగా ఉన్న కెనడియన్ నగరాలలో వాంకోవర్ నగరం 4వ స్త్యానంలో ఉంది. మొదటి మూడు స్త్యానాలలో టొరంటో, మాంట్రియల్, హాలిఫాక్స్ మునిసిపాలిటీ ఉన్నాయి.

ప్రస్తుత ప్రొఫెషనల్ టీంస్

ప్రొఫెషనల్ టీం లీగ్ క్రీడ వేదిక స్థాపన చాంపియన్ షిప్స్
బి.సి. లైయింస్ కెనడియన్ ఫుట్‌బాల్ లీగ్ (సి.ఎఫ్.ఎల్) కెనడియన్ ఫుట్‌బాల్ బి.సి. ప్లేస్ 1954 6
వాంకోవర్ చనుక్స్ నేషనల్ హాకీ లీగ్ (ఎన్.హెచ్.ఎల్) ఐస్ హాకీ రోగర్స్ ఎరేనా 1970
(1945: పసిఫిక్ కోస్ట్ హాకీ లీగ్ (పి.సి.హెచ్.ఎల్)
0 (6 ప్రీవియస్ లీగ్స్)
వాంకోవర్ వైట్‌కాప్స్ మేజర్ లీగ్ సాకర్ (ఎం.ఎల్.ఎస్) అసోసియేషన్ ఫుట్‌బాల్ (సాకర్) బి.సి.ప్లేస్ 2009
(1974: నార్త్ అమెరికన్ సాకర్ లీగ్ (ఎన్.ఎ.ఎస్.ఎల్)
0 (7 ప్రీవియస్ లీగ్)
వైట్‌కాప్స్ ఎఫ్.సి.2 (వాంకోవర్ వైట్‌కాప్స్ ఎఫ్.సి.2) యునైటెడ్ సాకర్ లీగ్ (యు.ఎస్.ఎల్) అసోసియేషన్ ఫుట్‌బాల్ సాకర్ తండర్‌బర్డ్ స్టేడియం 2014 0
వాంకోవర్ కెనడియన్లు నార్త్‌వెస్ట్ లీగ్
(NWL)
బేస్‌బాల్ నాట్ బైయిలీ స్టేడియం 2000 3
వాంకోవర్ జెయింట్స్ వెస్టర్న్ హాకీ లీగ్ (వి.హెచ్.ఎల్) ఐస్ హాకీ లాంగ్లే ఈవెంట్స్ సెంటర్ 2001 1
వాంకోవర్ స్టీల్త్ నేషనల్ లాక్రోస్ లీగ్ (ఎన్.ఎన్.ఎల్) లాక్రోస్ లాంగ్లీ ఈవెంట్స్ సెంటర్ 2014 1 (2010, వాషింగ్టన్ స్టీల్త్ )

మూలాలు

Tags:

వాంకోవర్ చరిత్రవాంకోవర్ భౌగోళికంవాంకోవర్ పర్యావరణంవాంకోవర్ వాతావరణంవాంకోవర్ నగరరూపంవాంకోవర్ నగర రూపకల్పనవాంకోవర్ నిర్మాణ కళవాంకోవర్ ఆర్ధికరంగంవాంకోవర్ ప్రభుత్వంవాంకోవర్ గణాంకాలువాంకోవర్ విద్యవాంకోవర్ Arts and cultureవాంకోవర్ ప్రయాణసౌకర్యాలువాంకోవర్ క్రీడలువాంకోవర్ మూలాలువాంకోవర్EN-Vancouver.oggEnglish languageకెనడాదస్త్రం:EN-Vancouver.oggన్యూయార్క్మెక్సికోశాన్ డియాగో

🔥 Trending searches on Wiki తెలుగు:

ద్వాదశ జ్యోతిర్లింగాలుఫ్లిప్‌కార్ట్సచిన్ టెండుల్కర్సవర్ణదీర్ఘ సంధిసునాముఖి2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిరష్మి గౌతమ్ప్రజా రాజ్యం పార్టీపూర్వ ఫల్గుణి నక్షత్రమునిర్మలా సీతారామన్జీమెయిల్ఇందిరా గాంధీఉత్తరాభాద్ర నక్షత్రముజాతిరత్నాలు (2021 సినిమా)కడియం కావ్యజోల పాటలుబలి చక్రవర్తిఫేస్‌బుక్అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిభారత రాజ్యాంగ ఆధికరణలుఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్పెంటాడెకేన్దినేష్ కార్తీక్ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంతాటిపర్యావరణంశాసనసభవందే భారత్ ఎక్స్‌ప్రెస్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుదక్షిణామూర్తిభువనేశ్వర్ కుమార్భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాభూమా అఖిల ప్రియ2024 భారతదేశ ఎన్నికలువెలిచాల జగపతి రావుH (అక్షరం)పూర్వాషాఢ నక్షత్రముశ్రీవిష్ణు (నటుడు)ఏప్రిల్వై.యస్.రాజారెడ్డిభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుసంధ్యావందనంమంజుమ్మెల్ బాయ్స్హనుమంతుడుసలేశ్వరంతెలంగాణ ప్రభుత్వ పథకాలుఛత్రపతి శివాజీపొడుపు కథలుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంపన్ను (ఆర్థిక వ్యవస్థ)మదర్ థెరీసాహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాస్వాతి నక్షత్రముఉత్తర ఫల్గుణి నక్షత్రమునజ్రియా నజీమ్తెలుగు సినిమాలు 2023కె. అన్నామలైఅల్లూరి సీతారామరాజుచతుర్వేదాలుజాతీయములుమండల ప్రజాపరిషత్దానం నాగేందర్సత్యమేవ జయతే (సినిమా)శామ్ పిట్రోడామీనాక్షి అమ్మవారి ఆలయంభూమిరోహిత్ శర్మనితిన్అయోధ్య రామమందిరంమెరుపుఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాబి.ఎఫ్ స్కిన్నర్లోక్‌సభ నియోజకవర్గాల జాబితానువ్వు నాకు నచ్చావ్తెలుగు అక్షరాలువిజయవాడఓటు🡆 More