లుడ్విగ్ వాన్ బీథోవెన్

లుడ్విగ్ వాన్ బీథోవెన్ (/ˈlʊdvɪɡ væn ˈbeɪˌtoʊvən/ ( listen); జర్మన్  ( listen) ;17 డిసెంబర్ 1770లో బాప్తిజం పొందాడు – 26 మార్చి 1827) జర్మన్ స్వరకర్త, పియానిస్ట్.

పాశ్చాత్య సంగీతకళలో క్లాసికల్, రొమాంటిక్ యుగాల మధ్యకాలంలోని అత్యంత ముఖ్యమైన వ్యక్తి. పాశ్చాత్య స్వరకర్తలందరిలోనూ అత్యంత ప్రసిద్ధ, ప్రభావశీలమైన వ్యక్తి. 9 సింఫనీలు, 5 పియానో కాన్సెర్టోలు, 1 వయొలిన్ కాన్సెర్టో, 32 పియానో సొనాటాలు, 16 స్ట్రింగ్ క్వార్టెట్లు ఆయన చేసిన కంపోజిషన్లలో విఖ్యాతంగా నిలుస్తాయి.

పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో భాగమైన కొలోగ్నె ఎలక్టొరేట్ రాజధాని అయిన బోన్ లో జన్మించారు, అత్యంత చిన్న వయసులోనే బీథోవెన్ తన సంగీత ప్రతిభను ప్రదర్శించారు. అతని తండ్రి, వ్యవసాయదారుడు అయిన జోహాన్ వాన్ బీథోవెన్, క్రిస్టియన్ గొట్లొబ్ నీఫె అతని సంగీత గురువులు. బోన్లో 22 ఏళ్ళ వయసు వరకూ గడిపిన కాలంలో, వూల్ఫ్ గాంగ్ అమడాస్ మొజార్ట్ తో చదవాలని, జోసెఫ్ హయ్ డన్ తో స్నేహం చేయాలని బీథోవెన్ ఆశించేవాడు. 1792లో బీథోవెన్ వియన్నాకు వెళ్ళి హయ్ డన్ తో కలిసి చదువుకోవడం ప్రారంభించి, త్వరలోనే పియానో వాదనలో ఘనాపాఠిగా పేరొందాడు. 1800 నుంచి అతని వినికిడిశక్తి క్షీణించిపోసాగింది, క్రమంగాఅతని చివరి దశాబ్ది కాలానికి వచ్చేసరికి దాదాపుగా చెవిటివాడే అయ్యాడు. దాంతో ప్రజలమధ్య ప్రదర్శనలు ఇవ్వడం, నిర్వహించడం మానేసి కంపోజ్ చేసుకోవడంలో గడిపాడు; అతని ఆరాధనీయమైన, సుప్రఖ్యాతమైన కృతులు ఈ కాలంలోనే వెలువడ్డాయి.

జీవిత చరిత్ర

నేపథ్యం, తొలినాళ్ళ జీవితం

లుడ్విగ్ వాన్ బీథోవెన్ 
బోన్గాస్సె 20లో బీథోవెన్ జన్మస్థలం, ప్రస్తుతం బీథోవెన్ మ్యూజియం
బీథోవెన్ లొడ్వుజ్క్ వాన్ బీథోవెన్ (1712–73) అన్న దక్షిణ నెదర్లాండ్స్ కు చెందిన మెకెలెన్ (ప్రస్తుతం బెల్జియం) ప్రాంతానికి చెందిన సంగీత విద్వాంసుని మనవడు, ఆయన తన 20వ ఏట బోన్ ప్రాంతానికి వలసవచ్చాడు. లోడ్విజ్క్ (జర్మన్ లుడ్విగ్ అన్న పదానికి డచ్ సహజాత పదం) ఎలక్టర్ ఆఫ్ కొలోగ్నె ఆస్థానంలో శృతి ఇచ్చే గాయకునిగా నియమితులయ్యారు. క్రమంగా కపెల్ మీస్టెర్ (సంగీత దర్శకుడు) స్థాయికి ఎదిగారు. లొడ్విజ్క్ కు జోహాన్ (1740–1792) ఏకైక కుమారుడు, అతను గాయకునిగా పనిచేస్తూనే సంపాదన కోసం వయొలిన్, పియానో పాఠాలు చెప్పేవాడు. జోహాన్ 1767లో ట్రెయర్ ఆర్చిబిషప్ ఆస్థానంలో పెద్ద వంటవాడిగా పనిచేస్తున్న జోహాన్ హీన్రిచ్ కెవెరిచ్ కుమార్తె మరియా మాగ్డలీనా కెవెరిచ్ ని వివాహం చేసుకున్నాడు.
లుడ్విగ్ వాన్ బీథోవెన్ 
బోన్ లోని ప్రిన్స్-ఎలెక్టర్ ప్యాలెస్ (కెర్ఫర్ స్టిలిచెస్ స్క్లొస్). ఇక్కడే 1730 నుంచి బీథోవెన్ కుటుంబంలోని పలువురు పనిచేశారు.

ఈ వివాహం ఫలితంగా బోన్లో బీథోవెన్ జన్మించారు. అతని జన్మదినం గురించిన ప్రామాణికమైన ముద్రిత సమాచారమేదీ లేదు; సెయింట్ రెజియస్ లోని  రోమన్ కాథలిక్ సర్వీస్ వద్ద 17 డిసెంబర్ 1770లో బాప్తిజం పొందినట్టుగా నమోదుఅయివుంది, ఆ నమోదైన రికార్డు మిగిలివుంది. బీథోవెన్ కుటుంబం, అతని గురువు జోహాన్ ఆల్బ్రెక్ట్స్ బెర్గర్ 16 డిసెంబరున అతని పుట్టినరోజు వేడుకలు నిర్వహించేవారని తెలుస్తోంది, ఈ విషయంలో పలువురు పండితులు 16 డిసెంబర్ 1770నే బీథోవెన్ జన్మించినట్టు అంగీకరిస్తున్నారు. జొహాన్ వాన్ బీథోవెన్ కు ఏడుగురు సంతానం కలిగినా వారిలో రెండవ వాడైన లుడ్విగ్, అతని మరొక ఇద్దరు తమ్ముళ్ళు మాత్రమే శైశవం దాటి జీవించారు. 8 ఏప్రిల్ 1774లో కాస్పర్ ఆంటన్ కార్ల్, అందరికన్నా చిన్నవాడు నికొలస్ జొహాన్ 2 అక్టోబర్ 1776న జన్మించారు.

బీథోవెన్ కు తండ్రే మొదటి సంగీత గురువు. సంప్రదాయికంగా వినవస్తున్న కథనం ప్రకారం జోహాన్ చాలా కఠినమైన గురువు, బాల బీథోవెన్ "చాలాసార్లు కన్నీళ్ళతోనే కీబోర్డ్ వద్ద నుంచోబెట్టబడ్డాడు," గ్రోవ్ డిక్షనరీ ఆఫ్ మ్యూజిక్ అండ్ మ్యూజిషియన్స్ దీనికి డాక్యుమెంటల్ ఆధారాలేమీ లేవని, ఊహాగానాలు, మిత్ రెండూ దీన్ని ఉత్పత్తి చేశాయని పేర్కొన్నది. బీథోవెన్ కు ఇతర స్థానిక గురువులూ ఉన్నారు: ఆస్థాన ఆర్గాన్ వాద్యకారుడు గిల్లెస్ వాన్ డెన్ ఈడెన్ (మరణం. 1782), టోబీస్ ఫ్రెడ్రిక్ ఫీఫెర్ (కుటుంబ స్నేహితుడు, ఇతను బీథోవెన్ కు పియానో వాదన నేర్పాడు), ఫ్రంజ్ రోవన్టిని (బంధువు, వయొలిన్, వయోలాలు వాయించడంలో నిర్దేశకుడు). బీథోవెన్ సంగీత ప్రతిభ అతని చిన్నతనంలోనే స్పష్టంగా తెలిసిపోయింది.లెపార్డ్ మొజార్ట్ తన కుమారుడు వూల్ఫ్గాంగ్ మొజార్ట్, కుమార్తె నన్నెరీల సంగీత ప్రతిభవల్ల సంపాదించం గురించి తెలియడంతో, జొహాన్ తన కుమారుడి బాలమేధాశక్తిని వాడుకుని ధనికుడు అవుదామని భావించాడు. ఏడేళ్ళ వయసులో ఉన్న బీథోవెన్ ను ఆరేళ్ళ వయసువాడని బీథోవెన్ తొలి బహిరంగ ప్రదర్శన పోస్టర్లలో (మార్చి 1778) వేసుకుని ప్రచారం చేసుకున్నాడు జోహాన్.

1779 నుంచి ఆ ఏడాదే ఆస్థానంలో ఆర్గాన్ వాద్యకారునిగా నియమితుడైన క్రిస్టియన్ గొట్లాబ్ నీఫే వద్ద విద్యనభ్యసించడం ప్రారంభించాడు. బోన్ లో విద్యాభ్యాస కాలంలోకెల్లా అతను బీథోవెన్ కు అత్యంత విశిష్టమైడన, ముఖ్యుడైన గురువు. బీథోవెన్ కు కంపోజ్ చేయడాన్ని నీఫే నేర్పించాడు, మార్చి 1783 నాటికల్లా బీథోవెన్ తన తొలి ముద్రిత కంపోజిషన్: వొ0WoO 63 రాయగలిగాడు. బీథోవెన్ అనతికాలంలోనే నీఫే వద్ద అసిస్టెంట్ ఆర్గానిస్టుగా 1781 నాటికి జీతం లేకుండా, మరి మూడేళ్లకు జీతంతోనూ పనిలో చేరాడు. అప్పట్లో ఆండ్రియే లూకెసి కపెల్ మీస్టెర్ గా ఆస్థాన చర్చిలో కింద ఈ పనిచేసేవారు. కుర్ఫూర్స్ట్ (ఎలెక్టర్) అన్న పేరుతో రాసిన మొదటి మూడు పియానో సొనాటాలు అప్పటి ఆర్చిబిషప్ ఎలక్టర్ మాక్సిమిలియన్ ఫ్రెడ్రిక్ (1708–1784) కి అంకితమిచ్చారు, 1783లో ప్రచురితమయ్యాయి. మాక్సిమిలియన్ ఫ్రెడెరిక్ మొదట్లోనే బీథోవెన్ ప్రతిభను గుర్తించి అతని సంగీత విద్యకు ఆర్థిక సహకారం, ప్రోత్సాహం అందించారు.

లుడ్విగ్ వాన్ బీథోవెన్ 
13 సంవత్సరాల వయసులోని బెథోవెన్ చిత్రం, పేరుతెలియని బోన్ చిత్రకారుడు గీసినది (c. 1783)

మాక్స్ మిలియన్ ఫ్రెడెరెక్ వారసునిగా ఆస్ట్రియా సామ్రాజ్ఞి మరియా థెరెసి చిన్నకుమారుడు మాక్సిమిలియన్ ఫ్రెంజ్ వచ్చాడు, అతని అన్న జోసెఫ్ వియన్నాలో తీసుకువచ్చిన మార్పులను అనుసరిస్తూ బోన్ లో గుర్తించదగ్గ మార్పులు తీసుకువచ్చాడు. పునర్వికాస కాలపు తత్వాన్ని ఆధారం చేసుకుని విద్యకు, కళలకు సహకారాన్ని పెంచాడు. ఈ మార్పుల వల్ల దాదాపు కచ్చితంగా తరుణ వయస్కుడైన బీథోవెన్ ప్రభావితుడయ్యాడు. ఫ్రీమాసన్రీగా ప్రాచుర్యం పొందిన ఆలోచనల వల్ల కూడా అతను ప్రభావితుడై వుండొచ్చు, అతని గురువు నీఫె, అతని చుట్టూవున్న వ్యక్తులు పలువురు ఆర్డర్ ఆఫ్ ఇల్యూమినాటి స్థానిక శాఖలో సభ్యులుగా వుండేవారు.

1787లో బీథోవెన్ వియన్నాకు మొట్టమొదటి సారిగా ప్రయాణించారు, బహుశా మొజార్ట్ తో అభ్యసించవచ్చన్న ఆశతో. వారిమధ్య సంబంధం వివరాలు అస్పష్టంగా ఉన్నాయి, చివరకి వారు కలిశారో లేదో కూడా స్పష్టత లేదు. తల్లి అనారోగ్యంతో ఉన్నదని తెలుసుకుని, తాను వెళ్ళిన రెండు వారాలకేతిరిగివెళ్లిపోయాడు. కొన్నాళ్ళకే అతని తల్లి చనిపోయింది, తండ్రి క్రమంగామద్యానికి బానిసైపోయాడు. ఈ కారణంగా, బీథోవెన్ తన ఇద్దరు తమ్ముళ్ళ బాధ్యత వహించాల్సివచ్చి, తర్వాతి ఐదేళ్ళూ బోన్లోనే గడిపాడు.

ఆ కాలంలోనే తనకు తర్వాతి జీవితంలో అత్యంత ముఖ్యులుగా నిలిచిన పలువురిని కలిశాడు. యువ వైద్యవిద్యార్థి ఫ్రెంజ్ వెగెలెర్ అతడికి బ్ర్యూనింగ్ కుటుంబాన్ని పరిచయం చేశారు. బెథోవెన్ వాన్ బ్ర్యూనింగ్ ఇంటికి తరచు వచ్చిపోతూండేవాడు, వారి పిల్లలకు పియానో నేర్పాడు. అక్కడే అతను జర్మన్ భాష, క్లాసిక్ సాహిత్యానికీ పరిచయమయ్యాడు. అతని కుటుంబ వాతావరణం కన్నా వాన్ బ్ర్యూనింగ్ కుటుంబ వాతావరణం తక్కువ ఒత్తిడి కలిగించేది, తన కుటుంబంలో తండ్రి పరిస్థితి క్షీణిస్తూండడంతో కుటుంబ స్థితి బాగుండేది కాదు. కౌంట్ ఫెర్డినాండ్ వాన్ వాల్డ్ స్టీన్ దృష్టిలో బీథోవెన్ పడ్డాడు, అతను బీథోవెన్ కు జీవితకాల మిత్రునిగా, ఆర్థికంగా సహకారిగా, పోషకునిగా వ్యవహిరించారు.

1789లో బీథోవెన్ తన తండ్రి జీతంలో సగం కుటుంబ అవసరాల మేరకు నేరుగా పొందేందుకు చట్టపరమైన ఉత్తర్వు పొందాడు. కుటుంబ ఆదాయానికి సహకరించేలా ఆస్థానపు ఆర్కెస్ట్రాలో వయొలా వాయించేవాడు. ఈ పని బీథోవెన్ రకరకాల ఒపెరాలను తెలుసుకునేందుకు సహకరించింది, ఆస్థానంలో అప్పుడు ప్రదర్శించినవాటిలో మూడు మొజార్ట్ ఒపెరాలే. ఆస్థానపు ఆర్కెస్ట్రా కండక్టర్ జోసెఫ్ రీచా మేనల్లుడు,  వేణూవాద్యనిపుణుడు, వయొలినిస్ట్ అయిన ఆంటన్ రీచాతో స్నేహం చేసుకున్నాడు.

వియన్నాలో కెరీర్ ఏర్పరుచుకోవడం

1790 నుంచి 1792 వరకూ బీథోవెన్ ఎన్నో కృతులను కంపోజ్ చేశారు. (వీటిలో ఏవీ ఆ కాలంలో ప్రచురితం కాలేదు, ఓపస్ సంఖ్యలేనివిగా ప్రస్తుతం జాబితాకెక్కుతున్నాయి) ఇవి అతని స్థాయి, పరిపక్వత పెరగడాన్ని సూచిస్తున్నాయి. 1790 దశకంలోనే బీథోవెన్ కు జోసెఫ్ హయ్ డన్ పరిచయమయయాడు, జోసెఫ్ లండన్ కు ప్రయాణమై వెళ్తూ క్రిస్మస్ సమయంలో బోన్ వద్ద ఆగాడు, అదే సమయంలో బీథోవెన్ అతను కలిశారు. సంవత్సరం తర్వాత తిరుగు ప్రయాణంలో హయ్ డన్ వియన్నాకు వెళ్తూ జూలై 1792లో బోన్ వద్ద ఆగాడు, అదే సమయంలో బీథోవెన్ అతనివద్ద చదువుకునేందుకు ఏర్పాట్లూ జరిగాయి. ఎలక్టర్ సహకారంతో, బీథోవెన్ బోన్ నుంచి వియన్నాకు నవంబర్ 1792లో, ఫ్రాన్స్ లో యుద్ధం వస్తోందన్న వార్తల నడుమ, ప్రయాణమయ్యాడు. త్వరలోనే అతని తండ్రి చనిపోయిన వార్త అతనికి చేరింది. మొజార్ట్ ఇటీవలే మరణించారన్న విషయమూ తెలిసింది. కౌంట్ వాల్డ్ స్టైన్ తన ఫేర్వెల్ నోట్ లో ఇలా రాశాడు, "అయినా మొజార్ట్ ఆత్మ నుంచి ఎడతెగని diligence హయ్ డన్ చేతుల ద్వారా నువ్వు అందుకుంటావు." కొద్ది సంవత్సరాల్లోనే, మొజార్ట్ వారసుడనే విస్తృతజనాభిప్రాయాన్ని, ఇటీవలే మరణించిన ఆ మహావిద్వాంసుని కృతులు అధ్యయనం చేసి-తన కృతుల్లో ఓ మొజార్టియన్ ఫ్లేవర్ జతచేయడంతో, చవిచూశాడు.

లుడ్విగ్ వాన్ బీథోవెన్ 
కార్ల్ ట్రాగట్ రీడెల్ (1769–1832) వేసిన యువకునిగా బీథోవెన్ అన్న పోర్ట్రయిట్ 

బీథోవెన్ వెనువెంటనే తనను స్వరకర్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నమేమీ చేయలేదు, అధ్యయనానికీ, ప్రదర్శనలకీ తన సమయాన్ని అంకితం చేశారు. హైడన్ చూపిన దారిలో పనిచేయడం, కౌంటర్ పాయింట్ ను సాధించాడు. వయొలిన్ ని ఇగ్నయాజ్ షూప్పన్జై వద్ద అభ్యాసం కొనసాగించాడు. ఈ దశలో, ఆంటోనియో సాలీరి నుంచి ఇటాలియన్ వోకల్ కంపోజిషన్ల శైలిని నేర్చుకునేవాడు. వీరి అనుబంధం 1802 వరకూ కొనసాగడం కచ్చితంగా చెప్పవచ్చు, అయితే కొందరు 1809 వరకూ సాగిందనీ భావిస్తారు. హయ్ డన్ 1794లో ఇంగ్లాండుకు తరలివెళ్ళిపోయినప్పుడు, ఎలెక్టర్ బీథోవెన్ తిరిగి వచ్చేస్తాడని ఆశించాడు. అయితే అతను వియన్నాలోనే ఉండి జోహాన్ ఆల్బెక్ట్స్ బర్గ్, ఇతర సంగీత గురువుల వద్ద విద్యనభ్యసించడానికి నిశ్చయించుకున్నాడు. ఎలక్టర్ అందించే విద్యాభృతి ఆగిపోయినా, ఎందరో వియన్నీస్ ఉన్నత కుటుంబీకులు, సంపన్నులు అతని సామర్థ్యాన్ని గుర్తించి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకువచ్చారు, వారిలో ప్రిన్స్ జోసెఫ్ ఫ్రాంజ్ లోబ్కొవిట్జ్, ప్రిన్స్ కార్ల్ లిక్నొవ్ స్కీ, బారన్ గోట్ ఫ్రైడ్ వాన్ స్వైటెన్ ఉన్నారు.

1793 నాటికల్లా, బీథోవెన్ ప్రభువుల సమక్షంలో సంగీతాన్ని వినిపించే విద్యలో రాణించేవ్యక్తిగా పేరొందాడు, కొ్కోసారి జె.ఎస్.బాచ్ యొక్క వెల్ టెంపర్డ్ క్లవియర్ నుంచి ప్రీలూడ్లు, ఫుగులు వాయించేవాడు. అతని స్నేహితుడు నికొలస్ సిమ్రాక్, బీథోవెన్ కంపోజిషన్లు ప్రచురించడం ప్రారంభించాడు.; వూ066 పేరిట వెలువడ్డది మొదటిదిగా భావిస్తున్నారు. 1793 నాటికి, వియన్నాలో పియానో విర్ట్యూసోగా మంచి ప్రఖ్యాతి సంపాదించుకున్నాడు.  బీథోవెన్ వియన్నాలో చేసిన తొలి బహిరంగ ప్రదర్శన మార్చి 1795లో జరిగింది, ఆ కాన్సర్ట్ (కచేరీ) లో అతని తొలినాళ్ళ పియానో కాన్సర్ట్ లను ప్రదర్శించారు. అది అతని తొలి కచేరీనా లేక రెండవదా అన్నది అస్పష్టం.ఈ విషయంగా డాక్యుమెంటరీ ఆధారాలు స్పష్టంగా లేవు, రెండు కన్సర్టోలూ దాదాపు పూర్తయ్యే స్థితిలోనే ఉన్నాయి (రెంటిలో ఏదీ చాలా ఏళ్ళ వరకూ ప్రచురితం కాలేదు). ఈ ప్రదర్శనానంతరం ఓపస్ సంఖ్య ఇచ్చుకున్న తొలినాళ్ళ కృతుల (కంపోజిషన్స్) ను ప్రచురించారు. 3 పియానో ట్రయోలకు ఓపస్ సంఖ్య 1 ఇచ్చారు. ఈ కృతులను అతని పోషకుడు ప్రిన్స్ లిక్నోవ్ స్కీకి అంకితమిచ్చారు, ఇవి ఆర్థికంగా విజయం సాధించాయి, ఆ ఆదాయం అతను సంవత్సరాంతం వరకూ జీవనం సాగించడానికి సరిపోయేంతటిది.

సంగీతపరంగా పరిణతి

బీథోవెన్ తన తొలి సిక్స్ స్ట్రింగ్ క్వార్టెట్స్ (ఓపస్ సంఖ్య.18) ని 1798కీ 1800కీ నడుమ స్వరపరిచారు (ప్రిన్స్ లోబ్కొవిట్జ్ ఆజ్ఞానుసారం, అతనికి అంకితంగా వెలువడ్డాయి). అవి 1801లో ప్రచురితమయ్యాయి. 1800లోనూ, 1803లోనూ జరిగిన అతని తొలి రెండు సింఫనీల ద్వారా, మొజార్ట్, హయ్ డన్ల అనంతరం అంతటి అత్యంత ప్రముఖమైన స్వరకర్తగా పేరొందారు. పాథటిక్ సొనాటా (ఓపస్ సంఖ్య.13) గా పేరొందిన పియానో సొనాటాలనూ రాయడం ప్రారంభించారు.ఈ కంపోజిషన్ ని కూపర్ "అంతకు ముందున్న అతని కంపోజిషన్లను వ్యక్తిత్వ బలంలోనూ, అనుభూతి లోతులోనూ, ఒరిజినాలిటీ స్థాయిలోనూ దాటిపోయాయని" పేర్కొన్నారు. అతని సాప్టెట్ (ఓపస్. 20) ని కూడా 1799లో పూర్తిచేశాడు, అతని జీవితకాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కృతుల్లో అదొకటి.

లుడ్విగ్ వాన్ బీథోవెన్ 
1803లో బీథోవెన్, క్రిస్టియన్ హార్న్ మాన్ చిత్రం.

1800లో జరిగిన అతని తొలి సింఫనీకి, బీథోవెన్ బర్గ్ థియేటర్ ని అద్దెకి తీసుకున్నాడు. ప్రత్యేకమైన సంగీత కార్యక్రమంలో, హయ్ డన్, మొజార్ట్ ల కృతులూ, తన సెప్టెట్, తాను రాసిన ఒకానొక పియానో కాన్సర్ట్ లతో సహా వినిపించారు. (చివరి మూడు కృతులు అప్పటికి అముద్రితం). అల్జిమీన్ మ్యూసికాలిస్క జీతుంగ్ ఈ కచేరీని, "చాన్నాళ్ళ తర్వాత అత్యంత ఆసక్తిదాయకమైన కచేరీ"గా అభివర్ణించింది, అయితే ఇబ్బందులు ఎదురుకాలేదని కాదు, విమర్శల్లో "సోలోయిస్ట్ పట్ల ఏమాత్రం శ్రద్ధనీ వాద్యకారులు పెట్టలేదన్నది." కూడా ఉంది

మొజార్ట్, హయ్ డన్ ల ప్రభావం పక్కనపెట్టలేని విధంగా బీథోవెన్ పై ఉంది. ఉదాహరణకు, బీథోవెన్ యొక్క క్విన్టెట్ ఫర్ పియానో అండ్ విండ్స్ బీథోవెన్ విశిష్టతను పక్కనపెడితే అదే కాన్ఫిగరేషన్ తో ఉన్న మొజార్ట్ కృతితో చాలా దగ్గరి పోలికలు కలిగివుంది. బీథోవెన్ మెలోడీలు, సంగీతపర అభివృద్ధి, మాడ్యులేషన్, టెక్స్చర్ల, అనుభూతిని వినియోగించే పద్ధతి, వంటివి అన్ని ప్రభావాల నుంచి వేరుచేసి నిలబెట్టాయి, అతని విశిష్టతను తొలిగా ప్రచురితమైనప్పుడే వివరించాయి. 1800 సంవత్సరం ముగిసేనాటికే అతని అభిమానులు, ప్రచురణకర్తల నుంచి బీథోవెన్ కి, అతని సంగీతానికి డిమాండ్ పెరిగింది.

లుడ్విగ్ వాన్ బీథోవెన్ 
లుడ్విగ్ వాన్ బీథోవెన్: 1804-05 నాటి చిత్రీకరణ, చిత్రకారుడు విల్లిబ్రోర్డ్ మెహ్లెర్. పూర్తి చిత్రం బీథోవెన్ ఐరె గిటార్ తో ఉన్నట్టు చూపిస్తుంది.

1799 మేలో, బీథోవెన్ హంగేరియన్ కౌంటెస్ అన్నా బ్రూన్స్విక్ కుమార్తెలకు పియానో నేర్పాడు. ఈ కాలంలోనే అతను ఆమె చిన్నకూతురు జోసెఫైన్ తో ప్రేమలో పడ్డాడు. ఈ పాఠాలు ప్రారంభమైన కొన్నాళ్ళకే జోసఫైన్ ను కౌంట్ జోసెఫ్ డెమ్ కి ఇచ్చి వివాహం చేవారు. బీథోవెన్ వారింటికి తరచు ఆతిథ్యం స్వీకరించేందుకు వెళ్తూండేవాడు, జోసెఫైన్ కి బోధిస్తూండేవాడు, వారి పార్టీల్లోనూ, కచేరీల్లోనూ పియానో వాయిస్తూండేవాడు. అన్నివిధాలా ఆమె వివాహం ఆనందప్రథమైంది (మొదట్లో వచ్చిన కొన్ని ఆర్థిక సమస్యలు మినహాయిస్తే, ఈ దంపతులకు నలుగురు పిల్లలు పుట్టారు. హఠాత్తుగా డెమ్ 1804లో మరణించాకా జోసఫైన్-బీథోవెన్ మధ్య సంబంధం దృఢపడింది.

బీథోవెన్ కి మరికొందరు విద్యార్థులూ ఉండేవారు. 1801 నుంచి 1805 వరకూ, ఫెర్డినాండ్ రీస్ కి బోధించారు, తర్వాతి కాలంలో అతను స్వరకర్త అయి బీథోవెన్ రిమంబర్డ్ అన్న పుస్తకాన్ని వారి పరిచయాన్ని, అనుబంధాన్ని వివరిస్తూ రాశారు. కార్ల్ జెర్నై బీథోవెన్ వద్ద 1801 నుంచి 1803 వరకూ చదువుకున్నాడు. అతను ప్రఖ్యాతుడైన సంగీత గురువు అయ్యి, ఫ్రాంజ్ లిస్జ్ట్ కి సంగీతం బోధించారు, బీథోవెన్ 11 ఫిబ్రవరి 1812లో ఐదవ పియానో కన్సర్టో (ది ఎంపరర్) కి ఇన్స్ట్రక్టర్ గా పనిచేశారు.

బీథోవెన్ 1800 నుంచి 1802లో చేసిన కంపోజిషన్లలో ప్రముఖ స్థానాన్ని రెండు పెద్దస్థాయి ఆర్కెస్ట్రల్ కృతులు ఆక్రమించాయి. అయితే అతను మూన్లైట్ సొనాటాగా ప్రఖ్యాతమైన పియానో సొనాటా అయిన సొనాటా క్వాసీ ఉనా ఫన్టాసియా వంటి ఇతర ముఖ్యమైన కృతులనూ తయారుచేశారు. 1801లో ది క్రీచర్స్ ఆఫ్ ప్రొమెథియస్ అనే బాలెట్ పూర్తిచేశాడు. ఈ కృతి 1801-1802ల మధ్య అనేకమైన ప్రదర్శనలకు నోచుకుంది, దాని ప్రాచుర్యాన్ని సొమ్ముచేసుకునేందుకు పియానో అరేంజ్మెంట్ త్వరపడి ప్రచురించాడు. 1802లో రెండవ సింఫనీ పూర్తచేశాడు, ఇది తర్వాత రద్దైన ఓ కచేరీలో ప్రదర్శించేందుకు తయారుచేసుకున్నాడు. ఏప్రిల్ 1803లో థియేటర్ ఆన్ డెర్ వీన్లో (ఇక్కడ ఆయన కంపోజర్ ఇన్ రెసిడెన్స్ గా నియమితులయ్యారు) ప్రదర్శించారు.రెండవ సింఫనీతో పాటుగా కచేరీలో తొలి సింఫనీ, మూడవ పియానో కాన్సెర్టో, క్రైస్ట్ ఆన్ ది మౌంట్ ఆ్ ఆలివ్స్ అనే ఓరటొరియోలు కూడా ప్రదర్శించారు. మధ్యస్థంగా సమీక్షలు పొందినా, కచేరీ ఆర్థిక విజయాన్ని సాధించింది; బీథోవెన్ సాధారణమైన కచేరీ టిక్కెట్టుకు మూడురెట్లు సొమ్ము తీసుకోగలిగాడు.

బీథోవెన్ తమ్ముడు కార్ల్, అప్పటివరకూ సామాన్యంగా సహకరిస్తూ వచ్చినవాడల్లా అతని వ్యవహారాలను చూసుకునేందుకు పెద్ద పాత్రను స్వీకరించాకా, 1802లో ప్రచురణకర్తలతో అతని వ్యాపారకలాపాలు మరింత మెరుగుపడి, ఇంకా లాభసాటిగా మారాయి. కొత్తగా స్వరపరిచిన కృతులకు ఎక్కువ మొత్తాన్ని బేరం చేసిపెట్టడంతో పాటు, కార్ల్ అతని వెలుగుచూడని కృతులను కూడా వెలుగుచూసేట్టు, ప్రాచుర్యం పొందిన అతని కృతులను వేరే ఇన్స్ట్రుమెంట్లకు అరేంజ్మెంట్, ట్రాన్స్ క్రిప్షన్లు రాసేందుకు కూడా కోరాడు. ప్రచురణకర్తలని అతని కృతులను పోలిన అరేంజ్ మెంట్లకు వేరేవారిని పెట్టుకోకుండా నిరోధించలేక ఈ ప్రతిపాదనలు బీథోవెన్ తోసిపుచ్చాల్సి వచ్చింది.

వినికిడిశక్తి కోల్పోవడం

1796లో, 26ఏళ్ళ వయసులో, బీథోవెన్ వినికిడిశక్తి కోల్పోవడం ప్రారంభమైంది.. తీవ్రమైన టిన్నిటస్ తో బాదపడ్డాడు, సంగీతం వినిపించకుండా చెవిలో వచ్చే తీవ్రమైన గంటల శబ్దాలు వినిపించే జబ్బు అది; అతను ఇతరులతో సంభాషణలు కూడా తప్పించాలని ప్రయత్నించాడు. బీథోవెన్ చెవిటితనానికి కారణాలు తెలియవు, కానీ అది టైఫస్, ఆటో-ఇమ్యూన్ డిజార్డర్ వంటివాటికీ, చల్లని నీటిలో తలపెట్టి మెలకువగా ఉంచుకునే అతని అలవాటు వంటివాటికి వేర్వేరుగా పలువురు ఆపాదించారు. బీథోవెన్ మరణానంతరం చేసిన పంచనామాలో తెలిసినదాని ప్రకారం అతనికి లోపలి చెవిభాగం విషయంలో ఉన్న నిర్మాణపరమైన లోపం, లీజన్స్ కి దారితీసిందని వివరించింది.

లుడ్విగ్ వాన్ బీథోవెన్ 
1815లో బీథోవెన్, జోసెఫ్ విలియబ్రొర్డ్ మాహ్లెర్ వేసిన చిత్రం

1801 తొలినాళ్ళలోనే, బీథోవెన్ తన చెవిటితనం యొక్క లక్షణాలనూ, అందువల్ల వృత్తి, వ్యక్తిగత, సామాజిక వ్యవహారాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ స్నేహితులకు రాశారు (అయితే అప్పటికే అతనికి చాలా దగ్గరైన స్నేహితులకు ఈ విషయాలు తెలుసు). బీథోవెన్, వైద్యుని సలహామేరకు హీలిగెన్ స్టాడ్ట్ అనే చిన్న ఆస్ట్రియన్ పట్టణంలో 1802 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ నివసించారు, తద్వారా తన పరిస్థితిని అర్థం చేసుకుని తనకు తానే దానితో కొన్ని ఏర్పాట్లు చేసుకుందుకు. అక్కడే అతను హీలిగెన్ స్టాడ్ట్ టెస్ట్మెంట్ పేరిట, తమ్ముళ్ళకి ఓ ఉత్తరం రాశాడు. అందులో తనకు ఆత్మహత్య చేసుకోవలన్న ఆలోచనలు కలుగుతున్నట్టు, అయితే కళ కోసం, కళ ద్వారా జీవించాలన్న సంకల్పంతోనే బతుకుతున్నట్టు రాశారు. కాలక్రమేణా, అతని వినికిడి లేమి తీవ్రతరం కావచ్చింది: చివరాఖరికి 1824లో అతని ప్రఖ్యాతమైన తొమ్మిదవ సింఫనీ తొలి ప్రదర్శన సందర్భంగా ఆర్కెస్ట్రా సంగీతం కానీ, చప్పట్ల శబ్దం కానీ వినలేకపోవడంతో చివర్లో ప్రేక్షకుల కరతాళధ్వనులు తెలుసుకునేందుకు చుట్టూ కలయజూడాల్సి వచ్చింది. బీథోవెన్ వినికిడిలేమి అతన్ని సంగీతాన్ని స్వరపరిచడంలో అడ్డుకోలేకపోయింది, కానీ అతనికి ఆదాయం బాగా సమకూర్చిపెట్టే కచేరీల విషయంలో మాత్రం అడ్డుకుంది. 1811లో తన పియానో కన్సెర్టో నెం.5 (ద ఎంపరర్) ప్రదర్శించడానికి విఫలయత్నం చేసి, దాన్ని తొలిగా అతని శిష్యుడు కార్ల్ జెర్నీ ప్రదర్శించాకా, మళ్ళీ అతని తొమ్మిదవ సింఫనీని 1824లో ప్రదర్శించేంతవరకూ కూడా బహిరంగ ప్రదర్శనకు ప్రయత్నించలేదు.

బీథోవెన్ వాడిన ఇయర్ హార్న్ వంటి వినికిడి సహాయక పరికరాలు జర్మనీలోని బోన్ పట్టణంలో బీథోవెన్ హౌస్ మ్యూజియంలో ఉన్నాయి. ఆయన ఆందోళన పక్కనపెడితే, బీథోవెన్ 1812 వరకూ మాటలు, సంగీతం కూడా సాధారణంగానే వినగలిగాడని జోర్న్ గుర్తుచేసుకున్నారు. 1814 నుంచి 44 ఏళ్ళ వయసు వరకూ బీథోవెన్ దాదాపుగా పూర్తి వినికిడిలేమితో జీవించాడు. కొందరు సందర్శకులతో తన పియానోపై గట్టి శబ్దాన్ని చేసి, "ఈజ్ట్ ఎస్ నిచ్ట్ స్కోన్?" (చాలా బావుంది కదా?) అని అడిగినప్పుడు, అతని ధైర్యాన్ని, హాస్యస్ఫూర్తిని మెచ్చుకుంటూ లోతైన సానుభూతితో ప్రతిఫలించారు. (ముందుగా ఎక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలను వినేశక్తి కోల్పోయారాయన).

బీథోవెన్ వినికిడిశక్తి కోల్పోవడంతో అతని సంభాషణల పుస్తకాలు అత్యంత విలువైన మూలాలుగా నిలిచాయి. ఆయన చివరి పదేళ్ళ జీవితకాలంలో వీటిని వినియోగించడం ప్రారంభించారు, ముందుగా వారి స్నేహితులో, కుటుంబసభ్యులో వాటిలో తాము చెప్పదలిచింది రాస్తే, దాన్ని చదవి మాట్లాడిగానీ, తానూ రాసి గానీ బదులిచ్చేవారు. ఈ పుస్తకాలు సంగీతం గురించిన చర్చలు, ఇతర ముఖ్య విషయాలు కలిగివుంటాయి, బీథోవెన్ ఆలోచనధోరణిపై లోతైన చూపునిస్తాయి.; పరిశోధకులకు తన సంగీతాన్ని ఎలా ప్రదర్శించాలని భావించాడో, కళ గురించి ఆయన దృక్కోణమేంటో ఆ పుస్తకాలు వివరిస్తాయి. బీథోవెన్ మరణానంతరం ఆంటన్ స్కిండ్లర్ కేవలం ఒకేఒక ఆదర్శవంతమైన జీవితచరిత్రే ఉండాలని భావించి మొత్తం 400 సంభాషణ పుస్తకాల్లో, 264 పుస్తకాలను నాశనం చేసి మిగతావాటిలో మార్పులను చేశారు. అయితే థియోడర్ ఆల్బ్రెక్ట్ ఇలా స్కిండ్లర్ చేసిన పనిలోని అసంభావ్యతను వ్యతిరేకించారు.

పోషకులు

లుడ్విగ్ వాన్ బీథోవెన్ 
బీథోవెన్ పోషకుడు, ఆర్చ్‌బిషప్ రుడాల్ఫ్

బీథోవెన్ తన కృతుల ప్రచురణల ద్వారానూ, ప్రదర్శనల ద్వారానూ సంపాదించుకున్నా, అతను ఆదాయం కోసం పోషకులపై కూడా ఆధారపడ్డారు. పోషకుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు, వారు కోరి చేయించుకున్న కృతులను ప్రచురణకు ముందు ప్రత్యేకించిన కాలం పాటు కాపీ ఇవ్వడం వంటివి చేసేవారు. కొందరికి కృతులను అంకితం ఇచ్చారు. ఆయన తొలినాళ్ళ పోషకుల్లో ప్రిన్స్ లోబ్కోవిట్జ్, ప్రిన్స్ లిక్నోవ్ స్కీ వంటివారు కృతులను కోరిచేయించుకున్నందుకు ఇచ్చేవి, ప్రచురితమైన కృతులు కొనడం వంటివే కాకుండా వార్షిక ఉపకారవేతనాలు కూడా అందించేవారు.

బీథోవెన్ ను పోషించిన అత్యంత ముఖ్యుడైన ఉన్నత తరగతి పోషకుడు రెండవ లియోపాల్డ్ చక్రవర్తి చిన్నకుమారుడు ఆర్చ్‌డ్యూక్ రూడాల్ఫ్, ఆయన బీథోవెన్ వద్ద పియానో, కంపోజిషన్ 1803 లేదా 1804ల్లో ప్రారంభించి అభ్యసించారు. క్లెరిక్ (కార్డినల్-ప్రీస్ట్) కు బీథోవెన్ స్నేహితుడయ్యాడు, 1824 వరకూ వారిద్దరూ కలుస్తూండేవారు. రూడాల్ఫ్ కి బీథోవెన్ 14 కంపోజిషన్లు అంకితం ఇచ్చారు, ఆర్చ్‌డ్యూక్ ట్రయో (1811) గా పేరుపెట్టినవీ, అతని అత్యుత్తమ మిస్సా సోలెమ్నిస్ (1823) వాటిలో ఉన్నాయి. అందుకు ప్రతిగా రూడాల్ఫ్ తన ఒకానొక కంపోజిషన్ బీథోవెన్ కు అంకితం ఇచ్చారు. రూడాల్ఫ్ కు బీథోవెన్ రాసిన ఉత్తరాలు వియన్నాలోని గెసెల్చఫ్ట్ డెర్ మ్యూసిక్ ఫ్రౌండెలో భద్రపరిచారు. మరోక పోషకుడు కౌంట్ (తర్వాతి కాలంలో ప్రిన్స్) ఆండ్రియాస్ రజుమోవ్స్కీ, స్ట్రింగ్ క్వార్టెట్స్ నం.7-9, ఓపస్.59 కృతికి అతని పేరు మీదుగా రసుమోవ్ స్కీ అని పెట్టారు.

1808 శరత్కాలం (ఆటమ్) లో, రాయల్ థియేటర్లో ఉద్యోగానికి తిరస్కరింపబడ్డప్పుడు, బీథోవెన్ కు నెపోలియన్ సోదరుడు, ఆనాడు వెస్ట్ ఫాలియాకు రాజు అయిన జెరోమ్ బోనపార్టే నుంచి ఓ అవకాశం వచ్చింది. కాసెల్ లోని అతని ఆస్థానంలో మంచి జీతంతో కూడిన కపెల్ మీస్టర్ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. వియన్నాలోనే ఉండేందుకు ఒప్పించడానికి బీథోవెన్ స్నేహితుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆర్చ్‌డ్యూక్ రుడాల్ఫ్, ప్రిన్స్ కిన్ స్కీ, ప్రిన్స్ లోబ్కొవిట్జ్ లు బీథోవెన్ కు ఏడాదికి నాలుగువేల ఫ్లోరిన్లు (అప్పటి కరెన్సీ) పింఛనుగా అందించేందుకు మాట ఇచ్చారు. ఆర్చ్‌డ్యూక్ రుడాల్ఫ్ మాత్రమే అంగీకరించిన పింఛన్లో తన వాటా ఇచ్చారు కిన్ స్కీని వెనువెంటనే సైనిక బాధ్యతల కోసం పిలవడం, ఆ క్రమంలో అతని గుర్రం నుంచి పడిపోయి మరణించడం జరిగాయి. లోబ్కోవిట్జ్ 1811సెప్టెంబరులో చెల్లించడం నిలిపివేశారు. పోషణ సొమ్మును ఇచ్చేందుకు వారసులెవరూ ముందుకురాలేదు. బీథోవెన్ కంపోజిషన్ల హక్కులు అమ్మడంపైనా, కొద్దిమాత్రం పింఛన్ పైన మాత్రమే ఆధారపడి 1815 తర్వాత జీవించారు. ఈ డబ్బుసంబంధమైన ఏర్పాట్లు ఫ్రాన్స్ తో యుద్ధం కారణంగా ప్రభుత్వం యుద్ధ అవసరాల కోసం ఎక్కువ కరెన్సీ ముద్రించడంతో ఏర్పడ్డ మాంద్యం వల్ల కొంతవరకూ వెనక్కిపోయాయి.

మధ్యకాలం

లుడ్విగ్ వాన్ బీథోవెన్ 
మూన్ స్టెర్ ప్లాట్జ్, బోన్ లో బీథోవెన్ స్మారకచిహ్నం

బీథోవెన్ హీలిగెన్ స్టడ్ట్ నుంచి వియన్నా తిరిగివచ్చాకా అతని సంగీతశైలిలో సరికొత్త మార్పు చోటుచేసుకుంది, ప్రస్తుతం దాన్ని మధ్య లేదా హీరోయిక్ కాలపు ఆరంభంగా గుర్తిస్తున్నారు. కార్ల్ జెర్నీ ప్రకారం, బీథోవెన్, "ఇప్పటివరకూ నేను చేసిన కృతులతో, కృషితో నేను సంతృప్తి చెందలేదు. ఇప్పటి నుంచీ కొత్త మార్గాన్ని స్వీకరిద్దామనుకుంటున్నాను" అన్నాడు. హీరోయిక్ అనే పదబంధం గొప్పస్థాయిలో అనేకమైన స్వతంత్రమూ, స్వంతశైలిలో ఉన్నవీ అయిన గొప్ప స్థాయికి చెందిన కృతులు కంపోజ్ చేయడాన్ని నిర్దేశిస్తోంది. ఇలాంటి కొత్త శైలిని అమలుచేస్తూ తయారుచేసిన మొట్టమొదటి ప్రధానమైన కృతి ఇ-ఫ్లాట్లోని అతని మూడవ సింఫనీ, ఎరోయికాగా పేరొందినది. అంతకుముందున్న సింఫనీలన్నిటిలోనూ ఈ కృతి పరిమితిలో పెద్దదీ, సుదీర్ఘమైనది. 1805లో తొలిగా ప్రదర్శింపబడ్డప్పుడు మిశ్రమ స్పందన పొందింది. కొందరు శ్రోతలు సుదీర్ఘంగా ఉండడంపై అభ్యంతరం తెలిపారు, లేదా దాని నిర్మాణాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, ఐతే ఇతరులు దాన్నొక అపురూపమైన కృతిగా, మాస్టర్ పీస్ గా చూశారు.

మధ్యకాలం కొన్నిసార్లు స్వరకల్పనలో హీరోయిక్ విధానం కలిగివుంది, అయితే హీరోయిక్ అనే పదాన్ని వాడడంపై బీథోవెన్ పాండిత్యరంగంలో అభ్యంతరం పెరుగుతోంది. మధ్యకాలానికి ప్రత్యామ్నాయ నామంగా సాధారణం కన్నా ఎక్కువగానే వాడారు. మొత్తం మధ్యకాలానికి హీరోయిక్ అన్న పదాన్ని వాడడంలోని సంభావ్యత ప్రశ్నింపబడింది: అలానే కొన్ని కృతులు, ముఖ్యంగా మూడవ, నాల్గవ సింఫనీలు, హీరోయిక్ అని అభివర్ణించడానికి అనువుగానేవుంటాయి, పాస్టొరల్ అన్న ఆరవ సింఫనీ వంటి అనేకం అందుకు తగినవి కావు.

కొన్ని మధ్యకాలపు కృతుల్లో బీథోవెన్ సంగీత భాష హయ్డన్, మొజార్ట్ ల నుంచి పారంపర్యంగా పొందినవి ఉన్నాయి. మధ్యకాలపు కృతుల్లో మూడు నుంచి ఎనిమిదవ సింఫనీ వరకూ, రసుమోవ్ స్కీ, హార్ప్, సెరియోసో అన్న స్ట్రింగ్ క్వార్టెట్లు, ద వాల్డ్ స్టైన్, అపాస్సియోనాటా పియానో సానెట్లు, క్రైస్ట్ ఆఫ్ ది మౌంట్ ఆఫ్ ఆలివ్స్, ఒపెరా ఫిడెలియో, వయొలిన్ కాన్సెర్టియో వంటి అనేక కంపోజిషన్లు ఉన్నాయి. ఈ కాలంలో బీథోవెన్ ఆదాయం అతని ప్రచురితమైన కృతుల నుంచీ, వాటి ప్రదర్శనల నుంచీ, అతని పోషకుల నుంచీ లభించింది. థియేటర్ మేనేజ్ మెంట్ మారాకా థియేటర్ అన్ డెర్ వీన్ లో అతని ఉద్యోగం నుంచి 1804 తొలగించారు. గత్యంతరం లేని స్థితిలో అతని స్నేహితుడు స్టీఫెన్ వాన్ బ్ర్యూనింగ్ తో కలిసి వియన్నా సబ్ అర్బ్స్ లోకి మారాల్సివచ్చింది. ఇది ఫిడెలియో అనే కృతిపై చేసే పని వేగం మందగించేలా చేసింది. ఆ సమయానికి అదే అతని అతిపెద్ద కృతి. ఆస్ట్రియన్ సెన్సార్ కారణంగా అది మళ్ళీ వెలుగుచూడడం ఆలస్యమైంది. చివరికి 1805 నవంబర్ నెలలో ఫ్రెంచి వారు నగరాన్ని ఆక్రమించడంతో దాదాపుగా ఖాళీ అయిన నగరపు ఇళ్ల మధ్య మొదట ప్రదర్శితమైంది. ఇలా ఆర్థికంగా విఫలం కావడంతో పాటుగా, ఫిడెలియో యొక్క మొదటి వెర్షన్ విమర్శకుల వద్ద కూడా వైఫల్యంగా నిలిచింది, బీథోవెన్ దీనిని తిరిగి పరిశీలించి సరిజేయడం ప్రారంభించారు.

ఫెర్డినాండ్ చెప్పినదాని ప్రకారం 1809లో, నెపోలియన్ సేనలు వియన్నాను ఆక్రమిస్తుండగా జరిపిన బాంబుదాడుల్లో తన మిగిలిన కాస్త వినికిడిశక్తి కూడా కోల్పోతానేమోనని బీథోవెన్ చాలా ఆందోళన చెందాడు, దాన్నుంచి తప్పించుకునేందుకు అతని తమ్ముడి ఇంటి భూగర్భంలో దాక్కుని, చెవులను దిండ్లతో దాచుకున్నాడు.

మధ్యకాలంలోని బీథోవెన్ కృతులు ఆయనను మాస్టర్ గా నిలబెట్టాయి. 1810 నుంచీ జరిగిన సమీక్షల్లో ఇ.టి.ఎ.హాఫ్ మాన్ ఆయనను రొమాంటిక్ శైలికి చెందిన అత్యుత్తములైన ముగ్గుర స్వరకర్తల్లో ఒకనిగా నిలిపారు; బీథోవెన్ అయిదవ సింఫనీని హాఫ్ మాన్ "మన కాలానికి చెందిన ఒకానొక అతి ముఖ్యమైన కృతి"గా అభివర్ణించారు.

వ్యక్తిగత, కుటుంబ ఇబ్బందులు

బీథోవెన్ ప్రేమని తరగతుల సమస్య దెబ్బతీసింది. 1801 చివరిలో అతను యువకురాలైన కౌంటెస్, జూలీ (గియులియెట్టా) గియుచ్చియార్డిని బ్రూన్స్ విక్ కుటుంబం ద్వారా జోసెఫైన్ బ్రూన్స్ విక్ కి తరచుగా పియానో తరగతులు ఇస్తున్న కాలంలో కలిశారు. బీథోవెన్ జూలీపై తనకున్న ప్రేమను 1801 నవంబరులో తన చిన్ననాటి స్నేహితుడు ఫ్రాంజ్ వెగెలర్ కి రాసిన ఉత్తరంలో ప్రస్తావించారు. అలానే తనకు ఆమెకూ ఉన్న అంతస్తుల తేడా వల్ల ఆమెను వివాహం చేసుకోవడం పరిగణించలేననీ రాశారు. బీథోవెన్ తర్వాత అతని పద్నాలుగవ సొనాటా, మూన్ లైట్ సొనాటాగానూ, మోన్డ్ స్కీన్ సొనాటా (జర్మన్లో) పేరొందిన కృతిని ఆమెకు అంకితం ఇచ్చారు.

References

Notes

Tags:

లుడ్విగ్ వాన్ బీథోవెన్ జీవిత చరిత్రలుడ్విగ్ వాన్ బీథోవెన్De-Ludwig van Beethoven.oggEn-LudwigVanBeethoven.oggదస్త్రం:En-LudwigVanBeethoven.ogg

🔥 Trending searches on Wiki తెలుగు:

ఇన్‌స్టాగ్రామ్రామప్ప దేవాలయంతెలుగు సినిమాలు డ, ఢపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఢిల్లీ డేర్ డెవిల్స్అక్కినేని నాగార్జునభారత జాతీయ చిహ్నంహిందూధర్మంబమ్మెర పోతనయోనిఅమెజాన్ ప్రైమ్ వీడియోఘట్టమనేని కృష్ణవంగవీటి రంగాసామెతలుమురుడేశ్వర ఆలయంతెలంగాణ చరిత్రకాకినాడస్వర్ణకమలంకల్వకుంట్ల కవితశ్రీ చక్రంమమితా బైజుఉలవలుసుధ (నటి)ఖమ్మంవిద్యా బాలన్అయలాన్ఋగ్వేదంకోదండ రామాలయం, ఒంటిమిట్టత్రిష కృష్ణన్రైతుబంధు పథకంఆంధ్రప్రదేశ్ శాసనసభతోటపల్లి మధుమూలా నక్షత్రంసీతాదేవితెలుగునాట జానపద కళలుహస్త నక్షత్రముభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుసెక్యులరిజంగ్లోబల్ వార్మింగ్బుధుడు (జ్యోతిషం)నాగార్జునసాగర్అల్లూరి సీతారామరాజుసజ్జల రామకృష్ణా రెడ్డిపాలకొల్లు శాసనసభ నియోజకవర్గంవేంకటేశ్వరుడుసమంతనందమూరి తారక రామారావుప్రేమలుమేషరాశిసూర్యుడుశతక సాహిత్యముపద్మశాలీలువిరాట పర్వము ప్రథమాశ్వాసముభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంసూర్య నమస్కారాలువిడాకులుశ్రీ కృష్ణుడుజూనియర్ ఎన్.టి.ఆర్తెలుగు సంవత్సరాలుతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాపూర్వాషాఢ నక్షత్రముతెలంగాణ గవర్నర్ల జాబితాఅంగారకుడు (జ్యోతిషం)కాకతీయులుఘట్టమనేని మహేశ్ ‌బాబుగుంటకలగరహనుమంతుడుఇక్ష్వాకులుపాముసంగీత వాద్యపరికరాల జాబితాపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుపంచభూతలింగ క్షేత్రాలువిజయనగర సామ్రాజ్యంవాతావరణం🡆 More