మొహమ్మద్ షమీ

మొహమ్మద్ షమీ (జననం 1990 మార్చి 9) బెంగాల్ దేశీయ క్రికెట్ కు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు.

అతను కుడి చేతి ఫాస్ట్-మీడియం స్వింగ్, సీమ్ బౌలర్. అతడు 85 మీ/గం. (140కి.మీ/గం) వేగంతో నిలకడగా బౌలింగ్ చేస్తాడు. ఇది అతనికి మాయాశీల ఫాస్ట్ బౌలర్గా పేరు తెచ్చింది. అతడిని రివర్స్ స్వింగ్ స్పెషలిస్టుగా కూడా పిలుస్తారు. అతడు ఒన్ డే ఇంటర్నేషనల్ లో జనవరి 2013న పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ ద్వారా ప్రవేశించాడు. ఆ చ్ లో నాలుగు మేడిన్ ఓవర్స్ చేసి రికార్డు సృష్టించాడు. నవంబరు 2013 న వెస్ట్ ఇండీస్ తోజరిగిన టెస్టు మ్యాచ్ లో ప్రవేశించి ఐదు వికెట్లను పడగొట్టాడు.

మొహమ్మద్ షమీ
మొహమ్మద్ షమీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మొహమ్మద్షమీ
పుట్టిన తేదీ (1990-03-09) 1990 మార్చి 9 (వయసు 34)
అమోహా, ఉత్తరప్రదేశ్, భారతదేశం
ఎత్తు5 ft 8 in (1.73 m)
బ్యాటింగుకుడిచేతి
బౌలింగుకుడి చేతి (ఫాస్టు మీడియం)
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 279)2013 నవంబరు 21 - వెస్ట్ ఇండీస్ తో
చివరి టెస్టు2018 జనవరి 27 - దక్షిణ ఆఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 195)2013 జనవరి 6 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2017 సెప్టెంబరు 28 - ఆస్ట్రేలియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.11
తొలి T20I (క్యాప్ 46)2014 మార్చి 21 - పాకిస్తాన్ తో
చివరి T20I2017 జూలై 9 - వెస్ట్ ఇండీస్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.11
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010/11–ప్రస్తుతంబెంగాల్ క్రికెట్ టీం
2012–2013కోల్‌కతా నైట్ రైడర్స్ (స్క్వాడ్ నం. 11)
2014–ప్రస్తుతంఢిల్లీ డేర్ డివిల్స్ (స్క్వాడ్ నం. 11)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టు క్రికెట్ ఒన్ డే ఇంటర్నేషనల్ టి 20 లిస్టు A క్రికెట్
మ్యాచ్‌లు 30 50 7 79
చేసిన పరుగులు 371 116 289
బ్యాటింగు సగటు 14.27 10.54 9.96
100లు/50లు 0/1 0/0 -/- 0/1
అత్యుత్తమ స్కోరు 51 25 26
వేసిన బంతులు 5634 2525 142 3949
వికెట్లు 110 91 8 145
బౌలింగు సగటు 28.91 25.37 31.25 23.97
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/28 4/35 3/38 4/25
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 16/– -/– 28/–
మూలం: ESPN Cricinfo, 2018 జనవరి 26

మహమ్మద్‌ షమీ వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన ఏకైక భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

జీవిత విశేషాలు

షమీ వాస్తవంగా ఉత్తరప్రదేశ్ లోణి సాహస్‌పూర్ కి చెందినవాడు. అతడి తండ్రి టోసిఫ్ ఆలీ సాధారణ రైతు. తండ్రి కూడా యుక్తవయసులో క్రికెట్ లో ఫాస్టు బౌలర్ గా ఆడేవాడు. షమీకి ఒక సోదరి, ముగ్గురు సోదరులు. సోదరులు కూడా ఫాస్టు బౌలర్స్ కావాలని కోరుకుంటున్నారు. 2005లో అతడి తంద్రి షమీలోని బౌలింగ్ నైపుణ్యాన్ని గమనించి అతడిని తన గ్రామానికి 22 కి.మీ దూరంలో ఉన్న మొరాదాబాదులోని క్రికెట్ కోచ్ బద్రుద్దీన్ సిద్దిక్ వద్దకు తీసుకుపోయాడు.

"నేను 15 యేండ్ల బాలునిగా నెట్స్ వద్ద భౌలింగ్ ను చూసినపుడు నేను ఈ బాలుడు సామాన్యమైన వాడు కాదని అనుకున్నాను. అందువల్ల ఈ బాలునికి శిక్షణ ఇవ్వాలనుకున్నాను. ఒక సంవత్సరంలో మాకు క్లబ్ క్రికెట్ ఇక్కడ లేనందువల్ల అతడిని యు.పి. ట్రైల్స్ కు తయారుచేసాను. అతడు బాగా సహకరించేవాడు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం కలిగి ఉండేవాడు. అతడు శిక్షణలో ఒక్కరోజు కూడా గైర్హాజరు కాలేదు. అండర్ 19 ట్రయల్స్ లో అతడు బాగా బౌలింగ్ చేసాడు, కానీ రాజకీయ కారణాల వల్ల సెలక్షన్ కాబడలేదు. వారు అతడిని తరువాత సంవత్సరం తీసుకురమ్మని చెప్పారు, కానీ ఆ సమయంలో నేను ఒక సంవత్సరం మిస్ చేయకూడదని కోరుకున్నాను. అందువల్ల నేను అతడి తల్లిదండ్రులకు కోల్‌కతా పంపించమని సలహా ఇచ్చాను."

— బద్రుద్దిన్ సిద్దిక్ (మొహమ్మద్ షమీ గురించి)

షమీ అండర్ 19 విభాగంలో ఉత్తర ప్రదేశ్ జట్టులో స్థానం పొందలేనందున బద్రుద్దీన్ అతడిని 2005లో కోల్‌కతాకు పంపాడు. షమీ డల్హౌసీ అథ్లెటిక్ క్లబ్ కు ఆడేవాడు. ఆ క్లబ్ కొరకు ఆడుతున్నప్పుడు బెంగా క్రికెట్ అసోసియేషన్‌కు మాజీ అసిస్టెంట్ సెక్రటరీ అయిన "దెబబ్రాటదాస్" చే గుర్తింపబడ్డాడు. అతడు షమీ బౌలింగ్ కు ఆకర్షితుడై అతడి టీం (టౌన్ క్లబ్) లో ఆడవలసినదిగా కోరాడు. దీనికి రూ. 75,000 కాంట్రాక్ట్ గా కూడా మాట్లాడుకున్నారు. దాస్ కలకత్తాలో నివాస స్థానం లేని షమీని తన ఇంటికి తీసుకు పోయాడు. షమీ టౌన్ క్లబ్ తరౌన బాగా బౌలింగ్ చేసి అండర్ 22 బెంగాల్ జట్టులో స్థానం సంపాదించాడు. దాస్ క్రికెట్ జట్టు ఎంపికదరులలో ఒకరైన సమర్బన్ బెనర్జీ వద్దకు షమీని తీసుకొని పోయి షమీ బౌలింగ్ పరిశీలించవలసినదిగా కోరాడు. బెనర్జీని అతడి బౌలింగ్ ఆకట్టుకుంది. అతడు బెంగాల్ అండర్ 22 జట్టులో స్థానం కల్పించాడు.

"షమీ ఎప్పుడూ డబ్బును కోరుకోలేదు. అతడి లక్ష్యం స్టంపులు, స్టంపుకు బంతి తగిలినప్పుడు దాని నుండి వచ్చిన శబ్దం. నేను అతనిని చూసినప్పటి నుండి, అతని వికెట్లలో ఎక్కువగా బౌల్డ్ చేయబడినవి. అతను ఒక నిటారుగా ఉండి, స్టంపుపై లేదా ఆఫ్ స్టంపుకు కొద్దిగా వెలుపలకు, వెనుకకు కట్ అయ్యే విధంగా బౌల్ చేస్తాడు."

— మొహమ్మద్ షమీ గురించి దేబాబ్రత దాస్

బెంగాల్ జట్టులో స్థానం పొందిన తరువాత దాస్ బెంగాల్ లో పెద్దక్లబ్ అయిన మోహన్ బగన్ క్లబ్ కు షమీని పంపాడు ఆ క్లబ్ లో చేరిన తరువాత ఈడెన్ గార్డెన్ నెట్స్ వద్ద సౌరవ్ గంగూలీకు బౌలింగ్ చెసేవాడు. గంగూలీ షమీ బౌలింగ్ నైపుణ్యాన్ని గమనించి అతడిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సెలక్టర్లను కోరాడు. తరువాత 2010లో బెంగాల్ రంజీ స్క్వాడ్ లో స్థానంపొందాడు.

దేశీయ జీవితం

షమీ మొట్టామొదటి సారిగా 2010లో ఆస్సాంతో ఫస్టు క్లాసు క్రికెట్ ను ప్రారంభించాడు. అందులో మూడు వికెట్లను తీసుకున్నాడు. దేశీయ క్రికెట్ లో అతని ప్రదర్శన కారణంగా 2012 లో వెస్ట్ ఇండీస్-బౌండ్ ఇండియా (ఎ) స్క్వాడ్ లో స్థానం పొందాడు. ఆ ఆటలో మ్యాచ్ గెలుపు కోసం 10వ వికెట్ వద్ద 73 పరుగుల భాగస్వామ్యాన్ని చేసాడు. 2012-12 లో రంజీ ట్రోఫీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ లో హైదరాబాదు జట్టుకు ప్రత్యర్థిగా ఆడాడు. అందులో 4/36, 6/71 వికెట్లు తీసుకొని 6 బంతులకు 15* పరుగులను చేసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్

షమీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో "కోల్‌కతా నైట్ రైడర్స్" 2011 సీజన్ కు ఒప్పందం చేసుకున్నాడు. దీనికి కోచ్ గా వసీం అక్రం వ్యవహరించేవాడు. ఈ సీజన్ లో షమీ కొన్ని మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. అతను తరువాతి రెండు సీజన్లలో ఫ్రాంచైజ్ చేత కొనసాగించబడ్డాడు, 2012 లో టైటిల్ గెలుచుకున్న జట్టులో ఒక భాగమయ్యాడు.

2014లో ఢిల్లీ డేర్ డెవిల్స్ అతడిని 4.25 కోట్లకు కొనుగోలు చేసింది. అందులో అతడు కొన్ని మ్యాచ్ లు ఆడాడు. అయితే అతని బృందం మంచి సీజన్ఉం లో లేనందువల్ల అతడిని ఐపిఎల్ యొక్క 2015 ఎడిషన్లో ఫ్రాంచైస్ ఉంచాడు. అతను మంచి పేస్ బౌలింగ్ చేసాడు. అతడు 140 కిమీ / గం వేగం కంటే ఎక్కువగా బౌలింగ్ చేసాడు. అతడి వేగవంతమైన బంతి వేగం 147.9 km/h.

జనవరి 2018 లో ఐపిల్ 2018 అతడిని కొనుగోలుచేసింది.

అంతర్జాతీయ జీవితం

ODI జీవితం

షమీ బెంగాల్ జట్టు సహ సభ్యుదు అశోక్ దిండా స్థానంలో పాకిస్థాన్ తో జరిగిన ఒన్ డే ఇంటర్నేషనల్ సిరీస్ కు ఎంపిక కాబడ్డాడు. తరువాత 2013 జనవరి 5 న మూడవ ఒ.డి.ఐలో ప్రవేశించాడు. అతను 9 ఓవర్లలో 1/23 స్కోరును చేసి తక్కువ స్కోరు ఆటలో ఓడించి భారతదేశం 10 పరుగుల తేడాతో విజయం సాధించేటట్లు చేసాడు.

అక్టోబరు 2013 లో ఆస్ట్రేలియా పర్యటన కోసం అతడు ఎంపికయ్యాడు. మొదటి 3 మ్యాచ్లకు ఆడకపోయినప్పటికీ, అతను నాల్గో మ్యాచ్లో 3 వికెట్లు తీసుకున్నాడు.

2014 లో న్యూజిలాండ్లో జరిగిన భారత పర్యటనలో, షామీ 28.72 సగటుతో 11 వికెట్లు తీసుకున్నాడు.

2014 మార్చి 5 న, ఆసియా కప్‌ కొరకు ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన మ్యాచ్లో షామీ 50 వన్డేల వికెట్లు సాధించిన రెండవ వ్యక్తిగా నిలిచాడు. అతను టోర్నమెంట్ను 9 వికెట్లు 23.59 వద్ద ముగించాడు.

ఇంగ్లండ్ తో 3-1 తేడాతో టెస్టు సిరీస్ను కోల్పోయిన తరువాత భారతదేశం 3-1 తేడాతో ODI సిరీస్ను గెలుచుకుంది, దీనిలో 24.16 సగటుతో 8 వికెట్లు తీసుకున్నాడు.

5వ ODI లో ఓటమి అంచున ఉన్న స్పెల్ లో మంచి లైన్ అండ్ లెంగ్త్ , మిడిల్ స్టప్ యార్కర్స్ తో బౌలింగ్ చేసాడు క్రికెట్ పండుతులు అతడిని "ఇండియా బౌలింగ్ ప్యూచర్" అనిపిలుస్తారు.

2014 అక్టోబరులో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్‌లో షామీ 10 వికెట్లు 17.40 సగటుతో సాధించాడు.

సిరీస్లో రెండో వన్డేలో అతను తన వన్డేల్లో అత్యదిక స్థానాన్ని పొందాడు. అతను 9.3 ఓవర్లలో 36 పరుగులకు 4 వికెట్లు తీసుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

9 మార్చి 2018 న షమీ, అతని కుటుంబ సభ్యులపై అతని భార్య హసీన్ జహాన్ గృహ హింస, అక్రమ సంబంధాల ఆరోపణలు చేస్తూ ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసింది. హత్యాయత్నం, మాన భంగం ఆరోపణలను కూడా హసీన్ జత చేసింది. షమీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని కూడా హసీన్ ఆరోపించింది.

ఈ ఆరోపణల దృష్ట్యా BCCI షమీ పేరును తమ ఒప్పందాల చిట్టా నుండి తొలగించింది. 2018 మార్చి 22 న, BCCI యొక్క అవినీతి నిరోధక విభాగం షమీ నిర్దోషి అని తేల్చాక, తిరిగి అతను ఒప్పందాల చిట్టాలో చేరాడు.

11 ఏప్రిలల్ 2018న హసీన్ జహాన్ తన/తమ కూతురి ఖర్చులకు గాను షమీ వద్ద నుండి నెలకు 15 లక్షల చొప్పున భరణం కోరింది .

జీవితంలో మైలు రాళ్ళు

ఐదు వికెట్లు తీసుకొన్న మ్యాచ్ లు

# సంఖ్యలు మ్యాచ్ ప్రత్యర్థి క్రికెట్ మైదానం క్రికెట్ మైదానం దేశం సంవత్సరం
1 5/47 1 మొహమ్మద్ షమీ  వెస్ట్ ఇండీస్ ఈడెన్ గార్డెన్స్ కోల్‌కతా భారతదేశం 2013
2 5/112 12 మొహమ్మద్ షమీ  ఆస్ట్రేలియా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ సిడ్నీ ఆస్ట్రేలియా 2015
3 5/28 30 మొహమ్మద్ షమీ  దక్షిణాఫ్రికా న్యూ వాండర్స్ స్టేడియం జోహన్స్‌బర్గ్ దక్షిణాఫ్రికా 2018

అంతర్జాతీయ పురస్కారాలు

ఒన్-డే ఇంటర్నేషనల్ క్రికెట్

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు

క్ర.సం. ప్రత్యర్థి జట్టు క్రికెట్ మైదానం తేదీ మ్యాచ్ ప్రదర్శన ఫలితం
1 వెస్ట్ ఇండీస్ ఫిరోజ్ షా కోట్లా మైదానం, ఢిల్లీ 2014 అక్టోబరు 11 DNB ; 9.3-0-36-4 మొహమ్మద్ షమీ  IND won by 48 runs.
2 వెస్ట్ ఇండీస్ WACA మైదానం, పెర్త్ 2015 మార్చి 6 8-0-35-3 ; DNB మొహమ్మద్ షమీ  IND won by 4 wickets.

మూలాలు

Tags:

మొహమ్మద్ షమీ జీవిత విశేషాలుమొహమ్మద్ షమీ దేశీయ జీవితంమొహమ్మద్ షమీ ఇండియన్ ప్రీమియర్ లీగ్మొహమ్మద్ షమీ అంతర్జాతీయ జీవితంమొహమ్మద్ షమీ వ్యక్తిగత జీవితంమొహమ్మద్ షమీ జీవితంలో మైలు రాళ్ళుమొహమ్మద్ షమీ అంతర్జాతీయ పురస్కారాలుమొహమ్మద్ షమీ మూలాలుమొహమ్మద్ షమీ

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు సినిమావిష్ణువులగ్నంభారత ఎన్నికల కమిషనుసుభాష్ చంద్రబోస్సౌర కుటుంబంరవీంద్రనాథ్ ఠాగూర్జానంపల్లి రామేశ్వరరావుపోసాని కృష్ణ మురళిసాయిపల్లవిభారతదేశంలో మహిళలుభారత ఆర్ధిక వ్యవస్థమురళీమోహన్ (నటుడు)యజుర్వేదంభగవద్గీతఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళినందమూరి తారక రామారావుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంకులంమహాకాళేశ్వర జ్యోతిర్లింగంతెలుగు సినిమాలు 2023సికింద్రాబాద్మియా ఖలీఫాప్రొద్దుటూరుఅక్కినేని నాగార్జునచంద్రయాన్-3అమ్మకోసంఈనాడురంజాన్సామజవరగమనమిథునరాశిమలబద్దకంకిలారి ఆనంద్ పాల్రోజా సెల్వమణిఎర్రబెల్లి దయాకర్ రావుఅక్కినేని నాగేశ్వరరావుఅరవింద్ కేజ్రివాల్వైరస్రఘురామ కృష్ణంరాజుభౌతిక శాస్త్రందశదిశలురావి చెట్టురైతుప్రేమలుఆంధ్రప్రదేశ్ మండలాలువిద్యమూత్రపిండముసిద్ధార్థ్జవాహర్ లాల్ నెహ్రూయేసు శిష్యులుతీహార్ జైలుగ్యాస్ ట్రబుల్ప్రపంచ రంగస్థల దినోత్సవంకుక్కఅశోకుడుశ్రీ గౌరి ప్రియఅన్నప్రాశనషాజహాన్ఉస్మానియా విశ్వవిద్యాలయంరమణ మహర్షిరావణుడుసమాచార హక్కువడ్డీఉలవలుభారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 299 - 377ఐశ్వర్య రాయ్జోల పాటలు20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిమాయాబజార్భారత జాతీయగీతంగంజాయి మొక్కఅమెజాన్ (కంపెనీ)స్వామియే శరణం అయ్యప్పపరిటాల రవిలోక్‌సభముహమ్మద్ ప్రవక్తనవరత్నాలు🡆 More