అరవింద్ కేజ్రివాల్

అరవింద్ కేజ్రివాల్ భారతీయ సామాజికవేత్త, రాజకీయ నాయకుడు.

హర్యానాలో జన్మించిన కేజ్రివాల్ ఐఐటి ఖరగపూర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులు అయ్యారు. మొదట భారతీయ రెవెన్యూ సర్వీసులో కొంతకాలం పనిచేశారు. జన లోకపాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి చేసిన పోరాటం, సమాచార హక్కు చట్టం కోసం చేసిన పోరాటంతో ఈయన దేశవ్యాప్తంగా మంచి ప్రాముఖ్యత సంపాదించారు. సమాచార హక్కు చట్టం తీసుకురావటం, పేదవారి స్తోమత పెంచడానికి చేసిన కృషికి 2006 లో రామన్ మెగసెసే పురస్కారం లభించింది. 2012 లో ఆమ్ ఆద్మీ పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన తరువాత జరిగిన తొలి ఎన్నికలైన 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికల విజయంతో ఢిల్లీ 7వ ముఖ్యమంత్రిగా పదవి చేబట్టారు. కేజ్రివాల్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో అత్యంత పిన్నవయస్కుడు.

అరవింద్ కేజ్రివాల్
అరవింద్ కేజ్రివాల్


8వ ఢిల్లీ ముఖ్యమంత్రి
పదవీ కాలం
రెండవ పర్యాయం
పదవీ కాలం
15 ఫిబ్రవరి 2014 – ప్రస్తుత
ముందు రాష్ట్రపతి పాలన

7వ ఢిల్లీ ముఖ్యమంత్రి
పదవీ కాలం
మొదటి పర్యాయం
పదవీ కాలం
28 డిసెంబర్ 2013 – 14 ఫిబ్రవరి 2014
ముందు షీలా దీక్షిత్

పదవీ కాలం
రెండవ పర్యాయం
పదవీ కాలం
14 ఫిబ్రవరి 2014 – ప్రస్తుతం
నియోజకవర్గం న్యూ ఢిల్లీ

పదవీ కాలం
మొదటి పర్యాయం
పదవీ కాలం
డిసెంబర్ 2013 – ఫిబ్రవరి 2015
ముందు షీలా దీక్షిత్
నియోజకవర్గం న్యూ ఢిల్లీ

వ్యక్తిగత వివరాలు

జననం (1968-08-16) 1968 ఆగస్టు 16 (వయసు 55)
హిసార్, హర్యానా
జీవిత భాగస్వామి సునీత కేజ్రివాల్
సంతానం 2
నివాసం ఢిల్లీ,భారతదేశం
పూర్వ విద్యార్థి ఐఐటి,ఖరగ్‌పూర్

బాల్యము

అరవింద్ కేజ్రీవాల్ ( 1968 ఆగస్టు 16) హర్యానాలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు.గోబింద్ రామ్ కేజ్రివాల్ ను గీతా దేవికి పుట్టిన మూడు పీల్లలలో పెద్ద వాడు. ఐ.ఐ.టీ. ఖరగ్పూర్ లో ఇంజనీరింగ్ చదువుకున్నాడు.

ఉద్యోగము

ఇంజనీరింగ్ పూర్తవగానే టాటా స్టీల్ కంపెనీలో, 1989లో జేరాడు. 1992లో మానేసాడు. అప్పుడే సివిల్ సర్వీసెస్ పరీక్షలు వ్రాసి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు ఎంపికయ్యారు. డిల్లీలోని ఆదాయపు పన్ను కార్యాలయంలో జాయింట్ కమీషనర్ ఉద్యోగంలో చేరారు.

సామాజిక పోరాటాలు

పరివర్తన్

1999 డిసెంబరులో కేజ్రివాల్ రెవెన్యూ సర్వీసులో ఉండగానే, పరివర్తన్ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసి ఢిల్లీలోని ప్రజలకు పన్నులు, విద్యుత్తు, ఆహార పంపిణి విషయాల గురించి అవగాహన కలిగించడంలో సహాయం చేశారు. కేజ్రివాల్ "మార్పు చిన్న చిన్న విషయాలతో ప్రారంభం అవుతుంది "అని నమ్మేవారు. 2008 లో ఈ సంస్థ ఢిల్లీ నకిలీ రేషను కార్డు స్కాంను బట్ట బయలు చేసింది.

సమచార హక్కు చట్టం

సమచార హక్కు చట్టం వినియోగించి ఢిల్లీ లోని ప్రభుత్వ సంస్థలలో అవినీతిని వెలికితీశారు.

జన లోక్ పాల్ బిల్లు

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారేతో కలిసి జన లోక్ పాల్ బిల్లు బిల్లు కోసం పోరాడారు.

రాజకీయ జీవితం

2012 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

2012 నవంబరు 26న ఆమ్ ఆద్మీ పార్టీ అనే రాజకీయ పార్టీని ఢిల్లీలో స్థాపించారు. 2013 డిసెంబరు 4 న జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ పై 25, 864 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.జన్ లోక్‌పాల్ బిల్లు ఢిల్లీ శాసనసభలో ఆమోదం పొందకపోవడంతో కేజ్రీవాల్ 49 రోజుల తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

2014 పార్లమెంటు ఎన్నికలు

2014 పార్లమెంటు ఎన్నికలలో వారణాసి పార్లమెంటు బరిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పై అరవింద్ కేజ్రివాల్ పోటిపడ్డాడు..ఢిల్లీలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి తప్పుకున్న కేజ్రీవాల్ వారణాసిలో భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్రమోడీకి పోటీగా బరిలోకి దిగారు. కానీ ఆయన చేతిలో 3, 71, 784 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ముందుండి నడిపించారు. 70 స్థానాలలో 67 స్థానాలు పొంది అనూహ్య విజయం సాధించడంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు. కేజ్రివాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి 31, 583 వోట్ల ఆధిక్యంతో గెలిచారు.

2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో 62స్థానాలు గెలుపొందారు. వీరు బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ పై 14227 ఓట్ల తేడాతో గెలుపొందారు.[1]

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలంటూ కేజ్రీవాల్‌కు ఈడీ తొమ్మిదో సారి సమన్లు జారీ చేసింది. దీనిని తీవ్రంగా తీసుకున్న ఆయన తనకు జారీ చేసిన అనేక సమన్లను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈడీ బృందం 10వ సమన్లతో మార్చి 21న సాయంత్రం కేజ్రీవాల్ ఇంటికి చేరుకొని విచారించి ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21న అరెస్టు చేసింది.

రచనలు

2012 లో స్వరాజ్ అనే పుస్తకాన్ని ప్రచురించారు.

బిరుదులు

బయటి లింకులు

ఇవికూడా చూడండి

మూలాలు

Tags:

అరవింద్ కేజ్రివాల్ బాల్యముఅరవింద్ కేజ్రివాల్ ఉద్యోగముఅరవింద్ కేజ్రివాల్ సామాజిక పోరాటాలుఅరవింద్ కేజ్రివాల్ రాజకీయ జీవితంఅరవింద్ కేజ్రివాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంఅరవింద్ కేజ్రివాల్ రచనలుఅరవింద్ కేజ్రివాల్ బిరుదులుఅరవింద్ కేజ్రివాల్ బయటి లింకులుఅరవింద్ కేజ్రివాల్ ఇవికూడా చూడండిఅరవింద్ కేజ్రివాల్ మూలాలుఅరవింద్ కేజ్రివాల్అన్నా హజారేఆమ్ ఆద్మీ పార్టీఐఐటిఢిల్లీముఖ్యమంత్రిరామన్ మెగసెసే పురస్కారంసమాచార హక్కు చట్టం

🔥 Trending searches on Wiki తెలుగు:

నవగ్రహాలుతెలుగు వికీపీడియామ్యాడ్ (2023 తెలుగు సినిమా)స్నేహవై.ఎస్.వివేకానందరెడ్డిభారతీయ శిక్షాస్మృతిలలితా సహస్రనామ స్తోత్రంఓం భీమ్ బుష్నామవాచకం (తెలుగు వ్యాకరణం)తెలుగు సినిమాకొడాలి శ్రీ వెంకటేశ్వరరావుసంభోగంమాదిగనల్గొండ లోక్‌సభ నియోజకవర్గంఆల్ఫోన్సో మామిడిసన్నిపాత జ్వరంఇన్‌స్పెక్టర్ రిషిమానవ శాస్త్రంభూమిఫ్లిప్‌కార్ట్ముదిరాజ్ (కులం)భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుశార్దూల విక్రీడితముబొత్స ఝాన్సీ లక్ష్మిభారత జాతీయగీతంశ్రీలలిత (గాయని)శ్రీనాథుడుYసౌందర్యపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుశాసన మండలిఛత్రపతి శివాజీభారత రాజ్యాంగ పీఠికచతుర్వేదాలుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుతెలుగు కులాలురామ్ చ​రణ్ తేజభాషా భాగాలుసాక్షి (దినపత్రిక)మెరుపుఎస్. జానకిఅంగారకుడు (జ్యోతిషం)సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువేంకటేశ్వరుడుతెలుగుఅనాసరాజనీతి శాస్త్రముఎన్నికలుదాశరథి కృష్ణమాచార్యవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)వాల్మీకితెలుగు అక్షరాలుకాలేయంభారత జాతీయ క్రికెట్ జట్టుమురుడేశ్వర ఆలయంవంగవీటి రాధాకృష్ణరోజా సెల్వమణివ్యవస్థాపకతప్రియురాలు పిలిచిందిలావు రత్తయ్యఆంగ్ల భాషడి. కె. అరుణరష్యాఖండంగురువు (జ్యోతిషం)శుభాకాంక్షలు (సినిమా)మీనరాశిఅష్ట దిక్కులుజవహర్ నవోదయ విద్యాలయంక్రికెట్నవగ్రహాలు జ్యోతిషంతెలంగాణ గవర్నర్ల జాబితాఋగ్వేదంపెమ్మసాని నాయకులుపార్లమెంటు సభ్యుడుతిరుపతిషరియా🡆 More