మాసెచూసెట్స్

మాసెచూసెట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని 50 రాష్ట్రాలలో ఒకటి.

ఇది ఈశాన్య అమెరికాలోని న్యూ ఇంగ్లాండు ప్రాంతంలోగల రాష్ట్రాలలో అతి పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రానికి తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరాన న్యూ హాంప్షైర్, వెర్మాంట్ రాష్ట్రాలు, పశ్చిమాన న్యూ యార్క్ రాష్ట్రం, దక్షిణాన రోడ్ ఐలాండ్, కనెటికెట్ రాష్ట్రాలు ఉన్నాయి. మాసెచూసెట్స్ రాష్ట్ర రాజధాని, అత్యధిక జనాభా కలిగిన నగరం బోస్టన్. బోస్టన్, దగ్గరి కొన్ని నగరాలను కలిపి గ్రేటర్ బోస్టన్ గా పిలుస్తారు. మాసెచూసెట్స్ రాష్ట్రం లోని 80% మంది ఈ గ్రేటర్ బోస్టన్ లో నివసిస్తున్నారు. అమెరికా జాతీయ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటాలలో మాసెచూసెట్స్ రాష్ట్రానికి ఒక విశిష్ట స్థానం ఉంది.

మాసెచూసెట్స్
మాసెచూసెట్స్ ను చూపిస్తూ అమెరికా సంయుక్త రాష్ట్రాల పటం
మాసెచూసెట్స్ ను చూపిస్తూ అమెరికా సంయుక్త రాష్ట్రాల పటం
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
బోస్టన్
 - 42.36 ఉ 71.05 ప
పెద్ద నగరము బోస్టన్
జనాభా (2015)
 - జనసాంద్రత
67,94,422
 - 840/చ.మై
విస్తీర్ణము
 
10,565  చ.మై  
సమయ ప్రాంతం అమెరికా తూర్పు సమయం (ET) సా.స.స -5/-4
అధికార బాష (లు) ఆంగ్లము
పొడిపదం (ISO) US-MA
వెబ్‌సైటు: www.mass.gov
మాసెచూసెట్స్
మాసెచూసెట్స్ రాజముద్ర

మొట్టమొదటగా న్యూ ఇంగ్లండ్కి మేఫ్లవర్ నౌకలో వచ్చిన ఐరోపా వలసవాసులు మాసెచూసెట్స్ లోని ప్లిమత్ నగరంలో వారి నివాస స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సా.శ. 1692 అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన సేలం మంత్రగత్తె విచారణలు ఈ రాష్ట్రంలోనే జరిగాయి. ఈ విచారణల్లో మంత్రగత్తెలుగా అనుమానించబడిన మహిళలను సజీవ దహనం చేసేవారు. 19వ శతాబ్ది చివరిలో బేస్ బాల్, బాస్కెట్ బాల్ వంటి క్రీడల్ని మాసెచూసెట్స్ లో కనిపెట్టడం జరిగింది. ప్రపంచం లోనే ప్రసిద్ధి గాంచిన హార్వర్డ్, మాసెచూసెట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అమెరికాలోని అత్యంత పలుకుబడి కలిగిన రాజకీయ వంశాలైన ఆడమ్స్, కెన్నడీ వంశాల పునాదులు మాసెచూసెట్స్ లోనే మొదలయ్యాయి. 2004 లో స్వలింగ వివాహాలకు న్యాయస్థాన మద్దతునిచ్చిన మొట్టమొదటి అమెరికా రాష్ట్రం మాసెచూసెట్స్.

మూలాలు

Tags:

అట్లాంటిక్ మహాసముద్రంఅమెరికా సంయుక్త రాష్ట్రాలుకనెక్టికట్చరిత్రన్యూ ఇంగ్లండ్బోస్టన్రాష్ట్రమువెర్మాంట్

🔥 Trending searches on Wiki తెలుగు:

రష్మికా మందన్నఅమెజాన్ ప్రైమ్ వీడియోసముద్రఖనిడేటింగ్ప్రకటనమొదటి పేజీఛత్రపతి శివాజీనెల్లూరురామాయణంలో స్త్రీ పాత్రలుపనసమూత్రపిండముసమ్మక్క సారక్క జాతరతెలుగునాట జానపద కళలుఆరెంజ్ (సినిమా)రాజోలు శాసనసభ నియోజకవర్గంవడ్రంగిఇందిరా గాంధీఎస్త‌ర్ నోరోన్హామొదటి భారత స్వాతంత్ర్య యుద్ధంఆంధ్రప్రదేశ్ శాసనమండలిదిల్ రాజుతెలంగాణ మండలాలుపేరురాశితెల్ల రక్తకణాలుసంగీత వాద్యపరికరాల జాబితాతామర వ్యాధిహీమోగ్లోబిన్విద్యుత్తుభారతీయ సంస్కృతిపాల్కురికి సోమనాథుడుశివాత్మికకంటి వెలుగుబాలచంద్రుడు (పలనాటి)సూర్యుడుఖాదర్‌వలినందమూరి తారక రామారావుభారతీయ నాట్యంభాస్కర్ (దర్శకుడు)పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివాతావరణంభీమ్స్ సిసిరోలియోరాగులుకళలుఇంటి పేర్లుయూరీ గగారిన్మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంవిన్నకోట పెద్దనపల్నాటి యుద్ధంబైబిల్ గ్రంధములో సందేహాలుగొంతునొప్పిఅంతర్జాతీయ మహిళా దినోత్సవంశక్తిపీఠాలుపంచతంత్రంశ్రీదేవి (నటి)భారతదేశ పంచవర్ష ప్రణాళికలుపునర్వసు నక్షత్రముబ్రాహ్మణులుకర్ణాటక యుద్ధాలుమాల (కులం)పూజా హెగ్డేతెలుగు వాక్యందగ్గు మందుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుభారత రాష్ట్రపతిరమ్యకృష్ణసంభోగంహోమియోపతీ వైద్య విధానంకంప్యూటరులక్ష్మిచేతబడితెనాలి శ్రావణ్ కుమార్తెలంగాణకు హరితహారంసర్దార్ వల్లభభాయి పటేల్నవగ్రహాలు జ్యోతిషంనరేంద్ర మోదీ🡆 More