మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం.

తెలంగాణ రాష్ట్రంలోని చెరువులు, కాలువలు నీటితో కళకళలాడాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ (మన ఊరు, మన చెరువు) ను ప్రారంభించింది. వేల ఏండ్లపాటు తెలంగాణను సస్యశ్యామలం చేసి, కొన్ని దశాబ్దాలుగా పూడుకుపోయిన దాదాపు 46 వేలకుపైగా (సుమారు 12,000 గొలుసుకట్టు) చెరువులను మళ్ళీ పునరుద్ధరించడమే మిషన్ కాకతీయ ప్రధాన లక్ష్యం. ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 46,531 చెరువులు, సరస్సులలో 265 టిఎంసి నీటిని నిల్వచేయడం కోసం ఇది రూపొందింది. 2014 జూన్‌లో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి కార్యక్రమం ఇది. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి పూడిక తొలగించడానికి ట్యాంకులు, సరస్సులను తవ్వారు. ఆయకట్టు ప్రాంతంలో గృహ వ్యవసాయ ఆదాయం కూడా 78.50% పెరిగింది.

మిషన్ కాకతీయ
మిషన్ కాకతీయ
మన ఊరు మన చెరువు
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
స్థాపనమొదటి దశ (మార్చి 12- జూలై 11, 2015)
వెబ్ సైటుఅధికారిక వెబ్ సైట్
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం

ఈ పథకం తొలిదశలో 5 నుంచి 10 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన చెరువుల పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం 20 శాతం చొప్పున 2023 వరకు నాలుగుదశల్లో 9,155 కోట్ల రూపాయలతో 27,627 చెరువులు పునరుద్ధరించబడ్డాయి. కట్టల బలోపేతం, పూడికతీయడం, తూముల పునర్నిర్మాణం, అలుగుల మరమ్మతులు తదితర పనులు పూర్తిచేయబడ్డాయి. తద్వారా ఆయా చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరగడంతో గ్రామాల్లో భూగర్భజలాల మట్టం కూడా పెరిగింది.

చరిత్ర

తెలంగాణలో వ్యవసాయం పూర్తిగా చెరువులపైనే ఆధారపడి ఉండేది. నిజాం పాలన వరకు తెలంగాణ ప్రాంతంలో ట్యాంకులలో 244 టీఎంసీల సామర్థ్యం ఉండేవి. 1956లో 70,000 ట్యాంకుల కింద సాగునీరు (ఆయకట్టు) దాదాపు 25 లక్షల ఎకరాలు ఉండేది. 2014 నాటికి 46,531 ట్యాంకులు మిగిలి ఉన్నాయి, వాటిలో దాదాపు సగం ఎండిపోయాయి. రైతులు సాగునీటి బావులపై ఆధారపడటం ప్రారంభించారు. నీటి మట్టం తగ్గడంతో బావులు ఎండిపోవడంతో రైతులు బోర్‌వెల్‌లు తవ్వడం ప్రారంభించారు. అవి కూడా భూమి, భూగర్భజలాలు లేకపోవడంతో ఎండిపోయాయి.

ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2015, మార్చి 12న కామారెడ్డి జిల్లా, సదాశివనగర్‌ లోని పాత చెరువులో మిషన్ కాకతీయ పథకానికి శంకుస్థాపన చేసాడు. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ రాజులు ఈ ప్రాంతంలో ఎన్నో కాలువలు తవ్వించారు. వారి గుర్తుగా ఈ ప్రాజెక్టుకు మిషన్ కాకతీయ అని పేరు పెట్టారు.

ఈ కార్యక్రమాన్ని 2015 డిసెంబరు మూడవ వారంలో ప్రారంభించారు. ఐదేళ్లలో 2,00,000 కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రంలోని 46,531 చెరువులను మిషన్ కాకతీయ ప్రాజెక్టులో భాగంగా పునరుద్ధరించారు. అన్ని చెరువులను 250 ~ 270 టిఎంసిల కన్నా ఎక్కువ నీటి సామర్థ్యన్ని కలిగివుండేలా పునరుద్ధరించడం ద్వారా వ్యవసాయం, నీటిపారుదల, పశువులు, మంచినీటి అవసరాలకు నీటిని అందుబాటులోకి తెచ్చారు.

పనుల అప్పగింత

నీటిపారుదల శాఖ పునర్నిర్మాణంలో భాగంగా ఈ శాఖ పరిధిలో ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటనెన్స్‌ (ఓఅండ్‌ఎం) విభాగాన్ని ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ను నియమించి ప్రాజెక్టులు, పంప్‌లు, కాల్వలు, చెరువులు, తూముల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. ఓఅండ్‌ఎం వారు ప్రతి సీజన్‌ ప్రారంభంలోనే తూములు, షెట్టర్లు, ప్రాజెక్టుల గేట్లను చెక్‌ చేయడం, గ్రీసింగ్‌ తదితర చర్యలను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. డీఈ రూ.5 లక్షలు, ఈఈ రూ.25 లక్షలు, ఎస్‌ఈ రూ.55 లక్షలు, చీఫ్‌ ఇంజినీర్‌ రూ.కోటి వరకు సత్వర పనులకు కోసం వెచ్చించే అధికారం ఇచ్చారు. ఫలితంగా చెరువులకు ఎక్కడయినా గండి పడినా వెంటనే ఇంజినీర్లు తమ ఆర్థిక అధికారాలను వినియోగించి మరమ్మతు పనులు సత్వరమే పూర్తి చేస్తున్నారు. సంవత్సరానికి దాదాపు 280 కోట్ల రూపాయల వరకు ఓఅండ్‌ఎం పనులకు ప్రభుత్వం వెచ్చిస్తోంది.

ప్రాజెక్టు

ఈ ప్రాజెక్ట్ ఐదు దశల్లో చేపట్టబడింది:

  • మొదటి దశ - 8003 ట్యాంకులు
  • రెండవ దశ - 8927 ట్యాంకులు
  • మూడవ దశ - 5886 ట్యాంకులు
  • నాలుగవ దశ - 6000 ట్యాంకులు
  • ఐదవ దశ - మిగిలిన, కొత్త ట్యాంకుల సృష్టి

పెద్ద చెరువులు, సరస్సులు ఎత్తైన ఆయకట్టుతో ముందుగా ప్రారంభించబడ్డాయి. 2018 మార్చి నాటికి 27,713 సరస్సుల పనులు పూర్తయ్యాయి, ₹8700 కోట్లు ఖర్చు చేసి, స్థిరీకరించి 20 లక్షల ఎకరాలకు నీటిని అందించారు.

మట్టిపోషకాల వాడకం

మట్టి పోషకాలు అధికంగా ఉన్న సిల్ట్ లేదా మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకున్నారు. చెరువలు నుంచి తవ్విన దాదాపు 7 కోట్ల ట్రాక్టర్ల సిల్ట్‌ను రైతులు వినియోగించుకున్నారు.

విజయాలు

గొట్టపు బావి నీటికి బదులుగా ఉపరితల నీటిని ఉపయోగించడం ద్వారా నాణ్యతలో గణనీయమైన మార్పు వచ్చింది. 2.88 లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు స్థిరీకరించబడింది, ప్రాజెక్ట్ పూర్తయ్యే నాటికి 12 లక్షల ఎకరాలకు చేరుకుంటుంది. భూగర్భ జలాలు 6.9% నుంచి 9.2%కి పెరిగాయి. మత్స్యకారుల జీవనోపాధి కూడా మెరుగుపడింది.

వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా గా పిలువబడుతున్న నీటి కార్యకర్త, రాజేంద్ర సింగ్ ఈ సరస్సులను సందర్శించి, 2016లో వరంగల్‌లోని ట్యాంక్ బండ్‌పై తన పుట్టినరోజు జరుపుకున్నారు. తెలంగాణ కవులైన నందిని సిధారెడ్డి, ఏనుగు నరసింహా రెడ్డి, దేశపతి వంటి ప్రసిద్ధులు తమ కవితలలో మిషన్ కాకతీయ ప్రశస్తి ని కొనియాడారు.

అధ్యయనాలు

వివిధ ప్రభుత్వ సంస్థలు, యుఎస్ ఆధారిత విశ్వవిద్యాలయాలైన మిచిగాన్ విశ్వవిద్యాయలం, చికాగో విశ్వవిద్యాలయం ఈ ప్రాజెక్ట్‌ను అధ్యయనం చేస్తున్నాయి.

మిచిగాన్ విశ్వవిద్యాలయ అధ్యయన బృందం భారతీయ రైతులకు పంట దిగుబడిని పెంచడానికి, ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి తక్కువ ఖర్చుతో కూడిన మార్గాన్ని అభివృద్ధి చేస్తోంది. యూనివర్సిటీలోని ఎనిమిది విభాగాలను చెందిన 16 మంది విద్యార్థులతో కూడిన మల్టీ-డిసిప్లినరీ బృందం, 12 నెలలపాటు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని రెండు గ్రామాలలో పనిని విశ్లేషించి కార్యక్రమ ప్రభావం గురించి తెలుసుకుంది. ఎరువుల వినియోగం తగ్గడం, విద్యుత్ వినియోగం తగ్గడం, పంట దిగుబడి పెరగడం వంటివి వారి పరిశోధనల్లో భాగంగా ఉన్నాయి. చికాగో విశ్వవిద్యాలయం వ్యవసాయ, పర్యావరణ, ఆర్థిక ఫలితాలపై దాని ప్రభావాన్ని అంచనా వేస్తోంది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్ కూడా ప్రాజెక్ట్ ప్రభావంపై అధ్యయనం చేసింది. ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యయనం కూడా చేస్తోంది.

అవార్డులు

  • 2018లో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ అండ్‌ పవర్‌ నుంచి బెస్ట్‌ ఇరిగేషన్‌ ప్రాక్టీసెస్‌ అవార్డును అందుకుంది.
  • ఈ మిషన్‌ కాకతీయ పథకం 2021లో జాతీయస్థాయిలో స్కోచ్‌ అవార్డును గెలుచుకుంది. రాష్ట్ర సాగునీటి పారుదలశాఖలోని ఈ గవర్నెన్స్‌ విభాగం ఇంజినీర్లు తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ జాతీయస్థాయిలో గుర్తింపుపొందింది. ఎల్‌ఏఎంఎం పేరిట తయారుచేసిన ఈ సాఫ్ట్‌వేర్‌, మొబైల్‌ యాప్‌తో చెరువుల స్థితిగతులు, నీటినిల్వ, పునరుద్ధరణ పనుల ప్రగతి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. అలాగే వరద నివారణ చర్యలను సమర్థవంతంగా నిర్వహించి నిధులు ఆదా చేయవచ్చు. వర్చువల్‌గా నిర్వహించిన స్కోచ్‌ 75వ సమ్మిట్‌లో ఈ గవర్నెన్స్‌ విభాగం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రామాంజనేయులు అవార్డు అందుకున్నాడు.

మూలాలు

Tags:

మిషన్ కాకతీయ చరిత్రమిషన్ కాకతీయ ప్రారంభంమిషన్ కాకతీయ పనుల అప్పగింతమిషన్ కాకతీయ ప్రాజెక్టుమిషన్ కాకతీయ మట్టిపోషకాల వాడకంమిషన్ కాకతీయ విజయాలుమిషన్ కాకతీయ అధ్యయనాలుమిషన్ కాకతీయ అవార్డులుమిషన్ కాకతీయ మూలాలుమిషన్ కాకతీయచెరువుటిఎంసితెలంగాణతెలంగాణా ప్రభుత్వం

🔥 Trending searches on Wiki తెలుగు:

సుహాసినిఈస్టర్వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంగుంటూరు కారంజాతీయ ఆదాయంరామప్ప దేవాలయంపసుపు గణపతి పూజక్రోధిమహామృత్యుంజయ మంత్రంవన్ ఇండియావిడదల రజినియానిమల్ (2023 సినిమా)అదితిరావు హైదరీపచ్చకామెర్లుజోల పాటలుఇండోనేషియాఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితావినాయక్ దామోదర్ సావర్కర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంతెలుగుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంకల్వకుంట్ల తారక రామారావుసింగిరెడ్డి నారాయణరెడ్డిరాశి (నటి)భారతీయ సంస్కృతిభీష్ముడుఎఱ్రాప్రగడసంపన్న శ్రేణిసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనునడుము నొప్పిగురువు (జ్యోతిషం)కామసూత్రఇండియన్ ప్రీమియర్ లీగ్నువ్వుల నూనెజోర్దార్ సుజాతపవన్ కళ్యాణ్తెలుగు సినిమాలు 2023నిర్మలా సీతారామన్నామనక్షత్రముభీమా (2024 సినిమా)శ్రీముఖిసుకన్య సమృద్ధి ఖాతాభారతీయ శిక్షాస్మృతి2024 భారత సార్వత్రిక ఎన్నికలుప్రియురాలు పిలిచిందిఆటలమ్మఅల్లసాని పెద్దనరామావతారంతెలుగు భాష చరిత్రద్వాదశ జ్యోతిర్లింగాలు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకృతి శెట్టితెలుగు అక్షరాలుచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంభావ కవిత్వంగాంధీప్రొద్దుటూరుఅనిల్ అంబానీచంద్రయాన్-3భాగ్యరెడ్డివర్మలిబియాఉస్మానియా విశ్వవిద్యాలయంనాయీ బ్రాహ్మణులుసెక్యులరిజంశ్రీ కృష్ణదేవ రాయలుఆరణి శ్రీనివాసులుషణ్ముఖుడువ్యవసాయంగ్లోబల్ వార్మింగ్సావిత్రి (నటి)ఎల్లమ్మఈనాడుపిఠాపురం శాసనసభ నియోజకవర్గంఅమృతా రావుశ్రీవిష్ణు (నటుడు)భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితానితిన్🡆 More