మనిషి మెదడు

మనిషి శరీరంలో వివిధ అవయవాలు నాడీమండలం ఆధీనంలో ఉంటాయి.

నాడీమండలంలో కేంద్ర నాడీమండలం, వికేంద్ర నాడీమండలం భాగాలు.కేంద్ర నాడీమండలంలో పెద్దమెదడు, మస్తిష్కమూలం, చిన్నమెదడు, కపాలనాడులు వివిధ భాగాలు. పెద్దమెదడు క్రింద మస్తిష్కమూలం ఉంటుంది. మస్తిష్కమూలంలో మధ్యమస్తిష్కం, వారధి ( పాన్స్ ), మజ్జాముఖం ( మెడుల్లా ఆబ్లాంగేటా ) ఉంటాయి. మస్తిష్కమూలానికి చిన్నమెదడు మూడు జతల నాడీకాండాలతో కలుపబడి ఉంటుంది. మజ్జాముఖం వెన్నుపాముగా వెన్నెముకలో కొనసాగుతుంది. వికేంద్ర నాడీమండలంలో వెన్నుపాము , వెన్నునాడులు , సహవేదన నాడీవ్యవస్థ ( సింపథెటిక్ నెర్వస్ సిష్టెమ్ ), పరానుభూత నాడీవ్యవస్థ ( పారాసింపథెటిక్ నెర్వస్ సిష్టెమ్ ) భాగాలు.

పెద్ద మెదడు

పెద్దమెదడు ఆలోచనలకు , విషయగ్రాహణంకు , జ్ఞాపకశక్తికి , విచక్షణా జ్ఞానానికి , విషయ చర్చలకు , వివిధ భావాలకు స్థానం. పంచేద్రియాలు గ్రహించే వాసన , దృష్టి, వినికిడి , రుచి , స్పర్శ మొదలైన సమాచారాలు జ్ఞాననాడుల ద్వారా ప్రసరించి పెద్దమెదడులో జ్ఞానంగా రూపొందుతాయి.

మెదడు పొరలు

మెదడు కపాలంలో రక్షించబడుతుంది. మెదడును మూడు పొరలు కప్పి ఉంచుతాయి. అందులో పై పొరను డ్యూరా అంటారు. డ్యూరా కపాలము లోపలి భాగంను అంటి ఉంటుంది. ఈ పొరలో తంతుకణజాలం, సాగుకణజాలం ఉంటాయి. ఈ పొర దళసరితనాన్ని గట్టిదనాన్ని కలిగి ఉంటుంది.మధ్య పొరను ఎరఖ్ నాయిడ్ అంటారు. సాలెగూడును పోలి ఉండడం వలన ఈ పొరకు ఆ పేరు వచ్చింది. ఈ సన్నని పొరలో తంతుకణజాలం ఉంటుంది.లోపలి సున్నితమైన పొరను పయా అంటారు. ఈ పొర మెదడును అంటిపెట్టుకొని ఉంటుంది. ఈ పొరలో తంతుకణజాలం ఉంటుంది. తంతుకణజాలానికి వెలుపల చదును కణాలు ఉంటాయి. మెదడుకు రక్తప్రసరణ కూర్చే రక్తనాళాలు ఈ పొరను చొచ్చుకొని లోపలకు వెళ్తాయి. ఎరఖనాయిడ్ కు పయాకు మధ్య గల జాగాలో నాడీద్రవము ఉంటుంది.

మెదడులో భాగాలు

మనిషి మెదడు 

పెద్దమెదడులో రెండు అర్ధగోళాలు ఉంటాయి. రెండు అర్ధగోళాలు కార్పస్ కల్లోజమ్ అనబడే శ్వేత తంతువుల బంధనంతో కలుపబడి ఉంటాయి. ప్రతి అర్ధగోళంలోను లలాటభాగం, పార్శ్వభాగం, కర్ణభాగం, పృష్ఠభాగం ఉంటాయి. పెద్దమెదడులో వెలుపలి భాగంలో ధూసర పదార్థం, లోపలి భాగంలో శ్వేతపదార్థం ఉంటాయి.

లలాట భాగం

మనిషి మెదడు 

లలాట భాగాలు పెద్దమెదడుకు ముందు భాగంలో ఉంటాయి. ఇవి పార్శ్వ భాగాల నుంచి మధ్య గర్తాలతోను ( సెంట్రల్ సల్కస్ ), కర్ణభాగాల నుంచి పక్క గర్తాలతోను ( లేటరల్ సల్కస్ ) వేఱుచేయబడి ఉంటాయి. స్వయంనియంత్రణ, విచక్షణ, ప్రణాళికా రచన, తర్కం వంటి క్రియలు లలాట భాగాలపై ఆధారపడి ఉంటాయి. లలాట భాగంలో మధ్య గర్తంకు ముందున్న మెలికలో చలన వల్కలం ఉంటుంది . చలన వల్కంలోని నాడీకణాలపై శరీరంలోని ఇచ్ఛాకండరాల ఇచ్ఛా చలనాలు ఆధారపడి ఉంటాయి. కుడి చలన వల్కలం శరీరం ఎడమ భాగపు ఇచ్ఛాకండరాలను , ఎడమ చలన వల్కలం శరీరంలోని కుడిభాగపు ఇచ్ఛాకండరాలను నియంత్రిస్తాయి.

చలన వల్కలంలో నాడీకణాలను ఊర్ధ్వ చలన నాడీకణాలుగా పరిగణిస్తారు. వీటి నుంచి వెలువడే అక్ష తంతులు మెదడులో క్రిందకు సాగుచు అంతర గుళిక ( ఇంటర్నల్ కాప్సూల్ ) అనే భాగంలో గుమికూడి ఆపై మస్తిష్క మూలానికి చేరుతాయి. ఈ అక్ష తంతులు రెండవ ప్రక్కకు దాటుకొని కపాల నాడుల కేంద్రాలలో ఉన్న అధో చలన నాడీకణాలతోను, వెన్నుపాములోని అధో చలన నాడీకణాలతోను సంధానం అవుతాయి.

కపాల నాడుల కేంద్రాలలో చలన నాడీకణాలనుండి వెలువడే అక్షతంతులు కపాలనాడుల ద్వారాను, వెన్నుపాములోని చలన నాడీకణాల అక్షతంతులు వెన్నునాడుల ద్వారాను పయనించి వివిధ కండరాలకు చేరుకుంటాయి.

పార్శ్వ భాగం

మధ్య గర్తానికి వెనుక పార్శ్వ భాగాలలో జ్ఞానవల్కలం ఉంటుంది . శరీరంలో వివిధ భాగాల నుంచి జ్ఞాన నాడులు సమీకరించే స్పర్శ, కంపన స్పర్శ, నొప్పి, ఉష్ణోగ్రత జ్ఞానసంజ్ఞలు మెదడులో థలమస్ లకు ఆపై జ్ఞాన వల్కలాలకు చేరడం వలన ఆయా జ్ఞానాలు కలుగుతాయి. కుడి జ్ఞాన వల్కలం వలన శరీరపు ఎడమభాగంలో స్పర్శ మొదలగు జ్ఞానాలు, ఎడమ జ్ఞాన వల్కలం వలన శరీరపు కుడి భాగములో స్పర్శ మొదలగు జ్ఞానాలు పొందుతాం.

కర్ణ భాగం

మెదడు కర్ణ భాగాలలో శ్రవణ వల్కలాలు ఉంటాయి. వినికిడి , వినిన పదాలు, సంభాషణలు అర్థం చేసుకొనడం ఈ శ్రవణ వల్కలాల వలన కలుగుతాయి.

దృశ్య సంజ్ఞల బట్టి చూసిన వస్తువులు గుర్తుపట్టడం, దీర్ఘకాలపు జ్ఞాపకాలు కూడ మస్తిష్కంలోని కర్ణ భాగాల వలన కలుగుతాయి.

పృష్ఠ భాగం

మెదడులో పృష్ఠ భాగాలలో దృష్టి వల్కలాలు ఉంటాయి. కంటితెరలపై నుండి వచ్చే సంజ్ఞలను బోధచేసుకొని దృష్టి వల్కలాలు దృష్టి జ్ఞానాన్ని కలుగ చేస్తాయి.

వాక్కు మెదడులో వివిధ భాగాలపైన ఆధారపడి ఉన్నా మెదడులో బ్రోకా ప్రాంతంగా పరిగణించబడే లలాట భాగం వెనుక క్రిందిభాగం మాటలు పలకడంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది.

మెదడుకు రక్తప్రసరణ

మెదడుకు రక్తప్రసరణ అంతర కంఠధమనుల ద్వారాను, వెన్నుధమనుల ద్వారాను కలుగుతుంది. మస్తిష్క మూలానికి, చిన్నమెదడుకు రక్తప్రసరణ వెన్నుధమనుల ద్వారా కలుగుతుంది.

మస్తిష్కమునుండి రక్తము బాహ్య సిరల జాల , అంతర సిరల జాల వ్యవస్థల ద్వారా వివిధ సిరాపరిఖలకు చేరి ఆపై అంతర కంఠసిరలకు కొనిపోబడుతుంది.

చిన్న మెదడు

చిన్నమెదడు (సెరిబెల్లమ్) చలన ప్రక్రియలను సమన్వయపరచుటకు, శరీరాన్ని సమస్థితిలో ఉంచడానికి తోడ్పడుతుంది.

మూలాలు

Tags:

మనిషి మెదడు పెద్ద మెదడుమనిషి మెదడు మెదడు పొరలుమనిషి మెదడు మెదడులో భాగాలుమనిషి మెదడు చిన్న మెదడుమనిషి మెదడు మూలాలుమనిషి మెదడు

🔥 Trending searches on Wiki తెలుగు:

నాయట్టుసుభాష్ చంద్రబోస్యానిమల్ (2023 సినిమా)చందనా దీప్తి (ఐపీఎస్‌)నయన తారయాపిల్ ఇన్‌కార్పొరేషన్రావణుడుశ్రీనివాస రామానుజన్ఎస్. జానకినాయకత్వంఉత్తర ఫల్గుణి నక్షత్రముపరకాల ప్రభాకర్రజాకార్ఆంధ్రప్రదేశ్ చరిత్రవర్షంఇతర వెనుకబడిన తరగతుల జాబితాపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికర్ర పెండలంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాసింగిరెడ్డి నారాయణరెడ్డిఅల్లు అర్జున్ఘిల్లివేమనటంగుటూరి అంజయ్యఉండి శాసనసభ నియోజకవర్గంప్రియ భవాని శంకర్శ్రేయాస్ అయ్యర్సూర్యుడుఅల్లు అరవింద్శ్రీకాళహస్తియనమల రామకృష్ణుడుసజ్జల రామకృష్ణా రెడ్డిగరుత్మంతుడుఉడుముపేర్ని వెంకటరామయ్యప్లీహముశ్రేయా ధన్వంతరిఉష్ణోగ్రతకన్నెగంటి బ్రహ్మానందంగోవిందుడు అందరివాడేలేకర్కాటకరాశితెలంగాణ చరిత్రపిఠాపురం శాసనసభ నియోజకవర్గం2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుప్రకటనరాజీవ్ గాంధీజవాహర్ లాల్ నెహ్రూభారత ఎన్నికల కమిషనుజనసేన పార్టీకేతిరెడ్డి పెద్దారెడ్డితెలుగుఅందెశ్రీఉమ్రాహ్మాధవీ లతభారతదేశపు పట్టణ పరిపాలనతరుణ్ కుమార్మహాభాగవతంసంకటహర చతుర్థికడప లోక్‌సభ నియోజకవర్గంభారతదేశ అత్యున్నత న్యాయస్థానంపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంశిబి చక్రవర్తిసాయిపల్లవిరైతుబంధు పథకంఅనుష్క శెట్టిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంపూర్వాభాద్ర నక్షత్రముకర్నూలుసూర్య నమస్కారాలుతెలుగు ప్రజలునీతి ఆయోగ్భూమిప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాభారత ప్రధానమంత్రుల జాబితాఅనసూయ భరధ్వాజ్భారతదేశ చరిత్రరాకేష్ మాస్టర్🡆 More