బిట్ కాయిన్

బిట్ కాయిన్ అనేది ఏదేశానికి చెందని అంతర్జాతీయ ఊహాజనిత ద్రవ్యము.

బిట్ కాయిన్
Logo of the bitcoin reference client
Logo of the bitcoin reference client
వినియోగదారులు Worldwide
ద్రవ్యోల్బణం 25 bitcoins per block (approximately every ten minutes) until mid 2016, and then afterwards 12.5 bitcoins per block for 4 years until next halving. This halving continues until 2110-2140 when 21 million bitcoins have been issued.
విభాగాలు
10−3 millibitcoin
10−6 microbitcoin, bit
10−8 satoshi
గుర్తు BTC, XBT, బిట్ కాయిన్
millibitcoin mBTC
microbitcoin, bit μBTC
నాణేలు unspent outputs of transactions denominated in any multiple of satoshis: ch. 5 
Administration Decentralized

నేపధ్యము

ఇది ఏ దేశానికీ చెందదు. ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకీ రాదు. అచ్చమైన అంతర్జాతీయ కరెన్సీ. దీని సృష్టికర్త ఎవరికీ తెలీదు. కానీ సతోషి నకమోటో అనే జపానీస్ మారుపేరుతో బిట్‌కాయిన్ల గురించి 2008లో ఒక కథనం ప్రచురితమైంది. తర్వాత ఏడాదికి... అంటే 2009 జనవరి 3న ఈ వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. ఒక భారీ నెట్‌వర్క్‌గా ఏర్పడిన కంప్యూటర్ల ద్వారా (బ్లాక్‌చెయిన్) సంక్లిష్టమైన గణిత శాస్త్ర సమీకరణాలతో బిట్ కాయిన్లను సృష్టిస్తారు. ఈ నెట్‌వర్క్‌లో ఉండే కంప్యూటర్లు కూడా అత్యంత శక్తిమంతమైనవి. పెపైచ్చు ప్రతి కంప్యూటర్ ద్వారా సృష్టించగలిగే బిట్‌కాయిన్ల సంఖ్య చాలా పరిమితం. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియ పేరు మైనింగ్. ఎప్పటికైనా సరే... మొత్తం బిట్‌కాయిన్ల సంఖ్య 2.1 కోట్లకు మించకుండా ఈ విధానాన్ని రూపొందించారు. 2009 నుంచి ఇప్పటి దాకా 1.24 కోట్ల బిట్‌కాయిన్ల మైనింగ్ జరిగింది.

వాడుక, లావాదేవీలు

ఎలక్ట్రానిక్ లావాదేవీలకు బిట్‌కాయిన్లు వాడొచ్చు. బిట్‌కాయిన్లతో ఏది కొన్నా... ఆ లావాదేవీ తక్షణం డిజిటల్ రూపంలో ‘లాగ్’ అవుతుంది. ఈ ‘లాగ్’లో ఎప్పుడు కొన్నారు? లావాదేవీ జరిగాక ఎవరి దగ్గర ఎన్ని కాయిన్లున్నాయి? వంటివన్నీ అప్‌డేట్ అయిపోతాయి. బిట్‌కాయిన్‌కు సంబంధించిన ప్రతి ఒక్క లావాదేవీ ఈ లాగ్‌లో అప్‌డేట్ అవుతుంటుంది. ఈ వ్యవస్థే బ్లాక్ చెయిన్. ఈ చెయిన్‌లో మొదటి నుంచి అప్పటిదాకా జరిగిన ప్రతి లావాదేవీ నమోదవుతుంది. బ్లాక్‌చెయిన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ... లావాదేవీలు పొల్లుపోకుండా జరిగాయో లేదో చూసే వారే మైనర్స్. ఒకరకంగా చెప్పాలంటే లావాదేవీలకు ఆమోదముద్ర వేసేవారన్న మాట. ఇలా చేసినందుకు వీరికి వ్యాపారుల నుంచి కొంత ఫీజు ముడుతుంది.బిట్‌కాయిన్‌లో 10 కోట్లవ వంతు విలువను సతోషిగా పిలుస్తారు. అంటే 10 కోట్ల సతోషిలు ఒక్క బిట్‌కాయిన్‌కు సమానం. బిట్‌ కాయిన్‌ ట్రేడింగ్‌కు బిట్‌ స్టాంప్‌ (అమెరికా), ఓకే కాయిన్‌ (చైనా) సహా ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు, ఎక్స్ఛేంజీలు ఉన్నాయి. క్రయవిక్రయాలు మాత్రం వ్యాలెట్‌ ద్వారానే జరుగుతుంటాయి. ఇందుకు ప్రత్యేక వ్యాలెట్లు ఉంటాయి.మాఫియా కార్యకలాపాలు నిర్వహించేవారు, హ్యాకర్లు ఈ లావాదేవీలను ఎక్కువగా నిర్వహిస్తుంటారు.

మారకం విలువ

ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ మారకం విలువ 2000 అమెరికన్ డాలర్లు. ఇటీవల ఈ విలువ 3200 డాలర్లను తాకింది కూడా!! ఎందుకంటే బంగారం మాదిరిగా బిట్‌కాయిన్లూ అరుదైనవే. వీటిని సూపర్ కంప్యూటర్ల ద్వారా... అది కూడా పరిమితంగానే సృష్టించగలరు. అందుకే బిట్‌కాయిన్ల ట్రేడింగ్‌లో స్పెక్యులేషన్ పెరిగింది. పెపైచ్చు వర్డ్‌ప్రెస్, ఓవర్‌స్టాక్.కామ్, రెడ్డిట్, ఒకే క్యుపిడ్, వర్జిన్ గెలాక్టిక్, బైదు లాంటి సంస్థలన్నీ ఆన్‌లైన్ షాపింగ్‌కు బిట్‌కాయిన్లను అనుమతిస్తున్నాయి. అందుకే వీటిని కావాలనుకునేవారు పెరిగారు. దీంతో బిట్‌కాయిన్ల మారకం రేటు రయ్యిమని పెరిగింది. ఇంతలో కొన్ని దేశాలు దీని వాడకంపై పరిమితులు విధిస్తామని చెప్పటం, మారకం ఎక్స్ఛేంజీలపై హ్యాకర్లు దాడులు చెయ్యటంతో విలువ కొంత పడింది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న బిట్‌కాయిన్ల మార్కెట్ విలువ సుమారు 8.4 బిలియన్ డాలర్లుంటుంది. బిట్‌కాయిన్ లాంటి వర్చువల్ కరెన్సీలు 70కి పైగా ఉండగా... వీటి మొత్తం విలువ దాదాపు 13 బిలియన్ డాలర్లుంటుందని అంచనా. దీన్లో సింహభాగం బిట్‌కాయిన్లదే కనక దీనికంత ప్రాధాన్యం. 2009లో బిట్‌కాయిన్‌ విలువ అమెరికా సెంటు విలువ కంటే కూడా తక్కువ. 2011లో డాలరుకు సమాన విలువకు చేరింది.2017 ప్రారంభంలో 800- 1000 డాలర్ల (రూ.60,000- 70,000) మధ్య ఉన్న బిట్‌కాయిన్‌ విలువ.. డిసెంబరులో 20,000 డాలర్ల (సుమారు రూ.15,00,000) చేరువకు వెళ్లింది. అంటే ఇంచుమించు 2000 శాతం పెరిగింది.చికాగో మర్కంటైల్‌ ఎక్స్ఛేంజీ (సీఎంఈ) గ్రూపు, అమెరికా నాస్‌డాక్‌ ఎక్స్ఛేంజీలు బిట్‌కాయిన్‌కు ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ను ప్రారంభించడంతో ఆ సమయంలో బిట్‌కాయిన్‌కు ట్రేడర్ల నుంచి ఆదరణ పెరిగింది. వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు విధించిన ఆంక్షల ప్రభావంతో ఆ తర్వాత తిరోగమన బాట పట్టింది.ప్రస్తుతం బిట్‌కాయిన్‌ విలువ దాదాపు 6500 డాలర్ల వద్ద ఉంది. భారత కరెన్సీలో చెప్పదలిస్తే రూ.4.5 లక్షలు

కొనుగోలు - అమ్మకము

ప్రస్తుతం బిట్‌కాయిన్లు కొనాలంటే ఆన్‌లైన్ ఎక్స్చేంజీలను ఆశ్రయించాల్సిందే. దీనికోసం ఆయా ఎక్స్ఛేంజీల్లో ఒక ఖాతా క్రియేట్ చేసుకుని, దాన్ని బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలి. ఈ ఖాతాయే మనం కొనే బిట్‌కాయిన్లను దాచిపెట్టుకునే వాలెట్. మన అకౌంటు వెరిఫికేషన్ పూర్తయ్యాక... సరిపడే మొత్తాన్ని ఎక్స్చేంజీకి బదలాయిస్తే మన వాలెట్‌లోకి బిట్‌కాయిన్లు వచ్చి చేరతాయి. అయితే ఈ వెరిఫికేషన్ ప్రక్రియకు సుమారు పది రోజులు పైగా పడుతోందని, ఈలోగా బిట్‌కాయిన్ మారకం విలువ భారీగా మారిపోవడం వల్ల ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలు కోల్పోవాల్సి వస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.

బిట్‌కాయిన్లను నియంత్రించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థేమీ లేదు. యూజర్ల బ్లాక్‌చెయినే దీని వ్యవస్థ. ప్రతి యూజరుకు ఆన్‌లైన్లో ఒక కోడ్‌తో నిర్దిష్టమైన అడ్రెస్ ఉంటుంది. వారి లావాదేవీలన్నీ ఇలాంటి అడ్రెస్‌తోనే జరుగుతాయి. ఒక లావాదేవీ జరిగినపుడు... ఒక అడ్రస్ నుంచి బిట్‌కాయిన్లు మరో అడ్రస్‌కు బదిలీ అవుతాయి. కేవలం అడ్రస్ తప్ప... ఈ లావాదేవీ చేసినవారి వ్యక్తిగత వివరాలేవీ బయటకు రావు. అందుకే బిట్‌కాయిన్ల ద్వారా ఆన్‌లైన్లో పెద్ద ఎత్తున అక్రమాయుధాలు, మాదకద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇలా వివరాలు తెలియకపోవటమన్నది దీనికి ప్లస్సే కాదు... మైనస్ కూడా.

ఉపయోగాలు

మామూలు కరెన్సీతోనే అన్నీ చేయగలుగుతున్నపుడు బిట్ కాయిన్ల అవసరమేంటి? సహజంగా ప్రతి ఒక్కరికీ కలిగే సందేహమే ఇది. వెనకటి కాలంలో డబ్బు చలామణి లేని కాలంలో వస్తు మార్పిడి విధానం ఉండేది. అక్కడ ఉన్న సమస్యలలో నుంచి రాతి నాణేలు, తదుపరి బంగారు వెండి నాణేలు చలామణి అయ్యాయని మనము చిన్నప్పుడు చదువుకున్నాము. ఆ తరువాత మెటల్ కాయిన్స్ వచ్చాయి. అంటే చిల్లర నాణాలు. ఆ తరువాత ఫియట్ కరెన్సీ... అంటే కాగితపు నోట్లు వచ్చాయి. ఆ తదుపరి ప్లాస్టిక్ మనీ.. అంటే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు వచ్చాయి. ఆ తరువాత గడచిన కొన్ని సంవత్సరాలుగా మనము ఎలక్ట్రానిక్ మనీ ఉపయోగిస్తున్నాము. అంటే... ఫోన్-పే, గూగుల్ పే, NEFT మొదలైనవి అన్నమాట. ఈ డబ్బు పరిణామ క్రమంలో ఇప్పటి దశగా అభివర్ణించవచ్చు ఈ క్రిప్టోను. ఒక్కమాటలో చెప్పాలంటే.. క్రిప్టో అంటే భవిష్యత్తు డబ్బు స్వరూపం అన్నమాట. పెపైచ్చు బిట్‌కాయిన్ లావాదేవీల్లో మధ్యవర్తి ఎవ్వరూ ఉండరు. నేరుగా మన వాలె ట్‌లోంచి డబ్బు వ్యాపారి వాలెట్‌లోకి వెళుతుంది. అదే మన వివరాలు బయటకు రావు. వీటికితోడు వేరొకచోటికి తీసుకెళ్లటం, దాచుకోవటం వంటి అంశాల్లో కష్టం ఉండదు. అదే డీ- సెంట్రలైజ్ద్ విధానము అంటారు. వీటన్నిటితో పాటు... బిట్‌కాయిన్ లావాదేవీలపై ఛార్జీలు తక్డకువగా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యం... బిట్‌కాయిన్లలో జరిగే ప్రతి లావాదేవీ యూజర్లందరికీ తెలుస్తుంది. అంతా పారదర్శకమన్న మాట.

మనదేశంలో బిట్‌కాయిన్ వ్యవస్థ

ఇంకా మన దగ్గర బిట్‌కాయిన్ల వాడకం బాగా పెరిగింది. ఇంకా బిట్ కాయిన్ తరువాత ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 21 వేలకు పైగా క్రిప్టోల పేరిట కాయిన్లు, పలు టోకెన్లు చలామణీ అవుతున్నాయి. 2020 సుప్రీం తీర్పు తరువాత క్రిప్టోలో పెట్టుబడులు పెట్టేవారు ఎక్కువ అయ్యారు. ఈ రంగాన్ని మనదేశంలో క్రమబద్దీకరించాలని సుప్రీం ఆర్‌బీఐకు , ప్రభుత్వానికి సూచనా చెయ్యడమే కారణం. ఇంకా జి-20 దేశాల సమావేశాలలో వివిధ దేశాల సూచనలు పాటిస్తూ ఇందుకు సంబంధించి విధానాలు రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. ఇంకా ఈ తరహా లావాదేవీలకు వినియోగదారుడు తప్పనిసరిగా తన పూర్తీ వివరాలతో కేవైసి చేసుకుని ఎక్సేజి లలో కొనుగోలు అమ్మకాలు జరపవచ్చని కుడా రాజపత్రంలో ప్రకటించారు. అంతేకాదు డిజిటల్ ఆస్తులుగా పరిగణించే ఈ క్రిప్టో... మన దేశంలో లీగల్ అసెట్. వీటి లాభాల మీద 30 శాతం పన్ను విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిణామాలతో దేశీయంగా పలు ఎక్స్చేంజీలు కొనుగోలు అమ్మకాలతో ట్రేడింగ్ నిరంతరమూ కొనసాగిస్తున్నాయి.

భద్రత

ఇది అన్నిటికన్నా ప్రధానమైన ప్రశ్న. ఇక్కడ టెక్నాలజీ పరంగా భద్రత లభిస్తుంది. ఆ టెక్నాలజీ పేరు బ్లాక్ చైన్ టెక్నాలజీ. మరి ముఖ్యంగా ఇది డీ- సెంట్రలైజ్ద్ విధానంలో ఉంటుంది. అంటే మూడో వ్యక్తీకి ప్రమేయం లేకుండా అన్నమాట. అసలు ఇది రూపొందిన కారణమే డిజిటల్ ఆస్తుల పరిరక్షణకు. ఈ టెక్నాలజీ అనేది.... ఇందులో ఎలాంటి సర్వర్ లేకపోవడమే కారణం. అందువల్ల దీని రూపకర్త కుడా దీనిని, లేక సమాచారాన్ని తారుమారు చెయ్యలేరు. హక్ చేసే అవకాశం కుడా ఉండదు. అదే ఈ టెక్నాలజీ లో ఉన్న గొప్పదనము. 2017లో భారతదేశంలో అతిపెద్ద బ్లాక్ చెయిన్ సమ్మిట్ ఆంద్రప్రదేశ్'లో విశాఖ పట్నంలో జరిగింది. ఈ సందర్భంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం.... ఈ టెక్నాలజీ ఆవశ్యకత ఏమిటి, పారదర్శక పాలన అందించేందుకు ఈ టేక్నాలజి ఏ విధంగా దోహదం చేస్తుంది అన్నది గుర్తించినది. అంతేకాకుండా భూమి రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖలను ఈ బ్లాక్ చెయిన్ చెయిన్ టెక్నాలజీతో ఆధునీకరించాలని నిర్ణయం తీసుకున్నది. తద్వారా దేశంలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఉపయోగించుకున్న మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఇంకా చాలా రాష్ట్రాలు కూడా ఈ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా ప్రత్యేక వెబ్ సైట్ల ( https://blockchain.gov.in/) ద్వారా ఈ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆవశ్యకతను వివరిస్తున్నాయి. పలు సాంకేతిక విశ్వవిద్యాలయాలు ఈ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ మీద ప్రత్యెక కోర్సులు నిర్వహిస్తున్నాయి.

మూలాలు

https://www.niti.gov.in/sites/default/files/2020-01/Blockchain_The_India_Strategy_Part_I.pdfhttps://blockchain.gov.in/

Tags:

బిట్ కాయిన్ నేపధ్యముబిట్ కాయిన్ వాడుక, లావాదేవీలుబిట్ కాయిన్ మారకం విలువబిట్ కాయిన్ కొనుగోలు - అమ్మకముబిట్ కాయిన్ ఉపయోగాలుబిట్ కాయిన్ మనదేశంలో బిట్‌కాయిన్ వ్యవస్థబిట్ కాయిన్ భద్రతబిట్ కాయిన్ మూలాలుబిట్ కాయిన్

🔥 Trending searches on Wiki తెలుగు:

ప్రకృతి - వికృతివిద్యుత్తుశ్రేయా ధన్వంతరిఘిల్లికొడాలి శ్రీ వెంకటేశ్వరరావుపెళ్ళి2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాజూనియర్ ఎన్.టి.ఆర్20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిమండల ప్రజాపరిషత్వృశ్చిక రాశితెలుగు సినిమాలు 2024జై శ్రీరామ్ (2013 సినిమా)రజత్ పాటిదార్ఎనుముల రేవంత్ రెడ్డిఈనాడురైలుఛత్రపతి శివాజీపంచారామాలుఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంఉపమాలంకారంవిశ్వామిత్రుడువిరాట్ కోహ్లిసెక్స్ (అయోమయ నివృత్తి)రాజ్యసభగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంభారత జాతీయ మానవ హక్కుల కమిషన్థామస్ జెఫర్సన్వందేమాతరంబోడె రామచంద్ర యాదవ్తీన్మార్ మల్లన్నఎస్. ఎస్. రాజమౌళిపర్యాయపదంరౌద్రం రణం రుధిరంకుంభరాశికృతి శెట్టిఅన్నప్రాశనగజము (పొడవు)చిత్త నక్షత్రముఏ.పి.జె. అబ్దుల్ కలామ్రవీంద్రనాథ్ ఠాగూర్H (అక్షరం)నీతి ఆయోగ్కోవూరు శాసనసభ నియోజకవర్గంసోరియాసిస్మొఘల్ సామ్రాజ్యంలక్ష్మిఫిరోజ్ గాంధీసజ్జలునరేంద్ర మోదీపరిపూర్ణానంద స్వామిశ్రీ కృష్ణుడుగోత్రాలుహనుమాన్ చాలీసాభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుదొమ్మరాజు గుకేష్ఎల్లమ్మరుద్రమ దేవినితీశ్ కుమార్ రెడ్డివేంకటేశ్వరుడుహస్త నక్షత్రముభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంభారతరత్నమొదటి పేజీక్వినోవావృత్తులుసింగిరెడ్డి నారాయణరెడ్డిగ్రామ పంచాయతీవెలిచాల జగపతి రావురెడ్యా నాయక్కృత్తిక నక్షత్రముదశదిశలుమాధవీ లతసామెతలుస్వామి రంగనాథానందపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుఉగాది🡆 More