పామిటిక్ ఆమ్లం (Palmitic acid, or hexadecanoic acid in IUPAC nomenclature) కొన్ని జంతువులలోను, మొక్కలలోను లభించే ఒకరకమైన సంతృప్త కొవ్వు ఆమ్లం.
దీని రసాయన ఫార్ములా : CH3 (CH2) 14CO2H. ఇది పామ్ కుటుంబంలోని మొక్కలనుండి లభించే పామాయిల్, పామ్ కెర్నెల్ నూనె, కొబ్బరి నూనెలలో అధికంగా ఉంటుంది. పామిటేట్ అనేది పామిటిక్ ఆమ్లం యొక్క ఎస్టర్లు.
పేర్లు | |
---|---|
IUPAC నామము hexadecanoic acid | |
ఇతర పేర్లు C16:0 (Lipid numbers), palmic acid | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [57-10-3] |
పబ్ కెమ్ | 985 |
SMILES | CCCCCCCCCCCCCCCC(=O)O |
ధర్మములు | |
C16H32O2 | |
మోలార్ ద్రవ్యరాశి | 256.42 g/mol |
స్వరూపం | White crystals |
సాంద్రత | 0.853 g/cm3 at 62 °C |
ద్రవీభవన స్థానం | 62.9 °C |
బాష్పీభవన స్థానం | 351-352 °C 215 °C at 15 mmHg |
నీటిలో ద్రావణీయత | Insoluble |
ప్రమాదాలు | |
జ్వలన స్థానం | {{{value}}} |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
పామాయిల్ 18 కార్బనులను కలిగివుండి, ద్విబంధాలు లేని, ఎటువంటి శాఖలు లేని, సరళ హైడ్రొకార్బను శృంఖలం కలిగివున్న మోనో కార్బలిక్ కొవ్వుఆమ్లం. అనీమొక్కల నూనెలు, జంతుకొవ్వు లలో తప్పనిసరిగా 3-50% వుండే సంతృప్త కొవ్వుఆమ్లం. ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త ఎడ్మండ్ ఫ్రెమ్ 1840లో మొదటిసారిగా ఈఆమ్లాన్ని పామ్ఫ్రూట్ నూనెలో గుర్తింఛాడు. ఫ్రెంచిలో 'పామిటిక్యూ' అనగా పామ్చెట్టు యొక్క స్రవం అని ఆర్థం.ఆవిదంగా ఈకొవ్వు ఆమ్లానికి పామిటిక్ ఆమ్లమనే పేరు సార్థకమైనది. పామిటిక్ ఆమ్లం స్పటిక, ఘనరూపంలో తెల్లగా లేదా పాలిపోయిన పసుపురంగులో వుండును.
అణుఫార్ములా: CH3 (CH2) 14COOH
పామిటిక్ఆమ్లం యొక్క కొన్ని లక్షణాలు
స్వభావం | విలువ మితి |
ఎంపిరికల్ ఫార్ములా | CnH2nO2 |
ఆణుఫార్ములా | C16H32O2 (ఎంఫిరికల్) |
సపోనిఫికెసన్ విలువ | 205-2210C |
బాష్ప పీడనం | 10.0mm/Hg @2100C |
ఫ్లాష్ ఉష్ణోగ్రత | 114.40C |
అణుభారం | 258.27 |
లిపొజెనెసిస్ చర్యలో ఎసెటైల్ కొ-ఎంజైమ్ A (acetyl CoA) వలన ఏర్పడు మొదటికొవ్వు ఆమ్లం పామిటిక్ ఆమ్లం. ఆతరువాత అసెటైల్ కో-ఎంజైమ్A రెండుకార్బను సమూహలను (carbon groups) లను చేర్చుతూ పోవడంవలన మిగతా కొవ్వుఆమ్లాలు ఏర్పడును. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తన పరిశోధన నివేదికలో పామిటిక్ ఆమ్లంవున్న నూనెలను అధికంగా తీసుకోవడంవలన హృదయ సంబంధిత (cardiovascular) వ్యాదులకు త్వరగాగురై ఆవకాశమున్నదని చెప్పింది. కాని మరికొందరుచేసిన పరిశోధన సమాచారం ప్రకారం లినొలిక్ ఆమ్లంతో పాటు (పామిటిక్ ఆమ్లం% కన్న లినొలిక్ ఆమ్లం 4.5% ఎక్కువగా వుండాలి) తీసుకున్న ప్రమాదం అంతగాలేదని తెల్చాయి.
పామిటిక్ ఆమ్లాన్ని కలిగివున్న కొన్నినూనెలు/కొవ్వులు
నూనె | శాతం | నూనె | శాతం |
పామాయిల్ | 45-50 | కొకో బట్టరు | 25-27 |
పత్తిగింజల నూనె | 23-26 | ఇప్పనూనె | 24-25 |
తవుడు నూనె | 15-20 | నువ్వుల నూనె | 10-12 |
వేప నూనె | 16-30 | వేరుశనగ నూనె | 10-12 |
పామ్కెర్నల్ నూనె | 8-10 | Linseed నూనె | 6-8 |
కుసుమ నూనె | 2-10 | పొద్దుతిరుగుడు నూనె | 3.0-10.0 |
ఆవాల నూనె | 3.0-3.5 | ఆముదం | 1.0-2.0 |
మామిడిపిక్కనూనె | 5-6 | Lard, tallow | 25-40 |
కొబ్బరి నూనె | 6-7 | మొక్కజొన్ననూనె | 10-15 |
This article uses material from the Wikipedia తెలుగు article పామిటిక్ ఆమ్లం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.