డీహైడ్రేషన్: శరీరంలో నీరు క్షీణించడం

డీహైడ్రేషన్ (Dehydration) అంటే శరీరంలోని నీరు బాగా క్షీణించిపోవడం.

దీని వల్ల జీవక్రియ దెబ్బతింటుంది. దీనినే తెలుగులో జలహరణం అనవచ్చు.

డీహైడ్రేషన్
డీహైడ్రేషన్: లక్షణాలు, కారణాలు, నివారణ
డీహైడ్రేషన్, కలరా వలన కలిగిన హైపోవోలెమియా తగ్గించడానికి నోటి ద్వారా రీహైడ్రేషన్ ద్రావణాన్ని రోగికి తాగిస్తున్న నర్సు. కలరా వచ్చినపుడు నీరు (డీహైడ్రేషన్), సోడియం రెండింటినీ కోల్పోతారు.
ప్రత్యేకతఅత్యవసర వైద్య చికిత్స

ఇది సాధారణంగా శరీరంలోనికి వెళ్ళే నీటికన్నా బయటికి వెళ్ళే నీరు ఎక్కువైనప్పుడు సంభవిస్తుంది. మితిమీరిన వ్యాయామం, వ్యాధులు, అత్యంత వేడి వాతావరణం దీనికి ముఖ్యమైన కారణాలు. వేడి వాతావరణంలో బయట తిరిగితే శరీరం నుంచి నీరు, ఖనిజాలు, లవణాలు చెమట రూపంలో ఎక్కువగా బయటకు వెళ్ళిపోతాయి. ఇది డీహైడ్రేషన్ కు దారితీస్తుంది.

శరీరంలోని మొత్తం నీటిలో 3-4% ఆవిరైపోయినా మనుష్యుల్లో చాలావరకు తట్టుకోగలరు. 5-8% నష్టం అయితే కళ్ళు తిరగడం, అలసట సంభవిస్తాయి. నష్టం 10% కి మించితే భౌతికంగా మానసికంగా క్షీణించిపోతారు. విపరీతమైన దాహం వేస్తుంది. 15-25% నీరు పోతే మరణం సంభవిస్తుంది. ఒక మాదిరి డీహైడ్రేషన్ అయితే కొంచెం అసౌకర్యంగా, దాహంగా ఉంటుంది. దీన్ని ఓరల్ రీహైడ్రేషన్ (ప్రత్యేకమైన ద్రవపదార్థాల్ని సేవింపజేయడం) ద్వారా పరిష్కరించవచ్చు.

లక్షణాలు

బాగా దాహం వేయడం, తలనొప్పి, అసౌకర్యంగా అనిపించడం, ఆకలి మందగించడం, మూత్రం తక్కువగా రావడం, మానసికంగా గందరగోళం, ఏ కారణంలేకుండానే అలసటగా ఉండటం, గోళ్ళు ఊదారంగులోకి తిరగడం, మూర్ఛ మొదలైనవి డీహైడ్రేషన్ ప్రధాన చిహ్నాలు. శరీరంలో నీటి నష్టం ఎక్కువయ్యే కొద్దీ ఈ లక్షణాలు మరింత తీవ్రతరమవుతాయి.

కారణాలు

ఎండ, తేమ శాతం ఎక్కువగా ఉన్న వాతావరణంలో ఎక్కువగా తిరిగేవారు, ఎత్తైన ప్రాంతాల్లో నివసించేవారు, శ్రమతో కూడిన పనులు, వ్యాయామాలు, క్రీడల్లో పాల్గొనేవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కొన్ని రకాల మందుల వాడకం ద్వారా కూడా డీహైడ్రేషన్కు గురి కావచ్చు.

నివారణ

సాధారణ స్థాయిలో పనిచేస్తున్నపుడు దాహం వేసినప్పుడల్లా నీరు త్రాగుతుంటే డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవచ్చు. కనీసం ఎంత నీరు తీసుకోవాలి అనేది సదరు వ్యక్తి బరువుపైన, వాతావరణంపైన, తీసుకునే ఆహారంపైన, జన్యులక్షణాల మీద ఆధారపడి ఉంటుంది.

మూలాలు

బాహ్య లంకెలు

Classification
External resources


Tags:

డీహైడ్రేషన్ లక్షణాలుడీహైడ్రేషన్ కారణాలుడీహైడ్రేషన్ నివారణడీహైడ్రేషన్ మూలాలుడీహైడ్రేషన్ బాహ్య లంకెలుడీహైడ్రేషన్జీవక్రియ

🔥 Trending searches on Wiki తెలుగు:

దాశరథి కృష్ణమాచార్యనోటాతిథిబీమాకొబ్బరిచాట్‌జిపిటిసర్వే సత్యనారాయణవై.ఎస్.వివేకానందరెడ్డి హత్యనవలా సాహిత్యముమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంగోత్రాలుసిద్ధార్థ్మధుమేహంఝాన్సీ లక్ష్మీబాయిపులివెందులఫేస్‌బుక్కేతిరెడ్డి పెద్దారెడ్డిగరుత్మంతుడువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)త్రినాథ వ్రతకల్పంమీనరాశిరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంఅన్నప్రాశనరుక్మిణి (సినిమా)రాకేష్ మాస్టర్సౌర కుటుంబంపచ్చకామెర్లునామవాచకం (తెలుగు వ్యాకరణం)జ్యోతీరావ్ ఫులేసంఖ్యఅనసూయ భరధ్వాజ్మంజుమ్మెల్ బాయ్స్వడదెబ్బయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుఆరూరి రమేష్పాట్ కమ్మిన్స్తెలుగు సినిమాలు 2022తిరుమలకర్ణుడురుద్రమ దేవికేంద్రపాలిత ప్రాంతంతొలిప్రేమవిడాకులుఅరుణాచలంఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాతామర వ్యాధిరౌద్రం రణం రుధిరంగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంగున్న మామిడి కొమ్మమీదబతుకమ్మనువ్వు వస్తావనిభారతదేశ సరిహద్దులుజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షవాతావరణంవ్యాసుడుతోట త్రిమూర్తులుబోడె రామచంద్ర యాదవ్స్త్రీవిశాఖ నక్షత్రముతెలుగు నాటకరంగంసామెతల జాబితాడీజే టిల్లుసింగిరెడ్డి నారాయణరెడ్డిపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిహైదరాబాదుఆప్రికాట్పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్అనూరాధ నక్షత్రంభారత జాతీయ మానవ హక్కుల కమిషన్వృత్తులుఓటుకుండలేశ్వరస్వామి దేవాలయం20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిశ్రీకాంత్ (నటుడు)రాజంపేటఆవర్తన పట్టిక🡆 More