టిబెట్‌పై చైనా దురాక్రమణ

 

పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) టిబెట్‌పై నియంత్రణను పొందిన ఘటనను టిబెట్‌ను ఆక్రమించుకోవడం అంటారు. చైనా ప్రభుత్వం దీన్ని "టిబెట్ శాంతియుత విమోచన" అని అంటుంది. కేంద్రీయ టిబెట్ ప్రభుత్వం, టిబెటన్ డయాస్పోరాలు దీన్ని" టిబెట్‌పై చైనా దురాక్రమణ" అంటారు.

అంతర్జాతీయ గుర్తింపు పొందేందుకు, తన సైన్యాన్ని ఆధునీకరించేందుకూ టిబెట్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాక, టిబెట్ ప్రభుత్వం, PRC మధ్య చర్చలు కూడా విఫలమయ్యాక, 1950 అక్టోబరులో పశ్చిమ ఖామ్‌లోని చామ్‌డో ప్రాంతంలో జరిగిన సైనిక వివాదం తర్వాత ఈ ప్రాంతాలు చైనా నియంత్రణలోకి వచ్చాయి. 1951 అక్టోబరులో చైనీయుల ఒత్తిడికి లొంగి టిబెట్ ప్రభుత్వం పదిహేడు అంశాల ఒప్పందాన్ని ఆమోదించింది. కొన్ని పాశ్చాత్య అభిప్రాయాలలో, టిబెట్‌ను చైనాలో చేర్చడమనేది విలీనం చేయడం కిందకి వస్తుంది.

1959 టిబెటన్ తిరుగుబాటు వరకు టిబెట్ ప్రభుత్వం, టిబెటన్ సామాజిక వ్యవస్థ టిబెట్ పరిపాలన చైనా అధీనం కింద ఉండేవి. ఆ తిరుగుబాటు తరువాత దలైలామా ప్రవాసంలోకి పారిపోయాడు. ఆ తర్వాత టిబెట్ ప్రభుత్వాన్ని, టిబెటన్ సామాజిక వ్యవస్థనూ చైనా రద్దు చేసింది.

నేపథ్యం

చైనాలోని క్వింగ్ రాజవంశానికి చెందిన క్వింగ్ 1720లో డుంగర్ ఖానేట్ బలగాలను పారదోలి టిబెట్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. 1912 వరకు ఇది క్వింగ్ వంశపు పాలనలోనే ఉంది. తరువాత వచ్చిన రిపబ్లిక్ ఆఫ్ చైనా టిబెట్‌తో సహా క్వింగ్ రాజవంశం ఆధీనంలో ఉన్న అన్ని భూభాగాలను తనకు వారసత్వంగా చెందినట్లుగా ప్రకటించింది. ఆరేళ్ల జువాంటాంగ్ చక్రవర్తి తరపున ఎంప్రెస్ డోవేజర్ లాంగ్యు సంతకం చేసిన క్వింగ్ చక్రవర్తి యొక్క పదవీ విరమణ రాజ శాసనంలో ఈ దావాను ఇలా ప్రకటించారు: "... మంచూ, హాన్, మంగోల్, హుయ్, టిబెటన్ అనే ఐదు జాతులకు చెందిన భూభాగాల సమగ్రతను ఒక గొప్ప రిపబ్లిక్ ఆఫ్ చైనాగా మార్చడం". 1912లో ఆమోదించబడిన రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క తాత్కాలిక రాజ్యాంగం ప్రత్యేకంగా టిబెట్‌తో సహా కొత్త రిపబ్లిక్ యొక్క సరిహద్దు ప్రాంతాలను దేశంలో అంతర్భాగాలుగా ప్రకటించింది.

1911లో జిన్‌హై విప్లవం తర్వాత, ప్రస్తుత టిబెట్ స్వాధికార ప్రాంతం (TAR)తో కూడిన చాలా ప్రాంతం డీ ఫ్యాక్టో స్వతంత్ర పాలనగా మారింది. రిపబ్లిక్ ఆఫ్ చైనా నుండి ఇది స్వతంత్రంగా ఉండేది. మిగిలిన టిబెట్‌ ప్రాంతం 1917 నాటికి టిబెటన్ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది. టిబెటన్ జాతుల జనాభా అధికంగా కలిగిన కొన్ని సరిహద్దు ప్రాంతాలు (అమ్డో, తూర్పు ఖమ్) చైనీస్ నేషనలిస్ట్ పార్టీ ( కోమింటాంగ్ ) లేదా స్థానిక యుద్దవీరుల నియంత్రణలో ఉండేవి.

టిబెట్ స్వాధికార ప్రాంతాన్ని "రాజకీయ టిబెట్" అని కూడా పిలుస్తారు. అయితే టిబెటన్ జాతి జనులు అధికంగా ఉన్న అన్ని ప్రాంతాలను సమిష్టిగా "జాతి టిబెట్" అని పిలుస్తారు. రాజకీయ టిబెట్ అనేది 1951 వరకు నిరంతరం టిబెట్ ప్రభుత్వాల పాలనలో ఉన్న ప్రాంతం. "జాతి టిబెట్" అనేది ఉత్తర, తూర్పు ప్రాంతాలను సూచిస్తుంది. ఇక్కడ చారిత్రాత్మకంగా టిబెటన్ల ప్రాబల్యం ఉండేది. కానీ ఆధునిక కాలం వరకు కూడా ఇక్కడ టిబెటన్ అధికారం నిరంతరంగా లేదు. పైగా ఇది కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేది.

రాజకీయ టిబెట్‌కు డీ ఫ్యాక్టో స్వాతంత్ర్యం వచ్చిన సమయానికి, దాని సామాజిక-ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు మధ్యయుగ ఐరోపాను పోలి ఉండేవి. 1913 - 1933 మధ్య 13వ దలైలామా టిబెటన్ మిలిటరీని విస్తరించడానికి, ఆధునీకరించడానికీ చేసిన ప్రయత్నాలు శక్తివంతులైన కులీనులు సన్యాసుల వ్యతిరేకత కారణంగా విఫలమయ్యాయి. ప్రపంచంలోని ఇతర ప్రభుత్వాలతో దానికి పెద్దగా సంబంధాలు ఉండేవి కావు; భారతదేశం, యునైటెడ్ కింగ్‌డం, అమెరికాలను మినహాయించి. దీంతో టిబెట్‌ దౌత్యపరంగా ఒంటరై పోయి, అంతర్జాతీయ సమాజానికి సమస్యలపై తన వైఖరిని తెలియజేయ లేని స్థాయికి తెగిపోయింది.

స్వతంత్రంగా ఉండటానికి టిబెట్ చేసిన ప్రయత్నాలు

1949 జూలైలో, రాజకీయ టిబెట్‌లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ జరిపించిన ఆందోళనలను నిరోధించడానికి, టిబెటన్ ప్రభుత్వం లాసాలోని (జాతీయవాద) చైనా ప్రతినిధి బృందాన్ని బహిష్కరించింది. 1949 నవంబరులో, ఇది అమెరికా విదేశాంగ శాఖకు ఒక లేఖను రాస్తూ మావో జెడాంగ్‌కు ఒక కాపీ పంపింది. అలాగే బ్రిటీషు ప్రభుత్వానికి విడిగా ఒక లేఖను పంపింది. టిబెట్‌లోకి చైనా దళాల చొరబాట్లకు వ్యతిరేకంగా "సాధ్యమైన మార్గాలన్నిటి ద్వారా" తనను తాను రక్షించుకోవాలనే ఉద్దేశాన్ని ఈ లేఖల్లో ప్రకటించింది.

అంతకు ముందు మూడు దశాబ్దాలలో, సంప్రదాయ వాద టిబెట్ ప్రభుత్వం తన సైనిక ప్రాధాన్యతను తగ్గిస్తూ, దాన్ని ఆధునికీకరించకుండా దూరంగా ఉంది. 1949లో సైన్యాన్ని ఆధునికీకరించేందుకు, విస్తరింపజేయడానికీ త్వరితగతిన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ రెండు అంశాలూ చాలా వరకు విఫలమయ్యాయి. సమర్థవంతమైన సైన్యాన్ని తయారుచెయ్యడం, శిక్షణ ఇవ్వడం అప్పటికే చాలా ఆలస్యమైంది. భారతదేశం కొన్ని చిన్న ఆయుధాలను అందించి, సైనిక శిక్షణనూ అందించింది. అయితే, చైనా సైన్యం టిబెట్ సైన్యం కంటే చాలా పెద్దది, మెరుగైన శిక్షణ పొందినది, మెరుగైన నాయకత్వం కలిగినది, మెరుగైన సన్నద్ధతలో ఉన్నది, అనుభవమున్నదీను.

1950లో, 14వ దలైలామా వయస్సు 15 సంవత్సరాలు. అతనికి ఇంకా వయీజనుడు కాదు. కాబట్టి రీజెంట్ తక్త్రా టిబెట్ ప్రభుత్వానికి తాత్కాలిక అధిపతిగా ఉండేవాడు. దలైలామా మైనరుగా ఉన్న ఆ కాలం సాంప్రదాయకంగా అస్థిరతకూ విభజనకూ ఆలవాలమై ఉండేది. అప్పట్లో జరిగిన రెటింగ్ కుట్ర వలన, 1947 రీజెన్సీ వివాదం వలనా ఈ విభజన, అస్థిరతలు మరింత ముదిరాయి.

చైనా సన్నాహాలు

టిబెట్‌పై చైనా దురాక్రమణ 
కమ్యూనిస్ట్ అడ్వాన్స్ యొక్క ఉజ్జాయింపు లైన్ (CIA, ఫిబ్రవరి 1950)

చైనా, దాని పూర్వగామి యిన కుమింటాంగ్‌లు రెండూ టిబెట్ చైనాలో భాగమేననే వాదనకే ఎప్పుడూ చెప్పేవి. పిఆర్‌సి టిబెటన్లను ఆధ్యాత్మిక భూస్వామ్య వ్యవస్థ నుండి "విముక్తి" చేయడానికి సైద్ధాంతికంగా కట్టుబడి ఉన్నట్లు కూడా ప్రకటించింది. 1949 సెప్టెంబరులో, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడానికి కొద్దికాలం ముందు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP), టిబెట్, తైవాన్, హైనాన్ ద్వీపం, పెస్కాడోర్స్ దీవులను శాంతియుతంగా నైనా, బలవంతంగా నైనా PRCలో కలపడం తన ప్రాథమ్యతగా ప్రకటించింది. టిబెట్ తన డీ ఫ్యాక్టో స్వాతంత్ర్యాన్ని స్వచ్ఛందంగా వదులుకునే అవకాశం లేనందున, మావో 1949 డిసెంబరులో టిబెట్ ప్రభుత్వాన్ని చర్చలకు ప్రేరేపించడం కోసం, కమ్‌డో (చాండో) వద్ద టిబెట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు సన్నాహాలు చేయాలని ఆదేశించాడు. PRC క్రింద పది లక్షలకు పైబడి సైనికులుండేవారు ఆ మధ్యనే ముగిసిన చైనీస్ అంతర్యుద్ధంలో పాల్గొన్న విస్తృతమైన పోరాట అనుభవం వారికి ఉంది.

టిబెట్, చైనాల మధ్య చర్చలు

టిబెట్, చైనాల మధ్య జరిగిన చర్చలో బ్రిటన్, భారతదేశ ప్రభుత్వాలు మధ్యవర్తిత్వం వహించాయి. ఇతర విషయాలతోపాటు చైనీయుల నుండి టిబెట్ " ప్రాదేశిక సమగ్రతను " గౌరవిస్తామనే హామీని పొందేందుకు టిబెటన్ ప్రతినిధి బృందం 1950 మార్చి 7 న, కొత్తగా ప్రకటించిన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో చర్చలు జరిపేందుకు, భారతదేశంలోని కాలింపాంగ్‌కు చేరుకుంది. చర్చలు ఎక్కడ జరపాలనే అంశంపై టిబెటన్, భారతీయ, బ్రిటీష్, చైనా ప్రతినిధుల మధ్య జరిగిన సంప్రదింపుల కారణంగా చర్చలు ఆలస్యమయ్యాయి. సింగపూర్ లేదా హాంకాంగ్ (బీజింగ్ కాదు) లో జరపాలని టిబెట్ ప్రతిపాదించగా; బ్రిటన్ భారతదేశం పట్ల (హాంకాంగ్, సింగపూర్ కాదు) మొగ్గు చూపింది; భారతదేశం, చైనాలు బీజింగ్ పట్ల మొగ్గుచూపాయి. టిబెటన్ ప్రతినిధి బృందం చివరికి 1950 సెప్టెంబరు 16 న ఢిల్లీలో PRC రాయబారి జనరల్ యువాన్ ఝాంగ్జియాన్‌తో సమావేశమైంది. టిబెట్‌ను చైనాలో భాగంగా పరిగణించాలని, టిబెట్ రక్షణకు చైనా బాధ్యత వహించాలని, టిబెట్ వాణిజ్యం విదేశీ సంబంధాలకు చైనా బాధ్యత వహించాలనీ యువాన్ ఒక 3-అంశాల ప్రతిపాదనను పెట్టాడు. దానికి అంగీకరిస్తే శాంతియుతంగా చైనా సార్వభౌమత్వం కిందకి వస్తుంది, లేదంటే యుద్ధానికి దారి తీస్తుంది. చైనా టిబెట్ బంధాన్ని పూజారి-ధర్మకర్త సంబంధంగా టిబెటన్లు నిర్వచించారు:

ఇప్పుడున్నట్లు గానే టిబెట్ ఇకముందూ స్వతంత్రంగా ఉంటుంది. చైనాతో మా సంబంధాలు పూజారి-ధర్మకర్త తరహా లోనే కొనసాగుతాయి. అలాగే, టిబెట్‌లో బ్రిటిషు వారు గానీ, అమెరికా వారు గానీ, గువోమిండాంగ్ గానీ రాజ్యం చెయ్యడం లేదు కాబట్టి, టిబెట్‌ను 'విముక్తం' చెయ్యాల్సిన అవసరమే తలెత్తదు. టిబెట్‌ను పరిపాలిస్తున్నదీ, సంరక్షిస్తున్నదీ దలైలామా (విదేశీ శక్తులేమీ కాదు).  – త్సెపోన్ డబ్ల్యు.డి. షకాబ్పా : 46 

సెప్టెంబరు 19న వారు, వారి ప్రధాన ప్రతినిధి త్సెపోన్ WD షకబ్బా, అమలుకు సంబంధించిన కొన్ని నిబంధనలతో, సహకారం అందిస్తామని చెప్పారు. టిబెట్‌లో చైనా సైనికులు ఉండాల్సిన అవసరం లేదు. టిబెట్‌కు ఎలాంటి ముప్పు లేదనీ, ఒకవేళ భారత్ గానీ, నేపాల్ గానీ దాడి చేస్తే అప్పుడు సైనిక సహాయం కోసం చైనాకు విజ్ఞప్తి చేయవచ్చనీ వారు వాదించారు. ఓవైపు టిబెట్ చర్చిస్తుండగా, 1950 అక్టోబరు 7 న చైనా సేనలు తూర్పు టిబెట్‌లోకి 5 ప్రదేశాలలో సరిహద్దును దాటి చొచ్చుకెళ్ళాయి. దాని ప్రయోజనం కేవలం దాడి కాదు, చామ్డోలో టిబెటన్ సైన్యాన్ని పట్టుకుని లాసా ప్రభుత్వాన్ని నిరుత్సాహపరచి, తద్వారా టిబెట్ అప్పగింతపై సంతకాలు చేసేందుకు తమ ప్రతినిధులను పంపే దిశగా బలమైన ఒత్తిడి తేవడమే ఆ చొరబాటు ఉద్దేశం. కమ్యూనిస్ట్ ప్రభుత్వంతో సంప్రదింపుల కోసం తక్షణమే బీజింగ్‌కు బయలుదేరమని టిబెట్ ప్రభుత్వం తన ప్రతినిధి బృందాన్ని ఆదేశించింది. దలైలామా హోదాకు హామీ ఇస్తే, మొదటి నిబంధనను అంగీకరించాలనీ, మిగతా రెండు షరతులనూ తిరస్కరించాలనీ తన ప్రతినిధి బృందానికి సూచించింది. ఆరు-సాయుధ మహాకాల దేవతలు చెప్పిన భవిష్యవాణి విన్న తర్వాత, టిబెట్, అసలు మూడింటిలో ఏ అంశాన్నీ అంగీకరించవద్దని ఆదేశించింది. అలా మొదటి డిమాండును అంగీకరిస్తే, టిబెట్‌ విదేశీ ఆధిపత్యంలోకి వస్తుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది.

చండో దండయాత్ర

నెలల తరబడి జరిగిన విఫల చర్చలు , విదేశీ సాయం, మద్దతుల కోసం టిబెట్ చేసిన ప్రయత్నాలు, PRC టిబెటన్ దళాల మోహరింపులూ వగైరాల తరువాత 1950 అక్టోబరు 6/7 న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) జిన్షా నదిని దాటింది. రెండు PLA యూనిట్లు సంఖ్యాబలం లేని టిబెటన్ దళాలను చుట్టుముట్టి, అక్టోబరు 19 నాటికి సరిహద్దు పట్టణం చమ్డోను స్వాధీనం చేసుకున్నాయి. ఆ సమయానికి 114 మంది చైనా సైనికులు, 180 మంది టిబెటన్ సైనికులు మరణించారు లేదా గాయపడ్డారు. 1962లో జాంగ్ గుయోహువా, "5,700 మందికి పైగా శత్రు సైనికులను నాశనం చేసారు", "3,000 మందికి పైగా" శాంతియుతంగా లొంగిపోయారు అని రాసాడు. పోరాటం గయామో న్గుల్ చు నదికి ఈశాన్యంగా, 96వ మెరిడియన్‌కు తూర్పున ఉన్న సరిహద్దు ప్రాంతానికి పరిమితమైంది. చమ్డోను స్వాధీనం చేసుకున్న తర్వాత, చైనా సైన్యం పోరాటాన్ని ఆపింది. చర్చల నిబంధనలను పునరుద్ఘాటించడానికి, పట్టుబడిన కమాండరు న్గాబోను లాసాకు పంపింది. బీజింగ్‌కు పంపిన దౌత్య అధికారుల ద్వారా టిబెట్ ప్రతినిధులు ప్రతిస్పందించే వరకు వేచి ఉన్నారు.

తదుపరి చర్చలు, విలీనం

టిబెట్‌పై చైనా దురాక్రమణ 
PLA అక్టోబర్ 1951లో లాసాలోకి కవాతు చేసింది

PLA తరుపున దలైలామాతో చర్చలు జరపడానికి విడుదలైన ఖైదీలను (వారిలో ఖామ్ గవర్నర్ జనరల్ న్గాపోయి న్గావాంగ్ జిగ్మే ఉన్నాడు) లాసాకు పంపింది. టిబెట్ "శాంతియుతంగా విముక్తి పొందినట్లయితే", టిబెట్ ఉన్నత వర్గాలు తమ స్థానాలను, అధికారాన్నీ నిలుపుకోగలవని చైనా ప్రసారాల్లో వాగ్దానం చేసారు.

చైనా టిబెట్‌పై దాడి చేసిన ఒక నెల తర్వాత, ఎల్ సాల్వడార్ ఐరాస వద్ద టిబెట్ ప్రభుత్వం చేసిన ఫిర్యాదును స్పాన్సర్ చేసింది. అయితే భారతదేశం, యునైటెడ్ కింగ్‌డమ్‌లు దానిపై చర్చ జరగకుండా నిరోధించాయి.

టిబెటన్ సంధానకర్తలను బీజింగ్‌కు పంపారు. అప్పటికే పూర్తి చేసిన సెవెన్టీన్ పాయింట్ అగ్రిమెంట్‌గా పేర్కొనే పత్రాన్ని వారికి ఇచ్చారు. చైనా ప్రతినిధి బృందం ఎటువంటి చర్చలు జరపలేదు. టిబెట్‌ను దాని స్వంత వేగంతో, దాని స్వంత పద్ధతిలో సంస్కరణలు జరుపౌకునేందుకు అనుమతిస్తుందని పేర్కొంది. అంతర్గత వ్యవహారాలను తానే నిర్వహించుకోవడం, మత స్వేచ్ఛను అనుమతించారు. చైనాలో భాగం కావడానికి కూడా అది అంగీకరించాలి. టిబెటన్ సంధానకర్తలు ఈ కీలక అంశంపై తమ ప్రభుత్వంతో సంప్రదించడానికి వారిని అనుమతించలేదు. ప్రభుత్వం పేరుతో దేనిపైనా సంతకం చేయడానికి అనుమతి ఇవ్వనప్పటికీ, 1951 మే 23 న ఒప్పందంపై సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చారు. టిబెటన్ చరిత్రలో దాని ప్రభుత్వం చైనా అభిప్రాయాన్ని అంగీకరించడం – ఇష్టం లేకపోయినా – ఇదే మొదటిసారి.

బీజింగ్‌లోని టిబెటన్ ప్రతినిధులు, PRC ప్రభుత్వం టిబెట్‌లో PLA ఉనికిని, సెంట్రల్ పీపుల్స్ గవర్నమెంట్ పాలననూ అనుమతిస్తూ 1951 మే 23 న పదిహేడు పాయింట్ల ఒప్పందంపై సంతకం చేశారు. ఒప్పందం లోని నిబంధనలపై సంతకం చేయడానికి ముందు టిబెటన్ ప్రభుత్వం దాన్ని అనుమతించలేదు. టిబెటన్ ప్రభుత్వం ఆ పత్రాన్ని ఉన్నదున్నట్లుగా అంగీకరించాలా లేక ప్రవాసానికి పారిపోవడం మంచిదా అనే దానిపై ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. ఈ సమయానికి సింహాసనాన్ని అధిరోహించిన దలైలామా, ప్రవాసంలోకి పారిపోకూడదని నిర్ణయించుకున్నాడు. 1951 అక్టోబరులో అతను, 17 పాయింట్ల ఒప్పందాన్ని అధికారికంగా అంగీకరించాడు టిబెటన్ వర్గాల ప్రకారం, అక్టోబరు 24 న, దలైలామా తరపున, ఒప్పందాన్ని సమర్థిస్తూ జనరల్ జాంగ్ జింగ్వు మావో జెడాంగ్‌కు ఒక టెలిగ్రామ్ పంపాడు. న్గాపోయి న్గావాంగ్ జిగ్మే, జాంగ్ వద్దకు వచ్చి, టిబెటన్ ప్రభుత్వం అక్టోబరు 24న టెలిగ్రామ్ పంపడానికి అంగీకరించిందని మాత్రమే చెప్పినట్లూ, దలైలామా ఇచ్చిన అధికారిక ఆమోదం కాదనీ ఆధారాలు ఉన్నాయి. కొంతకాలం తర్వాత, PLA లాసాలోకి ప్రవేశించింది. టిబెట్ తదుపరి విలీనం, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో అధికారికంగా "టిబెట్ శాంతియుత విముక్తి" అని ప్రకటించగా, దాన్ని ఆ దేశ మీడియా ప్రచారం చేసింది.

అనంతర పరిణామాలు

టిబెట్‌పై చైనా దురాక్రమణ 
టిబెట్ యొక్క 'శాంతియుత విముక్తి' వేడుకలో జరుపుకునే విందులో చైనీస్, టిబెటన్ ప్రభుత్వ అధికారులు

అనేక సంవత్సరాల పాటు, ఆక్రమణకు ముందు టిబెట్‌లో తన పాలనలో ఉన్న ప్రాంతాలలో టిబెట్ ప్రభుత్వ పాలన కొనసాగింది. 1950లో PLAచే ఆక్రమించుకున్న కమ్‌డో పరిసర ప్రాంతాలు దీనికి మినహాయింపు. ఈ సమయంలో, టిబెటన్ ప్రభుత్వం క్రింద ఉన్న ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం నుండి పెద్ద స్థాయిలో స్వయంప్రతిపత్తి ఉండేది. అక్కడ తమ సాంప్రదాయిక సామాజిక నిర్మాణాన్ని కొనసాగించుకున్నాయి

1956లో, టిబెట్ అటానమస్ రీజియన్ వెలుపల ఉన్న తూర్పు ఖామ్‌లోని జాతిపరంగా టిబెటన్ ప్రాంతంలోని టిబెటన్ మిలీషియాలు, భూసంస్కరణలో PRC ప్రభుత్వ ప్రయోగాలతో ప్రేరేపించబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటం ప్రారంభించాయి. చుషీ గ్యాంగ్‌డ్రుక్ వాలంటీర్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడానికి మిలీషియాలు ఏకమయ్యాయి. 1959 మార్చిలో పోరాటం లాసాకు వ్యాపించినప్పుడు, దలైలామా ఆరుగురు క్యాబినెట్ మంత్రులతో సహా ఇరవై మంది పరివారంతో మార్చి 17న లాసాను విడిచిపెట్టి, టిబెట్ నుండి పారిపోయారు. దలైలామా లాసాను విడిచిపెట్టినప్పటి నుండి అతని భద్రత లేదా ఆచూకీ గురించి ఎటువంటి వార్తలు లేనందున అతన్ని చంపి ఉంటారని చాలా మంది భావించారు. ఇక్కడ టిబెటన్లకు, చైనా సైన్యానికీ మధ్య జరిగిన మూడు రోజుల పోరాటంలో 2,000 మందికి పైగా మరణించినట్లు అంచనా. చివరకు 1959 మార్చి 31న హిమాలయ పర్వతాల మీదుగా కాలినడకన పదిహేను రోజుల ప్రయాణం తర్వాత కెంజిమాన పాస్ వద్ద సరిహద్దు దాటి దలైలామా, భారత్‌లోకి ప్రవేశించినట్లు తెలిసింది.

దలైలామా, టిబెట్‌లోని PRC ప్రభుత్వం ఇద్దరూ 17 పాయింట్ల ఒప్పందాన్ని తిరస్కరించారు. టిబెట్‌ లోని PRC ప్రభుత్వం టిబెట్ స్థానిక ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఈ చర్య పర్యవసానమే నేటికీ కొనసాగుతోంది.

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి ఇద్దరు వ్యక్తులలో ఒకరు, టిబెట్‌లో జన్మించిన టెన్జింగ్ నార్గే కుమారుడు జామ్లింగ్ టెన్జింగ్ నార్గే తన పుస్తకంలో ఇలా అన్నాడు, "హిమాలయాలకు దక్షిణం వైపున జన్మించడం, తద్వారా టిబెట్‌పై చైనా దాడిని తప్పించుకోవడం నా అదృష్టంగా భావిస్తాను."

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

టిబెట్‌పై చైనా దురాక్రమణ నేపథ్యంటిబెట్‌పై చైనా దురాక్రమణ స్వతంత్రంగా ఉండటానికి టిబెట్ చేసిన ప్రయత్నాలుటిబెట్‌పై చైనా దురాక్రమణ చైనా సన్నాహాలుటిబెట్‌పై చైనా దురాక్రమణ టిబెట్, చైనాల మధ్య చర్చలుటిబెట్‌పై చైనా దురాక్రమణ చండో దండయాత్రటిబెట్‌పై చైనా దురాక్రమణ తదుపరి చర్చలు, విలీనంటిబెట్‌పై చైనా దురాక్రమణ అనంతర పరిణామాలుటిబెట్‌పై చైనా దురాక్రమణ ఇవి కూడా చూడండిటిబెట్‌పై చైనా దురాక్రమణ మూలాలుటిబెట్‌పై చైనా దురాక్రమణ

🔥 Trending searches on Wiki తెలుగు:

నానాజాతి సమితిభారత జాతీయ మానవ హక్కుల కమిషన్సాహిత్యంఅనసూయ భరధ్వాజ్తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్నరసింహావతారంపేరుఅమెరికా సంయుక్త రాష్ట్రాలుఉస్మానియా విశ్వవిద్యాలయంఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థవ్యతిరేక పదాల జాబితాకాకతీయులుపాలకొండ శాసనసభ నియోజకవర్గంవిజయ్ (నటుడు)వాల్మీకితెలుగు కవులు - బిరుదులుట్రావిస్ హెడ్కొణతాల రామకృష్ణఆయాసంఆత్రం సక్కుగైనకాలజీఅరుణాచలంబాల కార్మికులుభూకంపంశింగనమల శాసనసభ నియోజకవర్గంసాక్షి (దినపత్రిక)శివపురాణంఅమెరికా రాజ్యాంగందశావతారములుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలురష్మికా మందన్నతెలంగాణ ఉద్యమంమహాసముద్రంఅంగచూషణఅనిఖా సురేంద్రన్జిల్లేడుఓటుYనక్షత్రం (జ్యోతిషం)సమంతభారత రాజ్యాంగ సవరణల జాబితాసావిత్రి (నటి)జయలలిత (నటి)సమ్మక్క సారక్క జాతరలలితా సహస్రనామ స్తోత్రంవిభక్తికుప్పం శాసనసభ నియోజకవర్గంపచ్చకామెర్లునానార్థాలుపాడ్కాస్ట్నిర్వహణజాతీయ ప్రజాస్వామ్య కూటమినంద్యాల లోక్‌సభ నియోజకవర్గంసంస్కృతంప్రభాస్ఎనుముల రేవంత్ రెడ్డిముదిరాజ్ (కులం)సింగిరెడ్డి నారాయణరెడ్డిఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుసురేఖా వాణికోడూరు శాసనసభ నియోజకవర్గంసురవరం ప్రతాపరెడ్డితెలుగు కులాలుజనసేన పార్టీదక్షిణామూర్తి ఆలయంహార్దిక్ పాండ్యాఉండి శాసనసభ నియోజకవర్గంమహామృత్యుంజయ మంత్రంతెలుగు అక్షరాలుకోవూరు శాసనసభ నియోజకవర్గంకాశీహస్తప్రయోగంఏ.పి.జె. అబ్దుల్ కలామ్అల్లూరి సీతారామరాజుసుందర కాండరేణూ దేశాయ్🡆 More