జాన్ ఫోర్డ్

జాన్ ఫోర్డ్ (1894, ఫిబ్రవరి 1 - 1973, ఆగస్టు 31) అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత.

తన తరానికి చెందిన అత్యంత ముఖ్యమైన, ప్రభావవంతమైన సినిమా దర్శకులలో ఒకడిగా నిలిచాడు. ఫోర్డ్ ఎక్కువగా లొకేషన్ షూటింగ్, వైడ్ షాట్‌లను ఉపయోగించేవాడు.

జాన్ ఫోర్డ్
జాన్ ఫోర్డ్
జాన్ ఫోర్డ్ (1946)
జననం
జాన్ మార్టిన్ ఫీనీ

(1894-02-01)1894 ఫిబ్రవరి 1
కేప్ ఎలిజబెత్, మైనే, యుఎస్
మరణం1973 ఆగస్టు 31(1973-08-31) (వయసు 79)
పామ్ ఎడారి, కాలిఫోర్నియా
సమాధి స్థలంహోలీ క్రాస్ స్మశానవాటిక, కల్వర్ సిటీ, కాలిఫోర్నియా
వృత్తిసినిమా దర్శకుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1913–1966
రాజకీయ పార్టీరిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్)
జీవిత భాగస్వామి
మేరీ మెక్‌బ్రైడ్ స్మిత్
(m. 1920)
పిల్లలు2

జననం

ఫోర్డ్ 1894, ఫిబ్రవరి 1న జాన్ అగస్టిన్ ఫీనీ - బార్బరా "అబ్బే" కుర్రాన్ దంపతులకు కేప్ ఎలిజబెత్, మైనేలో జన్మించాడు. ఇతని తండ్రి జాన్ అగస్టిన్ 1854లో స్పిడాల్ కౌంటీ గాల్వే, ఐర్లాండ్‌లో జన్మించాడు. బార్బరా కుర్రాన్ ఇనిష్మోర్ (ఇనిస్ మోర్) ద్వీపంలోని కిల్రోనన్ పట్టణంలో అరన్ దీవులలో జన్మించింది.

సినిమారంగం

ది ఇన్ఫార్మర్ (1935), ది గ్రేప్స్ ఆఫ్ వ్రాత్ (1940), హౌ గ్రీన్ వాస్ మై వ్యాలీ (1941), ది క్వైట్ మ్యాన్ (1952) సినిమాలకు ఉత్తమ దర్శకుడిగా రికార్డు నాలుగు విజయాలతోసహా ఆరు అకాడమీ అవార్డులను అందుకున్నాడు. స్టేజ్‌కోచ్ (1939), మై డార్లింగ్ క్లెమెంటైన్ (1946), రియో గ్రాండే (1950), ది సెర్చర్స్ (1956), ది మ్యాన్ హూ షాట్ లిబర్టీ వాలెన్స్ (1962) వంటి సినిమాలకు ప్రసిద్ధి చెందాడు.

50 సంవత్సరాలకు పైగా తన సినీ జీవితంలో ఫోర్డ్ 140 కంటే ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించాడు. అకిరా కురోసావా, ఓర్సన్ వెల్లెస్, ఇంగ్మార్ బెర్గ్‌మాన్ ఇతన్ని గొప్ప దర్శకుల్లో ఒకరిగా పేర్కొన్నారు.

జాన్ ఫోర్డ్ 
1915లో ఫోర్డ్
జాన్ ఫోర్డ్ 
1973లో ఫోర్డ్

ఆర్కైవ్ వివరాలు

జాన్ ఫోర్డ్ తీసిన హౌ గ్రీన్ వాస్ మై వ్యాలీ, ది బాటిల్ ఆఫ్ మిడ్‌వే, డ్రమ్స్ ఎలాంగ్ ది మోహాక్, సెక్స్ హైజీన్, టార్పెడో స్క్వాడ్రన్ 8, ఫోర్ సన్స్ వంటి అనేక సినిమాలను అకాడమీ ఫిల్మ్ ఆర్కైవ్ భద్రపరిచింది.

అవార్డులు, సన్మానాలు

ది ఇన్‌ఫార్మర్ (1935), ది గ్రేప్స్ ఆఫ్ వ్రాత్ (1940), హౌ గ్రీన్ వాస్ మై వ్యాలీ (1941),, ది క్వైట్ మ్యాన్ (1952) మొదలైన సినిమాలకు ఉత్తమ దర్శకుడిగా మొత్తం నాలుగు అకాడమీ అవార్డులను అందుకున్నాడు. స్టేజ్‌కోచ్ (1939) సినిమాకు ఉత్తమ దర్శకుడిగా కూడా ఎంపికయ్యాడు. ఈనాటి వరకు కూడా ఫోర్డ్ అత్యధిక ఉత్తమ దర్శకుడు ఆస్కార్‌ అవార్డులను గెలుచుకున్న రికార్డును కలిగి ఉన్నాడు. 1940, 1941లో వరుసగా ఉత్తమ దర్శకుడు అవార్డులను గెలుచుకున్న మొదటి దర్శకుడు ఫోర్డ్. ఈ ఘనతను సరిగ్గా పది సంవత్సరాల తర్వాత జోసెఫ్ ఎల్. మాన్కీవిచ్ 1950, 1951లో ఉత్తమ దర్శకుడిగా వరుసగా అవార్డులు గెలుచుకున్నాడు. నిర్మాతగా, ఇతను ది క్వైట్ మ్యాన్ సినిమాకు ఉత్తమ చిత్రంగా నామినేషన్ కూడా అందుకున్నాడు. 1955, 1957లో ది జార్జ్ ఈస్ట్‌మన్ అవార్డు లభించింది, 1973లో అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుండి తొలి లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నాడు.

అకాడమీ అవార్డులు

సంవత్సరం అవార్డులు సినిమా విజేత
1932 ఉత్తమ చిత్రం ఆరోస్మిత్ ఇర్వింగ్ జి. థాల్బర్గ్ - గ్రాండ్ హోటల్
1935 ఇన్ఫార్మర్ ఇర్వింగ్ జి. థాల్బెర్గ్ – ది మ్యూటినీ ఆన్ ది బౌంటీ
ఉత్తమ దర్శకుడు విజేత
1939 స్టేజ్ కోచ్ విక్టర్ ఫ్లెమింగ్ - గాన్ విత్ ది విండ్
1940 ఉత్తమ చిత్రం ది లాంగ్ వాయేజ్ హోమ్ డేవిడ్ ఓ. సెల్జ్నిక్ - రెబెక్కా
ఉత్తమ దర్శకుడు ది గ్రేప్స్ ఆఫ్ వ్రత్ విజేత
1941 ఉత్తమ చిత్రం హౌ గ్రీన్ వాజ్ మై వ్యాలీ విజేత
ఉత్తమ దర్శకుడు విజేత
1942 ఉత్తమ డాక్యుమెంటరీ ది బాటిల్ ఆఫ్ మిడ్‌వే విజేత
1943 బెస్ట్ డాక్యుమెంటరీ, షార్ట్ సబ్జెక్ట్స్ డిసెంబర్ 7: ది మూవీ విజేత
1952 ఉత్తమ చిత్రం ది క్వైట్ మ్యాన్ సెసిల్ బి. డెమిల్ - ది గ్రేటెస్ట్ షో ఆన్ ద ఎర్త్
ఉత్తమ దర్శకుడు విజేత

ఇతర అకాడమీ అవార్డులు

సంవత్సరం నటులు సినిమా ఫలితం
ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డు
1935 విక్టర్ మెక్‌లాగ్లెన్ ఇన్ఫార్మర్ విజేత
1940 హెన్రీ ఫోండా ది గ్రేప్స్ ఆఫ్ వ్రత్ నామినేట్
ఉత్తమ నటిగా అకాడమీ అవార్డు
1953 అవా గార్డనర్ మొగాంబో నామినేట్
ఉత్తమ సహాయ నటుడిగా అకాడమీ అవార్డు
1937 థామస్ మిచెల్ హరికేన్ నామినేట్
1939 స్టేజ్ కోచ్ విజేత
1941 డోనాల్డ్ క్రిస్ప్ హౌ గ్రీన్ వాజ్ మై వ్యాలీ విజేత
1952 విక్టర్ మెక్‌లాగ్లెన్ ది క్వైట్ మ్యాన్ నామినేట్
1955 జాక్ లెమ్మన్ మిస్టర్ రాబర్ట్స్ విజేత
ఉత్తమ సహాయ నటిగా అకాడమీ అవార్డు
1939 ఎడ్నా మే ఆలివర్ మోహాక్ వెంట డ్రమ్స్ నామినేట్
1940 జేన్ డార్వెల్ ది గ్రేప్స్ ఆఫ్ వ్రత్ విజేత
1941 సారా ఆల్‌గుడ్ హౌ గ్రీన్ వాజ్ మై వ్యాలీ నామినేట్
1953 గ్రేస్ కెల్లీ మొగాంబో నామినేట్

మరణం

ఫోర్డ్ తన 79 ఏళ్ళ వయసులో 1973, ఆగస్టు 31 కాలిఫోర్నియాలోని పామ్ ఎడారి ప్రాంతంలో మరణించాడు. కాలిఫోర్నియా కల్వర్ సిటీలోని హోలీ క్రాస్ శ్మశానవాటికలో ఇతని అంత్యక్రియలు జరిగాయి.

మూలాలు

బయటి లింకులు

Tags:

జాన్ ఫోర్డ్ జననంజాన్ ఫోర్డ్ సినిమారంగంజాన్ ఫోర్డ్ ఆర్కైవ్ వివరాలుజాన్ ఫోర్డ్ అవార్డులు, సన్మానాలుజాన్ ఫోర్డ్ మరణంజాన్ ఫోర్డ్ మూలాలుజాన్ ఫోర్డ్ బయటి లింకులుజాన్ ఫోర్డ్అమెరికన్లుదర్శకుడునిర్మాతసినిమా

🔥 Trending searches on Wiki తెలుగు:

Lసింధు లోయ నాగరికతగాయత్రీ మంత్రంనిన్నే ఇష్టపడ్డానుబరాక్ ఒబామామంగళవారం (2023 సినిమా)చాట్‌జిపిటిరెడ్డిప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాసామెతల జాబితాపాండవులుమాగుంట శ్రీనివాసులురెడ్డిబాలకాండతెలుగు సినిమాచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగుంటూరు కారంబలి చక్రవర్తిజొన్నఆది శంకరాచార్యులుఆంధ్రజ్యోతిప్రీతీ జింటామద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డితెలుగు వికీపీడియాఛత్రపతి శివాజీకుంభరాశివిజయ్ దేవరకొండరామాఫలంఅయోధ్య రామమందిరంకర్కాటకరాశిదశదిశలుఘట్టమనేని కృష్ణగుంటకలగరజయలలిత (నటి)ఏ.పి.జె. అబ్దుల్ కలామ్బంగారంకుష్టు వ్యాధిగరుడ పురాణంఎర్రబెల్లి దయాకర్ రావుశుక్రుడు జ్యోతిషంకల్వకుంట్ల చంద్రశేఖరరావునానార్థాలుకల్వకుంట్ల కవితతులారాశిదత్తాత్రేయశ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంటి.జీవన్ రెడ్డిబేతా సుధాకర్వేయి స్తంభాల గుడిరాగంభూమిఅశ్వగంధతెలుగు సాహిత్యంపర్యాయపదంఉలవలువ్యతిరేక పదాల జాబితాఉత్తరాభాద్ర నక్షత్రముఅక్కినేని నాగార్జున నటించిన చిత్రాలుసోంపురంజాన్వంగా గీతసుఖేశ్ చంద్రశేఖర్కన్నెగంటి బ్రహ్మానందంగుంటూరురావి చెట్టుస్టార్ మాఆకాశం నీ హద్దురాజాతిరత్నాలు (2021 సినిమా)సింగిరెడ్డి నారాయణరెడ్డిమోదుగచేతబడి90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్తెలంగాణా సాయుధ పోరాటంశాసనసభకర్మ సిద్ధాంతంఅవయవ దానంభారతీయ జనతా పార్టీ🡆 More