ఐజాక్ న్యూటన్

సర్ ఐజాక్ న్యూటన్ ( జనవరి 4, 1643 - మార్చి 31, 1727) ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త.

ఒక సిద్ధాంత కర్త, తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలో అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం, అది సైన్సుగా ఎలా పరిణామం చెందింది? అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవస్తుంది. 1687లో ప్రచురితమైన ఆయన శాస్త్ర గ్రంథం Philosophiæ Naturalis Principia Mathematica, సైన్సు చరిత్రలో అత్యంత ముఖ్యమైన రచన. ఈ గ్రంథంలో గురుత్వాకర్షణ శక్తి గురించి, న్యూటన్ ప్రతిపాదించిన మూడు గమన నియమాల గురించి ప్రస్తావించాడు. తరువాతి మూడు శతాబ్దాల పాటు భౌతిక ప్రపంచానికి సైన్సు దృక్కోణంగా వెలుగొందిన యాంత్రిక శాస్త్రానికి తరువాత ఆధునిక ఇంజనీరింగ్ కూ ఈ గ్రంథమే పునాది. ఏదైనా ఒక వస్తువు యొక్క గమనం, భూమి మీదైనా లేక ఇతర గ్రహాలమీదైనా ఒకే రకమైన నియమాల మీద ఆధారపడి ఉంటుందని నిరూపించాడు. దీనికి ఆధారంగా కెప్లర్ నియమాలకూ, గురుత్వాకర్షణ సిద్ధాంతాలకూ గల సామ్యాన్ని దృష్టాంతంగా చూపాడు. దీంతో సూర్య కేంద్రక సిద్ధాంతంపై పూర్తిగా అనుమానం తొలిగిపోవడమే కాకుండా ఆధునిక సైన్సు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది.

సర్ ఐజాక్ న్యూటన్
ఐజాక్ న్యూటన్
Godfrey Kneller's 1689 portrait of Isaac Newton aged 46
జననం(1643-01-04)1643 జనవరి 4
[OS: 25 December 1642]
Woolsthorpe-by-Colsterworth
లింకన్‌షైర్, ఇంగ్లండు
మరణం1727 మార్చి 31(1727-03-31) (వయసు 84)
[OS: 20 March 1726]
కెన్సింగ్‌టన్, లండన్, ఇంగ్లండు
నివాసంఇంగ్లండు
జాతీయతఇంగ్లీషు
రంగములుభౌతిక శాస్త్రము, గణితము, ఖగోళ శాస్త్రము,
న్యాచురల్ ఫిలాసఫీ, ఆల్కెమీ, థియాలజీ
వృత్తిసంస్థలుకేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం
రాయల్ సొసైటీ
చదువుకున్న సంస్థలుకేంబ్రిడ్జి ట్రినిటీ కళాశాల
విద్యా సలహాదారులుIsaac Barrow
Benjamin Pulleyn
ముఖ్యమైన విద్యార్థులుRoger Cotes
William Whiston
John Wickins
Humphrey Newton
ప్రసిద్ధిన్యూటోనియన్ మెకానిక్స్
గురుత్వాకర్షణ
కలన గణితం
కాంతి శాస్త్రము
ప్రభావితులుNicolas Fatio de Duillier
John Keill
సంతకం
ఐజాక్ న్యూటన్
గమనికలు
His mother was Hannah Ayscough. His half-niece was Catherine Barton.

బాల్యం

ఐజాక్ న్యూటన్ జనవరి 4, 1643లో లింకన్ షైర్ కౌంటీకి చెందిన ఒక చిన్న కుగ్రామమైన Woolsthorpe Manor అనే గ్రామంలో జన్మించాడు. న్యూటన్ జన్మించే సమయానికి ఇంగ్లండు ప్రంపంచమంతా పాటించే క్యాలెండరును పాటించక పోవడం మూలాన ఆయన జన్మదినం డిసెంబరు 25, 1642గా నిక్షిప్తం చేయబడింది. న్యూటన్ తండ్రి చనిపోయిన మూడు మాసాలకు జన్మించాడు. నెలలు నిండక మునుపే పుట్టడం వలన పసికందుగా ఉన్నపుడు న్యూటన్ చాలా చిన్నగా ఉండేవాడు. న్యూటన్ తల్లి Hannah Ayscough ఆ పసికందు ఒక లీటర్ పాత్రలో పట్టగలడని చెప్పినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. న్యూటన్ కు మూడు సంవత్సరాల వయసు రాగానే అతడి తల్లి, ఇతడిని ఆమె తల్లియైన Margery Ayscough సంరక్షణలో వదిలేసి వేరొక వ్యక్తిని (Barnabus Smith) పెళ్ళాడి అతనితో వెళ్ళిపోయింది. చిన్నప్పుడు న్యూటన్ తన పెంపుడు తండ్రిని ద్వేషించే వాడు. అంతేకాక అతన్ని పెళ్ళి చేసుకున్నందుకు తన తల్లి మీద కూడా ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఇది 19 ఏళ్ళ లోపు అతను చేసిన పొరపాట్ల జాబితా నుంచి వెల్లడి అయింది.

యాంత్రికశాస్త్రం , గురుత్వాకర్షణ

"ఎడ్మండ్ హాలే ఆర్థిక సహాయంతో జూలై 1687 లో Principia ప్రచురించబడింది. ఈ పనిలో, న్యూటన్ మూడు సార్వత్రిక నియమాల (universal law of gravitation)ని పేర్కొన్నాడు. ఇది ఒక విప్లవాత్మక ఆవిష్కరణ. Principia తో, న్యూటన్ అంతర్జాతీయంగా గుర్తించబడ్డాడు. ఆయనకు స్విట్జర్లాండ్ కి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు నికోలస్ ఫ్యాటియో డి డ్యూలియర్ తో దగ్గర సంబంధం ఏర్పడింది. నికోలస్ ప్రింసిపియా పుస్తకాన్ని తిరగరాయడాం మొదలు పెట్టాడు. కానీ 1693 లో వారిద్దరి మధ్య సంబంధాలు చెడిపోవడంతో ఆ పుస్తకం బయటి రానే లేదు. అదే సమయంలో న్యూటన్ నాడీ వ్యవస్థ దెబ్బతినింది.

న్యూటన్ సూత్రాలు

మూలాలు

Tags:

ఐజాక్ న్యూటన్ బాల్యంఐజాక్ న్యూటన్ యాంత్రికశాస్త్రం , గురుత్వాకర్షణఐజాక్ న్యూటన్ న్యూటన్ సూత్రాలుఐజాక్ న్యూటన్ మూలాలుఐజాక్ న్యూటన్16431727en:Philosophiæ Naturalis Principia Mathematicaగురుత్వాకర్షణగురుత్వాకర్షణ శక్తిజనవరి 4ప్రపంచముమార్చి 31యాంత్రిక శాస్త్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

Aమా తెలుగు తల్లికి మల్లె పూదండతమిళ అక్షరమాలప్రేమలుశ్రీనివాస రామానుజన్ఉగాదిపాలకొండ శాసనసభ నియోజకవర్గంనాగార్జునసాగర్ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుగుంటూరునరసింహావతారండి. కె. అరుణవెంట్రుకపది ఆజ్ఞలుసెక్యులరిజందూదేకులభారతీయ స్టేట్ బ్యాంకుమహాసముద్రంఉమ్మెత్తభువనేశ్వర్ కుమార్లలితా సహస్రనామ స్తోత్రంతామర పువ్వుపాల కూరపసుపు గణపతి పూజతెలుగుదేశం పార్టీవరలక్ష్మి శరత్ కుమార్పార్వతిజ్యోతీరావ్ ఫులేరోహిత్ శర్మసచిన్ టెండుల్కర్మరణానంతర కర్మలుఉత్తరాషాఢ నక్షత్రముమీనరాశిభారత ప్రధానమంత్రుల జాబితాశ్రీముఖితోట త్రిమూర్తులుప్రకటనఉపద్రష్ట సునీతదొంగ మొగుడునానార్థాలుతేటగీతిరావణుడుఅమిత్ షావిజయ్ (నటుడు)ఫ్యామిలీ స్టార్రక్తపోటుఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఏప్రిల్ 25బాల కార్మికులుఅమ్మల గన్నయమ్మ (పద్యం)దేవుడునిఖిల్ సిద్ధార్థఅల్లసాని పెద్దనలలిత కళలుఫిరోజ్ గాంధీక్రికెట్నవగ్రహాలుసునాముఖిసిద్ధు జొన్నలగడ్డవిశ్వనాథ సత్యనారాయణఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతెలుగుమానవ శరీరముతెలుగు నాటకరంగంసామెతలుశివపురాణంమహామృత్యుంజయ మంత్రంజవహర్ నవోదయ విద్యాలయంవిశాఖ నక్షత్రముహైదరాబాదుసరోజినీ నాయుడుఅవకాడోపాట్ కమ్మిన్స్శ్రేయా ధన్వంతరిక్వినోవా🡆 More