అభిరుచి

అభిరుచి అనేది ఆనందం కోసం చేసే ఒక సాధారణ చర్య.

సాధారణంగా ఒకరి విశ్రాంతి సమయంలో, వృత్తిపరంగా. జీతం కోసం కాకుండా తన ఆనందం కోసం చేసే చర్య. అభిరుచులలో వస్తువులను సేకరించడం, సృజనాత్మక, కళాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం , క్రీడలు ఆడటం లేదా ఇతర వినోదాలను అనుసరించడం వంటివి కొన్ని ఉదాహరణలు. అభిరుచులలో పాల్గొనడం ఆ రంగంలో గణనీయమైన నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని సంపాదించడాన్ని ప్రోత్సహిస్తుంది.

అభిరుచి
అభిరుచితో సముద్రపు శంకాలను సేకరించి పేర్చిన దృశ్యం

అభిరుచులు సమాజంలో పోకడలను అనుసరిస్తాయి. ఉదాహరణకు పంతొమ్మిదవ, ఇరవయ్యవ శతాబ్దాలలో స్టాంప్ సేకరణ ప్రజాదరణ పొందింది. ఎందుకంటే ఆ కాలంలో పోస్టల్ వ్యవస్థలు కమ్యూనికేషన్ యొక్క ప్రధాన సాధనంగా ఉన్నాయి. అయితే సాంకేతిక పురోగతిని అనుసరించి ఈ రోజుల్లో వీడియో గేమ్స్ మరింత ప్రాచుర్యం పొందాయి. పంతొమ్మిదవ శతాబ్దం యొక్క అభివృద్ధి చెందుతున్న ఉత్పత్తి, సాంకేతికత కార్మికులకు తమ అభిరుచిలో పాల్గొనడానికి విశ్రాంతి సమయాన్ని అందించింది. ఈ కారణంగా, అభిరుచుల కోసం పెట్టుబడులు పెట్టే వ్యక్తుల ప్రయత్నాలు కాలంతో పాటు పెరిగాయి.

మనిషి జీవితం అంతా యాంత్రికం అయిపోయింది. ఎవరికి వారు తమ తమ రోజువారీ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ పనుల తర్వాత దొరికే ఖాళీ సమయాల్లో మనమంతా మనకి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటాం. ఈ ఖాళీ సమయంలో చేసే పనినే అభిరుచి అని అంటారు.

ఉదాహరణలు: పాటలు వినడం, సినిమాలు చూడటం, బొమ్మలు గీయటం, ఇంటర్నెట్ చూడటం, యోగా చేయడం, నీటిలో ఈదటం, నడవటం వంటివి.

ఇవి అందరికీ మామూలుగా ఉండే అభిరుచులుగా చూడచ్చు. ఇంకా కొంతమందికి కొన్ని వినూత్నమైన అభిరుచులు ఉంటాయి. ఉదాహరణలు: తపాలా బిళ్ళల సేకరణ, వివిధ దేశాల నాణేల సేకరణ, ఎత్తైన కొండలు ఎక్కడం వంటివి.

ప్రతి ఒక్కరికీ ఏవో కొన్ని అభిరుచులు ఉండటం చాలా అవసరం. దీనివల్ల మన రోజువారీ పనుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొదవచ్చు. అలా సరదాగా గడపటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. తొందరగా అలసిపోకుండా ఉండవచ్చు.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

వ్యతిరేక పదాల జాబితాశుక్రుడుగ్రామ పంచాయతీపూర్వాషాఢ నక్షత్రమునిర్మలా సీతారామన్పులివెందులఆంధ్ర విశ్వవిద్యాలయంబుధుడుదసరామహేశ్వరి (నటి)వాతావరణంరమ్య పసుపులేటిరిషబ్ పంత్మంతెన సత్యనారాయణ రాజుపర్యాయపదంసాహిత్యంనందమూరి బాలకృష్ణఅవకాడోపటిక2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలురోహిణి నక్షత్రంతోట త్రిమూర్తులుపిఠాపురంఋగ్వేదంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుదానం నాగేందర్అన్నమయ్య జిల్లాఉమ్రాహ్జై శ్రీరామ్ (2013 సినిమా)జ్యోతీరావ్ ఫులేఅ ఆపెళ్ళియానిమల్ (2023 సినిమా)నాయీ బ్రాహ్మణులుకాశీఉస్మానియా విశ్వవిద్యాలయంనిర్వహణతెలుగు భాష చరిత్రనువ్వు నేనుశుక్రుడు జ్యోతిషంవిష్ణువుడిస్నీ+ హాట్‌స్టార్2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుపంచభూతలింగ క్షేత్రాలుతెలుగు విద్యార్థిH (అక్షరం)బర్రెలక్కభారతీయ రిజర్వ్ బ్యాంక్నూరు వరహాలువికీపీడియావినాయక చవితిఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుహార్సిలీ హిల్స్తెనాలి రామకృష్ణుడువర్షంవిడదల రజినిమాధవీ లతఉమ్మెత్తతెలుగు సంవత్సరాలుబీమాభీమసేనుడుతెలుగు అక్షరాలునాగార్జునసాగర్రాజంపేట శాసనసభ నియోజకవర్గంబతుకమ్మషణ్ముఖుడుసెక్యులరిజంపాలకొండ శాసనసభ నియోజకవర్గందగ్గుబాటి పురంధేశ్వరిశ్రీరామనవమిగ్లెన్ ఫిలిప్స్జే.సీ. ప్రభాకర రెడ్డికంప్యూటరుబొత్స సత్యనారాయణరామప్ప దేవాలయంయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ🡆 More