అంతర్జాతీయ మాతృ దినోత్సవం

అంతర్జాతీయ మాతృ దినోత్సవం (ఆంగ్లం: Mother's Day) కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం (ఎక్కువ దేశాలలో) నాడు జరుపుకుంటారు.

‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు.

అంతర్జాతీయ మాతృ దినోత్సవం
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
జరుపుకొనేవారు40+ దేశాలు
రకంప్రపంచ దేశాలు
ప్రాముఖ్యతతల్లులకు గౌరవంగా
జరుపుకొనే రోజుమే నెల రెండవ ఆదివారం (ఎక్కువ దేశాలలో)
ఆవృత్తివార్షికం

నేపథ్యం

తల్లిదండ్రులను దైవాలుగా భావిస్తూ ఆదరించే సంప్రదాయం భారతదేశంలో ఉంది. పాశ్చాత్య దేశాలలో పిల్లలు ఎదగగానే తల్లిదండ్రులను వదిలిపెట్టి స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తారు. అలాంటి సందర్భంలో అమ్మను రోజూ చూసుకునే పరిస్థితులు లేకపోవడంతో, అమ్మకోసం ఒక్కరోజును కేటాయించాలని మాతృ దినోత్సవంను ఏర్పాటుచేశారు.

చరిత్ర

ఈస్టర్కి ముందు నలభైరోజులను ‘లెంట్ రోజులుగా’ పరిగణిస్తారు. 17వ శతాబ్దంలో ఇంగ్లండులో నలభై రోజులలోని నాలుగవ ఆదివారంనాడు తల్లులకు గౌరవ పూర్వకంగా ‘మదరింగ్ సండే’ పేరిట ఉత్సవాలు జరిపేవారు. 1872లో అమెరికాలో జూలియావర్డ్ హోవే అనే మహిళ తొలిసారిగా ప్రపంచశాంతి కోసం మాతృ దినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించి, బోస్టన్ లో సమావేశాలను కూడా ఏర్పాటు చేసింది. సివిల్ వార్ గాయాల స్మృతులను చెరిగిపోయేలా చేసేందుకు ‘మదర్స్ ఫ్రెండ్ షిప్’డే నిర్వహించిన అన్నా మేరీ జెర్విస్ అనే మహిళ 1905, మే 9న చనిపోయింది. ఆవిడ కూతురైన మిస్‌జెర్విస్ మాతృ దినోత్సవం నిర్వహించాలని బాగా ప్రచారం చేయడంతోపాటు తన తల్లి రెండవ వర్థంతి సందర్భంగా మే నెలలోని రెండవ ఆదివారంనాడు మాతృ దినోత్సవంను నిర్వహించింది. అమెరికాలోనే తొలిసారిగా 1910లో వర్జీనియా రాష్ట్రంలో ఈ దినోత్సవాన్ని జరిపింది. జెర్విస్ చేసిన ప్రచారం ఫలితంగా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో ఈ దినోత్సవం జరపడం సంప్రదాయంగా మారింది. 1914లో నాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మాతృ దినోత్సవంను అధికారికంగా జరపాలని నిర్ణయించడంతోపాటూ, ఆ రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించి ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

మూలాలు

Tags:

en:Mother's Dayఆదివారముగ్రీస్మేసంవత్సరం

🔥 Trending searches on Wiki తెలుగు:

పరశురాముడులోక్‌సభ నియోజకవర్గాల జాబితాప్రధాన సంఖ్యట్రైడెకేన్అరకులోయశివ కార్తీకేయన్ఆప్రికాట్జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాఉమ్మెత్తవ్యవసాయంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిరజాకార్స్వాతి నక్షత్రముతెలుగు సినిమాలు 2022మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిశ్రీరామనవమివ్యవస్థాపకతభారత జాతీయగీతంయేసుమాదిగసంగీత వాద్యపరికరాల జాబితాఅల్లూరి సీతారామరాజుసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంకేంద్రపాలిత ప్రాంతంకన్యారాశిమదర్ థెరీసాఉస్మానియా విశ్వవిద్యాలయంశ్రీ కృష్ణుడునారా చంద్రబాబునాయుడుపంచభూతలింగ క్షేత్రాలుఋతువులు (భారతీయ కాలం)రైతుబంధు పథకంగోత్రాలు జాబితాగొట్టిపాటి రవి కుమార్వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)వేమన శతకముయవలుభద్రాచలంకొణతాల రామకృష్ణఆది శంకరాచార్యులుకేతిరెడ్డి పెద్దారెడ్డితులారాశికాన్సర్క్రిక్‌బజ్కల్వకుంట్ల కవిత73 వ రాజ్యాంగ సవరణభారత జాతీయ కాంగ్రెస్తెలుగు సాహిత్యంభారత రాజ్యాంగంవడదెబ్బఇక్ష్వాకులుతెలుగు సినిమాలు డ, ఢనామనక్షత్రమువిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితాహైపోథైరాయిడిజంహనుమజ్జయంతితెలుగు భాష చరిత్రఆంధ్రప్రదేశ్అండాశయముపల్లెల్లో కులవృత్తులుభారతదేశంలో కోడి పందాలుమ్యాడ్ (2023 తెలుగు సినిమా)కాలేయందివ్యభారతిఫ్యామిలీ స్టార్ఖమ్మంనాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంటైఫాయిడ్ఉత్తర ఫల్గుణి నక్షత్రముహస్త నక్షత్రముస్వర్ణకమలంపరీక్షిత్తుఓటురాజంపేట లోక్‌సభ నియోజకవర్గంశ్రీదేవి (నటి)చేపవిజయ్ దేవరకొండఅశ్వత్థామ🡆 More