శ్యామ్‌జీ కృష్ణ వర్మ

శ్యామ్‌జీ కృష్ణ వర్మ (1857 అక్టోబరు 4 - 1930 మార్చి 30) భారతీయ విప్లవ పోరాట యోధుడు.

న్యాయవాది. పాత్రికేయుడు. బ్రిటిష్ వలస పాలకుల గడ్డ లండన్ నుంచే స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిలూదిన ధీరుడు. ఏకంగా లండన్ కేంద్రంగానే ఇండియా హౌస్, ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ, ది ఇండియన్ సోషియాలజిస్ట్‌ పత్రికలను స్థాపించిన భారతీయ దేశభక్తుడు.

పండిట్

శ్యామ్‌జీ కృష్ణ వర్మ
శ్యామ్‌జీ కృష్ణ వర్మ
జననం(1857-10-04)1857 అక్టోబరు 4
మాండవి, కచ్ రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు కచ్, గుజరాత్)
మరణం1930 మార్చి 30(1930-03-30) (వయసు 72)
స్మారక చిహ్నంక్రాంతి తీర్థం, మాండవి, కచ్
విద్యాసంస్థబల్లియోల్ కాలేజ్, ఆక్స్‌ఫర్డ్
వృత్తిస్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, పాత్రికేయుడు
ఇండియన్ హోం రూల్ సొసైటీ,
ఇండియా హౌస్,
ది ఇండియన్ సోషియాలజిస్ట్
ఉద్యమంభారత స్వాతంత్ర్య ఉద్యమం
జీవిత భాగస్వామిమూస:వివాహం
తల్లిదండ్రులుకార్సన్ భానుశాలి (నఖువా), గోమతిబాయి

బాల్యం, విద్యాభ్యాసం, వృత్తి

శ్యామ్‌జీ కృష్ణ వర్మ గుజరాత్ లోని కచ్ లో 1857 లో జన్మించాడు. ముంబయిలోని విల్సన్ హైస్కూల్లో చదివాడు. సంస్కృతంలో పాండిత్యం సంపాదించాడు. 1875లో స్వామి దయానంద సరస్వతి స్ఫూర్తితో వేదతత్వంపై అధ్యయనం చేసాడు. 1877లో వారణాసి విశ్వవిద్యాలయం నుంచి పండిట్ బిరుదు పొందాడు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా పుచ్చుకున్నాడు. 1885లో స్వదేశం తిరిగొచ్చిన అతను న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. 1897లో ఆ వృత్తిని వీడి మళ్లీ లండన్ వెళ్లాడు.

1900లో అక్కడ ఇండియా హౌస్ ను, 1905లో ది ఇండియన్ సోషియాలజిస్ట్‌ను స్థాపించాడు. తన సొంత డబ్బుతో భారతదేశంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలిచ్చేవాడు. లండన్‌లో చదువుకోవటానికి కూడా వారిని ప్రోత్సహించేవాడు. ఇలా వచ్చే విద్యార్థులతో, భారతీయులతో ఇండియా హౌస్ క్రమంగా లండన్ లో జాతీయోద్యమ వేదికగా రూపాంతరం చెందింది. వీర సావర్కర్, భికాజీ కామ, లాలా హర్దయాళ్, మదన్ లాల్ ధింగ్రా.. ఇలాంటి వారంతా ఇక్కడ తయారైనవారే.

ఇండియన్ సోషియాలజిస్ట్ పత్రిక స్థాపించి బ్రిటిష్ పాలనపై వ్యాసాలు రాసేవాడు, శ్యామ్‌జీ కృష్ణ వర్మ. స్వరాజ్య సాధన లక్ష్యంగా 1905లో ఇండియా హోమ్రూల్ సొసైటీని కూడా ఏర్పాటు చేశాడు. బ్రిటన్ తో పాటు మిగిలిన ఐరోపా దేశాల్లోనూ భారత స్వాతంత్ర్య ఆవశ్యకతను విడమరచి చెప్పే ప్రయత్నం చేశాడు. వీటన్నింటి కారణంగా శ్యామ్‌జీ కృష్ణ వర్మను లక్ష్యంగా చేసుకుంది, బ్రిటన్ ప్రభుత్వం. బ్రిటన్ కోర్టుల్లో అతను అడుగుపెట్టకుండా నిషేధించారు. అతనిపై నిఘా పెంచారు. పోలీసుల ఒత్తిడి పెరగటంతో తప్పించుకొని 1907లో ఫ్రాన్స్కు చేరుకున్నాడు. వెనక్కి రప్పించాలని బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నించినా ఫ్రాన్స్ రాజకీయవర్గాల్లో అతనికున్న బలం కారణంగా అది సాధ్యపడలేదు. కింగ్ జార్జ్ ఫ్రాన్స్ పర్యటన నేపథ్యంలో అక్కడి నుంచి స్విట్జర్లాండ్ వెళ్లి అక్కడ ఒంటరిగా గడిపాడు. ఇదే అదనుగా అతన్ని గృహనిర్భందం చేసారు, బ్రిటన్ గూఢచారులు. తన సన్నిహితులనుకున్నవారే మోసం చేయటంతో 1930 లో స్విట్జర్లాండ్ లోనే అతను కన్నుమూసాడు.

శ్యామ్‌జీ కృష్ణ వర్మ 
పోస్టల్ స్టాంప్
శ్యామ్‌జీ కృష్ణ వర్మ 
క్రాంతి తీర్థం, శ్యామ్‌జీ కృష్ణ వర్మ మెమోరియల్, మాండ్వి, కచ్ (బ్యాక్ గ్రౌండ్‌లో ఇండియా హౌస్ ప్రతిరూపం)

గుర్తింపు

తన జీవితాన్ని, సంపదనంతటినీ భారత స్వాతంత్ర్య సాధనకోసం దానం చేసిన అతను.. మరణించే ముందు స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో, తన అస్థికలను భారత్ కు స్వాతంత్ర్యం వచ్చాకే అప్పగించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతని మరణ వార్తను లోకానికి తెలియకుండా చేయాలని బ్రిటన్ ప్రభుత్వం చూసినా విఫలమైంది. లాహోర్ జైలులో భగత్ సింగ్ తదితరులు అతనికి నివాళి అర్పించారు. బాల గంగాధర్ తిలక్ ప్రారంభించిన ఆంగ్ల దినపత్రిక మరాఠా అతనికి నివాళి అర్పించింది. 2003 ఆగస్టు 22న అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీకి స్విస్ ప్రభుత్వం శ్యామ్‌జీ కృష్ణ వర్మ, అతని భార్య భానుమతిల అస్థికలను అప్పగించింది. అతని స్మృతి చిహ్నంగా లండన్ లోని ఇండియా హౌస్ లాంటి ఇంటినే మాండ్వాలో గుజరాత్ ప్రభుత్వం నిర్మించింది. అతని స్మారకార్థం 1989 అక్టోబరు 4న ఇండియా పోస్ట్ పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. అతని గౌరవార్థం కచ్ విశ్వ విద్యాలయానికి అతను పేరు పెట్టింది.

మూలాలు

Tags:

ఇండియా హౌస్

🔥 Trending searches on Wiki తెలుగు:

పుష్కరంభారత రాష్ట్రపతిరాశి (నటి)ఇండియన్ ప్రీమియర్ లీగ్అనపర్తి శాసనసభ నియోజకవర్గంభారతదేశంలో మహిళలువ్యాసుడుసంఖ్యఅయోధ్య రామమందిరంభారత ఆర్ధిక వ్యవస్థశ్రీ చక్రంహనుమజ్జయంతితెలంగాణ ఉద్యమంతెలుగు సినిమాలు 2023హైదరాబాదుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంగంగా నదిపొడుపు కథలువెల్లలచెరువు రజినీకాంత్అశ్వత్థామబంగారంభారత రాష్ట్రపతుల జాబితాజాతీయములుఎన్నికలుపార్వతిఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుఉపనిషత్తుటీవీ9 - తెలుగుతెలుగు సినిమాగౌతమ బుద్ధుడుగ్యాస్ ట్రబుల్తెలుగు కవులు - బిరుదులుఅనురాధ శ్రీరామ్అల్లూరి సీతారామరాజుయానిమల్ (2023 సినిమా)హల్లులుమొలలుదగ్గుబాటి వెంకటేష్నవగ్రహాలు జ్యోతిషంతహశీల్దార్పోలవరం ప్రాజెక్టుజాషువాగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంశివాత్మికఉడుముగురువు (జ్యోతిషం)ఉత్తరాషాఢ నక్షత్రముమానవ శాస్త్రంజాతీయ విద్యా విధానం 2020భారతదేశ జిల్లాల జాబితావేమనప్రపంచ మలేరియా దినోత్సవం2024 భారత సార్వత్రిక ఎన్నికలురైతుబంధు పథకంభూమినందమూరి బాలకృష్ణభారత ఎన్నికల కమిషనుశాసనసభ సభ్యుడుమూర్ఛలు (ఫిట్స్)భరణి నక్షత్రముశాతవాహనులుతెలుగు సినిమాలు 2024గరుడ పురాణంఅండాశయముభారత రాజ్యాంగ సవరణల జాబితాటబుకె.బాపయ్యవంగవీటి రాధాకృష్ణగోత్రాలు జాబితాఇన్‌స్పెక్టర్ రిషిజాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంవిశ్వామిత్రుడువీరేంద్ర సెహ్వాగ్డి. కె. అరుణమహాసముద్రంఇంగువవై.యస్.రాజారెడ్డినామనక్షత్రము🡆 More