విజయ నరేష్: సినీ నటుడు, రాజకీయ నాయకుడు

విజయ నరేష్ లేదా నరేష్ తెలుగు సినీ నటుడు.

ఇతను నటి విజయ నిర్మల కుమారుడు. అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

విజయ నరేష్
విజయ నరేష్: నేపథ్యము, వ్యక్తిగత జీవితము, రాజకీయ జీవితము
నరేష్
జన్మ నామంనరేష్ కృష్ణమూర్తి
జననం (1960-01-20) 1960 జనవరి 20 (వయసు 64)
ప్రముఖ పాత్రలు నాలుగు స్తంభాలాట
శ్రీవారికి ప్రేమలేఖ
చిత్రం భళారే విచిత్రం

నేపథ్యము

బాలనటుడిగా 1972లో పండంటి కాపురం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. 1982లో ఇతని తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో ప్రేమ సంకెళ్ళు చిత్రంలో కథానాయకుడిగా నటించాడు, కానీ ఆ చిత్రం విజయవంతం కాలేదు. తర్వాతి కాలంలో అనేక హాస్య ప్రధాన చిత్రాలలో నటించి నటుడిగా మంచిపేరు తెచ్చుకున్నాడు. ఇతను కథానాయకిడిగా నటించిన చిత్రం జంబలకిడి పంబ తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన హాస్యచిత్రంగా నిలిచింది. కొద్దికాలంగా సహాయ పాత్రలను పోషిస్తున్నాడు. ప్రతినాయక పాత్రలను కూడా పోషించనున్నట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 2019 మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో అంతకు మునుపు అధ్యక్షుడైన శివాజీ రాజా మీద 69 ఓట్ల ఆధిక్యంతో గెలిచి అధ్యక్షుడయ్యాడు.

వ్యక్తిగత జీవితము

ఇతని వివాహము మూడుసార్లు జరిగింది. మొదటి సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించిన తర్వాత మనస్ఫర్ధల కారణంగా విడిపోయారు. తర్వాత రెండో పెళ్ళి చేసుకున్నాక అది కూడా విడాకులవరకు వచ్చింది. 50 ఏళ్ళ వయస్సులో ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకుడు అయిన రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను 2010 డిసెంబరు 3న హిందూపురంలో వివాహం చేసుకున్నాడు. ముగ్గురు కొడుకులు.

రాజకీయ జీవితము

1990వ దశకంలో రాజకీయ అనిశ్చితి వల్ల వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం పదమూడు రోజులో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సమయంలో వాజపేయి ప్రసంగానికి ఉత్తేజితుడై భారతీయ జనతా పార్టీలో చేరి కొంతకాలం చురుకైన పాత్ర పోషించాడు. యువ నాయకుడి నుంచి రాష్ట్ర జనరల్ సెక్రటరీ స్థాయికి ఎదిగాడు. 2009లో పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తరువాత బిజెపిని వదిలిపెట్టాడు.

నటించిన చిత్రాల పాక్షిక జాబితా

పురస్కారాలు

  1. నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ఎస్వీ రంగారావు పురస్కారం
  2. ఫిలిప్పీన్స్ రాజధాని మనిలాలో నరేష్ విజయకృష్ణ కి 'సర్' అనే బిరుదు తో పాటు గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేశారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ సంస్థ తో పాటు ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ విభాగాలు కలిసి నిర్వహించిన సమావేశాలలో నరేష్ ను మిలటరీ ఆర్ట్స్ గుడ్ విల్ అంబాసిడర్ గా, లెఫ్టినెంట్ కల్నల్ గా నియమించారు. ఈ విధమైన గౌరవం పొందిన తొలి నటుడు దేశంలో నరేష్.

మూలాలు

బయటి లంకెలు

Tags:

విజయ నరేష్ నేపథ్యమువిజయ నరేష్ వ్యక్తిగత జీవితమువిజయ నరేష్ రాజకీయ జీవితమువిజయ నరేష్ నటించిన చిత్రాల పాక్షిక జాబితావిజయ నరేష్ పురస్కారాలువిజయ నరేష్ మూలాలువిజయ నరేష్ బయటి లంకెలువిజయ నరేష్జంధ్యాలవిజయ నిర్మల

🔥 Trending searches on Wiki తెలుగు:

కర్ణుడుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిప్లీహముగజాలామేషరాశిభారత జాతీయగీతంకడప లోక్‌సభ నియోజకవర్గంమెదక్ లోక్‌సభ నియోజకవర్గంవేమనభారత జాతీయ కాంగ్రెస్నన్నయ్యఅమర్ సింగ్ చంకీలాఎయిడ్స్తెలంగాణ జనాభా గణాంకాలుమహావీర్ జయంతిభారత రాజ్యాంగ ఆధికరణలుమారేడుఅమెరికా సంయుక్త రాష్ట్రాలుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంశ్రీఆంజనేయంఇందిరా గాంధీపల్నాడు జిల్లాభూమన కరుణాకర్ రెడ్డిఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంవేంకటేశ్వరుడుగోత్రాలు జాబితాగూగుల్వసంత వెంకట కృష్ణ ప్రసాద్క్వినోవాసప్త చిరంజీవులుసలేశ్వరంఅర్జా జనార్ధనరావుతెలుగు వ్యాకరణంవిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితారెడ్డివర్షంసోనియా గాంధీకావ్యముస్వాతి నక్షత్రమునవలా సాహిత్యముభద్రాచలంఅయోధ్యపిఠాపురంభారత రాజ్యాంగ పీఠికచిరుధాన్యంభారత స్వాతంత్ర్యోద్యమంనానార్థాలుజానపద గీతాలుకృతి శెట్టితెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంప్రజా రాజ్యం పార్టీపక్షవాతంమరణానంతర కర్మలుగుంటకలగరలోక్‌సభరష్మి గౌతమ్చంద్రుడు జ్యోతిషంశాంతికుమారివిశాఖ నక్షత్రముడీహైడ్రేషన్ముదిరాజ్ (కులం)తెలంగాణ ఉద్యమంతెలంగాణా బీసీ కులాల జాబితాకేతిరెడ్డి పెద్దారెడ్డిరంగస్థలం (సినిమా)మర్రిభారతదేశంలో కోడి పందాలుతిరుమలరావణుడుతిక్కనబోయింగ్ 747అమ్మల గన్నయమ్మ (పద్యం)నందమూరి బాలకృష్ణఫేస్‌బుక్శాతవాహనులుజాతిరత్నాలు (2021 సినిమా)తెలుగులో అనువాద సాహిత్యం🡆 More