రెండవ ప్రపంచ యుద్ధం - ఐరోపాలో పూర్వరంగం

ఫ్రధాన వ్యాసం: రెండవ ప్రపంచ యుద్ధం

దస్త్రం:Hitlermusso2 edit.jpg
ముసోలినీ (ఎడమ), హిట్లర్

రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు దాదాపు ఎనభయ్యేళ్లుగా జెర్మనీ, ఫ్రాన్స్ ల మధ్య ఐరోపాలో తమ ప్రాబల్యం పెంచుకోవటానికి పోటీ పడుతూ ఉండేవి. ఈ మధ్య కాలంలో ఆ రెండు దేశాలు రెండుసార్లు యుద్ధానికి దిగాయి. మొదటిది 1870-71 మధ్య జరిగిన ఫ్రాన్స్-ప్రష్యా యుద్ధం, కాగా రెండవది 1914-18 మధ్య నాటి మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా జరిగింది.

1917నాటి రష్యన్ విప్లవం తరువాత ఐరోపా అంతటా కమ్యూనిస్టు ఉద్యమం విస్తరించటం మొదలు పెట్టింది. నెమ్మదిగా హంగరీ, బవేరియా వంటి దేశాలు కమ్యూనిస్టు పాలనలోకి జారుకున్నాయి. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఎదుర్కొనే నెపంతో ఐరోపాలోని కొన్ని దేశాల్లో జాత్యహంకార ధోరణులతో కూడిన రాజకీయ పక్షాలు పుట్టుకొచ్చాయి. 1922లో ఫాసిస్టు నియంత బెనిటో ముసోలినీ నాయకత్వంలోని జాత్యహంకార జాతీయ ఫాసిస్టు పార్టీ ఇటలీలో అధికారం చేజిక్కించుకుంది. ముసోలినీ స్ఫూర్తితో 1934లో జెర్మనీలో మరో జాత్యహంకార నాజీ పార్టీ నేత అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకొచ్చాడు. జెర్మనీలో అప్పట్లో నెలకొని ఉన్న ఆర్థిక మాంద్య పరిస్థితులు కూడా హిట్లర్ అధికార పీఠమలంకరించటానికి తోడ్పడ్డాయి. ఈ నియంతలిరువురూ తమ తమ దేశాల్లో విపరీతమైన సైనికీకరణ జరపడంద్వారా ఐరోపాలో ప్రమాదఘంటికలు మోగించారు. ఈ క్రమంలో, మొదటి ప్రపంచ యుద్ధానంతరం జెర్మనీ నిరాయుధీకరణనుద్దేశించి అమల్లోకి తెచ్చిన వెర్సైల్స్ ఒప్పందాన్ని హిట్లర్ ఉల్లంఘించాడు. కాగా, ముసోలినీ తొలుత ఆఫ్రికా దేశమయిన అబిసినియా, వెనువెంటనే తోటి ఐరోపా దేశమయిన అల్బేనియాలో కొంతభాగాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ నియంతలిరువురూ స్పెయిన్లో సోవియెట్ యూనియన్ మద్దతుతో కొనసాగుతున్న జాతీయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న జాత్యహంకార ఫాలాంగే పార్టీ నాయకుడు ఫ్రాన్సిస్కో ఫ్రాంకోకి అండదండలు అందించసాగారు.

1938 మార్చి నెలలో హిట్లర్ ఆస్ట్రియాను ఆక్రమించి జెర్మనీలో విలీనం చేసుకున్నాడు. ఐతే, నెవిల్ చాంబర్లేన్ నేతృత్వంలోని బ్రిటిష్ ప్రభుత్వం హిట్లర్ కన్నా జోసెఫ్ స్టాలిన్ పాలిత సోవియెట్ యూనియన్ నే ఐరోపాకు ఎక్కువ ప్రమాదకారకంగా భావించింది. సోవియెట్ల కమ్యూనిస్టు భావజాల విస్తరణ నిరోధించటానికి జెర్మనీని ప్రోత్సహించటమే సరైనదన్న అంచనాతో జెర్మనీతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీన్నే మ్యూనిక్ ఒప్పందం అంటారు. ఇందులో ఇంగ్లాండ్, జెర్మనీలతో పాటు ఫ్రాన్స్, ఇటలీ కూడా పాలుపంచుకున్నాయి. దీని ప్రకారం ఐరోపాలో జెర్మనీ, ఇటలీలు ఆక్రమించుకున్న భూభాగాలపై యధాతధ స్థితిని కొనసాగించవచ్చు కానీ ఇక ముందు ఆక్రమణలకు పాల్పడకూడదు. కానీ 1939 మార్చిలో ఇటలీ అల్బేనియానీ, జెర్మనీ చెకొస్లవేకియాలో మిగిలిన భాగాన్నీ ఆక్రమించటం ద్వారా మ్యూనిక్ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. దానితో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లు యుద్ధ సన్నాహకాలు మొదలు పెట్టాయి. ఆ దిశగా ఈ రెండు దేశాలూ అదే ఏడాది వేసవి కాలంలో పోలాండ్తో అవసరమైన పక్షంలో ఒకరికొకరు సైన్య సహాయం అందించుకోవాలనే అవగాహనకు వచ్చాయి.

మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జెర్మనీకి సముద్ర మార్గంద్వారా చమురు, నిత్యావసర వస్తువుల సరఫరా జరగకుండా ఇంగ్లాడ్ అడ్డుకుంది. ఆ యుద్ధంలో జెర్మనీ ఓటమికి అదీ ఒక కారణం. దాన్ని దృష్టిలో ఉంచుకుని 1939 ఆగస్టు నెలలో హిట్లర్ సోవియెట్ యూనియన్ తో ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీని ప్రకారం జెర్మనీకి అవసరమైన చమురు, నిత్యావసర వస్తువులను సోవియెట్లు సరఫరా చేస్తారు. ఇదే ఒప్పందంలో భాగంగా మధ్య ఐరోపాను జెర్మనీ, సోవియెట్ యూనియన్ లు ఉమ్మడిగా ఆక్రమించి పంచుకుంటాయి.

తరువాత: పాశ్చాత్య మిత్ర రాజ్యాలతో జెర్మనీ యుద్ధం

Tags:

రెండవ ప్రపంచ యుద్ధం

🔥 Trending searches on Wiki తెలుగు:

తీన్మార్ మల్లన్నవినుకొండకాలుష్యంభారత స్వాతంత్ర్యోద్యమంభారత రాజ్యాంగ సవరణల జాబితాద్వాదశ జ్యోతిర్లింగాలుసోరియాసిస్పురాణాలుపాండవులుకెఫిన్ఆంధ్రప్రదేశ్ మండలాలుచోళ సామ్రాజ్యంబోడె ప్రసాద్బర్రెలక్కనానార్థాలుఅక్కినేని నాగార్జునఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితావందేమాతరంశ్రీ కృష్ణుడుఅనపర్తి శాసనసభ నియోజకవర్గంఫిదామేషరాశిబ్రాహ్మణులురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ఎస్. ఎస్. రాజమౌళిచాట్‌జిపిటిత్రిష కృష్ణన్దాశరథి కృష్ణమాచార్యశ్రీశైల క్షేత్రంపౌరుష గ్రంథితెలంగాణపృథ్వీరాజ్ సుకుమారన్రామ్ చ​రణ్ తేజవిరాట్ కోహ్లిరతన్ టాటాయేసు శిష్యులువృషణంసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుఅంజలి (నటి)కల్పనా చావ్లారాధ (నటి)పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిభాగ్యరెడ్డివర్మజయలలిత (నటి)సంధ్యావందనంమీనరాశివ్యవసాయంకరక్కాయఅలెగ్జాండర్సర్దార్ వల్లభభాయి పటేల్రాజ్యసభఅంగన్వాడిPHవిటమిన్భారతదేశంలో మహిళలుఢిల్లీ మద్యం కుంభకోణందానం నాగేందర్భారత జాతీయగీతంజి.ఆర్. గోపినాథ్ఛందస్సుఈదుమూడిగౌడ2019 భారత సార్వత్రిక ఎన్నికలుగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంనవరత్నాలుఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంచిలకమర్తి లక్ష్మీనరసింహంగురువు (జ్యోతిషం)తిరుమలగేమ్ ఛేంజర్పుష్యమి నక్షత్రముభాషా భాగాలుహైన్రిక్ క్లాసెన్అనుష్క శెట్టికీర్తి సురేష్ప్రశ్న (జ్యోతిష శాస్త్రము)అష్టదిగ్గజములుదగ్గుబాటి పురంధేశ్వరిప్రకటన🡆 More