అల్బేనియా

అల్బేనియా (అధికార నామము రిపబ్లిక్ ఆఫ్ అల్బేనియా) ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశం.

అల్బేనియాకి ఆగ్నేయసరిహద్దున గ్రీస్, ఉత్తరాన మాంటెనెగ్రో, ఈశాన్యసరిహద్దున కొసావో, తూర్పున రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా ఉన్నాయి. సముద్రమార్గాన ఈ దేశం ఇటలీకి కేవలము 72 కిలోమీటర్ల దూరములో ఉంది.

Republika e Shqipërisë
రిపబ్లిక్ ఆఫ్ అల్బేనియా
Flag of అల్బేనియా అల్బేనియా యొక్క Coat of arms
నినాదం
Ti Shqipëri më jep nder, më jep emrin shqipëtar
(You Albania give me honor, you give me the name Albanian.)
జాతీయగీతం
Himni i Flamurit
("Anthem of the Flag")
అల్బేనియా యొక్క స్థానం
అల్బేనియా యొక్క స్థానం
Location of  అల్బేనియా  (orange)

on the European continent  (white)  —  [Legend]

రాజధాని
అతి పెద్ద నగరం
టిరానా
41°20′N 19°48′E / 41.333°N 19.800°E / 41.333; 19.800
అధికార భాషలు అల్బేనియన్1
ప్రజానామము Albanian
ప్రభుత్వం పార్లమెంటరీ రిపబ్లిక్
 -  President Bujar Nishani
 -  Prime Minister Edi Rama
Independence
 -  from the Ottoman Empire November 28, 1912 
 -  from Italy de facto October 1944 
 -  జలాలు (%) 4.7
జనాభా
 -  2024 అంచనా 3,600,523 [1] (130th)
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $19.944 billion (112th)
 -  తలసరి $6,298 (IMF) (100th)
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $10.768 billion 
 -  తలసరి $3,400 (IMF) 
జినీ? (2005) 26.7 (low
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.801 (high) (68th)
కరెన్సీ Lek (ALL)
కాలాంశం CET (UTC+1)
 -  వేసవి (DST) CEST (UTC+2)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .al
కాలింగ్ కోడ్ +355
1 Greek, Macedonian and other regional languages are government-recognized minority languages.

అల్బేనియా ఐక్య రాజ్య సమితి, ప్రపంచ వాణిజ్య సంస్థలలో సభ్యదేశంగా ఉంది. 2006 లో ఐరోపా సమాఖ్యలో చేరటానికి కూడా అల్బేనియాకు మార్గము సుగమం అయ్యింది.

అరుణవర్ణంలో ఉన్న అల్బేనియా జాతీయ పతాకం మధ్యలో నల్లరంగులో గండభేరుండ పక్షిని పోలిన రెండు తలల గ్రద్ద చిహ్నం ఉంటుంది.

భౌగోళికంగా దేశవైశాల్యం 28,748 చ.కిమీ (11,100 చదరపు మైళ్ళు). దేశం వైవిధ్యమైన వాతావరణ, భౌగోళిక, జలవనరులు, నైసర్గిక పరిస్థితులను ప్రదర్శిస్తుంది. ఇది అల్బేనియా ఆల్ప్సు లోని మంచుతో కప్పబడిన పర్వతాల నుండి కోరాబ్, స్కాండర్బెగు, పిండస్, సెరానియా పర్వతాల నుండి మధ్యధరా సముద్రం వెంట అల్బేనియా అడ్రియాటికు, అయోనియా సముద్రం వేడి-సూర్యరశ్మితో కూడిన తీరాల వరకు అద్భుతమైన వైవిధ్యాన్ని కలిగి ఉంది.

చారిత్రాత్మకంగా ఇల్లిరియన్లు, థ్రేసియన్లు, ప్రాచీన గ్రీకులు, రోమన్లు, బైజాంటైన్లు, వెనీషియన్లు, ఒట్టోమన్లు వంటి అనేక నాగరికతలు దేశంలో విలసిల్లాయి. అల్బేనియన్లు 12 వ శతాబ్దంలో స్వయంప్రతిపత్తి కలిగిన అర్బోరు ప్రిన్సిపాలిటీని స్థాపించారు. 13 వ - 14 వ శతాబ్దాల మధ్య కాలంలో అల్బేనియా రాజ్యం, అల్బేనియా ప్రిన్సిపాలిటీ ఏర్పడ్డాయి. 15 వ శతాబ్దంలో ఒట్టోమన్లు అల్బేనియాను జయించటానికి ముందు ఐరోపాలో ఒట్టోమన్ విస్తరణకు " గెర్జ్ కాస్ట్రియోటి స్కందర్బెగు " నేతృత్వంలో జరిగిన పోరాటాన్ని అల్బేనియన్లు ప్రతిఘటించినందుకు ఐరోపాలో అనేకులు అల్బేనియన్లను ప్రశంసించారు.

18 వ - 19 వ శతాబ్దాల మధ్య అల్బేనియన్లు ఆధ్యాత్మిక, మేధో బలాన్ని సేకరించారు. ఇది అల్బేనియా పునరుజ్జీవనానికి దారితీసింది. బాల్కను యుద్ధాలలో ఒట్టోమన్ల ఓటమి తరువాత, ఆధునిక అల్బేనియా 1912 లో స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది.

20 వ శతాబ్దంలో అల్బేనియా రాజ్యాన్ని ఇటలీ ఆక్రమించింది. ఇది నాజీ జర్మనీ రక్షణాతదేశంగా మారడానికి ముందు మహా అల్బేనియాను రూపొందించింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఎన్వర్ హోక్షా కమ్యూనిస్టు అల్బేనియాను ఏర్పాటు చేసి అల్బేనియన్లను అణచివేత కొనసాంగించి, దశాబ్దాల ఒంటరితనంలో మునిగిపోయేలా చేసాడు. 1991 నాటి విప్లవాలు అల్బేనియాలో కమ్యూనిజం పతనం చేసి ప్రస్తుత అల్బేనియా రిపబ్లిక్ స్థాపించి ముగింపుకు వచ్చాయి.

రాజకీయంగా దేశం ఒక పార్లమెంటరీ రాజ్యాంగ గణతంత్ర రాజ్యంగా ఉంది. ఎగువ-మధ్య ఆదాయదేశంగా అభివృద్ధి చెందుతున్న అల్బేనియాలో ఆర్థికరంగాన్ని సేవారగం ఆధిపత్యం చేస్తుండగా ద్వీతీయస్థానంలో తయారీ రంగం ఉంది. ఇది 1990 లో కమ్యూనిజం ముగిసిన తరువాత, కేంద్రీకృత ప్రణాళిక నుండి మార్కెట్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా పరివర్తన చేయబడింది. అల్బేనియా తన పౌరులకు సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, ఉచిత ప్రాథమిక - మాధ్యమిక విద్యను అందిస్తుంది.

దేశం ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్, యునెస్కో, నాటో, ప్రపంచ వాణిజ్యసంస్థ, సి.ఒ.ఇ, ఒ.ఎస్.సి.ఇ, ఒ.ఐ.సిలలో సభ్యదేశంగా ఉంది. ఇది ఐరోపా సమాఖ్య సభ్యత్వం కోసం అధికారిక అభ్యర్థించింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ది బ్లాక్ సీ ఎకనామిక్ కోఆపరేషన్, యూనియన్ ఫర్ ది మెడిటరేనియన్ సహా ఎనర్జీ కమ్యూనిటీ వ్యవస్థాపక సభ్యదేశాలలో ఇది ఒకటిగా ఉంది.

పేరువెనుక చరిత్ర

మధ్యయుగంలో దేశానికి అల్బేనియా అనే లాటిన్ పేరు నిర్ణయించబడింది. క్రీస్తుశకం 150 లో అలెగ్జాండ్రియాకు చెందిన భౌగోళిక శాస్త్రవేత్త రూపొందించిన భౌగోళిక వివరణా చిత్రం, ఖగోళ శాస్త్రవేత్త టోలెమి నమోదు చేసిన అల్బానీ ఇల్లిరియన్ తెగ నుండి ఈ పదం ఉద్భవించింది. ఇది డుర్రేసుకు ఈశాన్యంగా ఉన్న అల్బనోపోలిస్ నగరాన్ని చూపిస్తుంది. ఈ పదం అల్బనాన్ లేదా అర్బనాన్ అని పిలువబడే మధ్యయుగ స్థావరం పేరుకు ఇది కొనసాగింపును కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ అది ఈ ప్రాంతం అని కచ్చితంగా నిర్ధారించబడలేదు. 10 వ శతాబ్దంలో బైజాంటైన్ చరిత్రకారుడు తన ఆత్మకథలో మైఖేల్ అటాలియేట్స్ 1043 లో " అర్బనిటైను డ్యూక్ ఆఫ్ డైరాచియం " తరఫున అల్బనోయిని కాన్స్టాంటినోపులు మీద తిరుగుబాటులో పాల్గొన్నట్లు పేర్కొన్నాడు. మధ్య యుగాలలో అల్బేనియన్లు తమ దేశాన్ని అర్బెరి లేదా అర్బాని అని, తమను తాము అర్బరేషు (అర్బనేషా) అని పేర్కొన్నారు.

ప్రస్తుతం అల్బేనియన్లు తమ దేశాన్ని షికిపారి లేదా షికిపారియా అని పిలుస్తారు. షికిపారి, షికిప్తార్ అనే పదాలు 14 వ శతాబ్దం నుండి ధ్రువీకరించబడ్డాయి. కానీ 17 వ శతాబ్దం చివరిలో, 18 వ శతాబ్దం ప్రారంభంలో మాత్రమే షికిపారియా అనే జాతిపేరు, షికిపారే అనే జాతి ప్రజలను క్రమంగా అల్బేరియాభాష మాట్లాడేవారిలో అర్బెరియా, అర్బెరేషే ప్రజలు భర్తీ చేశారు. ఈ రెండు పదాలు "ల్యాండ్ ఆఫ్ ది ఈగల్స్", (డేగల భూమి) "చిల్డ్రన్ ఆఫ్ ది ఈగల్స్" (డేగల పిల్లలు)గా ప్రసిద్ధి చెందాయి.

చరిత్ర

చరిత్రపూర్వకాలం

అల్బేనియా 
The remains of Kamenica Tumulus in the county of Korçë.

అల్బేనియా భూభాగంలో మధ్య, ఎగువ పాలియోలిథిక్ కాలం నాటి నియాండర్తల్ ఉనికి మొట్టమొదటి ఆనవాళ్ళు ధ్రువీకరించబడ్డాయి. వీటిని జార్లో, టిరానా ప్రక్కనే ఉన్న డాజ్టు పర్వతం సమీపంలో కనుగొన్నారు. ఈ కాలానికి చెందిన పురావస్తు ప్రదేశాలలో కామెనికా తుములస్, కొనిస్పోల్ గుహల్, పెలుంబాస్ గుహలు ఉన్నాయి.

క్సెర్రె సమీపంలో ఒక గుహలో కనుగొనబడిన వస్తువులలో జంతువుల శిలాజాల ఎముకలతో పాటు చెకుముకి రాళ్ళు, జాస్పర్ వస్తువులు ఉన్నాయి. అయితే డాజ్ట్ పర్వతం సమీపంలో కనుగొన్న ఎరిగ్నేసియన్ సంస్కృతికి చెందిన ఎముక, రాతి ఉపకరణాలు ఉన్నాయి. మాంటెనెగ్రో, వాయవ్య గ్రీసులోని క్రెవెనా స్టిజెనా సమీపంలో లభించిన సమకాలీన వస్తువులతో కూడా ఇవి ముఖ్యమైన సారూప్యతలను ప్రదర్శిస్తాయి.

మధ్య, దక్షిణ అల్బేనియాలో తుములస్ ఖననాలకు సమీపంలో ఇనుము, కాంస్య యుగాలకు చెందిన బహుళ కళాఖండాలు కనుగొనబడ్డాయి. ఇవి నైరుతి మాసిడోనియా, లెఫ్కాడాలోని ప్రాంతాలతో అనుబంధాన్ని కలిగి ఉన్నాయి. ప్రోటో-గ్రీక్ భాష మాట్లాడే ఇండో-యూరోపియా ప్రజలు క్రీస్తుపూర్వం మూడవ సహస్రాబ్ది మధ్య నుండి ఈ ప్రాంతాలలో నివసించారని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. అందువలన ఈ చారిత్రక జనాభాలో కొంత భాగం క్రీ.పూ 1600 లో మైసెనేకు వెళ్లి మైసెనియా నాగరికతను స్థాపించారని భావిస్తున్నారు.

పూర్వీకత

అల్బేనియా 
Apollonia was an important Greek colony on the Illyrian coast along the Adriatic Sea and one of the western points of the Via Egnatia route, that connected Rome and Constantinople.

పురాతన కాలంలో అల్బేనియా భూభాగంలో ఇండో-యూరోపియా ప్రజలు, ప్రాచీన గ్రీకులు, థ్రేసియన్లు, విభిన్న ఇల్లిరియా తెగలకు చెందిన ప్రజలు నివసించేవారు. ఇల్లిరియా గిరిజనులకు సామూహిక నామకరణం ఏదీ ఉపయోగించారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. వారు ఒక సామూహిక నామం ఉపయోగించుకునే అవకాశం లేదని భావిస్తారు. ఇల్లిరియన్లు అనే సామూహిక నామం ఒక నిర్దిష్ట ఇల్లిరియా తెగకు వర్తింపజేసిన పేరుగా ఉంది. ఇది ప్రాచీన గ్రీకులతో సంబంధాలు పెట్టుకున్న మొట్టమొదటి సమూహం. దీని ఫలితంగా ఇల్లిరియన్లు అనే సామూహికనామం కలిగిన ప్రజలకు సమాన భాష, ఆచారాల కలిగిన ప్రజలందరికీ పార్స్ ప్రో టోటో అనే సామూహికనామం వర్తించబడుతుంది.

ఇల్లిరియా అని పిలువబడే భూభాగం మధ్యధరా సముద్రంలో అడ్రియాటిక్ సముద్రానికి తూర్పున దక్షిణాన వొజో ముఖద్వారం వరకు విస్తరించి ఉంది. క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దం మధ్యలో యూక్సిన్ సముద్రం ప్రాంతం అయిన పెరిప్లస్ ప్రాంతంలో వ్రాయబడిన పురాతన గ్రీకు గ్రంథంలో ఇల్లిరియా సమూహాల మొదటి సమాచారం పేర్కొనబడింది. పశ్చిమాన బ్రైజెస్ థ్రాసియన్ తెగకు చెందిన ప్రజలు నివసించేవారు. దక్షిణాన గ్రీకు తెగలకు చెందిన చావోనియన్లు నివసించారు. దీనికి ఫీనిస్ రాజధానిగా ఉంది. క్రీస్తుపూర్వం 7 వ శతాబ్దం నాటికి గ్రీకు నగర-రాజ్యాల తీరంలో అపోలోనియా, ఎపిడమ్నోస్, అమాంటియా వంటి కాలనీలు స్థాపించబడ్డాయి.

అల్బేనియాలో ఎక్కువ భాగాన్ని మాంటెనెగ్రోలో కేంద్రీకృతమై ఉన్న ఇల్లిరియా ఆర్డియాయి తెగ పాలించింది. రెండవ ప్లూరాటస్ కుమారుడు అగ్రోన్ ఆధ్వర్యంలో ఆర్డియాన్ రాజ్యం గొప్ప స్థాయికి చేరుకుంది. అగ్రన్ ఇతర పొరుగు తెగల మీద కూడా తన పాలనను విస్తరించాడు. క్రీస్తుపూర్వం 230 లో అగ్రోన్ మరణించిన తరువాత ఆయన భార్య ట్యూటాకు ఆర్డియా రాజ్యం వారసత్వంగా లభించింది. ట్యూటా దళాలు తమ కార్యకలాపాలను మరింత దక్షిణంలోని అయోనియా సముద్రం వరకు విస్తరించాయి. క్రీస్తుపూర్వం 229 లో రోం ఓడలను విస్తృతంగా దోచుకునేందుకు రోం రాజ్యం మీద యుద్ధం ప్రకటించింది. క్రీస్తుపూర్వం 227 లో ఇల్లిరియా ఓటమితో యుద్ధం ముగిసింది. క్రీస్తుపూర్వం 181 లో టీటా తరువాత జెంటియస్ పాలకుడుగా వచ్చాడు. క్రీస్తుపూర్వం 168 లో జెంటియస్ రోమన్లతో గొడవపడి, మూడవ ఇల్లిరియా యుద్ధాన్ని ప్రారంభించాడు. క్రీస్తుపూర్వం 167 నాటికి ఈ ప్రాంతాన్ని రోం స్వాధీనం చేసుకుంది. రోమన్లు ఈ ప్రాంతాన్ని మూడు పరిపాలనా విభాగాలుగా విభజించారు.

మద్య యుగాలు

అల్బేనియా 
The city of Krujë was the capital of the Principality of Arbanon.

బార్బోరియా దండయాత్రల బెదిరింపులతో ఒత్తిడి అధికరించిన కారణంగా 395 లో మొదటి థియోడోసియస్ మరణించిన తరువాత రోం సామ్రాజ్యం తూర్పు, పశ్చిమ రోం సామ్రాజ్యంగా విభజించబడింది. 6 వ శతాబ్దం నుండి 7 వ శతాబ్దం మద్యకాలంలో బానిసలు డానుబేను దాటి బాల్కన్లోని స్థానిక ప్రాచీన గ్రీకులు, ఇల్లిరియన్లు, థ్రాసియన్ల మీద ఆధిపత్యం సాధించారు. అందువలన చారిత్రక రికార్డులలో ఇల్లిరియన్లను చివరిసారిగా 7 వ శతాబ్దంలో ప్రస్తావించబడ్డారు.

11 వ శతాబ్దంలో గ్రేట్ స్కిజం తూర్పు ఆర్థోడాక్సు, వెస్ట్రన్ కాథలిక్ చర్చిల మధ్య విచ్ఛిన్నతను అధికారబద్ధం చేసింది. ఇది అల్బేనియాలో ఉత్తర కాథలిక్, దక్షిణ ఆర్థడాక్స్ ఆవిర్భావించడానికి దారితీసింది. అల్బేనియా ప్రజలు ష్కుంబిన్ నది ఎగువ లోయలో ఉన్న ఓక్రిడా సరస్సు పశ్చిమప్రాంతంలో నివసించారు. తరువాత వారు క్రుజా ప్రోగాన్ నాయకత్వంలో 1190 లో అర్బనాన్ రాజ్యాన్ని స్థాపించారు. ఆయన తరువాత కుమారులు జిజిన్, ధిమిత్రి పాలనాబాధ్యతలు స్వీకరించారు.

ధిమిటర్ మరణం తరువాత ఈ భూభాగం అల్బేనియన్-గ్రీకు గ్రెగొరీ కమోనాస్ పాలనలో వచ్చింది. తరువాత క్రుజా గోలెం పాలనాధికారం స్వీకరించాడు. 13 వ శతాబ్దంలో రాజ్యం రద్దు చేయబడింది. అర్బనాన్ ఒక అల్బేనియన్ రాజ్యం మొదటి రూపంగా పరిగణించబడుతుంది. ఇది బైజాంటైన్ సామ్రాజ్యం పశ్చిమాంత భాగంగా ఎపిరస్ బైజాంటైన్ డౌకాయ్, నైసియా లాస్కారిడ్ల పాక్షిక స్వయంప్రతిపత్తి హోదాను కలిగి ఉంది.

అల్బేనియా 
ష్కోడ్రా ముట్టడిని స్మరించుకుంటూ స్కూలా డెగ్లీ అల్బనేసి రిలీఫ్. ఇది వెనీషియన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న అల్బేనియా పట్టణం ష్కోడ్రా ముట్టడి వేయడాన్ని వివరిస్తుంది

12 వ శతాబ్దం చివర, 13 వ శతాబ్దం ఈ భూభాగాన్ని ప్రారంభంలో, సెర్బులు, వెనీషియన్లు స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. అల్బేనియన్ల సంప్రదాయ మూలం అనిశ్చితం; అయినప్పటికీ అల్బేనియన్ల గురించి మొట్టమొదటి వివాదాస్పద ప్రస్తావన 1079 లేదా 1080 నుండి చారిత్రక రికార్డులలో నమోదైంది. మైఖేల్ అటాలియేట్స్ రచనలో అల్బనోయిని కాన్స్టాంటినోపులు మీద తిరుగుబాటులో పాల్గొన్నట్లు పేర్కొన్నాడు. ఈ సమయంలో అల్బేనియన్లు పూర్తిగా క్రైస్తవ మతం స్వీకరించారు.

అర్బనాన్ రద్దు చేసిన కొద్ది సంవత్సరాల తరువాత అల్బేనియన్లను, వారి ప్రాచీన స్వేచ్ఛను రక్షించుకుంటానని వాగ్దానం చేస్తూ అంజౌ చార్లెస్ అల్బేనియన్ పాలకులతో ఒక ఒప్పందాన్ని ముగించాడు. 1272 లో ఆయన అల్బేనియా రాజ్యాన్ని స్థాపించాడు. ఎపిరస్ డెస్పోటేట్ భూభాగాలను తిరిగి జయించాడు. ఈ రాజ్యం సెంట్రల్ అల్బేనియా భూభాగాన్ని డైర్హాచియం నుండి అడ్రియాటిక్ సముద్ర తీరం వెంబడి బుట్రింట్ వరకు తమ సార్వభౌమాధికారాన్ని ప్రకటించింది. కాథలిక్ రాజకీయ నిర్మాణం ఆధారంగా బాల్కన్ ద్వీపకల్పంలో కాథలిక్కులను వ్యాప్తి చేయాలని పాపల్ ప్రణాళిక వేసాడు. ఈ ప్రణాళికకు చార్లెస్ బంధువు (అంజౌ), హెలెన్ (అంజౌ) మద్దతు కూడా లభించింది. ప్రధానంగా ఉత్తర అల్బేనియాలో ఆమె పాలనలో సుమారు 30 కాథలిక్ చర్చిలు, మఠాలు నిర్మించబడ్డాయి. 14 వ శతాబ్దంలో బైజాంటైన్ సామ్రాజ్యంలో అంతర్గత పోరాటాలు ప్రారంభం అయ్యాయి. సెర్బులలోని అత్యంత శక్తివంతమైన పాలకుడు స్టీఫన్ దుసాన్ (మధ్యయుగం) దోరెస్ మినహా అల్బేనియా మొత్తం ప్రాంతాన్ని కలుపుకుంటూ స్వల్పకాలిక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 1367 లో వివిధ అల్బేనియా పాలకులు కలిసి సంఘటితంగా డెస్పోటేట్ ఆఫ్ ఆర్టాను స్థాపించారు. ఆ సమయంలో బాల్షా, థోపియా, కస్ట్రియోటి, ముజాకా, అరియానిటీ వంటి అనేక అల్బేనియన్ సంస్థానాలు సృష్టించబడ్డాయి. 14 వ శతాబ్దం మొదటి భాగంలో ఒట్టోమన్ సామ్రాజ్యం అల్బేనియాలోని అత్యధిక భాగం ఆక్రమించి లీగ్ ఆఫ్ లెజో స్కాండర్బెగ్ ఆధ్వర్యంలో ఒక పాలకుడిని నియమించింది. ఆయన అల్బేనియా మధ్యయుగ చరిత్రలో జాతీయ నాయకుడు అయ్యాడు.

ఓట్టమన్ సామ్రాజ్యం

అల్బేనియా 
After serving the Ottoman Empire for nearly 20 years, Gjergj Kastrioti Skanderbeg deserted and began a rebellion against the empire that halted Ottoman advance into Europe for 25 years.

కాన్స్టాంటినోపుల్ పతనంతో ఒట్టోమన్ సామ్రాజ్యం ఆగ్నేయ ఐరోపాలోకి లోతుగా పాతుకుంటూ ఆక్రమణ, విస్తర కొనసాగింది. వారు 1385 లో అల్బేనియాలోని అయోనియా సముద్ర తీరానికి చేరుకున్నారు. 1415 లో దక్షిణ అల్బేనియా అంతటా వారి దండులను నియమించారు. తరువాత 1431 నాటికి అల్బేనియాలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించారు. ఆక్రమణ ఫలితంగా వేలాది మంది అల్బేనియన్లు పశ్చిమ ఐరోపాకు (ముఖ్యంగా కాలాబ్రియా, నేపుల్స్, రగుసా, సిసిలీ)కి పారిపోయారు. ఇతరులు తరచుగా ప్రవేశించశక్యం కాని అల్బేనియా పర్వతాల వద్ద రక్షణ పొందారు.

అల్బేనియన్లు, క్రైస్తవులుగా, ప్రజలు ద్వితీయవర్గం ప్రజలుగా పరిగణించబడ్డారు. అందువలన వారి మీద దేవ్షీర్ము వ్యవస్థ ఆధారంగా భారీ పన్నులు విధించబడ్డాయి. ఒట్టోమన్ల ఆక్రమణ క్రమంగా ఇస్లామీకరణ ప్రక్రియ, మసీదుల వేగవంతమైన నిర్మాణంతో పాటు అల్బేనియా, మతపరమైన చిత్రం సవరించబడింది.

లెజో అసెంబ్లీ ఏర్పడిన తరువాత జెర్జ్ కాస్ట్రియోటి స్కందర్బెగ్ నాయకత్వంలో (ష్కోడార్ ముట్టడి వరకు) శక్తివంతమైన దీర్ఘకాలిక విప్లవం చెలరేగింది. సుల్తానులు రెండవ మురాదు, రెండవ మెహ్మెదు నేతృత్వంలోని ప్రధాన ఒట్టోమన్ సైన్యాలు పలుసార్లు ఓడించబడ్డాయి. స్కాండర్బెగు అరియానిటిస్, డుకాగ్జినిస్, జహారియాస్, థోపియాస్‌లను వంటి అనేక మంది అల్బేనియా మేధోవర్గాన్ని సమీకరించి అప్పటి వరకు జయించబడని భూభాగాల మీద కేంద్రీకృత అధికారాన్ని స్థాపించి, అల్బేనియా ప్రభువుగా అవతరించాడు.

స్కాండర్బెగు ఒట్టోమన్లకు వ్యతిరేకంగా ఐరోపా సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడం లక్షంగా నిర్విరామంగా చేసిన కృషి సఫలం కాలేదు. అయినప్పటికీ అల్బేనియాను తిరిగి పొందటానికి ఒట్టోమన్లు చేసిన ప్రయత్నాలన్నింటినీ ఆయన అడ్డుకున్నాడు. ఇటలీ, పశ్చిమ ఐరోపా మీద దండయాత్రకు ఇది ఒక ఆధారంగా వారు ఊహించారు. ఓట్టమన్లకు వ్యతిరేకంగా ఆయన చేసిన అసమాన పోరాటం ఐరోపా గౌరవాన్ని గెలుచుకుంది. ఇతరులలో పాపసీ, నేపుల్స్, వెనిస్, రగుసా వంటి ఇతర తెగల నుండి ఆయనకు ఆర్థిక, సైనిక సహాయం లభించింది.

అల్బేనియా 
అలీ పాషా టెపెలెనా ఒక శక్తివంతమైన స్వయంప్రతిపత్త ఒట్టోమన్ అల్బేనియన్ పాలకుడుగా యానినా పశాలిక్‌లను పరిపాలించాడు

ఒట్టోమన్లు ఈ ప్రాంతం మీద గట్టి పట్టు సాధించిన కాలంలో నాలుగు అల్బేనియా పట్టణాలు నాలుగు ప్రధాన సంజాకులుగా నిర్వహించింది. స్పెయిన్లో హింస నుండి పారిపోతున్న శరణార్థులతో యూదు స్థావరానికి మద్ధతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం సూంపన్నమైన వాణిజ్యాన్ని ప్రోత్సహించింది. ఐరోపా నుండి వెల్వెటు, పత్తి వస్తువులు, మొహైర్లు, తివాచీలు, సుగంధ ద్రవ్యాలు, తోలు వంటి వస్తువులను బుర్సా, కాన్స్టాంటినోపుల్ నుండి దిగుమతి చేసుకుని వ్లోరే నగరం నుండి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయబడ్డాయి. కొంతమంది వొర్లే పౌరులు ఐరోపా అంతటా వ్యాపార సహచరులను కలిగి ఉన్నారు.

17 వ శతాబ్దం నుండి అల్బేనియన్లలో ఇస్లామీకరణ విస్తృతంగా మారి ఇది 18 వ శతాబ్దం వరకు కొనసాగింది. ఇస్లాం ఒట్టోమన్ సామ్రాజ్యంలో వారికి ముస్లిములతో సమానంగా అభివృద్ధి అవకాశాలు ఇచ్చింది. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వనరుల కొరత కారణంగా మార్పిడి ఉద్దేశాలు సందర్భాన్ని బట్టి వైవిధ్యమైనవిగా ఉన్నాయి. కాథలిక్కుల అణచివేత పెరుగుతున్నందున, ఎక్కువగా కాథలిక్ అల్బేనియన్లు 17 వ శతాబ్దంలో మతమార్పిడి చేసినప్పటికీ సనాతన అల్బేనియన్లు తరువాతి శతాబ్దంలో అనుసరించారు.

అల్బేనియన్లు ఒట్టోమన్ సైనిక, రాజ్యాంగ వృత్తులలో గణనీయమైన నిష్పత్తిని కలిగి ఉండడం వ్యూహాత్మకంగా ఉత్తమం అని భావించారు. ముస్లిం అల్బేనియన్లు ప్రాధాన్యత కలిగిన రాజకీయ, సైనిక స్థానాలను విస్తృత ముస్లిం ప్రపంచంలో సాంస్కృతికంగా భాగస్వామ్యం వహించారు. ఈ విశేష పదవిని అనుభవిస్తూ, వారు రెండు డజనలకంటే అధికమైన అల్బేనియన్ గ్రాండ్ వైజియర్లుగా వివిధ ఉన్నత పదవులను నిర్వహించారు. ఇతరులలో ప్రముఖ కోప్రెలీ కుటుంబ సభ్యులు, జగన్ పాషా, ఈజిప్టుకు చెందిన ముహమ్మదు అలీ, టెపెలెనాకు చెందిన అలీ పాషా, ఇద్దరు సుల్తాన్ల (రెండవ బేజిదు, మూడవ మెహమెదు)కు అల్బేనియా మూలానికి చెందిన ఇద్దరు తల్లులు ఉన్నారు.

రిలింద్జ

అల్బేనియా 
Naum Veqilharxhi was among the most important figures of the early National Renaissance.

18 వ శతాబ్దం చివరలో, 19 వ శతాబ్దం వరకు అల్బేనియా పునరుజ్జీవనం కొనసాగింది. స్వతంత్ర అల్బేనియా దేశంలో అల్బేనియా ప్రజలు స్వతంత్ర సాంస్కృతిక, రాజకీయ జీవితం సాగించడానికి తగినంత ఆధ్యాత్మిక, మేధో బలాన్ని సేకరించారు. ఆధునిక అల్బేనియా సంస్కృతిలో సాహిత్యం, కళలు కూడా అభివృద్ధి చెందాయి. ఇవి ప్రధానంగా రొమనిజం, జ్ఞానోదయ సూత్రాల ప్రభావాలతో తరచుగా ముడిపడి ఉన్నాయి.

జాతీయవాదం అధికరించడానికి ముందు అల్బేనియా దాదాపు ఐదు శతాబ్దాలుగా ఒట్టోమన్ సామ్రాజ్యం పాలనలో ఉంది. ఒట్టోమన్ అధికారులు అల్బేనియన్ ప్రజల జాతీయ ఐక్యత, చైతన్యాల వ్యక్తీకరణను అణచివేశారు. సాహిత్యం ద్వారా అల్బేనియన్లు తమ ప్రజలలో జాతీయభావాలు, ఐక్యతా భావాలను మేల్కొల్పడానికి ఒక చైతన్యవంతమైన ప్రయత్నం చేయడం ప్రారంభించారు. ఇది గొప్ప చరిత్రను గుర్తుచేస్తూ మరింత మంచి భవిష్యత్తు కోసం ఆశలు పెట్టుకుంటుంది.

రష్యన్-ఒట్టోమన్ యుద్ధాల తరువాత ఒట్టోమన్ సామ్రాజ్యం మీద రష్యా సాధించిన విజయం ఫలితంగా శాన్ స్టెఫానో ఒప్పందం అమలు చేయబడింది. ఇది అల్బేనియా ప్రజల నివాసితప్రాంతాన్ని స్లావిక్, గ్రీకు పొరుగువారికి అప్పగించడాన్ని పట్టించుకోలేదు. అయినప్పటికీ యునైటెడ్ కింగ్‌డం, ఆస్ట్రో-హంగేరియా సామ్రాజ్యం ఈ ఏర్పాటును నిరోధించాయి. ఇది బెర్లిన్ ఒప్పందానికి కారణమైంది. ఈ దశ నుండి అల్బేనియా జనాభా కలిగిన ప్రాంతాలను ఏకీకృత దేశంగా రక్షించి ఏకం చేయాలనే లక్ష్యంతో అల్బేనియన్లు తమను తాము వ్యవస్థీకరించడం ప్రారంభించారు. ఇది లీగ్ ఆఫ్ ప్రిజ్రెన్ ఏర్పడటానికి దారితీసింది.

అల్బేనియా 
Dora d'Istria was among the main advocates in Europe for the Albanian cause.

ప్రారంభంలో లీగుకు ఒట్టోమన్ అధికారుల సహాయం అందించారు. ముస్లిం ప్రజలు, ఒట్టోమన్ పరిపాలనతో అనుసంధానించబడిన భూస్వాముల మత సంఘీభావం ఆధారంగా లీగు పనిచేసింది. వారు ముస్లిం సంఘీభావానికి మొగ్గు చూపారు. ముస్లిం భూములను రక్షించాలని పిలుపునిచ్చారు. రియల్ ముస్లింల లీగ్ కమిటీ పేరు పెట్టడానికి ఇది కారణం అయింది.

బోస్నియా ప్రతినిధులు, కేంద్ర అధికార ప్రతినిధి ప్రిజ్రెన్ సంజాకు నిర్వాహకుడు, విలేయెట్ ఆఫ్ స్కుటారి ప్రతినిధులు పాల్గొన్న అసెంబ్లీలో సుమారు 300 మంది ముస్లింలు పాల్గొన్నారు.మూస:Check quotation 47 మంది ముస్లిం బల్గేరియా, సెర్బియా, మాంటెనెగ్రో దళాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలను రక్షించడానికి ఉత్తర అల్బేనియా, ఎపిరస్, బోస్నియా & హెర్జెగోవినా ప్రజల ప్రతినిధులు 47 మంది లీగు విడుదల చేసిన కరార్నామె మీద సంతకం చేసారు.

అల్బేనియన్ విలేయెటులో కొసావో, ష్కోడార్, మొనాస్టిర్, ఐయోనినాతో సహా నాలుగు విలేట్లను విలీనం చేయాలని కోరుతూ అబ్డిల్ ఫ్రాషరీ ఆధ్వర్యంలో లీగ్, అల్బేనియన్ స్వయంప్రతిపత్తి వైపు పనిచేయడం మీద దృష్టి సారించినందుకు ఒట్టోమన్ అధికారులు వారి సహాయాన్ని రద్దు చేశారు. మాంటెనెగ్రోకు కేటాయించిన ప్లావ్, గుసిన్జే ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడాన్ని నిరోధించడానికి లీగ్ సైనిక శక్తిని ఉపయోగించింది. నోవిసీ యుద్ధం వంటి మాంటెనెగ్రో దళాలతో అనేక విజయవంతమైన యుద్ధాల తరువాత, లీగ్ వారి పోటీ ప్రాంతాల నుండి వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. తరువాత సుల్తాన్ పంపిన ఒట్టోమన్ సైన్యం లీగును ఓడించింది.

స్వతంత్రం

అల్బేనియా 
The original act of the Albanian declaration of Independence.

1912 నవంబరు 28 న అల్బేనియా ఒట్టోమన్ సామ్రాజ్యం నుండి స్వాతంత్ర్యం ప్రకటించింది. 1912 డిసెంబరు 4 న వ్లోరే అసెంబ్లీ, సెనేట్, ప్రభుత్వాన్ని స్థాపించింది. అల్బేనియా సార్వభౌమత్వాన్ని లండన్ సమావేశం గుర్తించింది. 1913 జూలై 29 న లండన్ ఒప్పందంలో దేశం దాని పొరుగు దేశాల సరిహద్దులను వివరించింది. చాలా మంది అల్బేనియన్లు అల్బేనియా వెలుపల వదిలివేయబడ్డారు. ప్రధానంగా వారు మోంటెనెగ్రో, సెర్బియా, గ్రీస్ మధ్య విభజించబడ్డారు.

అల్బేనియా 
ఇస్మాయిల్ ఖేమాలిని ఆధునిక అల్బేనియన్ దేశానికి వ్యవస్థాపక పితామహుడిగా భావిస్తారు

1913 అక్టోబరు 15 న కొత్తగా స్థాపించబడిన అల్బేనియా దాని స్వంత రాజకీయ సంస్థలు క్రమంగా ఉండే వరకు పరిపాలనను నిర్వహించడానికి వ్లోరేలో ప్రధాన కార్యాలయం, ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ కంట్రోల్ స్థాపించబడ్డాయి. అల్బేనియా రాజ్యం మొదటి చట్ట అమలు సంస్థగా అంతర్జాతీయ జెండర్మెరీ స్థాపించబడింది. నవంబరులో మొదటి జెండర్మెరీ సభ్యులు దేశానికి వచ్చారు. అల్బేనియా యువరాజు విల్హెల్మ్ వైడ్ (ప్రిన్క్ విల్హెల్మ్ విడి) రాజ్యానికి మొదటి యువరాజుగా ఎంపికయ్యాడు. మార్చి 7 న ఆయన తాత్కాలిక రాజధాని డుర్రేస్‌కు చేరుకుని తన ప్రభుత్వాన్ని నిర్వహించడం ప్రారంభించాడు. మొదటి అల్బేనియా మంత్రిమండలిని ఏర్పాటు చేయడానికి తుర్హాన్ పాషా పర్మేటిని నియమించాడు.

1913 నవంబరులో అల్బేనియా అనుకూల దళాలు అల్బేనియా సింహాసనాన్ని అల్బేనియా మూలం కలిగిన ఒట్టోమన్ రక్షణమంత్రి అహ్మద్ ఇజ్జెట్ పాషాకు ఇచ్చాయి. ఒట్టోమన్ అనుకూల రైతులు కొత్త పాలనను ఆరు క్రైస్తవ గొప్ప శక్తులు, వ్యవసాయయోగ్యమైన భూభాగంలో సగం మీద యాజమాన్యం కలిగిన స్థానిక భూస్వాముల సాధనం అని విశ్వసించారు.

1914 ఫిబ్రవరిలో " అటానిమస్ రిపబ్లిక్ ఆఫ్ నార్తర్న్ ఎపిరస్ " అల్బేనియాతో కలిసిపోవడానికి స్థానిక గ్రీకు జనాభా జిజిరోకాస్టారులో వ్యతిరేకిస్తూ ప్రకటించింది. ఈ చొరవ స్వల్పకాలికం కొనసాగినప్పటికీ 1921 లో దక్షిణ ప్రావిన్సులు అల్బేనియా రాజ్యంలో చేర్చబడ్డాయి. ఇంతలో కొత్త అల్బేనియా పాలనకు వ్యతిరేకంగా అల్బేనియా రైతుల తిరుగుబాటు ముస్లిం మతాధికారుల బృందం నాయకత్వంలో విస్ఫోటనం చెందింది. విప్లవం ఎస్సాద్ పాషా తోప్టాని చుట్టూ కేంద్రీకరించబడింది. ఆయన తనకుతానుగా అల్బేనియా ఇస్లాం రక్షకుడని ప్రకటించాడు. ప్రిన్స్ వైడ్ అల్బేనియా ఉత్తర భాగం నుండి మిర్డిటా కాథలిక్ వాలంటీర్ల మద్దతు పొందడానికి వారి నాయకుడు ప్రింక్ బీబే దోడాను అల్బేనియా రాజ్యానికి విదేశాంగ మంత్రిగా నియమించారు. 1914 మే, జూన్ మాసాలలో అంతర్జాతీయ జెండర్మెరీలో ఇసా బోలెటినీ, ఆయన మనుషులు (అధికంగా కొసావో) చేరారు. 1914 ఆగస్టు చివరి నాటికి ఉత్తర మిర్డిటా కాథలిక్కులను సెంట్రల్ అల్బేనియాలో ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసుకున్న తిరుగుబాటుదారులు ఓడించారు. ప్రిన్స్ వైడ్ పాలన కూలిపోయింది. ఆయన 1914 సెప్టెంబరు 3 న దేశం విడిచి వెళ్ళాడు.

మొదటి రిపబ్లిక్కు

అల్బేనియా 
Zog I was the first and only king of Albania whose reign lasted 11 years (1928–1939).

ఫ్యాన్ నోలి ప్రభుత్వం ముగిసిన తరువాత పార్లమెంటు కొత్త రాజ్యాంగాన్ని స్వీకరించి దేశాన్ని పార్లమెంటరీ రిపబ్లిక్గా ప్రకటించింది. దీనికి అల్బేనియా రాజు మొదటి జోగ్ (అహ్మత్ ముహ్తార్ జోగు) ఏడు సంవత్సరాల కాలం దేశాధినేతగా పనిచేశారు. టిరానాను అధికారికంగా దేశం శాశ్వత రాజధానిగా ఆమోదించారు.

జోగు సాంప్రదాయికమైనవి, స్థిరత్వం, క్రమబద్ధమైన ప్రాథమిక లక్ష్యంతో రాజకీయాధికారాన్ని ఉపయోగించుకున్నాడు. ఆయన ఇటలీతో సహకార విధానాన్ని అవలంబించవలసిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అక్కడ రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. తద్వారా దేశానికి ఇటలీ షిప్పింగు, వాణిజ్య రాయితీల మీద గుత్తాధిపత్యం లభించింది. 1928 లో ఇటలీ నియంతృత్వ పాలన బలమైన మద్దతుతో దేశం చివరికి మరొక రాచరికం రాజ్యం భర్తీ చేయబడినప్పటికీ ఇటాలీ దేశం మీద దాడి చేసే వరకు ఇద్దరూ సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. జోగు సంప్రదాయవాదిగా ఉండి సంస్కరణలను ప్రారంభించి మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు.

సాంఘిక ఆధునీకరణ ప్రయత్నంలో ఒకరి పేరుమీద ఉన్న ప్రాంతాన్ని మరొకరి పేరుకు మార్చే ఆచారం తొలగించబడింది. పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణానికి అంతర్జాతీయ సంస్థలకు భూమిని విరాళంగా ఇచ్చారు. సాయుధ దళాలకు ఇటలీకి చెందిన బోధకులు శిక్షణ ఇచ్చి, పర్యవేక్షించారు. బ్రిటిషు వారిని తొలగించాలని ఇటాలీ నుండి బలమైన ఒత్తిడి ఉన్నప్పటికీ బ్రిటిషు వారిని జండర్మేరీ నిలిపాడు.

1939 నుండి 1943 వరకు ఇటలీ సైనికపరంగా ఆక్రమించింది. తరువాత అల్బేనియా రాజ్యం మూడవ విక్టర్ ఇమ్మాన్యుయేల్ పాలనలో ఉన్న ఇటలీ రాజ్యం రక్షితప్రాంతంగా, ఆధారిత దేశంగా ఉంది. 1940 అక్టోబరులో ఇటలీ గ్రీసు మీద చేసిన విజయవంతం కాని దాడికి అల్బేనియా వేదికగా పనిచేసింది. తరువాత జరిగిన ఎదురుదాడి ఫలితంగా దక్షిణ అల్బేనియాలో కొంత భాగం గ్రీకు సైనిక నియంత్రణలోకి వచ్చింది. 1941 ఏప్రెలు వరకు జర్మనీ దండయాత్ర సమయంలో గ్రీసు లొంగిపోయింది. 1941 ఏప్రెలు నాటికి అల్బేనియాతో కలిపి యుగోస్లేవియా భూభాగాలు, పశ్చిమ మాసిడోనియా, తూర్పు మాంటెనెగ్రో భూచీలిక, మద్య సెర్బియాలోని టుటిన్ పట్టణం, కొసావోలో చాలా భాగంలో గణనీయమైన అల్బేనియా జనాభా ఉంది..

1943 సెప్టెంబరులో జర్మన్లు దేశాన్ని ఆక్రమించటం ప్రారంభించి తటస్థ అల్బేనియా స్వాతంత్ర్యాన్ని తాము గుర్తిస్తామని ప్రకటించారు. కొత్త ప్రభుత్వం, సైనిక, చట్ట అమలును ఏర్పాటు చేసారు. ఇటలీకి వ్యతిరేకంగా పోరాడిన బల్లీ కొంబాటర్ తటస్థ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, జర్మనీలతో కలిసి కమ్యూనిస్టు నేతృత్వంలోని అల్బేనియా జాతీయ విముక్తి ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడారు.

యుద్ధం చివరి సంవత్సరాలలో దేశంలో కమ్యూనిస్టులు, జాతీయవాదుల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. 1944 లో కమ్యూనిస్టులు దక్షిణాదిలోని చివరి కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులను ఓడించారు. నవంబరు చివరినాటికి ప్రధాన జర్మనీ దళాలు టిరానా నుండి వైదొలిగాయి. కమ్యూనిస్టులు దాని మీద దాడి చేసి తమ నియంత్రణలోకి తీసుకున్నారు. 1944 నవంబరు 29 నాటికి కమ్యూనిస్టులు జర్మనీ ఆక్రమణ నుండి దేశాన్ని పూర్తిగా విడిపించారు. అక్టోబరులో బెరాట్ వద్ద కమ్యూనిస్టులు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసారు. కమ్యూనిస్టు అల్బేనియా ప్రభుత్వానికి ఎన్వర్ హోక్షా అధ్యక్షుడుగా పనిచేసాడు.

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి దేశం ప్రధాన సైనిక, రాజకీయ శక్తి, కమ్యూనిస్టు పార్టీ కలిసి జాతీయవాదులకు వ్యతిరేకంగా ఉత్తర అల్బేనియాకు బలగాలను పంపింది. వారు నికాజ్-మార్తూర్, డుకాగ్జిన్, కెల్మెండ్లలో ప్రీక్ కాలి నేతృత్వంలోని దళాలు కమ్యూనిస్టు ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. 1945 జనవరి 15 న తమరా వంతెన వద్ద మొదటి బ్రిగేడు నియంతృత్వ దళాలు, జాతీయవాద దళాల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో జాతీయవాద శక్తులు ఓటమిపాలయ్యాయి. ఘర్షణలో [page needed] 150 మంది ప్రజలు చంపబడడం లేదా హింసించబడడం సంభవించింది. ఈ సంఘటన ఎన్వర్ హోక్ష నియంతృత్వ కాలంలో జరిగిన అనేక ఇతర సమస్యలకు ప్రారంభ కేంద్రం అయింది. వర్గ పోరాటం తలెత్తింది, మానవ స్వేచ్ఛ, మానవ హక్కులు తిరస్కరించబడ్డాయి. కెల్మెండు ప్రాంతం సరిహద్దు రెండుగా వేరుచేయబడింది. తరువాత 20 సంవత్సరాలు రహదారుల కొరత సహకార వ్యవసాయ సంస్థ ఆర్థిక క్షీణతకు కారణమై చాలా మంది కెల్మెండి ప్రజలు పారిపోయారు, మరికొందరు సరిహద్దును దాటటానికి ప్రయత్నిస్తున్నారు.

కమ్యూనిజం

అల్బేనియా 
Enver Hoxha served as Prime Minister and First Secretary of the Party of Labour of Albania.

రెండవ ప్రపంచ యుద్ధం, నాజీ జర్మనీ ఓటమి తరువాత, దేశం మొదట్లో సోవియట్ యూనియన్ సామంత రాజ్యంగా మారింది. కొత్తగా స్థాపించబడిన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ అల్బేనియాకు ఎన్వర్ హోక్ష నాయకుడిగా ఎదిగాడు. 1953 లో స్టాలిన్ మరణించిన తరువాత సోవియట్-అల్బేనియన్ సంబంధాలు క్షీణించడం ప్రారంభించాయి. ఈ సమయంలో దేశం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వంటి ఇతర కమ్యూనిస్టు దేశాలతో విదేశీ సంబంధాలను అభివృద్ధి చేయడం ప్రారంభించింది.

ఈ కాలంలో దేశం పారిశ్రామికీకరణ, పట్టణీకరణ అభివృద్ధిని అనుభవించింది. వేగవంతమైన సమిష్టీకరణ, ఆర్థిక వృద్ధి అధిక జీవన ప్రమాణాలకు దారితీసింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కొరకు రవాణాను పునరుద్ధరించడానికి రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

కొత్త భూ సంస్కరణ చట్టాలు భూమిని పండించిన కార్మికులకు, రైతులకు యాజమాన్యాన్ని మంజూరు చేసాయి. వ్యవసాయం సహకారంగా మారి ఉత్పత్తి గణనీయంగా అధికరించింది. దేశం వ్యవసాయంలో స్వయం సమృద్ధిగా మారింది. దేశంలోని వయోజన జనాభాలో నిరక్షరాస్యత తొలగించబడింది. మహిళల విముక్తి, దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ, విద్యా విస్తరణను కూడా ప్రభుత్వం పర్యవేక్షించింది.

దేశం జాతీయ ఆదాయంలో సగటు వార్షిక పెరుగుదల ప్రపంచ దేశాల, ఐరోపా దేశాల సగటు కంటే (వరుసగా 29%, 56%) అధికం. [ఆధారం యివ్వలేదు]. ఈ దేశం యుగోస్లేవియాతో 1948 వరకు, తరువాత సోవియట్ యూనియన్ 1961 వరకు, చైనా 1950 ల మధ్య నుండి పెద్ద ఎత్తున ఋణాలను స్వీకరించింది. కమ్యూనిస్టు రాజ్యాంగం వ్యక్తుల మీద పన్నులను అనుమతించలేదు. బదులుగా సహకార సంస్థలు, ఇతర సంస్థల మీద పన్నులు విధించబడ్డాయి.

అల్బేనియా 
A bunker overlooking the Albanian Alps. By 1983, approximately 173,371 concrete bunkers were scattered across the country.

ప్రస్తుతం అల్బేనియాలో అధికారిక మతంలేని, ఆచారాలు లేని, మతస్వేచ్ఛ కలిగిన లౌకిక రాజ్యంలో కమ్యూనిస్టు యుగంలో మతపరమైన ఆరాధనలను నిషేధం ఉండేది. 1945 లో వ్యవసాయ చట్టం సంస్కరణ ఆధారంగా వక్వాఫు మసీదుల ఎస్టేటులు, టెక్కేలు, మఠాలు, డియోసెస్ ఎస్టేటులు వంటి మతసమూహాల యాజమాన్యంలోని ఆస్తులు పెద్దమొత్తంలో జాతీయం చేయబడ్డాయి. ఉలేమా వంటి చాలా మంది విశ్వాసం కలిగిన చాలా మంది పూజారులను అరెస్టు చేసి ఉరితీశారు. 1949 లో మత సమాజాల మీద కొత్త డిక్రీ జారీచేసిన తరువాత వారి కార్యకలాపాలన్నింటినీ రాజ్యం మాత్రమే మంజూరు చేయవలసి ఉంది.

అమూల్యమైన వ్రాతప్రతులను కలిగి ఉన్న వందలాది మసీదులు, డజన్ల కొద్దీ ఇస్లాం గ్రంథాలయాలు ధ్వంసమైన తరువాత హోక్షా 1967 లో అల్బేనియాను ప్రపంచంలోని మొట్టమొదటి నాస్తిక రాష్ట్రంగా ప్రకటించింది. చర్చిలను కూడా విడిచిపెట్టలేదు. అవి అనేకమంది యువకుల సాంస్కృతిక కేంద్రాలుగా మార్చబడ్డాయి. 1967 చట్టం అన్ని నియంతృత్వ మత, సంఘవిద్రోహ కార్యకలాపాలు, ప్రచారాలను నిషేధించింది. మతాన్ని బోధకులకు మూడు నుంచి పదేళ్ల జైలు శిక్ష విధించబడింది.

అయినప్పటికీ చాలామంది అల్బేనియన్లు తమ నమ్మకాలను రహస్యంగా పాటించడం కొనసాగించారు. హోక్షా మత వ్యతిరేక విధానం ఒక దశాబ్దం తరువాత చట్టపరమైన రాజకీయ వ్యక్తీకరణను సాధించింది: "రాజ్యం అధికార మతాన్ని గుర్తించలేదు" అని 1976 రాజ్యాంగం పేర్కొన్నది. " శాస్త్రీయ భౌతికవాద ప్రపంచ దృక్పథాన్ని అమర్చడానికి నాస్తిక ప్రచారానికి మద్దతు ఇచ్చింది".

నాలుగవ రిపబ్లిక్కు

అల్బేనియా 
In 1988, the first foreigners were allowed to walk into the car-free Skanderbeg Square in Tirana.

నలభై సంవత్సరాల కమ్యూనిజం, ఒంటరితనం, 1989 విప్లవాల తరువాత ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, రాజకీయంగా చైతన్యవంతంగా మారారు. ప్రస్తుత పరివర్తనకు దారితీసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. 1991 మొదటి బహుళ-పార్టీ ఎన్నికలలో ప్రజల మద్దతు తరువాత, 1992 ఎన్నికలలో డెమొక్రాటిక్ పార్టీ విజయం సాధించే వరకు కమ్యూనిస్టులు పార్లమెంటులో ఒక బలమైన స్థానాన్ని నిలుపుకున్నారు.

ప్రభుత్వం ఆదరించిన పోంజీ పిరమిడ్ పథకాలకు గణనీయమైన ఆర్థిక వనరులను కేటాయించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరికలు ఉన్నప్పటికీ, సాలి బెరీషా ఈ పథకాలను పెద్ద పెట్టుబడి సంస్థలుగా సమర్థించారు. ఎక్కువ మంది ప్రజలు తమ పన్ను చెల్లింపును దారి మళ్లించడానికి, పథకాలలో జమ చేయడానికి నగదు కోసం వారి ఇళ్లను, పశువులను విక్రయించడానికి ఇది దారితీసింది.

1996 చివరలో ఈ పథకాలు కూలిపోవటం ప్రారంభించాయి. దీనివలన చాలా మంది పెట్టుబడిదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందు శాంతియుత నిరసనలకు దిగి వారి డబ్బును తిరిగి ఇమ్మని కోరారు. 1997 ఫిబ్రవరిలో నిరసనలు హింసాత్మకంగా మారాయి ప్రభుత్వం కాల్పులు జరించడానికి ఆదేశాలు జారీచేసారు. మార్చిలో పోలీసులు, రిపబ్లికన్ గార్డులు వారి ఆయుధాలను అలాగే వదిలి వెళ్ళారు. మిలిషియా, క్రిమినల్ ముఠాలు వీటిని వెంటనే ఖాళీ చేశాయి. ఫలితంగా సంక్షోభం విదేశీ పౌరులు దేశం నుండి వెలుపలికి పంపడం, శరణార్థుల తరలింపుకు దారితీసింది.

ఈ సంక్షోభం అలెక్సాండర్ మెక్సి, సాలి బెరీషా ఇద్దరూ ఎన్నికల నేపథ్యంలో పదవికి రాజీనామా చేశారు. 1997 ఏప్రెలులో ఐక్యరాజ్యసమితి శాంతిదళాలు ఇటలీ నేతృత్వంలో " ఆపరేషన్ ఆల్బా పేరుతో దేశంలో ప్రవేశించారు. ప్రవాసుల తరలింపుకు సహాయపడటానికి, అంతర్జాతీయ సంస్థల భూములను భద్రపరచే లక్ష్యలతో పనిచేసారు. ఇందులో పాల్గొన్న ప్రధాన అంతర్జాతీయ సంస్థ, పశ్చిమ ఐరీపాసమాఖ్య దళాలు అల్బేనియన్ పోలీసు వ్యవస్థను, న్యాయ వ్యవస్థను పునర్నిర్మించడానికి అల్బేనియన్ పోలీసులతో ప్రభుత్వంతో కలిసి పనిచేసాయి.

సమకాలీనం

అల్బేనియా 
The earthquake of 26 November 2019 was the strongest to hit the country in more than four decades.

కమ్యూనిస్టు అల్బేనియా విచ్ఛిన్నమైన తరువాత దేశం పాశ్చాత్యీకరణ చురుకుగా జరిగింది. తరువాత నాటో, ఐరోపాసమాఖ్యలలో సభ్యత్వం పొందడానికి ప్రయత్నించింది.

2009 లో క్రొయేషియాతో పాటు అల్బేనియా నాటోలో చేరడానికి పూర్తి సభ్యత్వాన్ని పొందింది. ఆగ్నేయ ఐరోపాలో శాంతికార్యక్రమ భాగస్వామ్యంలోకి ప్రవేశించిన మొదటి దేశాలలో ఒకటిగా నిలిచింది. 2009 ఏప్రెలు 28 న దేశం ఐరోపాసమాఖ్యలో చేరడానికి కూడా దరఖాస్తు చేసినప్పటికీ దాని దరఖాస్థు మీద 24 జూన్ 2014 జూన్ 24 న అధికారిక అభ్యర్థి హోదాను పొందింది.

2013 - 2017 లో సోషలిస్టు పార్టీకి చెందిన " ఎడి రామా " పార్లమెంటు ఎన్నికలలో గెలిచారు. ప్రధానిగా ఉన్న కాలంలో ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడం, న్యాయవ్యవస్థ, చట్ట అమలు వంటి ప్రభుత్వసంస్థలను ప్రవేటీకరణ చేయడంపై దృష్టి సారించిన అనేక సంస్కరణలను ఆయన అమలు చేశారు. బాల్కన్లో 4 వ అతి తక్కువ నిరుద్యోగిత రేటును కలిగి ఉన్న నిరుద్యోగం క్రమంగా తగ్గించబడింది. ఆయన తన ఎజెండా మధ్యలో లింగ సమానత్వాన్ని ఉంచాడు. 2017 నుండి దాదాపు 50% మంది మహిళలు మంత్రివర్గంలో ఉన్నారు.

ఐరోపాసమాఖ్యలో సభ్యత్వం పొందడానికి అల్బేనియా అభ్యర్ధన రెండుసార్లు తిరస్కరించబడింది. దేశాన్ని ప్రవేశపెట్టడానికి చర్చలు జరగడానికి ముందు 2017 లో ఐరోపా పార్లమెంటు ప్రభుత్వ నాయకులను 2017 పార్లమెంటు ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా ఉండాలని హెచ్చరించాయి.

2019 నవంబరు 26 న 6.4 తీవ్రతతో వచ్చిన భూకంపం అల్బేనియాను సుమారు 20 కిలోమీటర్ల లోతువరకు నాశనం చేసింది. తీరానాలో భూకంపంప ప్రకంపనలు తీవ్రంగా ఉంది. టరాంటో, బెల్గ్రేడ్ వరకు ఉన్న ప్రదేశాలలో ప్రజలు ప్రకంపనల అనుభవం పొందారు. తీరప్రాంత నగరం డుర్రేస్, కోడార్-తుమనే ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. భూకంపానికి ప్రతిస్పందనగా అల్బేనియా ప్రజలకు సహకరించడానికి అల్బేనియా డయాస్పోరా, ప్రపంచంలోని అనేక దేశాలు ముందుకు వచ్చాయి.

భౌగోళికం

అల్బేనియా 
The Albanian Alps are an extension of the Dinaric Alps.

అల్బేనియా వైశాల్యం 28,748 చ.కి.మీ. ఇది ఐరోపాలోని దక్షిణ, ఆగ్నేయ బాల్కన్ ద్వీపకల్పంలో ఉంది. దీని తీరం వాయువ్య దిశలో అడ్రియాటిక్ సముద్రం, నైరుతి దిశలో అయోనియన్ సముద్రం ఉన్నాయి.

అల్బేనియా దేశం 42 ° - 39 ° ఉత్తర అక్షాంశం, 21 ° - 19 ° తూర్పు రేఖాంశం మద్య ఉంటుంది. దీని ఉత్తరాన ఉన్న వర్మోష్ 42 ° 35 '34 "ఉత్తర అక్షాంశంలో ఉంది; దక్షిణం వైపున కొనిస్పోల్ 39 ° 40 '0" ఉత్తర అక్షాంశం, 19 ° 16 '50 "తూర్పు రేఖాంశంలో ఉంది. తూర్పు దిశలో ఉన్న వర్నిక్ 21 ° 1 '26" తూర్పు రేఖాంశంలో ఉంది. అల్బేనియాలో ఎత్తైన ప్రదేశం అయిన కొరియాబు పర్వతం అడ్రియాటిక్ సముద్రమట్టానికి 2,764 మీటర్లు (9,068.24 అడుగులు)ఎత్తున ఉంది; అతి తక్కువ పాయింట్ అయిన అడ్రియాటిక్, అయోనియన్ సముద్రం 0 మీటర్లు (0.00 అడుగులు)ఉన్నాయి. తూర్పు నుండి పడమరల మద్య దూరం 148 కిలోమీటర్లు (92 మైళ్ళు) ఉంటుంది. ఉత్తరం, దక్షిణం మద్య దూరం 340 కిలోమీటర్లు (211 మైళ్ళు)ఉంటుంది.

అల్బేనియా 
అడ్రియాటిక్, అయోనియన్ సముద్రం సంగమంలో ఉన్న గ్జిపె

చిన్న దేశం అయిన అల్బేనియాలో ఎక్కువ భాగం పర్వతప్రాంతాలు, కొండప్రాంతాలు ఉంటాయి. దేశం పొడవు, వెడల్పులో వేర్వేరు దిశల్లో ఉంటాయి. ఉత్తరాన అల్బేనియన్ ఆల్ప్, తూర్పున కొరాబు పర్వతాలు, ఆగ్నేయంలో పిండసు పర్వతాలు, నైరుతిలో సెరానియన్ పర్వతాలు, మధ్యలో స్కాండర్బెగు పర్వతాలు చాలా విస్తృతశ్రేణిలో విస్తరించి ఉన్నాయి.

దేశంలో అనేక గొప్ప సరస్సులు ఉన్నాయి. వాయవ్యంలో దక్షిణ ఐరోపాలో అతిపెద్ద సరస్సు అయిన ష్కోడార్ సరస్సు ఉంది. ఆగ్నేయంలో ఓహ్రిడ్ సరస్సు ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన సరస్సులలో ఒకటి. దక్షిణాన ప్రెస్పా లార్జు, ప్రెస్పా స్మాల్ అనే రెండు సరస్సులు ఉన్నాయి.

అల్బేనియాలో ప్రవహిస్తున్న నదులు ఎక్కువగా అల్బేనియాకు తూర్పున ఉద్భవించి అడ్రియాటిక్ సముద్రంలోకి సంగమిస్తాయి. కొన్ని మాత్రం అయోనియన్ సముద్రంలో సంగమిస్తున్నాయి. దేశంలోని పొడవైన నది డ్రిన్. ఇది రెండు హెడ్ వాటర్స్ (బ్లాక్ అండ్ వైట్ డ్రిన్) సంగమం వద్ద ప్రారంభం ఔతుంది. వ్జోస్ నది ఐరోపాలో చివరిగా ఉద్భవించిన పెద్ద నదీ వ్యవస్థగా ఉంది.

వాతావరణం

అల్బేనియా 
Panorma Bay on the Albanian Riviera in the south has a mediterranean climate.

అక్షాంశం, రేఖాంశం, ఎత్తులలో తేడాల కారణంగా దేశంలో వాతావరణం చాలా వైవిధ్యంగా ఉంటుంది. అల్బేనియా ప్రధానంగా నాలుగు విభిన్న ఋతువులతో మధ్యధరా, ఖండాంతర వాతావరణాన్ని అనుభవిస్తుంది. కొప్పెన్ వాతావరణ వర్గీకరణ విధానంలో అల్బేనియాలో 5 ప్రధాన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. పశ్చిమ భాగంలో ఉపఉష్ణమండల వాతావరణం, సముద్ర, ఖండాంతర వాతావరణం అల్బేనియా తూర్పు భాగంలో సబార్కిటిక్ వాతావరణ ఉంది.

దేశంలోని అడ్రియాటిక్, అయోనియన్ సముద్ర తీరాల వెంట వెచ్చని వాతావరణ ప్రాంతాలు ఉంటాయి. దీనికి విరుద్ధంగా ఉత్తర, తూర్పు ఎత్తైన ప్రదేశాలలో శీతల వాతావరణ ప్రాంతాలు ఉంటాయి. సగటు నెలవారీ ఉష్ణోగ్రతలలో శీతాకాలంలో −1 ° సెం (30 ° ఫా), వేసవిలో 21.8 ° సెం (71.2 ° ఫా) ఉంటుంది. 1973 జూలై 18 న కునోవాలో అత్యధిక ఉష్ణోగ్రత 43.9 ° సెం (111.0 ° ఫా) గా నమోదైంది. 2017 జనవరి 9 న లైబ్రాజ్డు లోని షటిల్లె గ్రామంలో −29 ° సెం (−20 ° ఫా)గా అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.

అల్బేనియా 
The Albanian Alps in the north enjoy a subarctic climate.

వర్షపాతం సహజంగా వార్షికంగా సీజన్ నుండి సీజన్ వరకు మారుతూ ఉంటుంది. వర్షపాతం శీతాకాలంలో ఎక్కువ, వేసవి నెలలలో తక్కువగా ఉంటుంది. సగటు వర్షపాతం 1,485 మి. సగటు వార్షిక వర్షపాతం భౌగోళిక స్థానాన్ని బట్టి 600 మిల్లీమీటర్లు (24 అంగుళాలు) నుండి 3,000 మిల్లీమీటర్లు (120 అంగుళాలు) మధ్య ఉంటుంది. వాయవ్య, ఆగ్నేయ పర్వత ప్రాంతాలలో తీవ్ర వర్షపాతం ఉంటుంది. అదే సమయంలో ఈశాన్య, నైరుతి ఎత్తైన ప్రాంతాలలో అధికంగా, పశ్చిమ లోతట్టు ప్రాంతాలలో మరింత పరిమితమైన వర్షపాతం ఉంటుంది.

దేశానికి ఉత్తరాన ఉన్న అల్బేనియన్ ఆల్ప్సు ఐరోపాలోని అత్యంత తేమతో కూడిన ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ సంవత్సరానికి కనీసం 3,100 మిమీ (122.0 అంగుళాలు) వర్షం పడుతుంది. కొలరాడో విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక యాత్రలో ఈ పర్వతాలలో నాలుగు హిమానీనదాలు (2,000 మీటర్ల (6,600 అడుగులు)) కనుగొనబడ్డాయి. ఇది దాదాపుగా ఆగ్నేయ అక్షాంశంలో ఉంటుంది.

దేశంలోని ఎత్తైన ప్రదేశాలలో తరచుగా హిమపాతం ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు పర్వతాల మీద, అల్బేనియన్ ఆల్ప్సు, కోరాబు పర్వతాలలో హిమపాతం సంభవిస్తుంది. సెరానియన్ పర్వతాలలో ప్రతి శీతాకాలంలో నైరుతిలో తీరప్రాంతాలలో మంచు కురుస్తుంది. ఇక్కడ అది మార్చి దాటి కూడా సంభవిస్తూ ఉంటుంది.

జీవవైవిధ్యం

అల్బేనియా 
జాతీయ చిహ్నం, అల్బేనియా జంతువు అయిన బంగారు గ్రద్ధ

అల్బేనియా జీవవైవిధ్యంతో సుసంపన్నంగా ఉన్న దేశం. అల్బేనియా మధ్యధరా సముద్రం మధ్యలో ఉన్న భౌగోళిక స్థానంగా దాని వాతావరణ, భౌగోళిక, జలవనరుల వైవిధ్యం అనూహ్యమైన జీవవైవిధ్యానికి కారణంగా ఉంది.

సుదూరప్రాంతం ఉన్న అల్బేనియా పర్వతాలు, కొండలు అడవులు, చెట్లు, గడ్డితో నిండి ఉంటుంది. దేశంలోని వాతావరణం అత్యధికమైన జంతుజాలానికి నిలయంగా ఉంది. వీటిలో లింక్స్, బ్రౌన్ అనే రెండు ఎలుగుబంటి జాతులు వంటి అంతరించిపోతున్న జంతువులు కూడా ఉన్నాయి. వైల్డ్ క్యాట్, బూడిద రంగు తోడేలు, ఎర్ర నక్క, బంగారు నక్క వంటి ఇతర జంతువులు కూడా ఉన్నాయి. దేశం జాతీయ జంతువు ఈజిప్టియన్ రాబందు, బంగారు గ్రద్ధ తరచుగా కనిపిస్తుంటాయి.

చిత్తడి నేలలు, సరస్సులు అధికంగా ఫ్లెమింగో, పిగ్మీ కార్మోరెంటు, డాల్మేషియన్ పెలికాన్ పక్షులకు అనుకూలంగా ఉంటాయి. దేశంలోని తీరప్రాంత జలాలతీరాలలో గూడు కట్టుకునే మెడిటరేనియన్ మోంక్ సీల్, లాగర్ హెడ్ సముద్ర తాబేలు, ఆకుపచ్చ సముద్ర తాబేలు వంటి సముద్రజాతులు అధికంగా ఉంటాయి.

అల్బేనియా 
అల్బేనియన్ అడ్రియాటిక్, అయోనియన్ సముద్ర తీరాల జలాలలో బాటిల్నోజ్ డాల్ఫిన్ తరచూ కనిపిస్తుంది

ఫైటోజియోగ్రఫీ పరంగా అల్బేనియా బోరియల్ రాజ్యంలో భాగంగా ఉంది. ఇది ప్రత్యేకంగా సర్కుంబోరియల్, మధ్యధరా ప్రాంతంలోని ఇల్లిరియన్ ప్రావిన్స్‌లో విస్తరించి ఉంది. ఈ భూభాగాన్ని సాంప్రదాయకంగా పాలియార్కిటిక్ ఎకో జోన్ లోని నాలుగు భూగోళ పర్యావరణ ప్రాంతాలుగా విభజించవచ్చు; ఇల్లిరియన్ ఆకురాల్చే అడవులు, బాల్కన్ మిశ్రమ అడవులు, పిండస్ పర్వతాల మిశ్రమ అడవులు, డైనరిక్ పర్వతాల మిశ్రమ అడవులు.

అల్బేనియాలో సుమారు 3,500 వేర్వేరు జాతుల మొక్కలను చూడవచ్చు. ఇది ప్రధానంగా మధ్యధరా, యురేషియన్ పర్యావరణాన్ని సూచిస్తుంది. దేశంలో శక్తివంతమైన మూలికా, ఔషధ పద్ధతుల సంప్రదాయం ఉంది. స్థానికంగా పెరుగుతున్న కనీసం 300 మొక్కలను మూలికలు, మందుల తయారీలో ఉపయోగిస్తారు. అడవుల్లోని ప్రధానంగా ఫిర్, ఓక్, బీచ్, పైన్ల వంటి చెట్లు ఉంటాయి.

2010 పర్యావరణ పనితీరు సూచికలో ప్రపంచంలోని 163 దేశాలలో అల్బేనియా 23 వ స్థానంలో ఉంది. 2012 లో దేశం 23 నుండి 15 వ స్థానానికి చేరుకుంది. అయినప్పటికీ దక్షిణ, తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలో ఇది అత్యధిక ర్యాంకును కలిగి ఉంది. 2005 పర్యావరణ సస్టైనబిలిటీ ఇండెక్స్ ప్రకారం ఈ దేశం ప్రపంచంలో 24 వ పచ్చటి దేశంగా ఉంది. అయినప్పటికీ 2016 లో ఐక్యరాజ్యసమితి చేత హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్‌లో 13 వ ఉత్తమ దేశంగా దేశం నిలిచింది.

రక్షిత ప్రాంతాలు

అల్బేనియా 
The Lagoon of Karavasta within the Divjakë-Karavasta National Park is renowned for hosting the rare Dalmatian pelican.

అల్బేనియన్ ప్రభుత్వం అల్బేనియా రక్షిత ప్రాంతాల వ్యవస్థ దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన, విలువైన వాతావరణాలను సంరక్షిస్తూ, నిర్వహిస్తూ ఉంది. అల్బేనియాలో 15 జాతీయ ఉద్యానవనాలు, 4 రామ్సర్ ప్రాంతాలు, బయోస్పియర్ రిజర్వు, 786 ఇతర రకాల పరిరక్షణ నిల్వలు ఉన్నాయి. వీటిలో పర్వతాలు, సుందరమైన తీరాలు, అనేక రకాల సహజ దృశ్యాలు ఉన్నాయి.

అల్బేనియాలో భూభాగంలో చెల్లాచెదురుగా అధికారికంగా నియమించబడిన పదిహేను జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. వాల్బోన్ వ్యాలీ నేషనల్ పార్క్, థెత్ నేషనల్ పార్కు ఉత్తర అల్బేనియాలోని కఠినమైన అల్బేనియన్ ఆల్ప్సు (106.3 చ.కి.మీ (41.0 చదరపు మైళ్ళు) విస్తీర్ణం) ఉన్నాయి. షెబెనిక్-జబ్లానిక్ నేషనల్ పార్కు, ప్రెస్పా నేషనల్ పార్కు, తూర్పు అల్బేనియా, అద్భుతమైన పర్వత దృశ్యాలు, అలాగే ప్రెస్పా గ్రేట్ అండ్ స్మాల్ లేక్సు రక్షితప్రాంతాలుగా ఉన్నాయి.

మధ్య అల్బేనియన్ అడ్రియాటిక్ సముద్ర తీరం వెంట దివ్జాకా-కరావాస్టా నేషనల్ పార్కు విస్తరించి ఉంది. ఇకియాడలో మధ్యధరా సముద్రంలో అతిపెద్ద మడుగులలో ఒకటి అయిన కరావాస్టా సరస్సు ఉంది. దక్షిణ అల్బేనియాలోని అల్బేనియన్ అయోనియన్ సముద్ర తీరం వెంట సెరానియన్ పర్వతాలు లోగారా నేషనల్ పార్కు, కరాబురున్-సాజాన్ మెరైన్ పార్కులో కరాబురున్ ద్వీపకల్పం వరకు కొనసాగుతుంది. కార్ఫు జలసంధి తూర్పు భాగంలో బట్రింట్ సరస్సు, వివారి ఛానల్ చుట్టూ ఉన్న ఒక ద్వీపకల్పంలో బట్రింట్ నేషనల్ పార్క్ విస్తరించి ఉన్నాయి. చివరగా రాజధాని టిరానాలోని స్థానికులు, సందర్శకులకు కేబుల్ కారు ఉన్నాయి. కొన్ని అద్భుతమైన దృశ్యాలకు కాలిబాటలతో కూడిన దజ్తి మౌంట్ నేషనల్ పార్కు ప్రసిద్ధి చెందింది.

నిర్వహణా విభాగాలు

అల్బేనియా సార్వభౌమ రాజ్యం మొత్తం 28,748 చ.కి.మీ. ఇది 12 కౌంటీలుగా విభజించబడింది. కౌంటీలు దేశం ప్రాథమిక పరిపాలనా విభాగాలు 61 మునిసిపాలిటీలుగా విభజించబడ్డాయి. కౌంటీల లోపల భౌగోళిక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ప్రయోజనాలకు వారు బాధ్యత వహిస్తారు.

2000 జూలై 31 న 36 మాజీ జిల్లాల స్థానంలో కౌంటీలు సృష్టించబడ్డాయి. 2015 లో కొత్త పరిపాలనా విభాగాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మునిసిపాలిటీలను 61 కి తగ్గించారు. గ్రామీణ ప్రాంతాలను రద్దు చేశారు. పనికిరాని మునిసిపాలిటీలను పొరుగు ప్రాంతాలు లేదా గ్రామాలు అంటారు. మొత్తం దేశంలో మొత్తం 2980 గ్రామాలు లేదా సంఘాలు ఉన్నాయి. వీటిని గతంలో ప్రాంతాలు అని పిలుస్తారు. మునిసిపాలిటీలు మొదటి స్థాయి స్థానిక పాలన, స్థానిక అవసరాలు, చట్ట అమలుకు బాధ్యత వహిస్తాయి.

అల్బేనియాలో అతిపెద్ద కౌంటీ జనసంఖ్య ఆధారంగా టిరానా కౌంటీ జనసంఖ్య 800,000 కంటే అధికంగా ఉంది. తరువాత ఫైర్ కౌంటీ జనసంఖ్య 300,000 కంటే అధికంగా ఉంది. జనాభా ప్రకారం అతిచిన్న కౌంటీ 70,000 మంది జనసంఖ్య కలిగిన జిజిరోకాస్టార్ కౌంటీ. అల్బేనియా ఆగ్నేయంలో ఉన్న కోరే కౌంటీ జనసంఖ్య 3,711 కి.మీ (1,433 చదరపు మైళ్ళు). ఇది అల్బేనియాలో అతిపెద్ద కౌటీగా ఉంది. తరువాత ష్కోడార్ కౌంటీ జనసంఖ్య 3,562 చ.కి.మీ (1,375 చదరపు మైళ్ళు) ఉంది. అల్బేనియా వాయవ్య ప్రాంతంలో ఉన్న డ్యూరెస్ కౌంటీ వైశాల్యం 766 చ.కి.మీ (296 చదరపు మైళ్ళు). ఇది అతిచిన్న కౌంటీ.

అల్బేనియా 
  1.      ష్కోడర్
  2.      కుకెస్
  3.      లెఝె
  4.      డిబర్
  5.      డుర్రెస్
  6.      టిరానె
  7.      ఎల్బాసన్
  8.      కొర్సె
  9.      ఫియర్
  10.      బెరత్
  11.      వ్లొరె
  12.      గ్జిరొకస్టర్

ఆర్ధికరంగం

అల్బేనియా 
Tirana is the economic hub of the country. It is home to major domestic and foreign companies operating in the country.

ప్రణాళికాబద్ధమైన సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ నుండి పెట్టుబడిదారీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు మారడంలో అల్బేనియా చాలావరకు విజయంసాధించింది. దేశంలోని అభివృద్ధి చెందుతున్న మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ బ్యాంకు ఎగువ మధ్యతరగతి ఆదాయ ఆర్థిక వ్యవస్థగా వర్గీకరించింది. 2016 లో ఇది 14.7% శాతంతో 4 వ అత్యల్ప నిరుద్యోగ శాతం కలిగి ఉంది. ఇటలీ, గ్రీస్, చైనా, స్పెయిన్, కొసావో, యునైటెడ్ స్టేట్స్ దీని అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యదేశాలుగా ఉన్నాయి. దేశం కరెన్సీ లెక్. ఒక యూరోకు సుమారు 132,51 లెక్ సమానం.

వ్యూహాత్మక భౌగోళిక స్థానం కారణంగా అల్బేనియా కేంద్రస్థానంలో ఉన్న టిరానా, డ్యూరెస్ నగరాలు అధిక జనసంఖ్య, ఆధునిక మౌలిక సదుపాయాలు కలిగి ఉన్నాయి. దేశంలోని అతి ముఖ్యమైన మౌలిక సదుపాయాలు ఈ రెండు నగరాలలో కేంద్రీకృతమై ఈ నగరాలను ఉత్తర, దక్షిణ, పశ్చిమ, తూర్పు ప్రాంతాలతో కలుపుతూ వీటిని అంతర్జాతీయ కూడలిగా చేసాయి. అతిపెద్ద కంపెనీలలో పెట్రోలియం కంపెనీలు ప్రాధాన్యం సంతరించుకుని ఉన్నాయి. తరువాత స్థానంలో టాసి ఆయిల్, ఆల్బెట్రోల్, ఆర్మో రిఫైనరీ, కస్త్రాటి, మ్నరల్ ఆల్బుక్రోం, సిమెంటు ఆంటియా, ఇన్వెస్ట్మెంట్ బాల్ఫిన్ గ్రూప్, టెక్నాలజీ ఆల్బ్టెలెకాం, వొడాఫోన్, టెలికాం అల్బేనియా, ఇతర కంపెనీలు ఉన్నాయి.

2012 లో అల్బేనియా తలసరి జిడిపి ఐరోపాసమాఖ్య సగటులో 30% ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత 2010 మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధిని నమోదు చేసిన ఐరోపాలోని మూడు దేశాలలో అల్బేనియా ఒకటి. అంతర్జాతీయ ద్రవ్య నిధి 2010 లో అల్బేనియా 2.6%, 2011 లో 3.2% వృద్ధిని అంచనా వేసింది.

2016 నాటికి స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) 2.8% అభివృద్ధి చెందుతుందని ఫోర్బ్సు అంచనా. దేశంలో వాణిజ్య సమతుల్యత 9.7%, నిరుద్యోగిత రేటు 14.7% ఉంటుందని అంచనా వేయబడింది. ద్వారా వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవలి సంవత్సరాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా అధికరించాయి. బలమైన పెట్టుబడుల వల్ల ఆర్థిక వ్యవస్థ సమీప కాలంలో విస్తరిస్తుందని భావిస్తున్నారు. వృద్ధి 2016 లో 3.2%, 2017 లో 3.5%, 2018 లో 3.8% ఉంటుందని అంచనా.

ప్రాధమిక రంగం

అల్బేనియా 
బెరాట్ ద్రాక్షలు. మద్యధరా వాతావరణం కారణంగా దక్షిణ అల్బేనియాలో వైన్, ఆలివ్, సిట్రస్ పండ్లును ఉత్పత్తి చేస్తున్నారు

దేశంలో వ్యవసాయం చిన్న, మధ్య తరహా కుటుంబ యాజమాన్యంలో చెదురుమదురుగా ఉన్న వ్యవసాయ క్షేత్రాలమీద ఆధారపడి ఉంటుంది. ఇది అల్బేనియా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన రంగంగా మిగిలిపోయింది. ఇది జనాభాలో 41% మందికి ఉపాధిని కల్పిస్తుంది. వ్యవసాయ అవసరాలకు సుమారు 24.31% భూమి ఉపయోగించబడుతుంది. దేశం ఆగ్నేయంలో ఐరోపాలో మొట్టమొదటి వ్యవసాయ ప్రదేశాలలో ఒకటి కనుగొనబడింది. అల్బేనియా ఐరోపాసమాఖ్యలో ప్రవేశించే ముందస్తు ప్రక్రియలో భాగంగా, అల్బేనియన్ వ్యవసాయ ప్రమాణాలను మెరుగుపరచడానికి రైతులకు ఐపిఎ నిధుల ద్వారా సహాయం చేస్తున్నారు.

అల్బేనియా గణనీయమైన మొత్తంలో పండ్లు (ఆపిల్, ఆలివ్, ద్రాక్ష, నారింజ, నిమ్మకాయలు, ఆప్రికాట్లు, పీచెస్, చెర్రీలు, అత్తి పండ్లు, పుల్లని చెర్రీలు, రేగు పండ్లు, స్ట్రాబెర్రీలు), కూరగాయలు (బంగాళాదుంపలు, టమోటాలు, మొక్కజొన్న, ఉల్లిపాయలు, గోధుమలు), చక్కెర దుంపలు, పొగాకు, మాంసం, తేనె, పాల ఉత్పత్తులు, సాంప్రదాయ ఔషధం, సుగంధ మొక్కలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఇంకా దేశం సాల్వియా, రోజ్మేరీ, పసుపు జెంటియన్ ప్రపంచవ్యాప్త ముఖ్యమైన ఉత్పత్తిదారుగా ఉంది. అయోనియన్ సముద్రం, అడ్రియాటిక్ సముద్రానికి దేశం సామీప్యత ఇప్పటివరకు అభివృద్ధి చెందని మత్స్య పరిశ్రమకు గొప్ప అవకాశం లభింపజేస్తుంది. ప్రపంచ బ్యాంకు, ఐరోపా కమ్యూనిటీ ఎకనామిస్టులు నివేదించిన ప్రకారం అల్బేనియా ఫిషింగ్ పరిశ్రమ ఎగుమతి ఆదాయాన్ని సంపాదించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎందుకంటే సమీపంలోని గ్రీకు, ఇటాలీ మార్కెట్లలో ధరలు అల్బేనియన్ మార్కెట్లో కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉన్నాయి. దేశ సముద్రతీరంలో కార్పు, ట్రౌట్, సీ బ్రీం, మస్సెల్సు, క్రస్టేసియన్లు వంటి చేపలు లభిస్తుంటాయి.

ఐరోపాలో దీర్ఘకాల విటికల్చరు చరిత్ర ఉన్న దేశాలలో అల్బేనియా ఒకటి. మంచు యుగంలో ద్రాక్ష సహజంగా పెరిగే వాతావరణం కలిగిన కొన్ని దేశాలలో అల్బేనియా ఒకటి. ఈ ప్రాంతంలో 4,000 నుండి 6,000 సంవత్సరాల పురాతనమైన విత్తనాలు కనుగొనబడ్డాయి. 2009 లో దేశం 17,500 టన్నుల ద్రాక్షను ఉత్పత్తి చేసింది. కమ్యూనిస్టు యుగంలో ఉత్పత్తి ప్రాంతం 20,000 హెక్టార్లకు (49,000 ఎకరాలు) విస్తరించింది.

సెకండరీ రంగం

అల్బేనియా 
ఫుషె-క్రుజె లోని అంటియా సిమెంటు కంపెనీ

దేశంలో కమ్యూనిస్టు పాలన పతనం నుండి అల్బేనియా ద్వితీయ రంగం అనేక మార్పులు, వైవిధ్యీకరణకు గురైంది. ఎలక్ట్రానిక్సు, తయారీ, వస్త్రాలు, ఆహారం, సిమెంటు, మైనింగు, విద్యుత్తు శక్తి వంటి చాలా వైవిధ్యంగా అభివృద్ధి చెందింది. ఫుషో-క్రుజోలోని ఆంటియా సిమెంటు ప్లాంటు దేశంలో అతిపెద్ద పారిశ్రామిక గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడులలో ఒకటిగా పరిగణించబడుతుంది. అల్బేనియా ఆర్థికవ్యవస్థను నియంత్రిస్తున్న అల్బేనియన్ చమురు, సహజ వాయువు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. అల్బేనియాలో రెండవ అతిపెద్ద చమురు నిక్షేపాలుతో అల్బేనియా బాల్కన్ ద్వీపకల్పంలో ద్వితీయ స్థానంలో (రొమేనియా మొదటి స్థానంలో ఉంది) ఉంది. ఐరోపాలో అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నాయి. ఆల్బెట్రోల్ సంస్థ అల్బేనియన్ ప్రభుత్వానికి చెందినది. ఇది దేశంలో ప్రభుత్వ పెట్రోలియం ఒప్పందాలను పర్యవేక్షిస్తుంది. అల్బేనియాలోని ఐరోపా సమాఖ్య కంపెనీలను సంప్రదించడం ద్వారా వస్త్ర పరిశ్రమ విస్తృతంగా విస్తరించింది. 2016 నాటికి ఇన్స్టిట్యూటు ఆఫ్ స్టాటిస్టిక్సు ఆధారంగా, వస్త్ర ఉత్పత్తి వార్షిక వృద్ధి 5.3%, వార్షిక టర్నోవరు 1.5 బిలియన్ యూరోలు.

అల్బేనియా ఒక ముఖ్యమైన ఖనిజ ఉత్పత్తిదారుగా ఉంది. ప్రపంచంలోని ప్రముఖ క్రోమియం ఉత్పత్తిదారులు, ఎగుమతిదారు దేశాలలో స్థానం పొందింది. దేశం కూడా రాగి, నికెలు, బొగ్గును ఉత్పత్తి చేసేది. బాత్రా గని, బుల్కిజా గని, థెక్నా గని ఇప్పటికీ పనిచేస్తున్న అత్యంత గుర్తింపు పొందిన అల్బేనియన్ గనులుగా ఉన్నాయి.

తృతీయ రంగం

అల్బేనియా 
అల్బేనియన్ ఐయోసియన్ సముద్రతీరానికి దక్షిణంలో ఉన్న క్సమి ద్వీపాలు

తృతీయ రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. జనాభాలో 36% సేవా రంగంలో పనిచేస్తున్నారు. ఇది దేశ జిడిపిలో 65%కు భాగస్వామ్యం వహిస్తుంది. 20 వ శతాబ్దం చివరి నుండి తృతీయ రంగంలో బ్యాంకింగు పరిశ్రమ ప్రధానభాగంగా ఉంది. ప్రైవేటీకరణ, ప్రశంసనీయ ద్రవ్య విధానం కారణంగా బ్యాంకింగు రంగం మంచి స్థితిలో ఉంది.

ఇంతకు ముందు ప్రపంచంలో అత్యంత ఒంటరితనం, నియంత్రిత దేశాలలో ఒకటిగా ఉండేది. టెలికమ్యూనికేషన్ పరిశ్రమ ఆర్థిక రంగానికి ప్రధాన సహకారిగా ఉంది. దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల పెట్టుబడుల ద్వారా ఆర్థికరంగం అభివృద్ధి చెందింది. ఈగిల్, వోడాఫోన్, టెలికాం అల్బేనియా దేశంలో ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీసు ప్రొవైడర్లుగా ఉన్నాయి.

21 వ శతాబ్దం ప్రారంభం నుండి క్రమంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగం జాతీయ ప్రాముఖ్యత కలిగిన పరిశ్రమగా గుర్తించబడింది. ఇది 2016 లో జిడిపిలో 8.4% భాగస్వామ్యం వహించింది. పరోక్ష ఆదాయం ఈ నిష్పత్తిని 26% చేసింది. అదే సంవత్సరంలో ఐరోపా, యునైటెడ్ స్టేట్స్ నుండి అల్బేనియాను సుమారు 4.74 మిలియన్ల సందర్శకులు వచ్చారు.

అల్బేనియా 
అల్బేనియా పర్వతప్రాంతం పరిధిలోని కోమన్ సరస్సు ఇరుకైన ఘాటుమార్గం. ఎత్తైన రాళ్ళు కొన్నిసార్లు స్కాండినేవియన్ ఫ్జోరర్డ్సును గుర్తు చేస్తాయి

విదేశీ సందర్శకుల సంఖ్య నాటకీయంగా అభివృద్ధి చెందింది. 2005 లో అల్బేనియాలో 5,00,000 మంది సందర్శకులు ఉన్నారు. 2012 లో 4.2 మిలియన్లు ఉన్నారు. కేవలం 7 సంవత్సరాలలో 740% అభివృద్ధి చెందింది. 2015 లో దేశ పర్యాటక సంస్థ ఆధారంగా వేసవిలో పర్యాటకం మునుపటి సంవత్సరానికి భిన్నంగా 25% అభివృద్ధి చెందుతుంది. 2011 లో లోన్లీ ప్లానెట్ అల్బేనియాను ఒక అగ్ర ప్రయాణ గమ్యస్థానంగా పేర్కొన్నది. [ఆధారం యివ్వలేదు] న్యూయార్కు టైమ్సు 2014 లో అల్బేనియాను 4 వ ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ఉందని పేర్కొన్నది.

పర్యాటక పరిశ్రమలో ఎక్కువ భాగం దేశానికి పశ్చిమప్రాంతంలో ఉన్న అడ్రియాటిక్, అయోనియన్ సముద్రం వెంట కేంద్రీకృతమై ఉంది. అయినప్పటికీ నైరుతిలో అల్బేనియన్ రివేరా అత్యంత సుందరమైన, సహజమైన సముద్రతీరాలను కలిగి ఉంది. దీనిని తరచుగా అల్బేనియన్ తీరం ముత్యం అని పిలుస్తారు. ఈ తీరప్రాంతం గణనీయమైన పొడవు 446 కిలోమీటర్లు (277 మైళ్ళు) ఉంది. ఈ తీరానికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఎందుకంటే ఇందులో రకరకాల వర్జిన్ బీచ్‌లు, కేప్స్, కోవ్స్, కవర్ బేలు, మడుగులు, చిన్న కంకర బీచ్‌లు, సముద్ర గుహలు, అనేక ల్యాండ్ఫార్ములు ఉన్నాయి. ఈ సముద్రతీరంలోని కొన్ని భాగాలు పర్యావరణపరంగా చాలా శుభ్రంగా ఉన్నాయి. ఇవి అన్వేషించబడని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. మధ్యధరా ప్రాంతంలో ఇలాంటివి చాలా అరుదు. ఇతర ఆకర్షణలలో అల్బేనియన్ పర్వతప్రాంతం, సెరానియన్ పర్వతాలు, కొరాబు పర్వతాలు వంటి పర్వత ప్రాంతాలు ఉన్నాయి. అలాగే చారిత్రక నగరాలు బెరాట్, డ్యూరెస్, జిజిరోకాస్టార్, సరండా, ష్కోడారు, కోరే వంటి నగరాలు కూడా పర్యాటకకేంద్రాలుగా ఉన్నాయి.

ప్రయాణసౌకర్యాలు

అల్బేనియా 
ఎ 1 పశ్చిమ దిగువప్రాంతంలో ఉన్న ఆడ్రియాటిక్ సముద్రతీరాన్ని ఉత్తరప్రాంతంలో ఉన్న అల్బేసియన్ కొండప్రాంతాలను అనుసంధానిస్తుంది

అల్బేనియాలో రవాణా వ్యవస్థలో గత రెండు దశాబ్దాలలో గణనీయమైన మార్పులు, మెరుగుదలలు జరిగాయి. ప్రజా రవాణా వ్యవస్థలో రహదారి మార్గాలు, రైలు మార్గాలు వంటి మౌలికసదుపాయాలు, జలయానం, విమాన ప్రయాణాలలో నిరంతర మెరుగుదలలు రవాణావ్యవస్థలో విస్తారమైన అభివృద్ధికి దారితీశాయి.

టిరానా అంతర్జాతీయ విమానాశ్రయం దేశానికి ప్రధాన ద్వారంగా పనిచేస్తుంది. ఇది ఎయిర్ అల్బేనియాకు అల్బేనియా జాతీయ జెండా క్యారియర్ ప్రధాన కేంద్రంగా ఉంది. ఐరోపాలోని ఇతర దేశాలలో అనేక గమ్యస్థానాలతో అనుసంధానం చేస్తున్న ఈ విమానాశ్రయం నుండి సంవత్సరానికి దాదాపు 2.5 మిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణప్రాంతంలో సరండే, జిజిరోకాస్టారు, వ్లోరేలలో విమానాశ్రయాల సంఖ్యను క్రమంగా పెంచాలని అల్బేనియా యోచిస్తోంది.

అల్బేనియా 
టిరానా ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి అల్బేనియా సన్యాసిని " మదర్ థెరసా " పేరు పెట్టబడింది

అల్బేనియా సన్యాసిని, మిషనరీ మదర్ థెరిసా గౌరవార్థం టిరానా అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆమె పేరు పెట్టారు. అల్బేనియాలోని రహదారులు, మోటారు మార్గాలు తరచూ నిర్మించబడుతూ చక్కగా నిర్వహించబడుతున్నాయి. అల్బేనియాలోని ప్రధాన రవాణా కారిడారు ఎ.1. దేశంలోని పొడవైన మోటారు మార్గంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఇది కొసావోలోని ప్రిస్టినా మీదుగా అడ్రియాటిక్ సముద్రంలో ఉన్న డ్యూరెస్‌ను సెర్బియాలోని పాన్-యూరోపియన్ కారిడారుతో అనుసంధానిస్తుంది. ఎ.2 A2 అడ్రియాటిక్-అయోనియన్ కారిడార్, అలాగే పాన్-ఐరోపా కారిడారు 8 లో భాగం ఉండి, ఫైర్‌ను వ్లోరేతో అనుసంధానిస్తుంది. ఎ.3. నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత టిరానా, ఎల్బాసన్ పాన్-యూరోపియన్ కారిడారు 8 తో అనుసంధానం ఔతుంది. మూడు కారిడార్లు పూర్తయిన తరువాత అల్బేనియా 759 కిలోమీటర్ల (472 మైళ్ళు) రహదారిని దాని పొరుగు దేశాలతో అనుసంధానిస్తుంది.

అల్బేనియా 
డుర్రోసు అత్యంత అత్యాధునికప్రాంతం అయిన ప్రదేశంగా తన నౌకాశ్రయాన్ని అల్బేనియాలో అత్యంత రద్దీగా, అడ్రియాటిక్ సముద్రంలో అతిపెద్దదిగా అభివృద్ధి చేసింది

డ్యూరెస్ దేశంలో అత్యంత రద్దీ అయిన అతిపెద్ద ఓడరేవు. తరువాత వ్లోరే, షాంగ్జిను, సరండే ఉన్నాయి. 2014 నాటికి ఇది అడ్రియాటిక్ సముద్రంలో అతిపెద్ద ప్రయాణీకుల ఓడరేవులలో ఒకటిగా అభివృద్ధి చెందింది. వార్షిక ప్రయాణీకుల సంఖ్య సుమారు 1.5 మిలియన్లు. ప్రధాన ఓడరేవులు క్రొయేషియా, గ్రీసు, ఇటలీలోని అనేక ద్వీపాలు, తీర నగరాలను కలిపుతూ ఫెర్రీల వ్యవస్థను అందిస్తాయి.

జాతీయ రైల్వే సంస్థ హేకురుధ ష్కిప్టారే రైలు నెట్వర్కును నిర్వహిస్తుంది. దీనిని నియంత ఎన్వర్ హోక్ష విస్తృతంగా ప్రోత్సహించారు. ప్రైవేట్ కార్ల యాజమాన్యం, బస్సు వాడకంలో గణనీయమైన పెరుగుదల ఉంది. అయితే కమ్యూనిజం ముగిసినప్పటి నుండి రైలు వాడకం తగ్గింది. అయినప్పటికీ టిరానా, దాని విమానాశ్రయం నుండి డ్యూరెస్ వరకు కొత్త రైల్వే మార్గం ప్రణాళిక చేయబడింది. అల్బేనియాలో అత్యధిక జనాభా కలిగిన పట్టణ ప్రాంతాలను కలుపుతూ ఈ రైల్వే అల్బేనియాలో ఒక ముఖ్యమైన ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్టుగా చేస్తుంది.

మౌలికవనరులు

విద్య

అల్బేనియా 
ఆర్ట్సు అధ్యయనానికి ప్రత్యేకించబడిన దేశంలో అతి పెద్ద విశ్వవిద్యాలయం " ఆర్ట్సు విశ్వవిద్యాలయం

దేశంలో విద్య లౌకికవిధానంలో ఉచితంగా అందించబడుతుంది. ప్రాథమిక, మాధ్యమిక, తృతీయ విద్యగా విభజించబడిన మూడు స్థాయిల విద్యలో ప్రాధమిక, మాధ్యమిక స్థాయి వరకు నిర్బంధవిద్య అమలులో ఉంది. విద్యాసంవత్సరం సెప్టెంబరు లేదా అక్టోబరులో ప్రారంభమై జూన్ లేదా జూలైలో ముగిసే రెండు సెమిస్టర్లుగా విభజించబడింది. దేశంలోని అన్ని విద్యాసంస్థలలో అల్బేనియాభాష బోధనాభాషగా, ప్రాధమిక భాషగా పనిచేస్తుంది.

నిర్బంధ ప్రాధమిక విద్యను ప్రాథమిక (గ్రేడ్ ఒకటి నుండి ఐదు), మాధ్యమిక పాఠశాల (ఆరు నుండి తొమ్మిది వరకు), రెండు స్థాయిలుగా విభజించారు. విద్యార్థులు ఆరు సంవత్సరాల వయస్సు నుండి 16 ఏళ్ళు వచ్చే వరకు పాఠశాలకు తప్పకుండా హాజరు కావాలి. ప్రాధమిక విద్యను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత విద్యార్థులు అందరూ కళలు, క్రీడలు, భాషలు, శాస్త్రాలు లేదా సాంకేతికతతో సహా ఏదైనా ప్రత్యేక రంగంలో ప్రత్యేకత కలిగిన ఉన్నత పాఠశాలలకు హాజరు కావడానికి అర్హులు ఔతారు.

మాధ్యమిక విద్యను అనుసరించి తృతీయస్థాయి విద్య అధికారికంగా స్వీయ ఎన్నిక మీద ఆధారపడి ఉంటుంది. ఇది బోలోగ్నా ప్రక్రియ సూత్రాలకు అనుగుణంగా పూర్తి సంస్కరణ, పునర్నిర్మాణానికి గురైంది. ఉన్నత విద్యను అందించే ప్రైవేటు ప్రభుత్వ సంస్థలు గణనీయమైన సంఖ్యలో అల్బేనియాలోని ప్రధాన నగరాలలో విస్తరించబడ్డాయి. తృతీయ విద్యాధ్యయనాలు వరుసగా మూడు స్థాయిలలో నిర్వహించబడతాయి. వీటిలో బ్యాచిలరు, మాస్టరు, డాక్టరేటు ఉన్నాయి.

మొదటి విదేశీ భాష అధ్యయనాన్ని తప్పనిసరిగా చేసి ప్రాథమిక, ద్విభాషా పాఠశాలల్లో చాలా తరచుగా బోధిస్తారు. పాఠశాలలలో విదేశీభాషాషా విధానంలో ఇంగ్లీషు, ఇటాలియన్, ఫ్రెంచి, జర్మనీ భాషలు బోధించబడుతున్నాయి. దేశంలో 16 సంవత్సరాల వరకు నిర్బంధ విద్య అమలులో ఉంది. అక్షరాస్యత 98.7%, పురుషులకు 99.2%, మహిళలకు 98.3%.

విద్యుత్తు

అల్బేనియా 
కొమన్ జలవిద్యుత్తు పవర్ ప్లాంటు నిర్మాణం ఫలితంగా ఏర్పడిన " కొమన్ సరోవరం "(1985)

అల్బేనియా విద్యుత్తు అవసరాలకు అధికంగా జలవిద్యుత్తు మీద ఆధారపడి ఉంటుంది. దేశ విద్యుత్తు వినియోగంలో దాదాపు 94.8% జలవిద్యుత్తు కేంద్రాల నుండి లభిస్తుంది. జవిద్యుత్తు ఉతపత్తిలో అల్బేనియా ప్రపంచంలో 7 వ స్థానంలో ఉంది. డ్రిన్ నది ప్రవాహిత ప్రాంతంలో ఫియెర్జా, కోమన్, స్కవికా, వావు డెజెస్ సహా ఆరు జలవిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. రెండు స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి. డెవోల్ నదిలో బాంజో, మొగ్లిక్ ప్లాంటులు ఉన్నాయి. ఈ రెండూ 2016 - 2018 మధ్య పూర్తయ్యే అవకాశం ఉంది.

అల్బేనియాలో చమురు నిల్వలు గణనీయంగా ఉన్నాయి. అతిపెద్ద చమురు నిల్వలను కలిగిన ఐరోపాదేశాలలో అల్బేనియా 10 వ స్థానంలో ఉంది, ప్రపంచంలో 58 వ స్థానంలో ఉంది. అల్బేనియన్ అడ్రియాటిక్ సీ కోస్ట్, వెస్ట్రన్ లోలాండ్స్ లోని మైజెక్ మైదానం (ఇక్కడ దేశం అతిపెద్ద రిజర్వ్ ఉంది) ప్రాంతాలలో దేశంలోని ప్రధాన పెట్రోలియం నిక్షేపాలు ఉన్నాయి. ఐరోపాలో అతిపెద్ద సముద్ర తీర క్షేత్రం అయిన " పటోస్-మారిన్జా " ఈ ప్రాంతంలోనే ఉంది.

2015 నాటికి 498 కిలోమీటర్లు (309 మైళ్ళు) సహజ వాయువు పైపులైన్లు, 249 కిలోమీటర్లు (155 మైళ్ళు) చమురు పైపులైన్లు దేశ భూభాగం అంతటా విస్తరించి ఉన్నాయి. సహజ వాయువును అజర్‌బైజాన్ నుండి అల్బేనియా, పశ్చిమ ఐరోపాకు ఇటలీ ద్వారా పంపిణీ చేయడానికి ప్రతిపాదించబడిన ట్రాన్స్ అడ్రియాటిక్ పైప్‌లైను ప్రాజెక్టు నిర్మాణం 2020 లో పూర్తవుతుందని అంచనా వేయబడింది.

మాంటెనెగ్రో సరిహద్దుకు దగ్గరగా ఉన్న ష్కోడారు సరస్సు వద్ద ఒక అణు విద్యుత్ ప్లాంటును నిర్మించే అవకాశాన్ని గురించి అల్బేనియా, క్రొయేషియా సంయుక్తంగా చర్చించాయి. ఈ ప్రణాళిక భూకంపానికి కారణం కాగలదని మాంటెనెగ్రో విమర్శించింది. దేశంలో విద్యుత్తు వనరులను విస్తృతం చేయడానికి 2009 లో ఎనెల్ సంస్థ 800 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన బొగ్గు ఆధారిత ధర్మల్ విద్యుత్తు ప్లాంటు ప్రణాళికను ప్రకటించింది.

సాంకేతికం, మాధ్యమం

అల్బేనియా 
1938 లో జాంగు రాజు, రాణి జెరాల్డినె " రేడియో, టెలివిజన్ ష్క్విప్తర్ " ప్రారంభిస్తున్న దృశ్యం

1993 లో రాజకీయ, ఆర్థిక మార్పుల కారణంగా శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానంలో మానవ వనరులు అధికంగా క్షీణించాయి. 1991 - 2005 మద్యకాలంలో దేశంలోని విశ్వవిద్యాలయాలు, విజ్ఞాన సంస్థల ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలలో సుమారు 50% మంది అల్బేనియాను విడిచిపెట్టారు. 2009 నుండి అల్బేనియాలో సైన్సు, టెక్నాలజీ, ఇన్నోవేషన్ కొరకు రూపొందించిన జాతీయ వ్యూహాత్మక ప్రణాళికను 2009 - 2015 మద్య కాలంలో అమలు చేయడానికి ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వ జి.డి.పి.లో 0.6% " పరిశోధన & అభివృద్ధి " కొరకు కేటాయించింది. అలాగే ఐరోపా సమాఖ్య పరిశోధన కొరకు ఫ్రేమ్‌వర్కు ప్రోగ్రాంలతో సహా విదేశీ వనరుల నుండి జిడిఇ (ఇది 40% పరిశోధన ఖర్చులను భర్తీచేస్తుంది) వాటాను పెంచడానికి అల్బేనియా ప్రభుత్వం కృషిచేసింది.

అల్బేనియాలో 66 రేడియో స్టేషన్లు, 67 టెలివిజన్ స్టేషన్లతో సహా 257 మీడియా సంస్థలు ఉన్నాయి. వీటిలో 65 జాతీయ, 50 కి పైగా కేబుల్ టెలివిజన్ స్టేషన్లు ఉన్నాయి. 1938 లో రేడియో టెలివిజియోని షికిప్టార్ స్థాపనతో అల్బేనియాలో అధికారికంగా రేడియో ప్రారంభమైంది. 1960 లో టెలివిజన్ ప్రసారం ప్రారంభమైంది. దేశంలోని నాలుగు సరిహద్దు ప్రాంతాలలో 4 ప్రాంతీయ రేడియో స్టేషన్లు పనిచేస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలు తమ ప్రసారాలలో భాగంగా అల్బేనియాలో ఏడు ఇతర భాషలతో సహా మీడియం వేవ్, షార్ట్ వేవ్ ద్వారా రేడియో కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. "కెపుటా ఎన్జె జిజెతే డాఫిన్" పాటలోని థీంను ఆరంభ సంగీతంగా ఉపయోగిస్తుంది. 1993 నుండి ఉపగ్రహం ద్వారా అంతర్జాతీయ టెలివిజన్ సేవ ప్రారంభించబడింది. పొరుగు దేశాలలోని అల్బేనియా కమ్యూనిటీలు, అల్బేనియా ప్రవాసులను లక్ష్యంగా చేసుకుని ఇవి పనిచేస్తున్నాయి. ప్రస్తుతం డ్యాన్సింగ్ విత్ ది స్టార్స్, బిగ్ బ్రదర్, గాట్ టాలెంట్, ది వాయిస్, ఎక్స్ ఫాక్టర్ వంటి ప్రపంచవ్యాప్త సిరీస్‌లో భాగంగా దేశం అనేక ప్రదర్శనలను నిర్వహించింది.

ఆరోగ్యం

అల్బేనియా 
The Albanian cuisine from the Mediterranean, which is characterized by the use of fruits, vegetables and olive oil, contributes to the good nutrition of the country's population.

అల్బేనియా రాజ్యాంగం పౌరులందరికీ సమానంగా ఉచిత, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణకు హామీ ఇస్తుంది. దేశం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ప్రస్తుతం మూడు స్థాయిలలో నిర్వహించబడుతుంది. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ ఆరోగ్య సంరక్షణ విధానం ఆధునీకరణ, అభివృద్ధి ప్రక్రియలో ఉంది.

అల్బేనియా ప్రజల ఆయుఃపరిమితి 77.8 సంవత్సరాలు. అనేక అభివృద్ధి చెందిన దేశాలను అధిగమిస్తూ అల్బేనియా సగటు ఆయుఃపరిమితి ప్రపంచంలో 37 వ స్థానంలో ఉంది. సగటు ఆరోగ్యకరమైన ఆయుర్దాయం 68.8 సంవత్సరాలు. ఇది ప్రపంచంలో 37 వ స్థానంలో ఉంది. దేశం శిశు మరణాల రేటు 2015 లో 1,000:12 గా అంచనా వేయబడింది. 2000 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచించిన విధంగా ఉత్తమ ఆరోగ్య సంరక్షణ అందిస్తున్న ప్రపంచదేశాలలో అల్బేనియా 55 వ స్థానంలో ఉంది.

దేశంలో హృదయ సంబంధ వ్యాధులు మరణానికి ప్రధాన కారణంగా (మొత్తం మరణాలలో 52%) ఉన్నాయి. ప్రమాదాలు, గాయాలు, ప్రాణాంతక, శ్వాసకోశ వ్యాధులు మరణానికి ఇతర ప్రాథమిక కారణాలుగా ఉన్నాయి. దేశంలో ఇటీవలి జనాభా పెరుగుదల, సామాజిక, ఆర్థిక మార్పుల కారణంగా న్యూరోసైకియాట్రిక్ వ్యాధి కూడా అధికరించింది.

2009 లో దేశంలో రోజుకు తలసరి 886 గ్రాముల పండ్లు, కూరగాయల సరఫరా అందించబడుతుంది. ఇది ఐరోపాలో ఐదవ అత్యధిక సరఫరాగా గుర్తించబడుతుంది. ఇతర అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే, అల్బేనియాలో ఊబకాయం రేటు తక్కువగా ఉంది. ఆరోగ్య ప్రయోజనాలకు మధ్యధరా ఆహారం కారణంగా భావించబడుతుంది. 2016 నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ఆధారంగా దేశంలో 21.7% మంది పెద్దలు వైద్యపరంగా ఊబకాయం కలిగి ఉన్నారు. బాడీ మాస్ ఇండెక్సు స్కోరు 25 లేదా అంతకంటే అధికంగా ఉంది.

అల్బేనియా 
The Albanian population development in the last sixty years

గణాంకాలు

ఇన్స్టిట్యూటు ఆఫ్ స్టాటిస్టిక్సు ఆధారంగా అల్బేనియా జనాభా 2016 లో 28,86,026 గా అంచనా వేయబడింది. అల్బేనియా మహిళలలో సంతానోత్పత్తి నిష్పత్తి ఒకస్త్రీకి 1.51 మంది పిల్లలు ప్రపంచంలోనే ఇది అతి తక్కువ. దీని జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 259 మంది నివాసితులు. ప్రజల ఆయుఃపరిమితి 78.5 సంవత్సరాలు; పురుషులకు 75.8 సంవత్సరాలు, స్త్రీలకు 81.4 సంవత్సరాలు. ఈ దేశం అత్యధిక జనాభా కలిగిన బాల్కను దేశాలలో 8 వ స్థానంలో ఉంది. ప్రపంచంలో 137 వ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. దేశ జనాభా 1979 లో 2,5 మిలియన్ల ఉండగా 1989 నాటికి 3.1 మిలియన్లకు చేరుకుంది నికర వలసల స్థాయి ఆధారంగా వాస్తవ జనన రేటు వచ్చే దశాబ్దంలో జనాభా తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు.

అల్బేనియాలో ఇటీవలి జనాభా తగ్గింపుకు కమ్యూనిజ పాలన పతనం కారణం అని భావిస్తున్నారు. ఈసమయంలో అల్బేనియా నుండి గ్రీస్, ఇటలీ, యునైటెడ్ స్టేట్సుకు పెద్ద ఆర్థిక సామూహిక వలసలు అధికంగా జరిగాయి. ఈ దేశవిసర్జనకు ప్రపంచం నుండి 40 సంవత్సరాల ఒంటరితనం, దాని వినాశకరమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు కారణం అయింది. కమ్యూనిస్టు యుగంలో బాహ్య వలసలు పూర్తిగా నిషేధించబడ్డాయి. అంతర్గత వలసలు చాలా పరిమితం, అందువలన కమ్యూనిజం పతనం తరువాత విదేశీవలసలు అధికరించాయి. ఈ కాలంలో కనీసం 9,00,000 మంది అల్బేనియాను విడిచిపెట్టారు. వారిలో 6,00,000 మంది గ్రీసులో స్థిరపడ్డారు. వలసలు దేశ అంతర్గత జనాభా పంపిణీని ప్రభావితం చేసింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో జనసంఖ్య కనీసంగా క్షీణించింది. అయినప్పటికీ ఇది టిరానా, డుర్రేస్ నగరాలలో అధికరించింది. పెరిగింది.[ఆధారం చూపాలి] ఇంస్టిట్యూటు ఆఫ్ స్టాటిస్టిక్సు ఆధారంగా 2015 జనవరి నాటి అల్బేనియా జనసంఖ్య 2,893,005.

దేశ జనాభాలో 53.4% మంది నగరాల్లో నివసిస్తున్నారు. మొత్తం జనాభాలో సగం మంది జనసంఖ్య ఆధారంగా మూడు అతిపెద్ద కౌంటీలలో నివసిస్తున్నారు. మొత్తం జనాభాలో దాదాపు 30% టిరానా కౌంటీలో ఉంది, తరువాత ఫైర్ కౌంటీ 11%, డ్యూరెస్ కౌంటీ 10%తో ఉన్నాయి. 1 మిలియన్ మందికి పైగా ప్రజలు టిరానా, డ్యూరస్‌లలో కేంద్రీకృతమై ఉన్నారు. ఇది అల్బేనియాలో అతిపెద్ద పట్టణ ప్రాంతంగా మారింది. టిరానా బాల్కన్ ద్వీపకల్పంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటిగా ఉంది. 8,00,000 జనాభాతో ఈ నగరం బాల్కన్ ద్వీపకల్పంలో 7 వ స్థానంలో ఉంది. జనసంఖ్య ఆధారంగా దేశంలో రెండవ అతిపెద్ద నగరం డ్యూరెస్, (జనసంఖ్య 201.110), తరువాత వ్లోరే (141.513 జనసంఖ్య).

The country's largest urban areas by population as of 2011.

అల్బేనియా 
Tirana
అల్బేనియా 
Durrës
# నగరం జనసంఖ్య # నగరం జనసంఖ్య
అల్బేనియా 
Gjirokastër
అల్బేనియా 
Sarandë
1 |align=left|టిరానా | 418,495 |style="text-align:center; background:#f0f0f0;"| 11 |align=left|కవజె | 20,192
2 |align=left|డుర్రెస్ | 113,249 |style="text-align:center; background:#f0f0f0;"| 12 |align=left|గ్జిరొకస్టర్ | 19,836
3 |align=left|వ్లొరె | 79,513 |style="text-align:center; background:#f0f0f0;"| 13 |align=left|సరండే | 17,233
4 |align=left|ష్కొడర్ | 78,703 |style="text-align:center; background:#f0f0f0;"| 14 |align=left|లాక్ | 17,086
5 |align=left|ఎల్బాసన్ | 77,075 |style="text-align:center; background:#f0f0f0;"| 15 |align=left|కుకెస్ | 16,719
6 |align=left|ఫియర్ | 55,845 |style="text-align:center; background:#f0f0f0;"| 16 |align=left|పాటోస్ | 15,937
7 |align=left|కొర్సె' | 51,152 |style="text-align:center; background:#f0f0f0;"| 17 |align=left|లెజె | 15,510
8 |align=left|బెరాట్ | 32,606 |style="text-align:center; background:#f0f0f0;"| 18 |align=left|పెషొపి | 13,251
9 |align=left|లుషన్జె | 31,105 |style="text-align:center; background:#f0f0f0;"| 19 |align=left|కుకొవె | 12,654
10 |align=left|పొగ్రాడెక్ | 20,848 |style="text-align:center; background:#f0f0f0;"| 20 |align=left|క్రుజె | 11,721
-

పై జాబితాలో నగరాల వారీగా జనసంఖ్య వివరించబడింది.

అల్పసంఖ్యాకులు

జాతి సమస్యలు సున్నితమైన అంశంగా చర్చకు లోబడి ఉంటాయి. దేశం అధికారికంగా అల్బేనియా ప్రజల ఆధిక్యతను (97% కంటే అధికంగా) చూపిస్తుంది. అధికారిక గణాంకాలకు విరుద్ధంగా మైనారిటీ సమూహాలు (గ్రీకులు, మాసిడోనియన్లు, మాంటెనెగ్రియన్లు రోమానియన్లు, అరోమానియన్లు వంటివి) అధికారిక సంఖ్యలను తరచూ వివాదానికి గురి చేస్తున్నాయి. దేశ జనాభాలో అల్బేనియన్లు ఎక్కువ శాతం మంది ఉన్నారు. వివాదాస్పద 2011 జనాభా గణాంకాల ఆధారంగా జాతుల సంబంధిత ప్రజల జసంఖ్య ఈ క్రింది విధంగా ఉంది: అల్బేనియన్లు 2,312,356 (మొత్తం 82.6%), గ్రీకులు 24,243 (0.9%), మాసిడోనియన్లు 5,512 (0.2%), మాంటెనెగ్రియన్లు 366 (0.01%), అరోమానియన్లు 8,266 (0.30%), రోమానియన్లు 8,301 (0.3%), బాల్కన్ ఈజిప్షియన్లు 3,368 (0.1%), ఇతర జాతులు 2,644 (0.1%), అప్రకటిత జాతి 390,938 (14.0%), ఏజాతికి చెందని ప్రజలు 44,144 (1.6%). జాతీయ అల్పసంఖ్యాకుల రక్షణ కోసం చేసిన ముసాయిదా సమావేశంలో సలహా కమిటీ నిర్దిష్ట డేటా నాణ్యత గురించి ఇలా పేర్కొంది "జాతీయ అల్పసంఖ్యాకుల రక్షణ కొరకు రాజ్యాంగ విధానాన్ని నిర్ణయించడానికి నిర్వహించిన జనాభా గణాంకాలను సేకరించిన సమయంలో జనాభా లెక్కల ఫలితాలపట్ల చాలా జాగ్రత్త వహించాలని, ప్రత్యేకంగా సేకరించిన డేటా మీద ఆధారపడి జాతీయత నిర్ధారించవద్దని అధికారులకు పిలుపునిచ్చారు".

అల్బేనియా తొమ్మిది సాంస్కృతిక అల్పసంఖ్యాకులను గుర్తించింది: గ్రీక్, మాసిడోనియన్, వల్లాచియన్, మాంటెనెగ్రిన్, సెర్బ్, రోమా, ఈజిప్షియన్, బోస్నియా, బల్గేరియా ప్రజలు. ఇతర అల్బేనియా అల్పసంఖ్యాక ప్రజలలో గోరానీ, అరోమానియన్లు, యూదులు ఉన్నారు. అల్బేనియాలో ఎంతమంది గ్రీకులు ఉన్నారో తెలుసుకోవడం కష్టం. అల్బేనియాలో గ్రీకుజాతి ప్రజల సంఖ్య మధ్య అంచనాలు (60,000 - 3,00,000) మారుతూ ఉంటాయి. ఇయాన్ జెఫ్రీస్ అభిప్రాయం ఆధారంగా పలు పాశ్చాత్య వనరులు గ్రీకులు 2,00,000 ఉన్నారని తెలియజేస్తున్నాయి. గ్రీకు ప్రభుత్వం 3,00,000 సంఖ్యకు మద్దతు ఇస్తుంది.

సి.ఐ.ఎ. వరల్డు ఫాక్ట్సుబుక్కు మొత్తం జనాభాలో గ్రీకు మైనారిటీని 0.9%గా అంచనా వేసింది. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంటు గ్రీకుల సంఖ్య 1.17%, ఇతర అల్పసంఖ్యాకుల సంఖ్య 0.23% ఉన్నట్లు తెలియజేస్తుంది. గ్రీకు మైనారిటీ గురించి జనాభా లెక్కల డేటా ప్రామాణికతను ఇవి ప్రశ్నిస్తున్నాయి. దేశం నుండి వెలుపలకు పోతున్న విదేశీవలసలు గణాంకాలను ప్రభావితం చేస్తున్నాయి.

జనాభా లెక్కల చట్టంలోని ఆర్టికల్ 20 ను మాసిడోనియాలోని కొన్ని గ్రీకు అల్పసంఖ్యాకుల సమూహాలు తీవ్రంగా విమర్శించాయి. దీని ప్రకారం స్త్రీ, పురుషులు ఎవరైనా వారి జనన ధ్రువీకరణ పత్రంలో పేర్కొన్నదాని కంటే ఇతర జాతిని ప్రకటిస్తే వారికి $ 1,000 అమెరికా డాలర్ల జరిమానా విధించబడుతుంది. ఇది అల్బేనియా జాతి ప్రజలు అధికంగా ఉన్నట్లు ప్రకటించి అల్పసఖ్యాకులను బెదిరించే ప్రయత్నం అని పేర్కొంటున్నారు. వారి అభిప్రాయం ప్రకారం అల్బేనియా ప్రభుత్వం జనాభా గణనలో జాతిని ప్రకటించడానికి నిరాకరించిన స్త్రీ,పురుషులను జైలులో పెడుతుందని పేర్కొంది. మంత్రి జెన్క్ పోలో ఇలా ప్రకటించారు: "అల్బేనియా పౌరులు తమ జాతి, మతపరమైన అనుబంధాన్ని, మాతృభాషను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలరు. అయినప్పటికీ వారు సున్నితమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు". సవరణలలో జైలు శిక్షల గురించి, బలవంతంగా జాతి, మతాలను ప్రకటించడం గురించిన వివరణ లేదని విమర్శకులు పేర్కొన్నారు. జరిమానా మాత్రమే (దీనిని కోర్టు పడగొట్టవచ్చు) ఊహించబడింది.

అల్బేనియా పార్లమెంటులో గ్రీకు ప్రతినిధులు భాగంగా ఉన్నారు. ప్రభుత్వం అల్బేనియా గ్రీకులను వారి స్థితిని మెరుగుపర్చడానికి వారి పేరును నమోదు చేయడం ఏకైక మార్గం అని పిలుపు ఇచ్చింది. మరోవైపు అల్బేనియాలోని జాతీయవాదులు, వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు జనాభా లెక్కలు గ్రీకు అల్పసంఖ్యాకుల సంఖ్యను కృత్రిమంగా పెంచుతాయని, అల్బేనియా ప్రాదేశిక సమగ్రతను బెదిరించడానికి గ్రీస్ ప్రయత్నిస్తుంది అని తమ ఆందోళనను వ్యక్తం చేశాయి.

Regions with a traditional presence of ethnic groups other than Albanian.
Distribution of ethnic groups within Albania, as of the 2011 census. Districts colored gray are those where a majority of people did not declare an ethnicity (the question was optional). The census was criticized and boycotted by minorities in Albania.
Traditional locations of linguistic and religious communities in Albania.

భాషలు

అల్బేనియా 
అల్బేనియాలోని " అల్బేనియా భాషా మాండలికం "

దేశ అధికారిక భాష అల్బేనియా. ఇది దేశ జనాభాలో ఎక్కువ మంది ప్రజలకు వాడుకభాషగా ఉంది. రెండు ప్రాధానిక మాండలికాలైన ఘెగ్, టోస్కు సవరించి అల్బేనియా భాష మాట్లాడేరూపం, వ్రాతపూర్వక రూపం ఏర్పరచబడ్డాయి. అయినప్పటికీ ఇది టోస్కు మాండలికం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. రెండు మాండలికాల మధ్య విభజన రేఖగా ష్కుంబిన్ నది ఉంటుంది. ప్రామాణిక ఆధునిక గ్రీకులో కోల్పోయిన లక్షణాలను సంరక్షించడానికి గ్రీకు అల్పసంఖ్యాకులు నివసించే ప్రాంతాలలో పురాతన గ్రీకు మాండలికం మాట్లాడతారు. అల్బేనియాలో అల్పసంఖ్యాక భాషలు మాట్లాడే ఇతర భాషలలో అరోమానియా, సెర్బియా, మాసిడోనియా, బోస్నియా, బల్గేరియా, గోరానీ, రోమా ఉన్నాయి. తూర్పు అల్బేనియాలోని పుస్టెక్ మునిసిపాలిటీలో మాసిడోనియా భాష అధికారభాషగా ఉంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా జనాభాలో 27,65,610 (98.767%) మంది ప్రజలు అల్బేనియాభాషను తమ మాతృభాషగా ప్రకటించారు. (బాల్యంలో ఇంట్లో మాట్లాడే మొదటి లేదా ప్రధాన భాష మాతృభాషగా నిర్వచించబడింది).

One road sign in Albanian and a minority language (Macedonian) and one in Albanian and a foreign language for tourists (English) in Pustec (left) Road sign in Albanian and a minority language (Greek) in Goranxi (right)

ఇటీవలి సంవత్సరాలలో గ్రీకు అల్పసంఖ్యాక ప్రజల కొరకు ప్రత్యేకించబడిన పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం ఉపాధ్యాయులకు సమస్యలను కలిగించింది. ప్రక్కనే ఉన్న గ్రీసుతో సాంస్కృతిక, ఆర్థిక సంబంధాల కారణంగా దేశంలోని దక్షిణ భాగంలో ప్రధానంగా గ్రీకుభాష వాడుకభాషగా ఉంది. 2017 లో అల్బేనియా ప్రభుత్వ గణాంక సంస్థ ఇన్స్టాటు నిర్వహించిన అధ్యయనంలో 25-64 సంవత్సరాల వయసు కలిన వారిలో 39.9% మంది కనీసం ఒక విదేశీ భాషను ఉపయోగించగలుగుతారు. వీటిలో ఇంగ్లీషు మొదటి స్థానంలో (40.0%), ద్వితీయ స్థానంలో ఇటాలియన్ (27.8%), తృతీయస్థానంలో గ్రీకు (22.9%) ఉన్నాయి. 2000 తరువాత 25 లేదా అంతకంటే తక్కువ వయస్సు గల యువకులలో ఇంగ్లీషు, జర్మనీ, టర్కిషు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇటాలియన్, ఫ్రెంచి అంటే వారికి స్థిరమైన ఆసక్తి ఉంది. గ్రీకు చాలా ఆసక్తిని కోల్పోయింది. ఈ పోకడలు సాంస్కృతిక, ఆర్థిక కారణాలతో ముడిపడి ఉన్నాయి.

దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండవ భాష గ్రీకు. జనాభాలో 0.5 - 3% మంది దీనిని మొదటి భాషగా మాట్లాడుతున్నారు. ప్రధానంగా అల్బేనియా కుటుంబాలలో మూడింట రెండొంతుల కుటుంబాలు గ్రీకు మాట్లాడే సభ్యుడు ఒకరిని కలిగి ఉన్నాయి. కమ్యూనిస్టు అనంతర కాలంలో (1992-ప్రస్తుతం) చాలావరకు ప్రైవేటు పాఠశాలలు లేదా గ్రీసు వలసల కారణంగా గ్రీకు నేర్చుకున్నారు. కమ్యూనిస్టు పాలనా కాలంలో దక్షిణప్రాంతంలో "అల్పసంఖ్యాక ప్రాంతం" వెలుపల గ్రీకు బోధన నిషేధించబడింది. 2003 నాటికి గ్రీకును అల్బేనియా అంతటా 100 కి పైగా ప్రైవేట్ ట్యూటరింగ్ సెంటర్లలో, టిరానాలోని ఒక ప్రైవేటు పాఠశాలలో గ్రీకుభాషను అందిస్తున్నారు. ఇది గ్రీస్ వెలుపల గ్రీస్ భాషను అందిస్తున్న దేశాలలో ఇదే మొదటిది.

యువత ఇటీవలి సంవత్సరాలలో జర్మనీ భాష మీద ఆసక్తిని కలిగి ఉన్నారు. వారిలో కొందరు అధ్యయనం కోసం లేదా వివిధ అనుభవాల కోసం జర్మనీకి వెళతారు. రెండు దేశాల యువతకు రెండు సంస్కృతులను బాగా తెలుసుకోవడంలో సహకరించడానికి అల్బేనియా, జర్మనీ మద్య ఒప్పందాలు ఉన్నాయి. టర్కీతో ఆర్థిక సంబంధాలు అధికరించిన కారణంగా యువతలో టర్కీ నేర్చుకోవడంలో ఆసక్తి క్రమంగా అధికరిస్తుంది. టర్కీ పెట్టుబడుల ఆర్థిక ప్రాముఖ్యత కారణంగా రెండు దేశాల మధ్య విలువలకు యువత ఆకర్షించబడుతుంది. విశ్వవిద్యాలయాల సాంస్కృతిక, విద్యా సహకారం నుండి యువత ప్రయోజనం పొందుతున్నారు. 2011 లో టర్కిషు యాజమాన్యంలోని ఎపోకా విశ్వవిద్యాలయం విద్యార్థులకు టర్కీతో కలిపి ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలను అందిస్తుంది. అల్బేనియాలో ఉత్తమ విదేశీ యాజమాన్యంలోని విశ్వవిద్యాలయంగా ఇది ఎంపిక చేయబడింది.

మతం

అల్బేనియా 
Mirahori Mosque in Korçë is a monument of cultural heritage.

అల్బేనియా అధికారిక మతరహిత లౌకిక రాజ్యం. మత స్వేచ్ఛ రాజ్యాంగబద్ధమైన హక్కుగా ఉంది. 2011 జనాభా గణాంకాల ఆధారంగా 1930 తరువాత మొదటిసారిగా గణాంకాలలో మతం గురించిన బహిరంగ ప్రశ్న ఉంది; జనాభా లెక్కల ప్రకారం అల్బేనియాలో ముస్లింలు (58.79%) ఉన్నారు, ఇందులో సున్నీ (56.70%), బెక్తాషి ముస్లింలు (2.09%) ఉన్నారు.[ఆధారం చూపాలి] క్రైస్తవుల (16.92%)లో కాథలిక్కులు (10.03%), ఆర్థడాక్సు (6.75%), ఎవాంజెలికల్ ప్రొటెస్టంట్లు (0.14%) ఉన్నారు. జనాభాలో అథిస్టులు 2.5%, విశ్వాసరహితులు 5.49%, 13.79% మంది ఏ సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు.

2011 జనాభా లెక్కల ప్రాథమిక ఫలితాలలో భిన్నమైన ఫలితాలను ఇచ్చినట్లు అనిపించింది. 70% మంది మతవిశ్వాసాల వివరాలను ప్రకటించడానికి నిరాకరించారు. అల్బేనియన్ ఆర్థోడాక్స్ చర్చి ఈ ఫలితాలను గుర్తించడాన్ని అధికారికంగా నిరాకరించబడింది. మొత్తం జనాభాలో 24% మంది తమ విశ్వాసానికి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. కొంతమంది ముస్లిం కమ్యూనిటీ అధికారులు చాలా మంది ముస్లింలను లెక్కించలేదని, ముస్లిం అనుచరుల సంఖ్య అల్బేనియన్ జనాభాలో 70% మంది ఉన్నారని డేటా మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. అల్బేనియన్ కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ కూడా జనాభా గణన మీద సందేహాలను వ్యక్తం చేసింది, దాని విశ్వాసులలో చాలామందిని సంప్రదించలేదని ఫిర్యాదు చేశారు. ముస్లిం అల్బేనియన్లు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. ఆర్థడాక్సు, బెక్టాషిలు ఎక్కువగా దక్షిణప్రాంతంలో కనిపిస్తారు, కాథలిక్కులు ప్రధానంగా ఉత్తరప్రాంతంలో నివసిస్తున్నారు. 2008 లో దేశంలో 694 కాథలిక్ చర్చిలు, 425 ఆర్థడాక్స్ చర్చిలు, 568 మసీదులు, 70 బెక్టాషి టెక్కేలు ఉన్నాయి.

అల్బేనియా 
టిరానా పునరుత్థానం కేథడ్రల్; ఐరోపాలో మూడవ అతిపెద్ద ఆర్థడాక్సు చర్చి. తూర్పు ఆర్థడాక్సు మొట్టమొదట రోమన్ కాలంలో ప్రవేశపెట్టబడింది

అల్బేనియన్ల సంప్రదాయం ముఖ్యమైన విలువలలో మత సహనం ఒకటి. దేశంలోని వివిధ మత వర్గాల విశ్వాసులు అల్బేనియన్లు సాధారణంగా శాంతియుత సహజీవనాన్ని గౌరవిస్తారని అంగీకరిస్తున్నారు. మత సహజీవనం, సహనం సుదీర్ఘ సాంప్రదాయం కారణంగా పోప్ ఫ్రాన్సిస్ టిరానాలో అధికారిక పర్యటనలో అల్బేనియాను మత సామరస్యం నమూనాగా ప్రశంసించారు. అల్బేనియా ప్రపంచంలో అతి తక్కువ మతప్రాధ్యత కలిగిన దేశాలలో ఒకటిగా ఉంది. ఇంకా దేశ జనాభాలో కేవలం 39% మంది మాత్రమే మతంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. 2016 గల్లప్ ఇంటర్నేషనల్ రిపోర్టులో 56% అల్బేనియా ప్రజలు తమను తాము మతవిశ్వాసులుగా భావించారు, 30% మంది తమను తాము మతరహితంగా భావించారు, 9% మంది తమను తాము నాస్తికులుగా నిర్వచించారు; 80% దేవుణ్ణి నమ్ముతారు, 40% మరణం తరువాత జీవితాన్ని నమ్ముతారు. అయినప్పటికీ 40% మంది నరకాన్ని విశ్వసించగా, 42% మంది స్వర్గాన్ని విశ్వసించారు.

క్లాసికల్ కాలంలో అపొస్తలుల కాలం నాటికి డుర్రేసులో 70 క్రైస్తవ కుటుంబాలు ఉన్నట్లు భావిస్తున్నారు. పాల్ అపొస్తలు డుర్రేసు ఆర్చ్ బిషోప్రిక్ చర్చిని (ఇల్లిరియా, ఎపిరస్లలో బోధించేసమయంలో) స్థాపించాడు. మధ్యయుగ కాలంలో బైజాంటైన్ల నుండి అల్బేనియన్ ప్రజలు చారిత్రక రికార్డులలో కనిపించారు. ఈ సమయంలో వారు ఎక్కువగా క్రైస్తవీకరణ చేయబడ్డారు. 9 వ శతాబ్దం చివరలో అరబ్బులు అడ్రియాటిక్ సముద్రం తూర్పు ఒడ్డున కొన్ని ప్రాంతాల దాడి చేసినప్పుడు ఇస్లాం మొదటిసారిగా ఈ ప్రాంతానికి వచ్చింది. ఒట్టోమన్ కాలం శతాబ్దాలలో ఇది మెజారిటీ మతంగా ఉద్భవించింది. అయినప్పటికీ గణనీయమైన క్రైస్తవ అల్పసంఖ్యాక వర్గం ఉంది.

ఆధునిక కాలంలో అల్బేనియా రిపబ్లిక్కు, రాచరికం, తరువాత వచ్చిన కమ్యూనిస్టు పాలకులు సాంస్కృతిక జీవితం నుండి మతాన్ని వేరు చేసే ఒక క్రమమైన విధానాన్ని అనుసరించారు. రిపబ్లిక్కుగా, రాజ్యంగా దేశానికి ఎప్పుడూ అధికారిక మతం లేదు.

అల్బేనియా 
రూబిక్ ఆశ్రమం

20 వ శతాబ్దంలో మతాధికారులందరూ రాచరిక పాలనలో బలహీనపడ్డారు. చివరికి 1950 - 1960 లలో ప్రభుత్వవిధానాను అనుసరించి అల్బేనియా భూభాగాల నుండి వ్యవస్థీకృత మతాలను నిర్మూలించారు. కమ్యూనిస్టు పాలన మత ఆచారాలను, సంస్థలను హింసించి, అణచివేసి మతాన్ని పూర్తిగా నిషేధించింది. ఆ దేశం అధికారికంగా ప్రపంచంలోని మొట్టమొదటి నాస్తిక రాజ్యంగా ప్రకటించబడింది. అయినప్పటికీ కమ్యూనిజం ముగిసినప్పటి నుండి దేశం మత స్వేచ్ఛ తిరిగి వచ్చింది.

ఇస్లాం కమ్యూనిస్టు శకం హింస నుండి బయటపడింది. ఆధునిక యుగంలో అల్బేనియాలో తిరిగి ఆచరణలో ఉన్న మతంగా మారింది. అల్బేనియాలోని కొన్ని చిన్న క్రైస్తవ వర్గాలలో ఎవాంజెలికల్సు సెవెన్త్-డే అడ్వెంటిస్టు చర్చి, చర్చి ఆఫ్ జీసస్ క్రైస్టు ఆఫ్ లేటర్-డే సెయింట్సు, యెహోవాసాక్షులు ఉన్నారు. ప్రొటెస్టంటు సైడ్ తోప్తాని ఐరోపాలో పర్యటించి 1853 లో టిరానాకు తిరిగి వచ్చాడని అల్బేనియా మొట్టమొదటి రికార్డు వ్రాతపూర్వకంగా సూచిస్తుంది. అక్కడ ఆయన ప్రొటెస్టాంటిజం బోధించాడు. ఆ కారణంగా ఆయనను 1864 లో ఒట్టోమన్ అధికారులు అరెస్టు చేసి జైలులో పెట్టారు. మొదటి సువార్త ప్రొటెస్టంట్లు 19 వ శతాబ్దంలో కనిపించారు. 1892 లో ఎవాంజెలికల్ అలయన్స్ స్థాపించబడింది. ప్రస్తుతం వివిధ ప్రొటెస్టంటు తెగలకు చెందిన 160 సమాజాలు ఉన్నాయి.

హోలోకాస్ట్ సమయంలో యూదుల జనాభా గణనీయంగా పెరిగిన ఐరోపాలో అల్బేనియా మాత్రమే ఉంది. ఇజ్రాయెలుకు సామూహిక వలసల తరువాత, కమ్యూనిజం పతనం తరువాత దేశంలో 200 మంది అల్బేనియా యూదులు మాత్రమే మిగిలి ఉన్నారు.

సంస్కృతి

చిహ్నాలు

అల్బేనియా 
The double-headed eagle on the walls of the St. Anthony Church.

అల్బేనియా దాని చరిత్ర, సంస్కృతి, నమ్మకంతో సంబంధం ఉన్న అనేక చిహ్నాలను గుర్తిస్తుంది. వీటిలో ఎరుపు - నలుపు రంగులు, దేశవ్యాప్తంగా నివసిస్తున్న బంగారు గ్రద్ధ వంటి జంతువులు, ప్రత్యేక కార్యక్రమాలు, వేడుకలకు ధరించే ఫస్టనెల్లా, ప్లిస్, ఒపింగా వంటి దుస్తులు, ఆలివ్, ఎరుపు గసగసాల వంటి మొక్కలు పెరుగుతున్నాయి దేశం.

అల్బేనియా జెండా ఎరుపు రంగులో ఉంటుంది. మధ్యలో నల్లని రెండు తలల గ్రద్ధ ఉంటుంది. ఎరుపు రంగు అల్బేనియా ప్రజల ధైర్యం, బలం, శౌర్యాన్ని సూచిస్తుంది. నలుపు రంగు స్వేచ్ఛ, వీరత్వానికి చిహ్నంగా కనిపిస్తుంది. మధ్య యుగం నుండి అల్బేనియాలోని కస్ట్రియోటి, ముజాకా, థోపియా, డుకాగ్జిని వంటి గొప్ప పాలక కుటుంబాలకు చెందిన ప్రముఖులు గ్రద్ధను " ప్రిన్సిపాలిటీ ఆఫ్ అర్బోర్ " చిహ్నంగా స్థాపించారు. ఒట్టోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి తిరుగుబాటు ప్రారంభించిన జెర్జ్ కాస్ట్రియోటి స్కాండర్బ్యూ ఓట్టమన్ దళాలు ఐరోపాలోకి ప్రవేశించకుండా దాదాపు 25 సంవత్సరాలు ఆపాడు. ఆయన తన జెండాలోనూ, రాజముద్రమీద రెండుతలల గ్రద్ధను ఉంచాడు.

దేశం జాతీయ నినాదం " టి షికిపారి, మా జెప్ ఎండర్, మో జెప్ ఎమ్రిన్ షికిపతార్" ("మీరు అల్బేనియా, మీరు నాకు గౌరవం ఇస్తారు, మీరు నాకు అల్బేనియన్ అనే పేరు ఇస్తారు"). అల్బేనియా జాతీయ మేలుకొలుపులో దాని మూలం ఉంటుందని భావించబడుతుంది. నైం ఫ్రాషారీ తన కవిత టి షికిపారి మా జెప్ నెడర్ ద్వారా ఈ నినాదాన్ని మొట్టమొదట వ్యక్తం చేసాడు.

ఆహారం

అల్బేనియా 
పిటేతో వడ్డించబడుతున్న స్పెకా టె ఫర్గుయారా (కాల్చిన కాప్సికం) ప్రముఖ అల్బేనియన్ ఆహారం

శతాబ్దాలుగా అల్బేనియా వంటకాలను అల్బేనియా సంస్కృతి, భౌగోళికం, చరిత్ర విస్తృతంగా ప్రభావితంచేసాయి. దేశంలోని వివిధ ప్రాంతాలు ఆప్రాంతాలకే ప్రత్యేకమైన నిర్దిష్ట ప్రాంతీయ వంటకాలను ఆనందిస్తాయి. విభిన్నమైన స్థలాకృతి, వాతావరణం కారణంగా వంట సంప్రదాయాలు ముఖ్యంగా ఉత్తరం, దక్షిణం ప్రాంతాల మధ్య మారుతూ ఉంటాయి. ఇవి విస్తృతమైన మూలికలు, పండ్లు, కూరగాయలతో అద్భుతమైన ఆరోగ్యాభివృద్ధికి దోహదం చేస్తాయి.

అల్బేనియన్లు నిమ్మకాయలు, నారింజ, అత్తి పండ్లు వంటి అనేక రకాల పండ్లను ఉత్పత్తి చేసి ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఆలివ్‌లు అల్బేనియన్ వంటలో చాలా ముఖ్యమైన పాత్రపోషిస్తాయి. సుగంధ ద్రవ్యాలు, తులసి, లావెండరు, పుదీనా, ఒరేగానో, రోజ్మేరీ, థైం వంటి ఇతర మూలికలను విస్తారంగా ఉపయోగిస్తున్నారు. కూరగాయలలో వెల్లుల్లి, ఉల్లిపాయలు, మిరియాలు, బంగాళాదుంపలు, టమోటాలు, అలాగే అన్ని రకాల చిక్కుళ్ళు వంటి కూరగాయలు అధికంగా ఉపయోగిస్తారు.

మధ్యధరా సముద్రంలోని అడ్రియాటిక్, అయోనియన్ సముద్రతీరాల ప్రజలు చేపలు, క్రస్టేసియన్లు అల్బేనియా ఆహారంలో అంతర్భాగంగా ఉంటాయి. కాకపోతే, పౌల్ట్రీ, గొడ్డు మాంసం, పంది మాంసం కూడా సమృద్ధిగా ఉన్నప్పటికీ వేర్వేరు సెలవుదినాలు, మతపరమైన పండుగలలో క్రైస్తవులు, ముస్లింలకు గొర్రెపిల్లతో చేసిన ఆహారం సాంప్రదాయ మాంసాహారంగా ఉంటుంది.

తవే కోసి ("సోరెడ్ మిల్క్ క్యాస్రోల్") అల్బేనియా జాతీయ వంటకం. ఇందులో మందపాటి టార్ట్ వీల్ కింద కాల్చిన గొర్రె, బియ్యం ఉంటాయి. మరొక జాతీయ వంటకం ఫెర్గేసు మిరియాలు, టమోటాలు, కాటేజ్ జున్నుతో తయారు చేయబడుతుంది. పైట్ కూడా ప్రాచుర్యం పొందింది; బచ్చలికూర, జిజి (పెరుగు) లేదా మిష్ (నలుగకొట్టిన మాంసం) మిశ్రమాన్ని నింపి కాల్చిన పేస్ట్రీ.

అల్బేనియా 
బుకా మిశ్రీ (కార్న్‌బ్రెడ్) అల్బేనియన్ పట్టికలో ప్రధానమైనది

వేయించిన పిండితో చేసిన పెటుల్లా కూడా సాంప్రదాయవంటకం ప్రత్యేకత సంతరించుకుంది. దీనిని పొడి చక్కెర లేదా ఫెటా చీజ్, వివిధ రకాల పండ్ల జాంలతో అందిస్తారు. బహుళ క్రీప్ లాంటి పొరలు కలిగిన ఫ్లియాను క్రీంతో బ్రష్ చేసి సోర్ క్రీంతో వడ్డిస్తారు. బెర్లినర్ డోనట్స్ మాదిరిగానే క్రోఫ్నే జాం లేదా చాక్లెటుతో నిండి ఉంటుంది. దీనిని శీతాకాలంలో తరచుగా తింటారు.

అల్బేనియన్ జీవనశైలిలో కాఫీ ఒక అంతర్భాగం, అల్బేనియాలో ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తలసరి ఎక్కువ కాఫీ హౌస్‌లు ఉన్నాయి.

ఇంట్లో లేదా వెలుపల కేఫ్‌లు, బార్లు లేదా రెస్టారెంట్లలో కూడా టీ ఆనందించబడుతుంది. కాజ్ మాలి (సైడెరిటిస్ టీ) ఎంతో ప్రియమైనది. చాలా మంది అల్బేనియన్లకు రోజువారీ దినచర్యలో ఒక భాగంగా ఉంది. ఇది దక్షిణ అల్బేనియా అంతటా సాగు చేయబడుతుంది. దాని ఔషధ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. నిమ్మ, చక్కెర, పాలు లేదా తేనెతో కూడిన బ్లాక్ టీ కూడా ప్రాచుర్యం పొందింది

అల్బేనియా ద్రాక్ష దేశవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందింది. ఇది వేలాది సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. అల్బేనియా వైన్ ఉత్పత్తి సుదీర్ఘ, పురాతన చరిత్రను కలిగి ఉంది. ఇది పాత ప్రపంచ వైన్ ఉత్పత్తి దేశాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. అల్బేనియా వైన్ తీపి రుచితో ఉంటూ సాంప్రదాయమైన స్వదేశీ రకాలను కలిగి ఉంటుంది.

కళలు

అల్బేనియా 
1992 నుండి పరపంచవారసత్వ సంపదగా గుర్తించబడుతుందని భావించబడుతున్న బుట్రియంటు

అల్బేనియా కళాత్మక చరిత్ర ముఖ్యంగా ప్రాచీన, మధ్యయుగ ప్రజలు, సంప్రదాయాలు, మతాలచే ప్రభావితమైంది. పెయింటింగ్, కుండలు, శిల్పం, సెరామిక్సు, వాస్తుశిల్పాలను కలిగి ఉన్న మాధ్యమాలు, విభాగాలు ఇందులో విస్తారంగా ఉన్నాయి. ఇవన్నీ వివిధ ప్రాంతాలు, కాలంలో, శైలి, ఆకృతిలో గొప్ప వైవిధ్యాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

మధ్య యుగాలలో బైజాంటైన్, ఒట్టోమన్ సామ్రాజ్యం పెరుగుదల అల్బేనియా భూభాగంలో క్రైస్తవ, ఇస్లామిక్ కళలలో సంబంధిత పెరుగుదలతో పాటు దేశవ్యాప్తంగా వాస్తుశిల్పం (మొజాయిక్ల ఉదాహరణలలో)లో స్పష్టంగా కనబడుతుంది. శతాబ్దాల తరువాత సంభవించిన అల్బేనియన్ పునరుజ్జీవనం ఆధునిక అల్బేనియన్ సంస్కృతి విముక్తికి కీలకమని నిరూపించింది. సాహిత్యం, కళ వంటి రంగాలలో అపూర్వమైన పరిణామాలను చూసింది. అయితే కళాకారులు ఇంప్రెషనిజం, రొమాంటినిజానికి తిరిగి రావాలని కోరారు. ఏదేమైనా, ఒనుఫ్రి, కోలే ఇడ్రోమెనో, డేవిడ్ సెలెనికా, కోస్టాండిన్ షపతారకు, జోగ్రాఫీ సోదరులు ప్రముఖ అల్బేనియన్ కళలకు ప్రతినిధులుగా ఉన్నారు.

అల్బేనియా 
The Codices of Berat are eminently important for the global community and the development of ancient biblical, liturgical and hagiographical literature. In 2005, it was inscribed on the UNESCO's Memory of the World Register.

అల్బేనియా నిర్మాణాలు పురాతన కాలం నాటి వివిధ నాగరికతల వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అల్బేనియాలోని ప్రధాన నగరాలు కోటలోపలి నివాసాలు, మత, వాణిజ్య నిర్మాణాలను కలిగి ఉన్నాయి. భవన నిర్మాణ పద్ధతుల పరిణామంతో పట్టణ కూడలి పునఃరూపకల్పన చేయబడింది. ప్రస్తుత నగరాలు, పట్టణాలు వివిధ నిర్మాణ శైలులను ప్రతిబింబిస్తాయి. 20 వ శతాబ్దంలో కమ్యూనిస్టు యుగంలో అనేక చారిత్రక, పవిత్ర భవనాలు పడగొట్టబడ్డాయి.

అల్బేనియా అంతటా పురాతన వాస్తుశిల్పం కనిపిస్తుంది. ఇది బైల్లిస్, అమాంటియా, ఫీనిస్, అపోలోనియా, బట్రింట్, ఆంటిగోనియా, ష్కోడార్, డ్యూరెసులలో అధికంగా కనిపిస్తుంది. బైజాంటైన్ సామ్రాజ్యం సుదీర్ఘ పాలనను అల్బేనియన్లు పరిశీలిస్తే కుడ్యచిత్రాలు, ఫ్రెస్కోల అద్భుతమైన సంపదతో కోటలు, చర్చిలు, మఠాలను ప్రవేశపెట్టారని భావించవచ్చు. దక్షిణ అల్బేనియా నగరాలు, కోరే, బెరాట్, వోస్కోపోజో, జిజిరోకాస్టార్ పరిసరాలలో బహుశా స్పష్టమైన ఉదాహరణలు చూడవచ్చు. ఒట్టోమన్ వాస్తుశిల్పం పరిచయంలో మసీదులు, ఇతర ఇస్లామిక్ భవనాల అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా బెరాట్, జిజిరోకాస్టార్లలో వీటిని అధికంగా చూడవచ్చు.

అల్బేనియా 
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తాత్కాలిక జాబితాలో ఉన్న బాష్టోవె

19 వ శతాబ్దంలో హిస్టారినిజం, ఆర్ట్ నోయువే, నియోక్లానిజం విలీనం అయ్యింది. ఇందుకు కోరె ఉత్తమ ఉదాహరణగా ఉంది. 20 వ శతాబ్దం ఆధునిక ఇటాలియన్ శైలి వంటి కొత్త నిర్మాణ శైలులను తీసుకువచ్చింది. ఇందుకు టిరానాలో స్కందర్బెగు కూడలి, మినిస్ట్రీస్ వంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇది ష్కోడార్, వ్లోరే, సరండే, డ్యూరస్‌లలో కూడా ఉంది. అంతేకాకుండా ఇతర పట్టణాలు వివిధ సాంస్కృతిక లేదా ఆర్థిక ప్రభావాల ద్వారా వారి ప్రస్తుత అల్బేనియా-ప్రత్యేకమైన రూపాన్ని పొందాయి.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అల్బేనియా కమ్యూనిస్టు యుగంలో సోషలిస్ట్ క్లాసిజం వచ్చింది. ఈ కాలంలో అనేక సోషలిస్టు తరహా సముదాయాల చేత విశాలమైన రోడ్లు, కర్మాగారాలు నిర్మించబడ్డాయి. పట్టణ కూడళ్ళు పునఃరూపకల్పన చేయబడ్డాయి. ముఖ్యమైన చారిత్రాత్మక భవనాలు కూల్చివేయబడ్డాయి. ఆ శైలికి మదర్ థెరిసా కూడలి, పిరమిడ్ ఆఫ్ టిరానా, ప్యాలెస్ ఆఫ్ కాంగ్రెస్ మొదలైన నిర్మాణాలు ముఖ్యమైన ఉదాహరణలుగా ఉన్నాయి.

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో మూడు అల్బేనియన్ పురావస్తు ప్రదేశాలు చేర్చబడ్డాయి. వీటిలో బుట్రింటు పురాతన అవశేషాలు, మధ్యయుగ చారిత్రక కేంద్రాలు బెరాటు, జిజిరోకాస్టెరు, ఓహ్రిడ్ ప్రాంతాలు (2019 నుండి సాంస్కృతిక వారసత్వాన్ని ఉత్తర మాసిడోనియాతో పంచుకుంటున్నాయి) ఉన్నాయి. ఇంకా రాయల్ ఇల్లిరియన్ సమాధులు, అపోలోనియా అవశేషాలు, పురాతన యాంఫిథియేటర్ ఆఫ్ డ్యూరెస్, బాష్టోవే కోట అల్బేనియా తాత్కాలిక జాబితాలో చేర్చబడ్డాయి.

సంగీతం

అల్బేనియా 
The Albanian iso-polyphony is UNESCO's Masterpiece of the Oral and Intangible Heritage of Humanity.

అల్బేనియా జాతీయ గుర్తింపులో జానపద సంగీతం ప్రముఖ భాగం వహిస్తుంది. మొత్తం అల్బేనియా సంగీతంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. జానపద సంగీతాన్ని రెండు శైలీకృత సమూహాలుగా (ఉత్తర, దక్షిణ సంప్రదాయాలు) విభజించవచ్చు. ప్రధానంగా ఉత్తరప్రాంత ఘెగ్ బాణీ, దక్షిణప్రాంతంలో ల్యాబ్, టోస్క్ బాణీలు ఉన్నాయి. ఉత్తరప్రాంత సంగీతబాణీలు కఠినస్వరాలు పలికిస్తాయి. దక్షిణప్రాంత రిలాక్స్డు బాణీలు ఉండేవి.

ఈ సంగీతంలో అల్బేనియా చరిత్ర, సంస్కృతికి సంబంధించిన గౌరవం, ఆతిథ్యం, ద్రోహం, పగ సాంప్రదాయ ఇతివృత్తాలతో సహా అనేక పాటలు ఉంటాయి. అల్బేనియా జానపద సంగీతం మొదటి సంకలనంలో పారిసులోని ఇద్దరు హిమారియోటు సంగీతకారులు (నియో ముకా, కోనో అకాలి) అల్బేనియా సోప్రానో టెఫ్టా తాష్కో-కోనోతో కలిసి పనిచేశారు. ఈ ముగ్గురు కళాకారులచే ఆ సమయంలో అనేక గ్రాంఫోన్ సంకలనాలు రికార్డు చేయబడ్డాయి. చివరికి అల్బేనియా ఐసో-పాలిఫోనీని యునెస్కో అలౌకిక సాంస్కృతిక వారసత్వంగా గుర్తించటానికి దారితీసింది.

సమకాలీన కళాకారులలో రీటా ఓరా, బెబే రెక్షా, ఎరా ఇష్ట్రేఫి, దువా లిపా, అవా మాక్స్, బ్లీయోనా, ఎల్వానా గ్జాటా, ఎర్మోనెలా జాహో, ఇన్వా ములా వారి సంగీతానికి పరిఙానంతో అంతర్జాతీయ గుర్తింపును పొందారు, సోప్రానో ఎర్మోనెలా జాహోను కొందరు "ప్రపంచంలో అత్యంత ప్రశంసలు పొందిన సోప్రానో" అని వర్ణించారు. అల్బేనియా ఒపెరా గాయకుడు సైమిర్ పిర్గు 2017 గ్రామీ అవార్డుకు ఎంపికయ్యారు.

సంప్రదాయ దుస్తులు

అల్బేనియా 
ఫ్రెంచి కళాకారుడు అలెగ్జాండర్-గాబ్రియేల్ డికేంప్స్ నృత్యం చేస్తున్న " అల్బేనియ నృత్యకారుడు " (1835); నృత్యకారులు ధరించిన ఫస్టనెల్ల దుస్తులు;ఇవి అల్బేనియా సంప్రదాయ దుస్తులు

అల్బేనియాలోని సాంస్కృతిక, భౌగోళిక ప్రాంతాన్నింటికి వాటికే ప్రత్యేకమైన శైలి, పదార్థం, రంగు, ఆకారం, రూపకరణలో తేడాలతో ప్రత్యేకమైన దుస్తులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రత్యేక కార్యక్రమాలు, వేడుకల సమయాలలో ఎక్కువగా జాతిసంబంధిత ఉత్సవాలు, మతపరమైన సెలవులు, వివాహాల సందర్భంలో నృత్యం చేసే నృత్యబృందాలు తమ నృత్యప్రదర్శనకు జాతీయ దుస్తులు ధరిస్తారు. కొంతమంది వృద్ధులు తమ దైనందిన జీవితంలో సాంప్రదాయ దుస్తులను ధరిస్తూనే ఉన్నారు. దుస్తులు సాంప్రదాయకంగా తోలు, ఉన్ని, నార, జనపనార, పట్టు వంటి స్థానిక పదార్థాల నుండి తయారు చేయబడ్డాయి; అల్బేనియా వస్త్రాలు ఇప్పటికీ విస్తృతంగా పురాతన నమూనాలలో ఎంబ్రాయిడరీ చేయబడుతుంటాయి.

సాహిత్యం

అల్బేనియా 
గ్జాన్ బుజుకు వ్రాసిన మెషరీ సందేశం

(1555) అల్బేనియాలో అల్బేనియాభాషకు స్వతంత్ర శాఖ ఉంది. ఇది ఇండో-యూరోపియన్ భాషాకుటుంబాల నుండి వేరుచేయబడిన భాషగా ఉంది; ఇది ఐరోపాలో ఉనికిలో ఉన్న ఇతర సజీవభాషలతో అనుసంధానించబడలేదు. దీని మూలం నిశ్చయంగా తెలియనప్పటికీ ఇది పురాతన పాలియో-బాల్కన్ భాష నుండి ఉద్భవించిందని విశ్వసిస్తున్నారు.

సాంస్కృతిక పునరుజ్జీవనం ఆరంభంలో అల్బేనియాభాష అభివృద్ధి ద్వారా చర్చి గ్రంథాలు, ప్రచురణలు వ్యక్తీకరించబడ్డాయి. ప్రధానంగా అల్బేనియా ఉత్తరప్రాంతం ఉన్న కాథలిక్ ప్రాంతంగానూ, దక్షిణప్రాంతంలో ఆర్థడాక్సు ప్రాంతంగానూ ఉన్నాయి. ప్రొటెస్టంటు సంస్కరణలు స్థానిక భాష, సాహిత్య సంప్రదాయం అభివృద్ధికి ఆశలు రేకెత్తించాయి. మతాధికారి జిజోన్ బుజుకు కాథలికు ప్రార్థనలను అల్బేనియా భాషలోకి తీసుకురావడం (మార్టిన్ లూథర్ జర్మనీ భాష కొరకు చేసినట్లు) అల్బేనియా సాహిత్యం పునరుద్ధరణకు బాటలు వేసింది. జిజోన్ బుజుకు రాసిన మేషరి (ది మిస్సల్) 1555 లో ప్రచురించబడింది. మధ్య యుగాలలో అల్బేనియా వ్రాసిన మొదటి సాహిత్య రచనలలో ఇది ఒకటి. అల్బేనియాభాష పూర్వ సంప్రదాయాన్ని భాషాశుద్ధి చేసి, స్థిరీకరించబడిన ఆర్థోగ్రఫీ రూపొందించబడిన ఈ సాహిత్య సంప్రదాయం బాగా అర్థం కాలేదు. అయినప్పటికీ బుజుకుకు ముందు డేటింగ్ చేసిన కొన్ని విచ్ఛిన్నమైన ఆధారాలు ఉన్నాయి. ఇది అల్బేనియాలో కనీసం 14 వ శతాబ్దం నుండి వ్రాయబడిందని భావిస్తున్నారు. పురాతన ఆధారాలు సా.శ. 1332 నుండి ఫ్రెంచి డొమినికన్ గిల్లెల్మస్ అడే, ఆంటివారి ఆర్చ్ బిషపు లాటిన్ నివేదికలో అల్బేనియన్లు తమ పుస్తకాలలో లాటిన్ అక్షరాలను ఉపయోగించారని అయినప్పటికీ వారి భాష లాటిన్ కంటే చాలా భిన్నంగా ఉందని రాశారు. ఇతర ముఖ్యమైన ఉదాహరణలు: 1462 లో అల్బేనియా భాషలో లాటిన్ వచనంలో డ్యూరెస్ బిషప్ పాల్ ఎంగ్జల్లి వ్రాసిన బాప్టిజం ఫార్ములా (అంటె పాగెసోంట్ ప్రీమెనిట్ అటిట్ ఎట్ బిరిట్ ఎట్ స్పెర్టిట్ సెనిట్); అల్బేనియా గుండా ప్రయాణించిన జర్మనీ పౌరుడైన ఆర్నాల్డ్ వాన్ హార్ఫు సేకరించిన 1497 నాటి అల్బేనియా పదాల పదకోశం. 15 వ శతాబ్దపు మాథ్యూ సువార్త గ్రీకు అక్షరాలతో అలేనియాభాషలో వ్రాయబడింది.

అల్బేనియా 
పరాష్కేవి కిరియాజీ గురువు, స్త్రీవాది (1880-1970)

ఈ శతాబ్దాల నుండి వచ్చిన అల్బేనియా రచనలలో మత గ్రంథాలు మాత్రమే కాక చారిత్రక కథనాలు కూడా ఉన్నాయని మానవతావాది మారిన్ బార్లేటి ప్రస్తావించారు. ఆయన 1504 నాటి తన సీజ్ ఆఫ్ ష్కోడార్ (రెరెతిమి ఐ ష్కోడ్రేస్) పుస్తకంలో వ్యవహారిక భాషలో వ్రాసిన వృత్తాంతాలను ప్రసిద్ధ వ్యక్తుల జీవిత చరిత్రలు చెప్పినట్లు ధ్రువీకరించబడింది. 1508 నుండి స్కాండర్బెగు హిస్టోరియా డి వీటా ఎట్ జెస్టిస్ స్కాండర్బెగి ఎపిరోటారం ప్రిన్సిపాలిస్ (హిస్టరీ ఆఫ్ స్కాండర్బెగ్) స్కాండర్బెగ్ చరిత్ర ఇప్పటికీ స్కాండర్బేగ్ అధ్యయనాలకు పునాదిగా ఉంది. ఇది అల్బేనియా సాంస్కృతిక నిధిగా పరిగణించబడుతుంది. ఇది అల్బేనియా జాతీయ స్వీయ-స్పృహ ఏర్పడటానికి కీలకపాత్ర వహించింది.

16 వ - 17 వ శతాబ్దాలలో లెకే మాట్రాంగా రాసిన 1592 నాటి కాటేచిజం (ఎ బెస్ట్యూం క్రిష్టెరె) (క్రిస్టియన్ బోధనలు), 1618 నాటి (డోక్త్రినా ఎ క్రిష్టెరె) (ది క్రిస్టియన్ సిద్ధాంతం), 1621 లో అసలైన అల్బేనియా గద్యరూపంలో వ్రాయబడిన ప్జెట్ బుద్ర్ బుది రచన (రిత్యుయేల్ రోమనం), ఫ్రాంగ్ బర్ది కవిత్వరూపంలో రాసిన జార్జ్ కాస్ట్రియాట్ (1636) కు క్షమాపణ ప్రసిద్ధి చెందాయి. అలాగే ఫ్రాంగ్ బర్ది ఒక నిఘంటువు, జానపద కథనాలను కూడా ప్రచురించాడు. ప్జెటర్ బొగ్దానీ వ్రాసిన ధర్మశాస్త్ర-తాత్విక ఒప్పందం కునియస్ ప్రవచనం (1685) ప్రచురించబడింది. 20 - 21 వ శతాబ్దాలలో అత్యంత ప్రసిద్ధ అల్బేనియా రచయిత బహుశా ఇస్మాయిల్ కదారే. సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహీతగా ఆయన చాలాసార్లు ప్రతిపాదించబడ్డాడు.

చలనచిత్రాలు

అల్బేనియా 
Albanian-American actress Eliza Dushku produced the documentary Dear Albania with a crew from Travel Channel and Lonely Planet, promoting tourism in Albania.

20 వ శతాబ్దంలో సినిమాటోగ్రఫీ ప్రాచుర్యం పొందింది. ష్కోడారు, కోరే నగరాలలో విదేశీ సినిమాలు, డాక్యుమెంటరీలు ప్రదర్శించబడ్డాయి. అల్బేనియాలో మొట్టమొదటిసారిగా బహిరంగగా ప్రదర్శించబడిన " పాడీ ది రిలయబుల్ " కామిక్ స్టోరీ గురించి స్వల్పంగా మాత్రమే గుర్తింపు పొందింది.

మొదటి అల్బేనియన్ చిత్రాలు అధికంగా డాక్యుమెంటరీలు చిత్రీకరించబడ్డాయి; మొదటి డాక్యుమెంటరీ చిత్రంగా 1908 లో అల్బేనియా వర్ణమాలను రూపొందించిన మొనాస్టిరు కాంగ్రెసు గురించి చిత్రీకరించబడింది. కమ్యూనిజపాలనా కాలంలో అల్బేనియా ఫిల్మ్ ఇన్స్టిట్యూటు స్థాపించబడి తరువాత " కినోస్టూడియో షికిరియా ఇ రే " అని పిలువబడింది. సోవియట్ సహాయంతో స్థాపించబడిన ఇది అధికంగా యుద్ధకాల పోరాటాల ప్రచారం మీద దృష్టి సారించింది. 1945 తరువాత కమ్యూనిస్టు ప్రభుత్వం " 1952 లో కినోస్టోడియో షికిపారియా ఇ రే "ను స్థాపించింది. దీని తరువాత మొదటి అల్బేనియా ఇతిహాస చిత్రం గ్రేట్ వారియర్ స్కందర్బెగు చిత్రీకరణకు సోవియట్ కళాకారులు సహకరించారు. ఇది అల్బేనియా జాతీయ హీరో స్కందర్బెగ్ జీవితాన్ని, పోరాటాన్ని వివరిస్తుంది. 1954 కేన్స్ చలన చిత్రోత్సవంలో ఈ చిత్రానికి అంతర్జాతీయ బహుమతి లభించింది.

1990 నాటికి సుమారు 200 సినిమాలు నిర్మించబడ్డాయి. అల్బేనియాలో 450 కి పైగా థియేటర్లు ఉన్నాయి. 1990 లలో కమ్యూనిజం పతనం తరువాత ఆర్థిక పరివర్తనతో, కినోస్టూడియో ప్రైవేటీకరించబడింది. కొత్త నేషనల్ సెంటర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ స్థాపించబడింది. నగరాలు ఎక్కువగా అమెరికా సినిమాలను చూపించే ఆధునిక సినిమా థియేటర్లను నిర్మించాయి. 2003 లో టిరానా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభించబడింది. ఇది దేశంతో పాటు బాల్కన్లలో ప్రధాన, అతిపెద్ద చలన చిత్రోత్సవంగా మారింది. డ్యూరెస్ " ఇంటర్నేషనల్ ఫిల్మ్ సమ్మర్‌ఫెస్ట్ ఆఫ్ డ్యూరస్‌ "కు ఆతిథ్యం ఇస్తుంది. ఇది దేశంలో రెండవ అతిపెద్ద అంతర్జాతీయ చలన చిత్రోత్సవం. ఇది ప్రతి సంవత్సరం ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబరు ఆరంభంలో డుర్రేస్ యాంఫిథియేటరులో జరుగుతుంది.

అల్బేనియా చిత్ర దర్శకులలో అండమియా మురాటాజ్, బెసిం సహతియు, షాన్‌ఫైజ్ కెకో, ధిమితార్ అనగ్నోస్టి, కుజ్తిమ్ కష్కు, లుల్జేటా హొక్ష, సైమ్ కోకోనా, సైమిర్ కుంబారో, క్రిస్టాక్ మిట్రో, లియోన్ కఫ్జెజి, గువెర్జీ జి ఖ్యాతిగడించారు. అల్బేనియాలోని ప్రముఖ నటులలో నిక్ జెలీలాజ్, క్లెమెంట్ టినాజ్, మాసిలా లూషా, బ్లెరిమ్ డెస్టాని, అలెక్సాండర్ మొయిసియు, టింకా కుర్తి, ప్జెటార్ మలోటా, సాండెర్ ప్రోసి, మార్గరీటా జెపా ఉన్నారు.

అల్బేనియన్ ప్రవాసులలో అల్బేనియా-అమెరికన్లు ఎలిజా దుష్కు, జిం, జాన్ బెలూషి, కొసావో-అల్బేనియన్లు బెకిమ్ ఫెహ్మియు, ఆర్టా డోబ్రోషి, టర్కిష్-అల్బేనియన్లు బారిష్ అర్డుక్ వంటి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన నటులుగా ఉన్నారు.

క్రీడలు

అల్బేనియా 
Lorik Cana is Albania's most capped player of all time. He captained the French Olympique de Marseille, as well as the Albanian national team.

అల్బేనియా 1972 లో తొలిసారిగా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంది. దేశం 2006 లో తన వింటర్ ఒలింపిక్ క్రీడలకు అరంగేట్రం చేసింది. తరువాతి నాలుగు ఆటలకు అల్బేనియా దూరమైంది. వాటిలో రెండు (1980 - 1984 మద్యకాలంలో దేశంలో సంభవించిన వలసల కారణంగా ఉన్నాయి. కాని బార్సిలోనాలో 1992 లో నిర్వహించబడిన క్రీడలలో తిరిగి పాల్గొన్నాయి. అప్పటి నుండి అల్బేనియా అన్ని ఆటలలో పాల్గొంది. అల్బేనియా సాధారణంగా ఈత, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, షూటింగు, రెజ్లింగ్ వంటి ఈవెంట్లలో పోటీపడుతుంది. 1972 నుండి అల్బేనియా జాతీయ ఒలింపిక్ కమిటీ ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 1987 నుండి సిరియాలో నిర్వహించబడిన మధ్యధరా క్రీడలలో అల్బేనియా పాల్గొంది. అల్బేనియా అథ్లెట్లు 1987 - 2013 వరకు మొత్తం 43 (8 బంగారు, 17 రజత 18 కాంస్య) పతకాలు సాధించారు.

అల్బేనియా 
సెంట్రల్ టిరానాలోని ఎయిర్ అల్బేనియా స్టేడియం

అల్బేనియాలో ప్రసిద్ధ క్రీడలలో ఫుట్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్, స్విమ్మింగ్, రగ్బీ, జిమ్నాస్టిక్స్ ఉన్నాయి. అల్బేనియాలో ఫుట్‌బాల్ అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడగా ఉంది. దీనిని ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ అల్బేనియా నిర్వహిస్తుంది. ఇది 1930 లో సృష్టించబడింది. ఇది ఫిఫా, యు.ఇ.ఎఫ్.ఎ.లో సభ్యత్వం కలిగి ఉంది. 20 వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తర నగరమైన ష్కోడారు నివాసులు ఒక క్రైస్తవ మిషన్లో విద్యార్థులు ఆడుతున్న వింత ఆటను చూసి ఆశ్చర్యపోయారు. అదే ఫుట్బాల్ క్రీడగా అల్బేనియాలో మొదటిసారిగా ప్రవేశించింది.

2017 లో ప్రపంచంలో 51 వ స్థానంలో ఉన్న అల్బేనియా జాతీయ ఫుట్‌బాల్ జట్టు ( 2015 ఆగస్టు 22 ఆగస్టున 22 వ స్థానంలో ఉంది) 1946 బాల్కన్ కప్, మాల్టా రోత్మన్స్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ 2000 లను గెలుచుకుంది. కాని యు.ఇ.ఎఫ్.ఎ యూరో వరకు ఏ పెద్ద యు.ఇ.ఎఫ్.ఎ లేదా ఫిఫా టోర్నమెంట్‌లోనూ పాల్గొనలేదు. 2016 ఖండాంతర టోర్నమెంటులో, ఒక ప్రధాన పురుషుల ఫుట్బాల్ టోర్నమెంటులో అల్బేనియా తొలిసారి కనిపించింది. 2016 జూన్ 19 న జరిగిన యు.ఇ.ఎఫ్.ఎ యూరో 2016 మ్యాచిలో రొమేనియాను 1-0 తేడాతో ఓడించినప్పుడు అల్బేనియా ఒక ప్రధాన టోర్నమెంటులో తమ మొట్టమొదటి గోల్ సాధించింది. ఐరోపా ఛాంపియన్షిప్‌లో తొలి విజయాన్ని సాధించింది. దేశంలోని స్కాండర్బ్యూ, కెఎఫ్ టిరానా, డైనమో టిరానా, పార్టిజాని, వల్లాజ్నియా అత్యంత విజయవంతమైన ఫుట్బాల్ క్లబ్బులుగా ఉన్నాయి.

అల్బేనియన్లకు అత్యంత విజయవంతమైన క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ ఒకటి. యూరోపియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో జాతీయ జట్టు పతకాలు గెలుచుకుంది. యూరోపియన్ ఛాంపియన్‌షిపుతో కలిపి మిగిలిన అంతర్జాతీయ పోటీలలో అల్బేనియా వెయిట్‌లిఫ్టర్లు మొత్తం 16 పతకాలు సాధించారు. వాటిలో 1 బంగారం, 7 రజతం, 8 కాంస్యాలు ఉన్నాయి. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్పులో అల్బేనియా వెయిట్ లిఫ్టింగ్ జట్టు 1972 లో ఒక స్వర్ణం, 2002 లో ఒక రజతం, 2011 లో కాంస్య పతకం సాధించింది.

విదేశీ ఉపాధి

చారిత్రాత్మకంగా అల్బేనియా ప్రజలు దక్షిణ ఐరోపా అంతటా అనేక ప్రాంతాలలో అనేక సంఘాలను స్థాపించారు. వివిధ సామాజిక-రాజకీయ ఇబ్బందుల నుండి లేదా అల్బేనియా మీద ఒట్టోమన్ ఆక్రమణ నుండి తప్పించుకోవడానికి అల్బేనియా విదేశీ ఉపాధిదారులు (డయాస్పోరా) మధ్య యుగాల చివరికాలంలో ఇటలీ వంటి ప్రదేశాలకు, ముఖ్యంగా సిసిలీ, కాలాబ్రియా, గ్రీస్ వంటి ప్రాంతాలకు వలసపోవడం ప్రారంభించారు. కమ్యూనిజం పతనం తరువాత పెద్ద సంఖ్యలో అల్బేనియన్లు ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇటలీ, స్కాండినేవియా, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డం, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలకు వలసపోయారు. పొరుగు భూభాగాలైన ఉత్తర మాసిడోనియా, తూర్పు మాంటెనెగ్రో, కొసావో, దక్షిణ సెర్బియాలో అల్బేనియాకు చెందిన చిన్న సమూహం ఉన్నారు. కొసావోలో అల్బేనియన్లు దేశంలో అతిపెద్ద జాతి సమూహంగా ఉన్నారు. మొత్తంగా అల్బేనియా భూభాగంలోని మొత్తం జనాభా కంటే విదేశాలలో నివసిస్తున్న అల్బేనియా జాతి ప్రజలసంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా.

ఇవీ చూడండి

మూలాలు



Tags:

అల్బేనియా పేరువెనుక చరిత్రఅల్బేనియా చరిత్రఅల్బేనియా భౌగోళికంఅల్బేనియా నిర్వహణా విభాగాలుఅల్బేనియా ఆర్ధికరంగంఅల్బేనియా మౌలికవనరులుఅల్బేనియా గణాంకాలుఅల్బేనియా సంస్కృతిఅల్బేనియా ఇవీ చూడండిఅల్బేనియా మూలాలుఅల్బేనియాఆగ్నేయంఇటలీఉత్తర మేసిడోనియాఐరోపాకొసావోగ్రీస్మాంటెనెగ్రో

🔥 Trending searches on Wiki తెలుగు:

మొలలుభారత ఆర్ధిక వ్యవస్థహోళీతెలుగు నెలలువేటూరి ప్రభాకరశాస్త్రిఆటలమ్మఅశ్వగంధవినాయక్ దామోదర్ సావర్కర్నడుము నొప్పిత్యాగరాజుచిత్రదర్శిని(Kaleidoscope)మహిళావరణంసావిత్రిబాయి ఫూలేబి.ఆర్. అంబేడ్కర్స్టెతస్కోప్తెనాలి రామకృష్ణుడుపురాణాలుకాళోజీ నారాయణరావుబ్రాహ్మణ గోత్రాల జాబితావిభక్తిఉత్పలమాలవస్తు, సేవల పన్ను (జీఎస్టీ)గంగా నదిబద్దెనసంభోగంభూ కేంద్రక సిద్ధాంతంసింహరాశినెమలివారసుడుఅధిక ఉమ్మనీరుఅనూరాధ నక్షత్రముదగ్గుబాటి వెంకటేష్కృష్ణ గాడి వీర ప్రేమ గాథఫిబ్రవరిభారత జాతీయ కాంగ్రెస్మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంప్రొజెక్టర్అనుపమ పరమేశ్వరన్ఆజం జాహి మిల్స్, వరంగల్సంత్ సేవాలాల్ మహరాజ్తెలంగాణకృష్ణా నదివిశ్వబ్రాహ్మణవేమన శతకముఅంటువ్యాధివాల్మీకిశాసనసభ సభ్యుడుపక్షవాతంతిథిఆంధ్రప్రదేశ్ గవర్నర్లుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుతెలంగాణ ఆసరా పింఛను పథకంభారతీయ సంస్కృతివిద్యా హక్కు చట్టం - 2009పాఠశాలలయ (నటి)సర్ జోసెఫ్ జాన్ థామ్సన్వాతావరణంమహామృత్యుంజయ మంత్రంవెంకీ అట్లూరిభారతీయ శిక్షాస్మృతి2022పనసవేపపర్యావరణంగంగిరెద్దులాటలురాం చరణ్ తేజఅతిసారంకాకతీయులుఝాన్సీ లక్ష్మీబాయివిజయనగర సామ్రాజ్యంపింగళి సూరనామాత్యుడుబృహదీశ్వరాలయంపాకిస్తాన్చిప్కో ఉద్యమంమండల ప్రజాపరిషత్ఎండోమెట్రియమ్🡆 More