జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్

జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్ (ఆంగ్లం: Javier Pérez de Cuéllar; 1920 జనవరి 19 – 2020 మార్చి 4) ఐక్యరాజ్య సమితికి 5వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పెరూకు చెందిన దౌత్యవేత్త.

ఇతడు 1920, జనవరి 19న పెరూ రాజధాని నగరం లిమాలో జన్మించాడు.

జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్
జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్

డిక్యుల్లర్ 1940లో పెరూ విదేశాంగ మంత్రిగా, 1944లో దౌత్య సర్వీసులో పనిచేసాడు. ఆ తరువాత ఫ్రాన్స్ లోని పెరూ దౌత్య కార్యాలయంలో కార్యదర్శిగా వ్యవహరించనాడు. ఆ తదుపరి కాలములలో డిక్యుల్లర్ స్విట్జర్లాండ్, సోవియట్ యూనియన్ (నేటి రష్యా), పోలాండ్, వెనుజులాలలో రాయబారిగా పనిచేసాడు. 1946లో లండన్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తొలి సమావేశపు కాలములో అతడు పెరూ నుంచి జూనియర్ సభ్యుడిగా హాజరైనాడు. 1973, 1974లలో భద్రతా మండలిలో తన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 1974 జూలైలో సైప్రస్ సమస్య వివాదించు కాలములో డుక్యుల్లర్ భద్రతా మండలి అధ్యక్షుడిగా ఉన్నాడు. 1975, సెప్టెంబర్ 18 నాడు అతడికి సైప్రస్‌లో ప్రధాన కార్యదర్శి యొక్క ప్రధాన దూతగా నియమించారు. ఈ పదవిలో అతడు 1977 డిసెంబర్ వరకు కొనసాగినాడు. 1979, ఫిబ్రవరి 27న ఐక్యరాజ్య సమితి యొక్క ఉప ప్రధాన కార్యదర్శిగా ప్రత్యేక రాజకీయ అంశం కొరకు నియమించబడినాడు. అప్ఘనిస్తాన్ సమస్యపై కూడా ప్రధాన కార్యదర్శి యొక్క ప్రత్యేక దూతగా వ్యవహరించే అవకాశం లభించింది. 1981, డిసెంబర్ 31 న డిక్యుల్లర్ ఐక్యరాజ్య సమితి యొక్క 5 వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు కుర్ద్ వాల్దీమ్ నుంచి స్వీకరించాడు. 1986లో అతడు తిరిగి రెండో పర్యాయము ఐరాస ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై 1991, డిసెంబర్ 31 వరకు పదవిలో కొనసాగినాడు. రెండు సందర్భాల్లోను కూడా డిక్యుల్లర్ ఫాక్లాండ్ దీవుల సమస్యపై బ్రిటన్, అర్జెంటీనాల మధ్య మధ్యవర్తిగా నిర్వర్తించాడు. ఆ విధంగా మధ్య అమెరికాలో శాంతిసాధనకు దోహదపడినాడు. ఇతని తరువాత బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. డిక్యుల్లర్ 1995లో పెరూ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో అల్బెర్టో ఫుజుమొరితో పోటీపడి పరాజయం పొందినాడు.

బయటి లింకులు

Tags:

1920ఐక్యరాజ్య సమితిజనవరి 19పెరూ

🔥 Trending searches on Wiki తెలుగు:

నాని (నటుడు)ఉత్తరాషాఢ నక్షత్రముకలబందఉలవలుఎస్. ఎస్. రాజమౌళిట్రావిస్ హెడ్జాన్ నేపియర్ఆస్ట్రేలియామల్లు రవిరాకేష్ మాస్టర్మండల ప్రజాపరిషత్శిల్పా షిండేభారత జాతీయ కాంగ్రెస్వికలాంగులువిజయవాడవ్యతిరేక పదాల జాబితావరిబీజంవర్షందక్షిణామూర్తి ఆలయంసింగిరెడ్డి నారాయణరెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురఘురామ కృష్ణంరాజువిద్యుత్తుజ్యోతీరావ్ ఫులేతీహార్ జైలుపోక్సో చట్టంమమితా బైజుయాదవకరోనా వైరస్ 2019సింధు లోయ నాగరికతరామాయణంపక్షవాతంరఘుపతి రాఘవ రాజారామ్సూర్యుడుభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలునాగార్జునసాగర్యోనిలగ్నంఆది పర్వములవ్ స్టోరీ (2021 సినిమా)వందేమాతరంహస్తప్రయోగంభారత జాతీయ ఎస్సీ కమిషన్సజ్జా తేజమేషరాశిసుహాసిని (జూనియర్)ఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితాదత్తాత్రేయటి.జీవన్ రెడ్డితెలుగు సినిమాలు డ, ఢడిస్నీ+ హాట్‌స్టార్భారతీయ తపాలా వ్యవస్థతిరుమలఆంధ్రజ్యోతిబ్రిటీష్ ఇండియాలోని ప్రెసిడెన్సీలు, ప్రావిన్సులుకే. కేశవరావుకామసూత్రశ్రీముఖిమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిమిథునరాశిసూర్య (నటుడు)సమ్మక్క సారక్క జాతరవాతావరణంవిజయశాంతికిరణ్ రావుకందుకూరి వీరేశలింగం పంతులుభారత ఆర్ధిక వ్యవస్థఫ్లిప్‌కార్ట్శ్రీలీల (నటి)తట్టురామప్ప దేవాలయంఅవశేషావయవముతెలంగాణహోళీపర్యాయపదంతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఏప్రిల్🡆 More