పోక్సో చట్టం

పోక్సో చట్టం (POCSO Act) అనేది లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే భారతీయ చట్టం.

బాలబాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (Protection of Children from Sexual Offenses Act, 2011) ని 2012 మే 22న భారత పార్లమెంటు ఆమోదించింది, ఇది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, 2012గా 2012 నవంబరు 14 నుండి అమలులోకి వచ్చింది. భారతదేశంలోని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక మార్గదర్శకాన్ని ఆమోదించింది. చట్టానికి అనుగుణంగా ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను కూడా నవంబరు 2012లో నోటిఫై చేయడంతో చట్టం అమలుకు సిద్ధమైంది. మరింత కఠినమైన చట్టాల కోసం అనేక డిమాండ్లు ఇంకా ఉన్నాయి.

ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, 2012
లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం
Enacted byభారత పార్లమెంటు
Date enacted2012

ప్రపంచంలోనే అత్యధిక పిల్లల జనాభా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సంఖ్య 472 మిలియన్లు కాగా ఇందులో 225 మిలియన్ల మంది బాలికలు ఉన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం దేశంలోని బాలల రక్షణ భారతీయ పౌరులకు హామీ ఇవ్వబడింది.

పోక్సో చట్టం 2012 ముందు అమలులో ఉన్న చట్టాలు

పోక్సో చట్టం 2012 ముందు, గోవా చిల్డ్రన్ యాక్ట్ 2003 అనేది పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన ఏకైక చట్టం. బాలలపై లైంగిక వేధింపుల నేరాలు భారతీయ శిక్షాస్మృతి 1860లోని సెక్షన్ల కిందకు వచ్చేవి.

అవి..

  • ఐ.పి.సి. (1860) సెక్షన్ 375- అత్యాచారం
  • ఐ.పి.సి. (1860) సెక్షన్ 354- దౌర్జన్యం, స్త్రీ అణకువకు భంగం కలిగించడం
  • ఐ.పి.సి. (1860) సెక్షన్ 377- అసహజ నేరం
  • ఐ.పి.సి. సెక్షన్ 511- నేరాలు చేయటానికి ప్రయత్నించడం

అయితే, ఇవి పిల్లలను సమర్థవంతంగా రక్షించలేకపోయేవి. అందుకని ప్రభుత్వం సమగ్రమైన చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించింది. పిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవడం కోసం పోక్సో చట్టాన్ని రూపొందించింది. వికృత చేష్టలతో పిల్లలు జీవించే హక్కును హరించిన వారికి ఈ చట్టం కఠినంగా శిక్షిస్తుంది. శారీరకంగా, మానసికంగా వారిని వేధిస్తే నిందుతులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. 2012లో వచ్చిన ఫోక్సో చట్టం 18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. వారిపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్షలతో పాటు మరణశిక్ష కూడా విధిస్తారు.

మూలాలు

బాహ్య లంకెలు

Tags:

భారత పార్లమెంట్మహిళా శిశు అభివృద్ధి శాఖ

🔥 Trending searches on Wiki తెలుగు:

రాహుల్ గాంధీనరసింహ (సినిమా)రావణుడురాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంభీమా (2024 సినిమా)అహోబిలంపాముకులంఇన్‌స్టాగ్రామ్శుభాకాంక్షలు (సినిమా)అష్టదిగ్గజములుపక్షవాతంశ్రీనాథుడుపవన్ కళ్యాణ్అండాశయముఊరు పేరు భైరవకోనవృషభరాశిశ్రీదేవి (నటి)ఉత్పలమాలవాతావరణంసంక్రాంతిజాతీయ విద్యా విధానం 2020థామస్ జెఫర్సన్భారతదేశ రాజకీయ పార్టీల జాబితాభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.అతిసారంవాల్మీకిరమణ మహర్షిభారతదేశంలో మహిళలుక్రికెట్పాలకొల్లు శాసనసభ నియోజకవర్గంశ్రీశైల క్షేత్రంగ్రామ పంచాయతీభారత రాష్ట్రపతికామాక్షి భాస్కర్లపంచకర్ల రమేష్ బాబుశివుడుతెలుగు సినిమాలు 2024కార్తెమాధవీ లతశాసన మండలిశివ కార్తీకేయన్కాకినాడభారత రాజ్యాంగ పీఠికఝాన్సీ లక్ష్మీబాయిఉపమాలంకారంకుంభరాశిసజ్జల రామకృష్ణా రెడ్డిపరిపూర్ణానంద స్వామివంగవీటి రంగాగూగ్లి ఎల్మో మార్కోనిశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఅమలాపురం లోక్‌సభ నియోజకవర్గంరైతుమహాభారతంకంప్యూటరునన్నయ్యభారత ప్రభుత్వంభారత జాతీయ కాంగ్రెస్మొదటి ప్రపంచ యుద్ధం73 వ రాజ్యాంగ సవరణచరాస్తికర్ర పెండలంక్రిక్‌బజ్నారా లోకేశ్రోహిత్ శర్మపొడుపు కథలురామ్ పోతినేనిచంద్రయాన్-3బ్రాహ్మణ గోత్రాల జాబితానితీశ్ కుమార్ రెడ్డిభారతదేశంలో కోడి పందాలుఉత్తరాభాద్ర నక్షత్రముప్రశాంత్ నీల్హర్భజన్ సింగ్కాశీ🡆 More