కొత్తిమీర నూనె

కొత్తిమీర నూనె లేదా కొత్తిమీర ఆకు నూనె ఒక ఆవశ్యక నూనె.కొత్తిమీర నూనె వలన పలు ప్రయోజనాలు ఉన్నాయి.కొత్తిమీర విత్తనాలను ధనియాలు అంటారు.

కొత్తిమీర తాజాపచ్చి ఆకులను, ధనియాలను వంటలలో విరివిగా ఉపయోగిస్తారు. కొత్తిమీర ఆహాల్లదకర మైన సువాసన, ఘాటైన ప్రత్యేకమైన రుచిని వంటలకు ఇస్తుంది.ధనియాలు జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి.

కొత్తిమీర
కొత్తిమీర నూనె
శాస్త్రీయ వర్గీకరణ edit
Kingdom: Plantae
Clade: Tracheophytes
Clade: Angiosperms
Clade: Eudicots
Clade: Asterids
Order: Apiales
Family: Apiaceae
Genus: Coriandrum
Species:
C. సటివం
Binomial name
Coriandrum సటివం

కొత్తిమీరమొక్క

కొత్తి మీర గుబురుగా పెరుగు మొక్క.ఇది ఆపియేసియే /అంబిల్లిఫెరే కుటుంబానికి చెందిన మొక్క.కొత్తిమీర వృక్షశాస్త్రపేరు కోరియండమ్ సటివమ్ (Coriandrum sativum L) ఇది ఓషద గుణాలు వున్న మొక్క.ఆకులు, విత్తనాలు/కాయలు, కాండం వేర్లు ఆన్ని వైద్యపరమైన ప్రయోజనాలు ఉన్న మొక్క.మొక్క అన్నీ భాగాలు ఆహార యోగ్యం కావున ఆకులను, విత్తనాలను మొత్తం మొక్కను వంటల్లో విరివిగా ఉపయోగిస్తారు. ఇది ఏకవార్షిక మొక్క. మొక్క ఒక మీటరు ఎత్తువరకు పెరుగును.

ఆవాసం

ఇది యూరఫ్, పశ్చిమ ఆసియాకు చెందిన మొక్కగా భావిస్తారు.ఆతరువాత ఉత్తర అమెరికాలో విస్తరించింది. ప్రపంచమంతా ఈ పంటను సాగు చేస్తున్నారు.కొత్తిమీరలో పలురకాలైన జాతులు ఉన్నాయి.

నూనెను సంగ్రహించు విధానం

కొత్తిమీర ఆకులనుండి లేదా ధనియాలనుండి నూనెను స్టీము డిస్టిలేసన్ (ఆవిరి స్వేదన క్రియ) పద్ధతి ద్వారా సంగ్రహిస్తారు. డిస్టీలరు అను ఒక స్టీల్ పాత్రలో దాల్చిన చెక్క పొడిని లేదా ఆకుల పొడిని తీసుకుని, ఆ పాత్రను అడుగునుండిస్టీము/నీటి ఆవిరిని పంపిస్తారు. నీటిఆవిరి /స్టీము ధనియాలు, లేదా ఆకుల ద్వారా పయనించు సమయంలో, వాటిలోని నూనెను ఆవిరిగా మార్చును.నీటి ఆవిరి,, నూనె ఆవిరులు డిస్టీలరు పైభాగాన వున్న ఒక గొట్టం ద్వారా కండెన్సరుకు వెళ్ళును. కండెన్సరులో ఆవిరి గొట్టం వెలుపలి భాగంలో చల్లని నీరు ప్రవహించు ఏర్పాటు వుండును. అక్కడ నీటి ఆవిరి, దాల్చిన నూనె ద్రవీకరణ చెంది, సంగ్రహణ పాత్రలో చేరును. సంగ్రహణ పాత్రలో జమ అయిన నూనె, నీటి మిశ్రమాన్ని కొన్ని గంటలు కదఫా కుండా వుంచాలి. అప్పుడు నూనె, నీరు వేరు వేరు పొరలుగా/మట్టాలుగా ఏర్పడును. నూనె సాంద్రత నీటి కన్న తక్కువ కావున పైభాగాన నూనె, ఆడుగు భాగాన నీరు చేరును, నూనెను వేరు పరచి, వడబోసీ భద్ర పరుస్తారు.పాత్రలో తీసుకున్న పరిమాణాన్ని బట్టి సంగ్రహణకు 5-6 గంటల సమయం పట్టును.

నూనె భౌతిక గుణాలు

రంగులేని లేదా లేత పసుపు రంగులో వుండు పారదర్శక ద్రవం.నూనెను కొత్తిమీర ఆకులనుండే కాకుండా కొత్తిమీర విత్తానాలైన ధనియాలనుండి కూడా సంగ్రహిస్తారు.నూనెను సాధారణంగా స్టీము డిస్టిలేసను విధానంలో ఉత్పత్తి చేస్తారు.ఆకులనుండి నూనెను తాజా ఆరబెట్టిన ఆకులనుండి తీస్తారు.

నూనె భౌతిక గుణాలపTTiక

క్రమ సంఖ్య గుణం పరిమితి
1 విశిష్ట గురుత్వం20 °C వద్ద 0.85000 - 0.86400
2 వక్రీభవన సూచిక 20 °C వద్ద 45000 - 1.46000
3 ఫ్లాష్ పాయింట్ 136.40 °F
4 ద్రావణీయత నీటిలో, ఆల్కహాల్ లో కరుగును.
5 నిల్వ సమయం 12 నెలలు

నూనె యాంటీ బాక్టీరియాల్ (బాక్టీరియా నిరోధక), యాంటీ ఫంగల్ (శిలీంద్ర నీరోధక),, యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్న పలు హైడ్రోకార్బన్ రసాయన సమ్మేళనాలను కల్గి ఉంది. నూనెను వైద్యపరమీన ఉపయోగానికై పార్మా సూటికల్ ఉత్పత్తులలో, సువాసనకై సువాసన ద్రవ్యాలలో (perfumes), రుచికి, వాసనకై వంటల్లో ఉపయోగిస్తారు.

నూనెలోని రసాయన సమ్మేళన పదార్థాలు

కొత్తిమీర ఆకుల ఆవశ్యక నూనెలో 44 రకాల రసాయన సమ్మేళన పదార్థాలు వున్నట్లు గుర్తించడైనది.వీటిలో ఎక్కువ శాతం ఆరోమాటిక్ ఆమ్లాలు ఉన్నాయి.వాటిలో ముఖ్యమైన కొన్ని రసాయన సమ్మేళనాలను దిగువ పట్టికలో ఇవ్వడమైనది

క్రమ సంఖ్య సంయోగ పదార్థం శాతం
1 2-డెసేనోయిక్ ఆమ్లం 30.8%
2 E-11-టెట్రా డెసేనోయిక్ ఆమ్లం 13.4%
3 కాప్రిక్ ఆమ్లం 12.7%
4 ఆన్ డెకనోయిక్ ఆమ్లం 7.1%

కొత్తిమీర గింజల నూనెలో/దనియాల నూనెలో 53 రసాయన సంయోగ పదార్థాలు ఉన్నాయి.వాటిలో ముఖ్యమైనవి దిగువ పట్టికలో ఇవ్వబడినవి.

క్రమ సంఖ్య సంయోగ పదార్థం శాతం
1 లినలూల్ 37.7%
2 జెరానైల్ అసిటేట్ 17.6%
3 - γ- terpinene 14.4%

అర్జెంటినా కొత్తిమీర గింజల/ధనియాల నూనెలో 68.9 -87% లినలూల్ అనే రసాయన సంయోగ పదార్థం వుండును.ఇరాన్ లో తయారగు నూనెలో 40.9 -79.9%వరకు లినలూల్ వుండును.గింజల/ధనియాల నూనెలో ఇంకా γ- టెర్పినేన్, నెరిల్ అసిటేట్, α- పినిన్, పి-సిమెన్, డోడెకానల్ 2 ఇ-డోడెకానల్. ఉన్నాయి.

కొత్తిమీర నూనె వాడకం

  • ఫంగస్ సోకిన కాలి వేళ్లకు ఆయింట్ మెంట్ లో 6% కొత్తిమీర నూనెను కలిపి ఉపయోగిస్తారు.
  • పరిమళద్రవ్యాలలో, సబ్బులలో ఉపయోగిస్తారు.
  • వీర్యవృద్ధికరమైనమందుగా ఉపయోగిస్తారు.
  • బాక్టిరీయా/ సూక్ష్మజీవి/క్రిమి సంహారకంగా ఉపయోగించవచ్చును.
  • వాయుహరమైన ఔషధముగా, జీర్ణకారిగా ఉపయోగిస్తారు.
  • బాధానివారక ఔషరంగా ఉపయోగిస్తారు.
  • ప్రేరకం/ ఉత్తేజకంగా పనిచేయును.
  • శూలహరముగా పనిచేయును.

ఇవికూడా చూడండి

మూలాలు,ఆధారాలు

వెలుపలి లంకెలు

Tags:

కొత్తిమీర నూనె కొత్తిమీరమొక్కకొత్తిమీర నూనె ఆవాసంకొత్తిమీర నూనె నూనెను సంగ్రహించు విధానంకొత్తిమీర నూనె నూనె భౌతిక గుణాలుకొత్తిమీర నూనె నూనెలోని రసాయన సమ్మేళన పదార్థాలుకొత్తిమీర నూనె వాడకంకొత్తిమీర నూనె ఇవికూడా చూడండికొత్తిమీర నూనె మూలాలు,ఆధారాలుకొత్తిమీర నూనె వెలుపలి లంకెలుకొత్తిమీర నూనె

🔥 Trending searches on Wiki తెలుగు:

కేంద్రపాలిత ప్రాంతంసత్యనారాయణ వ్రతంపూర్వ ఫల్గుణి నక్షత్రముఆయాసంకాశీభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుపూర్వాభాద్ర నక్షత్రముసుందర కాండఇస్లాం మతంరాజ్యసంక్రమణ సిద్ధాంతంవిడదల రజినిచంద్రుడు జ్యోతిషంఅనసూయ భరధ్వాజ్బైబిల్రజినీకాంత్అల్లు అర్జున్భారత జాతీయగీతంశోభితా ధూళిపాళ్లకొమురం భీమ్భారత అత్యవసర స్థితిభాషా భాగాలుపోకిరిరాజాచంద్ర గ్రహణంతెలుగు వ్యాకరణంనయన తారకేతువు జ్యోతిషంతులారాశిఐశ్వర్య లక్ష్మితెలంగాణ రాష్ట్ర శాసన సభకోడి రామ్మూర్తి నాయుడుకాంచనతెలుగునాట జానపద కళలుపుష్యమి నక్షత్రముభారతదేశ ప్రధానమంత్రిఎఱ్రాప్రగడఅక్కినేని అఖిల్పంచతంత్రంనరేంద్ర మోదీసావిత్రి (నటి)కస్తూరి రంగ రంగా (పాట)ధనిష్ఠ నక్షత్రముభారతదేశంపొంగూరు నారాయణమధ్యాహ్న భోజన పథకముకొండపల్లి బొమ్మలుసరోజినీ నాయుడుపాలపిట్టసత్య సాయి బాబావృషణంభారత జాతీయ చిహ్నంతెలంగాణ దళితబంధు పథకంకృష్ణ గాడి వీర ప్రేమ గాథచీకటి గదిలో చితక్కొట్టుడుఏప్రిల్ 30గరుత్మంతుడుసురభి బాలసరస్వతిశ్రీశైల క్షేత్రంభగత్ సింగ్సర్వేపల్లి రాధాకృష్ణన్వినాయక చవితిమేషరాశిభారత సైనిక దళంహలో గురు ప్రేమకోసమేఅర్జునుడువాల్మీకిపూర్వాషాఢ నక్షత్రముభారత జాతీయ ఎస్సీ కమిషన్మూత్రపిండముకర్ణాటకలలితా సహస్ర నామములు- 1-100ఈనాడుకనకదుర్గ ఆలయంభారత క్రికెట్ జట్టుచిలుకూరు బాలాజీ దేవాలయంవిద్యుత్తుతెలంగాణ నదులు, ఉపనదులుఉసిరిరౌద్రం రణం రుధిరంబెల్లి లలిత🡆 More