హాస్యము అనేది జీవితములో చాలా ప్రధానమైన రసం.
హాస్యము (Humour or humor) అనగా వినోదం కలిగించి నవ్వు పుట్టించే లక్షణం కలిగిన ఒక భావానుభవం. హాస్యం అంటే ఏమిటి, అది ఎలా సంభవిస్తుంది, దాని వలన ప్రయోజనాలు ఇబ్బందులు ఏమిటి అనే విషయాలపై పలు అభిప్రాయాలున్నాయి. దైనందిన జీవితంలోను, సినిమాలలోను, సాహిత్యంలోను, వ్యక్తుల వ్యవహారాలలోను హాస్యం ఒక ముఖ్యమైన పాత్ర కలిగి ఉంటుంది.
హాస్యం ఉత్పన్నమయ్యే పరిస్థితులు
హాస్యం గురిచి ప్లేటో ఇలా అన్నాడు (సోక్రటీస్ చెప్పినట్లుగా) - ఒకరిపట్ల వ్యంగ్యంగా ప్రవర్తించినపుడు రెండవవారు దానిని త్రిప్పికొట్టలేని పరిస్థితి ఉంటుంది. దానిని అర్ధం చేసుకోలేకపోవడమే వ్యంగ్యం. అరిస్టాటిల్ ఇలా అన్నాడు - జుగుప్స కలిగించని అందవిహీనత హాస్యానికి ప్రాథమిక ఉపకరణం.
హాస్యానికి అసంబద్ధత (Incongruity Theory) కారణం అని కాంట్ అభిప్రాయం. ఒక నిశ్చితమైన ఫలితం లేని పరిస్థితి హాస్యం అవుతుంది అని. దీనినే హెన్రీ బెర్గ్సన్ మరింత విపులీకరించాడు. ఈ సిద్ధాంతాలపై అనేక పొడిగింపులు, వివరణలు ఉన్నాయి. మోరియల్ అనే విశ్లేషకుడు "ఏకకాలపు కలగాపులగం" (simultaneous juxtapositions) అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చాడు. లాట్టా (Latta) అనే శాస్త్రజ్ఞుడు మాత్రం ఒక పరిస్థితిలో ఒక పజిల్‌కు సమాధానం లభించినపుడు కలిగే దృక్పథపు మార్పు హాస్యానికి ప్రధానమైన అంశం అన్నాడు. ఇంకా ఇలాంటి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. కొందరు మాత్రం అసలు హాస్యాన్ని ఇలా విశ్లేషించడం తగదన్నారు.
హస్యం "పండించే" విషయాలు
రోవాన్ అట్కిన్సన్ (Rowan Atkinson) అనే ప్రసిద్ధ హాస్య నటుడు ఒక ఉపన్యాసంలో హాస్యాన్ని కలిగించే హావభావాలు ఇవి అని చెప్పాడు
This article uses material from the Wikipedia తెలుగు article హాస్యము, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.