సమంత: తెలుగు నటి

సమంత (జ.

28 ఏప్రిల్, 1987) తెలుగు, తమిళ్ భాషల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.

సమంత
సమంత: పెళ్ళి - విడాకులు, నటించిన చిత్రాలు, పురస్కారాలు
జన్మ నామంసమంత రుతు ప్రభు
జననం (1987-04-28) 1987 ఏప్రిల్ 28 (వయసు 36)
భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు 2007 - ఇప్పటివరకు
భార్య/భర్త అక్కినేని నాగ చైతన్య (2017-2021)

మరోపక్క ఈగ ఏకకాల తమిళ నిర్మాణం నాన్ ఈ, ఎటో వెళ్ళిపోయింది మనుసు ఏకకాల తమిళ నిర్మాణం నీదానే ఎన్ పొన్వసంతం సినిమాలతో తమిళంలో గుర్తింపు సాధించిన సమంత ఆపై అంజాన్ (2014), కత్తి (2014) సినిమాలతో తమిళనాట కూడా ప్రముఖ కథానాయికగా ఎదిగింది. 2013లో రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధి గాంచింది. సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ యొక్క రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది.

పెళ్ళి - విడాకులు

అక్టోబర్‌ 2017, 6, 7 తేదీలలో సమంత, నాగ చైతన్యల పెళ్లి గోవాలో హిందూ, క్రిస్టియన్‌ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. వీరు టాలీవుడ్ స్టార్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే వారిరువురు 2 అక్టోబరు, 2021న వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ విషయాన్ని నాగ చైతన్య  ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు. మరోవైపు సమంత సైతం నాగచైతన్యతో విడిపోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

నటించిన చిత్రాలు

తెలుగు

సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు
2010 ఏ మాయ చేశావే జెస్సీ 'విజేత', ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన నటి,
'విజేత', సినీ"మా" అవార్డ్ - ఉత్తమ నూతన నటి,
'విజేత', నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్,
'విజేత', టీ.ఎస్.ఆర్ - టీవీ 9 అవార్డ్ 2011 - ఉత్తమ నటి,
పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి
2010 బృందావనం ఇందు
2011 దూకుడు ప్రశాంతి పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి,
పేర్కొనబడింది, దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్ SIIMA - ఉత్తమ నటి
2012 ఈగ బిందు తమిళంలో "నాన్ ఈ" పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది,
'విజేత', ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి,
'విజేత', టీ.ఎస్.ఆర్ - టీవీ 9 అవార్డ్ 2012 - ఉత్తమ నటి,
'విజేత', సినీ"మా" అవార్డ్ - ఉత్తమ నటి
2012 ఎటో వెళ్ళిపోయింది మనసు నిత్య
2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గీత
2013 జబర్‌దస్త్ శ్రేయ
2013 సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అతిథి పాత్ర
2013 అత్తారింటికి దారేది శశి
2013 రామయ్యా వస్తావయ్యా ఆకర్ష
2014 ఆటోనగర్ సూర్య శిరీష
2014 మనం ప్రియ/కృష్ణవేణి
2014 రభస
2017 అ ఆ అనసూయ విజేత, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి,
పేర్కొనబడింది, దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్ SIIMA - ఉత్తమ నటి
2017 24
2018 మహానటి మధురవాణి మహానటి సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమలో ప్రజావాణి పత్రిక విలేఖరి.
2018 యూ టర్న్ రచన మిస్టరీ - థ్రిల్లర్ చిత్రం
2018 సీమరాజా
2019 ఓ బేబీ
2020 జాను జానకి దేవి/ జాను సమంత చేసిన జాను పాత్రను తమిళంలో నటి త్రిష చేయబడింది.
2022 యశోద యశోద
2022 శాకుంతలం శకుంతల

తమిళం

సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు
2010 విన్నైతాండి వరువాయా నందిని అతిథి పాత్ర
2010 బాణ కాథడి ప్రియ పేర్కొనబడింది, విజయ్ అవార్డ్ - ఉత్తమ నూతన నటి
2011 మాస్కోవిన్ కావేరి కావేరి
2012 నడునిశి నాయగల్ అతిథి పాత్ర
2012 నాన్ ఈ బిందు తెలుగులో "ఈగ" పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది
2013 నీదానే ఎన్ పొన్వసంతం నిత్య ఎటో వెళ్ళిపోయింది మనసు యొక్క ఏకకాల నిర్మాణం,
ఇందులో నానీ పోషించిన వరుణ్ పాత్రను తమిళ నటుడు జీవా పోషించాడు
'విజేత', ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి,
'విజేత', వికటన్ అవార్డ్ - ఉత్తమ నటి,
'విజేత', విజయ్ అవార్డ్ - ఉత్తమ నటి
2014 అంజాన్ జీవా చిత్రీకరణ జరుగుతున్నది
2014 కత్తి వేణి చిత్రీకరణ జరుగుతున్నది

పురస్కారాలు

సైమా అవార్డులు

మూలాలు

బయటి లింకులు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సమంత పేజీ

Tags:

సమంత పెళ్ళి - విడాకులుసమంత నటించిన చిత్రాలుసమంత పురస్కారాలుసమంత మూలాలుసమంత బయటి లింకులుసమంత198728 ఏప్రిల్అత్తారింటికి దారేదిఈగ (సినిమా)ఎటో వెళ్ళిపోయింది మనసుఏ మాయ చేశావేతమిళ్తెలుగుదూకుడు (సినిమా)బృందావనం (2010 సినిమా)సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

🔥 Trending searches on Wiki తెలుగు:

రాజమండ్రిఋతువులు (భారతీయ కాలం)పిఠాపురంనాగార్జునసాగర్కనకదుర్గ ఆలయంరంగస్థలం (సినిమా)ఆంగ్ల భాషబ్రెజిల్అమృతా రావుAరోహిణి నక్షత్రంతెలుగు నెలలుసుభాష్ చంద్రబోస్మేషరాశిటి.జీవన్ రెడ్డిగాయత్రీ మంత్రంపచ్చకామెర్లుప్రశ్న (జ్యోతిష శాస్త్రము)సమాసంపక్షముసంక్రాంతిఅల్లసాని పెద్దనక్షయభాషా భాగాలుపాల్కురికి సోమనాథుడుదానం నాగేందర్రౌద్రం రణం రుధిరంగజము (పొడవు)భారతదేశ రాజకీయ పార్టీల జాబితాభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులురాకేష్ మాస్టర్అమరావతిఓం భీమ్ బుష్బోడె ప్రసాద్భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలురేవతి నక్షత్రంసైంధవుడువిష్ణువుకన్యారాశియేసు శిష్యులుసరోజినీ నాయుడుపవన్ కళ్యాణ్జ్యేష్ట నక్షత్రంకాజల్ అగర్వాల్జైన మతంకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)బ్రాహ్మణులుజె. చిత్తరంజన్ దాస్ఆవురాగులుపృథ్వీరాజ్ సుకుమారన్రుంజ వాయిద్యంఉషా మెహతాఆరూరి రమేష్హనుమాన్ చాలీసాఆంధ్రప్రదేశ్ మండలాలుఅరవింద్ కేజ్రివాల్పంచారామాలురోహిత్ శర్మభారత రాజ్యాంగ సవరణల జాబితావాముగంగా నదిటైఫాయిడ్తిథికృత్తిక నక్షత్రముక్రోధిఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌అలెగ్జాండర్యేసుభాగ్యరెడ్డివర్మమహేంద్రసింగ్ ధోనిడి.వై. చంద్రచూడ్రామప్ప దేవాలయంలావణ్య త్రిపాఠిఎనుముల రేవంత్ రెడ్డిపన్నుఇండియన్ ప్రీమియర్ లీగ్పద్మశాలీలుతట్టు🡆 More