విష్ణు వామన్ శిర్వాద్కర్: భారతీయ కవి

విష్ణు వామన్ శిర్వాద్కర్ (మరాఠీ: विष्णु वामन शिरवाडकर) (1912 ఫిబ్రవరి 27 – 1999 మార్చి 10), కుసుమగ్రాజ్ కలంపేరుతో సుపరిచితులు.

ఆయన ప్రసిద్ధ మరాఠీ కవి, రచయిత, నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత, మానవతా వాది. ఆయన మానవతా వాదిగా న్యాయ, దారిద్ర్యం గల ప్రజల విముక్తి కోసం స్వాతంత్ర్యానికి పూర్వం ఐదు దశాబ్దాలుగా 10 సంపుటాలు కవితలు, మూడు నవలలు, ఎనిమిది సంపుటాల లఘు కథలు, ఏడు సంపుటాల వ్యాసాలు, 18 నాటకాలు, ఆరు ఏక పాత్రాభినయనాల నాటకాలు వ్రాసారు. ఆయన సాహితీ సేవలలో పాటక సంకలనం "విశాఖ" (1942) స్వాతంత్ర్యానికి పూర్వ ఉధ్యమంలో ఉద్యమకారులను, ప్రజలను స్ఫూర్తినిచ్చింది. అది ప్రస్తుతం భారత సాహితీ చరిత్రలో ఒక కళాఖండంగా నిలిచింది. ఆయన రచించిన నాటకం "నటసామ్రాట్"కు మరాఠీ సాహిత్యంలో ముఖ్యమైన స్థానం లభించింది. ఆయన అనేక రాష్ట్ర స్థాయి అవార్డులను, జాతీయ అవార్డులతో పాటు 1974 లో మరాఠీ సాహిత్య అకాడమీ అవార్డు , 1988 లో జ్ఞానపీఠ అవార్డులను అందుకున్నారు. ఆయన 1989 లో జరిగిన ప్రపంచ మరాఠీ సదస్సుకు చైర్ పర్సన్ గా పనిచేసారు. ఆయన మహారాష్ట్ర లోని పూణేలో జన్మిచారు , తన జీవితంలో అత్యధిక కాలాన్ని నాసిక్లో గడిపారు.

విష్ణు వామన్ శిర్వాద్కర్
విష్ణు వామన్ శిర్వాద్కర్: ప్రారంభ జీవితం , విద్య, కెరీర్, అవార్డులు , గుర్తింపులు
विष्णु.वामन.शिरवाडकर
జననం(1912-02-27)1912 ఫిబ్రవరి 27
పూణే, మాహారాష్ట్ర
మరణం1999 మార్చి 10(1999-03-10) (వయసు 87)
నాశిక్, మాహారాష్ట్ర
వృత్తిరచయిత,
నాటక రచయిత,
నవలా రచయిత,
లఘు కథా రచయిత,
మానవతావాది
గుర్తించదగిన సేవలు
విశాఖ (1942)
నటసామ్రాట్
పురస్కారాలు1974 మరాఠీ సహిత్య అకాడమీ అవార్డు
1988 జ్ఞానపీఠ అవార్డు

ప్రారంభ జీవితం , విద్య

ఆయన 1912 ఫిబ్రవరి 27పూణేలో జన్మించారు. ఆయన బాల్యనామం విష్ణు వామన్ శిర్వాద్కర్. ఆ తరువాత ఆయన తన నామాన్ని "కుసుమాగ్రజ్"గా మార్చుకున్నారు. ఆయన ప్రాథమిక విద్యను పింపాల్గన్ లోనూ ఉన్నత విద్యను నాశిక్ లోని న్యూ ఇంగ్లీషు పాఠశాల (ప్రస్తుతం జె.ఎస్.రుంగ్తా ఉన్నత పాఠశాల) లోనూ పూర్తిచేసారు. ముంబై విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ పూర్తిచేసారు.

కెరీర్

విష్ణు వామన్ శిర్వాద్కర్: ప్రారంభ జీవితం , విద్య, కెరీర్, అవార్డులు , గుర్తింపులు 
క్విట్ ఇండియా ఉద్యమం 75 వ వార్షికోత్సవానికి అంకితం చేసిన 2017 స్టాంప్ షీట్. ఇందులో పాట్నా లోని అమరవీరుల మెమోరియల్ (దిగువ-ఎడమ) ఉంది. గాంధీ తన 1942 ఆగస్టు 8 నాటి "డు ఆర్ డై" ప్రసంగం (3 వ స్టాంప్) ఉంది. దానిలో ఒక భాగం కూడా ఉంది. : "మన మంత్రం 'డు ఆర్ డై'. మేము భారతదేశాన్ని విడిపించుకుంటాము లేదా ఆ ప్రయత్నంలో చనిపోతాము; మా బానిసత్వం యొక్క శాశ్వతత్వాన్ని చూడటానికి మేము జీవించము. " (1 వ స్టాంప్).

ఆయన తన 20వ యేట నాశిక్ లోని దేవాలయాలలో బ్రాహ్మణ వర్గం దేవాలయాలలోనికి అంటరానివారిని వర్గాలను నిషేధించుటను వ్యతిరేకిస్తూ అహింసావిధానంలో నిరసన (సత్యాగ్రహం) లో పాల్గొన్నారు. అంతకు పూర్వం పూజారులు హిందూమతంలో అంటరానివారిగా భావిస్తున్న కొన్ని వర్గాలను దేవాలయ ప్రవేశానికి అనుమతినిచ్చేవారుకాదు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ నాశిక్ లో జరిగిన ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి తోడ్పడ్డారు.

20 యేండ్ల వయస్సులో ఆయన మొదటిసారి "జీవనలహరి" అనే కవితా సంకలనాన్ని ప్రచురించారు. ఆ తరువాత ఆయన నాశిక్ లో "మరాఠీ సినిమా"లో కూడా పాలుపంచుకున్నారు. ఆయన పౌరాణిక చిత్రం "సతీ సులోచన"కు స్క్రిప్టు వ్రాసారు. అందులో నటించారు కూడా. ఆయన ప్రధాన రంగం అయిన కవిత్వ రచనకు ముందుగా జర్నలిజంలో కూడా పనిచేసారు. 1942 ఆయన జీవితంలో ముఖ్యమలుపు. ఆయన కుసుమగ్రాజ్ కవితా సంకలనాన్ని ప్రచురించి మరాఠీ సాహిత్యంలో పితామహునిగా వెలుగొందారు. ఆయన స్వంత ఖర్చులతో "విశాఖ" ప్రచుచించారు. ఇందులో ముందుమాటలో వ్రాసిన వాక్యాలను బట్టి ఆయన మానవతావాది అయిన రచయిత అని తెలుస్తుంది. ఆ పుస్తకం ముందుమాటలో "ఆయన మాటలు సామాజిక అసంతృప్తిని వ్యక్తం చేసాయి కానీ పురాతన ప్రపంచం కొత్తమార్గాన్ని ఇస్తుందనే ఆశావాద విశ్వాసాన్ని కలిగి ఉంటారు." అని ఉంది. ఇది క్విట్ ఇండియా ఉద్యమంలో వెలువడింది. ఈ రచన స్వాతంత్ర్యోద్యమంలో బానిస వ్యవస్థ నిర్మూలనకు ఒక సంకేతాన్ని అందించింది. ఈ రచనలోని వాక్యాలు యువతలో ప్రాముఖ్యత పొందాయి. ఈ కాలములో ఆయన రచనలు భారతీయ సాహిత్యంలో శాశ్వత వారసత్వం పొందేలా చేశాయి. 1943 తర్వాత మరాఠీ ధియేటర్లో ప్రదర్శితమవుతున్న ప్రముఖ ఆంగ్ల రచయితలైన ఆస్కార్ వైల్డ్, మోలీర్, మారిస్ మాటెర్లింక్, షేక్స్‌పియర్ ల నాటకాలలోని ముఖ్య పాత్రలను దత్తత తీసుకునుట ప్రారంభించారు. ఈ విధానాన్ని 1970క వరకు ఆయన రచన "నటసామ్రాట్" ప్రదర్శించేవరకూ కొనసాగించారు.

1950లలో ఆయన నాశిక్ లో "ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ గుడ్" --"లోకహితవాతి మండల్"ను ప్రారంభించారు. ఆయన సామాజికంగా అణగదొక్కబడినవారికి సామాజిక స్ఫూర్తి కలిగించే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించారు. కానీ ఆయన కవిత్వం , రచన రంగాలలో విశేష ప్రతిభావంతునిగా కొనసాగించారు. 1954 లో ఆయన షేక్స్‌పియర్ యొక్క రచన "మెక్‌బెత్"ను "రాజ్‌ముకుట్"గా స్వీకరించారు. అందులో నానాసాహెబ్ పాఠక్ , దుర్గా కోతేలు నటించారు. ఆ తరువాత "ఒథెల్లో" అనే నాటకాన్ని 1960 లో స్వీకరించారు. ఆయన మరాఠీ సినిమాకు పాటల రచయితగా కూడా పనిచేసారు.

అవార్డులు , గుర్తింపులు

ఆయన మరాఠీ సాహిత్యంలో చేసిన కృషికి ప్రతి సంవత్సరం ఆయన పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 27 వ తేదీన "మరాఠీ భాషా దినం"గా జరుపుకుంటారు. 1987 లో ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య అవార్డు "జ్ఞానపీఠ అవార్డు"ను అందజేసారు. ఆయన రచించిన నాటకం "నటసామ్రాట్"కు 1974 లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1985లో ఆయనకు "గణేష్ గడ్కారీ అవార్డు" వచ్చింది. 1986లో పూణే విశ్వవిద్యాలయం ఆయనకు "డి.లిట్"ను అందజేసి సత్కరించింది. 1988 లో ఆయనకు సంగీత నాట్య లేఖన్ అవార్డు వచ్చింది.

వ్యక్తిగత జీవితం

ఆయన అసలుపేరు గజానన్ రంగనాథ్ సివాద్కర్ , ఆయన యొక్క మామయ్య ఆయనను దత్తత తీసుకున్నారు. ఆయన 1990 లో నాశిక్ లో "కుసుమాగ్రజ్ ప్రతిష్టాన్" అనే సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం వివిధ సాంస్కృతిక కార్యకలాపాలను ప్రోత్సహించడమే. ఈ సంస్థ సమాజంలో అణగారిన వర్గాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. 1972లో ఆయన భార్య "మనోరమాబాయి" మరణించారు. కుసుమాగ్రజ్ యొక్క జన్మదినాన్ని ప్రపంచ మరాఠీ దినంగా జరుపుకుంటారు.

ఆయన మార్చి 10, 1999 న మరణించారు. ఆయన నివాసం "కుసుమాగ్రజ్ ప్రతిష్టాన్" సంస్థకు కార్యాలయంగా ఉంది.

రచనలు

కవితా సంకలనాలు

  • విశాఖ (సంవత్సరం : 1942)
  • హిమరేష (సంవత్సరం : 1964)
  • చండోమయి (సంవత్సరం : 1982)
  • జీవనలహరి (సంవత్సరం : 1933)
  • జైచ కుంజ (సంవత్సరం : 1936)
  • సమిధ (సంవత్సరం : 1947)
  • కాన (సంవత్సరం : 1952)
  • కినార (సంవత్సరం : 1952)
  • మరాఠీ మతి (సంవత్సరం : 1960)
  • వాడల్వేల్ (సంవత్సరం : 1969)
  • రాసయాత్ర (సంవత్సరం : 1969)
  • ముక్తాయాన్ (సంవత్సరం : 1984)
  • శ్రావన్ (సంవత్సరం : 1985)
  • ప్రవాసి పక్షి (సంవత్సరం : 1989)
  • పాథేయ (సంవత్సరం : 1989)
  • మేఘదూత (సంస్కృతంలోని "మేఘదూతం: నకు మరాఠీ అనువాదం) (సంవత్సరం : 1956)
  • Swagat (సంవత్సరం : 1962)
  • బల్బోద్ మెవ్యటిల్ కుసుమాగ్రజ్ (సంవత్సరం : 1989)

సరిదిద్దిన కవితా సంకలనాల

  • కావ్యవాహిని
  • సాహిత్య సువర్ణ
  • ఫూలరాణి
  • పింపాలాపన్
  • చందనవెల్
  • రస్యత్ర, శంకర్ వైద్య, బోకార్ కవి యొక్క ఎంపిక చేసిన రచనలు

కథల సంకలనాలు

  • ఫూలవాలి
  • ఛోటే అని మోతే
  • సటారిచే బోల్ అని ఇటెర్ కథ
  • కహి వృద్ధ, కహి తౌన్
  • ప్రేమ్‌ ఆని మంజర్
  • అపాయింటు మెంటు
  • ఆహే అని నహి
  • విరామచిహ్నే
  • ప్రతిసాద్
  • ఎక్కై తారా
  • వాటే వారల్య సావల్య
  • షేక్స్‌పియరేచ్య శోధత్
  • రూపారేష
  • కుసుమాగ్రజాంచ్య బార కథ
  • జడోచి హోదీ (పిల్లలకు)

నాటకాలు

  • Yayāti Āni Dewayāni
  • Weeja Mhanāli Dharateelā
  • Natasamrāt
  • Doorche Diwe
  • Dusarā Peshwā
  • Waijayanti
  • Kounteya
  • Rājmukut
  • Āmche Nāw Bāburāం
  • Widushak
  • Ek Hoti Wāghin
  • Ānand
  • Mukhyamantri
  • Chandra Jithe Ugawat Nāhi
  • Mahant
  • Kaikeyi
  • Becket (Translation of The Honour of God by Jean Anouilh)

ఏక పాత్రాభినయాలు

  • Diwāni Dāwā
  • Dewāche Ghar
  • Prakāshi Dāre
  • Sangharsh
  • Bet
  • Natak Basat Āhe Āni Itar Ekānkikā

నవలలు

  • Waishnawa
  • Jānhawi
  • Kalpanechyā Teerāwar

అనువాద సేవలు

  • The Saint in the Cellar: selected poems. Tr. by S. A. Virkar. New Native Press, 2003. ISBN 1-883197-18-X.

కుసుమాగ్రజ్ యొక్క పనుల దృశ్యాలు

The translation of Meghadūta by Kusumagraj were visualised by watercolour artist Nana Joshi. These visualisations were published in the Menaka Diwali issue in 1979.

మూలాలు

బయటి లంకెలు


బయటి లంకెలు

Tags:

విష్ణు వామన్ శిర్వాద్కర్ ప్రారంభ జీవితం , విద్యవిష్ణు వామన్ శిర్వాద్కర్ కెరీర్విష్ణు వామన్ శిర్వాద్కర్ అవార్డులు , గుర్తింపులువిష్ణు వామన్ శిర్వాద్కర్ వ్యక్తిగత జీవితంవిష్ణు వామన్ శిర్వాద్కర్ రచనలువిష్ణు వామన్ శిర్వాద్కర్ అనువాద సేవలువిష్ణు వామన్ శిర్వాద్కర్ కుసుమాగ్రజ్ యొక్క పనుల దృశ్యాలువిష్ణు వామన్ శిర్వాద్కర్ మూలాలువిష్ణు వామన్ శిర్వాద్కర్ బయటి లంకెలువిష్ణు వామన్ శిర్వాద్కర్ బయటి లంకెలువిష్ణు వామన్ శిర్వాద్కర్కవినవలా సాహిత్యమునాసిక్న్యాయంపూణేపేదరికంమరాఠీ భాషరచయితసాహిత్యం

🔥 Trending searches on Wiki తెలుగు:

నవగ్రహాలు జ్యోతిషంకిరణ్ రావుపురాణాలుక్రికెట్గోవిందుడు అందరివాడేలేఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాశ్రీ కృష్ణదేవ రాయలువై.యస్. రాజశేఖరరెడ్డికర్ణుడుపాలపిట్టశ్రీ గౌరి ప్రియభారతదేశ చరిత్రశ్రీశ్రీపిఠాపురం శాసనసభ నియోజకవర్గంలోక్‌సభ నియోజకవర్గాల జాబితాకానుగముంతాజ్ మహల్దేవీ ప్రసాద్సంపన్న శ్రేణిమన్నెంలో మొనగాడుపుష్యమి నక్షత్రముఆవుక్షయసామెతల జాబితాఅనసూయ భరధ్వాజ్బరాక్ ఒబామాఅంగుళంకోల్‌కతా నైట్‌రైడర్స్గోత్రాలు జాబితానువ్వు నేనుపాట్ కమ్మిన్స్ప్రకటనఅన్నప్రాశనగౌడవైరస్కర్ణాటకడి.వై. చంద్రచూడ్సికింద్రాబాద్మార్చి 28దేవుడువై.యస్.రాజారెడ్డియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంన్యుమోనియాపర్యాయపదంతెనాలి రామకృష్ణుడుశ్రవణ నక్షత్రముసంస్కృతంతెలంగాణ ప్రభుత్వ పథకాలుసుహాసినిగోత్రాలుమాయాబజార్ఎన్నికలుఆంధ్రప్రదేశ్ చరిత్రభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థగైనకాలజీమహాకాళేశ్వర జ్యోతిర్లింగంతెలుగు సినిమాలు 2024కనకదుర్గ ఆలయంరంజాన్తెలంగాణఅనిష్ప సంఖ్యఆప్రికాట్ఇన్‌స్టాగ్రామ్మెదక్ లోక్‌సభ నియోజకవర్గంమహాభాగవతంతెలుగు పద్యమురెండవ ప్రపంచ యుద్ధంతొట్టెంపూడి గోపీచంద్రామాఫలంనీతా అంబానీనరేంద్ర మోదీసౌందర్యలహరిఉస్మానియా విశ్వవిద్యాలయంప్రభాస్మార్చి 27ప్లీహమురంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)🡆 More