రంతి దేవుడు

రంతి దేవుడు భాగవత పురాణం నవమ స్కందంలో ప్రస్తావించబడిన చంద్రవంశపు రాజు.

దానగుణానికి మచ్చుకగా ఈయనను ప్రస్తావిస్తారు. రాజ్య పరిత్యాగం చేసి అడవిలో సన్యాసి జీవితం గడుపుతుంటాడు. రంతి దేవుని ప్రస్తావన భాగవత పురాణంతో పాటు మహాభారతంలోనూ, సంస్కృత కవి కాళిదాసు రచించిన మేఘదూతంలోనూ ఉంది. రంతిదేవుని రాజధాని రంతిపురం. ఇది చంబల్ ప్రాంతంలోని ఆధునిక రణతంబూరుగా పరిగణించబడుతున్నది. చంబల్ ప్రాంతం, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మూడూ కలిసే ప్రాంతంలో ఉంది.

ఒక రోజు రంతి దేవుడు 48 రోజుల పాటు వరుసగా ఉపవాసం ఉంటాడు. 49 వరోజు కొద్దిగా అన్నం వండుకుంటాడు. దాన్ని ఆరగించేలోగా ఒక పేదవాడు ఆకలితో ఆయన్ను సమీపించి ఆకలేస్తుంది అన్నం పెట్టమంటాడు. రంతి దేవుడు సంతోషంగా కొంత అన్నం అతనికి సమర్పించుకుంటాడు. అతను ఆ అన్నం తినేసి తన దారిన వెళ్ళిపోతాడు. రంతిదేవుడు రెండో సారి ఆరగించడానికి ఉద్యుక్తుడవుతుండగా ఇంకా ఇద్దరు పేద వాళ్ళు వచ్చి అన్నం కోసం అడుగుతారు. వాళ్ళకు కూడా సంతోషంగా సమర్పించుకోగా ఇంక కొంచెం అన్నం మాత్రమేమిగిలి ఉంటుంది. ఆ సమయానికి ఒక కుక్క అక్కడికి వచ్చి తన తోకనాడిస్తూ అన్నం కోసం చూస్తుంది. మిగిలిన అన్నమంతా దానికి సమర్పించిన రంతిదేవుడు నేను ఈ రోజు నలుగురి ఆకలి తీర్చినందుకు సంతృప్తిగా ఉంది అనుకుంటాడు.

మరుక్షణమే దేవుడు అక్కడ ప్రత్యక్షమై అతనికి మోక్ష ప్రాప్తిని కలుగ జేస్తాడు.

మూలాలు

Tags:

అడవిఉత్తర ప్రదేశ్కాళిదాసుభాగవత పురాణంమధ్యప్రదేశ్మహాభారతంరాజస్థాన్

🔥 Trending searches on Wiki తెలుగు:

షాజహాన్ద్రౌపది ముర్ముకెఫిన్కె. అన్నామలైనీతా అంబానీతొట్టెంపూడి గోపీచంద్వినాయక్ దామోదర్ సావర్కర్బుడి ముత్యాల నాయుడువై.యస్.అవినాష్‌రెడ్డిఅయోధ్యజ్యేష్ట నక్షత్రంరాయప్రోలు సుబ్బారావుమృగశిర నక్షత్రముసికిల్ సెల్ వ్యాధిక్షయమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిమగధీర (సినిమా)సింధు లోయ నాగరికతఓం భీమ్ బుష్అమృత అయ్యర్ఆశ్లేష నక్షత్రముశివ సహస్రనామాలుశ్రవణ నక్షత్రముఅన్నమయ్యమాగుంట శ్రీనివాసులురెడ్డిమియా ఖలీఫాహార్దిక్ పాండ్యాకిలారి ఆనంద్ పాల్సుహాసినిశ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)హైదరాబాదురక్త పింజరిభూమిపాలపిట్టరామాయణంతెలుగు సినిమాకొణతాల రామకృష్ణశ్రీరామనవమిభారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 299 - 377అంజలి (నటి)భారత పార్లమెంట్తహశీల్దార్నాగార్జునసాగర్సుఖేశ్ చంద్రశేఖర్మూత్రపిండముసెల్యులార్ జైల్రావి చెట్టుచిత్తూరు నాగయ్యనరసింహ (సినిమా)కింజరాపు అచ్చెన్నాయుడుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్రవీంద్రనాథ్ ఠాగూర్ఇన్‌స్టాగ్రామ్కాలేయంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుమశూచిసామెతలుఆప్రికాట్కల్వకుంట్ల చంద్రశేఖరరావుగరుడ పురాణంతీన్మార్ మల్లన్నకుండలేశ్వరస్వామి దేవాలయంభారతదేశ ప్రధానమంత్రివిటమిన్శతక సాహిత్యమురోగ నిరోధక వ్యవస్థప్రభాస్వడ్డీరెడ్డిసర్పంచిఅచ్చులుహైదరాబాద్ రేస్ క్లబ్విరాట్ కోహ్లిహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాతేలువిశ్వామిత్రుడుఅనుష్క శెట్టి🡆 More