ముద్రారాక్షసం

ముద్రారాక్షసం విశాఖదత్తుడు రచించిన సంస్కృత చారిత్రక నాటకం.

భారతదేశ చక్రవర్తిగా చంద్రగుప్త మౌర్యుడు రాజ్యం చేపట్టాక జరిగిన రాజకీయపు ఎత్తుగడలను, పరిణామాలను నాటకం చిత్రీకరించింది. నందవంశాన్ని చాణక్యుని నీతి చతురత సహాయంతో నిర్మూలించి చంద్రగుప్తుడు పాటలీపుత్రాన్ని పరిపాలిస్తున్న నేపథ్యంలో నాటకం ప్రారంభం అవుతుంది. నందుని మహా మంత్రి రాక్షస మంత్రి తన రాజు మరణానికి ప్రతీకారం తీర్చుకోదలచి చంద్రగుప్తుని చంపేందుకు ఎత్తులు వేస్తూండగా, చంద్రగుప్తుని పక్షాన చాణక్యుడు వాటన్నిటినీ చిత్తు చేస్తూ పైఎత్తులు వేయడంతో నాటకం కొనసాగుతుంది. చివరికి చాణక్యుని మంత్రాంగానికి చిక్కి రాక్షస మంత్రి చంద్రగుప్తునికి మంత్రిత్వం వహించేందుకు అంగీకరించడంతో నాటకం పూర్తవుతుంది.

ముద్రారాక్షసం
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురించిన ముద్రారాక్షసనాటకానికి వ్యాఖ్య

ఇతివృత్తం

చంద్రగుప్తునికి పరాభవం జరుగుతుందన్న సూచన విని కోపంతో తానున్నంత వరకూ చంద్రగుప్తునికి అవమానం కలుగజేసే మొనగాడెవరంటూ చాణక్యుడు రావడంతో నాటకం ప్రారంభం అవుతుంది. ఐతే నందవంశాన్ని నిర్మూలించి చంద్రగుప్తుణ్ణి రాజుగా నిలబెట్టడం, నందుని మంత్రి రాక్షసుడిని వశుణ్ణి చేసుకున్నాకానే సంపూర్ణమౌతుందని గ్రహిస్తాడు. తన రాజైన నందుణ్ణి చంపి రాజ్యం చేపట్టిన చంద్రగుప్తుణ్ణి ఎలాగైనా చంపాలని పగతో రగులుతూంటాడు రాక్షస మంత్రి. అందుకోసం తన వలెనే చంద్రగుప్తునిపై కత్తికట్టిన మలయకేతువు, పర్వతేశ్వరుల వంటివారితో చేయికలుపుతాడు. చంద్రగుప్తుణ్ణి మట్టుపెట్టేందుకు తయారుచేసిన విషకన్యను అతనిపైకి ప్రయోగిస్తాడు. ఆ విషకన్యతోనే పర్వతేశ్వరుణ్ణి చంపేలా చేసిన చాణక్యుడు, రాక్షసుని వల్లనే మరణించినట్టు ప్రచారం చేస్తాడు. పర్వతేశ్వరుని కుమారుడు మలయకేతువు, రాక్షస మంత్రి వద్ద అనేకులైన గుఢచారులను నియమించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూంటాడు. రాక్షసుని కుటుంబం ఆయన మిత్రుడు చందనదాసు రక్షణలో ఉన్నట్టు తెలుసుకుని, చందనదాసుతో రాక్షస మంత్రి కుటుంబాన్ని తనకు అప్పగించమని చాణక్యుడు అడుగుతాడు. కానీ చందనదాసు నిరాకరిస్తాడు.
చంద్రగుప్తుని చంపేందుకు రాక్షసుడు పన్నిన ఎత్తుగడలన్నీ విఫలం కావడంతో భేదోపాయాన్ని ఎంచుకుంటాడు. చాణక్య చంద్రగుప్తుల నడుమ విభేదాలు సృష్టించాలని వైతాళికుల వేషంలో ఇద్దరు గూఢచారుల్ని చంద్రగుప్తుని వద్దకు పంపుతాడు రాక్షస మంత్రి. వీరు చంద్రగుప్తునికి గర్వం, అహంకారం పుట్టించేలాంటి స్తుతి చేస్తూంటారు. చాణక్య చంద్రగుప్తులిద్దరూ తమ తమ కార్యసఫలత వల్ల గర్వులై, సంతృప్తులై ఉన్నారు కనుక వారి మధ్య వివాదం పుట్టించడం సులభమని రాక్షస మంత్రి యోచన.
రాక్షస మంత్రి చేసిన ఈ పన్నాగాన్ని తెలుసుకున్న చాణక్యుడు తమ మధ్య విభేదాలు పొడసూపినట్టు ప్రవర్తించమని చంద్రగుప్తుడితో చెప్తాడు. భేదాన్ని సృష్టించినట్టు నటించేందుకు గాను పాటలీపుత్రంలో కౌముదీ మహోత్సవాన్ని చేయాలని చంద్రగుప్తుడు ప్రకటించగా, కౌముదీ మహోత్సవంలో ప్రజలు, రాజాధికారులు అప్రమత్తులై ఉండగా దండెత్తివచ్చేందుకు రాక్షస, మలయకేతువులకు అవకాశం దొరుకుతుందని చాణక్యుడు అంటాడు. ఆ అవకాశం లేకుండా చేయాలంటే కౌముదీ మహోత్సవాన్ని చేయరాదని చాణక్యుడు శాసిస్తాడు. చాణక్య చంద్రగుప్తులు వాగ్వాదం చేసుకున్నట్టు నటిస్తారు. ఈ అదను చూసుకుని చంద్రగుప్తుడి కోపం రెచ్చగొట్టే స్తుతి చదువుతారు వైతాళికులు.

Tags:

చంద్రగుప్త మౌర్యుడుచంద్రగుప్తుడుచాణక్యుడునాటకంపాటలీపుత్రసంస్కృతము

🔥 Trending searches on Wiki తెలుగు:

ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంమియా ఖలీఫాభారత జాతీయ క్రికెట్ జట్టుఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుభారతదేశ చరిత్రరత్నం (2024 సినిమా)భారత పార్లమెంట్మెరుపువడదెబ్బఉమ్మెత్తఇన్‌స్టాగ్రామ్శ్రీ కృష్ణదేవ రాయలుసింహరాశిభారత జాతీయ కాంగ్రెస్ఆంధ్రప్రదేశ్ చరిత్రఈసీ గంగిరెడ్డిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుసంధిహనుమజ్జయంతిహల్లులుపాల కూరసింధు లోయ నాగరికతఫిరోజ్ గాంధీరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంజాతిరత్నాలు (2021 సినిమా)నువ్వొస్తానంటే నేనొద్దంటానాతెలుగు వికీపీడియాకామాక్షి భాస్కర్లవిశ్వబ్రాహ్మణవిష్ణువు వేయి నామములు- 1-1000దొమ్మరాజు గుకేష్పోకిరిశ్రీలీల (నటి)అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిభారతీయ రిజర్వ్ బ్యాంక్బుర్రకథరుద్రమ దేవిమీనాక్షి అమ్మవారి ఆలయంపుష్యమి నక్షత్రముఈనాడునజ్రియా నజీమ్షర్మిలారెడ్డిసలేశ్వరంఅనూరాధ నక్షత్రంవిజయవాడచరాస్తినామనక్షత్రముభారతీయ జనతా పార్టీశ్రీవిష్ణు (నటుడు)విరాట్ కోహ్లిఅమ్మతెలుగు వ్యాకరణంవాస్తు శాస్త్రంనందమూరి బాలకృష్ణబోడె రామచంద్ర యాదవ్చాణక్యుడుAగ్లోబల్ వార్మింగ్జై శ్రీరామ్ (2013 సినిమా)తెలుగు సినిమాల జాబితాపి.వెంక‌ట్రామి రెడ్డిఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్లోక్‌సభ నియోజకవర్గాల జాబితాశార్దూల విక్రీడితముఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగురజాడ అప్పారావుసూర్య (నటుడు)ఇక్ష్వాకులుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిచిత్త నక్షత్రముబ్రాహ్మణ గోత్రాల జాబితావై.ఎస్.వివేకానందరెడ్డికుటుంబంఅన్నమాచార్య కీర్తనలుశోభితా ధూళిపాళ్లఆత్రం సక్కు🡆 More