భారతదేశ బడ్జెట్

భారతదేశ బడ్జెట్ భారతరాజ్యాంగంలోని ఆర్టికల్ 112 లో వార్షిక ఆర్థిక ప్రకటన అని పిలువబడుతుంది.

ఫిబ్రవరి 1 న ప్రభుత్వం దీనిని ప్రకటిస్తుంది. లోక్‌సభలో చర్చల అనంతరం ఆమోదం పొంది ఏప్రిల్ 1 నాటికి అనగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి అమలులోకి వస్తుంది. 2016 వరకు దీనిని ఫిబ్రవరి చివరి పని రోజున ఆర్థిక మంత్రి పార్లమెంటులో సమర్పించేవారు.

ఎన్నికల సంవత్సరంలో పూర్తి బడ్జెట్ కు బదులు మధ్యంతర బడ్జెట్ ప్రకటిస్తారు. ఇది 'ఖాతాపై ఓటు' (Vote on account)వలె ఉండదు. 'ఖాతా పై ఓటు' ప్రభుత్వ బడ్జెట్‌లోని వ్యయంవివరాలు మాత్రమే కలిగివుంటుంది. ఇది ఖర్చు, రశీదులతో పూర్తి వివరాలు కలిగి, పూర్తి బడ్జెట్‌తో సమానమైన ఆర్థిక నివేదికను ఇస్తుంది. దీనిలో పన్ను మార్పులను ప్రవేశపెట్టకూడదని షరతులు లేనప్పటికి, సాధారణంగా ఎన్నికల సంవత్సరంలో, ప్రభుత్వాలు ఆదాయపు పన్ను చట్టాలలో పెద్ద మార్పులు చేయవు.

2017 సెప్టెంబరు నాటికి, మొరార్జీ దేశాయి 10, పి చిదంబరం 9, ప్రణబ్ ముఖర్జీ 8, యశ్వంత్ సిన్హా , యశ్వంత్రావ్ చవాన్, సిడి దేశ్ముఖ్ లు 7, టిటి కృష్ణమాచారి, మన్మోహన్ సింగ్ లు 6 బడ్జెట్లను ప్రవేశపెట్టారు.

2019 నుంచి వరుసగా 2023 వరకు కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ సమర్పించారు.

చరిత్ర

స్వతంత్ర భారతదేశం మొదటి యూనియన్ బడ్జెట్‌ను ఆర్కె షణ్ముఖం చెట్టి 1947 నవంబరు 26 న న సమర్పించారు. మొత్తం ఆదాయం ₹ 171.15 కోట్లు, ఆర్థిక లోటు ₹ 24.59 కోట్లు. రక్షణ వ్యయం 92.74 కోట్లతో మొత్తం వ్యయం. 197.29 కోట్లుగా అంచనా వేయబడింది.

రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, మధ్యంతర ఎన్నికలు తప్పనిసరి కావడంతో 1991-92 లో తొలిగా మధ్యంతర బడ్జెట్ ను సమర్పించాడు.

రాజకీయ పరిణామాల కారణంగా 1991 మే లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ అధికారంలోకి వచ్చింది.ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ 1991-92 పూర్తిబడ్జెట్‌ను సమర్పించాడు.

పివి నరసింహారావు మంత్రిత్వంలో మన్మోహన్ సింగ్ 1992 నుండి 1993 వరకు తన తదుపరి వార్షిక బడ్జెట్లలో ఆర్థిక వ్యవస్థను, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాడు, గరిష్ట దిగుమతి సుంకాన్ని 300 కంటే ఎక్కువ శాతం నుండి 50 శాతానికి తగ్గించాడు.

మోడీ రెండవ ప్రభుత్వంలో నిర్మల సీతారామన్ 2019–2020 కేంద్ర బడ్జెట్‌ను 2019 జులై 5 న నాడు తన తొలి బడ్జెట్ ఉపన్యాసం చేసింది. 2020 – 2021 కేంద్ర బడ్జెట్‌ను 2020 ఫిబ్రవరి 1 న నాడు సమర్పించింది.

సంప్రదాయాలు

హల్వా వేడుక

ప్రకటనకు సుమారు ఒక వారం ముందు, బడ్జెట్ పత్రాల ముద్రణ పార్లమెంటులో 'హల్వా వేడుక'తో ప్రారంభమవుతుంది. హల్వాను బడ్జెట్ రూపకల్పనలో పాల్గొనే అధికారులు, సహాయక సిబ్బందికి వడ్డిస్తారు. వారు బడ్జెట్ సమర్పించే వరకు నార్త్ బ్లాక్ కార్యాలయంలో బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వుంటారు. ఈ వేడుక ఒక ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు తీపి తినాలనే భారతీయ సంప్రదాయంలో భాగంగా జరుగుతుంది.

బడ్జెట్ ప్రకటన సమయం

1999 సంవత్సరం వరకు, ఫిబ్రవరి నెల చివరి పని రోజున సాయంత్రం 5:00 గంటలకు కేంద్ర బడ్జెట్ ప్రకటించబడింది. ఈ పద్ధతి బ్రిటీషు పరిపాలన నాటిది.1990 ల వరకు, బడ్జెట్లన్నీ పన్నులను పెంచడం కావున, వస్తు సేవల నిర్మాతలకు, పన్ను వసూలు చేసే ఏజెన్సీలకు తగిన సవరణలు చేయడానికి ఆ రోజు రాత్రి పనిచేసి నిర్ణయించే అవకాశం వుండేది. అటల్ బిహారీ వాజ్‌పేయికి చెందిన ఎన్‌డిఎ ప్రభుత్వంలో ( భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని) అప్పటి భారత ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా, 1999 కేంద్ర బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు ప్రకటించడం ద్వారా ఆచారాన్ని మార్చాడు.

బడ్జెట్ ప్రకటన తేదీ

నరేంద్ర మోడీ ఎన్‌డిఎ ప్రభుత్వంలో ( భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో) ఆర్థిక మంత్రి (భారతదేశం) అరుణ్ జైట్లీ, 2016 ఫిబ్రవరి 1 న బడ్జెట్ ప్రకటించాడు. 92 సంవత్సరాలకు విడిగా సమర్పించబడే రైల్ బడ్జెట్, కేంద్ర బడ్జెట్‌తో విలీనం చేయబడింది.

బడ్జెట్ పత్రాలు

సంప్రదాయంలో భాగంగా 2018 వరకు ఆర్థిక మంత్రులు బడ్జెట్‌పత్రాలను తోలు పెట్టె (బ్రీఫ్‌కేస్‌)లో తీసుకువెళ్లారు. ఈ సంప్రదాయాన్ని భారత మొదటి ఆర్థిక మంత్రి ఆర్.కె.శణ్ముఖం చెట్టి ప్రారంభించాడు. 2019 జులై 5 న నిర్మలా సీతారామన్, బాహి-ఖాతాలో బడ్జెట్‌ను తీసుకువెళ్లటంతో ఈ సంప్రదాయం మారింది.

2021 ఫిబ్రవరి 1 న, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి డిజిటల్ బడ్జెట్‌ను సమర్పించింది. భారతదేశంలో COVID-19 మహమ్మారి కారణంగా ఇది జరిగింది.

2021-2022 కేంద్ర బడ్జెట్

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యాంశాలు

  • కోవిడ్19 టీకాలకు రూ. 35,400 కోట్లు
  • జల జీవన్ మిషన్‌కు రూ. 2,87,000 కోట్లు
  • 6 సంవత్సరాలకు గాను రూ. 64,180 కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్ యోజన పేరుతో కొత్త పథకం
  • రక్షిత మంచినీటి పథకాల కోసం రూ. 87 వేల కోట్లు; 2 కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు
  • 64,150 కోట్లతో ఆత్మనిర్భర భారత్
  • రైల్వేలకు 1.10 లక్షల కోట్లు, ప్రజా రవాణాకు రూ. 18.000 కోట్లు
  • ఆదాయపు పన్నులలో మార్పులు లేవు, 75 సంవత్సరాల వయోవృద్ధులు కేవలం పించన్, వడ్డీల పైన ఆధారపడినట్లయితే వారు వార్షిక ఆదాయపుపన్ను పత్రం (ITR) సమర్పించనవసరంలేదు

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చేపల ఓడరేవు నిర్మాణం కేటాయింపు, విజయవాడ-ఖరగ్ పూర్ రవాణా కారిడార్ వలన పెద్దగా వరిగేది లేదని, ముఖ్యమైన పోలవరం సవరించిన అంచనాలు, విశాఖ మెట్రోల గురించి ప్రస్తావన లేదని ఎంపి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించాడు.


మూలాలు

బాహ్య లింకులు

Tags:

భారతదేశ బడ్జెట్ చరిత్రభారతదేశ బడ్జెట్ సంప్రదాయాలుభారతదేశ బడ్జెట్ 2021-2022 కేంద్ర బడ్జెట్భారతదేశ బడ్జెట్ మూలాలుభారతదేశ బడ్జెట్ బాహ్య లింకులుభారతదేశ బడ్జెట్భారత పార్లమెంటుభారత రాజ్యాంగంభారతదేశంలోక్‌సభ

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత కేంద్ర బడ్జెట్ 2023 - 24భారతరత్ననెట్‌ఫ్లిక్స్తెలంగాణ రాష్ట్ర సమితివీర్యంఘటోత్కచుడుఅల్లూరి సీతారామరాజురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)బరాక్ ఒబామారాజ్యసభకల్వకుంట్ల చంద్రశేఖరరావు2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలుబ్రహ్మపుత్రా నదిసర్వాయి పాపన్నదానందక్షిణ భారతదేశంమౌర్య సామ్రాజ్యంజోరుగా హుషారుగాతెలుగు శాసనాలుమానవ పరిణామంధర్మరాజుఓ మంచి రోజు చూసి చెప్తాకుంభరాశివిశ్వబ్రాహ్మణభారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలుతేలులోక్‌సభ స్పీకర్రామానుజాచార్యుడుతిక్కనటి. రాజాసింగ్ లోథ్అనంత శ్రీరామ్శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఎస్.వి. రంగారావుఓం నమో వేంకటేశాయవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిరాధచాకలిస్వాతి నక్షత్రముపావని గంగిరెడ్డిబగళాముఖీ దేవివిజయనగర సామ్రాజ్యంగద్దర్ఐక్యరాజ్య సమితిబూర్గుల రామకృష్ణారావుభారతీయ జనతా పార్టీమదర్ థెరీసారావణుడుచంద్రుడునడుము నొప్పిదక్ష నగార్కర్కరక్కాయగోల్కొండశాతవాహనులుదురదడేటింగ్వావిలిగరుడ పురాణంభారత జాతీయ కాంగ్రెస్మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంశ్రీశైల క్షేత్రంలలిత కళలుసతీసహగమనంవిష్ణు సహస్రనామ స్తోత్రమురక్త పింజరిఅయ్యప్పకుతుబ్ షాహీ వంశంనల్గొండ జిల్లాబలిజవాస్తు శాస్త్రంఇందిరా గాంధీచక్రితెలంగాణ రైతుబీమా పథకంఇంగువజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షఇస్లాం మతంవిజయవాడభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుభారతదేశం🡆 More