పెన్సిల్: వ్రాయుటకు వాడు పరికరం

పెన్సిల్ రాయడానికి, చిత్రలేఖనంలో భాగం అయిన స్కెచ్లు వేయటానికి ఉపయోగించే ఒక సాధనం.

ఇది గ్రాఫైట్, చెక్క నుంచి తయారు చేయబడుతుంది.

పెన్సిల్: పుట్టుక, చిత్రలేఖనం లో, భారత్ లో పెన్సిల్ కంపెనీలు
పెన్సిల్

పుట్టుక

పెన్సిల్ ని కనిపెట్టింది జోసెఫ్ డిక్సన్. ఆయన ఇంగ్లాండ్‌లో పుట్టాడు. చాలా పేదవాడు. ఇల్లు గడవటానిక ఒకచిన్న దుకాణంలో పనికి చేరాడు. యజమాని చెప్పింది గుర్తుపెట్టుకోవటానికి ఏం చెయ్యాలో తెలియక ఒకరోజు బయటపడి ఉన్న ఓ నల్లరాయితో గోడమీద రాశాడు. అంతే! ఆ రోజు నుంచి ముఖ్యమైన విషయాన్ని గోడమీద ఆ నల్లరాయితో రాసేవాడు. ఆ రాయే గ్రాఫైట్. డిక్సన్‌కు ఒక చిన్న ఆలోచన కలిగింది. ఆ రాయిని పొడిచేసి కాస్త ముద్దగా ఉండటానికి ఆముదంలాంటి పదార్ధాన్ని కలిపి, దాన్ని ఒక గొట్టంలోకి ఎక్కించి బాగా ఎండిన తర్వాత రాశాడు. బాగానే ఉంది. కానీ కాస్త బరువుగా ఉండి రాయడానికి అంతగా వీలుకాలేదు. చేతులు నల్లగా అయ్యేవి. చాలా ప్రయోగాలు చేశాడు. కొన్ని రోజులకు ఒక ఉపాయం తట్టింది.

ఒక సన్నని కొయ్య ముక్కని తీసుకుని దానికి ఒక చిన్న రంద్రాన్ని వేసి ముద్దగా ఉన్న గ్రాఫైట్‌ను నింపి బాగా ఎండిన తర్వాత రాశాడు. అద్భుతం! పెన్సిల్ తయారయింది. సన్నగా రాయడం, చేతులకు నలుపు అంటకపోవడం, వేగంగా రాయడం లాంటిది జరిగింది. మొదట్లో గుండ్రని పెన్సిళ్లు వచ్చేవి. తర్వాత మరెన్నో మార్పులతో నేడు పెన్సిల్ రకరకాలుగా ఉపయోగపడుతోంది. పెన్సిల్‌ని గ్రాఫైట్‌తో చేస్తారు. గ్రాఫైట్ అనేది ఒక కర్బన సమ్మేళనం. వజ్రం కూడా కర్బన పదార్థమే. కానీ వజ్రానికి ఉన్న కాఠిన్యం గ్రాఫైట్‌కు లేదు. పెన్సిల్ చెక్క గుండ్రంగా ఉండవచ్చు కానీ "సాధారణంగా" పంచభుజి, అష్టభుజి రూపాల్లోనే ఉంటే ఆ చెక్కతో ఎక్కువ పెన్సిళ్లను తయారుచేయవచ్చు.

చిత్రలేఖనం లో

పెన్సిల్ పలురకాలుగా లభ్యం అవుతాయి. కరకుగా గీతలు గీసే పెన్సిళ్ళు కొన్ని అయితే, మృదువుగా గీసేవి మరికొన్ని. పెన్సిళ్ళలో కరకుదనాన్ని H అక్షరం, మృదుత్వాన్ని B అక్షరం సూచిస్తాయి. ఉదా:4H పెన్సిల్ 2H పెన్సిల్ కంటే కరకుగా గీస్తుంది. 4B పెన్సిల్ 2B పెన్సిల్ కంటే మృదువుగా గీస్తుంది. మధ్యస్తంగా ఉండే HB పెన్సిల్ పై ఒత్తిడిని బట్టి, ఒత్తిడి ఎక్కువ ఉంటే మృదువుగా, తక్కువ ఉంటే కరకుగా గీస్తుంది. అత్యంత కరుకైన పెన్సిల్ 6H అయితే అత్యంత మృదువైన పెన్సిల్ 6B. 0.3 మి.మీ, 0.5 మి.మీ వ్యాసం ఉన్న మెకానికల్ పెన్సిళ్ళు సన్నని గీతలను వేయటానికి ఉపయోగిస్తారు. పెన్సిళ్ళతో బాటు బాల్ పాయింట్ పెన్ లు, మార్కర్లు, చార్కోల్ కూడా స్కెచింగ్ లో వినియోగిస్తారు.

భారత్ లో పెన్సిల్ కంపెనీలు

  • నటరాజ
  • కేమెల్

ఇవీ చూడండి

మూలాలు

Tags:

పెన్సిల్ పుట్టుకపెన్సిల్ చిత్రలేఖనం లోపెన్సిల్ భారత్ లో కంపెనీలుపెన్సిల్ ఇవీ చూడండిపెన్సిల్ మూలాలుపెన్సిల్చిత్రలేఖనంచెక్కస్కెచ్

🔥 Trending searches on Wiki తెలుగు:

రోహిత్ శర్మఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుభారతదేశంలో బ్రిటిషు పాలనశోభితా ధూళిపాళ్లవ్యవస్థాపకతకీర్తి సురేష్భారత ఆర్ధిక వ్యవస్థరామాయణంభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుడీజే టిల్లుతెలుగు నాటకరంగంనర్మదా నదికుంభరాశిఅనుష్క శెట్టిపుష్కరంప్రేమలుపాములపర్తి వెంకట నరసింహారావుపి.వెంక‌ట్రామి రెడ్డిసైబర్ సెక్స్ధర్మవరం శాసనసభ నియోజకవర్గంమిథునరాశివేమిరెడ్డి ప్రభాకరరెడ్డిఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుచరవాణి (సెల్ ఫోన్)విశాఖపట్నంరాజ్‌కుమార్పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినరసింహావతారం2024పాల కూరహనుమజ్జయంతిసన్నిపాత జ్వరంభద్రాచలంతెలుగు సాహిత్యంయువరాజ్ సింగ్రామ్ పోతినేనివేయి స్తంభాల గుడిఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమకరరాశిఆల్ఫోన్సో మామిడిచంద్రయాన్-3పులివెందుల శాసనసభ నియోజకవర్గంపిఠాపురం శాసనసభ నియోజకవర్గంనువ్వు లేక నేను లేనుక్షయవిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితారైలురమ్య పసుపులేటిగాయత్రీ మంత్రంశతభిష నక్షత్రముఅనూరాధ నక్షత్రంసంభోగంభీమసేనుడుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంఅల్లు అర్జున్ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాతీన్మార్ మల్లన్నబొత్స ఝాన్సీ లక్ష్మిమహాత్మా గాంధీహనుమంతుడుజాతిరత్నాలు (2021 సినిమా)భారతదేశంవీరేంద్ర సెహ్వాగ్ఋతువులు (భారతీయ కాలం)తెలంగాణ రాష్ట్ర సమితిచంద్రుడుభారత రాష్ట్రపతుల జాబితామేషరాశిప్రపంచ మలేరియా దినోత్సవంత్రిష కృష్ణన్సాహిత్యంమొఘల్ సామ్రాజ్యంతెలుగు సినిమాల జాబితాఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంఅనురాధ శ్రీరామ్ఇంటి పేర్లు🡆 More