నీలం రాజశేఖరరెడ్డి

నీలం రాజశేఖరరెడ్డి భారతీయ కమ్యూనిస్టు నేత, మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సోదరుడు.

1918లో అనంతపురం దగ్గర ఇల్లూరు గ్రామంలో నీలం చిన్నపరెడ్డి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధులు కల్లూరు సుబ్బారావు బెనారస్ జాతీయ కళాశాలలో రాజశేఖరరెడ్డిని, తరిమెల నాగిరెడ్డిని చేర్పించారు. మానవునికున్న ఆస్తిలో కెల్లా ప్రియమైనది జీవితమే! అలాంటి జీవితాన్ని గడిపే అవకాశం మనిషికి ఒకసారి మాత్రమే లభిస్తుంది. మానవజాతి విముక్తికోసం నా జీవితాన్ని వినియోగించాను అని సంతృప్తి పడగల జీవితాన్ని ప్రతి మానవుడూ గడపాలి- అన్న లెనిన్ మాటలు నీలానికి ఆదర్శం. 1943 జనవరిలో అనంతపురం జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకి ప్రథమ కార్యదర్శిగా అతను ఎన్నికయ్యారు. 1946లో 'అనంతపురం జిల్లా కమ్యూనిస్టు పార్టీ చరిత్ర రాశారు. 1938లో కమ్యూనిస్టు పార్టీలో చేరి మూడు సంవత్సరాలు రహస్య జీవితం గడిపాడు. 1941-42లో యుద్ధాన్ని వ్యతిరేకరించినందుకు, యుద్ధ వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేసినందుకు రెండున్నర సంవత్సరాలు జైలు జీవితం. ఆగ్రా సెంట్రల్ జైలు, బెనారస్ జిల్లా జైలు, చెరైలీ సెంట్రల్ జైలు, రాజమండ్రి, ఆలీపూర్, వెల్లూరు... ఇలా దేశంలో ప్రసిద్ధి పొందిన అన్ని జైళ్లల్లోనూ బందీ అయ్యారు. అతను ఆస్తిని 1952 ప్రాంతాల్లో పోలీసులు జప్తు చేశారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన నీలం తన యావదాస్తిని కమ్యూనిస్టు ఉద్యమానికే దానం చేశారు. చండ్ర రాజేశ్వరరావు, తమ్మారెడ్డి సత్యనారాయణ ల పేరుతో ఏర్పాటైన ట్రస్టులకు అధ్యక్షుడిగా పనిచేశారు. 1994 డిసెంబరు 13న నీలం కన్నుమూశారు.

నీలం రాజశేఖరరెడ్డి
నీలం రాజశేఖరరెడ్డి
జననంనీలం రాజశేఖరరెడ్డి
1918
అనంతపురం దగ్గర ఇల్లూరు
మరణం1994 డిసెంబరు 13
ప్రసిద్ధిభారతీయ కమ్యూనిస్టు నేత
రాజకీయ పార్టీకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
తండ్రినీలం చిన్నపరెడ్డి,
తల్లిసుబ్బమ్మ

చండ్ర రాజేశ్వరరావు పౌండేషను మార్కిస్టు అధ్యయనానికి హైదరాబాదు శివార్లలోని కొండాపూర్లో ఏర్పాటుచేసిన పరిశోధనా కేంద్రానికి రాజశేఖరరెడ్డి స్మృత్యర్ధం "నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం" అని పేరుపెట్టారు.

మూలాలు

Tags:

19181994అనంతపురంఅనంతపురం జిల్లాఇల్లూరు (గార్లదిన్నె మండలం)కమ్యూనిస్టుకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకల్లూరు సుబ్బారావుచండ్ర రాజేశ్వరరావుడిసెంబరు 13తమ్మారెడ్డి సత్యనారాయణతరిమెల నాగిరెడ్డిదానంనీలం సంజీవరెడ్డిబెనారస్రాజమండ్రిరాష్ట్రపతిలెనిన్సెంట్రల్ జైలు

🔥 Trending searches on Wiki తెలుగు:

కార్తెదశరథుడుభారతీయ సంస్కృతిఅక్బర్పెళ్ళిలైంగిక విద్యశుక్రుడుపల్లెల్లో కులవృత్తులువిష్ణువు వేయి నామములు- 1-1000సింహరాశినయన తారలలిత కళలుతెలుగు కథతామర వ్యాధిసుందర కాండబైబిల్అనుష్క శర్మజవహర్ నవోదయ విద్యాలయంపెంటాడెకేన్తెలుగుశ్రీముఖిపర్యావరణంముదిరాజ్ (కులం)జ్యేష్ట నక్షత్రంద్విగు సమాసమువిడాకులుకాజల్ అగర్వాల్చదలవాడ ఉమేశ్ చంద్రతెలంగాణ జిల్లాల జాబితాఅక్కినేని నాగార్జునరతన్ టాటామెదడుతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాపాలకొండ శాసనసభ నియోజకవర్గంసప్తర్షులుతీన్మార్ సావిత్రి (జ్యోతి)ఈనాడుభువనేశ్వర్ కుమార్నోటాబద్దెనటంగుటూరి ప్రకాశంజగ్జీవన్ రాంనవధాన్యాలుఈసీ గంగిరెడ్డిఆంధ్రజ్యోతిఘట్టమనేని కృష్ణతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుతెలుగుదేశం పార్టీపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిభగత్ సింగ్సుస్థిర అభివృద్ధి లక్ష్యాలురోహిత్ శర్మభూమిఆల్ఫోన్సో మామిడినితీశ్ కుమార్ రెడ్డిఏ.పి.జె. అబ్దుల్ కలామ్పెళ్ళి (సినిమా)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.యూట్యూబ్ఎఱ్రాప్రగడఢిల్లీ డేర్ డెవిల్స్రాప్తాడు శాసనసభ నియోజకవర్గంసెక్యులరిజంఖమ్మం లోక్‌సభ నియోజకవర్గందక్షిణామూర్తి ఆలయంపి.వి.మిధున్ రెడ్డివై.ఎస్.వివేకానందరెడ్డి హత్యరత్నం (2024 సినిమా)హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంరేవతి నక్షత్రంఅల్లసాని పెద్దనశ్యామశాస్త్రియేసు శిష్యులుచాట్‌జిపిటితెలుగు పదాలు🡆 More