నికోలా స్టర్జన్

నికోలా ఫెర్గసన్ స్టర్జన్ (జననం 1970 జూలై 19) ప్రముఖ స్కాటిష్ రాజకీయవేత్త.

ఆమె ప్రస్తుతపు స్కాటిష్ మొదటి మంత్రి (రాష్ట్రపతికి సమానమైన పదవి). 2014 నవంబరు నుంచి నికోలా స్కాటిష్ జాతీయ పార్టీకి నాయకురాలిగా పనిచేస్తోంది. ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి మహిళ ఈమే. నికోలా 1999 నుంచి, స్కాటిష్ పార్లమెంట్ లో సభ్యురాలిగా ఉంది. ఆమె మొట్టమొదట 1999 నుంచి 2007 వరకు గ్లాస్గో నియోజకవర్గానికి అదనపు శాసనసభ సభ్యురాలిగా ఉంటూ వచ్చింది. ఆ తరువాత గ్లాస్గో దక్షిణ నియోజకవర్గానికి (2007-2011 వరకు గ్లాస్గో గోవన్ నియోజకవర్గంగా ప్రసిద్ధం) సభ్యురాలిగా ఉంటోంది.

ది రైట్ హానరబుల్ నికోలా స్టర్జన్ స్కాటిష్ పార్లమెంట్ సభ్యురాలు
నికోలా స్టర్జన్


5 వ స్కాట్లాండ్ మొదటి మంత్రి (రాష్ట్రపతి హోదా)
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 నవంబరు 20
చక్రవర్తి ఎలిజబెత్ II
డిప్యూటీ జాన్ స్విన్
ముందు అలెక్స్ సాల్మండ్

స్కాటిష్ జాతీయ పార్టీ నాయకురాలు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 నవంబరు 14
డిప్యూటీ స్టెవార్ట్ హోసీ
ఏంగస్ రాబర్ట్ సన్
ముందు అలెక్స్ సాల్మండ్

స్కాట్లాండ్ డిప్యూటీ మొదటి మంత్రి
పదవీ కాలం
2007 మే 17 – 2014 నవంబరు 19
మొదటి మంత్రి అలెక్స్ సాల్మండ్
ముందు నికోల్ స్టీఫెన్
తరువాత జాన్ స్విన్

మౌలిక వసతుల కల్పన, పెట్టుబడులు, నగరాల శాఖకు క్యాబినేట్ కార్యదర్శి
పదవీ కాలం
2012 సెప్టెంబరు 5 – 2014 నవంబరు 19
మొదటి మంత్రి అలెక్స్ సాల్మండ్
ముందు అలెక్స్ నైల్
తరువాత కెయిత్ బ్రౌన్

ఆరోగ్యం, సంక్షేమ శాఖ క్యాబినెట్ కార్యదర్శి
పదవీ కాలం
2007 మే 17 – 2012 సెప్టెంబరు 5
మొదటి మంత్రి అలెక్స్ సాల్మండ్
ముందు ఆండీ కెర్
తరువాత అలెక్స్ నైల్

స్కాటిష్ జాతీయ పార్టీ నాయకురాలు
పదవీ కాలం
2004 సెప్టెంబరు 3 – 2014 నవంబరు 14
నాయకుడు అలెక్స్ సాల్మండ్
ముందు రోజైన్నా కన్నింగ్ హామ్
తరువాత స్టీవర్ట్ హోసే

స్కాటిష్ పార్లమెంట్ సభ్యురాలు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2011 మే 6
ముందు నియోజకవర్గం స్థాపించబడింది
మెజారిటీ 9,593 (38.5%)

స్కాటిష్ పార్లమెంట్ సభ్యురాలు
గ్లాస్గో గోవన్ నియోజకవర్గం నుంచి గెలుపు
పదవీ కాలం
2007 మే 3 – 2011 మే 5
ముందు గోర్డన్ జాక్సన్
తరువాత నియోజకవర్గం స్థాపించబడింది

స్కాటిష్ పార్లమెంట్ సభ్యురాలు
గ్లాస్గో గోవన్ నియోజకవర్గం నుంచి గెలుపు
పదవీ కాలం
1999 మే 6 – 2007 మే 3
ముందు నియోజకవర్గం స్థాపించబడింది
తరువాత బాబ్ డోరిస్

వ్యక్తిగత వివరాలు

జననం (1970-07-19) 1970 జూలై 19 (వయసు 53)
ఐర్విన్, ఏర్ షైర్, స్కాట్లాండ్
రాజకీయ పార్టీ స్కాటిష్ జాతీయ పార్టీ
జీవిత భాగస్వామి పీటర్ ముర్రెల్ (2010 జూలై 16)
నివాసం బూట్ హౌస్
పూర్వ విద్యార్థి గ్లాస్గో విశ్వవిద్యాలయం
వృత్తి న్యాయవాది
వెబ్‌సైటు First Minister of Scotland

నికోలా, గ్లాస్గో విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించింది. గ్లాస్గోలో న్యాయవాదిగా కూడా కొన్నాళ్ళు పనిచేసింది. స్కాటిష్ పార్లమెంట్ లో సభ్యురాలిగా ఎన్నికైన తరువాత, స్కాటిష్ నేషనల్ పార్టీకి చాలా ఏళ్ళు విద్య, ఆరోగ్య, న్యాయ శాఖలకు ఛాయా మంత్రిగా ఎంతో కృషి చేసింది. 2004లో ఆ పార్టీ నాయకుడు జాన్ స్విన్నే రాజీనామా చేసిన తరువాత, ఆ స్థానానికి తాను నిలబడతానని ప్రకటించింది. అయితే తరువాత, అలెక్స్ సాల్మండ్ కు అనుకూలంగా, తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేసుకుంది. దానికి బదులుగా సహ నాయకురాలి స్థానానికి పోటీ చేసింది.

అలెక్స్, నికోలాలు ఎన్నికైన తరువాత, ఆమె సహ నాయకురాలిగా పనిచేసింది. 2004 నుంచి 2007 వరకు పార్టీని నడిపించింది ఆమె. 2007 సార్వత్రిక ఎన్నికల్లో స్కాటిష్ నేషనల్ పార్టీ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాంతో అలెక్స్ సాల్మండ్ స్కాట్లాండ్ కు మొదటి మంత్రి, ఆరోగ్యం, సంక్షేమ శాఖ క్యాబినెట్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 2012లో నికోలా మౌలిక వసతుల కల్పన, పెట్టుబడులు, నగరాల శాఖకు క్యాబినేట్ కార్యదర్శిగా నియమింపబడింది.

"ఎస్" ఉద్యమం విఫలమైన తరువాత స్కాటిష్ నేషనల్ పార్టీ నాయకుడు సాల్మండ్, నవంబరులో తన రాజీనామాను ప్రకటించాడు. ఇంకో మొదటి మంత్రి నియమించబడేవరకూ మాత్రం ఆ స్థానంలో కొనసాగుతానని తెలిపాడు. ఒక్క నామినేషన్ కూడా నమోదు కాకపోవడంతో, సహ నాయకురాలిగా ఉన్న నికోలా, పార్టీ నాయకురాలిగా, స్కాటిష్ ప్రభుత్వ మొదటి మంత్రిగా నవంబరు 19న ఏకగ్రీవంగా ఎన్నికైంది.

2016లో ఫోర్బ్స్ పత్రిక ప్రపంచంలోని 50వ, యుకెలో రెండవ అత్యంత శక్తివంతమైన మహిళగా నికోలాను పేర్కొంది. 2015లో, బిబిసి రేడియో 4 ప్రసారం చేసే ఉమెన్స్ అవర్ లో ఆమెను యుకెలోనే అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన మహిళగా పేర్కొన్నారు.

తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం

నికోలా ఫెర్గసన్ స్టర్జన్ ఐర్విన్ లోని ఏర్ షైర్ ఆసుపత్రిలో 1970 జూలై 19న జన్మించింది. ఆమె ముగ్గురు అక్కచెల్లెళ్ళలో పెద్దది. నికోలా తండ్రి రాబిన్ స్టర్జన్ (జననం 1948) ఎలక్ట్రీషియన్, తల్లి జాన్ కెర్ స్టర్జన్ (జననం 1952) దంతశాలలో నర్సు. ఆమె కుటుంబ మూలాలు ఈశాన్య ఇంగ్లాండ్ లో ఉన్నాయి. ఆమె తండ్రి తల్లి రైహోప్ కు చెందినది. ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని సిటీ ఆఫ్ సండర్ ల్యాండ్ అని వ్యవహరిస్తున్నారు.

నోట్స్

మూలాలు

Tags:

గ్లాస్గో

🔥 Trending searches on Wiki తెలుగు:

జవహర్ నవోదయ విద్యాలయంనిఖిల్ సిద్ధార్థభరణి నక్షత్రముఆంధ్రజ్యోతిసంగీతంఅశ్వని నక్షత్రముదూదేకులగొట్టిపాటి రవి కుమార్వినాయక చవితిపి.వెంక‌ట్రామి రెడ్డివృశ్చిక రాశిభీష్ముడునువ్వు నేనుఉష్ణోగ్రతవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంశాసనసభకన్యారాశిశ్రవణ కుమారుడుహార్దిక్ పాండ్యాయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీబీమాభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాహను మాన్బతుకమ్మPHగర్భాశయముట్రావిస్ హెడ్హనుమంతుడువిభక్తిటంగుటూరి ప్రకాశంనితీశ్ కుమార్ రెడ్డిఆంధ్రప్రదేశ్ చరిత్రకోవూరు శాసనసభ నియోజకవర్గంనెమలిఆతుకూరి మొల్లపుష్యమి నక్షత్రముఅనుష్క శర్మషాహిద్ కపూర్తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకాజల్ అగర్వాల్లక్ష్మివిడాకులుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుతెలుగు వ్యాకరణంనరసింహ శతకముఅమెరికా రాజ్యాంగంకరోనా వైరస్ 2019విరాట పర్వము ప్రథమాశ్వాసముభారతదేశ సరిహద్దులుశ్రీలలిత (గాయని)సజ్జలుభారత సైనిక దళంమరణానంతర కర్మలుశ్యామశాస్త్రిమామిడిజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితానజ్రియా నజీమ్తమన్నా భాటియాగురజాడ అప్పారావుఉండి శాసనసభ నియోజకవర్గంశుభాకాంక్షలు (సినిమా)శ్రీశైల క్షేత్రంవెలిచాల జగపతి రావుభారతదేశంలో సెక్యులరిజంపార్లమెంటు సభ్యుడుఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఅమర్ సింగ్ చంకీలాకల్వకుంట్ల కవితతీన్మార్ మల్లన్నరజత్ పాటిదార్నీటి కాలుష్యంమఖ నక్షత్రముప్రజా రాజ్యం పార్టీసూర్య నమస్కారాలుజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంరవీంద్రనాథ్ ఠాగూర్లలిత కళలుఓటు🡆 More