దాట్ల సత్యనారాయణ రాజు

కల్నల్ డి.యస్.రాజుగా ప్రసిద్దుడైన దాట్ల సత్యనారాయణ రాజు ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, భారత పార్లమెంట్ సభ్యుడు.

దాట్ల సత్యనారాయణ రాజు
దాట్ల సత్యనారాయణ రాజు

దాట్ల సత్యనారాయణ రాజు


పార్లమెంటు సభ్యుడు
నియోజకవర్గం రాజమండ్రి లోక సభ నియోజక వర్గం

వ్యక్తిగత వివరాలు

జననం ఆగష్టు 28 1904
పోడూరు, పశ్చిమ గోదావరి జిల్లా
మరణం 1973
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
సంతానం 4; ఒక కుమారుడు , ముగ్గురు కుమార్తెలు
మతం హిందూ
వెబ్‌సైటు [1]
దాట్ల సత్యనారాయణ రాజు
పోడూరు ప్రధాన రహదారిపై కల కల్నల్ రాజు విగ్రహము

జననం

పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు గ్రామం ఈయన జన్మస్థలం. ఈయన 1904, ఆగష్టు 28 న జన్మించాడు.

బాల్యము-విద్యాభ్యాసము

ఈయన తలిదండ్రులు దాట్ల రామఛంద్రరాజు, అచ్చయ్యమ్మ. ఈయన ప్రాథమిక, ఉన్నత విద్యలు స్వగ్రామమైన పోడూరు లోనే పూర్తి అయినవి. తదనంతరం 1924లో విశాఖపట్టణంలో ఆంధ్ర వైద్య కళాశాల మొదటి బాచ్ ఎమ్.బి.,బి.యస్.లో చేరి 1929లో విద్య పూర్తి చేసుకొని అదే సంవత్సరము లండన్లో ప్రసిద్ధి చెందిన రాయల్ కాలేజీలో మొదట ఫిజీషియన్ గా ఉత్తీర్ణుడైన తరువాత ఇటలీలో వి.యన్.ఐలో టి.బి. స్పెషలైజ్ చేసాడు.

తదనంతరం ఎల్,ఆర్,సి,పి,యమ్,ఆర్,సి,యస్ ఇంగ్లండులో పూర్తి చేసి తదనంతరం ఆర్,సి,సి,పి మేజర్ ఐ యమ్ యస్ రిటైర్డు ఎక్ష్ కల్నల్ ఐ ఎన్ ఏ డైరెక్టర్, కన్సల్టింగ్ ఫిజీషియన్ గా 1932లో స్వదేశానికి తిరిగి వచ్చాడు. తదనంతరం కొంతకాలం పోడూరు లోనే ప్రాక్టీసు చేసి 1934లో ఇండియన్ మెడికల్ సర్వీసులో ఉధ్యోగము చేపట్టినాడు. ఈయన భారత సైన్యంలో 1934 నుండి 1945 వరకు మేజర్ గా ఉన్నాడు.

ఆయన కాకినాడలో గల మెడికల్ ఎడ్యుకేషన్ సొసైటీకి వ్యవస్థాపక అధ్యక్షుడు.1958 లో కాకినాడలో గల రంగరాయ మెడికల్ కళాశాల ఈయన ఆధ్వర్యంలో స్థాపించబడింది. ఈ కాలేజి ప్రధాన లక్ష్యం వైద్య విద్యను అభివృద్ధిచేయుట, వైద్య పరిశోధనలు చేయుట, స్వచ్ఛందంగా వైద్య సహాయాలు చేయుట. ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఈ కాలేజీ స్థాపనకు 5 లక్షల రూపాయలు విరాళంగా యిచ్చిరి. ఆయన అభ్యర్థనపై ఈ కళాశాల పేరును పెండ్యాల రంగారావు, జమీందారు, ముళ్లపూడి వెంకట రాయుడు మెమోరియల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ గా మార్చబడింది.

ఆయన 2వ, 3వ, 4వ, లోక సభకు రాజమండ్రి నియోజకవర్గం నుండి 1957,1962, 1967 లలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైనాడు. ఆయన 1962-64లో డిప్యూటీ వైద్య మంత్రిగా, 1964-66 లో రక్షణ శాఖలో డిప్యూటీ మంత్రిగా ఉన్నాడు.

మరణం

ఈయన 1973 లో మరణించాడు.

సూచికలు

ఇతర లింకులు

Tags:

దాట్ల సత్యనారాయణ రాజు జననందాట్ల సత్యనారాయణ రాజు బాల్యము-విద్యాభ్యాసముదాట్ల సత్యనారాయణ రాజు మరణందాట్ల సత్యనారాయణ రాజు సూచికలుదాట్ల సత్యనారాయణ రాజు ఇతర లింకులుదాట్ల సత్యనారాయణ రాజు

🔥 Trending searches on Wiki తెలుగు:

అ ఆటంగుటూరి సూర్యకుమారివిశాఖ నక్షత్రముఏప్రిల్ 25యాదవసంస్కృతందసరాపెళ్ళిగూగ్లి ఎల్మో మార్కోనిభూమిసురేఖా వాణివినోద్ కాంబ్లీఘిల్లికర్ణుడుఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంపంచభూతలింగ క్షేత్రాలుఎన్నికలుభారతీయ జనతా పార్టీశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)ఘట్టమనేని మహేశ్ ‌బాబుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్టమాటోభారత రాజ్యాంగ పీఠికకిలారి ఆనంద్ పాల్నువ్వు లేక నేను లేనుఅమెజాన్ ప్రైమ్ వీడియోకర్కాటకరాశికృత్తిక నక్షత్రమువై.యస్. రాజశేఖరరెడ్డికొల్లేరు సరస్సువేయి స్తంభాల గుడితాటి ముంజలుఅంగారకుడు (జ్యోతిషం)వర్షం (సినిమా)చార్మినార్జవాహర్ లాల్ నెహ్రూకొడాలి శ్రీ వెంకటేశ్వరరావుమేషరాశిమొఘల్ సామ్రాజ్యంఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంఅమిత్ షాసుడిగాలి సుధీర్మహాకాళేశ్వర జ్యోతిర్లింగంరాహువు జ్యోతిషంగురుడురేవతి నక్షత్రంఫహాద్ ఫాజిల్ట్విట్టర్ప్రియ భవాని శంకర్చరవాణి (సెల్ ఫోన్)జే.సీ. ప్రభాకర రెడ్డిలోక్‌సభమేరీ ఆంటోనిట్టేఆర్టికల్ 370 రద్దుసిద్ధార్థ్రుక్మిణీ కళ్యాణంగైనకాలజీసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్సంధిచెమటకాయలుతాన్యా రవిచంద్రన్అన్నమయ్య జిల్లాసలేశ్వరంభారతదేశ సరిహద్దులుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుస్టాక్ మార్కెట్ద్రౌపది ముర్ముగౌడఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీషణ్ముఖుడువాట్స్‌యాప్అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుకోవూరు శాసనసభ నియోజకవర్గంరష్మికా మందన్ననువ్వు నేనుఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థబుధుడుఉప్పు సత్యాగ్రహంపరిటాల రవి🡆 More