దక్షిణేశ్వర కాళికాలయం

దక్షిణేశ్వర కాళికాలయం (బెంగాలీ: দক্ষিনেশ্বর কালী মন্দির ) భారతదేశ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్ కతా నగరమునందలి దక్షిణేశ్వరములో నెలకొనియున్న ఒక కాళికాలయం.

హుగ్లీ నదియొక్క తూర్పు తీరమున నెలకొన్న ఈ కోవెలలో కాళికామ్మవారు భవతారిణి అను పేరుతో కొలువబడుదురు. భవతారిణి అనిన భవసాగరమును(సంసార సాగరమును) దాటించునని అర్థము. ఈ ఆలయము 1855 లో రాణి రాస్మణి అనెడి సంపన్న భక్తురాలిచే నిర్మింపబడెను.

దక్షిణేశ్వర కాళికాలయం
দক্ষিণেশ্বর কালী মন্দির
దక్షిణేశ్వర కాళికాలయం
दक्षिणेश्वर काली मन्दिर
దక్షిణేశ్వర కాళికాలయం দক্ষিণেশ্বর কালী মন্দির is located in West Bengal
దక్షిణేశ్వర కాళికాలయం দক্ষিণেশ্বর কালী মন্দির
దక్షిణేశ్వర కాళికాలయం
দক্ষিণেশ্বর কালী মন্দির
Location in West Bengal
భౌగోళికాంశాలు:22°39′18″N 88°21′28″E / 22.65500°N 88.35778°E / 22.65500; 88.35778
పేరు
స్థానిక పేరు:దక్షిణేశ్వర కాళికాలయము
దేవనాగరి:दक्षिणेश्वर काली मन्दिर
Sanskrit transliteration:दक्षिणेश्वर काली मन्दिर
బెంగాలీ:দক্ষিণেশ্বর কালী মন্দির
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:పశ్చిమ బెంగాల్
జిల్లా:ఉత్తర 24 పరగణాలు
ప్రదేశం:కోల్‌కతా
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:Bhavatarini Kali
ప్రధాన పండుగలు:Kali Puja, Snana Yatra, Kalpataru Day
నిర్మాణ శైలి:Bengal architecture
ఆలయాల సంఖ్య:12:शिवलिंग(Shiv Lings) & 1:मुख्य मंदिर(Main Temple)
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
1855
నిర్మాత:Rani Rashmoni
వెబ్‌సైటు:Official website

చరిత్ర

దక్షిణేశ్వర కాళికాలయం 19 వ శతాబ్ద మధ్య కాలంలో రాణీ రాష్మోనీ చే స్థాపించబడినది. Rani Rashmoni belonged to Kaivarta caste ఈ దేవాలయం ఆమె యొక్క దాతృత్వ కార్యకలాపాలతో ప్రసిద్ధమైంది. 1847 లో రాష్మోనీ తీర్థయాత్రల కొరకు కాశీ నగరం లో నెలకొనిఉన్న ఆదిపరాశక్తి ని దర్శించుటకు వెళ్ళడానికి నిశ్చయించుకుంది. రాణీ 24 పడవలలో ఆమె బంధువులు, సేవకులు, సామాగ్రి తో బయలుదేరింది. సాంప్రదాయక ఆధారాల ప్రకారం ఆమె తీర్థయాత్రకు బయలుదేరిన ముందు రోజు రాత్రి కాళీ మాత అమె స్వప్నంలో కనబడి యిలా చెప్పింది.


బెనారస్ వెళ్ళవలసిన అవసరం లేదు. నా విగ్రహాన్ని గంగానదీ తీరంలో అందమైన దేవాలయంలో ప్రతిష్టించి అక్కడే పూజించండి. అచ్చట ప్రతిష్టించిన చిత్రంలో నుండి మీ ప్రార్థనలను స్వీకరిస్తాను.

స్వప్నం యొక్క ప్రభావంతో ఆమె వెంటనే దక్షిణేశ్వరం గ్రామంలో 20 ఎకరాల స్థలాన్ని కొని 1847 నుండి 1855 వరకు అతి పెద్ద దేవాలయ సముదాయాన్ని నిర్మించింది. ఈ 20-acre (81,000 m2) స్థలాన్ని ఒక ఆంగ్లేయుడైన జాన్ హాస్టీ వద్ద కొన్నది. అప్పటికి ఈ స్థలం "సహేబాన్ బగీచా" గా ప్రసిద్ధమైనది. అప్పటికి ఆ స్థలంలో ముస్లిం సమాధుల స్థలం తాబేలు ఆకారంలో ఉండెదిది. తంత్ర సంప్రదాయాల ప్రకారం శక్తి ఆరాధన యోగ్యమైనదిగా భావిస్తారు, కనుక ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేయడానికి ఎనిమిది సంవత్సరాల కాలం, తొమ్మిది వందల వేల ధనం ఖర్చు అయినది. చివరికి మే 31 1855 న కాళీ మాత "స్నేహ యాత్ర" దినాన ఈ దేవాలయంలో కాళీ మాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఉత్సవాలలో ఈ దేవాలయం ప్రధానంగా "శ్రీ శ్రీ జగదీశ్వరి మహాకాళి" గా ప్రసిద్ధమైంది. మే 31 1855 న ఒక లక్ష మంది కంటే ఎక్కువమండి బ్రాహ్మణులను విదిధ ప్రాతాలనుండి ఆహ్వానించడం జరిగినది. ఆ తర్వాతి సంవత్సరం ఆలయ ప్రధాన అర్చకుడు రామకుమార్ చటోపాధ్యాయ మరణించారు. ఆయన బాధ్యతలను ఆయన సోదరుడైన ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువైన రామకృష్ణ పరమహంస , రామకృష్ణుని భార్య శారదా దేవి లకు అప్పగించబడినది. వారు ఆ దేవాలయం దక్షిణ భాగంలో గల "నహాబాత్" (సంగీత గది) లో ఉండేవారు. ఆయన 1886 లో మరణించినంత వరకు గల 30 సంవత్సరాలు రామకృష్ణులవారు ఆలయ కీర్తి ప్రతిష్టలు పెంపొంచించే విధంగా విశేష కృషి చేసారు.

దేవాలయం ప్రారంభోత్సవం జరిగిన ఐదు సంవత్సరాల తొమ్మిది నెలలు మాత్రమే రాణీ రాష్మోనీ జీవించారు. ఆమె 1861 లో తీవ్ర అనారోగ్యపాలయ్యారు. ఆమె మరణించే ముందు ఆమె దీనాజ్ పట్ (ప్రస్తుతం బంగ్లాదేశ్ లో కలదు) లో కొంత ఆస్థిని కొని ఆలయ నిర్వాహణ కొరకు దేవాలయ ట్రస్టీకి అప్పగించాలని నిర్ణయించుకున్నారు. అదే విధంగా ఆమె ఫిబ్రవరి 18 1861 లో చేసి ఆ మరుసటి దినం స్వర్గస్తులైనారు.

నిర్మాణకళ

ఈ దేవాలయం బెంగాలీ నిర్మాణ శైలిలో తొమ్మిది స్తంబాలు లేదా "నవ-రత్న" అనే సాంప్రదాయ పద్ధతిలో నిర్మించారు. మూడు అంతస్తులు దక్షిణ ముఖ దేవాలయం తొమ్మిది స్థంబాలు పైన రెండు అంతస్తులలో విభజింపబడింది. ఇది ఎత్తుగా ఉన్న వేదికపై నిర్మించబడినది. ఇది 46 feet (14 m) చదరాలు కొలత, 100 feet (30 m) ఎత్తు కలిగిన మెట్ల నిర్మాణం కలిగి యున్నది.

ఈ దేవాలయం గర్భగృహం లో ప్రధాన దేవత "కాళీమాత". ఈ దేవత స్థానికంగా "భవతరణి" గా పిలువబడుతుంది. ఈమె శివుని ఉదరంపై నిలబడినట్లు ఉంటుండి. ఈ రెండు విగ్రహాలు వేయి రేకుల వెండి కమలంపై ఉండేటట్లు నిర్మించబడినది.

ప్రధాన ఆలయం దగ్గరగా పన్నెండు (12) ఒకేలా ఉన్న శివాలయాలు నిర్మిచబడినవి. అవి అన్నీ తూర్పు ముఖంగా "ఆట్ ఛాలా" అనే బెంగాలీ నిర్మాణ శైలిలో నిర్మితమైనవి. అవి అన్నీ హుగ్లీ నది యొక్క రెండు వైపులా ఉన్న తీరంలో నిర్మితమైనవి. ఈ దేవాలయ సముదాయ ఈశాన్యంలో విష్ణు దేవాలయం లేదా రాధా కాంత దేవాలయం నెలకొని యున్నది. మెట్ల వరుసలు వరండా, దేవాలయంలోనికి ఉన్నవి. ఇచట వెండి సింహాసనం పై 21+12-inch (550 mm) కృష్ణుని విగ్రహం , 16-inch (410 mm) రాధ విగ్రహం ఉన్నవి.

యితర పఠనాలు

చిత్రమాలిక

నోట్సు

మూలాలు

ఇతర లింకులు

Tags:

దక్షిణేశ్వర కాళికాలయం చరిత్రదక్షిణేశ్వర కాళికాలయం నిర్మాణకళదక్షిణేశ్వర కాళికాలయం యితర పఠనాలుదక్షిణేశ్వర కాళికాలయం చిత్రమాలికదక్షిణేశ్వర కాళికాలయం నోట్సుదక్షిణేశ్వర కాళికాలయం మూలాలుదక్షిణేశ్వర కాళికాలయం ఇతర లింకులుదక్షిణేశ్వర కాళికాలయంపశ్చిమ బెంగాల్బెంగాలీ

🔥 Trending searches on Wiki తెలుగు:

చార్మినార్అరుణాచలంఅశోకుడుకస్తూరి రంగ రంగా (పాట)మహా జనపదాలుతేలుమంతెన సత్యనారాయణ రాజుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీరోజా సెల్వమణిసాయిపల్లవిఆర్య (సినిమా)ఉత్తరాభాద్ర నక్షత్రమువరంగల్ లోక్‌సభ నియోజకవర్గంపరిటాల రవిఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంబుర్రకథకన్యారాశిఊర్వశితెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్మెయిల్ (సినిమా)పన్ను (ఆర్థిక వ్యవస్థ)అమ్మకోసంప్రజా రాజ్యం పార్టీజమ్మి చెట్టుపాండవులుఎల్లమ్మసద్గురురామ్ చ​రణ్ తేజజాతీయ ఆదాయంభారత కేంద్ర మంత్రిమండలిమఖ నక్షత్రముప్లేటోముఖేష్ అంబానీతట్టుమిథునరాశిసెల్యులార్ జైల్జ్యోతీరావ్ ఫులేసన్ రైజర్స్ హైదరాబాద్శ్రీలీల (నటి)వై.యస్.రాజారెడ్డిపంచభూతలింగ క్షేత్రాలుచతుర్యుగాలుమహాభాగవతంఒగ్గు కథశ్రీరామనవమిహృదయం (2022 సినిమా)భారత ఆర్ధిక వ్యవస్థగోదావరిఅరవింద్ కేజ్రివాల్దశదిశలుగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంగేమ్ ఛేంజర్పాల్కురికి సోమనాథుడువాట్స్‌యాప్నాని (నటుడు)పెరూభారత రాష్ట్రపతిచరవాణి (సెల్ ఫోన్)గజేంద్ర మోక్షంఎర్రబెల్లి దయాకర్ రావునవరసాలుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుఫేస్‌బుక్వేమనభారత జాతీయ ఎస్సీ కమిషన్నరేంద్ర మోదీసమ్మక్క సారక్క జాతరబ్రాహ్మణులురామావతారం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుముహమ్మద్ ప్రవక్తసంస్కృతంగోవిందుడు అందరివాడేలేమేషరాశిఋతువులు (భారతీయ కాలం)తొట్టెంపూడి గోపీచంద్సెక్యులరిజంతహశీల్దార్🡆 More