జిలేబీ

జిలేబీలు ఒక రకమైన మిఠాయి.

ఇది బంగారపు రంగులో చక్కెర పాకంతో ఉండే తియ్యని మిఠాయి. ఇది భారతదేశంలోనే కాక పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లలో విస్తరించిన పదార్థం,.

Jalebi
జిలేబీ
Jalebis as served in South Asia
మూలము
ఇతర పేర్లుJal-vallika, kundalika (ancient India); jilebi, jilawii; zoolbia (Middle East); jeri (Nepal)
ప్రదేశం లేదా రాష్ట్రంMiddle East, South Asia & East Africa
తయారీదారులుAncient Indian
వంటకం వివరాలు
వడ్డించే విధానంdessert
ప్రధానపదార్థాలు Maida flour, saffron, ghee, sugar
వైవిధ్యాలుJaangiri or Imarti

చరిత్ర

జైన మత బోధకుడు జినసుర సా.శ. 1450 లో రాసిన ప్రియకర్ణపాకత అనే పుస్తకంలో జిలేబీల ప్రస్తావన ఉంది. భారత దేశంలో ఈ మిఠాయి సుమారు 500 ఏళ్ళకు పూర్వమే తయారైనట్లు ఆధారాలున్నాయి.

జిలేబీ 
జిలేబీలు

తయారీ, రకాలు

జిలేబీల్లో రెండు రకాలు ఉన్నాయి.అవి

మైదా పిండి పలుచని ముద్దను సన్నని గొట్టాల ద్వారా వచ్చినట్టుగా చేసి, గొట్టాన్ని గుండ్రంగా తిప్పుతూ నూనెలో వేపుతారు. తరువాత వానిని లేత పాకంలో ముంచితే జిలేబీలు పీల్చుకొని తియ్యగా రుచికరంగా ఉంటాయి.

బెల్లం జిలేబి తయారి విధానం

రుచికరమైన బెల్లం జిలేబిని ఈ క్రింద వివరించిన పద్ధతిలో చెయ్యవచ్చును.

    కావలసిన పదార్థాలు
  • మైదా: 600 గ్రాములు
  • సోడాపుడి: అర టీ స్పూన్
  • పెరుగు: ఒకకప్పు
  • బెల్లంపాకం: 1¼కిలోలు
    తయారు చేసే విధానం
    ఒక రోజు ముందు వంద గ్రాముల మైదాపిండి చిటికెడు సోడాను, పెరుగు కలిపి మెత్తటి ముద్దలా కలియబెట్టాలి. ఎనిమిది గంటల తరువాత-మిగిలిన ఐదువందల గ్రాముల మైదాపిండిలో ముందుగా పులియబెట్టిన పిండి, కొద్దిగా గోరువెచ్చని నీళ్లు కలిపి మళ్ళీ మెత్తటి ముద్దలా, చపాతీల పిండి కంటే జారుడుగా చెయ్యాలి. అలాతయారు చేసిన పిండిని కనీసం పన్నెండు గంటలు నానబెట్టాలి. ఇలాచెయ్యడం వలన మైదా పిండి బాగా పులుస్తుంది.బెల్లాన్ని ముక్కలుగా చేసి రెండు కప్పుల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి పాకం తయారు చెయ్యాలి. పాకం లేతగా ఉండగానే దించచలెను.

అటుతరువాత ఒక బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టి తగిన విధంగా కాగిన తరువాత -పిండిని ఒక చిన్న రంధ్రం కలిగినగట్టి జిలేబీ వస్త్రం (పద్నాలుగు అంగుళాల చతురస్రాకారంగా ఉన్నా గట్టి వస్త్రానికి మద్యలో చిన్న రంధ్రం ఉండి, బటన్ కాజాకి కుట్టిన రీతిలో కుట్టినది) లో పోసి-అన్ని వైపులనుండి మూసి మూటగా చేయండి. ఈ మూటను చేతితో పిండుతూ నూనెలో మూడు నాలుగు సార్లు జిలేబిల మాదిరి తిప్పవలెను. నూనెలో జిలేబి వలయాల వలె ఏర్పడును. తగినట్టుగా వేగిన పిదప వీటిని సిద్ధంగా ఉంచిన బెల్లం పాకంలో ముంచి కొద్ది సేపు ఉంచి బయటికి తీసిన తీయని రుచికరమైన జిలేబీలు సిద్ధం.

చక్కెర జిలేబీ తయారి విధానం

రుచికరమైన చక్కెర జిలేబిని ఈ క్రింద వివరించిన పద్ధతిలో చెయ్యవచ్చును. కావలసిన పదార్థాలు:రమారమి26-30 జిలేబిలకు సరిపడ పరిమాణం

    జిలేబీ చెయ్యుటకు కావలసిన అహార పదార్థాలు
  • మైదా: 2 కప్పులు
  • బియ్యప్పిండి: 6 స్పూన్స్
  • చక్కెర: 5 కప్పులు
  • సోడ: చిటికెడు
    తయారు చేయు పద్ధతి
    ఒక గిన్నెలోమైదా, బియ్యపుపిండి, సోడ, పెరుగు వేసి కొద్దిగా నీరు వేసి పిండిని ఉండలు లేకుండా జారుగాఉండేలా కలుపుకోవాలి. కలిపినటువంటి జిలేబీ పిండిని కనీసం 20 నుంచి 24 గంటల వరకు బాగా నాననివ్వాలి. జిలేబి తయారు చేయాలనుకున్న ముందు రోజే పిండితయారు చేయాలి. తరువాత నానిన పిండిలో, కేసరి రంగును వేసి పిండిని బాగా కలపాలి. జారుగా ఉంటేనే జిలేబి బాగా వస్తుంది.పిమ్మట తయారు చేసుకున్న పిండిని కవ్వంతో పిండీ నురగలుగా వచ్చువరకు చిలకాలి. ఒక సరిపడ గిన్నెలో తగినంత చక్కెర వేసి, చక్కెర మునిగేలా నీరు నింపి, తీగ పాకం తయారు చెయ్యాలి.

వెడల్పాటి బాణలిలో నెయ్యి (లేదా నూనె) వేసి, వేడి చేయాలి. ఇప్పుడు మధ్యలో చిన్న రంధ్రం ఉన్నగుడ్డలో లేదా, మధ్యలో చిన్న రంద్రంఉన్నప్లాస్టిక్ కవరులో తయారు చేసిన మైదా పిండిని వేయాలి ( జిలేబీలు

చేయడానికి సీసాలాంటివి దొరుకుతాయి సూపర్ మార్కెట్లలో). నెయ్యి కొద్దిగా వేడి అయ్యాక చిన్నగా చుట్లు తిప్పుతూ జిలేబిని బాణలిలో వేయాలి. ఇలా వేసిన జిలేబిలు గోధుమ రంగు వచ్చేలా రెండు వైపులా కాల్చాలి. కాల్చిన జిలేబిలను పక్కన పెట్టుకున్న తీగ పాకంలో వేసి 1 నిముషం పాటు మునిగి ఉండేలా ఉంచాలి. వేడి వేడి జిలేబీ తినటానికి సిద్ధం.

ఇతర విశేషాలు

వీటి తయారీలో రాజస్థానీయులు ప్రసిద్ధి చెందారు. వీటిని సమోసా లతో కలిపి తింటారు. గుజరాత్లో జిలేబీలను ఫాపడా (కారం అప్పలము) తో కలిపి తింటారు.

జిలేబీ 
జలీబీ పాకిస్తాన్‌లో పాత, సాంప్రదాయ ఆహారం. మత, వివాహ ఉత్సవాల్లో ప్రజలు దీనిని ఆనందిస్తారు.

మూలాలు

Tags:

జిలేబీ చరిత్రజిలేబీ తయారీ, రకాలుజిలేబీ బెల్లం జిలేబి తయారి విధానంజిలేబీ చక్కెర తయారి విధానంజిలేబీ ఇతర విశేషాలుజిలేబీ మూలాలుజిలేబీచక్కెరజిలేబీలునేపాల్పాకిస్తాన్బంగ్లాదేశ్భారత దేశముమిఠాయిశ్రీలంక

🔥 Trending searches on Wiki తెలుగు:

బలి చక్రవర్తిగవర్నరుగురుడుచరవాణి (సెల్ ఫోన్)జాతీయములువరంగల్గిలక (హెర్నియా)మీనాక్షి అమ్మవారి ఆలయంఆంధ్రప్రదేశ్భారతదేశ అత్యున్నత న్యాయస్థానంసహాయ నిరాకరణోద్యమంభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాతిక్కనబ్రహ్మపుత్రా నదిరబీ పంటతెలంగాణ మండలాలుచిరంజీవి నటించిన సినిమాల జాబితామొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమముబి.ఆర్. అంబేడ్కర్బూర్గుల రామకృష్ణారావుభారత రాజ్యాంగ పీఠికబ్రహ్మపంచతంత్రంసాలార్ ‌జంగ్ మ్యూజియంరూపవతి (సినిమా)జీ20భావ కవిత్వంశ్రీనాథుడుసురేందర్ రెడ్డినువ్వొస్తానంటే నేనొద్దంటానాభారత జాతీయపతాకంపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుక్షత్రియులుపొట్టి శ్రీరాములువిశాఖ నక్షత్రముతెలంగాణ జిల్లాలుడొక్కా సీతమ్మహెబియస్ కార్పస్ఇంగువతెలంగాణ జాతరలుఆంధ్రప్రదేశ్ చరిత్రరజియా సుల్తానాసరోజినీ నాయుడునువ్వు లేక నేను లేనుఎల్లమ్మపిత్తాశయమురజాకార్లుసమంతదానంసప్తచక్రాలుదగ్గువాల్మీకిసిందూరం (2023 సినిమా)మీనరాశిఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితాసుందర కాండదశరథుడుయూకలిప్టస్జైన మతంతెలుగు వికీపీడియాపాండ్యులురావణాసురనిఖత్ జరీన్ఆర్. విద్యాసాగ‌ర్‌రావుబ్రాహ్మణులుహోళీఅశ్వగంధయునైటెడ్ కింగ్‌డమ్ఆది పర్వముద్వాదశ జ్యోతిర్లింగాలుఎర్ర రక్త కణంప్రస్తుత భారత గవర్నర్ల జాబితాసామెతల జాబితామొఘల్ సామ్రాజ్యంక్రిస్టమస్వినుకొండరోహిణి నక్షత్రంరాష్ట్రకూటులువేంకటేశ్వరుడు🡆 More