జాన్ స్టూవర్ట్ మిల్

జాన్ స్టూవర్ట్ మిల్ బ్రిటన్‌కు చెందిన తత్వవేత్త.

ఇతడు 1806, మే 20న జన్మించాడు. అనేక రాజనీతి సిద్ధాంతాలు రచించిన జె.ఎస్.మిల్ పార్లమెంటు సభ్యుడుగానూ వ్యవహరించాడు. ఉపయోగితా వాదం గురించి ప్రముఖంగా ఇతని పేరు చెప్పబడుతుంది. 1873, మే 8న మరణించాడు.

జాన్ స్టూవర్ట్ మిల్


జె.ఎస్.మిల్ యొక్క ముఖ్య ప్రవచనాలు

జె.ఎస్.మిల్ రచనలలో ఎక్కువుగా వ్యక్తి స్వేచ్ఛావాదం (ఇండివిడ్యువలిజమ్) కనిపిస్తుంది. ఇతని " ఆన్ లిబర్టీ" వ్యక్తి స్వేచ్చను వివరించుటలో, సమర్ధించటంలో ఈనాటికీ ఒక ప్రామాణిక గంధంగా కనపడుతుంది. స్వేచ్చ ప్రతి వ్యక్తి అవసరమని, వ్యక్తి నుంచి అది విడదీయరాదని, సామాజిక జీవనంలో భిన్నత్వాన్ని పెంపొందించటానికి, నైతిక, మానసిక, భౌతిక రంగాలలో స్వేచ్చ చాలా అవసరమని మిల్ ధృఢ విశ్వాసము. వ్యక్తి స్వేచ్చను సమర్దించటంలో మిల్, వోల్టర్, మిల్టన్, రూసో, ధామస్ మొదలైన సుప్రసిద్ధుల కోవకు చెందినవాడు. మిల్ అభిప్రాయంలో సమాజంలో జీవించే వ్యక్తుల అనేక అభిప్రాయాలు, ఆసక్తులు కలిగి ఉంటారు. విభిన్నమైన ఆసక్తులు, వాటి గుర్తింపు సమాజ వికాసానికి అవసరము. అంతే కాక సామాన్యంగా ఒక వ్యక్తి చర్యను అతని ఆలోచన నిర్దేశిస్తుంది. ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను యధేచ్చగా వ్యక్తం చేయటానికి, అతని చర్యలలో ఇతరుల జోక్యం లేకుండా ఉండడానికి తగిన పరిస్థితులను రాజ్యం కల్పించాలి. వ్యక్తి స్వేచ్చను సమాజ జోక్యం నుంచే కాక ప్రభుత్వ నియంత్రణ నుంచి సంరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మిల్ గ్రహించాడు. ప్రభుత్వ జోక్యం ఎంత తక్కువుగా ఉంటే వ్యక్తికి అంత ఎక్కువ స్వేచ్చ లభిస్తుందని మిల్ భావిస్తాడు.

వ్యక్తి స్వేచ్చను కేవలం రాజకీయాధికారంనుంచి పరిరక్షించటంతోనే మిల్ తృప్తి పడలేదు. సమాజ జోక్యం, సమాజ నియంత్రణ వ్యక్తి స్వేచ్చపై ఉండరాదని వాదిస్తాడు. సమాజ సంప్రదాయాలు, కట్టుబాట్లను ఉల్లంఘించే వ్యక్తులపై సమాజం విధించే శిక్షలు, నియంత్రణలు వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోటానికి ప్రతి బంధకాలుగా తయారయి చివరికి అవి తన వ్యతిరేకాభిప్రాయం, అసమ్మతి భావాలను, వొదులుకొని కేవలం యంత్రంలో ఒక భాగంగా మిగిలిపోయే ప్రమాదం సంభవిస్తుంది అంటాడు మిల్.

మిల్ అభిప్రాయంలో స్వేచ్చ సమగ్రమైనది. ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని పెంపొందుంచు కోటానికి అభిప్రాయ ప్రకటనకు, ఆంతరంగిక వ్యవహారాలలో స్వేఛ్ఛ అవసరము. ప్రతి వ్యక్తి చర్యలను మిల్ రెండు రకాలుగా విభజిస్తాడు- వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన చర్యలు అతనికి మాత్రమే (Self Recording) సంబంధించినవి వీటిలో ఇతరుల జోక్యం అనవసరం. రెండవది ఇతరులకు సంబంధించిన చర్యలు (Other Recording), ఇది ప్రయోజనాలకు సంబంధించిన చర్యలు. ఒక వ్యక్తి యొక్క చర్య వలన ఇతరులకు హాని కలుగుతుందని భావించినప్పుడు మాత్రమే సమాజం అతనిని నిరోధించవచ్చును. దొంగతనము, హత్య మొదలైనవి. ప్రతి వ్యక్తికి తన శరీరము, ఆలోచన, ఆత్మలపై సార్యభౌముడు. మిల్ సాంప్రదాయిక వ్యక్తి స్వేచ్చావాది.అతని కాలంలో ఉన్న రాజకీయ, సాంఘిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అతను తన అభిప్రాయాలను వ్యక్తం చేసాడు. అపరిమిత స్వేచ్చ అవాంచమైనప్పటికీ స్వేచ్చ కంటే స్వేచ్చపై విధించవలసిన ఆంక్షలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినప్పుడు స్వేచ్చాభావం నశించిపోతుంది.

రచనలు:

  • System of Logic (1843)
  • Principles of Political Economy (1848)
  • On Liberty (1859)
  • Representative Government
  • Utilitarianism (1861)

మూలములు

Tags:

యునైటెడ్ కింగ్‌డమ్

🔥 Trending searches on Wiki తెలుగు:

శిబి చక్రవర్తిH (అక్షరం)నర్మదా నదిరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితావిరాట్ కోహ్లిజో బైడెన్కోణార్క సూర్య దేవాలయంరష్యాగోదావరిరష్మికా మందన్నశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంవిజయ్ (నటుడు)ఛత్రపతి శివాజీఆలంపూర్ జోగులాంబ దేవాలయంగరుడ పురాణంట్రావిస్ హెడ్వనపర్తి సంస్థానంబంగారంమెయిల్ (సినిమా)సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిరాజస్తాన్ రాయల్స్పక్షవాతంతమిళ అక్షరమాలఅహోబిలంఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితాసంజు శాంసన్న్యూయార్క్రాగులునాగార్జునసాగర్ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్స్కాట్లాండ్చైనానల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిఅయోధ్యమా తెలుగు తల్లికి మల్లె పూదండఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీఉప్పెన (సినిమా)శని (జ్యోతిషం)కలబందనీతా అంబానీసింధు లోయ నాగరికతబ్రాహ్మణ గోత్రాల జాబితాసమ్మక్క సారక్క జాతరజవహర్ నవోదయ విద్యాలయంకామాక్షి భాస్కర్లమగధీర (సినిమా)సిరికిం జెప్పడు (పద్యం)రుక్మిణీ కళ్యాణంఅనూరాధ నక్షత్రంగురువారంకర్కాటకరాశిదానం నాగేందర్రంగస్థలం (సినిమా)అలంకారంమంతెన సత్యనారాయణ రాజుచిరుధాన్యందాశరథి కృష్ణమాచార్యవిశ్వక్ సేన్టబుమృగశిర నక్షత్రముతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థహనుమంతుడుధనిష్ఠ నక్షత్రముహోళీశ్రీకాంత్ (నటుడు)భారత పౌరసత్వ సవరణ చట్టంపురాణాలుకామినేని శ్రీనివాసరావుమాయాబజార్హిందూధర్మంఆక్యుపంక్చర్రామ్ చ​రణ్ తేజపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి🡆 More