జయ బచ్చన్: భారతీయ రాజకీయవేత్త మరియు నటి

జయ బాదురీ బచ్చన్ (జన్మ నామం జయ బాదురీ; జననం 1948 ఏప్రిల్ 9) భారతీయ రాజకీయ నాయకురాలు, హిందీ సినీ నటి.

ఈమె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే పూర్వవిద్యార్థి. ఈమె అమితాబ్ బచ్చన్ భార్య, శ్వేత నంద బచ్చన్, అభిషేక్ బచ్చన్ లకు తల్లి. ఈమె తన నటనకు గానూ క్రియాశీలకంగా ఉన్నన్ని రోజులూ ఎందరో మన్ననలు పొందింది. 1963లో వచ్చిన సత్యజిత్ రే సినిమా మహానగర్లో తొలిసారి ఒక యువతిగా నటించింది. ఆపై 1971లో గుడ్డీ అనే సినిమాలో పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. ఉపహార్ (1971), కోషిశ్ (1972), కోరా కాగజ్ (1974) సినిమాలలో ఈమె నటన అపూర్వం. జంజీర్ (1973), అభిమాన్ (1973), చుప్కే చుప్కే (1975), మిలీ (1975), శోలే (1975) సినిమాలలో భర్త అమితాబ్ సరసన నటించింది. పెళ్ళి, పిల్లల తరువాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయి పోయారు. మధ్యలో 1981లో సిల్సిలా అనే సినిమాలో కనిపించినా, నటనకు దూరంగానే ఉన్నారు. 1998 లో తిరిగి తెరంగేట్రం చేసారు. గోవింద్ నిహ్లానీ తీసిన హజార్ చౌరాసీ కీ మాఁ అన్న సినిమాలో నటించారు. అప్పటి నుండి ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలలో కనిపించారు. ఈ సినిమాలలో నటనకు గానూ ఈమెకు ఎన్నో బిరుదులు, అవార్డులు అందాయి. ఈమె మొత్తం నటన జీవితంలో ఇప్పటి వరకూ 9 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, (3 అత్యుత్తమ నటి, 3 అత్యుత్తమ సహాయ నటితో సహా). 2007లో ఫిల్మ్ ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 1992లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అందుకున్నారు.

జయ బచ్చన్
జయ బచ్చన్: తొలి రోజులు, సినీనటనా ప్రస్థానం, రాజకీయ జీవితం
జననం
జయ బాదురీ (బహాదురీ కి వికృతం)

(1948-04-09) 1948 ఏప్రిల్ 9 (వయసు 76)
వృత్తినటి, రాజకీయ నాయకురాలు
క్రియాశీల సంవత్సరాలు1963, 1971–1981, 1998–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅమితాబ్ బచ్చన్
పిల్లలుశ్వేతా బచ్చన్ నందా
అభిషేక్ బచ్చన్

తొలి రోజులు

జయ బచ్చన్: తొలి రోజులు, సినీనటనా ప్రస్థానం, రాజకీయ జీవితం 
పద్మశ్రీపురస్కారం

జయ బాదురీ కోల్‍కతలో ఒక హిందూ బాంగ్లా కుటుంబంలో 1948 ఏప్రిల్ 9న జన్మించారు. ఈమె తల్లిదండ్రులు ఇందిరా బాదురీ, తరూన్ కుమార్ బాదురీ. ఈమె తండ్రి ఒక రచయిత, పత్రికా సంపాదకుడు, రంగస్థల నటుడూను. ఈమె లోరెటో కాన్వెంట్ షిలాంగ్ లో, లోరెటో హౌస్, కోల్‍కతలో ప్రాథమిక విద్య పొందారు. ఆపై భోపాల్ లోని సెయింట్.జోసఫ్స్ కాన్వెంట్ స్కూల్ లో చదివారు. 1966 సంవత్సరపు గణతంత్ర దినోత్సవ వేడుకలలో బెస్ట్ ఆల్ ఇండియా ఎన్సీసీ క్యాడెట్ గా రాష్ట్రపతి విసిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. తరువాత ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే వద్ద చదువుకున్నారు. అక్కడ కూడా ఈమె స్వర్ణ పతకం పొందారు.

సినీనటనా ప్రస్థానం

ఈమె తన నటనా జీవితాన్ని 15వ ఏట సత్యజిత్ రే తీసిన బాంగ్లా సినిమా మహానగర్ లో సహాయనటిగా మొదలు పెట్టారు. ఈ సినిమాలో ఆమె అనిల్ చటర్జీ, మాధబీ ముఖర్జీతో నటించారు. అంతకు ముందు ఆమె రెండు బాంగ్లా సినిమాలలో నటించారు - ఒక 13 నిమిషాల నిడివి గల లఘు చిత్రం సుమన్, ఒక బాంగ్లా హాస్య చిత్రం ధన్నీ మెయె (1971) లో ఉత్తం కుమార్ మరదలిగా నటించారు.

రాజకీయ జీవితం

జయ ఉత్తరప్రదేశ్ నుండి సమాజ్‌వాది పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈమె రాజ్యసభ సభ్యురాలు. ఫిబ్రవరి 2010 నాటికి ఆమె తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. తిరిగి మరలా 2012 లో ఎన్నుకోబడ్డారు.

వివాదాలు

వ్యక్తిగత జీవితం

పురస్కారాలు, గుర్తింపు

సినిమాలు

బయటి లంకెలు

మూలాలు

వంశవృక్షం


Tags:

జయ బచ్చన్ తొలి రోజులుజయ బచ్చన్ సినీనటనా ప్రస్థానంజయ బచ్చన్ రాజకీయ జీవితంజయ బచ్చన్ వివాదాలుజయ బచ్చన్ వ్యక్తిగత జీవితంజయ బచ్చన్ పురస్కారాలు, గుర్తింపుజయ బచ్చన్ సినిమాలుజయ బచ్చన్ బయటి లంకెలుజయ బచ్చన్ మూలాలుజయ బచ్చన్ వంశవృక్షంజయ బచ్చన్అభిషేక్ బచ్చన్అమితాబ్ బచ్చన్కోరా కాగజ్ (1974 హిందీ చిత్రం)కోషిశ్పద్మశ్రీ పురస్కారంపూణేబాలీవుడ్శ్వేత నందసత్యజిత్ రేసినిమా

🔥 Trending searches on Wiki తెలుగు:

కాలుష్యంసముద్రఖనిరుక్మిణీ కళ్యాణంశ్రీ కృష్ణదేవ రాయలుసర్వే సత్యనారాయణవందేమాతరంభారతదేశంలో కోడి పందాలుదిల్ రాజుకోల్‌కతా నైట్‌రైడర్స్వరిబీజంకన్యారాశితెలంగాణ ప్రభుత్వ పథకాలుసింధు లోయ నాగరికతజీలకర్రఉత్తరాషాఢ నక్షత్రముఉత్తర ఫల్గుణి నక్షత్రమునక్షత్రం (జ్యోతిషం)స్టాక్ మార్కెట్శ్రీ కృష్ణుడుపూర్వాభాద్ర నక్షత్రముతాన్యా రవిచంద్రన్ఏప్రిల్రుద్రమ దేవినయన తారపేరుస్వామి రంగనాథానందజగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గంపూరీ జగన్నాథ దేవాలయంతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుజవహర్ నవోదయ విద్యాలయంరక్తంసన్నాఫ్ సత్యమూర్తికె. అన్నామలైఐడెన్ మార్క్‌రమ్తెలుగు వ్యాకరణంతెలంగాణ చరిత్రపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఆవుభారత ప్రధానమంత్రుల జాబితాసౌందర్యటెట్రాడెకేన్మాళవిక శర్మశక్తిపీఠాలుపిఠాపురం శాసనసభ నియోజకవర్గంపాల కూరలలితా సహస్ర నామములు- 1-100విడదల రజినిఉండి శాసనసభ నియోజకవర్గంతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రివృత్తులుగుడివాడ శాసనసభ నియోజకవర్గంఇంటి పేర్లుశామ్ పిట్రోడాఅండాశయముభారత జీవిత బీమా సంస్థఏప్రిల్ 25పది ఆజ్ఞలుబోయపాటి శ్రీనుసిరికిం జెప్పడు (పద్యం)రోనాల్డ్ రాస్గోత్రాలుచిరుధాన్యంబాలకాండడేటింగ్భీమసేనుడువికీపీడియాతామర వ్యాధిజిల్లేడుఉష్ణోగ్రతకోవూరు శాసనసభ నియోజకవర్గంయేసుధర్మవరం శాసనసభ నియోజకవర్గంగ్రామ పంచాయతీబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంఅంగారకుడు (జ్యోతిషం)తెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంఎల్లమ్మ2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుకేతువు జ్యోతిషం🡆 More