చార్‌ధామ్

భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, ద్వారక, పూరీ, రామేశ్వరం లను కలిపి చార్‌ ధామ్‌ గా వ్యవహరిస్తారు.

ఆదిశంకరాచార్యులచే స్థాపించబడిన ఈ క్షేత్రాలలో మూడు వైష్ణవ క్షేత్రాలు, ఒక శైవ క్షేత్రము ఉంది. కాలక్రమేణా చార్‌ ధామ్‌ అనే పదము హిమాలయాలలోని పుణ్యక్షేత్రాలను ఉద్దేశించేదిగా వ్యవహారంలోకి వచ్చింది.

చార్‌ ధామ్‌

చార్‌ధామ్చార్‌ధామ్చార్‌ధామ్చార్‌ధామ్

బద్రీనాథ్రామేశ్వరం
ద్వారకపూరీ

చరిత్ర

మూలాధారాలు లేనప్పటికీ భారతదేశంలో హిందూమత వ్యాప్తికి విస్తృతంగా కృషిచేసిన ఆది శంకరాచార్య ఈ నాలుగు పుణ్యక్షేత్రాలకు చార్‌ధాం హోదాను ఆపాదించాడు. ఈ నాలుగు ఆలయాలు భారతదేశం యొక్క నాలుగు వైపులా ఏర్పడటం గమనార్హం. ఉత్తరాన బద్రీనాథ్ ఆలయం, తూర్పున పూరీ లోని జగన్నాథ ఆలయం, పశ్చిమాన ద్వారక లోని ద్వారకాధీశ ఆలయం, దక్షిణాన రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయం స్థాపితమై ఉన్నాయి. సిద్ధాంతపరంగా ఈ దేవాలయాలు శైవమతానికి, వైష్ణవ శాఖలకు మధ్య విభజించబడి ఉన్నప్పటికీ, చార్ ధామ్ తీర్థయాత్ర ఒక హిందూ మతం వ్యవహారంగా భావింపబడుతుంది. 20వ శతాబ్ద మధ్యకాలం నుండి హిమాలయా పర్వత సానువులలో ఉన్న బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను కలిపి ఛోటా చార్‌ధామ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ యాత్ర ద్వారా ఉత్తరాఖండ్ పర్యాటకం అత్యధికంగా లాభపడుతున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యాత్రను బాగా ప్రోత్సహిస్తున్నది.

పుణ్యక్షేత్రాలు

బద్రీనాథ్ ఆలయం

ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్హ్వాల్ పర్వతశ్రేణులలో అలకనంద నది ఒడ్డున ఉంది. ఈ పట్టణం నీలకంఠ పర్వత శ్రేణులలోని నర నారాయణ పర్వత సానువుల మధ్యన 6,560 మీటర్ల ఎత్తులో ఉంది.

ద్వారకాధీశ ఆలయం

ఈ ఆలయం భారతదేశ పశ్చిమాన గుజరాత్ రాష్ట్రంలో స్థాపించబడింది. ఈ నగరం నామం ద్వార్ (వాకిలి) అనే సంస్కృత పదం నుండి జనించింది. ఈ నగరం గోమతి నది సమీపంలో, నది సముద్రంలో సంగమించే కచ్ సింధుశాఖ వద్ద స్థాపితమైంది. ఈ గోమతి నది, గంగా నదికి ఉపనదిగా భావించే గోమతి నది, ఒక్కటి కావు.

పూరీ జగన్నాథ ఆలయం

ఈ నగరం భారతదేశ తూర్పు భాగంలో ఒడిషా రాష్ట్రంలో స్థాపితమైంది. ఈ నగరం భారతదేశ అతి ప్రాచీన తూర్పు నగరాలలో ఒకటి. ఇది బంగాళాఖాతం ఒడ్డున ఉంది.

రామనాథస్వామి ఆలయం

రామేశ్వరము భారతదేశ దక్షిణాన తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇది భారతదేశ ద్వీపకల్ప చివరి భాగంలో మన్నార్ సింధుశాఖ వద్ద ఉంది. పురాణాల ప్రకారం శ్రీరాముడు ఈ ప్రదేశం నుండే రామసేతు నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇది శైవులకు అంకితమైన ప్రముఖ దేవాలయం. శ్రీరాముడు ఈ ఆలయాన్ని స్థాపించాడని ప్రతీతి..

చిత్రమాలిక

మూలాలు

ఇతర లింకులు

Tags:

చార్‌ధామ్ చరిత్రచార్‌ధామ్ పుణ్యక్షేత్రాలుచార్‌ధామ్ చిత్రమాలికచార్‌ధామ్ మూలాలుచార్‌ధామ్ ఇతర లింకులుచార్‌ధామ్ద్వారకపూరీబద్రీనాథ్రామేశ్వరం

🔥 Trending searches on Wiki తెలుగు:

రాహువు జ్యోతిషంపాండవులుఅంగుళంహనుమాన్ చాలీసాబలి చక్రవర్తిద్వాదశ జ్యోతిర్లింగాలుమొదటి పేజీభారతదేశంలో కోడి పందాలుకాళోజీ నారాయణరావుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థశక్తిపీఠాలుబ్రాహ్మణులురాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంతామర పువ్వుతెలంగాణ ఉద్యమంఅనిఖా సురేంద్రన్నక్షత్రం (జ్యోతిషం)విశాఖపట్నంపెంటాడెకేన్సాయిపల్లవితెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితావినాయకుడువందేమాతరంసీతాదేవిపరకాల ప్రభాకర్కేతిరెడ్డి పెద్దారెడ్డిఉష్ణోగ్రతగౌడజవహర్ నవోదయ విద్యాలయంకాలుష్యంశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)పులివెందులభారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితాబద్దెనఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాబి.ఆర్. అంబేద్కర్గంగా నదివికీపీడియాదూదేకులగోదావరిఏప్రిల్ 25లగ్నంగుణింతంకీర్తి సురేష్చిరంజీవి నటించిన సినిమాల జాబితావై.ఎస్.వివేకానందరెడ్డి హత్యనానార్థాలులావు శ్రీకృష్ణ దేవరాయలువిజయశాంతితెలుగు పదాలుభారత జాతీయగీతంపరిపూర్ణానంద స్వామిభారత రాజ్యాంగ పీఠికప్లీహముజాంబవంతుడుకింజరాపు అచ్చెన్నాయుడుతోటపల్లి మధుభూమా అఖిల ప్రియప్రభాస్లోక్‌సభచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంద్విగు సమాసముభారతదేశ జిల్లాల జాబితాతిరువణ్ణామలైక్రికెట్నువ్వు లేక నేను లేనువాస్తు శాస్త్రంముదిరాజ్ (కులం)మరణానంతర కర్మలుమాయదారి మోసగాడుభారత జాతీయ క్రికెట్ జట్టుభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థవారాహిభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుబుధుడు (జ్యోతిషం)డామన్షర్మిలారెడ్డితొలిప్రేమ🡆 More